వాషింగ్టన్: వివాదాస్పద కాశ్మీర్ అంశంపై జోక్యం చేసుకోబోమని పాకిస్థాన్కు అమెరికా స్పష్టం చేసింది. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్న పాకిస్థాన్ విన్నపాన్ని అగ్రదేశం తిరస్కరించింది. పాకిస్థాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తమ దేశంలో అడుగుపెట్టడానికి ముందే అమెరికా ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. 'కాశ్మీర్ విషయంలో మా విధానం మార్చుకునే ప్రశక్తి లేదు' అని అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా జోక్యం అవశ్యమని నవాజ్ షరీఫ్ అభిప్రాయపడిన నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ ప్రకటన చేసింది. కాశ్మీర్‌పై మూడో దేశం (అమెరికా) జోక్యం చేసుకోవడం భారత్‌కు ఇష్టం లేనప్పటికీ, సమస్య పరిష్కారం కావాలంటే అగ్ర దేశం జోక్యం అవసరమేనని నవాజ్ షరీఫ్ లండన్‌లో ఆదివారం ఈ వ్యాఖ్య చేశారు.
కాగా, అమెరికా జోక్యం చేసుకొని కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలన్న పాక్ ప్రధాని నవాజ్ షరీష్ డిమాండ్‌ను భారత్ తోసిపుచ్చింది. ద్వైపాక్షిక అంశమైన కాశ్మీర్ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్పష్టం చేశారు.
కాశ్మీర్పై జోక్యం చేసుకోబోం: అమెరికా
Published Mon, Oct 21 2013 9:01 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement