పఠాన్‌కోట్: ఉగ్రవాద దాడి నుంచి కోలుకుంటున్న పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో మళ్లీ కలకలం రేగింది. ఆచూకీ లేకుండా పోయిన క్యాబ్ డ్రైవర్ విజయక్ కుమార్ మరణించాడు. హిమాచల్ ప్రదేశ్‌లో అతని శవాన్ని పోలీసులు గుర్తించారు.
ముగ్గురు అనుమానితులు విజయ్‌కుమార్‌ను చంపి కారుతో పరారయినట్టు భావిస్తున్నారు. ఈ ముగ్గురు ఢిల్లీలోకి ప్రవేశించినట్టు సమాచారం. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపడుతున్నారు.
పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఇటీవల ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు దాడికి ముందు ఎస్పీ కారును హైజాక్ చేశారు. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్‌ను చంపి కారుతో పరారు కావడంతో ఇది ఉగ్రవాదుల చర్యే అని పోలీసులు భావిస్తున్నారు.
పఠాన్‌కోట్‌లో మళ్లీ కలకలం.. ఢిల్లీలో హై అలర్ట్
Published Fri, Jan 22 2016 12:07 PM | Last Updated on Tue, Aug 14 2018 3:14 PM
Advertisement