
వృద్ధ దంపతుల అన్యోన్యత వైరల్
అమెరికాకు చెందిన వృద్ధ దంపతుల మధ్య అన్యోన్యత రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ విషయమే వారిని సోషల్ మీడియాలో హైలైట్ చేసింది. పైగా వృద్ధాప్యం దరిచేరినా.. కొత్త దంపతుల మాదిరిగా నేటికీ తమ ఆహార్యంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఫ్లోరిడాకు చెందిన ఫ్రాన్(74), ఎడ్ గార్గిలా(76)కు 52 ఏళ్ల కిందట వివాహమైంది. భార్యాభర్తలు కలిసి ఉండే రోజులు పెరిగేకొద్ది వాళ్ల మధ్య ప్రేమ మరింత చిగురిస్తుందని ఎన్నో అధ్యాయనాల్లో వెల్లడైంది. ఈ అమెరికన్ వృద్ధ దంపతులు మాత్రం మరో అడుగు ముందుకేశారు.
వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత స్క్వేర్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు. ఇక అప్పటినుంచి ఇద్దరూ ఒకే రంగు దుస్తువులు ధరించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని వాళ్ల మనవడు ఆంథోనీ గార్గిలా ట్వీట్ చేశాడు. మా గ్రాండ్ పేరేంట్స్ ను చూడండీ.. వివాహం అయిన 52 ఏళ్ల తర్వాత కూడా వాళ్లు ఒకే కలర్ డ్రెస్సులు, మ్యాచింగ్ ఆహార్యంతో ఉంటున్నారని తెలిపాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ దంపతులు హైలైట్ అయ్యారు. ఈ విషయాన్ని వారికి ఎలా చెబితే అర్థమవుతోందో తనకు తెలియడం లేదని ఆంథోనీ మరో ట్వీట్ చేశాడు.
my grandparents have been married for 52 years and they match outfits every day. pic.twitter.com/79nCaNuTuD
— Anthony Gargiula (@AnthonyGargiula) 30 August 2016
"So I don't really know how to tell you this, but you've gone viral." pic.twitter.com/B7kLsBcY21
— Anthony Gargiula (@AnthonyGargiula) 30 August 2016