Human Rights Council
-
మానవ హక్కుల కౌన్సిల్ సేవలు ప్రశంసనీయం
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): సమాజాభివృద్ధిలో మానవ హక్కుల కౌన్సిల్ సేవలు ప్రశంసనీయమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ చెప్పారు. విశాఖలోని ఓ హోటల్లో ఆదివారం మానవ హక్కుల కౌన్సిల్ రజతోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు వ్యభిచార రొంపిలోకి వెళ్లకుండా.. వారి హక్కులు కాపాడేలా మానవ హక్కుల కౌన్సిల్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, జిల్లా లీగల్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.ప్రజలు, మహిళలు, విద్యార్థులకు భరోసానిచ్చేలా ఈ కార్యక్రమాలుండాలని, ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వై.సత్యనారాయణ మాట్లాడుతూ మానవ హక్కుల కౌన్సిల్‌ను స్థాపించి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహిళలు, చిన్నారుల రక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలో కౌన్సిల్ ఆధ్వర్యంలో వలంటీర్లను తయారుచేసి, వారి ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ గత పదేళ్లుగా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమారు 6 వేల ఫిర్యాదులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తిని కౌన్సిల్ ప్రతినిధులు సత్కరించారు. కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రావు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లా కాలేజీ ప్రిన్సిపాల్ సీతామహాలక్ష్మి, విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బెవరా సత్యనారాయణ, వివిధ జిల్లాల కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. -
లారెన్స్‌కు గౌరవ డాక్టరేట్
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్‌కు గౌరవ డాక్టరేట్ వరించింది. సినీ గ్రూప్ డాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించిన లారెన్స్ ఆ తర్వాత నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు, నిర్మాత అంటూ అంచలంచెలుగా ఎదిగారు. అయితే ఈయనలో సేవాభావం అనే మరో మానవతా కోణం కూడా ఉంది. ఎందరో అనాథలను వికలాంగులను చేరదీస్తూ వారికి కొండంత అండగా ఉండటంతో పాటు వారికోసం ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. చదవండి: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది: సాయి పల్లవి అదే విధంగా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా వెంటనే స్పందించి సాయం అందిస్తుంటారు. ఆయన సేవలను గుర్తించిన అంతర్జాతీయ నేర నిరోధక సంస్థ, మానవ హక్కుల సంఘం కలిసి గౌరవ డాక్టరేట్ ప్రకటించాయి. ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగింది. రుద్రన్ చిత్ర షూటింగ్లో ఉన్న లారెన్స్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. బదులుగా ఆయన తల్లి హాజరై గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చదవండి: వైరల్.. వరుసగా పెళ్లి ఫొటోలు వదిలిన విఘ్నేశ్, సందడిగా కోలీవుడ్ స్టార్స్ -
‘ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో’...
జెనీవాలో బుధవారం మానవ హక్కుల మండలి సమావేశం జరుగుతోంది. ఐక్యరాజ్యసమితి మండలి అది. అత్యంత కీలకమైన సమావేశం. దేశాలన్నీ బాధ్యతగా హాజరవుతాయి. మానవ హక్కుల గురించి మాట్లాడతాయి. మనమూ వెళ్లాం. మన పొరుగున ఉండే పాకిస్తాన్ కూడా వచ్చింది. ఎప్పటిలా జమ్మూ–కశ్మీర్లో ఉగ్రవాదం గురించి, స్వతంత్ర ప్రతిపత్తి గురించి మాట్లాడ్డం మొదలు పెట్టింది! మాట్లాడినంతా మాట్లాడనిచ్చి, మన దౌత్య అధికారి సీమా పూజాని మైక్ అందుకున్నారు. ‘నీకు సంబంధం లేని విషయం లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు?’ అని ప్రశ్నించారు. ‘ఆగస్టులో జరిగిన సదస్సులో కూడా ఇలాగే ఎక్కువ చేశావు’ అని హెచ్చరించారు. అక్కడితో ఆగలేదు. ఆ దేశం ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నుతోంది, భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ వేదికల్ని ఎలా వాడుకుంటోందో మండలి సభ్యులందరి దృష్టికి తెచ్చారు. ఆ యువ ఐ.ఎఫ్.ఎస్. ఇచ్చిన ‘రైట్ ఆఫ్ రిప్లయ్’కి దేశంలో ఇప్పుడు ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ∙∙ సీమా పూజాని ఐక్యరాజ్య సమితిలో భారత్ తరఫున మాట్లాడే హక్కు కలిగిన సెకెండ్ సెక్రెటరీ. దౌత్య అధికారి. ఆమె ఇచ్చిన సమాధానం గానీ, చేసిన ప్రకటన గానీ భారత్ తరఫున అధికారికం అవుతుంది. అందుకే హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ ఆరోపణలను ఆమె తిప్పికొట్టిన విధానానికి దౌత్యపరమైన ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణ భాషలో చెప్పాలంటే.. ‘ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో’ అని ఆ దేశానికి చెప్పడమే. సీమను తగిన పోస్ట్‌లోనే నియమించుకుంది భారత్. 2014 సివిల్స్‌లో ఆలిండియా ర్యాంకర్ ఆమె. 34వ ర్యాంకు సాధించి, ఇండియన్ ఫారిన్ సర్వీసును ఎంచుకున్నారు. అప్పటికి ఆమె ‘లా’ పూర్తయింది. ‘లా’ లోనే పై చదువుల కోసం జర్మనీ వెళ్లి అక్కడి ప్రతిష్టాత్మక బ్యూసెరియస్ లా స్కూల్ చేరుదామని అనుకుని కూడా.. సివిల్స్ సాధించాలనే తన కలలోకి మళ్లీ వెళ్లిపోయారు. రెండో అటెంప్ట్‌తో ఆమె కల నిజమైంది. సీమ హర్యానా అమ్మాయి. ఫరీదాబాద్‌లో పుట్టింది. ఇంట్లో తనే చిన్న. మిగతా ఇద్దరూ అక్కలు. తండ్రి అమర్నాథ్ పూజానీ రిటైర్డ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్. తల్లి గృహిణి. సీమ మొదట ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు. ఇంటర్లో సైన్స్ తీసుకున్నారు. ఇంటర్ తర్వాత మాత్రం ఇంజనీరింగ్ చేయలేదు. ‘లా’ వైపు వెళ్లిపోయారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్లో చదివారు. అప్పుడే విస్తృతంగా సామాజిక అంశాల అధ్యయనం చేశారు. దాంతో సివిల్స్ వైపు వెళ్లాలన్న ఆలోచన కలిగింది. మరీ చిన్నప్పుడైతే ఆమెకు వెటరినరీ డాక్టర్ అవాలని ఉండేదట. చివరికి ఆరోగ్యకరమైన దౌత్య సంబంధాలను నెరిపే బాధ్యతల్లోకి వెళ్లిపోయారు. అవసరమైతే మాటకు మాటతో చికిత్స కూడా. సమితి మానవ హక్కుల మండలిలో మొన్న పాకిస్తాన్‌కు ఆమె చేసిన చికిత్స అటువంటిదే. సమితి హక్కుల ‘మండలి’లో సీమ మాటకు మాట -
టీడీపీ ఎమ్మెల్యే సూరి చర్యపై మానవ హక్కుల సంఘాలు సమావేశం
-
‘ఐరాస మండలి’ ఎన్నికల్లో భారత్ గెలుపు
ఐరాస: ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల మండలిలో సభ్యదేశాల ఎంపిక కోసం జరిగిన ఎన్నికలో భారత్ విజయం సాధించింది. 2019 జనవరి1 నుంచి మూడేళ్లపాటు భారత్ ఐరాస మానవ హక్కుల మండలిలో సభ్యదేశంగా ఉండనుంది. సభ్యత్వం కోసం ఎన్నికల్లో విజయం సాధించేందుకు 97 ఓట్లు అవసరమవ్వగా, ఆసియా పసిఫిక్ కేటగిరీలో బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఫిజి దేశాలతో పోటీపడి భారత్ 188 ఓట్లతో భారీ విజయాన్ని అందుకుంది. పోటీలో పాల్గొన్న అన్ని దేశాల కన్నా భారత్‌కే అత్యధిక ఓట్లు పడ్డాయి. రహస్య పద్ధతిలో ఓటింగ్ జరగ్గా మొత్తం 18 దేశాలు ఐరాస మానవ హక్కుల మండలిలో సభ్యత్వానికి అవసరమైనన్ని ఓట్లు సాధించాయి. 2011–14, 2014–17 మధ్య భారత్ రెండుసార్లు జెనీవా కేంద్రంగా పనిచేసే ఐరాస మానవ హక్కుల మండలికి ఎన్నికైంది. -
హక్కుల మండలిపై ఆక్రోశం
ప్రపంచ దేశాలన్నిటా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం తన లక్ష్యమంటూ చెప్పే అమెరికా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ మానవ హక్కుల మండలికి గుడ్‌బై చెప్పింది. పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ్త హక్కుల మండలి తరచు తీర్మానాలు చేస్తున్నదని సమితిలో ఆ దేశం రాయబారి నిక్కీ హేలీ ఆరోపిస్తున్నారు. ఇటీవలికాలంలో ఇజ్రాయెల్‌పై మండ లిలో అయిదు తీర్మానాలు ఆమోదించడాన్ని ఆమె ప్రస్తావిస్తున్నారు. అయితే శాంతియుతంగా నిరస నలు తెలుపుతున్న పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దళాలు తరచు దాడులు చేస్తున్న సంగతిని నిక్కీ హేలీ విస్మరిస్తున్నారు. అలాగే ఆ నిరసన ప్రదర్శనలకు మూలం తమ మతిమాలిన చర్యేనని కూడా మరుస్తున్నారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరుడు డిసెంబర్లో ప్రకటించారు. దాంతోపాటు టెల్ అవీవ్‌లోని తమ దౌత్య కార్యాల యాన్ని అక్కడికి తరలిస్తున్నట్టు చెప్పారు. గత నెలలో అది కూడా పూర్తయింది. అప్పటినుంచీ అమె రికా వైఖరిని నిరసిస్తూ పాలస్తీనాలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రతిసారీ ఇజ్రాయెల్ దళాలు రెచ్చిపోయి వారిపై కాల్పులు జరుపుతున్నాయి. గాజాలో గత ఏడు నెలలుగా సాగుతున్న ఈ నర మేథంలో పదులకొద్దీమంది నేలకొరిగారు. వందలాదిమంది గాయపడ్డారు. ఈ నెల మొదట్లో జరి గిన కాల్పుల్లో సైతం అయిదుగురు చనిపోగా 117మంది గాయపడ్డారు. తమ ఘనకార్యం పర్య వసానంగానే పాలస్తీనా అల్లకల్లోలంగా మారిందని గుర్తించి, దాన్ని సరిదిద్దుకోవడానికి బదులు ఇజ్రాయెల్ తీరును హక్కుల మండలి ఖండించడాన్ని అమెరికా తప్పుబడుతోంది. వర్తమాన పరి స్థితులపై దాని ఆలోచనలు ఎంత తలకిందులుగా ఉన్నాయో ఈ చర్య తేటతెల్లం చేస్తోంది. మండలి నుంచి వైదొలగుతూ అమెరికా చేసిన ఆరోపణలు చిత్రంగా ఉన్నాయి. మానవహక్కు లకు పెద్ద పీట వేసే దేశాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తూ, హక్కులను ఉల్లంఘించే దేశాలను మండలి కాపాడుతున్నదట! అలాంటి సంస్థలో కొనసాగుతూ దానికి విశ్వసనీయత కల్పించటం తమకు ఇష్టం లేదట!! అకారణంగా హక్కుల మండలి ఖండన తీర్మానాల బారినపడుతున్న ‘మానవ హక్కుల’ దేశాలేవో అమెరికా వివరించి ఉంటే బాగుండేది. అసలు మానవ హక్కుల మండలి పుట్టిన ప్పుడే అమెరికా దానితో పేచీకి దిగింది. 2006లో మండలి ఆవిర్భవించినప్పుడు సమితిలో అప్పటి అమెరికా రాయబారి జాన్ బోల్టన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మండలిని తాము గుర్తించబోమని చెప్పారు. అప్పుడాయన రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జి బుష్ ప్రభుత్వం నియమించిన రాయబారి. ఆయనే ప్రస్తుతం ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉంటూ తాజా నిర్ణయానికి కారకుడ య్యారు. మానవహక్కుల మండలి ఏర్పాటైతే ఇజ్రాయెల్ దురాగతాలపై అది తీర్మానాలు చేస్తుందని రిపబ్లికన్లకు ముందే తెలుసు. అందుకే బుష్ అందులో సభ్యత్వం తీసుకోవ డానికి నిరాకరించారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన బరాక్ ఒబామా దేశాధ్యక్షుడయ్యాక 2009లో అమెరికా అందులో చేరింది. ట్రంప్ వచ్చినప్పటినుంచి దాన్నుంచి బయటపడటానికి మార్గాలు వెదుక్కుంటున్నారు. నిజానికి ఇజ్రాయెల్‌పై మండలి ‘అన్యాయంగా’ తీర్మానాలు చేస్తున్నదన్న అభిప్రాయం అమెరికా మిత్రదేశా లైన బ్రిటన్, ఆస్ట్రేలియాలకు కూడా ఉంది. కానీ సంస్థలో ఉంటూ ఆ తీరును వ్యతిరేకించాలని వారు చెబుతున్నారు. అయితే అమెరికా ఆలోచన వేరు. ప్రస్తుతం పాలస్తీనాలో వెల్లువెత్తుతున్న నిరసనలు రాయబార కార్యాలయం తరలింపునకు వ్యతిరేకంగా జరుగుతున్నవి. వాటిని అణచేందుకు చర్యలు తీసుకుంటున్న ఇజ్రాయెల్‌ను అభిశంసించడమంటే, తన చర్యను కూడా మండలి ఖండించినట్టే అవుతుందని దానికి తెలుసు. కనుకనే అది బయటి కొచ్చింది. మానవ హక్కుల మండలిలో సభ్యత్వమున్నంత మాత్రాన అందులోని దేశాలన్నీ ఆ హక్కుల్ని గౌరవిస్తున్నాయని కాదు. చైనా, సౌదీ అరేబియా, ఈజిప్టు, పాకిస్తాన్ వగైరా దేశాలపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలొచ్చాయి. కశ్మీర్లో మన దేశం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్ప డుతున్నదని ఈమధ్యే మండలి నివేదిక ఆరోపించింది. ఆ సంస్థ ఏటా మూడుసార్లు సమావేశమై సమితి సభ్య దేశాల్లో మానవ హక్కుల స్థితిగతుల్ని సమీక్షిస్తుంది. ఆయా దేశాల అభిప్రాయాలను తెలుసుకుంటుంది. అవసరమనుకుంటే ఆరోపణలెదుర్కుంటున్న దేశాలకు నిపుణుల్ని పంపి నివేది కలు తెప్పించుకుంటుంది. తప్పనిసరి అనుకున్నప్పుడు అత్యవసర సమావేశాలు నిర్వహిస్తుంది. మానవ హక్కుల మండలి అభిప్రాయాలతో ఏ దేశమైనా విభేదించడంలో తప్పులేదు. కానీ అలా విభేదించడానికి హేతుబద్ధమైన కారణాలను చూపాలి. మానవ హక్కుల మండలి వంటి సంస్థల వల్ల పౌరులను వేధిస్తున్న, అణచివేస్తున్న ప్రభుత్వాలపై ప్రపంచ ప్రజల దృష్టి పడుతుంది. వాటిపై ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆ ప్రభుత్వాలు దారికొచ్చే అవకాశముంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు అటువంటి పరిస్థితులు ఏర్పడతాయన్న భయం అమెరికాకు ఏమూలనో ఉంది. నిజానికి ఇజ్రాయెల్ మాత్రమే కాదు... అమెరికా సైతం హక్కుల మండలి అభిశంసనకు అర్హమై నదే. ట్రంప్ వచ్చాక స్వదేశంలో మీడియా స్వేచ్ఛపై తరచు దాడి చేస్తున్నారు. పురుషులతో సమా నంగా మహిళలకు సమాన వేతనాలివ్వడం తప్పనిసరి చేస్తూ ఒబామా హయాంలో తీసుకొచ్చిన రక్షణలకు మంగళంపాడారు. యెమెన్‌లోని అమెరికా రహస్య జైళ్లలో నిర్బంధితుల చిత్రహింసలు ఇంకా కొనసాగుతున్నాయి. సరిహద్దులు దాటి చట్టవిరుద్ధంగా అమెరికాకు వస్తున్నవారిని అరి కట్టడం కోసం వారిలోని పెద్దలనూ, పిల్లలనూ వేర్వేరు శిబిరాలకు తరలించి నిర్బంధిస్తూ భయ భ్రాంతులకు గురిచేశారు. తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో దానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. వీటన్నిటి విషయంలో సంజాయిషీ ఇవ్వాల్సిందిపోయి ఇజ్రాయెల్‌కు ఏదో అన్యాయం జరుగుతు న్నదని ఆక్రోశించడం అమెరికాకు తగని పని. -
దళిత మహిళలపై ఇలాంటి దారుణాలెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత దేశంలో పుట్టుకతోనే దళిత మహిళలపై వివక్ష కొనసాగుతోంది. దళిత యువతులపై దారుణాలు జరుగుతున్నాయి. దళిత మహిళలను ఎప్పుడైనా ఏమైనా చేయవచ్చని, ఏం చేసినా చెల్లిపోతుందని, తమకు వ్యతిరేకంగా నోరు విప్పేవారే ఉండరన్నది అగ్రవర్ణాల అహంకారం. నిర్జన ప్రదేశాల్లో దళిత బాలికలు, యువతులు కనిపిస్తే వారిపై అగ్రవర్ణాల మగాళ్లు ఎక్కడెక్కడనో చేతులు పెడతారు, ఏవేవో తడుముతారు. అనుకుంటే వారి ఇళ్లకు, వారి గదుల్లోకి, వారి పక్కలోకి వెళ్లగలమని భావిస్తారు. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదని, తమను ఎవరు ఏమీ చేయలేరన్నది అగ్రవర్ణ మగవాళ్ల ఆలోచన’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన సుమన అనే దళిత మహిళ వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ‘అధికారంలో ఉన్నా దళిత మహిళలకు రక్షణ లేదు. వారిని కూడా అగ్రవర్ణాల వారే నియంత్రిస్తుంటారు. దళితులపై జరిగిన దాడికో, దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలబడితే దళిత సర్పంచ్‌లను కూడా లక్ష్యంగా చేసుకొని హింసిస్తారు. చంపేస్తారు. ఓ గ్రామంలో దళిత మహిళపై జరిగిన దారుణాన్ని ఓ దళిత మహిళా సర్పంచ్ ప్రశ్నించినందుకు ఆమెను, ఆ మహిళను సజీవంగా దహనం చేశారు. మరో దారుణాన్ని ప్రశ్నించినందుకు ఓ దళిత సర్పంచ్ మేనల్లుడిని చితకబాదారు. ఈ రెండు సంఘటనల్లో ఎలాంటి కేసులు లేవు. శిక్షలు లేవు. నేను కూడా నా విధులను సక్రమంగా నిర్వర్తించాలని అనుకుంటాను. అగ్రవర్ణాల వారు చేయనీయరు’ అని అదే రాష్ట్రానికి చెందిన గాయత్రి అనే ఓ గ్రామ సర్పంచ్ చెప్పిన కథనం. ‘అగ్రవర్ణాల మహిళలు, దళిత మహిళలు ఒక్కటేనంటే, వారిద్దరు సమానమంటే నేను ఒప్పుకోను. 15 ఏళ్ల దళిత బాలికలపై 33.2 శాతం అత్యాచారాలు జరుగుతుంటే అగ్రవర్ణాల బాలికలపై 19.7 శాతం అత్యాచారాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. దళిత మహిళలపై జరుగుతున్న దారుణాల్లో వందకు ఐదు కేసులు మాత్రమే కోర్టుకు వస్తున్నాయి. ముందుగా కేసులు దాఖలైనా ఒత్తిళ్ల మేరకు అవి కోర్టు వరకు చేరుకోవు’ అని హర్యానాలో పానిపట్‌లో సవిత అనే దళిత లాయర్ అభిప్రాయపడ్డారు. జెనీవా సదస్సుకు నివేదన వీరి అభిప్రాయాలను జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల 38వ సమావేశంలో ‘అఖిల భారత దళిత మహిళా అధికార్ మంచ్’ నాయకులు గురువారం నాడు వినిపించారు. జూన్ 19వ తేదీ నుంచి ఈ సమావేశాలు కొనసాగుతుండగా, తమ వాదనను వినిపించేందుకు తమకు ఈ రోజు అవకాశం లభించినట్లు మంచ్ ప్రధాన కార్యదర్శి ఆశా కోతల్ తెలిపారు. దేశంలో కుల వివక్ష కొనసాగుతోందని, ముఖ్యంగా దళితులను అంటరాని వారిగా చూస్తారని భారత ప్రభుత్వం ఏనాడు అంతర్జాతీయ వేదికలపై అంగీకరించలేదు. పైగా అదంతా అబద్ధమంటూ ఖండించేది. వివక్ష దాడుల గురించి ఇలా వివరించినప్పుడు అది తమ అంతర్గత విషయమని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ ముక్తిసరి మాటలతోనే వాస్తవాలకు మసిపూసేది. ఈ మాత్రం అంగీకరించడం కూడా డర్బన్‌లో 2001లో జాతి విద్వేశంపై జరిగిన ప్రపంచ సదస్సులోనే జరిగింది. కుల వివక్ష అంశాన్ని జాతి విద్వేశంతో సమానంగా చూడవద్దని నాడు సదస్సును కోరింది. భారత్‌లో కొనసాగుతున్న కుల వివక్షతపై ఐక్యరాజ్య సమితి జాతి వివక్ష నిర్మూలన కమిటీ సభ్యురాలు రీటా ఇసాక్ 2016లో విడుదల చేసిన నివేదికను కూడా భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఖండించింది. పోగొట్టుకోవడానికి మా వద్ద ఏమీ మిగల్లేదు ప్రపంచ సదస్సుల్లో భారత్‌లో కొనసాగుతున్న కుల, లింగ వివక్షతలపై అంతర్జాతీయ హక్కుల సంఘాలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, నివేదికల్లో వివక్షత తీవ్రత ప్రతిబింబించడం లేదన్న ఉద్దేశంతో దళిత మహిళా అధికార మంచ్ తొలిసారిగా దళిత మహిళల అభిప్రాయాలను వారి మాటల్లోనే వ్యక్తం చేసింది. ‘వాయిసెస్ అగనెస్ట్ క్యాస్ట్ ఇంప్యునిటీ: న్యారెటీస్ ఆఫ్ దళిత విమెన్ ఇన్ ఇండియా’ శీర్షికతో సమావేశానికి సమర్పించింది. ‘కుల వ్యవస్థ చావు కేకలను వినేందుకు మేము గుండెలు దిటువు చేసుకొని ముందుకు వెళుతున్నాం. విజయం కోసం మేము అన్నీ వదులుకున్నాం. పోగొట్టుకోవడానికి మా వద్ద ఇంకా ఏమీ మిగల్లేదు’ అన్న వ్యాఖ్యలతో ఆ నివేదికను ముగించారు. -
హెచ్ఆర్సీని ఆశ్రయించిన వృద్ధ దంపతులు
ఖమ్మం: జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ సోమవారం హెచ్ఆర్సీని ఆశ్రయించారు. నేలకొండపల్లి సీఐ నరేందర్ రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణలిద్దరూ తమను చిత్రహింసలు పెడుతున్నారంటూ వారు వాపోతున్నారు. ఎస్ఐ, సీఐలపై చర్యలు తీసుకోవాలంటూ దంపతులిద్దరూ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. వారిద్దరూ ఆస్తి వ్యవహారాల్లో జోక్యం చేసుకుని తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. -
ఐరాస మానవ హక్కుల మండలికి భారత్ తిరిగి ఎన్నిక
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు మరో కీలక విజయం. 47 దేశాలతో కూడిన ఐరాస మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్చార్సీ)కి మనదేశం తిరిగి ఎన్నికైంది. మంగళవారం జరిగిన ఎన్నికల్లో భారత్‌కు ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుంచి అత్యధికంగా 162 ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికతో యూఎన్‌హెచ్చార్సీలో భారత్‌కు 2015-17 వరకు సభ్యత్వం ఉంటుంది. ఈ సంస్థలో భారత్ తొలి, ప్రస్తుత సభ్యత్వం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగుస్తుంది. విదేశీయులకు పీఎఫ్ వారి దేశాల్లోనే చెల్లింపు న్యూఢిల్లీ: భారత్‌లో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు వారి భవిష్యనిధి ఖాతాల డబ్బును వారి సొంత దేశాల్లోనే చెల్లించే సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. దీంతో వారు తమ పీఎఫ్ క్లెయిమ్‌లను పరిష్కరించుకోవడానికి భారత్‌లో గతంలో మాదిరి బ్యాంక్ ఖాతాలను తె రవాల్సిన అవసరం ఉండదని ఈపీఎఫ్ఓ అధికారి చెప్పారు. విదేశీ ఉద్యోగులకు వారి దేశాల్లో చెలింపుల కోసం పార్లమెంట్ స్ట్రీట్‌లోని ఎస్బీఐ బ్యాంకులో 3 ఖాతాలను ప్రభుత్వం తెరిచింది.ట