దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి మన జట్టు వరల్డ్ కప్ గెలిస్తే ఆ సంబరం ఎలా ఉంటుంది. భారత్ టీ20 ప్రపంచ కప్ గెలవడంతో ఊరూరా సంబరాలు జరుగుతున్నాయి. తమ ఉద్యోగులు కూడా సంబరాలు చేసుకునేందుకు ఏకంగా సెలవు ఇచ్చేసిందో కంపెనీ.
భారత్ టీ20 క్రికెట్ ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకుని స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌ఫెనో తన ఉద్యోగులందరికీ జూలై1న సెలవు దినంగా ప్రకటించింది. ఈ కంపెనీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఇందులో సుమారు 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
"ఇది మా అందరికీ ఆశ్చర్యం కలిగించింది. బిల్లింగ్‌లు, పేరోల్ క్లోజర్స్ వంటివి ఉన్నందున నెలలో మొదటి రోజు సాధారణంగా బిజీగా ఉంటుంది. కానీ టీమ్ ఇండియా గొప్ప విజయాన్ని సాధించడంతో ఆ రోజును సెలవుగా ప్రకటించాలని కంపెనీ నిర్ణయించింది" అని ఎక్స్‌ఫెనో వర్క్‌ఫోర్స్ రీసెర్చ్ హెడ్ ప్రసాద్ ఎంఎస్ చెప్పినట్లుగా మనీకంట్రోల్ పేర్కొంది.
ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచ కప్ యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్ సంయుక్తంగా వేదికగా జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరిగింది. ఇందులో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో రాణించి ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి కప్‌ను కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment