ఐరాస: జమ్మూకాశ్మీర్‌లో ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించాలని ఐరాస ఆరు దశాబ్దాల కిందట తీర్మానాలను ఆమోదించినా వాటి అమలు కోసం జమ్మూకాశ్మీర్ ప్రజలు నేటికీ ఎదురు చూస్తున్నారన్న పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఆ వ్యాఖ్యలు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని భారత్ తరపున ఐరాసకు హాజరైన అభిషేక్ సింగ్ స్పష్టం చేశారు. అంగీకారం కాని ప్రజాభిప్రాయ సేకరణ అంశాన్ని ఆయన ఐక్యరాజ్య సమితి వేదికగా షరీష్ ప్రస్తావించడం సరైనది కాదన్నారు.
గత నెల ఆగస్టులో ఇరుదేశాల మధ్య విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలు చివరి నిమిషంలో రద్దు కావడంపై షరీఫ్ విచారం వ్యక్తం చేసిన తెలిసిందే. ఇరు శాల మధ్య ఉన్న పెండింగ్ అంశాలకు పరిష్కారంపై చర్చల రూపంలో లభించిన అవకాశం భారత్ వైఖరి వల్లే చేజారిందని ఆయన ఆరోపించారు.