
పెరంబూరు: సీనియర్ నటి వడివుక్కరసి ఇంట్లో చోరీ జరిగింది. పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. టీ.నగర్, రామన్ వీధిలో నివశిస్తున్న వడివుక్కరసి అదే వీధిలో ఉన్న తన కూతురి ఇంటికి 10 రోజుల క్రితం వెళ్లారు. బుధవారం ఇంటికి తిరిగిరాగా తలుపులు తెరచిఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి 8 సవర్ల నగలను దుండగులు చోరీ చేసినట్టు తెలిసింది. చోరీకి గురైన బంగారం విలువ రూ.2లక్షలు. దీనిపై వడివుక్కరసు టీ.నగర్‌లోని పాండిబజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment