The United Nations
-
అఫ్గాన్‌లో ఇక ఆకలి కేకలే: యూఎన్
ఐక్యరాజ్య సమితి: అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంతో 1.4 కోట్ల మందికి తినడానికి తిండి కూడా దొరకదని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇప్పటికే కరోనా వైరస్‌తో కుదేలైపోయిన ఆ దేశంలో తాజాగా నెలకొన్న సంక్షోభంతో ప్రజలపై తీవ్రమైన ఆర్థిక, సామాజిక ప్రభావం కనిపిస్తుందని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్స్‌కి చెందిన అఫ్గాన్ డైరెక్టర్ మేరి ఎలన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 40 శాతానికి పైగా పంటలు సరిగా పండలేదని, నిల్వ ఉన్న ఆహార ధాన్యాలు నాశనమయ్యాయని తెలిపారు. తాలిబన్ల రాకతో వేలాది మంది నిరాశ్రయులు అవుతున్నారని వారికి కడుపు నిండా అన్నం పెట్టాలన్నా కటకటగానే ఉందన్నారు. యూఎన్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆమె మే నెలలో 40 లక్షల మంది ఆకలిని తీర్చామని, వచ్చే కొద్ది నెలల్లో 90 లక్షల మంది కడుపు నింపాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పటికీ ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునైనా ఈ ఆకలి సంక్షోభాన్ని నివారించాలంటే, 20 కోట్ల అమెరికా డాలర్లు తక్షణావసరమని మేరి వివరించారు. -
చెత్త దేశాల పౌరులు మాకెందుకు?
వాషింగ్టన్: నోటి దురుసుకు కేరాఫ్‌గా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుజారారు. హైతీ, ఎల్సాల్వడార్లతో పాటు ఆఫ్రికాలోని అత్యంత చెత్త(షిట్ హోల్) దేశాల పౌరుల్ని అమెరికాలోకి ఎందుకు అనుమతించాలని జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడిక్కడి ఓవల్ కార్యాలయంలో రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల సెనెటర్లతో సమావేశమైన ట్రంప్ ఈ మేరకు స్పందించారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికన్ యూనియన్‌తో పాటు ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ట్రంప్ ఎట్టకేలకు స్పందించారు. హైతీ, ఎల్‌సాల్వడార్, ఆఫ్రికా దేశాలపై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ట్రంప్ తెలిపారు. డీఏసీఏ సమావేశంలో తాను సీరియస్ కామెంట్స్ మాత్రమే చేశానని స్పష్టం చేశారు. అమెరికా రక్షణ కల్పిస్తున్న పౌరుల జాబితా నుంచి హైతీ దేశస్తుల్ని తొలగించాలని తాను ఆదేశించినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ట్వీటర్లో తెలిపారు. ఇదంతా డెమొక్రటిక్ పార్టీ సభ్యులు చేసిన కుట్రనీ, భవిష్యత్‌లో అన్ని సమావేశాలను రికార్డు చేస్తామని వెల్లడించారు. ఓవల్ కార్యాలయంలో గురువారం ఇరుపార్టీల సెనెటర్లతో సమావేశమైన ట్రంప్.. బాల్యంలో అమెరికా వచ్చినవారిపై చర్యల వాయిదా(డీఏసీఏ) బిల్లును తిరస్కరించారు. ఈ సందర్భంగా కొందరు నేతలు హైతీ, ఎల్సాల్వడార్తో పాటు ఆఫ్రికా దేశాల పౌరుల రక్షణ కోసం పోరాడటంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మన దేశంలో అత్యంత చెత్త(షిట్ హోల్) దేశాలకు చెందిన పౌరులంతా ఎందుకున్నారు? వీరందరినీ అసలు ఎందుకు అనుమతించాలి? అమెరికా ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూర్చే కొన్ని ఆసియా దేశాలతో పాటు నార్వే నుంచి వలసల్ని ప్రోత్సహించండి’ అని వారితో ట్రంప్ వ్యాఖ్యానించినట్లు పలు అమెరికన్ పత్రికలు గురువారం వార్తలు ప్రచురించాయి. లండన్‌లో ఎంబసీని ప్రారంభించను లండన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఫిబ్రవరిలో బ్రిటన్ వెళ్లాల్సిన ట్రంప్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ‘ఒబామా ప్రభుత్వం లండన్‌లో కీలకమైన మేఫైర్లో ఉన్న అమెరికా ఎంబసీని చిల్లరకు అమ్మేసి 1.2 బిలియన్ డాలర్లతో ఎక్కడో మారుమూలన నైన్ ఎల్మస్లో ఎంబసీని నిర్మించింది’ అని ట్రంప్ వరుస ట్వీట్లు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఐరాస ఆఫ్రికా దేశాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఐరాస మానవహక్కుల కార్యాలయం అధికార ప్రతినిధి రూపర్ట్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.. ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికాలోని వలసదారులు, మైనారిటీలపై దాడులు పెరిగే ప్రమాదముందన్నారు. ఆఫ్రికన్ యూనియన్(ఏయూ) ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. కాగా, తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామని ఇటీవల అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో పలు ఆఫ్రికా దేశాలు ఈ విషయంలో స్పందించేందుకు నిరాకరించాయి. అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రటిక్ పార్టీ విప్ హోయర్ స్పందిస్తూ..‘జాత్యహంకారంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన నిజస్వరూపాన్ని తెలియజేస్తున్నాయ్. ఓ అమెరికన్‌గా సిగ్గుపడుతున్నాను’ అని అన్నారు. -
కిల్లర్ రోబోలపై చర్చలు
జెనీవా: మానవ ప్రమేయం లేకుండానే శత్రువుల్ని గుర్తించి హతమార్చే రోబోల వినియోగంపై చర్చించేందుకు, నిబంధనల్ని రూపొందించేందుకు ఐక్యరాజ్యసమితి(ఐరాస)కు చెందిన ఓ కమిటీ శుక్రవారం అంగీకారం తెలిపింది. ఐదు రోజుల పాటు ‘కిల్లర్ రోబో’ల వినియోగంపై సాగిన ఈ సమావేశంలో ఈ రోబోల్ని నిషేధించాలని పలు దేశాలు డిమాండ్ చేశాయి. ఈ రోబోల వినియోగంలో కొంతైనా మానవప్రమేయం ఉండాలన్నాయి. సైనిక బడ్జెట్‌తో పాటు సాంకేతికత తక్కువగా ఉన్న 22 దేశాలు ఈ మేరకు స్పందించాయి. ఈ సమావేశం నిబంధనల రూపకల్పనలో తొలి అడుగు అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు యుద్ధ రంగంలో రోబోల వాడకంలో మానవ ప్రమేయం కచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీలో ఆయుధ విభాగం చీఫ్ కత్లీన్ లాల్యాండ్ తెలిపారు. ఈ రోబోలు సామూహిక జనహనన ఆయుధాలని విమర్శించారు. కిల్లర్ రోబోల వినియోగంపై వచ్చే ఏడాది మళ్లీ సమావేశమయ్యేందుకు పలు దేశాలు అంగీకరించాయి. -
ఉత్తర కొరియాపై సైనిక చర్య ఉండదు, కానీ...
- జింగ్ పిన్ తో ట్రంప్ ఫోన్ కాల్ - అగ్ర రాజ్యాలకు ఐరాస పిలుపు సాక్షి, వాషింగ్టన్: అణు పరీక్షలతో ఐక్యరాజ్య సమితికి సైతం విసుగు పుట్టిస్తున్న ఉత్తర కొరియా వ్యవహారంపై అమెరికా ఆచీ తూచీ వ్యవహరించబోతున్నట్లు అర్థమౌతోంది. ఉ.కొ. పై ఉన్నపళంగా సైనిక చర్యలు చేపట్టబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. ఉత్తర కొరియా ఈ మధ్య నిర్వహించిన అణు పరీక్షల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జింగ్ పిన్ బుధవారం ఫోన్లో ట్రంప్‌తో చర్చించారు. వారి సంభాషణలను ఉటంకిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థ విషయాలను వెల్లడించింది. సైనిక చర్య విషయంపై జింగ్ ప్రశ్నించగా.. అది తమ తొలి నిర్ణయం కాదని ట్రంప్ బదులిచినట్లు సమాచారం. ‘సూటిగా చెప్పాలంటే ఇది చాలా ముఖ్యమైన ఫోన్ కాల్. ఉ.కొ. విషయంలో నేను.. జింగ్ పింగ్ ఒకే అభిప్రాయంతో ఉన్నాం’ అని ట్రంప్ తెలిపారు. కిమ్ సామ్రాజ్యంలో ఏం జరుగుతుందో బాహ్యా ప్రపంచానికి తెలీని పరిస్థితి నెలకొందని, అతనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని జింగ్ పిన్ తనతో చెప్పినట్లు ట్రంప్ వివరించారు. అయితే సైనిక చర్యను పరిస్థితులు చేజారితే మాత్రం సైనిక చర్యలను చేపట్టవచ్చనే విషయాన్ని మాత్రం ట్రంప్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక రాజకీయాలకతీకంగా అగ్ర దేశాలన్నీ ఏకమై ఉత్తర కొరియా అణు పరీక్షల అంశంలో జోక్యం చేసుకోవాలంటూ ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అమెరికాకు త్వరలో మరిన్ని బహుమతులు (అణు ఆయుధాలు) పంపుతామంటూ ఉత్తర కొరియాకు చెందిన ఓ భద్రతా అధికారి హెచ్చరించిన కొన్ని గంటలలోపే ఐరాస శాంతి స్థాపనకు తాము ఎంత దూరమైన వెళ్తామని వ్యాఖ్యానించటం విశేషం. -
ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలి
ప్రపంచ దేశాలకు బ్రిక్స్ పిలుపు బెనౌలిమ్(గోవా): ప్రపంచ దేశాలన్నీ తమ భూభాగాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని, ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఐక్యరాజ్యసమితి తీర్మానానికి త్వరితంగా ఆమోదం తెలపాలని బ్రిక్స్ దేశాల సదస్సు కోరింది. గోవాలో జరిగిన వార్షిక సదస్సులో సభ్య దేశాలు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు ఈ మేరకు తీర్మానిస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేశాయి. ఐరాస సాధారణ అసెంబ్లీలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందం(సీసీఐటీ) ఆమోదంలో ఆలస్యం చేయవద్దంటూ సదస్సు చివరి రోజు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న వ్యవస్థీకృత నేరాలైన మనీ ల్యాండరింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిర్మూలించడంతో పాటు ఉగ్రవాదుల స్థావరాల్ని నాశనం చేయడం, ఇంటర్నెట్ ద్వారా ఉగ్రవాద అనుకూల ప్రచారాన్ని తిప్పికొట్టడంపై ప్రధానంగా దృష్టి సారించాలని సదస్సు పేర్కొంది. ‘ఉగ్రవాదంపై విజయవంతమైన పోరాటానికి అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం అంతర్జాతీయ న్యాయం, మానవ హక్కులకు లోబడి ఉండాలి. ఈ పోరులో వివిధ దేశాల కూటముల మధ్య సమన్వయ పాత్రను ఐరాస పోషించాలి. ఐరాస ఉగ్రవాద వ్యతిరేక విధివిధానాలు సమర్థంగా అమలయ్యేందుకు కట్టుబడి ఉన్నాం’ అని సదస్సు తీర్మానంలో పేర్కొన్నారు. ఎఫ్ఏటీఎఫ్ను అమలు చేయాలి మనీ ల్యాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సాయంపై పోరులో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌పోర్స్(ఎఫ్ఏటీఎఫ్) నిబంధనలకు కట్టుబడి ఉంటామని బ్రిక్స్ నేతలు చెప్పారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయంపై పోరుకు త్వరితంగా, సమర్థంగా అన్ని దేశాలు ఎఫ్ఏటీఎఫ్ అమలు చేయాలని కోరారు. మాదకద్రవ్యాల అక్రమ ఉత్పత్తి, రవాణాను అడ్డుకునేందుకు సహకారం, సమన్వయం బలోపేతం చేసుకోవాలని సదస్సు పిలుపునిచ్చింది. అవినీతిపై పోరుకు ప్రోత్సాహం అనేక దేశాల్లో రాజకీయ, భద్రతాపర అస్థిరతపై బ్రిక్స్ ఆందోళన వ్యక్తంచేసింది. అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో సహకారమందిస్తామంది. నిజాయతీతో కూడిన పన్ను వ్యవస్థకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. అవినీతిపై అంతర్జాతీయ సహకారానికి చేయూతనిస్తామని తెలిపింది. అక్రమ ధనం, విదేశాల్లో అక్రమ సంపదలు ఆర్థిక వృద్ధి, అభివృద్ధిపై ప్రభావం చూపుతాయన్న సదస్సు... అవినీతికి వ్యతిరేకంగా ఐరాస తీర్మానానికి అనుగుణంగా సాగుతున్న పోరును ప్రోత్సహిస్తామని తీర్మానించింది. రష్యా నుంచి గ్యాస్ పైప్‌లైన్ భారత్, రష్యా మధ్య ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఖర్చుతో నిర్మించ తలపెట్టిన గ్యాస్ పైప్‌లైన్ సంయుక్త అధ్యయనానికి ఇరు దేశాలు అంగీకరించాయి. బ్రిక్స్ సమావేశాల్లో మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు సంబంధిత పత్రంపై సంతకాలు చేశారు. ఈ సహజవాయివు పైప్‌లైన్ నిర్మాణానికి 25 బిలియన్ డాలర్ల ఖర్చవుతుంది. సైబీరియాలో ఉత్పత్తి అయిన గ్యాస్‌ను రష్యన్ గ్యాస్ గ్రిడ్‌కు అనుసంధానించి, 6 వేల కి.మీ పొడవైన పైప్‌లైన్ నిర్మాణం ద్వారా భారత్‌కు తీసుకొస్తారు. -
విశ్వాసంతో ముందుకు..
♦ రాష్ట్రపతి ప్రణబ్ పర్యటన నేపథ్యంలో చైనా ప్రకటన ♦ ఈ నెల 24 నుంచి 27 వరకు రాష్ట్రపతి చైనా పర్యటన బీజింగ్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 24 నుంచి 27 వరకు నాలుగు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. రాష్ట్రపతిగా ప్రణబ్‌కు ఇదే తొలి చైనా పర్యటన. ఈ సందర్భంగా పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ద్వారా భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తామని బుధవారం చైనా ప్రకటించింది. ఆదేశ విదేశాంగ అధికార ప్రతినిధి హాంగ్లీ మీడియాతో మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్, చైనాలు అంతర్జాతీయంగా క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయని, ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం ఇరు దేశాలూ గణనీయంగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఉభయ దేశాలకూ లాభం చేకూర్చేలా భారత్‌తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని లీ పేర్కొన్నారు. పర్యట నలో ప్రణబ్ చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్, ప్రధాని లీ కెకియాంగ్‌లతో పాటు ఇతర చైనా నాయకులతో సమావేశమవుతారు. ఉగ్ర పోరులో కలసి రండి: ప్రణబ్ ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌తో చేతులు కలపాలని ప్రణబ్ చైనాను కోరారు. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో మసూద్ అజార్‌ను చేర్చాలంటూ ఐక్యరాజ్యసమితిలో వచ్చిన ప్రతిపాదనను చైనా తిరస్కరించిన నేపథ్యంలో ప్రణబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్ద దేశాలైన భారత్, చైనాలు భిన్న జాతులు, సంస్కృతులకు నిలయాలని, ఉగ్రవాదంపై జరిపే పోరులో ఈ రెండు దేశాలు చేతులు కలిపితే సరైన ఫలితం వస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదన్నారు. -
ఐరాస భద్రతా మండలిలో ఒక్కరే మహిళ
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో మహిళా దౌత్యవేత్తల సంఖ్య చాలా తక్కువగా ఉంది. గత 70 ఏళ్ల కాలంలో అతి కొద్దిమంది మాత్రమే భద్రతా మండలిలో చోటు దక్కించుకోగలిగారు. 2014లో రికార్డు స్థాయిలో ఆరుగురు ఉండగా.. 2015కి వచ్చే సరికి ఈ సంఖ్య నాలుగుకు తగ్గింది. 15 మంది సభ్యుల భద్రతా మండలిలో ప్రస్తుతం ఒక్క మహిళ మాత్రమే ఉన్నారు. అమెరికా రాయబారి సమంతా పవర్ ఒక్కరే ఇప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నారు. యూఎన్ కమిషన్ ఆన్ ద స్టాటస్ ఆఫ్ వుమెన్‌కు సంబంధించి జరుగుతున్న వార్షిక సమావేశం కోసం వేలాది మంది మహిళలు ఈ వారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సమంతా పవర్‌తో పాటు భద్రతా మండలిలో రాయబారులుగా పని చేసిన నలుగురు మహిళలు స్పందిస్తూ.. పురుషాధిత్యత ఎక్కువగా ఉన్న భద్రతా మండలిలో మరింత మంది మహిళలకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ శాంతి, భద్రత వంటి కీలక అంశాలను మహిళలకు అప్పగించాలని కోరారు. -
సహస్రాబ్ది లక్ష్యాల్లో భారత్ ముందంజ!
ఐరాస మిలీనియం డెవలప్మెంట్ గోల్స్- 2015లో వెల్లడి న్యూఢిల్లీ: సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను (మిలీనియం డెవలప్మెంట్ గోల్స్) చేరుకోవడంలో భారత్ అద్భుత ప్రగతి సాధించిందని ఐక్యరాజ్యసమితి ఒక నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా పేదరికం సగానికి తగ్గింపు, లింగ సమానత్వం అంశాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించిందని కొనియాడింది. కానీ, సహస్రాబ్ది మొత్తం లక్ష్యాల్లో మాత్రం భారత్ అనుకున్న స్థాయిలో లేదని తెలిపింది. ఆహార భద్రత, ఆకలి చావులు, బరువు తక్కువ చిన్నారుల, పోషకాహార లోపం విషయంలో భారత్ అనుకున్న లక్ష్యానికి దూరంలో ఉందని నివేదికలో వెల్లడైంది. 2015 లోపు నిర్దేశించుకున్న లక్ష్యాలైన పేదరికం సగానికి తగ్గింపు, లింగ సమానత్వం, ప్రాథమిక విద్యలో చిన్నారుల సంఖ్య పెరుగుదల అంశాల్లో భారత్ అనుకున్న లక్ష్యాలను చేరుకుందని వెల్లడించింది. ఈ నివేదికను ఆర్థిక వేత్త, నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దె బ్రోయ్, యూఎన్ ఈఎస్సీఏపీ సంస్థ అధిపతి రిబెక్కా తవరెస్ తదితరులు మంగళవారమిక్కడ విడుదల చేశారు. ప్రాథమిక విద్యలో భారత్ భేష్ చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించడంలో భారత్ మంచి పురోగతిని సాధించిందని ఐరాస ఒక నివేదికలో వెల్లడించింది. అయితే మాధ్యమిక విద్య అందించే విషయంలో మాత్రం ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా భారత్‌లోనే బడికి రాని పిల్లల సంఖ్య అత్యధికంగా ఉన్నట్లు తెలిపింది. ఐరాస అనుబంధ యునెస్కో, ఎడ్యుకేషనల్ గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్(ఈఎఫ్ఆర్ జీఎంఆర్) సంయుక్తంగా అధ్యయనం చేసి ప్రపంచంలో 12.4 కోట్ల మంది ఇంకా బడి ముఖాన్ని చూడటమే లేదని వె ల్లడించాయి. 2011లో నమోదైన గణాంకాల ప్రకారం భారత్‌లో 1.6 కోట్ల మంది మాధ్యమిక, ప్రాథమికోన్నత విద్యకు దూరమయ్యారని పేర్కొన్నాయి. పొగాకు ఉత్పత్తులపై ‘పన్ను’పీకండి పొగాకు ఉత్పత్తులపై పన్నులు భారీగా పెంచడం వల్ల వాటి వినియోగం తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ఈ దిశగా అన్ని దేశాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేసింది. 2012-14 లో అధిక ఆదాయం కోసం భారత్ పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచడంతో వాటి వినియోగం స్వల్పంగా తగ్గిందని తెలిపింది. గ్లోబల్ టొబాకో ఎపిడమిక్- 2015 నివేదికను డబ్ల్యూహెచ్‌వో మనీలాలో విడుదల చేసింది. -
ఆకలి రాజ్యం.. భారత్
-
ఆకలి రాజ్యం.. భారత్
దేశంలో 19.4 కోట్ల మంది ఆకలి కేకలు చైనాను వెనక్కినెట్టి ప్రపంచంలోనే మొదటిస్థానం: ఐరాస వెల్లడి రోమ్/న్యూఢిల్లీ: ప్రపంచంలో ఆకలితో అలమటించేవారు భారత్‌లోనే ఎక్కువ మంది ఉన్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. దేశంలో ఏకంగా 19.4 కోట్ల మంది ఆకలి కోరల్లో చిక్కుకున్నారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలితో బాధపడుతున్నవారి సంఖ్య 79.5 కోట్లుగా ఉందని పేర్కొంది. ఇది 1990-92లో వందకోట్లుగా ఉంది. చైనాలో ఆకలితో బాధపడేవారి సంఖ్య 28.9 నుంచి 13.3 కోట్లకు పడిపోవడంతో ఈ తగ్గుదల నమోదైందని వివరించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహారం, వ్యవసాయ విభాగం (ఎఫ్ఏఓ) తాజాగా 2014-15 సంవత్సరానికిగాను ప్రపంచ దేశాల్లో ఆకలిపై నివేదిక(ద స్టేట్ ఆఫ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఇన్ ద వరల్డ్ 2015) విడుదల చేసింది. ఇందులో 19.4 కోట్ల మందితో భారత్ ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. 1990తో పోల్చుకుంటే దేశంలో ఆకలి కేకలు తగ్గినా ఇప్పటికీ పెద్ద సంఖ్యలో జనానికి తిండి అందడం లేదని వివరించింది. ఆకలిని తరిమికొట్టేందుకు భారత్‌లో అనేక పథకాలు అమలవుతున్న విషయాన్ని కూడా నివేదికలో ప్రస్తావించారు. అలాగే పౌష్టికాహార లోపాన్ని తగ్గించడంలో ఎఫ్ఏఓ అధ్యయనం చేసిన 129 దేశాల్లో 72 దేశాలు గడచిన దశాబ్దకాలంలో గణనీయమైన పురోగతిని ప్రదర్శించాయని తెలిపింది. -
నేల తల్లికి ప్రణమిల్లుతున్న కేరళ!
2015ను అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రం భూసార పరిరక్షణ, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంతో ముందడుగేస్తోంది. దశలవారీగా సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా అవతరించనుంది. ఇప్పటికే 96% కూరగాయలు రసాయనాలు వాడకుండానే పండిస్తున్నారని వ్యవసాయ మంత్రి కేపీ మోహనన్ ఇటీవల చెప్పారు. యువహృదయాల్లో సేంద్రియ సేద్య బీజాలు నాటేందుకు రెండేళ్లుగా కూరగాయ విత్తనాల పంపిణీ సత్ఫలితాలనిచ్చింది. తొలుత 20 పంచాయతీలను ఏప్రిల్ నాటికి సేంద్రియ సేద్య ప్రాంతంగా ప్రకటించడం.. 100 సేంద్రియ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు ప్రారంభించడం.. 2016 నుంచి దశలవారీగా రసాయనిక ఎరువుల వాడకాన్ని నిషేధించడం.. ఇవీ కేరళ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు. -
వీగిన ‘పాలస్తీనా’ తీర్మానం
భద్రతా మండలిలో స్వతంత్ర దేశంగా దక్కని గుర్తింపు న్యూయార్క్: పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించే తీర్మానానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆమోదం లభించలేదు. 2017 కల్లా పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించాలన్న ఈ తీర్మానం వీగిపోయింది. బుధవారం మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి 8 దేశాలు మద్దతు పలికాయి. మరో తొమ్మిది దేశాలు వ్యతిరేకించాయి. మద్దతు తెలిపిన దేశాల జాబితాలో అర్జెంటీనా, చైనా, ఫ్రాన్స్, జోర్డాన్, లగ్జెంబర్గ్, రష్యా, చిలీ, చాద్ ఉన్నాయి. మండలి వీటో అధికారం ఉన్న ఐదు శాశ్వత సభ్య దేశాలు వ్యతిరేకించకపోతే.. తీర్మానం ఆమోదం పొందడానికి 9 దేశాల మద్దతు అవసరం. కానీ అమెరికా, ఆస్ట్రేలియాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. బ్రిటన్, నైజీరియా, దక్షిణకొరియా, రువాండా, లిథువేనియా ఓటింగ్‌లో పాల్గొనలేదు. మెజారిటీ దేశాల ఆమోదం లభించకపోవడంతో తీర్మానం వీగిపోయింది. కాగా, ఈ తీర్మానంలో పేర్కొన్న వాక్యాలనూ అమెరికా వ్యతిరేకించింది. -
అమలులోకి అంతర్జాతీయ ఆయుధాల ఒప్పందం
ఐక్యరాజ్యసమితి: అంతర్జాతీయ ఆయుధ వ్యాపారానికి సంబంధించి 85 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 5 లక్షల 40 వేల కోట్లు) విలువైన నియంత్రణ ఒప్పందం బుధవారం నుంచి అమలులోకి వచ్చినట్టు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ వెల్లడించారు. ఉగ్రవాదులు, మానవ హక్కుల దుర్వినియోగానికి పాల్పడే వారికి ఆయుధాలు చేరకుండా ఈ ఒప్పందం సహాయపడుతుందని, ప్రధానమైన ఆయుధాల ఎగుమతిదారులు, దిగుమతిదారులు ఈ ఒప్పందంలో చేరాలని ఆయన సూచించారు. అయితే భారత్, రష్యా, చైనా, పాకిస్తాన్ సహా 23 దేశాలు ఒప్పందంపై సంతకాలు చేయలేదు. -
మన యోగా అంతర్జాతీయం
-
మన యోగా అంతర్జాతీయం
అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రకటించడం భారతీయులకు గర్వకారణం. ప్రత్యే కించి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొని యోగాపై చేసిన ప్రతిపాదనను సమితి గుర్తించింది. ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రక్రియ వహిస్తున్న సానుకూల పాత్ర భారతదేశం సరిహద్దులు దాటి అంతర్జాతీయ సమాజానికి ఎంతో కాలం క్రితమే పరిచయమైంది. యోగా గురించి భారత్ బయటనున్న ప్రపంచానికి స్వామి వివేకానంద పరిచయ వాక్యాలు పలుకగా ప్రముఖ యోగా గురు అయ్యంగార్ వంటి మహామహుల కృషితో యోగా ఆచరణ నేడు విశ్వవ్యాప్తమైంది. చిన్న చిన్న రోగాలకి కూడా పాశ్చాత్య వైద్యవిధానాలే దిక్కుగా మారడమే కాకుండా, స్వదేశీ వైద్యవిధానాలని చిన్నచూపు చూసే దుష్ట సంప్రదాయం మన దేశంలో ఎప్పటినుంచో నెలకొంది. ఈ నేపథ్యంలో యోగా ఆరోగ్యకరమైన జీవనశైలిని మనిషికి పరిచయం చేస్తుంది. ప్రకృతి సహజ సూత్రాల్ని గౌరవించడం నేర్పుతుంది. శారీ రక, మానసిక ఆరోగ్యానికి దోహదపడే ఈ ప్రక్రియ విశిష్టతను విలు వను ఐక్యరాజ్య సమితి నేటికి గుర్తించడం ముదావహం. అందుకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు. - డా. డి.వి.జి. శంకరరావు మాజీ ఎంపీ, పార్వతీపురం, విజయనగరం జిల్లా -
‘అణ్వస్త్ర రహిత’ తీర్మానానికి భారత్ నో
ఐక్యరాజ్యసమితి: ఏవిధమైన నిబంధనలూ లేకుండా అణ్వస్త్ర రహిత దేశంగా ఉండటానికి వెంటనే అంగీకరించడంపై ఐక్యరాజ్యసమితి సాధారణసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. ఈ మేరకు ఐరాసలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి వ్యతిరేకంగా భారత్‌తో పాటు పాకిస్తాన్, అమెరికా తదితర దేశాలు ఓటు వేశాయి. తమ అణు సదుపాయాలను ఐఏఈఏ భద్రతా ప్రమాణాలకు లోబడి ఉంచడాన్ని కూడా వ్యతిరేకించాయి. అణ్వస్త్ర నిరాయుధీకరణను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా మంగళవారం ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని 169 దేశాలు వ్యతిరేకించగా, 7 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. చైనా, భూటాన్‌తో పాటు ఐదు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈ ముసాయిదా తీర్మానంలోని పలు అంశాలకు విడివిడిగా ఓటింగ్ నిర్వహించారు. 9వ పేరాలోని అణ్వస్త్ర నిరాయుధీకరణలో భాగంగా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని, అలాగే ఐఏఈఏకు లోబడి ఉండటాన్ని అంగీకరించాల్సిందిగా భారత్, ఇజ్రాయెల్, పాకిస్తాన్ దేశాలకు విజ్ఞప్తి చేసే తీర్మానానికి వ్యతిరేకంగా రికార్డు సంఖ్యలో 165 ఓట్లు వచ్చాయి. 2015 నాటికి విజయవంతంగా నిర్వహించాల్సిన ఎన్పీటీ సమీక్ష సదస్సుకు సంబంధించి పీఠికలోని 24వ పేరాను కూడా భారత్, ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేకించాయి. అయితే దీనికి 166 ఓట్లు అనుకూలంగా రావడంతో ఈ నిబంధన కొనసాగనుంది. ప్రాంతీయ, ఉపప్రాంతీయ స్థాయిలో సంప్రదాయ ఆయుధ నియంత్రణ నిబంధనపై భారత్ ఒక్కటి మాత్రమే వ్యతిరేకంగా ఓటేసింది. ఇక ఎన్పీటీ విశ్వజనీనతపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అణ్వస్త్ర రహిత దేశంగా ఎన్పీటీలో చేరడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. కాగా, భారత్‌తో వివాదాస్పద అణు జవాబుదారీ అంశాన్ని పరిష్కరించుకుంటామని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది. -
అవినీతిపై ఏసీబీ గురి
నేటినుంచి వారోత్సవాలు ప్రజల్లో అవగాహనకు ప్రయత్నం విజయవాడ సిటీ : ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలన అంశంపై ప్రజలు పెద్దగా స్పందించరు. ఎంతోకొంత ముట్టచెప్పి తమ పని పూర్తి చేసుకుంటారు తప్ప అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు ఫిర్యాదు చేసి అక్రమార్కుల ఆట కట్టించేందుకు ప్రయత్నించరు. ప్రజల భావనలో మార్పు తెచ్చేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఏటా డిసెంబర్ మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించే వారోత్సవాలను ఇందుకు వేదికగా చేసుకోవాలని నిర్ణయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థులు, యువత, అవినీతిని పారదోలాలనే అభిప్రాయం ఉన్న వారిని ఒక చోటకు చేర్చి తమ ఉద్దేశాలను వివరించనున్నారు. వారం రోజుల పాటు పలు కార్యక్రమాలతో పాటు అవినీతికి సంబంధించిన అవకాశాలపై విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించనున్నారు. ఆఖరి రోజు జరిగే కార్యక్రమంలో విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందించనున్నారు. అన్ని కార్యక్రమాల్లోను ఆరోపణలు లేని స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయనున్నారు. పోస్టర్ల ప్రచారం: జిల్లాలో అవినీతిపై వ్యతిరేక నినాదాలతో కూడిన పోస్టర్లను విరివిగా ప్రదర్శించనున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద, ప్రజలు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో అందరికీ కనిపించే విధంగా వీటిని ఏర్పాటు చేస్తారు. కరపత్రాలు, స్టిక్కర్లను కూడా పెద్ద సంఖ్యలో అన్ని ప్రాంతాల్లో అంటించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి నిరోధక శాఖ లక్ష్యం, నినాదం, ఫోన్ నంబర్లను వీటిలో పొందుపరుస్తున్నారు. అవినీతి మెండు : ప్రభుత్వ శాఖలో అవినీతి పెరిగిందనే అభిప్రాయం సర్వత్రా ఉంది. చేయి తడపనిదే ప్రభుత్వ ఉద్యోగులు పని చేయడం అరుదు. తర్వాత తమ పని కాదనే భావన.. కోర్టుల చుట్టూ తిరగాలనే అభిప్రాయంతో ఏసీబి అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపరు. అన్ని శాఖల్లోనూ అవినీతిపై సమర శంఖం పూరించాలని ఏసీబీ నిర్ణయించింది. అపోహలు వద్దు ఏసీబి అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇబ్బందులుంటాయనే అపోహ వద్దు. బాధితుల సొమ్ము మా శాఖ నుంచే ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాము. డీజీపీ అనుమతితో ట్రాప్‌కు అవసరమైన సొమ్ము మేమే సమకూర్చుతాం. కోర్టు ద్వారా ఆ సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చేర్చుతాం. ఈ దిశగా ఇప్పటికే అధికారులతో చర్చిస్తున్నాం. పని కాదనే భయం కూడా వద్దు. ఆ పని పూర్తి చేసేందుకు మేమే చొరవ తీసుకుంటాం. - వి.గోపాలకృష్ణ, ఏసీబీ డీఎస్పీ, కృష్ణా -
ఐరాస మానవ హక్కుల మండలికి భారత్ తిరిగి ఎన్నిక
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు మరో కీలక విజయం. 47 దేశాలతో కూడిన ఐరాస మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్చార్సీ)కి మనదేశం తిరిగి ఎన్నికైంది. మంగళవారం జరిగిన ఎన్నికల్లో భారత్‌కు ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుంచి అత్యధికంగా 162 ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికతో యూఎన్‌హెచ్చార్సీలో భారత్‌కు 2015-17 వరకు సభ్యత్వం ఉంటుంది. ఈ సంస్థలో భారత్ తొలి, ప్రస్తుత సభ్యత్వం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగుస్తుంది. విదేశీయులకు పీఎఫ్ వారి దేశాల్లోనే చెల్లింపు న్యూఢిల్లీ: భారత్‌లో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు వారి భవిష్యనిధి ఖాతాల డబ్బును వారి సొంత దేశాల్లోనే చెల్లించే సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. దీంతో వారు తమ పీఎఫ్ క్లెయిమ్‌లను పరిష్కరించుకోవడానికి భారత్‌లో గతంలో మాదిరి బ్యాంక్ ఖాతాలను తె రవాల్సిన అవసరం ఉండదని ఈపీఎఫ్ఓ అధికారి చెప్పారు. విదేశీ ఉద్యోగులకు వారి దేశాల్లో చెలింపుల కోసం పార్లమెంట్ స్ట్రీట్‌లోని ఎస్బీఐ బ్యాంకులో 3 ఖాతాలను ప్రభుత్వం తెరిచింది.ట -
సహకారాన్ని పెంచుకుందాం!
న్యూయార్క్‌లో మోదీ, నెతన్యాహూ భేటీ న్యూయార్క్: రక్షణ, వాణిజ్యం తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్, ఇజ్రాయెల్‌లు సంకల్పించా యి. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఆదివారమిక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలు సమావేశమయ్యారు. వారు బస చేసిన ప్యాలెస్ హోటల్లో అరగంట పాటు కొనసాగిన ఈ భేటీలో పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, సైబర్ రంగాల్లో సహకారం పెంచుకునే మార్గాలపై, ఉగ్రవాదం, పశ్చిమాసియాలో ఇస్లామిక్ స్టేట్ మిలింటెంట్లతో తలెత్తిన పరిస్థితి తదితరాలపై విస్తృతంగా మాట్లాడుకున్నారు. ఇరు దేశాల సంబంధాలకు ఆకాశమే హద్దు అని నెతన్యాహూ పేర్కొన్నారు. తన ‘మేక్ ఇన్ ఇండియా’(భారత్‌లో తయారీ) కార్యక్రమం వివరించిన మోదీ.. తమ దేశ రక్షణ రంగంలో విదేశాలు 49 శాతం పెట్టుబడులు పెట్టొచ్చని తెలిపారు. ఐటీ, నీటి నిర్వహణ తదితర రంగాల్లో ఇజ్రాయెల్ నైపుణ్యాలను తమతో పంచుకోవాలని మోదీ సూచించగా, అందుకు సహకరిస్తామని నెతన్యాహూ చెప్పారు. త్వరలో తమ దేశంలో పర్యటించాలని నెతన్యాహూ మోదీని కోరారు. తమ దేశంలో యూదు మతస్తులపై ఎలాంటి వివక్షా లేదని, వారు తమ సమాజంలో అంతర్భాగమని మోదీ చెప్పారు. ముంబై విశ్వవిద్యాలయంలో హిబ్రూ భాషను బోధిస్తున్నారని, గతంలో ముంైబె కి ఒక యూదు మేయర్‌గా పనిచేశారని గుర్తు చేశారు. గత పదేళల్లో ఇరు దేశాల ప్రధానులు భేటీ కావడం ఇదే తొలిసారి. -
షరీఫ్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్
ఐరాస: జమ్మూకాశ్మీర్‌లో ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించాలని ఐరాస ఆరు దశాబ్దాల కిందట తీర్మానాలను ఆమోదించినా వాటి అమలు కోసం జమ్మూకాశ్మీర్ ప్రజలు నేటికీ ఎదురు చూస్తున్నారన్న పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఆ వ్యాఖ్యలు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని భారత్ తరపున ఐరాసకు హాజరైన అభిషేక్ సింగ్ స్పష్టం చేశారు. అంగీకారం కాని ప్రజాభిప్రాయ సేకరణ అంశాన్ని ఆయన ఐక్యరాజ్య సమితి వేదికగా షరీష్ ప్రస్తావించడం సరైనది కాదన్నారు. గత నెల ఆగస్టులో ఇరుదేశాల మధ్య విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలు చివరి నిమిషంలో రద్దు కావడంపై షరీఫ్ విచారం వ్యక్తం చేసిన తెలిసిందే. ఇరు శాల మధ్య ఉన్న పెండింగ్ అంశాలకు పరిష్కారంపై చర్చల రూపంలో లభించిన అవకాశం భారత్ వైఖరి వల్లే చేజారిందని ఆయన ఆరోపించారు. -
ఉగ్రవాద నిర్మూలన, శాంతి పరిరక్షణ
ఐరాస సమావేశంలో భారత్ ప్రాధాన్యాలు ఐక్యరాజ్య సమితి: భద్రతా మండలిలో సత్వర సంస్కరణలు, ఉగ్రవాద నిర్మూలన, శాంతి పరిరక్షణ పంటి ప్రధాన అంశాలను ఐక్యరాజ్యసమితి 69వ సర్వసభ్య మండలి సమావేశాల్లో భారత్ ప్రధానంగా ప్రస్తావించనుంది. 193 దేశాలతో కూడిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య మండలి సమావేశాలు బుధవారంనుంచి వచ్చే నెల 8 వరకూ జరగనున్నాయి. ఈ సమావేశాల్లో భారత ప్రతినిధి బృందం ప్రస్తావించబోయే వివిధ అంశాలను ఐక్యరాజ్యసమితి భారత రాయబారి అశోక్ మఖర్జీ వివరించారు. గతంలో ఎనిమిది దఫాలుగా జరిగిన చర్చలతో భద్రతా మండలి సంస్కరణలపై అవసరమైన సమాచారం అందుబాటులోకి వచ్చిందని, ఈ చర్చల ప్రాతిపదికగానే, సంస్కరణలపై వచ్చే నవంబర్‌లో ప్రభుత్వాల మధ్య చర్చలు జరపాలని భారత్ కోరుకుంటున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర చట్టం ముసాయిదాను ఖరారు చేయించేందుకు కూడా భారత్ కృషిచేస్తుందన్నారు. అల్‌కాయిదా, తాలిబన్ ఉగ్రవాద సంస్థలను భద్రతా మండలి ఆంక్షల కమిటీల జాబితాలో చేర్చేందుకు భారత్ చొరవ తీసుకుంటుందన్నారు. -
2100 నాటికి 1,100 కోట్లకు ప్రపంచ జనాభా
వాషింగ్టన్: 2100 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 1,100 కోట్లకు చేరుతుందట. అయితే జనాభా పెరుగుదల అంశం.. పేదరికం, వాతావరణ మార్పులు, అంటువ్యాధుల వ్యాప్తి అనేక అంతర్జాతీయ సమస్యలకు కారణం కానుందట. ఐక్యరాజ్యసమితి, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆధునిక గణాంక సాధనాలను ఉపయోగించి జరిపిన సర్వేలో 2100 నాటికి ప్రపంచ జనాభా 960 కోట్ల నుంచి 1,230 కోట్ల మధ్య ఉండేందుకు 80 శాతం సంభావ్యత ఉందని తేలింది. గతంలో అంచనా కంటే ఇది 200 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం 700 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుతుందని, అక్కడి నుంచి తగ్గుదల నమోదవచ్చని తెలిపింది. -
ఐరాసలో ‘హిందీ’ ప్రసంగం
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించనున్నారు! ఈ నెల చివర్లో ఐరాస సాధారణ సభ సమావేశంలో మోడీ పాల్గొననుండడం తెలిసిందే. ఆ సందర్భంగా మోడీ హిందీలో ప్రసంగించనున్నట్లు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. హిందీ దివస్ సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. అమెరికాలో హిందీలో మాట్లాడిన మొదటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అని చెప్పారు. విదేశీ అతిథులను కలుసుకున్నప్పుడు ప్రధాని మోడీ వారితో హిందీలోనే మాట్లాడుతుంటారని రాజ్‌నాథ్ వెల్లడించారు. దేశంలో 55 శాతం హిందీ మాట్లాడగలరని, 90 శాతం మంది అర్థం చేసుకోగలరన్నారు. మోడీకి ఎర్రతివాచీ మోడీకి ఎర్రతివాచీతో ఘనంగా స్వాగతం పలికేందుకు అమెరికా యంత్రాంగం సిద్ధమవుతోంది. ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి, ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, రక్షణ ఒప్పందాలు పట్టాలెక్కించడానికి ఈ పర్యటనను అనువుగా మలచుకోవాలని అగ్రరాజ్యం భావిస్తోంది. ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొన్న అనంతరం మోడీ ఈ నెల 29న న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ రానున్నారు. అదే రోజు మోడీకి అమెరికా అధ్యక్షుడు ఒబామా చిన్నపాటి విందు ఇవ్వనున్నారు. ఆ రోజు, మరుసటి రోజు ఒబామా, మోడీ మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఇరాక్, సిరియా, ఇరాన్, ఇజ్రాయెల్-పాలస్తీనా తదితర అంశాలపై అభిప్రాయాలను మోడీతో ఒబామా పంచుకోనున్నారు. -
కంటిచూపు లేకపోతేనేం...ఇంటి దీపమయింది!
అది 1999, సెప్టెంబరు 27వ తేదీ. కూతురు పుట్టిందని సంతోషించాడు దురైకన్ను. ఇంతలోనే పిడుగు లాంటి వార్త... పుట్టిన బిడ్డకు కళ్ళు కనబడవని, భవిష్యత్తులో కూడా చూపు వచ్చే పరిస్థితి లేదన్నారు డాక్టర్లు. భోరున విలపించాడు దురైకన్ను. కూతురు అంధత్వంతో పుట్టిందన్న బాధ కన్నా తమ తర్వాత బిడ్డకు ఎవరు తోడుంటారన్నదే ఆదంపతులను తీవ్రంగా బాధించిన అంశం. అయితే భవిష్యత్తులో ఆమే ఆ ఇంటికి దీపమవుతుందని వారు ఆ రోజు ఊహించకపోయి ఉండవచ్చు.ఆ అమ్మాయే స్వర్ణలక్ష్మి. పాండిచ్చేరి ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ప్లస్‌వన్ చదువుతోంది. పదవ తరగతిలో 458 మార్కులు తెచ్చుకుంది. అందులో ఏ విశేషమూ లేదు. కానీ విశేషం ఏమిటంటే... ఆమె రెండుసార్లు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించింది. 2013వ సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన అమెరికా, చైనా, అర్జంటీనా, ఉరుగ్వే, ఉగండా దేశాల ప్రతినిధుల తర్వాత స్వర్ణలక్ష్మి వంతు వచ్చింది. భారత్‌లో మహిళలపై జరుగుతున్న దురాగతాలు, అత్యాచారం, నేరాలు, వారి హక్కుల హరించడం, స్త్రీల హక్కులపై పురుషుల అధిక్యంతో పాటు సంప్రదాయాల పేరిట మహిళలకు ఎదురవుతున్న అసమానత్వం, అవమానాలు, బాల్యవివాహాలు, బాలికలను విద్యకు దూరంగా ఉంచడం లాంటి సమస్యలను ఆధారాలతో సహావివరించింది. అలాగే చిన్నపిల్లలను చదువుల పేరిట ఆటలకు దూరంగా ఉంచడం మీద కూడా వ్యాఖ్యానించింది. తల్లిదండ్రులు తమ బాధ్యత పేరిట పిల్లల హక్కులను హరించడం, తమ ఆశల కోసం చిన్నారులపై భారాన్ని మోపడంతో చిన్నారులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించింది. మహిళలు, చిన్నపిల్లల హక్కులపై స్వర్ణలక్ష్మి చేసిన ఏడు నిమిషాల ప్రసంగం అనేక దేశాల ప్రతినిధులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో మహిళలు, చిన్నపిల్లలపై హక్కులపై మరింత సమాచారంతో మరోసారి ప్రసంగించాల్సిందిగా ఐరాస నుండి ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం మేరకు 2013 అక్టోబర్‌లో ఐదు నిమిషాల పాటు ప్రసంగించింది. అలా ఐక్యరాజ్యసమితిలో ఒకే ఏడాదిలో రెండుసార్లు ప్రసంగించింది స్వర్ణలక్ష్మి. ఇంతకీ ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అవకాశం ఎలా వచ్చిందంటే... స్వర్ణలక్ష్మి పాఠశాల నేపథ్యాన్ని గుర్తు చేసుకోవాలి. చెన్నైలోని లిటిల్‌ప్లవర్ పాఠశాలలో నిర్వహించే వకృత్వం, వ్యాసరచన, కీబోర్డు వాయించడం తదితర రంగాలలో తన ప్రతిభను కనబరిచిందామె. పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించే మాక్ పార్లమెంట్లో సమాచార శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా రాణించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మాక్ పార్లమెంట్లో స్వర్ణలక్ష్మి చేసిన ప్రసంగాలను విదేశీ స్వచ్ఛంద సంస్థల ద్వారా తెలుసుకున్న ఐకాస ప్రతినిధులు తమ వేదికపై ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందుకుంది. మనిషి మేధాసంపత్తికి, ప్రతిభకు అంధత్వం అడ్డుకాదని నిరూపించింది. - కోనేటి వెంకటేశ్వర్లు, న్యూస్‌లైన్, చెన్నై, ఫొటోలు: చుండి ముకుందరావు -
పేదల్లో మూడోవంతు భారత్‌లోనే!
ఐరాస సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల తాజా నివేదిక వెల్లడి న్యూఢిల్లీ: ప్రపంచంలోకెల్లా అత్యంత నిరుపేదల్లో మూడోవంతు మంది భారత్‌లోనే ఉన్నారని ‘ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల’ తాజా నివేదిక వెల్లడించింది. అలాగే ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల మరణాలు కూడా భారత్‌లోనే అత్యధికమని తేల్చింది. ఈ నివేదికను కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది ఓ సవాలని, దీన్ని కచ్చితంగా అధిగమిస్తామని అన్నారు. ‘‘పేదరికం అన్నది చాలా పెద్ద సవాలు.. తదుపరి నివేదిక వచ్చేసరికి మనం కచ్చితంగా కాస్త మెరుగుపడగలమని నాకు విశ్వాసముంది’’ అని పేర్కొన్నారు. ‘అందరితో కలిసి, అందరికీ అభివృద్ధి’ అని పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పేదరిక నిర్మూలనకు చాలా చిత్తశుద్ధితో కృషి చేస్తారన్నారు. ఈ నివేదికలో చాలా అభివృద్ధి సూచికలపై చర్చ ఉన్నప్పటికీ.. వాటిలో భారత్‌కు అనుకూలంగా ఏదీ లేదన్నారు. నివేదికలో ముఖ్యాంశాలు ►భారత్‌లో 60 శాతం మంది ఇప్పటికీ బహిర్భూమికే వెళుతున్నారు. ►ప్రపంచంలో సంభవిస్తున్న ప్రసూతి మరణాల్లో 17 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి. ►నిరుపేదలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ తర్వాత స్థానంలో చైనా ఉంది. ►ప్రపంచ నిరుపేదల్లో 13 శాతం మంది చైనాలో, 9 శాతం మంది నైజీరియాలో, 5 శాతం మంది బంగ్లాదేశ్‌లో ఉన్నారు.