
ఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ గట్టి కౌంటరిచ్చింది. జమ్ముకశ్మీర్ అంశంపై పాక్ మరోసారి ఆరోపణలు చేయడంతో దాన్ని భారత్ ఖండించింది. ఈ క్రమంలో భారత్‌కు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో పాకిస్థాన్ లేదని స్పష్టం చేసింది. అలాగే, భారత్‌పై ఆరోపణలు చేయడం మానేసి.. వారి దేశ ప్రజలకు సుపరిపాలన అందించడంపై ఫోకస్ పెట్టాలని చురకలు అంటించింది.
అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ ప్రతీసారి భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో జమ్ముకశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ మరోసారి లేవనెత్తింది. జెనీవాలో జరిగిన ఈ సమావేశంలో పాక్ న్యాయ, మానవ హక్కుల మంత్రి అజం నజీర్ తరార్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వ్యాఖ్యలకు భారత్ గట్టి కౌంటరిచ్చింది.
పాక్ వ్యాఖ్యలపై భారత రాయబారి క్షితిజ్ త్యాగి స్పందిస్తూ..‘మానవ హక్కుల ఉల్లంఘన, మైనారిటీలను హింసించడంతో సహా ప్రజాస్వామ్య విలువలను పాటించని పాకిస్థాన్.. భారత్‌కు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో లేదు. ప్రజాస్వామ్య పురోగతి, ప్రజలకు గౌరవం కల్పించడం వంటి వాటిపై భారత్ దృష్టిసారిస్తుంది. పాకిస్థాన్ మాపై ఆరోపణలు చేయడం మానేసి.. తమ దేశంలోని ప్రజలకు సుపరిపాలనను అందించడంపై దృష్టిపెట్టాలి. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్ధాఖ్‌లు ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. దశాబ్దాల తరబడి పాకిస్థాన్ ఉగ్రవాదం కారణంగా దెబ్బతిన్న ఆ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఐరాస జాబితాలోని పలు ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తుంది. అనవసర వ్యాఖ్యలు చేసి కౌన్సిల్ సమయాన్ని వృధా చేయడం దురదృష్టకరం’ అని వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Geneva: At the 7th Meeting - 58th Session of Human Rights Council, Indian Diplomat Kshitij Tyagi says, "India is exercising its right of reply in response to the baseless and malicious references made by Pakistan. It is regrettable to see Pakistan's so-called leaders and… pic.twitter.com/7Bg5j8jZJX
— ANI (@ANI) February 26, 2025
Comments
Please login to add a commentAdd a comment