రివాల్వర్‌తో సెల్ఫీ తీసుకోబోయి...
పంజాబ్: సెల్ఫీల కోసం ఫోజులిస్తూ ఎందరో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఈ మధ్యన ఎక్కువయ్యాయి. అలాంటిదే ఓ ఘటన శుక్రవారం పఠాన్‌కోట్‌లో జరిగింది. అయితే కుర్రాడి అదృష్టం బాగుండి ప్రాణాపాయం తప్పింది. పఠాన్‌కోట్‌కు చెందిన గురుకృపాల్ సింగ్ కాంట్రాక్టరు. అతని వద్ద లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది. శుక్రవారం తెలిసిన వారింట్లో శుభకార్యానికి భార్యను తీసుకొని వెళ్లాడు.
ఇంట్లోనే ఉన్న అతని కుమారుడు, 15 ఏళ్ల అమన్‌దీప్ సింగ్ సొరుగులోంచి రివాల్వర్ తీసి సోదరితో కలసి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. రివాల్వర్‌ను కణతకు ఆనించుకొని సెల్ఫీకి ఫోజిచ్చాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రిగ్గర్‌పై వేలుపడి రివాల్వర్ పేలింది. తుపాకీ శబ్ధం విన్న ఇరుగుపొరుగు వచ్చి చూడగా అమన్‌దీప్ గాయపడి ఉన్నాడు. అతని తల్లిదండ్రులకు సమాచారమిచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను లూథియానాలోని దయానంద్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.