బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్న అర్బన్ డీసీఆర్‌బీ డీఎస్పీ దేవరకొండ ప్రసాద్
లక్ష్మీపురం(గుంటూరు): తల్లిదండ్రులను వేధిం చడం, ఆస్తి ఇవ్వాలని దాడులకు పాల్పడితే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అర్బన్ ఎస్పీ సిహెచ్.విజయారావు హెచ్చరించారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. వాటిలో కొన్ని ఫిర్యాదులను పరిశీలిస్తే..
డబ్బు ఇవ్వాలని బెదిరిస్తున్నారు
బ్రిక్స్ వ్యాపారం చేసుకుంటూ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటా. కొరిటిపాడుకు చెందిన పిల్లి నాగేశ్వరరావు నాతో ఏడేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఆరు నెలల కిందట ఓ చిన్నపాటి వివాదంలో నాపై తప్పుడు నింద వేయడంతో పెద్దల సమక్షంలో మాట రాకుండా ఉండేందుకు వేరే వర్గీయులకు నగదు చెల్లించాను. అయితే దాన్ని ఆసరాగా తీసుకొని నాగేశ్వరరావుకు కూడా తాను రూ.20లక్షలు వరకు అప్పుగా ఉన్నానని చెప్పి నిత్యం వేధిస్తున్నాడు. ఆదివారం రాత్రి నాగేశ్వరరావు తమ్ముడు మరి కొంత మందిని ఇంటికి తీసుకు వచ్చి రూ.20లక్షలు ఇవ్వాలని లేని పక్షంలోహతమార్చుతామని బెదిరింపులకు దిగాడు. నేను నాగేశ్వరరావుకు డబ్బు ఇవ్వాల్సిన పని లేక పోయినప్పటికి నా నుంచి నగదు బలవంతంగా తీసుకునే యత్నం చేస్తున్నారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశా.
కలిశెటి మోహన్‌రావు, ఆర్టీసీ కాలనీఉద్యోగం పేరుతో టోకరా
నేను ఇంటర్మీడియెట్ పూర్తి చేసి గుంటూరులో ముఠా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. గత నెల ఓ పత్రికలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ప్రకటన చూసి ఆ వ్యక్తికి ఫోన్ చేశాను. విజయవాడ ఎనికేపాడులో హెచ్‌పీఎల్‌లో ఉద్యోగం ఉందని కార్యాలయానికి రమ్మన్నారు. అక్కడ కాదని ఏలూరు తంగెళమూడి వద్ద ఉన్న కార్యాలయానికి రమ్మని చెప్పారు. వెళితే దరఖాస్తుకు రూ.6వేలు, ఉద్యోగం వచ్చిన తర్వాత రూమ్‌లో ఉండేందుకు రూ.14వేలు చెల్లించాల్సిందిగా చెప్పారు. దీంతో నగదు కట్టిన తర్వాత అక్టోబర్ ఒకటిన అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇస్తామని తెలిపారు. ఆ తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. అనుమానం వచ్చి హెచ్‌పీఎల్ కంపెనీలో విచారణ జరిపితే ఎలాంటి ఉద్యోగాలు లేవని చెప్పారు. దిక్కుతోచక అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశాను.–నాగేంద్రరెడ్డి, సంగడిగుంట
తమ్ముడు.. ఇంటినికాజేయాలని చూస్తున్నాడు
పట్టాభిపురంలోని జార్జీ పేటలో 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. తాము ఉన్న రేకుల ఇల్లు కారడంతో రేకులను తొలిగించి నూతన ఇంటి నిర్మాణానికి సిద్ధం అయ్యాం. అయితే సొంత తమ్ముడు వీరాస్వామి స్థలం తనదంటూ తమ్ముడు, అతని భార్య, కుమారుడు నిత్యం వేధింపులకు దిగుతూ బెదిరిస్తున్నారు. వారి నుంచి రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరుతూ అర్జీ ఇచ్చాను. –ఎం.నాగేంద్రం,
తిరుపతి, తల్లి, కూతూరు
Comments
Please login to add a commentAdd a comment