గత ఏడాది అక్టోబర్‌లో చైనా ప్రభుత్వాన్ని అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. జిన్‌పింగ్ ప్రభుత్వాన్ని విమర్శించడంతో కొద్ది రోజులపాటు జాక్ మా అండర్ గ్రౌండ్ కూడా వెళ్లిపోయాడు. అక్కడి ప్రభుత్వం జాక్ మా కంపెనీలపై ఉక్కుపాదం వేసింది. ప్రభుత్వంపై చేసిన విమర్శలే ఇప్పుడు జాక్ మా కొంపముంచాయి.
భారీ నష్టాలు...!
చైనా బిజినెస్ టైకూన్ జాక్ మాకు చెందిన అలీబాబా గత ఏడాది కాలంలో 344 బిలియన్ డాలర్ల భారీ నష్టాన్ని చవిచూశారు. గత ఏడాది అక్టోబర్‌లో అలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు జాక్ మా చైనా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా విమర్శించినప్పుడే అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ పతనమవుతాయని నిపుణులు అంచనా వేశారు. అనుకున్నట్లుగానే జాక్ మా భారీ నష్టాలను సొంతం చేసుకున్నారు. మూడు వారాల ముందు హాంకాంగ్‌లో అలీబాబా షేర్లు అత్యధికంగా రికార్డు స్థాయికి పడిపోయాయి. అక్టోబర్ 5 నుంచి 30శాతం రికవరీ ఉన్నప్పటికీ...గత ఏడాదితో పోలిస్తే 43 శాతం మేర స్టాక్ ధర తగ్గింది.
చదవండి: ఫ్రాన్సెన్స్ హాగెన్ చిచ్చు..ఫేస్‌బుక్‌పై బాంబు పేల్చిన ఆస్ట్రేలియా ?!
బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం...అలీబాబా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏడాదిలో 344 బిలియన్ డాలర్లను కోల్పోయినట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా షేర్‌హోల్డింగ్‌లో అతిపెద్ద నష్టాలను అలీబాబా ముటకట్టుకుంది. జిన్‌పింగ్ ప్రభుత్వంపై భారీ ఎత్తున ఆరోపణలు చేయడంతో...చైనాకు చెందిన జాక్ మా ఫిన్‌టెక్ ఆర్మ్ యాంట్ గ్రూప్ జాబితాను ఐపీవోకు వెళ్లకుండా నిలిపివేసింది. అప్పటి నుంచి దేశంలోని అత్యంత శక్తివంతమైన రంగంపై జిన్‌పింగ్ ప్రభుత్వం భారీ అణిచివేత చేపట్టి, అలీబాబాకు తీవ్ర నష్టాలు వచ్చేలా చేసింది.
జిన్‌పింగ్‌ప్రభుత్వంపై భారీ విమర్శలు..!
గత ఏడాది అక్టోబర్‌లో చైనా ఆర్థిక నియంత్రణ మండలి తీరుపై మల్టీబిలియనీర్ జాక్ మా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నియంత్రణ మండలి తీరుతో తనలాంటి ఎంతో మంది వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని బహిరంగంగా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు జాక్ మా. దీంతో జాక్ మా వ్యాపార లావాదేవీలకు అక్కడి చైనా ప్రభుత్వం భారీ ఆటంకాలను సృష్టించింది.
చదవండి: Tesla: టెస్లా కార్లలో ‘కలకలం..!’ పాత దానినే వాడండి..!
Comments
Please login to add a commentAdd a comment