
అంబటి రాయుడు-షికార్ దావన్
అహ్మదాబాద్: సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న రెండవ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. తెలుగు తేజం అంబటి రాయుడు సెంచరీ చేశాడు. శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 274 పరుగులు చేసింది. భారత జట్టు 44.3 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 275 పరుగులు చేసింది. 5 వన్డేల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యతలో ఉంది.
అంబటి రాయుడు 118 బంతులకు పది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 121 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఎస్ ధావన్ 79 పరుగులు విరాట్ కోహ్లీ 49 పరుగులు చేశారు.
**