న్యూయార్క్: ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు మరో కీలక విజయం. 47 దేశాలతో కూడిన ఐరాస మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్చార్సీ)కి మనదేశం తిరిగి ఎన్నికైంది. మంగళవారం జరిగిన ఎన్నికల్లో భారత్‌కు ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుంచి అత్యధికంగా 162 ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికతో యూఎన్‌హెచ్చార్సీలో భారత్‌కు 2015-17 వరకు సభ్యత్వం ఉంటుంది. ఈ సంస్థలో భారత్ తొలి, ప్రస్తుత సభ్యత్వం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగుస్తుంది.
విదేశీయులకు పీఎఫ్ వారి దేశాల్లోనే చెల్లింపు
న్యూఢిల్లీ: భారత్‌లో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు వారి భవిష్యనిధి ఖాతాల డబ్బును వారి సొంత దేశాల్లోనే చెల్లించే సదుపాయాన్ని ఈపీఎఫ్‌ఓ ప్రారంభించింది. దీంతో వారు తమ పీఎఫ్ క్లెయిమ్‌లను పరిష్కరించుకోవడానికి భారత్‌లో గతంలో మాదిరి బ్యాంక్ ఖాతాలను తె రవాల్సిన అవసరం ఉండదని ఈపీఎఫ్‌ఓ అధికారి చెప్పారు. విదేశీ ఉద్యోగులకు వారి దేశాల్లో చెలింపుల కోసం పార్లమెంట్ స్ట్రీట్‌లోని ఎస్‌బీఐ బ్యాంకులో 3 ఖాతాలను ప్రభుత్వం తెరిచింది.ట
ఐరాస మానవ హక్కుల మండలికి భారత్ తిరిగి ఎన్నిక
Published Wed, Oct 22 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM
Advertisement