
విజయకుమార్, వనిత
చెన్నై ,పెరంబూరు: షూటింగ్ కోసం ఇం టిని అద్దెకు తీసుకుని, ఖాళీ చేయకుండా ఆక్రమించుకుందని సీనియర్ నటుడు విజయకుమార్ తన కూతురు వనితపై స్థానిక మధురవాయిల్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. అందులో స్థానిక మధురవాయిల్, అలపాక్కమ్‌లోని అష్టలక్ష్మి నగర్ 11వ వీధిలో తనకు ఇల్లు ఉందన్నారు. దాన్ని షూటింగ్‌లకు అద్దెకు ఇస్తూ, తాను తన కొడుకు అరుణ్‌తో కలిసి కొట్టివాక్కమ్‌లో నివశిస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల క్రితం తన కూతురు షూటింగ్ కోసం అపపాక్కమ్‌లోని ఇంటిని అద్దెకు అడగడంతో ఇచ్చానన్నారు. అయితే షూటింగ్ పూర్తి అయినా వనిత ఇంటిని ఖాళీ చేయడం లేదని, అడిగితే రౌడీలు, న్యాయవాదులతో బెదిరిస్తోందని పేర్కొన్నారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న మధురవాయిల్ పోలీస్‌మిషనర్ విచారణ చేస్తున్నారు. కాగా గురువారం పోలీసులు విజయకుమార్ ఇంటికి వెళ్లి కేసు విషయమై వనితను విచారించగా ఈ ఇంట్లో తనకు భాగం ఉందని, అందువల్ల తాను ఖాళీ చేయనని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దీంతో పోలీసులు ఇల్లు మీదనడానికి ఆధారాలుంటే చూపాలని చెప్పారు. వనిత పోలీసులతో వాగ్వాదం చేస్తున్న విషయం గురించి తెలియడంతో మీడియా వాళ్లు అక్కడికి చేరారు. దీంతో వనిత మీడియా వాళ్లపై తిరగబడింది. కొందరు ఫొటోగ్రాఫర్ల కెమెరాలను లాగి నేలకేసి కొట్టింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. పోలీసులు విజయకుమార్, వనితల కేసును విచారిస్తున్నారు. ఇంతకు ముందు కూడా వనిత కుటుంబాల మధ్య గొడవలు జరిగాయన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment