India victory
-
నేడు 500 మంది ఉద్యోగులకు సెలవు!! కారణం తెలిస్తే..
దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి మన జట్టు వరల్డ్ కప్ గెలిస్తే ఆ సంబరం ఎలా ఉంటుంది. భారత్ టీ20 ప్రపంచ కప్ గెలవడంతో ఊరూరా సంబరాలు జరుగుతున్నాయి. తమ ఉద్యోగులు కూడా సంబరాలు చేసుకునేందుకు ఏకంగా సెలవు ఇచ్చేసిందో కంపెనీ.భారత్ టీ20 క్రికెట్ ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకుని స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌ఫెనో తన ఉద్యోగులందరికీ జూలై1న సెలవు దినంగా ప్రకటించింది. ఈ కంపెనీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఇందులో సుమారు 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. "ఇది మా అందరికీ ఆశ్చర్యం కలిగించింది. బిల్లింగ్‌లు, పేరోల్ క్లోజర్స్ వంటివి ఉన్నందున నెలలో మొదటి రోజు సాధారణంగా బిజీగా ఉంటుంది. కానీ టీమ్ ఇండియా గొప్ప విజయాన్ని సాధించడంతో ఆ రోజును సెలవుగా ప్రకటించాలని కంపెనీ నిర్ణయించింది" అని ఎక్స్‌ఫెనో వర్క్‌ఫోర్స్ రీసెర్చ్ హెడ్ ప్రసాద్ ఎంఎస్ చెప్పినట్లుగా మనీకంట్రోల్ పేర్కొంది.ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచ కప్ యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్ సంయుక్తంగా వేదికగా జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరిగింది. ఇందులో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో రాణించి ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి కప్‌ను కైవసం చేసుకుంది. -
Sri Lanka vs India: మెరిసిన దీప్తి, రేణుక
పల్లెకెలె: శ్రీలంక జట్టుతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టును ఓడించింది. రేణుక సింగ్ (3/29) పదునైన బౌలింగ్... దీప్తి శర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శన (3/25; 22 నాటౌట్) భారత విజయంలో కీలకపాత్ర పోషించాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 48.2 ఓవర్లలో171 పరుగులకు ఆలౌటైంది. నీలాక్షి డిసిల్వా (43; 4 ఫోర్లు), హాసిని పెరీరా (37; 5 ఫోర్లు) రాణించారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 38 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (35; 1 ఫోర్, 2 సిక్స్‌లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (44; 3 ఫోర్లు), హర్లీన్ (34; 2 ఫోర్లు) ఆకట్టుకున్నారు. పూజా వస్త్రకర్ (21 నాటౌట్; 2 సిక్స్‌లు)తో కలిసి దీప్తి భారత్‌ను విజయతీరానికి చేర్చింది. శ్రీలంక బౌలర్లలో ఇనోకా రణవీర (4/39), ఒషాది రణసింఘే (2/34) టీమిండియాను ఇబ్బంది పెట్టినా ఇతర బౌలర్లు విఫలమయ్యారు. రెండో వన్డే ఇదే వేదికపై సోమవారం జరుగుతుంది. -
నన్ను క్షమించండి
న్యూఢిల్లీ: కరోనా కోరల్లో చిక్కుకొని జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కోవిడ్–19 మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో భారత్ తప్పక విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ చేయడం కఠిన నిర్ణయమైనా ప్రస్తుత పరిస్థితుల్లో తప్పదన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు దేశప్రజలందరూ తనను క్షమించాలని వేడుకున్నారు. ఆకాశవాణి మన్‌కీ బాత్ కార్యక్రమంలో ఆదివారం జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘ఈ ప్రాణాంతక వ్యాధికి సంబంధించి కొన్ని విషయాలు చెబుతాను. ముందుగా దేశ ప్రజలందరినీ క్షమించమని కోరుకుంటున్నాను. మీరందరూ నన్ను క్షమిస్తారనే నాకు తెలుసు. నిరుపేద సోదర సోదరీమణులు ఈయనేం ప్రధానమంత్రి .. మమ్మల్ని సమస్యల ఊబిలోకి తోసేశాడు అని అను కుంటూ ఉండే ఉంటారు. అందుకే ప్రత్యేకంగా మీ అందరూ నన్ను మన్నించాలి. బహుశా, చాలా మం ది నా మీద కోపం పెంచుకుని ఉంటారు. మమ్మల్నందరినీ ఇలా ఇళ్లలో బంధిస్తావా అని ఆ గ్రహి స్తూ ఉంటారు. నేను మీ అందరి ఇబ్బందులను అర్థం చేసుకోగలను కానీ 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశాన్ని రక్షించడానికి ఇంతకంటే మరో మార్గం లేదు. కరోనాతో యుద్ధమంటే చావుబతుకుల మధ్య పోరాటం. ఈ యుద్ధంలో మనం గెలవాలి. గెలిచి తీరుతాం’’అని ప్రధాని అన్నారు. వైద్యసిబ్బంది సేవలు భేష్ కరోనాపై పోరాటంలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. లాక్డౌన్ ప్రకటించినప్పట్నుంచి ప్రజలకి ఇబ్బందులు తలెత్తకుండా నిత్యావసరాలు, కూరలు, పాలు సరఫరా చేసేవారు వేలాది మంది నిరంతరాయంగా పని చేస్తున్నారంటూ కొనియాడారు. దయచేసి చట్టాన్ని ఉల్లంఘించకండి ‘నాకు తెలుసు ఎవ్వరూ కూడా కావాలని చట్టాన్ని ఉల్లంఘించాలనుకోరు. కానీ కొందరు చేస్తున్నారు. వాళ్లు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోలేకపోతున్నారు. వారందరినీ కోరేది ఒక్కటే లాక్ డౌన్ నియమాలను పాటించకపోతే ఈ వైరస్ నుంచి కాపాడుకోవడం కష్టమవుతుంది. ప్రపంచంలో చాలా మంది ఈ అపోహలతోనే కాలం గడిపారు. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు’అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా మోదీ కరోనా నుంచి కోలుకున్న వారితో మాట్లాడారు. ప్రధానికి రాహుల్ లేఖ కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటించడం తీవ్రమైన గందరగోళానికి దారి తీసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఆదివారం లేఖ రాశారు. వలస కార్మికుల దుస్థితిని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లిన రాహుల్ అభివృద్ధి చెందిన దేశాలు పాటించిన సంపూర్ణ లాక్డౌన్ వ్యూహం భారత్‌లో సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దినసరి వేతన జీవులకి , నిరక్షరాస్యులకి ఈ పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి ఉండదని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు. దేశాన్ని పూర్తిగా లాక్డౌన్ చేయడంతో కార్మికులు ఊళ్లకి వెళుతూ ఉండడంతో గ్రామాల్లో కూడా కరోనా ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
భారత్ విజయం సాధించిన రోజు
-
‘ఐరాస మండలి’ ఎన్నికల్లో భారత్ గెలుపు
ఐరాస: ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల మండలిలో సభ్యదేశాల ఎంపిక కోసం జరిగిన ఎన్నికలో భారత్ విజయం సాధించింది. 2019 జనవరి1 నుంచి మూడేళ్లపాటు భారత్ ఐరాస మానవ హక్కుల మండలిలో సభ్యదేశంగా ఉండనుంది. సభ్యత్వం కోసం ఎన్నికల్లో విజయం సాధించేందుకు 97 ఓట్లు అవసరమవ్వగా, ఆసియా పసిఫిక్ కేటగిరీలో బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఫిజి దేశాలతో పోటీపడి భారత్ 188 ఓట్లతో భారీ విజయాన్ని అందుకుంది. పోటీలో పాల్గొన్న అన్ని దేశాల కన్నా భారత్‌కే అత్యధిక ఓట్లు పడ్డాయి. రహస్య పద్ధతిలో ఓటింగ్ జరగ్గా మొత్తం 18 దేశాలు ఐరాస మానవ హక్కుల మండలిలో సభ్యత్వానికి అవసరమైనన్ని ఓట్లు సాధించాయి. 2011–14, 2014–17 మధ్య భారత్ రెండుసార్లు జెనీవా కేంద్రంగా పనిచేసే ఐరాస మానవ హక్కుల మండలికి ఎన్నికైంది. -
భారత్ విజయంపై హీరో నిఖిల్ స్పందన!
-
అహ్మదాబాద్ వన్డేలో భారత్ ఘనవిజయం
అహ్మదాబాద్: సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న రెండవ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. తెలుగు తేజం అంబటి రాయుడు సెంచరీ చేశాడు. శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 274 పరుగులు చేసింది. భారత జట్టు 44.3 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 275 పరుగులు చేసింది. 5 వన్డేల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యతలో ఉంది. అంబటి రాయుడు 118 బంతులకు పది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 121 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఎస్ ధావన్ 79 పరుగులు విరాట్ కోహ్లీ 49 పరుగులు చేశారు. **