వృద్ధ దంపతులు తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ సోమవారం హెచ్ఆర్సీని ఆశ్రయించారు.
ఖమ్మం: జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ సోమవారం హెచ్ఆర్సీని ఆశ్రయించారు. నేలకొండపల్లి సీఐ నరేందర్ రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణలిద్దరూ తమను చిత్రహింసలు పెడుతున్నారంటూ వారు వాపోతున్నారు.
ఎస్ఐ, సీఐలపై చర్యలు తీసుకోవాలంటూ దంపతులిద్దరూ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. వారిద్దరూ ఆస్తి వ్యవహారాల్లో జోక్యం చేసుకుని తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు.