పఠాన్కోట్ సంఘటన మరవకముందే పంజాబ్లో మరోసారి కలకలం రేగింది. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన నలుగురు దుండగులు..
పాటియాల : పఠాన్కోట్ సంఘటన మరవకముందే పంజాబ్లో మరోసారి కలకలం రేగింది. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన నలుగురు దుండగులు ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించి కారును అపహరించుకు వెళ్లారు. పాటియాలలోని దష్మిష్ నగర్లో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.