‘ఐరాస మండలి’ ఎన్నికల్లో భారత్‌ గెలుపు | India elected to Human Rights Council at UN with highest number of votes | Sakshi
Sakshi News home page

‘ఐరాస మండలి’ ఎన్నికల్లో భారత్‌ గెలుపు

Published Sat, Oct 13 2018 4:59 AM | Last Updated on Sat, Oct 13 2018 4:59 AM

India elected to Human Rights Council at UN with highest number of votes - Sakshi

ఐరాస: ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల మండలిలో సభ్యదేశాల ఎంపిక కోసం జరిగిన ఎన్నికలో భారత్‌ విజయం సాధించింది. 2019 జనవరి1 నుంచి మూడేళ్లపాటు భారత్‌ ఐరాస మానవ హక్కుల మండలిలో సభ్యదేశంగా ఉండనుంది. సభ్యత్వం కోసం ఎన్నికల్లో విజయం సాధించేందుకు 97 ఓట్లు అవసరమవ్వగా, ఆసియా పసిఫిక్‌ కేటగిరీలో బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఫిజి దేశాలతో పోటీపడి భారత్‌ 188 ఓట్లతో భారీ విజయాన్ని అందుకుంది. పోటీలో పాల్గొన్న అన్ని దేశాల కన్నా భారత్‌కే అత్యధిక ఓట్లు పడ్డాయి. రహస్య పద్ధతిలో ఓటింగ్‌ జరగ్గా మొత్తం 18 దేశాలు ఐరాస మానవ హక్కుల మండలిలో సభ్యత్వానికి అవసరమైనన్ని ఓట్లు సాధించాయి. 2011–14, 2014–17 మధ్య భారత్‌ రెండుసార్లు జెనీవా కేంద్రంగా పనిచేసే ఐరాస మానవ హక్కుల మండలికి ఎన్నికైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement