టీ.నగర్(తమిళనాడు): వృద్ధ దంపతులను నిర్బంధించి 50 సవర్ల నగలు, వజ్రాలు చోరీ చేసిన ఘటన కారైకుడిలో చోటుచేసుకుంది. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని కండనూరుకు చెందిన దక్షిణామూర్తి (61) రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. భార్య విశాలాక్షి (60). ఇద్దరు కుమారులు విదేశాల్లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఇంట్లోకి చొరబడిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దక్షిణామూర్తిని కత్తితో బెదిరించి లోపలికి తీసుకెళ్లారు.
ఒక గదిలో అతన్ని, భార్యను కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో బంధించారు. బీరువాలోని 50 సవర్ల బంగారు, 30 కేరట్ వజ్రాల నగలు, కిలో వెండి, రూ.2 లక్షల నగదుతో పరారయ్యారు. ఎలాగొల తాళ్లను విప్పుకున్న దంపతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శివగంగై ఎస్పీ సెంథిల్‌కుమార్ విచారణ జరిపారు. సాకోటై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment