జాతీయ భద్రతనా.. నోబెల్ బహుమతా? | National Security or Nobel prize? | Sakshi
Sakshi News home page

జాతీయ భద్రతనా.. నోబెల్ బహుమతా?

Published Tue, Jan 5 2016 1:50 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

National Security or Nobel prize?

మీకేం కావాలో నిర్ణయించుకోవాలంటూ మోదీకి కాంగ్రెస్ వ్యంగ్య సూచన

 న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడిని ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ విరుచుకుపడింది. పఠాన్‌కోట్ ఘటనపై ప్రధాని మోదీ స్పందనను తప్పుబట్టిన కాంగ్రెస్.. ప్రభుత్వ వ్యవస్థ వైఫల్యానికి ఇదో ఉదాహరణ అని దుయ్యబట్టింది. దేశంలో అంతర్గత భద్రత ఆందోళనకరంగా ఉందని సోమవారం పార్టీ చీఫ్ సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. పంజాబ్‌కు చెందిన మాజీ కేంద్రమంత్రి మనీశ్ తివారీ ప్రధాని మోదీని ఎద్దేవా చేస్తూ పలు ట్వీట్లు చేశారు. ‘

మియా మోదీ.. మీకు నోబెల్ బహుమతి కావాలా? జాతీయ భద్రత కావాలా? త్వరగా నిర్ణయించుకోండి. మీరేం కోరుకుంటున్నారు? మరిన్ని ఉగ్రదాడులనా? తక్షణమే పాక్‌తో విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలను రద్దు చేయండి’ అని డిమాండ్ చేశారు. పఠాన్‌కోట్ దాడిపై కాంగ్రెస్ రాజకీయాలు చేయడం దురదృష్టకరమని బీజేపీ పేర్కొంది. కాగా,  దాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మూడు కేసులను నమోదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement