పాక్‌ ప్రియురాలి కోసం సరిహద్దులు దాటబోయి.. | Kashmir Man Plans To Meet Pakistan Woman | Sakshi
Sakshi News home page

పాక్‌ ప్రియురాలి కోసం సరిహద్దులు దాటబోయి..

Published Thu, Sep 26 2024 10:43 AM | Last Updated on Thu, Sep 26 2024 11:00 AM

Kashmir Man Plans To Meet Pakistan Woman

భుజ్: పాకిస్తాన్‌లోని తన ‍ప్రియురాలిని  కలుసుకునేందుకు అక్రమంగా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించిన ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని కచ్ జిల్లా ఖవ్రా గ్రామంలో  చోటుచేసుకుంది. ఇక్కడ జమ్ముకశ్మీర్‌కు చెందిన 36 ఏళ్ల యువకుడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ యువతిని కలుసుకునేందుకు ఆ యువకుడు అక్రమంగా సరిహద్దులు దాటి, పాకిస్తాన్‌ వెళ్లేందుకు ప్రయత్నించాడు.

పోలీసులు నిందితుడిని ఇంతియాజ్ షేక్ ముల్తాన్‌గా గుర్తించారు. అతను బందిపోరా జిల్లా వాసి. ఓ పాకిస్తానీ యువతిని కలుకునేందుకు కచ్‌ చేరుకున్నాడు. అక్కడి నుంచి పాక్‌ వెళ్లేందుకు స్థానికుల నుంచి సహకారం కోరాడు. ఈ ఉదంతం గురించి కచ్ (పశ్చిమ) ఎస్పీ సాగర్ బాగ్మార్ మాట్లాడుతూ ఆ యువకుడు ఆన్‌లైన్‌లో పరిచయమైన యువతిని కలుసుకునేందుకు సరిహద్దు దాటి పాకిస్తాన్‌కు వెళ్లాలనుకున్నాడన్నారు. ఈ నేపధ్యంలోనే తాము అతనిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పోలీసులతో అతను చెప్పిన విషయాలను ధృవీకరించాక, అతనితో ఎటువంటి ముప్పులేదని నిర్ధారించాక అతనిని విడుదల చేశామన్నారు.

ఆ యువకుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని, పాక్‌లోని ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఆకర్షితుడయ్యాడన్నారు. గూగుల్ మ్యాప్స్ చూసి, కచ్ నుంచి పాక్‌ వెళదామనుకుని స్థానికుల సహకారం కోరాడన్నారు. అయితే వారు ఆ యువకునిపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారన్నారు. ఆ తర్వాత  ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సాగర్ బాగ్మార్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Jharkhan‍d: పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement