ఉత్తర కొరియాపై సైనిక చర్య ఉండదు, కానీ...
ఉత్తర కొరియాపై సైనిక చర్య ఉండదు, కానీ...
Published Thu, Sep 7 2017 8:23 AM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM
- జింగ్ పిన్ తో ట్రంప్ ఫోన్ కాల్
- అగ్ర రాజ్యాలకు ఐరాస పిలుపు
సాక్షి, వాషింగ్టన్: అణు పరీక్షలతో ఐక్యరాజ్య సమితికి సైతం విసుగు పుట్టిస్తున్న ఉత్తర కొరియా వ్యవహారంపై అమెరికా ఆచీ తూచీ వ్యవహరించబోతున్నట్లు అర్థమౌతోంది. ఉ.కొ. పై ఉన్నపళంగా సైనిక చర్యలు చేపట్టబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు.
ఉత్తర కొరియా ఈ మధ్య నిర్వహించిన అణు పరీక్షల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జింగ్ పిన్ బుధవారం ఫోన్‌లో ట్రంప్‌తో చర్చించారు. వారి సంభాషణలను ఉటంకిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థ విషయాలను వెల్లడించింది. సైనిక చర్య విషయంపై జింగ్ ప్రశ్నించగా.. అది తమ తొలి నిర్ణయం కాదని ట్రంప్ బదులిచినట్లు సమాచారం. ‘సూటిగా చెప్పాలంటే ఇది చాలా ముఖ్యమైన ఫోన్ కాల్. ఉ.కొ. విషయంలో నేను.. జింగ్ పింగ్ ఒకే అభిప్రాయంతో ఉన్నాం’ అని ట్రంప్ తెలిపారు. కిమ్ సామ్రాజ్యంలో ఏం జరుగుతుందో బాహ్యా ప్రపంచానికి తెలీని పరిస్థితి నెలకొందని, అతనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని జింగ్ పిన్ తనతో చెప్పినట్లు ట్రంప్ వివరించారు.
అయితే సైనిక చర్యను పరిస్థితులు చేజారితే మాత్రం సైనిక చర్యలను చేపట్టవచ్చనే విషయాన్ని మాత్రం ట్రంప్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక రాజకీయాలకతీకంగా అగ్ర దేశాలన్నీ ఏకమై ఉత్తర కొరియా అణు పరీక్షల అంశంలో జోక్యం చేసుకోవాలంటూ ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అమెరికాకు త్వరలో మరిన్ని బహుమతులు (అణు ఆయుధాలు) పంపుతామంటూ ఉత్తర కొరియాకు చెందిన ఓ భద్రతా అధికారి హెచ్చరించిన కొన్ని గంటలలోపే ఐరాస శాంతి స్థాపనకు తాము ఎంత దూరమైన వెళ్తామని వ్యాఖ్యానించటం విశేషం.
Advertisement
Advertisement