Xing Ping
-
చైనాపై విమర్శ..! జాక్ మా కొంపముంచింది..!
గత ఏడాది అక్టోబర్‌లో చైనా ప్రభుత్వాన్ని అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. జిన్‌పింగ్ ప్రభుత్వాన్ని విమర్శించడంతో కొద్ది రోజులపాటు జాక్ మా అండర్ గ్రౌండ్ కూడా వెళ్లిపోయాడు. అక్కడి ప్రభుత్వం జాక్ మా కంపెనీలపై ఉక్కుపాదం వేసింది. ప్రభుత్వంపై చేసిన విమర్శలే ఇప్పుడు జాక్ మా కొంపముంచాయి. భారీ నష్టాలు...! చైనా బిజినెస్ టైకూన్ జాక్ మాకు చెందిన అలీబాబా గత ఏడాది కాలంలో 344 బిలియన్ డాలర్ల భారీ నష్టాన్ని చవిచూశారు. గత ఏడాది అక్టోబర్‌లో అలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు జాక్ మా చైనా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా విమర్శించినప్పుడే అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ పతనమవుతాయని నిపుణులు అంచనా వేశారు. అనుకున్నట్లుగానే జాక్ మా భారీ నష్టాలను సొంతం చేసుకున్నారు. మూడు వారాల ముందు హాంకాంగ్‌లో అలీబాబా షేర్లు అత్యధికంగా రికార్డు స్థాయికి పడిపోయాయి. అక్టోబర్ 5 నుంచి 30శాతం రికవరీ ఉన్నప్పటికీ...గత ఏడాదితో పోలిస్తే 43 శాతం మేర స్టాక్ ధర తగ్గింది. చదవండి: ఫ్రాన్సెన్స్ హాగెన్ చిచ్చు..ఫేస్‌బుక్‌పై బాంబు పేల్చిన ఆస్ట్రేలియా ?! బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం...అలీబాబా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏడాదిలో 344 బిలియన్ డాలర్లను కోల్పోయినట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా షేర్‌హోల్డింగ్‌లో అతిపెద్ద నష్టాలను అలీబాబా ముటకట్టుకుంది. జిన్‌పింగ్ ప్రభుత్వంపై భారీ ఎత్తున ఆరోపణలు చేయడంతో...చైనాకు చెందిన జాక్ మా ఫిన్‌టెక్ ఆర్మ్ యాంట్ గ్రూప్ జాబితాను ఐపీవోకు వెళ్లకుండా నిలిపివేసింది. అప్పటి నుంచి దేశంలోని అత్యంత శక్తివంతమైన రంగంపై జిన్‌పింగ్ ప్రభుత్వం భారీ అణిచివేత చేపట్టి, అలీబాబాకు తీవ్ర నష్టాలు వచ్చేలా చేసింది. జిన్పింగ్ప్రభుత్వంపై భారీ విమర్శలు..! గత ఏడాది అక్టోబర్‌లో చైనా ఆర్థిక నియంత్రణ మండలి తీరుపై మల్టీబిలియనీర్ జాక్ మా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నియంత్రణ మండలి తీరుతో తనలాంటి ఎంతో మంది వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని బహిరంగంగా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు జాక్ మా. దీంతో జాక్ మా వ్యాపార లావాదేవీలకు అక్కడి చైనా ప్రభుత్వం భారీ ఆటంకాలను సృష్టించింది. చదవండి: Tesla: టెస్లా కార్లలో ‘కలకలం..!’ పాత దానినే వాడండి..! -
ప్రైవేట్‌పై చైనా కొరడా మతలబు?!
మావో అనంతర పాలకులు కమ్యూనిస్టు పార్టీలో, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రైవేట్ వాణిజ్యవేత్తలకు చోటు కల్పించడం, రాజ్యాంగాన్ని మార్చడంద్వారా చైనాను వృద్ధి బాట పట్టించారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలు చైనాను ఆర్థిక దిగ్గజంగా మార్చినప్పటికీ, పట్టణ–గ్రామీణ, తీరప్రాంత– మైదాన ప్రాంతాల మధ్య విభజనలు బాగా పెరిగాయి. గత మూడు దశాబ్దాలుగా చైనా సమాజంలో ఒక నయా సంపన్న వ్యవస్థ బలపడి కమ్యూనిస్టు పార్టీకి, దాని సిద్ధాంతానికి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ చేస్తున్న ప్రయత్నాలు సోషలిస్టు సిద్ధాంతానికి తిరిగి మళ్లడం, సమాజంలోని వ్యత్యాసాలను తగ్గించడం అనే లక్ష్యానికి అనుగుణంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఆర్థిక కొలమానాల్లో అత్యున్నత స్థానంలో ఉంటున్న చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలిష్టంగానే ఉంది తప్ప కుప్పగూలిపోయే స్థితిలో మాత్రం లేదు. చైనా ఆర్థిక వ్యవస్థలో ఇటీవలి పరిణామాలు, ప్రత్యేకించి అలీబాబా గ్రూప్, ఎవెర్ గ్రాండే వంటి ప్రైవేట్ కంపెనీలు ఎదుర్కొన్న సమస్యలు... చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ త్రీ రెడ్ లైన్ పాలసీపై, ప్రైవేట్ రంగంపై ప్రభుత్వ వైఖరి, దాని ఉద్దేశాలపై ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. చైనా స్థూల దేశీయోత్పత్తిలో 60 శాతం, సాంకేతిక ఆవిష్కరణల్లో 70 శాతాన్ని ప్రైవేట్ రంగమే అందిస్తోంది. 1995లో ప్రైవేట్ రంగం చైనాలో 18 శాతం ఉద్యోగా లను కల్పించగా 2018లో అది 87 శాతానికి పెరిగింది. చైనా ఎగు మతులు ఇదే కాలానికి గాను 34 శాతం నుంచి 88 శాతానికి పెరి గాయి. పై ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ముందు చైనా ఆర్థిక వ్యవస్థ ఎలా నిర్మాణమైందో మనం అర్థం చేసుకోవడానికి అయిదు అంశాలను పరిశీలించాలి. మొదటిది: 1950లు, 60లలో మావో సేటుంగ్ పాలనలో నిఖా ర్సైన కమ్యూనిస్టు సైద్ధాంతిక పునాదిపై, అటు సోవియట్ సహాయం, ఇటు స్వావలంబనకు పిలుపివ్వడం అనే రెండింటి సమ్మేళనంతో, దేశంలో పారిశ్రామిక పునాదిని నిర్మించడంపై చైనా గట్టిగా కృషి చేసి మరీ విజయం సాధించింది. అయితే 1970లు, 80లలో డెంగ్ జియాంవో పింగ్ అంతర్జాతీయ సహకారంతో ఆర్థికాభివృద్ధిపై ఎక్కు వగా దృష్టిపెట్టారు. 1990లలో నాటి దేశాధ్యక్షుడు జియాంగ్ జెమిన్ సైద్ధాంతిక, ఆర్థిక రంగాల్లో సంస్కరణలతో చైనాను అత్యధిక వృద్ధి స్థాయికి తీసుకెళ్లారు. కమ్యూనిస్టు పార్టీలో, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రైవేట్ వాణిజ్యవేత్తలకు చోటు కల్పించడం, ఈ మేరకు రాజ్యాం గంలో కూడా మార్పులు తీసుకోవడం ద్వారా చైనాను వృద్ధి బాట పట్టించారు. ప్రైవేట్ యాజమాన్యానికి పలు హక్కులు కల్పిస్తూ ఒక నిబంధనను చేర్చారు. ప్రైవేట్ వ్యాపారులు కమ్యూనిస్టు పార్టీ నియం త్రణలో పనిచేయాల్సి ఉందని, పార్టీ పాలనకు వారు బేషరతుగా లోబడి ఉండాలని షరతు కూడా విధించారు. రెండు: ఈ విధానాల ఫలితంగా, 1978 నుంచి 2003 నాటికి ఎగుమతుల పరిమాణం 28 రెట్లకు పెరిగింది. 1952 నుంచి 1978 కాలంలో ఎగుమతుల్లో సాధించిన రెండు రెట్ల వృద్ధితో పోలిస్తే ఇది భారీ స్థాయి వృద్ధి అని చెప్పాలి. 1978–2003 కాలంలో సంస్కరణలు అమలు చేసి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించడానికి సుంకాలు, పన్నులు, వాణిజ్య ప్రోత్సాహకాలను ప్రతిపాదిస్తూ నాలుగు ప్రత్యేక ఆర్థిక మండళ్లను నెలకొల్పారు. ఎగుమతులను, అత్యున్నత టెక్నాల జీని దిగుమతి చేసుకోవడాన్ని ప్రోత్సహించడమే వీటి లక్ష్యం. దీంతో 1952లో చైనా జీడీపీలో పారిశ్రామిక రంగ వాటా 8 శాతం మాత్రమే ఉండగా, 2003 నాటికి 52 శాతానికి పెరిగింది. ప్రపంచ జీడీపీలో చైనా వాటా 1952లో 4.6 శాతం ఉండగా 2003 నాటికి 15 శాతానికి పెరిగింది. ఇక పారిశ్రామికోత్పత్తిలో విదేశీ మదుపు సంస్థల వాటా 1990లో 2.3 శాతం ఉండగా 2003 నాటికి అది 35.9 శాతానికి అమాంతంగా పెరిగిపోయింది. మూడు: 2003 నుంచి 2013 వరకు ఒక దశాబ్ది కాలంలో చైనా వార్షిక వృద్ధి రేటు 10.3 శాతంగా నమోదైంది. 2007 నాటికి 14.2 శాతం నమోదుతో ప్రపంచంలోనే అత్యన్నత వృద్ధి రేటును చైనా సాధించింది. 2008–2019 దశాబ్దంలో ఆర్థిక మాంద్య కాలంలో చైనా సగటు వృద్ధి రేటు 7.99 శాతానికి నమోదైంది. ఇది ఆ దశాబ్దంలో ఏ దేశమూ సాధించినంత అధిక వృద్ధి రేటు. 2004లో చైనా వస్తుతయారీ రంగం 625 బిలియన్ డాలర్ల విలువను నమోదు చేయగా 2019 నాటికి అది 3,896 బిలియన్లకు అమాంతంగా పెరిగింది. ఈ అసాధా రణమైన వృద్ధిరేటు వల్ల చైనా 2011లోనే ప్రపంచ తయారీరంగ కార్ఖానాగా మారింది. ఆ నాటికి ప్రపంచ తయారీరంగ ఉత్పత్తిలో చైనా వాటా 28.4 శాతంగా నమోదైంది. 2010లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఆవిర్భవించింది. నాలుగు: ఆర్థిక రంగ సంస్కరణలు ప్రైవేట్ భాగస్వామ్యానికి చోటు కల్పించినప్పటికీ, చైనా ప్రభుత్వరంగ సంస్థలు మొత్తం జీడీపీలో 23 నుంచి 27 శాతం వాటాను సాధించాయి. ఇవి పారి శ్రామిక రంగంలో 21 శాతం వాటాను కలిగి ఉండగా, నిర్మాణ రంగంలో 38.5 శాతం, హోల్‌సేల్, రిటైల్ రంగంలో 39 శాతం వాటాను, రవాణా, నిల్వ రంగంలో 77 శాతం వాటాను సాధించాయి. ఇక మొత్తం ద్రవ్యరంగంలో 88 శాతం, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల్లో 24.6 శాతం ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపత్యంలో ఉన్నాయి. 2000 సంవత్సరంలో ఫార్చ్యూన్ 500 జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా 27 ప్రభుత్వ రంగ సంస్థలకు చోటు దక్కగా చైనా నుంచి 9 సంస్థలు స్థానం సంపాదించాయి. 2017 నాటికి ఈ జాబితాలో మొత్తం 102 ప్రభుత్వ రంగ సంస్థలకు గాను 77 సంస్థలు చైనాకు సంబంధించినవే ఉండటం గమనార్హం. చైనా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు 2017లో 22,310 బిలియన్ డాలర్లతో రికార్డు సృష్టించాయి. కాగా మొత్తం 7,676 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన సరకులను అమ్మగలిగాయి. ప్రత్యేకించి బొగ్గు, ఇనుము పెద్దగా లేని లోహాలు, ఉక్కు, విద్యుత్తు, నిర్మాణ పరి శ్రమ వంటి రంగాల్లోకి చైనా భారీ పెట్టుబడులను తరలించింది. వీటిలో కొన్ని పరిశ్రమలను అధికోత్పత్తి సామర్థ్యతతో నిర్మించారు. చైనా 2000 సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరింది. అప్పటినుంచి 2015 నాటికి 15 సంవత్సరాల వ్యవధిలో ఏటా 13 శాతం సగటు ఉత్పత్తి రేటుతో చైనా ఉక్కు ఉత్పత్తిని అతి భారీ స్థాయిలో కొనసాగించింది. ఒక్క ఉక్కు రంగంలోనే 2018లో 8.1 శాతం వృద్ధి రేటుతో 928 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని, సిమెంట్ రంగంలో 895 మిలియన్ టన్నుల అధికోత్పత్తి సామర్థ్యాన్ని చైనా సాధించింది. ఇది ప్రపంచ అధికోత్పత్తి సామర్థ్యంలో 45 శాతా నికి ప్రాతినిధ్యం వహిస్తోంది. అయిదు: చైనాలో బ్యాంకింగ్ వ్యవస్థ 2016 నాటికి యూరో పియన్ యూనియన్ బ్యాంకింగ్ వ్యవస్థకంటే పెద్దదిగా మారింది. చైనా బ్యాంకుల సొంత ఆస్తుల విలువ 35 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది చైనా జీడీపీకి 3 రెట్లు ఎక్కువ. 2001 నుంచి చైనా బ్యాంకులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారీ స్థాయి మౌలిక వస తుల కల్పన ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలు అందించాయి. దీంతో అధికోత్పత్తి సామర్థ్యం కలిగిన చైనా ప్రత్యేక ఆర్థిక మండళ్లు నిర్మాణ రంగ సామగ్రిని ఈ దేశాలకు భారీగా పంపించగలిగాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ 2017లో నిర్వహించిన 19వ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మార్క్సిస్ట్ దృక్పథం, వైధానికం తోడుగా 2049 నాటికి చైనాను ఆధునిక సోషలిస్టు దేశంగా మలుద్దామని పిలుపు నిచ్చింది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలు చైనాను ఆర్థిక దిగ్గజంగా మార్చినప్పటికీ, గత మూడు దశాబ్దాల్లో పట్టణ–గ్రామీణ, తీరప్రాంత–మైదాన ప్రాంతాల మధ్య విభజనలు పెరి గాయి. 2019 నాటికి ఈ విభజన భారీ స్థాయికి చేరుకుంది. తీర ప్రాంతాల్లో నివసించే ఒక శాతం జనాభా దేశ మొత్తం సంపదలో 13 శాతాన్ని అదుపులో ఉంచుకున్నది. దీంతో చైనా సమాజంలో ఒక నయా సంపన్న వ్యవస్థ బలపడి కమ్యూనిస్టు పార్టీకి, దాని సిద్ధాం తానికి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ చేస్తున్న ప్రయ త్నాలు సోషలిస్టు సిద్ధాంతానికి తిరిగి మళ్లడం, సమాజంలోని వ్యత్యా సాలను తగ్గించడం అనే లక్ష్యానికి అనుగుణంగా ఉన్నట్లు కనిపి స్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటివరకు చైనా ఆర్థిక వ్యవస్థ బలిష్టంగానే ఉంది తప్ప కుప్పగూలిపోయే స్థితితో అయితే లేదు. డా. గద్దె ఓంప్రసాద్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్ సిక్కిం సెంట్రల్ యూనివర్సిటీ ‘ మొబైల్: 79089 33741 -
జనాభా నియంత్రణలో చైనా సడలింపులు
బీజింగ్: జనాభా నియంత్రణ విషయంలో చైనా ప్రభుత్వం దశాబ్ధాల తరబడి అమలు చేసిన పాలసీలో మార్పులు తీసుకొచ్చింది. ఇకపై చైనాలో ముగ్గురు పిల్లలను కనేందుకు దంపతులకు అనుమతి ఇచ్చింది. చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2016లో వందల ఏళ్లు అధిక జనాభాతో ఇబ్బందులు పడింది చైనా. దీంతో 1950వ దశకం నుంచి జనాభా నియంత్రణపై కఠిన నిబంధనలు విధించింది. అందుకు తగ్గట్టే సత్ఫలితాలు కూడా సాధించింది. అయితే రానురాను యువ జనాభా తగ్గిపోయి వృద్ధ జనాభా దేశంలో ఎక్కువైంది. ఈ క్రమంలో మానవ వనరుల కొరత ఎదుర్కొనే పరిస్థితి ఎదురైంది. దీంతో దాదాపు అరవై ఏళ్ల తర్వాత తొలిసారి జనాభా నియంత్రణ విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించింది కమ్యూనిస్టు ప్రభుత్వం. దీంతో ఇద్దరు పిల్లలు కనేందుకు 2016లో అనుమతి ఇచ్చింది. మారని తీరు దాదాపు యాభై ఏళ్ల పాటు జనాభా నియంత్రణ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో చైనీయుల్లో ఎక్కువ మంది జనాభా నియంత్రణకే అలవాటు పడిపోయారు. 2016లో ఇద్దరు పిల్లలు కనేందుకు అనుమతి వచ్చినా.. పెద్దగా ప్రయోజం లేదు. 2020 గణాకాంల ప్రకారం అక్కడి పెళ్లైన మహిళల్లో జననాల రేటు 1.3ని మించలేదు. తాజాగా ముగ్గురి పిల్లలకి అనుమతి ఇవ్వడంపైనా చైనీయుల్లో పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు. -
ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఎందాకా?
కోవిడ్–19 ఇప్పటికే అమెరికా, చైనా మధ్య ప్రచ్ఛన్న యుద్ధ తరహా పరిస్థితిని సృష్టిం చింది. భారత్ ఈ ప్రచ్ఛన్న యుద్ధ ఉద్రిక్తతలో భాగం పంచుకుంటూ అమెరికా పక్షం వహిం చింది. ఇప్పటికైతే అమెరికా, చైనాలు ఆర్థిక, సైనిక శక్తి విషయంలో పోటీపడుతున్నాయి. తమ ఆర్థిక, సైనిక శక్తితో చైనా, రష్యాలు ఒకవైపు చెక్ పెడుతున్నప్పటికీ.. ప్రపంచ సామ్రాజ్యవాద నియంత్రణ బలం కలిగిన పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికా. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయానికి, అమెరికాతో అనేక రంగాల్లో చైనా సమాన స్థాయిలో నిలబడటానికి ప్రయత్నిస్తూ వచ్చింది. ప్రత్యేకించి భారీస్థాయిలో ఉన్న నిపుణ కార్మిక శక్తి ఆధిపత్యంతో చైనా అమెరికాను సవాలు చేస్తోంది. ప్రపంచీకరణ ప్రక్రియను నేర్పుతో నిర్వహించడం ద్వారా ప్రపంచ మార్కెట్లలో అమెరికాను తోసిరాజన్న చైనా.. తన సరుకులు, విని యోగ వస్తువులతో అమెరికా మార్కెట్లనే ముంచెత్తింది. శ్రామిక శక్తితో కూడిన సోషలిజాన్ని చైనా ఆచరణలో పెడుతూ వస్తోంది. పూర్వపు సోవియట్ యూనియన్ ఇక్కడే దెబ్బతినిపోయింది. ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన మార్కెట్ నియంత్రణదారుగా చైనా అవతరించింది. కొన్ని రంగాల్లో అయితే తన సొంత బ్రాండ్తోకూడిన వినిమయ సంస్కృతిని సృష్టించడం ద్వారా యూరో–అమెరికన్ మార్కెట్లలోకి కూడా చైనా చొచ్చుకుపోయింది. శ్రమశక్తిని, నైపుణ్యాన్ని, విజ్ఞానశాస్త్రాన్ని మేళవించడం అనే కారల్ మార్క్స్ స్వప్నాన్ని చైనా ఆవిష్కరించింది. ఉన్నత మానవ జీవితాన్ని సాధ్యం చేసే నూతన ప్రపంచ వ్యవస్థను కూడా చైనా సృష్టించింది. పెట్టుబడిదారీ పాశ్చాత్య ప్రపంచం ప్రకృతి అసమతుల్యతను సృష్టించడం ద్వారా అవసరానికి మించి అధికంగా వినియోగించసాగింది. ఇప్పుడు కరోనా వైరస్ సరిగ్గా ఆ వినియోగదారీ సంస్కృతిలోనే సరికొత్త సంక్షోభాన్ని సృష్టించింది. ఈ పాత వ్యవస్థను మార్చడం ద్వారానే కరోనా అనంతర ప్రపంచం ఆవిర్భవించవచ్చు. బలమైన కమ్యూనిస్టు వ్యతి రేక మనోభావాలు కలిగిన భారతీయ ప్రభుత్వాలు.. చౌక ధరలతో కూడిన సరుకులతో చైనా సాగిస్తున్న మార్కెట్ విస్తరణను అడ్డుకోలేకపోయాయి. 130 కోట్లమంది ప్రజలున్న అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత్‌కు, 1962 యుద్ధం తర్వాత చైనా ప్రాదేశిక విస్తరణకు పూనుకుంటుందన్న భయం ఉన్నప్పటికీ దాని మార్కెట్ వృద్ధిని మాత్రం అధిగమించలేకపోయింది. పైగా చైనా బజార్లు మన దేశం లోని దిగువ ఆదాయ తరగతుల జీవన ప్రమాణాలను పెంచడంలో సాయపడ్డాయి. ఈరోజు భారత్‌లోని ప్రతి నగరంలోనూ, ప్రజా బృందాలకు చైనా బజార్లు అందుబాటులో ఉంటున్నాయి. చైనా బజార్లు కారు చౌక ధరలకు సరుకులను అమ్ముతుండటంతో భారతీయ అల్పాదాయవర్గాలు వాటి ముందు క్యూ కడుతున్నాయి. ప్రత్యేకించి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో 1999–2004 మధ్య కేంద్రంలో సాగిన బీజేపీ ప్రభుత్వం కానీ 2014 నుంచి మోదీ నేతృత్వంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం కానీ కమ్యూనిజాన్ని తమ నెంబర్ వన్ శత్రువుగా భావిస్తూ వచ్చాయి. అయినప్పటికీ చైనా సరు కులు భారతీయ మార్కెట్లలో పోటెత్తకుండా వాజ్‌పేయి, మోదీ ప్రభుత్వాలు అడ్డుకోలేకపోయాయి. దీనివెనుక కారణం ఏమిటంటే ప్రపంచంలోని ప్రతి సమాజం అవసరాలు, అభిరుచులను జాగ్రత్తగా అధ్యయనం చేసిన తర్వాతే, నాణ్యమైన సరుకులను చౌక ధరలకు ఎలా ఉత్పత్తి చేయాలో చైనా కార్మికులు చక్కగా నేర్చుకున్నారు. ఈ తరహా చైనా ఉత్పత్తి ఫార్ములాను దాని నిపుణులు యూరో–అమెరికన్ మార్కెట్లలోకి కూడా తీసుకుపోయారు. అంతర్జాతీయ సమాజపు బహుళ సంస్కృతి అవసరాలను జాగ్రత్తగా అధ్యయనం చేసిన చైనా.. అటు ఆహార పదార్థాలనుంచి ఇటు పడకగది అలంకరణల వరకు ప్రపంచ జనాభాలోని అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉండే ఉత్పత్తుల తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. చివరకు ఈ చైనా బజార్ల కారణంగానే ఆఫ్రికన్లు, అరబ్బులు సైతం 21వ శతాబ్ది జీవిత సౌకర్యాలను గురించి బాగా తెలుసుకున్నారు. అంతర్జాతీయ ఆధునిక జీవితానికి అవసరమైన అనేక కొత్త వస్తువులను అందించిన చైనా ఇప్పుడు కరోనా వైరస్‌కు కూడా మూలస్థానంగా నిలిచింది. ఈ వైరస్సే ఇప్పుడు అమెరికా, జర్మనీ, జపాన్, భారత్, ఆస్ట్రేలియా వంటి చైనా ప్రత్యర్థులు ఏకం కావడానికి దారి తీసింది. అయితే కరోనా అనంతర ప్రపంచంలోకి చైనా సరుకులు వెళ్లకుండా ప్రత్యర్థులు అడ్డుకోగలరా అన్నదే ప్రశ్న. ఇప్పుడు ట్రంప్, జిన్‌పింగ్ ప్రభుత్వాల మధ్య నడుస్తున్న యుద్ధానికీ, 1950లు, 60లు, 70లలో అమెరికా, సోవియట్ యూని యన్ మధ్య కొనసాగిన ప్రచ్ఛన్నయుద్ధానికి మధ్య పోలికలే లేవు. ఎందుకంటే సోవియట్ యూనియన్ తన కాలంలో ఏ దేశంలోనూ గృహ, కిచెన్ మార్కెట్‌ని నియంత్రించలేకపోయింది. ఆయుధాల అమ్మకమే యూఎస్ఎస్ఆర్ ఏకైక మార్కెట్‌గా ఉండేది. పైగా వినియోగదారీ సరుకులను భారీగా ఉత్పత్తి చేసే శ్రామికశక్తి నైపుణ్యాలు యూఎస్ఎస్ఆర్కి ఉండేవి కావు. కానీ నేడు చైనా తన 140 కోట్ల ప్రజానీకపు పరిమాణం, నాణ్యత (చక్కటి వ్యవసాయ పునాది, నైపుణ్యాలతో కూడిన కఠిన శ్రమశక్తి)తో కూడిన శ్రామిక శక్తిని ఉపయోగిస్తోంది. పైగా తాను సాధించిన ప్రతి ఫలితానికి సోషలిస్టు సంస్థాగత నైపుణ్యాలను జోడించింది. ప్రత్యేకించి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో చైనా చౌక ఉత్పత్తులు ప్రజారాశుల జీవన శైలినే మార్చివేశాయి. కోవిడ్–19 అనంతర కాలంలో ప్రపంచ మార్కెట్లలో చైనా స్థానాన్ని భర్తీ చేయడానికి తమ హిందుత్వం తోడ్పడుతుందని బీజేపీ సిద్ధాంతకారులు చెబుతున్నారు. అయితే చైనాలోని నిపుణ శ్రామిక శక్తిని సవాలు చేసేలా భారత్ తన శ్రామిక శక్తిని సిద్ధం చేయగలదా? చైనా తయారు చేస్తున్న స్థాయిలో చౌక ధరలు, నాణ్యతతో కూడిన సరుకులను, వస్తువులను భారత్ తయారు చేయగలదా? ముస్లిం వ్యతిరేక సాంస్కృతిక జాతీయవాదం తోనే ఆరెస్సెస్ 95 ఏళ్లుగా మనగలుగుతూ వచ్చింది. భారత్‌లో దిగువ కులాలనుంచి వచ్చిన శ్రామిక శక్తి నైపుణ్యాలను పెంచడం గురించి ఆరెస్సెస్ ఎన్నడూ ఆలోచించలేదు. చైనీయుల కన్ఫ్యూసియనిజం, బుద్ధిజం, మార్క్సిజం మానవుల సమానత్వాన్ని, శ్రమ పట్ల గౌరవాన్ని విశ్వసిస్తాయి. కానీ కౌటిల్యుడు, మనువు, గోల్వాల్కర్ ఆలోచనలను మూలంగా కలిగిన ఆరెస్సెస్ భావజాలం.. మానవ సమానత్వం, శ్రమను గౌరవించడం గురించి తన చరిత్రలో ఎన్నడూ ప్రచారం చేయలేదు. శ్రమనే జీవి తంగా గడుపుతున్న చైనా శ్రామిక శక్తిని ఆరెస్సెస్ భావజాలం ఎలా సవాలు చేయగలదు? ఆరెస్సెస్ ప్రవచించే ‘జై శ్రీరామ్’ నినాదం ‘వంద పుష్పాలు వికసించనీ, వేయి భావాలు ఘర్షించనీ’ అనే చైనా నినాదాన్ని సవాలు చేయగలదా? సామాజిక, ప్రకృతి శాస్త్రాల మేళ వంతో కూడిన వందభావాల ఘర్షణ ఫలితమే చైనా మార్కెట్ విస్తరణ. ‘మేడ్ ఇన్ చైనా’ అనే ముద్ర ఉంది కాబట్టి చైనా వస్తువులను, సరుకులను కొనుగోలుదారులు ఇష్టపడటం లేదు. చౌక ధరలతో లభి స్తాయి, మన్నికగా ఉంటాయి కాబట్టే ప్రపంచమంతటా చైనా వస్తువులను కొంటున్నారు. రేపు మనం కూడా మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ వేసి చైనాలాగా చౌకగా భారతీయ వస్తువులను ఎగుమతి చేసినా, చైనా సరుకుల్లోని నాణ్యతను ఇవ్వలేకపోతే ఎవరూ మన సరుకులను కొనబోరు. అందుకే ఆరెస్సెస్ సిద్ధాంతకారులు తమ సాంస్కృతిక జాతీయ వాదాన్ని విడిచిపెట్టి శ్రమశక్తిని గౌరవించడానికి అధిక విలువనిచ్చే ఉత్పాదక జాతీయవాదం గురించి పాఠాలు నేర్చుకుని తీరాలి. లేబర్ మార్కెట్‌ను కులాలకు అతీతంగా మార్చడాన్ని వారు నేర్చుకోవాలి. చైనా, భారత్‌లకు సరిహద్దులున్నాయి కానీ ఈ రెండు దేశాలు తమ సంస్కృతులను ఎన్నడూ పరస్పరం పంపిణీ చేసుకోలేదు. పూర్తిగా విభిన్నమైన సంస్కృతులతోటే ఇవి మనగలుగుతూ వచ్చాయి. చైనా గ్రామీణ పరిశ్రమ వివిధరకాల సాంస్కృతిక, వాణిజ్య మార్కెట్లకు తగిన సరుకులను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో ఉంటున్నాయి. మరి మన గ్రామీణ పరిశ్రమ పరిస్థితి ఏంటి? ప్రధాని నరేంద్రమోదీ కరోనా అనంతర ఆర్థిక కార్యాచరణ కోసం 20 లక్షల కోట్ల రూపాయలతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. కుటీర పరిశ్రమలను నెలకొల్పడం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ప్రపంచ మార్కెట్ అభిరుచులను సంతృప్తిపరిచే వస్తువులు, సరుకులను గ్రామీణ భారత్‌లోని నిపుణ కార్మికులు తయారు చేయగలరా? ఇక నుంచి మన స్థానిక ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లు కావాలని మోదీ ఆశి స్తున్నారు. ఎలా సాధ్యం? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా చైనా ద్విభాషా దేశంగా ఉందన్న విషయాన్ని గుర్తించడంలో విఫలమయ్యాయి. చైనా వ్యాప్తంగా మాండరీన్, ఇంగ్లిష్ భాషలు రాజ్యమేలుతున్నాయి. ఏ దేశానికి ఎలాంటి ఉత్పత్తులు అవసరం అనే అంశాన్ని గ్రామీణ చైనాలోని బ్రాండ్ మేకర్లకు బాగా తెలుసు. 1970ల నుంచి చైనాలో సిద్ధాంతం, ఆచరణల తోడుగా పాఠశాల విద్యా ప్రణాళిక నడుస్తోంది. మరి బీజేపీ ప్రభుత్వం ప్రబోధిస్తున్న స్కూలు విద్యా ఎజెండా ఏంటి? పురాణాలను ఆధునిక శాస్త్రంగా బోధించడం తప్ప పొలం దున్నడం, పంటలు పండించటమే భారతీయ సంస్కృతి అని బోధించడానికి మన పిల్లలను ఉత్పాదక క్షేత్రాల వద్దకు తీసుకుని పోవడం లేదు. చైనాలోని పిల్లలందరికీ తమ స్కూల్ కరిక్యులంలో భాగంగా పొలాల్లో పనిచేయడం నేర్పుతున్నారు. చైనాను మనం సవాలు చేయడం అంటే మనకు వాడుకలో ఉన్న అనేక అంశాల బూజు దులిపి కొత్త అంశాలను నేర్చుకోగలగడమే. ఈ కొత్త అంశాలు ఇప్పుడు జాతీయవాదతత్వంతో కనిపించకపోవచ్చు. నమస్తే ట్రంప్ అనే భావజాలంతో చైనాతో ప్రచ్ఛన్నయుద్ధం సాగించడం వల్ల దేశీయంగా కుటీర పరిశ్రమను అభివృద్ధి చేయలేం. పైగా ట్రంప్ పక్కా బిజినెస్‌మన్. తన ముందు ఎన్నికలు సవాలుగా ఉన్నాయి. ఈసారి కూడా ట్రంప్ గెలుపొందితే కచ్చితంగా జిన్‌పింగ్‌తో వాటాలు పంచుకుంటాడు తప్ప మోదీతో దాల్ రోటీని పంచుకోడు. వ్యాసకర్త: ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్, డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
ఉత్తర కొరియాపై సైనిక చర్య ఉండదు, కానీ...
- జింగ్ పిన్ తో ట్రంప్ ఫోన్ కాల్ - అగ్ర రాజ్యాలకు ఐరాస పిలుపు సాక్షి, వాషింగ్టన్: అణు పరీక్షలతో ఐక్యరాజ్య సమితికి సైతం విసుగు పుట్టిస్తున్న ఉత్తర కొరియా వ్యవహారంపై అమెరికా ఆచీ తూచీ వ్యవహరించబోతున్నట్లు అర్థమౌతోంది. ఉ.కొ. పై ఉన్నపళంగా సైనిక చర్యలు చేపట్టబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. ఉత్తర కొరియా ఈ మధ్య నిర్వహించిన అణు పరీక్షల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జింగ్ పిన్ బుధవారం ఫోన్లో ట్రంప్‌తో చర్చించారు. వారి సంభాషణలను ఉటంకిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థ విషయాలను వెల్లడించింది. సైనిక చర్య విషయంపై జింగ్ ప్రశ్నించగా.. అది తమ తొలి నిర్ణయం కాదని ట్రంప్ బదులిచినట్లు సమాచారం. ‘సూటిగా చెప్పాలంటే ఇది చాలా ముఖ్యమైన ఫోన్ కాల్. ఉ.కొ. విషయంలో నేను.. జింగ్ పింగ్ ఒకే అభిప్రాయంతో ఉన్నాం’ అని ట్రంప్ తెలిపారు. కిమ్ సామ్రాజ్యంలో ఏం జరుగుతుందో బాహ్యా ప్రపంచానికి తెలీని పరిస్థితి నెలకొందని, అతనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని జింగ్ పిన్ తనతో చెప్పినట్లు ట్రంప్ వివరించారు. అయితే సైనిక చర్యను పరిస్థితులు చేజారితే మాత్రం సైనిక చర్యలను చేపట్టవచ్చనే విషయాన్ని మాత్రం ట్రంప్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక రాజకీయాలకతీకంగా అగ్ర దేశాలన్నీ ఏకమై ఉత్తర కొరియా అణు పరీక్షల అంశంలో జోక్యం చేసుకోవాలంటూ ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అమెరికాకు త్వరలో మరిన్ని బహుమతులు (అణు ఆయుధాలు) పంపుతామంటూ ఉత్తర కొరియాకు చెందిన ఓ భద్రతా అధికారి హెచ్చరించిన కొన్ని గంటలలోపే ఐరాస శాంతి స్థాపనకు తాము ఎంత దూరమైన వెళ్తామని వ్యాఖ్యానించటం విశేషం.