old Couple
-
చెరువులోకి దూకిన వృద్ధ దంపతులు
-
హతమార్చి.. పోలీసులను ఏమార్చి!
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో మహిళలపై అఘాయిత్యాలకు తెగబడటం, ప్రతిఘటించిన వారిని హత్య చేసి పరారయ్యే హంతకుడిని పట్టుకోవడంలో రాచకొండ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. హత్య చేసి ఏడాదిన్నర కాలం పాటు పోలీసుల కళ్లగప్పి వారి ముందే తిరుగుతున్నా గుర్తించలేకపోయారు. మరో ఇద్దరిని హత్య చేసి, తనంతట తాను దొరికితే తప్ప విచారణాధికారులు నిందితుడిని పట్టుకోలేకపోయారు. శాస్త్రీయ కోణంలో ఆధారాలు సేకరించి తొలి కేసులోనే నిందితుడిని పట్టుకుని ఉంటే.. ఇద్దరు ప్రాణాలతో మిగిలేవారు. కేసుల దర్యాప్తులో రాచకొండ పోలీసుల డొల్లతనంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాగితే అఘాయిత్యమే.. దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల శివ కుమార్ మద్యం మత్తులో సైకోలాగా ప్రవర్తిస్తుంటాడు. తాగిన మైకంలో ఫామ్ హౌస్‌లు, నిర్మానుష్య ప్రాంతాల్లో సంచరిస్తూ ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిపై కన్నేసేవాడు. అదను చూసి మద్యం తాగి వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఎవరైనా ప్రతిఘటిస్తే అక్కడే ఉన్న పదునైన ఆయుధంతో వారిని హత్య చేసి పరారయ్యేవాడు. ఈ ఘటనను ఎవరైనా చూస్తే.. సాక్ష్యం మిగలకుండా వారిని కూడా అంతం చేసేందుకు వెనుకాడేవాడు కాదు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే అతను తన కార్యకలాపాలను ఎప్పటికప్పుడు వాటిలో పోస్ట్ చేస్తూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఆధారాల సేకరణలో విఫలం.. దాసర్లపల్లిలోని అరుణ ఫామ్ హౌస్‌లో పనిచేసే శైలజ అనే మహిళపై కన్నేసిన అతను గతేడాది మార్చి 3న ఆమెను హత్య చేశాడు. అనంతరం హతురాలి ఇంట్లో ఉన్న రెండు విదేశీ మద్యం బాటిళ్లు నిందితుడికంట పడ్డాయి. దీంతో ఒక బాటిల్‌ను తీసుకుని, మరొకటి తీస్తుండగా చేయి జారి కింద పడిపోయింది. పగిలిన బాటిల్‌పై ఉన్న నిందితుడి వేలిముద్రలను పోలీసులు సేకరించారు. అయితే హతురాలు, నిందితుడు ఇద్దరూ అదే గ్రామానికి చెందినవారే అయినా పోలీసులు ఊరిలో ఉన్న అనుమానితులను విచారించలేదు. దీంతో నిందితుడు శివ కళ్ల ముందు ఉన్నా గుర్తించలేకపోయారు. అంతే కాకుండా హత్య అనంతరం సంఘటనా స్థలానికి పోలీసులు వచి్చన సమయంలోనూ నిందితుడు కూడా అక్కడే ఉండి ఆధారాల సేకరణలో వారికి సహాయపడినట్లు తెలిసింది. వాసన పసిగట్టి డాగ్ స్క్వాడ్ వెంబడిస్తాయని ముందుగానే తెలుసుకున్న నిందితుడు... అవి రాకముందే అక్కడ్నుంచి పరారయ్యేవాడు. శైలజా రెడ్డిని హత్య చేసిన తర్వాత ఏడాదిన్నర కాలం పాటు అదే ఊర్లో తిరుగుతున్నా పోలీసులు గుర్తించలేకపోయారు. మరోసారి మద్యం మత్తులో మ్యాంగో ఆర్చిడ్స్ ఫామ్ హౌస్‌లో పని చేస్తున్న శాంతమ్మపై అత్యాచారానికి యతి్నంచాడు. ఆమె ప్రతిఘటించడంతో వేట కొడవలితో హత్య చేశాడు. ఇది చూశాడన్న అనుమానంతో ఆమె భర్త మూగ హోసయ్యనూ అంతం చేశాడు. తొలి కేసులోనే పోలీసులు హంతుకుడు శివను పట్టుకుని ఉంటే ఇద్దరి ప్రాణాలకు దక్కేవని స్థానికులు పేర్కొంటున్నారు.పాత కేసులపై ఆరా.. హత్యలు జరిగిన రెండు ఫామ్ హౌస్‌లలోనూ సీసీటీవీ కెమెరాలు లేకపోవడం కూడా పోలీసుల దర్యాప్తునకు సవాల్‌గా మారింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకునే యజమానులు, సిబ్బంది భద్రత, రక్షణ కోసం కనీసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఉండాల్సిందని పోలీసులు సూచిస్తున్నారు. ఫామ్ హౌస్‌లకు వచ్చివెళ్లే దారిలో కూడా ఎలాంటి నిఘా నేత్రాలు లేకపోవడం నిందితులు ఎలాంటి బెరుకు లేకుండా నేరాలకు పాల్పడుతుంటారని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా నిందితుడు సాయంత్రం వేళల్లో మద్యం తాగి, మహిళలపై అత్యాచారానికి పాల్పడుతుంటాడు. అడ్డుపడిన వారిపై పదునైన ఆయుధంతో హత్య చేస్తుంటాడు. దీంతో మహేశ్వరం జోన్ పరిధిలో ఇదే తరహాలో ఏమైనా హత్య కేసులు నమోదయ్యాయా అనే కోణంలో పోలీసులు పునఃసమీక్షిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, ఫామ్ హౌస్‌లు, గృహాలలో సాయంత్రం వేళల్లో జరిగిన మహిళల హత్య కేసులను ఆరా తీస్తున్నారు. -
గుళికల ప్యాకెట్‌ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని..
రాజానగరం: ఓ కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు కన్నుమూశారు. రాజానగరం మండలంలోని పల్లకడియం గ్రామానికి చెందిన వెలుచూరి గోవిందు (75), అప్పాయమ్మ (70) దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుమారుడు తన పిల్లల చదువు కోసం కుటుంబంతో సహా రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేశారు. గోవిందు, అప్పాయమ్మ మాత్రమే తమ ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గోవిందు, అప్పాయమ్మల ఇంటి నుంచి ఒక టీ పొడి ప్యాకెట్‌ను కోతి ఎత్తుకుపోయింది. మరుసటి రోజు శుక్రవారం ఉదయం వేరొక ఇంటి నుంచి పంటలకు ఉపయోగించే విష గుళికల మందు ప్యాకెట్‌ను తీసుకువచ్చి వీరి ఇంటి పెరటిలో పడేసింది. కళ్లు సరిగా కనిపించని అప్పాయమ్మ పెరటిలో పడి ఉన్న ప్యాకెట్‌ను తన ఇంటి నుంచి కోతి తీసుకువెళ్లిందేనని భావించి దానితో టీ పెట్టింది. ఆ టీని తన భర్తకు ఇచ్చి, తాను కూడా తాగింది. కొద్దిసేపటికే వారిద్దరూ నోటి నుంచి నరుగులు కక్కుతూ పడిపోయారు. ఇరుగు పొరుగువారు చూసి హుటాహుటిన రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే మరణించారు. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
తూ.గో.: టీ పొడి అనుకుని పురుగుల మందు కలపడంతో..
తూర్పు గోదావరి, సాక్షి: రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. టీ పొడి అనుకుని ఓ వృద్ధురాలు పాలలో పురుగుల మందు కలపడంతో.. భర్తతో సహా ప్రాణం విడిచింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అప్పాయమ్మ(70)కు కళ్లు సరిగ్గా కనిపించవు. దీంతో టీ పొడి అనుకుని పురుగుల మందును పాలలో కలిపింది. ఆ టీ తాగి భర్త వెలుచూరి గోవింద్(75), ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వెంటనే రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆ దంపతులు కన్నుమూశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
AP Police: వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం..రక్షించిన పోలీసులు
హనుమాన్‌జంక్షన్ రూరల్: కుటుంబ వివాదాల కారణంగా ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వెళ్లి ఆత్మహత్యకు యత్నించిన వృద్ధ దంపతులను కృష్ణాజిల్లా వీరవల్లి పోలీసులు కాపాడారు. పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురానికి చెందిన వృద్ధ దంపతులు గురువారం అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయారన్న సమాచారం తెలుసుకున్న తెలంగాణలోని నిజామాబాద్‌లో నివసిస్తున్న కుమారుడు ఆందోళన చెందాడు. క్షణికావేశంలో వారు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడతారోనని భయపడ్డాడు. ఆ అర్ధరాత్రి సమయంలోనే కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయూమ్ అస్మీకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. వృద్ధ దంపతుల ఆచూకీని కనిపెట్టి, వారిని తీసుకొచ్చే బాధ్యతను స్పెషల్ బ్రాంచ్ సీఐ జేవీ రమణ, వీరవల్లి ఎస్ఐ ఎం.చిరంజీవిలకు ఎస్పీ అప్పగించారు. ఎస్ఐ చిరంజీవి రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. కృష్ణా నదిలోకి దూకబోతున్న వీరిని నిలువరించి, వారికి నచ్చజెప్పి వీరవల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ, అనారోగ్య సమస్యల వల్ల ఎవ్వరికీ భారం కాకూడదన్న ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో ఇంటి నుంచి బయటికి వెళ్లినట్టు ఎస్ఐకి వారు వివరించారు. వృద్ధ దంపతులను క్షేమంగా కాపాడి, ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, మాజీ సైనికుడు అయిన ఆ వృద్ధ దంపతుల కుమారుడు ఏపీ పోలీసుల పనితీరుకు ముగ్ధుడయ్యారు. వెంటనే స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ, వీరవల్లి ఎస్ఐ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. -
30 ఏళ్ల క్రితం చేసిన మర్డర్.. తాజాగా తాగి వాగేసి.. దొరికేశాడు
ముంబై: లోనావాలాకు చెందిన అవినాష్ పవార్ 1993లో ఒక వృద్ధ జంటను హత్యచేసి వారింట్లో దొంగతనం చేశాడు. తర్వాత ఔరంగాబాద్ కు మకాం మార్చాడు. పరారీలో ఉండి 30 ఏళ్ళు రాజాలా బ్రతికాడు. చివరికి ఒక ఫంక్షన్లో బాగా తాగి ఆ మర్డర్ గురించి వాగి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. లోనావాలాలో చిన్న వ్యాపారం చేసుకునే అవినాష్ పవార్ అనే ఆసామి ఇద్దరు సహచరులతో కలిసి సమీపంలోని ఒక ఇంట్లోకి చొరబడి వృద్ధ జంటను హత్య చేసి వారింట్లో దొంగతనం చేశారు. తర్వాత పోలీసు విచారణలో మిగతా ఇద్దరు పట్టుబడగా అవినాష్ మాత్రం తన తల్లిని అక్కడే విడిచిపెట్టి ఢిల్లీ పారిపోయాడు. అప్పటికి అవినాష్ వయసు 19 ఏళ్ళు మాత్రమే. తర్వాత ఔరంగాబాద్ చేరుకుని అక్కడ అమిత్ పవార్ గా పేరు మార్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ కూడా సంపాదించాడు. అక్కడ నుండి పింప్రి-చించ్వాడ్, అహ్మద్ నగర్ అటునుంచి చివరికి ముంబై చేరుకొని అక్కడే సెటిల్ అయ్యాడు. ఆధార్ కార్డులో కూడా పేరు మార్చుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. తన భార్య రాజకీయంగా ఎదగడానికి కూడా తడ్పడ్డాడు. ప్రస్తుతం పవార్ వయసు 49 ఏళ్ళు. ఈ ముప్పై ఏళ్లలో అతను ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కానీ సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు మురుగు కాలవలో పడి చనిపోయినట్టు మందు మైకంలో అప్పుడు చేసిన మర్డర్ గురించి ఓ పార్టీలో ఒక అజ్ఞాతవ్యక్తి దగ్గర వాగి దొరికిపోయాడు. ఆ వ్యక్తి నుండి సమాచారం అందుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ స్వయంగా రంగంలోకి దిగి పవార్ ను విక్రోలిలో అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ పవార్ అలియాస్ అమిత్ పవార్ కోసం గాలిస్తూనే ఉన్నాము. అతడి ఇద్దరు సహచరులు పట్టుబడినా ఇతను మాత్రం తప్పించుకున్నాడు. ఇన్నాళ్లుగా పవార్ తన తల్లిని గాని తన భార్య తల్లిదండ్రులను గాని చూడటానికి రాలేదు. చివరకు ఇలా విక్రోలీలో పట్టుబడ్డాడని తెలిపారు. -
కూతురు ఇంటి నుంచి సంతోషంగా వెళ్తుంటే..
సాక్షి, మియాపూర్(హైదరాబాద్): కూతురు వద్దకు వెళ్లి తిరిగి సొంత గ్రామానికి వెళ్తున్న వృద్ధ దంపతులు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందిన సంఘటన లింగంపల్లి రైల్వే స్టేషన్లో సోమవారం చోటుచేసుకుంది. రైల్వే సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి గ్రామానికి చెందిన వెంకట్రావు(65), అనంతలక్ష్మీ(60) దంపతులు పదిరోజుల కిందట చిలుకూరులో ఉంటున్న వారి కుమార్తె కుమారి దగ్గరకు వచ్చారు. తిరిగి సొంతూరుకు వెళ్లేందుకు సోమవారం ఉదయం లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చి...సాయంత్రం 5:20 గంటల సమయంలో ఫస్ట్ ప్లాట్‌పారం నుంచి దిగి రెండవ ప్లాట్‌పారంకు వెళ్లేందుకు పట్టాలపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా శంకర్పల్లి వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ వీరిని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. సాయంత్రం 7:30 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్లో నర్సాపూర్ రైలు ఎక్కేందుకు వచ్చినట్లు బంధువులు తెలిపారు. వృద్ధ దంపతులు ఇద్దరు మృతి చెందడంతో బంధువులు విలపించారు. తోటి ప్రయాణికులు కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నెత్తురోడిన రహదారులు..రెండు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
సాక్షి, కంటోన్మెంట్: నగరంలో ఉంటున్న కుమారుడిని చూసేందుకు నిర్మల్ నుంచి వచ్చిన వృద్ధ దంపతులు ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన సంఘటన బోయిన్పల్లి చౌరాస్తాలో ఆదివారం చోటు చేసుకుంది.. నిర్మల్ నగరానికి చెందిన తులసీదాస్ (65), రాజమణి (62) దంపతులు నగరంలోని గచ్చిబౌలిలో ఉంటున్న తమ కుమారుడు రామరాజు ఇంటికి వెళ్లేందుకు ఆదివారం నగరానికి వచ్చారు. మధ్యాహ్నం బోయిన్‌పల్లిలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వైపునకు వెళ్తున్న జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు బస్సు డ్రైవర్ మార్గం నరహరి అదుపులోకి తీసుకున్నారు. మృతుల కుమారుడు రామరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తరచూ ప్రమాదాలు.. పట్టించుకోని అధికారులు బోయిన్పల్లి చౌరస్తాలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఆగ్రహించిన స్థానికులు పోలీసులు, అధికారులకు కనువిప్పు కలగాలంటూ ఓ పక్క అంబులెన్స్‌లో మృతదేహాలు, ఆర్టీసీ బస్సును చూపిస్తూ ఓ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పాదచారులు రోడ్డు దాటేందుకు తగిన ఏర్పాట్లు లేకపోవడం కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం కుషాయిగూడ: కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కుషాయిగూడ పీఎస్ పరిధిలోని మల్లాపూర్ అశోక్‌నగర్ కాలనీ మర్రిగూడ హెచ్‌పీ పెట్రోల్ పంప్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బిహార్‌కు చెందిన రాజు మహతో నగరానికి వలసవచ్చి మల్లాపూర్‌లోని న్యూ నర్సింహనగర్లో కుటుంబంతో సహా నివాసం ఉంటూ ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం తోపుడుబండిపై ఉల్లిపాయలు విక్రయిస్తుండగా మర్రిగూడ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచి్చన కారు అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతుడి బావ నాగేందర్‌కుమార్ ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి) -
మరణంలోనూ ఒకరికొకరు తోడుగా.. ఒకే సమాధిలో ఇద్దరికీ శాశ్వత విశ్రాంతి
రామచంద్రపురం రూరల్: మండలంలోని ఏరుపల్లికి చెందిన బూసి ధర్మరాజు(82), బూసి వీరమ్మ (72)లది 56 ఏళ్ల అన్యోన్య దాంపత్యం. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె, పెద్ద అల్లుడు కాలం చేశారు. చిన్న కుమార్తె గొల్లపల్లి పార్వతి హసన్‌బాద గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. ఆమె భర్త గొల్లపల్లి సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తూ ఇటీవల మృతి చెందారు. 56 ఏళ్ల వైవాహిక జీవితంలో ధర్మరాజు, వీరమ్మ ఏనాడూ ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేదు. కుమార్తెల ఇళ్లకు వెళ్లేటప్పుడు కూడా ఇద్దరూ కలిసే వెళ్లి వచ్చేవారు. గ్రామంలో ఒకరికొకరు తోడుగా జీవించేవారు. ధర్మరాజు ఎనిమిది పదుల వయస్సులోనూ సైకిల్ తొక్కుకుంటూ కుమార్తె ఇంటికి వెళ్లేవారు. ఇంటిలోకి కావాల్సిన సరుకులు తానే స్వయంగా తెచ్చుకునేవారు. వీరమ్మ కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటూ ఇంటి పనులు మొత్తం తానే చక్కబెట్టుకునేది. కొంతకాలంగా ధర్మరాజుకు కాస్త ఆయాసం వస్తూ ఉండేది. దీంతో భర్తకు వేడి మంచినీళ్లు ఇవ్వడం వీరమ్మకు అలవాటుగా మారింది. గురువారం రాత్రి 12 గంటల సమయంలో భర్తకు వేడి నీళ్లు ఇద్దామని పిలవగా స్పందించలేదు. చుట్టుపక్కల వారిని లేపి చూపించగా, వారు పరిశీలించి ధర్మరాజు మృతి చెందాడని చెప్పారు. దీంతో ఆమె రోదిస్తూ కూర్చుంది. చుట్టుపక్కల వారు కుమార్తెల కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. సుమారు 2 గంటల పాటు ఏడుస్తూ కూర్చున్న వీరమ్మ వెక్కిళ్లు వచ్చి, వాంతి చేసుకుని ప్రాణాలు విడిచిపెట్టింది. నాలుగు రోజుల క్రితం మునిమనవడితో కులాసాగా గడిపిన ఆ వృద్ధ దంపతులు ఒకే రోజు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శుక్రవారం ఉదయం క్రిస్టియన్ పద్ధతిలో ఇద్దరినీ ఒకే సమాధిలో పూడ్చి పెట్టారు. కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్ మల్లిమొగ్గల శ్రీధర్, మాజీ సర్పంచ్‌లు సాక్షి వేణు, చిల్లా గోపాలకృష్ణ, గ్రామస్తులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చదవండి: పోలీస్ స్టేషన్లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య -
నా భర్తకు 89 ఏళ్లు.. రోజూ అదే ధ్యాస.. నన్ను కాపాడండి
గాంధీనగర్: గుజరాత్ వడోదరలో 89ఏళ్ల భర్తపై ఫిర్యాదు చేసింది 87ఏళ్ల భార్య. వృద్ధ వయసులోనూ ఆయన రోజూ శృంగారం కావాలని తనను బాగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించింది. మహిళల కోసం గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్ 181 అభయంకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది. తన భర్త నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదు విని షాక్‌కు గురైన అభయం టీం వెంటనే రంగంలోకి దిగింది. వృద్ధ దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చింది. ఈ వయసులో యోగా చేయాలని, పుణ్యక్షేత్రాలను సందర్శించాలని సూచించింది. వీలైతే సీనియర్ సిటిజెన్ల కోసం ఏర్పాటు చేసిన పార్కులలో సేదతీరాలని చెప్పింది. భార్యను ఇబ్బందిపెట్టవద్దని భర్తకు సూచించి సమస్యను పరిష్కరించింది. తన భర్తకు ఎప్పుడూ అదే ధ్యాస అని, శృంగారానికి ఒప్పుకోకపోతే తనపై కోపపడతాడని భార్య చెప్పింది. తన ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినకుండా భర్త పదే పదే బలవంతం చేయడం వల్లే గత్యంతరం లేక ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. చదవండి: డ్రగ్స్ మత్తులో రోడ్డుపై కాలు కదపలేని స్థితిలో యువతి.. వీడియో వైరల్.. -
ఈ జంటకు సలాం కొట్టాల్సిందే!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..
వైరల్: 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. కేంద్రం ఇచ్చిన హర్ ఘర్ తిరంగా పిలుపు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఎక్కడ చూసినా మూడు రంగుల జెండా రెపరెపలాడుతూ సందడి చేసింది. అయితే.. జెండా ఎగరేసేందుకు ఓ వృద్ధ జంట ప్రయాస పడడంపై ఆనంద్ మహీంద్ర భావోద్వేగమైన పోస్ట్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ఇంత హడావుడి ఎందుకు చేస్తారనే మీకు ఎప్పుడైనా ఆశ్చర్యంగా అనిపిస్తే.. ఇక్కడున్న ఈ ఇద్దరినీ అడగండి. గొప్ప గొప్ప వక్తలు ఇచ్చే ఉపన్యాసాల కంటే బెటర్‌గా మీకు వీళ్లు వివరిస్తారు. జైహింద్ అని ట్విటర్లో పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. పైన ఉన్న ఒకావిడ జెండా మీద దృష్టి పెడితే.. ఆమె పడిపోకుండా కింద డ్రమ్మును పట్టుకుని ఉన్నారు ఓ పెద్దాయన. If you ever were wondering why such a fuss over Independence Day, just ask these two people. They will explain it better than any lecture can. Jai Hind. 🇮🇳 pic.twitter.com/t6Loy9vjkQ — anand mahindra (@anandmahindra) August 14, 2022 Next level it is! Love this young couple ❤️ — Jhony Bravo (@mahesh_s_savita) August 14, 2022 No word yet only Jai Hind 🙏🙏 — ramaekrisshna (@ramakrishna183) August 14, 2022 ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదుగానీ.. నిజమైన దేశభక్తే ఇదేనంటూ చాలామంది కామెంట్లు చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫొటోను మీరూ చూసేయండి. ఇదీ చదవండి: భారత్‌కు పాక్ మ్యూజిషియన్ ఊహించని కానుక -
పెళ్లయిన కొత్తలో విడిపోయి.. 52 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు!
హుబ్లీ: పెళ్లయిన కొత్తలో గొడవలతో వేరుపడ్డారు. విడాకులు కూడా తీసుకుని 52 ఏళ్ల పాటు ఎవరికొద్దీ వారు జీవించారు. చివరకు లోక్ అదాలత్ వారిని ఒక్కటి చేసింది. ఈ అపరూప సన్నివేశం కర్ణాటక రాష్ట్రం ధార్వాడ జిల్లా కలఘటికిలో నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌లో చోటు చేసుకుంది. జెన్నూరు గ్రామానికి చెందిన బసప్ప అగడి (85), మాజీ భార్య కళవ్వ (80) 52 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కళవ్వకు బసప్ప ప్రతి నెలా భరణం చెల్లించేవాడు. గత కొన్ని నెలలుగా చెల్లించలేకపోయాడు. దీంతో కళవ్వ కోర్టును ఆశ్రయించగా సోమవారం మెగా లోక్ అదాలత్‌లో జడ్జి జీఆర్ శెట్టర్ వారి సమస్యను పరిశీలించారు. నడవలేని స్థితిలో ఉన్న కళవ్వను చూసి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి కలిసి జీవించాలంటూ హితబోధ చేశారు. దంపతులను ఒక్కటి చేసి పంపించారు. (క్లిక్: అయ్యబాబోయ్ ఏనుగులు.. పరుగో పరుగు!) -
ఎంగిలి పేట్లు కడిగాం.. ఆస్తులన్నీ రాసిచ్చాం.. బతకడానికి దారి చూపండయ్యా
గూడూరు (తిరుపతి జిల్లా): ఎంగిలిపేట్లు కడిగి ఆస్తులు సంపాదించాం. పిల్లలకు ఏ కష్టం తెలియకుండా పెంచి ప్రయోజకుల్ని చేశాం. ఆస్తులన్నీ రాసిచ్చాం. వృద్ధాప్యంలో ఆదుకుంటారనుకుంటే చిత్రహింసలు పెడుతున్నారు. పదమూడేళ్లుగా జీవచ్ఛవాళ్లా జీవిస్తున్నాం. బతకడానికి దారి చూపండయ్యా’ అంటూ వృద్ధ దంపతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. చదవండి: చంద్రుడిని చూశారుగా? ఎంత పెద్దగా కనిపిస్తున్నాడో.. ఎక్కడో తెలుసా! బాధితుల కథనం మేరకు.. గూడూరు రెండో పట్టణంలోని జానకిరాంపేట ప్రాంతానికి చెందిన కోనేరు సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ, పిల్లలను ప్రయోజకుల్ని చేశారు. కాయకష్టం చేసి ఆస్తులు కూడబెట్టారు. అందరికీ వివాహాలయ్యాయి. ఉన్న ఆస్తులన్నింటినీ పిల్లల పేర రాసిచ్చేశారు. ఉన్న నగదుతోపాటు, బంగారం కూడా వారికే ఇచ్చేశారు. ఇంతచేసినా ఇంకా ఇవ్వాలంటూ తరచూ తల్లిదండ్రులను కొట్టడంతోపాటు, హింసించడం మొదలు పెట్టారు. ఈ మేరకు వృద్ధదంపతులు నాలుగేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టుకూడా అప్పట్లో తల్లిదండ్రులకే అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ పిల్లల్లో మార్పురాలేదు. ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిపోతున్న సుబ్బయ్యకు పక్షవాతం వచ్చింది. ఇంట్లో నుంచి బయటకు వస్తే కొడుకులు కొడుతున్నారని వాపోతున్నారు. తమకు బతకడానికి దారి చూపాలని వేడుకుంటున్నారు. ఈ విషయమై స్థానిక ఎస్ఐ తిరుపతయ్యను వివరణ కోరగా దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రాత్రి బాగానే ఉన్నారు.. ఏం జరిగిందో ఏమో ఉదయం ఇంట్లో చూస్తే..
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఆదివారం రాత్రి వరకు బాగానే ఉన్న దంపతులు సోమవారం ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. ఇద్దరి మెడలకు తాడు ఉండి కింద పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారా.. లేదా ఆస్తి కోసం ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన స్వర్గం సత్యనారాయణ (65) బాలమణి (58) దంపతులు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. సత్యానారాయణ గ్రామంలో చిన్నపాటి వ్యాపారం చేస్తుండగా, భార్య బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా వీరికి సంతానం లేకపోవడంతో ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. గజ్వేల్‌కు చెందిన యువకుడితో పెళ్లి కూడా జరిపించారు. సత్యనారాయణ సోదరుడు బుచ్చయ్యకు కూడా పిల్లలు లేకపోవడంతో అక్కారం గ్రామానికి చెందిన శ్రీను అనే బాలుడిని దత్తత తీసుకుని పెంచుకున్నాడు. మరో సోదరుడు ప్రభాకర్ చిన్నప్పుడే తంగళ్లపల్లిలో స్థిరపడ్డారు. కొన్నేళ్ల క్రితం బుచ్చయ్య దంపతులు అనారోగ్యంతో మృతి చెందారు.అప్పటి నుంచి శ్రీను ఒంటరిగానే ఉంటున్నాడు. సత్యనారాయణ, బుచ్చయ్యకు సంబంధించి 39 గుంటల భూమి ఉండడంతో రెండు నెలల క్రితం రూ. 25 లక్షలకు విక్రయించారు. అప్పటి నుంచి చిన్నపాటి గొడవలు ప్రారంభం అయ్యాయి. సత్యనారాయణ ఇద్దరు చెల్లెళ్లలకు తలా రూ. లక్ష ఇవ్వగా, శ్రీనుకు రూ. 3 లక్షలు ఇచ్చారు. మిగతా డబ్బులు సత్యనారాయణ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. శ్రీనుకు పెళ్లి కాకపోవడంతో పెళ్లి చేయాలని పెద్దల సమక్షంలో నిర్ణయించారు. ఈక్రమంలో సోమవారం ఉదయం 8 గంటలు దాటినా సత్యనారాయణ తలుపులు తీయలేదు. స్థానికుడైన వెంకట్‌రెడ్డి ఫోన్ చేసినా లేపలేదు. దీంతో ఇంటి వెనకలా తలుపును తట్టి చూడగా ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. వెంటనే అతడు సర్పంచ్ భానుప్రకాష్‌రావుకు సమాచారం అందించాడు. అనంతరం జగదేవ్‌పూర్ పోలీసులకు సమాచారం తెలిపారు. వెంటనే ఏసీపీ రమేష్, గజ్వేల రూరల్ సీఐ కమలాకర్, ఎస్ఐలు రాజు, పుష్పరాజు ఘటనా స్థలికి చేరుకొని క్లూస్‌టీం, డాగ్స్క్వాడ్లతో పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ ఇంటి చుట్టూ తిరిగి పక్కన ఉన్న ఫంక్షన్‌హాల్ ముందు నుంచి రోడ్డుపై వెళ్లి ఆగింది. ఏసీపీ రమేష్ మాట్లాడుతూ.. దంపతుల మృతిని అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాలెన్నో.. సోదరుడి పొత్తుల భూమి అమ్మగా సత్యనారాయణకు మరో ఎకరన్నర భూమి ఉంది. డబ్బులు, ఉన్న భూమి, ఆస్తి కోసం హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. బీరువాను చూడకపోవడం, అందులో సుమారు రూ. 2 లక్షల వరకు డబ్బులు, బంగారు ఆభరణాలు అలాగే ఉండడం, బాలమణి ఒంటిపై నగలుఉన్నాయి. వారి ఒంటిపై ఎలాంటి గాయాల ఆనవాళ్లు కూడా లేవని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. 70 ప్లస్‌లో ప్రేమ.. ఆపై పెళ్లి
ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్, ప్రేమకు సరిహద్దులు లేవు... ఈ డైలాగులు అప్పుడప్పుడు సినిమాల్లో మనం వింటూనే ఉంటాం. అయితే ఇద్దరు వృద్ధులు మాత్రం ఏడు పదులు వయసులో కూడా ఆ మాటలను నిజం చేసి చూపించారు. అసలు ఈ 70 ప్లస్ లవ్‌స్టారీ ఎలా మొదలైందంటే.. పెయింటర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన జిమ్ ఆడమ్స్కు పెళ్లయిన 38 సంవత్సరాల తర్వాత 2017లో తన భార్యను కోల్పోయాడు. ఇటీవల కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో, 78 ఏళ్ల అతను తనకి ఓ తోడు కావాలని నిర్ణయించుకుని 50 ఏళ్లు పైబడిన మహిళ కోసం ఆన్లైన్ డేటింగ్ యాప్‌లో లాగిన్ అయ్యాడు. అలా తోడు కోసం వెతుకుతున్న ఆడమ్స్కు అనుకోకుండా 79 ఏళ్ల రిటైర్డ్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ఆడ్రీని కలిశాడు. ఆమె 33 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. చివరికి ఒకిరికొకరు నచ్చడంతో ఇటీవలే పెళ్లి కూడా చేసుకుంది ఆ జంట. దీనిపై ఆడ్రీ.. నేను ఆ యాప్ ఉపయోగించిన తక్కువ సమయంలోనే ఆడ్రీని చూశాను. నాతో పరిచయం పెంచుకున్న తర్వాత మేము దగ్గర కావడానికి ఎక్కువ రోజులు కూడా పట్టలేదు. ఎందుకంటే తను కూడా నా లాంటి క్రేజీ పర్సన్ కాబట్టి.. అంటూ తెలిపాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ వీరి ప్రేమ బంధం పెళ్లి బంధంగా మార్చుకుంది ఆ వృద్ధ జంట. ప్రస్తుతం నెట్టింట జిమ్, ఆడ్రి పెళ్లి చేసుకున్న ఫోటోలు వైరల్‌గా మారి చక్కర్లు కొడుతున్నాయి. ఆ జంటను చూసిన నెటిజన్లు వారికి ఆల్ ది బెస్ట్ అని కామెంట్ పెడుతున్నారు. పోస్ట్ అప్లోడ్ చేసినప్పటి నుండి 1.5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. చదవండి: Viral: ప్రియుడి బాధ చూడలేక ప్రేయసి త్యాగం.. సినిమాల్లో కూడా సాధ్యం కాదేమో ! -
వృద్ధుల కన్నీటి గాథ: ఒక్కగానొక్క కొడుకు మృతి.. కిడ్నీలు ఫెయిల్.. పింఛనే ఆధారం
మునగాల: రెండు కిడ్నీలు చెడిపోవడంతో పాటు వయస్సు మీదపడడంతో కేవలం వృద్ధాప్య పింఛన్‌తోనే బతుకు వెళ్లదీస్తున్న వృద్ధ దంపతులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాలు.. మండలంలోని బరాఖత్‌గూడెం గ్రామానికి చెందిన జిల్లేపల్లి లచ్చయ్య (80), ఎల్లమ్మ (70) దంపతుల ఒక్కగానొక్క కుమారుడు పదేళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. నాటి నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా రెండేళ్ల కిందట లచ్చయ్యకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఇద్దరు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్‌తోనే కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం మందులు కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో తమను దాతలు ఎవరైనా ఆదుకోవాలని ఈ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. మా ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని భార్య ఎల్లమ్మ తెలిపింది. పింఛన్ పైసలతో పూట గడవడమే కష్టంగానే ఉందని వాపోయింది. ఆపన్నహస్తం అందించి ఆదుకుంటే రుణపడి ఉంటామని ఎల్లమ్మ చెబుతోంది. -
భర్త మరణించిన ఒక్కరోజు వ్యవధిలోనే భార్య కూడా
సేలం: వృద్ధాప్యం వల్ల భర్త మృతి చెందడంతో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన గురువారం సేలంలో చోటు చేసుకుంది. సేలం పాత సూరమంగళం వెల్లై కవునర్ వీధికి చెందిన వృద్ధుడు పెరియన్నన్ (98). ఇతని భార్య అన్నమ్మ (90). వీరికి గణేశన్, సుందరం, రాము అనే ముగ్గురు కుమారులు, కుమార్తె కలైసెల్వి ఉన్నారు. వీరిలో గణేశన్, సుందరానికి మాత్రమే వివాహం అయ్యింది. రాము, కలై సెల్విలకు వివాహం చేసుకోలేదు. అయితే, ముగ్గురు కుమారులు, కుమార్తె గత కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. గణేశన్, సుందరం వారివారి కుటుంబాలతో వేరు వేరుగా జీవిస్తూ వస్తున్నారు. దీంతో పెరియన్నన్, అన్నమ్మాల్ తోటలోని ఇంట్లో విడిగా నివసిస్తూ వచ్చారు. ఇక్కడ పొలం పండిస్తూ, పశువులను మేపుతూ పాలు విక్రయిస్తూ జీవిస్తున్నారు. ఈ స్థితిలో గత కొన్ని నెలలుగా పెరియన్నన్ అనారోగ్యానికి గురై మంచం పట్టాడు. ఆయనకు అన్నమ్మాల్ సేవలందించారు. ఈ స్థితిలో బుధవారం రాత్రి పెరియన్నన్ మృతి చెందాడు. రాత్రంతా భర్త పెరియన్నన్ మృతదేహం వద్ద ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్న అన్నమ్మాల్ తీవ్ర ఆవేదనతో గురువారం వేకువజామున ఇంట్లోని దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం ఎంత సేపటికి అన్నమ్మాల్ బయటకు రాకపోవడంతో ఇరుగు పొరు గు వారు వెళ్లి చూడగా పెరియన్నన్ మంచంపై శవంగాను, దూలానికి అన్నమ్మాల్ మృతదేహంగాను వేలాడుతుండడం చూసి సూరమంగళం పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అన్నమ్మాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెరియన్నన్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
అంత్యక్రియలకు డబ్బులిచ్చి.. ఎంతపని చేశారంటే..
తిరువొత్తియూర్(తమిళనాడు): దిండుక్కల్ జిల్లాలో వృద్ధ దంపతులు విషం తాగి.. ఆత్మహత్య చేసుకున్నారు. వీరు తమ అంత్యక్రియలు ముందస్తుగా డబ్బుఇవ్వడం గమనార్హం. వివరాలు.. దిండిగల్ జిల్లా వత్తలగుండు సమీపం కనవాయ్‌పట్టికి చెందిన తోత్తన్ (65). అతని భార్య వీరాయి (60). వీరికి పిల్లలు లేరు. తొత్తన్ కాఫీ తోటల్లో కూలి కార్మికుడిగా పని చేస్తున్నాడు. వీరాయి 100 రోజుల పనులకు వెళుతూ ఉన్నారు. వృద్ధాప్యం కారణంగా వీరు పనులకు వెళ్లలేక ఇద్దరూ ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. దీంతో విరక్తి చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. గన్నేరు కాయలు నూరి తాగేసి వాంతులు చేసుకున్నారు. ఈ విషయాన్ని పక్కంటిలో నివాసం ఉండే అంథోని గమనించారు. దీంతో వారు తాము విషం తాగామని, కాపాడడానికి ప్రయత్నం చేయవద్దని, తమ మృతదేహలను ఒకేచోట పాతి పెట్టాలని, అంత్యక్రియల ఖర్చులకు రూ. 40,000 నగదును అంథోనికి చేతికిచ్చారు. తర్వాత కొద్ది సేపటికే వీరాయి, తోత్తన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంత్యక్రియలకు డబ్బులు ఇచ్చి దంపతులు ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. -
వృద్ధ దంపతులను తాళ్లతో బంధించి..
టీ.నగర్(తమిళనాడు): వృద్ధ దంపతులను నిర్బంధించి 50 సవర్ల నగలు, వజ్రాలు చోరీ చేసిన ఘటన కారైకుడిలో చోటుచేసుకుంది. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని కండనూరుకు చెందిన దక్షిణామూర్తి (61) రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. భార్య విశాలాక్షి (60). ఇద్దరు కుమారులు విదేశాల్లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఇంట్లోకి చొరబడిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దక్షిణామూర్తిని కత్తితో బెదిరించి లోపలికి తీసుకెళ్లారు. ఒక గదిలో అతన్ని, భార్యను కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో బంధించారు. బీరువాలోని 50 సవర్ల బంగారు, 30 కేరట్ వజ్రాల నగలు, కిలో వెండి, రూ.2 లక్షల నగదుతో పరారయ్యారు. ఎలాగొల తాళ్లను విప్పుకున్న దంపతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శివగంగై ఎస్పీ సెంథిల్‌కుమార్ విచారణ జరిపారు. సాకోటై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిలువనీడ లేక.. చేరదీసేవారు లేక!
నిర్మల్: మిట్ట మధ్యాహ్నం.. ఎర్రటిఎండ.. నెత్తిన మూటలు, కాలినడకన, ఖాళీ కడుపున వచ్చి ఓ చెట్టు నీడన ముక్కుతూ, మూలుగుతూ గడుపుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఊరికాని ఊరిలో పడరాని పాట్లు పడుతున్నారు. జీవన మలిసంధ్యవేళ సంచార జీవనం గడుపుతున్నారు. ఇదీ నిర్మల్‌లో ఓ వృద్ధదంపతుల దయనీయస్థితి. నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామానికి చెందిన అల్లకుంట లక్ష్మి, లక్ష్మయ్య అనే వృద్ధ దంపతులకు సంతానం లేదు. సొంత ఇల్లు కూడా లేదు. అదే ఊరిలో ఓ గదిలో అద్దెకుండేవారు. లక్ష్మయ్య ఊళ్లోవారి బర్రెలను కాస్తుండగా, లక్ష్మి వ్యవసాయపనులకు వెళ్లేది. వయసు పైబడటంతో ఆయన ఇంటి పట్టునే ఉంటున్నాడు. నెలనెలా వచ్చే రూ.రెండు వేల పింఛన్‌తోనే ఆ దంపతులు ఇన్నాళ్లు బతుకు వెళ్లదీస్తూ వచ్చారు. ఇటీవల గ్రామంలో కరోనా కేసులు పెరగడంతో యజమాని ఈ వృద్ధ దంపతులుంటున్న గదిని ఖాళీ చేయించాడు. దీంతో తమ బట్టలను సంచులలో సర్దుకుని, వాటిని నెత్తిన పెట్టుకుని రోడ్డెంటా బయలుదేరారు. మూడు నెలలుగా పింఛన్ వస్తలేదు... రెండు, మూడు రోజులు ఆ ఊళ్లో, ఈ ఊళ్లో గడిపా రు. లక్ష్మి బంధువుల ఇళ్లలో వారం ఉన్నారు. అక్కడా పరిస్థితి బాగా లేక మళ్లీ బయటకు వచ్చా రు. ఇరవై రోజుల క్రితం నిర్మల్ బస్టాండ్ చేరుకున్నారు. అక్కడే ఉంటూ.. ఎవరైనా అన్నదానం చేస్తే తింటూ పూట గడుపుతున్నారు. బస్టాండ్ అధికారులు గురువారం బయటకు పంపించడంతో మళ్లీ రోడ్డున పడ్డారు. ఎండలో ప్రధాన రహదారి వెంట నడుస్తూ.. చివరకు ఆర్అండ్బీ విశ్రాంతి భవనం వద్ద ఓ చెట్టు కింద ఆగారు. ‘సుట్టాలున్నా.. మా అసుంటి ముసలోళ్లను ఎన్నాళ్లు ఉంచుకుంటరు బిడ్డా..’అని లక్ష్మి వాపోతోంది. మూణ్నెళ్లుగా పింఛన్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అందరూ ఉన్నా.. అనాథగానే! వర్ధన్నపేట: భర్త ఉన్నాడు.. బంధువులు ఉన్నారు.. దత్తపుత్రుడు ఉన్నాడు. అయినా ఆమె ఎవరూలేని అనాథలా జీవితం గడుపుతోంది.. అనారోగ్యంతో లేవలేని స్థితిలో బతుకుపోరు సాగిస్తోంది. కరోనా అనుమానంతో ఎవరూ దగ్గరకు రావడంలేదు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట 11వ వార్డుకు చెందిన గబ్బెట విజయ, వెంకటేశ్వర్లు దంపతులు. వెంకటేశ్వర్లు విశ్రాంత ఉపాధ్యాయుడు. సంతానం లేకపోవడంతో విజయను వదిలేసిన ఆయన మరో పెళ్లి చేసుకుని వరంగల్‌లో కాపురం ఉంటున్నాడు. విజయ ఒంటరిగా వర్ధన్నపేటలో ఉంటూ కొన్నేళ్ల క్రితం ఓ బాలుడిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసింది. వారం క్రితం విజయ అస్వస్థతకు గురికాగా దత్తపుత్రుడు ఆమెను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. మొదట ఆమెను అక్కాచెల్లెళ్లు తీసుకెళ్లారు. కానీ జ్వరం తగ్గకపోవడంతో కరోనా సోకిందనే అనుమానంతో వర్ధన్నపేటలోని ఇంట్లో వదిలేశారు. అప్పటి నుంచి ఆమె లేవలేని స్థితిలో తిండి, నీరు లేక నీరసించింది. గురువారం ఆమె స్థితిని గమనించిన ఇరుగుపొరుగువారు ఆమె భర్తకు ఫోన్ చేయగా తాను కరోనా బారిన పడినందున మీరే ఆస్పత్రిలో చేర్చాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక మునిసిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఇక స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులకు చెబితే హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్‌చేస్తే తప్ప తాము తీసుకెళ్లలేమని చేతులెత్తేశారు. స్థానిక యువకులు మంచినీరు, ఆహారం ఇవ్వాలని ప్రయత్నిం చారు. ఆమె నీళ్లూ తాగలేని పరిస్థితిలో ఉంది. -
కంటతడి పెట్టించిన హృదయ విదారక దృశ్యం..
కొత్తపల్లి: మండలంలోని ఉప్పాడలో వృద్ధ దంపతులు 24 గంటల వ్యవధిలో ఒకరి తరువాత ఒకరు ప్రాణాలు వదిలిన విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య శనివారం మధ్యాహ్నం మృతి చెందగా, ఆదివారం భర్త ప్రాణాలు విడిచారు. ఈ ఘటన గ్రామస్తులను కలచివేసింది. చేనేత వస్త్ర వ్యాపారం చేసే 85 సంవత్సరాల అతని మనుమడికి కరోనా సోకింది. అతడు ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో వృద్ధ దంపతులు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు విడిచారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ వృద్ధుల మృతదేహాలను చూసేందుకు ఎవరూ సాహసించలేదు. కనీసం శ్మశానానికి తరలించేందుకు బంధువులు కూడా ముందుకు రాకపోవడంతో వారి కుమారుడే రిక్షాలో తల్లిదండ్రుల శ్మశానానికి తరలించి, అంత్యక్రియలు చేశారు. రిక్షాలో మృతదేహాలను తరలించిన హృదయ విదారక దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టారు. చదవండి: జూదానికి డబ్బు ఇవ్వలేదని ఓ తండ్రి దారుణం.. ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య -
టీకా వేసుకున్న రోజే భార్య.. ఆ తర్వాత భర్త
నెక్కొండ: జ్వరంతో బాధపడుతున్న వృద్ధ దంపతులు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లారు. అక్కడే టీకా కూడా వేయించుకున్నారు. అదే రోజు భార్య మృతి చెందగా, ఐదో రోజు భర్త మరణించాడు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. నెక్కొండకు చెందిన పుట్టపాక అంజమ్మ (58), వెంకటయ్య (67) దంపతులు ఈనెల 19న స్థానిక పీహెచ్‌సీకి కరోనా పరీక్ష చేయించుకునేందుకు వెళ్లారు. అదే సెంటర్లో కరోనా టీకా సైతం తీసుకున్నారు. కాగా, అదే రోజు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై అంజమ్మ మృతి చెందింది. అప్పటినుంచి జ్వరంతో బాధపడుతూ, మనోవేదనకు గురైన భర్త వెంకటయ్య శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. టీకా కోసం వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించకుండా వ్యాక్సిన్ వేయడంతోనే వృద్ధ దంపతులు మృతిచెందారని గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రమేశ్‌ను వివరణ కోరగా, వృద్ధాప్యంలో వచ్చే హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెంది ఉండవచ్చనని అభిప్రాయపడ్డారు. చదవండి: విషాదం.. దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్.. అంతలోనే చదవండి: వేరే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మరణాలు తక్కువే -
ఆమెకు 73.. ఆయనకు 69.. ఓ శుభవార్త
మైసూరు: జీవితం చరమాంకంలో తోడు కావాలని భావించారు. వయసు శరీరానికే కాని మనసు కాదని ఒకరికొకరు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలపడంతో 73 ఏళ్ల వృద్ధురాలిని 69 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకోబోతున్నారు. వివరాలు... మైసూరు నగరంలో నివాసం ఉంటున్న ఓ రిటైర్డు ఉపాధ్యాయురాలు, కొన్నేళ్ల క్రితమే ఆమె విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఒంటరి తనంతో ఉన్నఆమెకు తోడు అవసరమని కుటుంబ సభ్యులు ఆమెను పెళ్లికి ఒప్పించారు. దీంతో వరుడు కావలెను అంటూ ఓ ప్రకటన ఇచ్చారు. అంతే 69 ఏళ్ల విశ్రాంత ఇంజినీర్ ఆమెకు ఫోన్ చేశారు. ఇద్దరి మనసులు కలిశాయి. ఇరువైపుల కుటుంబ సభ్యులు ఆమోదం తెలిపారు. వృద్ధుడికి కూడా ఏడేళ్ల క్రితమే భార్య చనిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు విదేశాలలో ఉన్నాడు. అతని ప్రోద్బలంతోనే పెళ్లికి అంగీకరించాడు. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. చదవండి: పెళ్లి కోసం ఐదేళ్లుగా ఆరాటం: మొత్తానికి నిశ్చితార్థం.. -
కొత్త ఇల్లు కట్టుకున్నాం.. ఇంట్లోకి రానివ్వం
జగిత్యాల: రేకుల షెడ్డు వేస్తామంటూ ఉన్న ఇంటిని కూల్చేసి కొత్తగా ఇల్లు కట్టుకున్న తనయులు.. వృద్ధులైన తల్లిదండ్రులను రోడ్డున పడేశారు. ఐదు రోజులుగా కొడుకుల ఇంటి ఎదుటే రోడ్డు పక్కన ఆ వృద్ధ దంపతులు నరకయాతన అనుభవిస్తున్నారు. జగిత్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన బుచ్చిరెడ్డి, బుచ్చమ్మ దంపతులు తమకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిని ఇద్దరు కొడుకులకు పంచారు. మరో 1.10 ఎకరాలు తామే సాగు చేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం వీరికి రేకుల షెడ్డు వేయిస్తామని చెప్పిన కొడుకులు పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇల్లు కట్టుకున్నారు. తల్లిదండ్రులను ఇంట్లోకి రానీయకపోవడంతో ఆ వృద్ధ దంపతులు రెండేళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. అయితే, ఈ మధ్య అద్దె ఇంటి యజమానులు వారిని ఖాళీ చేయించగా.. కుమారులు కూడా ఇళ్లలోకి రానివ్వలేదు. దీంతో ఆ వృద్ధులు గ్రామంలోని జగిత్యాల–ధర్మపురి ప్రధాన రహదారి పక్కన సామగ్రి పెట్టుకుని అక్కడే వంట చేసుకుంటూ బతుకీడుస్తున్నారు. -
దంపతుల డ్యాన్స్.. మనసు దోచేయడం ఖాయం
కోల్‌కతా: ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. కొందరు తాము చేస్తున్న పని ద్వారా తమకు తెలియకుండానే ఫేమస్ అయిపోతారు. సరిగ్గా అలాంటి పాపులారిటీనే భారత్‌కు చెందిన వృద్ధ దంపతులు పొందారు. వివరాలు.. కోల్‌కతాలోని హార్డ్ రాక్ కెఫే చాలా పురాతనమైనది. కోల్‌కతాకు ఉన్న మరోపేరు ‘సిటీ ఆఫ్ జాయ్’ మాదిరిగానే.. ప్రతినిత్యం ‘వో చలీ వో చలీ దేఖో ప్యార్ కి గలీ’ పాటను పెట్టి ఇక్కడ వచ్చేవారిని మైమరిచిపోయేలా బ్యాండ్ ఏర్పాటు చేశారు. తాజాగా అదే పాట వింటున్న ఓ వృద్ధ జంట అమాంతం లేచి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. చట్టూ జనం ఉన్నారనే సంగతి మరిచి వీరు చేసిన డ్యాన్స్ అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచింది. కెఫేలో ఉన్న వారంతా వీరి డ్యాన్స్‌కు చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు.ఈ వీడియోను దిబొహోబాలిక అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ బ్యాండ్ తనను 90 ల్లో తన చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చిందని, మరెందరికో మరిచిపోలేని అనుభూతులను పంచిపెట్టిందని రాసుకొచ్చారు.ఈ వీడియోను ఇప్పటివరకు 25 వేల మందికి పైగా వీక్షించారు.చదవండి: అయ్యో పాపం.. మీకు చేతులెలా వచ్చాయి View this post on Instagram A post shared by Mamta Sharma Das (@thebohobaalika)