military action
-
పశ్చిమ దేశాలదే ఈ పాపం
మాస్కో: ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితికి ముమ్మాటికీ పశ్చిమ దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌లో సైనిక చర్య ప్రారంభం కావడానికి, ఇదింకా కొనసాగుతుండటానికి అవే బాధ్యత వహించాలన్నారు. తమను నిందించడం తగదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో పుతిన్ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. పశ్చిమ దేశాల ఆటలో రష్యా, ఉక్రెయిన్ బాధిత దేశాలుగా మారాయన్నారు. తాము ఉక్రెయిన్ ప్రజలపై పోరాడడం లేదని, కేవలం స్వీయ మనుగడ కోసమే పోరాటం సాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. సమస్య పరిష్కారం కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. పుతిన్ ఇంకా ఏం చెప్పారంటే... అందుకే ఇలాంటి అడ్డదారులు ‘‘పాశ్చాత్య దేశాల చేతుల్లో ఉక్రెయిన్ బందీగా మారడం విచారకరం. రష్యా పతనమే వాటి లక్ష్యం. స్థానిక ఘర్షణను అంతర్జాతీయ పోరుగా మార్చడమే వాటి ఉద్దేశం. రష్యా సరిహద్దు వరకూ విస్తరించాలని నాటో కూటమి ప్రయత్నించింది. రష్యా ఉనికిని కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధం. మాపై యుద్ధం ప్రారంభించింది పశ్చిమ దేశాలే. దాన్ని ముగించడానికి మేం బలాన్ని ఉపయోగిస్తున్నాం. మాపై ‘సమాచార దాడులు’ కూడా జరుగుతున్నాయి. రష్యా సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారు. యుద్ధక్షేత్రంలో రష్యాను ఓడించడం అసాధ్యమని వారికి తెలుసు కాబట్టి ఇలాంటి అడ్డదారులు ఎంచుకుంటున్నారు. మా ఆర్థిక వ్యవస్థపైనా దాడి చేస్తున్నారు. కానీ, వారిప్పటిదాకా సాధించింది ఏమీ లేదు. ఇకపైనా ఏమీ ఉండబోదు.’’ సైనికులకు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు ‘‘తూర్పు దేశాలను నాశనం చేయాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నాటో దళాల సంఖ్యను పెంచుతున్నారు. డాన్బాస్ ప్రాంతంలో సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు మేము ప్రయత్నించాం. కానీ, పశ్చిమ దేశాలు క్రూరంగా వ్యవహరించాయి. ఉక్రెయిన్–రష్యా సమస్య పరిష్కారానికి అవి సిద్ధంగా లేవు. వాటి వైఖరి వల్లే వ్యవహారం మరింత జటిలంగా మారుతోంది. రష్యాపై యుద్ధం కోసం ఆ దేశాలు ఉక్రెయిన్‌కు 150 బిలియన్ డాలర్లు అందజేశాయి. చివరకు ఉక్రెయిన్‌కు ఇరాక్, యుగోస్లావియా గతి పట్టించడం ఖాయం. ప్రపంచ భద్రత, శాంతి కోసం చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని పుతిన్ పునరుద్ఘాటించారు. రష్యా కోసం పోరాడుతున్న సైనికులకు, వారి కుటుంబాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ‘న్యూ స్టార్ట్’లో రష్యా భాగస్వామ్యం రద్దు అమెరికాతో కుదిరిన ‘న్యూ స్టార్ట్ సంధి’లో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నట్లు పుతిన్ మంగళవారం ప్రకటించారు. అణ్వాయుధాల నియంత్రణ కోసం అమెరికా, రష్యా మధ్య కుదిరి, ఇంకా అమల్లో ఉన్న చివరి ఒప్పందం ఇదే కావడం గమనార్హం. ఒకవేళ అమెరికా అణ్వాయుధ పరీక్షలు చేపడితే తాము కూడా అందుకు సిద్ధమని పుతిన్ పేర్కొన్నారు. అమెరికా, దాని నాటో మిత్రదేశాలు రష్యాను లక్ష్యంగా చేసుకున్నాయని, అందుకే న్యూ స్టార్ట్ సంధి నుంచి భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలగలేదని అన్నారు. తమను ఓడించి, తమ అణ్వాయుధాలను స్వా«దీనం చేసుకోవాలన్నదే పశ్చిమ దేశాల ఆలోచన అని మండిపడ్డారు. అమెరికా, రష్యా మధ్య న్యూ స్టార్ట్ సంధి 2010లో కుదిరింది. 2021 ఫిబ్రవరిలో ఈ సంధి గడువు ముగిసిపోగా, మరో ఐదేళ్లు పొడిగించారు. -
100 రోజుల వార్.. మరుభూమిగా ఉక్రెయిన్.. దశలవారీగా ఏమేం జరిగిందంటే?
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి నేటికి 100 రోజులు. ఏడాదికి పైగా సన్నాహాలు జరిపి ఫిబ్రవరి 24న హఠాత్తుగా దాడికి దిగాయి పుతిన్ సేనలు. ‘ఉక్రెయిన్ నిస్సైనికీకరణ’ కోసం ‘ప్రత్యేక సైనిక చర్య’ ప్రకటనతో ప్రపంచ దేశాలకు పుతిన్ షాకిచ్చారు. కానీ కీవ్‌ను పట్టుకుని అధ్యక్షుడు జెలెన్స్కీని తప్పించి కీలుబొమ్మ సర్కారును గద్దెనెక్కించాలన్న ఆశలు మాత్రం నెరవేరలేదు. అమెరికా, పశ్చిమ దేశాలు భారీగా అందిస్తున్న ఆయుధాల సాయంతో రష్యాను ఉక్రెయిన్ దీటుగా ప్రతిఘటిస్తోంది. దాంతో సైనికంగా కనీవినీ ఎరగని నష్టాలతో, వాటికి తోడు పశ్చిమ దేశాల కఠిన ఆంక్షలతో రష్యా సతమతమవుతోంది. నాటో విస్తరణను అడ్డుకోవడం, ఉక్రెయిన్ అందులో చేరకుండా చూడటం కూడా పుతిన్ యుద్ధ లక్ష్యాల్లో ఒకటి. కానీ స్వీడన్, ఫిన్లండ్ వంటి తటస్థ యూరప్ దేశాలు కూడా రక్షణ కోసం నాటో గూటికి చేరాలని నిర్ణయించుకోవడానికి యుద్ధమే కారణమవడం ఆయనకు మింగుడుపడని పరిణామమే. 70 లక్షలకు పైగా ఉక్రేనియన్లు శరణార్థులుగా దేశం వీడటంతో పాటు మొత్తమ్మీద కోటిన్నరకు పైగా నిరాశ్రయులైన వైనం గుండెల్ని మెలిపెట్టింది. ఉక్రెయిన్ను మరుభూమిగా మార్చడమే గాక ప్రపంచమంతటినీ ధరాభారం, ఆహార కొరత వంటి పెను సమస్యల వలయంలోకి నెట్టిన యుద్ధంపై ఓ సింహావలోకనం... మొదటి దశ భీకర దాడి ఫిబ్రవరి 24: ఉక్రెయిన్‌వ్యాప్తంగా భారీ క్షిపణి దాడులతో రష్యా విరుచుకుపడింది. అధ్యక్ష భవనంలోకి చొరబడి ప్రెసిడెంట్ జెలెన్స్కీని హతమార్చేందుకు రష్యా పారాట్రూపర్లు విఫలయత్నం చేశారు. ఫిబ్రవరి 25: దేశం వీడాలని జెలెన్స్కీకి అమెరికాతో పాటు పలు దేశాధ్యక్షులు సూచించారు. అందుకు సాయం చేస్తామంటూ ముందుకొచ్చారు. కానీ ఆయన ససేమిరా అన్నారు. ‘‘కీవ్‌లోనే ఉన్నా. ఇక్కడే ఉంటా. నా సైనికులతో కలిసి ఆక్రమణదారులను తుది రక్తపు బొట్టు దాకా ఎదుర్కొంటా’’ అంటూ వీరోచిత వీడియో సందేశంతో సైన్యంలో స్థైర్యం నింపారు. ఫిబ్రవరి 28: తొలి ఐదు రోజుల యుద్ధంలో ఉక్రెయిన్ విపరీతంగా నష్టపోయింది. కీవ్ విమానాశ్రయం కూడా రష్యా దళాల చేతికి వచ్చినట్టు కన్పించింది. ఇరు దేశాలు తొలి దఫా చర్చలు జరిపాయి. మార్చి 2: కీలకమైన రేవు పట్టణం మారియుపోల్‌ను రష్యా సేనలు చుట్టుముట్టాయి. ఖెర్సన్పైనా పట్టు సాధించాయి. 2014లో ఆక్రమించిన క్రిమియాకు రష్యా నుంచి భూమార్గాన్ని దాదాపుగా ఏర్పాటు చేసుకున్నాయి. రెండో దశ ఎదురుదెబ్బలు మార్చి 4: జపోరిజియా అణు విద్యుత్కేంద్రాన్ని రష్యా ఆక్రమించింది. ఈ క్రమంలో జరిగిన బాంబు దాడుల్లో ఓ రియాక్టర్ దెబ్బ తినడంతో యూరప్ మొత్తం వణికిపోయింది. మార్చి 6: రష్యా సైన్యానికి గట్టి ఎదురుదెబ్బలు తాకడం మొదలైంది. కీవ్‌లోకి వాటి రాకను అడ్డుకునేందుకు ఇర్పిన్ నదిపై బ్రిడ్జిని పేల్చేయడంతో రష్యా సేనల కదలికలు నెమ్మదించాయి. మార్చి 11: 40 మైళ్లకు పైగా పొడవున్న రష్యా సాయుధ శ్రేణి కీవ్కేసి సాగుతూ కన్పించింది. దాన్ని ఉక్రెయిన్ దళాలు అడుగడుగునా దాడులతో అడ్డుకుంటూ, నష్టపరుస్తూ చీకాకు పెట్టాయి. రష్యా సాయుధ వాహనాలపై తొలిసారిగా డ్రోన్ దాడులకు దిగాయి. ఆ ఫుటేజీని కూడా బయట పెట్టాయి. మారియుపోల్‌లో స్టీల్ ఫ్యాక్టరీని స్థావరంగా చేసుకుని భారీ ప్రతిఘటనకు ఉక్రెయిన్ దళాలు శ్రీకారం చుట్టాయి. 25వ రోజు మార్చి 22: రష్యాకు నష్టాలు నానాటికీ పెరగడం మొదలైంది. యుద్ధంలో వెనకంజ వేస్తున్న తొలి సంకేతాలు వెలువడ్డాయి. రష్యా సైన్యం వద్ద ఆహార, ఆయుధ నిల్వలు నిండుకున్నాయి. వాటికి సరఫరాలు కూడా సజావుగా అందని వైనం వెలుగులోకి వచ్చింది. సైనికులతో పాటు భారీ సంఖ్యలో ఉన్నతాధికారులు కూడా చనిపోతూ వచ్చారు. ‘యుద్ధంతో ఇప్పటిదాకా మేం సాధించిందేమీ లేద’ంటూ పుతిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ పెదవి విరిచారు! మూడో దశ వెనకడుగు, వ్యూహం మార్పు మార్చి 29: పోరులో ఉక్రెయిన్ పై చేయి సాధిస్తున్న వైనం స్పష్టమైంది. నాలుగు దఫాల చర్చల్లో ఏమీ తేలకపోయినా కీవ్, చెహిర్నివ్ నగరాల వద్ద సైనిక మోహరింపులను బాగా తగ్గిస్తామంటూ రష్యా అనూహ్య ప్రకటన చేసింది. ఉక్రెయిన్ సైన్యాల భారీ ప్రతిఘటనతో కీవ్‌ను ఆక్రమించలేకపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు చెప్పుకొచ్చారు. తూర్పున ఇప్పటికే సగానికి పైగా తమ అనుకూల వేర్పాటువాదుల అధీనంలో ఉన్న డోన్బాస్ను పూర్తిగా ఆక్రమించి యుద్ధానికి గౌరవప్రదంగా ముగింపు పలికేలా పుతిన్ వ్యూహం మార్చారు. 50వ రోజు ఏప్రిల్ 14: రష్యాకు యుద్ధ నౌక మాస్క్వాను ఉక్రెయిన్ నల్లసముద్రంలో ముంచేసి భారీ దెబ్బ కొట్టింది. డ్రోన్లతో దృష్టి మళ్లించి నెప్ట్యూన్ యాంటీ షిప్ మిసైల్‌తో చేసిన ఈ దాడిలో నౌకతో పాటు వందల మంది సిబ్బంది కూడా జలసమాధయ్యారు. రష్యా కోలుకునేదాకా ఒకట్రెండు వారాల పాటు యుద్ధ తీవ్రత కాస్త తగ్గింది. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల తీవ్రత మరింతగా పెరిగింది. 75వ రోజు మే 9: విక్టరీ డే సందర్భంగా యుద్ధానికి సంబంధించి పుతిన్ కీలక ప్రకటనలు చేస్తారని అంతా భావించినా ఆయన మాత్రం సాదాసీదా ప్రసంగంతోనే సరిపెట్టారు. నాలుగో దశ మారియుపోల్ పతనం మే13: డోన్బాస్లో కూడా రష్యా సేనలకు ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. డొనెట్స్ నది దాటే ప్రయత్నంలో ఉక్రెయిన్ దాడిలో భారీ సైనిక నష్టం చవిచూశాయి. ఖర్కీవ్ శివార్ల నుంచీ రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ దళాలు వెనక్కు తరిమాయి. మే 17: మూడు నెలల పోరాటం తర్వాత స్టీల్ ప్లాంటులోని సైనికులంతా లొంగిపోవడంతో మారియుపోల్ పూర్తిగా రష్యా వశమైంది. 98వ రోజు జూన్ 1: రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేయాలని యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. 99వ రోజు జూన్ 2: ఉక్రెయిన్‌కు అత్యాధునిక మధ్య శ్రేణి క్షిపణులు ఇవ్వాలని అమెరికా, ఇంగ్లండ్ నిర్ణయించాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
దద్దరిల్లుతున్న డోన్బాస్
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక హబ్ డోన్బాస్ ప్రాంతంపై దాడులను రష్యా ఉధృతం చేస్తోంది. అక్కడి లుహాన్స్క్ ప్రాంతంలోని క్రెమినా నగరాన్ని బలగాలు చుట్టుముట్టి ఆక్రమించుకున్నాయి. డోన్బాస్ విముక్తే లక్ష్యంగా తమ సైనిక చర్యలో తదుపరి దశ మొదలైందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. ‘‘క్రెమినాలో ఎటు చూసినా వీధి పోరాటాలే జరుగుతున్నాయి. నగరాన్ని రష్యా సైన్యం దాదాపుగా నేలమట్టం చేసింది’’ అని ఉక్రెయిన్ పేర్కొంది. సమీపంలోని మరో చిన్న పట్టణాన్ని కూడా రష్యా ఆక్రమించిందని చెప్పింది. డోన్బాస్కు రష్యా నుంచి మరో 50 వేల సైన్యం, భారీగా ఆయుధాలు తరలాయని అమెరికా పేర్కొంది. మారియుపోల్ పూర్తిగా వశమైతే అక్కడినుంచి మరో 10 వేల రష్యా సైన్యం డోన్బాస్కు తరలుతుందని అంచనా వేసింది. దీన్ని ‘డోన్బాస్‌పై యుద్ధం’గా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అభివర్ణించారు. తూర్పుపై గురి పెట్టడం ద్వారా యుద్ధంలో కీలకమైన రెండో దశకు రష్యా తెర తీసిందన్నారు. ఎంత సైన్యంతో వచ్చినా పోరాడతామని, డోన్బాస్ను కాపాడుకుని తీరతామని చెప్పారు. దక్షిణ ఉక్రెయిన్‌లో టార్చర్ చాంబర్లు ఏర్పాటు చేసి మరీ పౌరులను రష్యా సైన్యం హింసిస్తోందన్నారు. ఇతర చోట్లా భీకర దాడులు ఉక్రెయిన్‌లోని మిగతా ప్రాంతాల్లోనూ రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా కాస్త సురక్షితంగా ఉంటూ వచ్చిన లివీవ్ నగరంపైనా భారీగా బాంబు దాడులు జరిగాయి. వీటిలో ఏడుగురు మరణించారని, చాలామంది గాయపడ్డారని నగర మేయర్ చెప్పారు. ఉక్రెయిన్‌లో 20కి పైగా ఆయుధాగారాలు, కమాండ్ హెడ్క్వార్టర్లు, ఇతర సైనిక లక్ష్యాలను మంగళవారం క్షిపణులతో నేలమట్టం చేసినట్టు రష్యా ప్రకటించింది. రేవు పట్టణం మారియుపోల్‌లో స్టీల్ ప్లాంట్ లోపల ఉండి పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవాలన్న రష్యా ఆఫర్‌ను మరోసారి తిరస్కరించారు. దాంతో ప్లాంటుపై రష్యా సైన్యం బంకర్ బస్టర్ బాంబులు వేస్తోంది. ప్లాంటులో పౌరులు భారీగా తలదాచుకుంటున్నారని తెలిసి కూడా ఇందుకు తెగబడటం దారుణమని ఉక్రెయిన్ దుయ్యబట్టింది. మారియుపోల్‌లో 21,000 మంది మరణించారని చెప్పింది. ఈయూ దిశగా అడుగులు యూరోపియన్ యూనియన్‌లో ఉక్రెయిన్ చేరిక దిశగా అడుగులు వేగవంతమవుతున్నాయి. ఇం దుకు సంబంధించి ఈయూ ప్రశ్నావళికి సమాధా నాలను ఉక్రెయిన్‌లో ఈయూ రాయబారి మత్తీ మాసికాస్కు అధ్యక్షుడు జెలెన్స్కీ సమర్పించారు. ఈయూ సభ్యత్వం పొందితే యూరప్‌లో తామూ సమాన భాగస్వాములమన్న ఉక్రెయిన్‌వాసుల విశ్వాసం మరింత దృఢమవుతుందన్నారు. అయితే ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం లభిస్తే రష్యా మరింతగా రెచ్చిపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధరలు పెరిగాయి: పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి అనంతరం రష్యాలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. అయితే పశ్చిమ దేశాల ఆంక్షలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పుకొచ్చారు. ‘‘వాటిని తట్టుకుని నిలిచాం. పైగా ఆంక్షలు అమెరికా, యూరప్ దేశాలకే బెడిసికొట్టాయి. ఆ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు దిగజారాయి’’ అన్నారు. -
‘మాస్కోవా’ ఏం చెబుతోంది?
‘మీకు మీ గురించీ తెలియాలి... శత్రువు గురించీ తెలియాలి. అది కొరవడితే ప్రతి యుద్ధంలోనూ ఓటమి తప్పదు’ అంటాడు చైనా పురాతన సైనిక నిపుణుడు సన్ ట్జూ. ఉక్రెయిన్‌పై వెనకా ముందూ చూడకుండా విరుచుకుపడి దురాక్రమణకు సిద్ధపడిన రష్యాకు తన గురించి మాత్రమే కాదు... తన ప్రత్యర్థి గురించి కూడా ఏమీ తెలియదని ఇప్పటికే అందరికీ అర్థమైంది. ఈలోగా దురాక్రమణ యుద్ధం మొదలై యాభై రోజులు కావొస్తున్న తరుణంలో నల్ల సముద్రంలో లంగరేసిన రష్యా యుద్ధనౌక ‘మాస్కోవా’లో గురువారం ఉదయం హఠాత్తుగా పేలుళ్లు సంభవించి కుప్పకూలింది. ఉక్రెయిన్ దళాల దాడిలో అది నాశనమైందా... లేక అగ్ని ప్రమాదమే దాన్ని దహించిందా అన్నది వెంటనే తెలియకపోయినా ఈ ఉదంతం రష్యా సామర్థ్యాన్ని సందేహాస్పదం చేసింది. మాస్కోవా రష్యా అమ్ములపొదిలో ప్రధానమైన యుద్ధ నౌక. 16 సూపర్ సోనిక్ దీర్ఘ శ్రేణి క్షిపణులను మోసుకెళ్లగల, ప్రత్యర్థులపై అవిచ్ఛిన్నంగా ప్రయోగించగల సామర్థ్యమున్న యుద్ధ నౌక. 2015లో సిరియా సేనలకు మద్దతుగా రష్యా సైన్యం దాడులు నిర్వహించినప్పుడు, అంతకు చాన్నాళ్లముందు 2008లో దక్షిణ ఒసేతియా, అబ్ఖాజియా ప్రాంతాలపై రష్యా నిప్పుల వాన కురిపించినప్పుడు మాస్కోవా పాత్రే ప్రధానమైనది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై విరుచుకుపడి నల్ల సముద్రంలోకి ఆ దేశ నావికాదళం ప్రవేశించకుండా చూడటంలోనూ మాస్కోవాదే కీలకపాత్ర. పైగా ఈ మహమ్మారి నౌకను ముంచింది ఉక్రెయిన్‌కు చెందిన చిన్నపాటి మానవరహిత యుద్ధ విమానం అంటున్నారు. మాస్కోవా లాంటి భారీ యుద్ధ నౌకను ఇలా దెబ్బతీయడం అసాధారణమైంది. ఆ నౌకను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు అందులో పటిష్టమైన ఆత్మరక్షణ వ్యవస్థ ఉంటుంది. వాయుమార్గంలో రాగల ఎలాంటి ప్రమాదాన్నయినా దూరంలో ఉండగానే రాడార్లు పసిగడతాయి. ఆ వెంటనే ఆత్మరక్షణ వ్యవస్థ అప్రమత్తమై క్షిపణుల్ని ప్రయోగించి వాటిని ధ్వంసం చేస్తుంది. కానీ ఉక్రెయిన్ వ్యూహం ముందు మాస్కోవా నిస్సహాయగా మారింది. దాడి జరిగిన రోజు ఆ ప్రాంతంలోని కల్లోల వాతావరణాన్ని ఉక్రెయిన్ సానుకూలంగా మలుచుకుని దొంగ దెబ్బ తీయగలిగిందంటున్నారు. ఈ కథనాలు నిజమే అయితే మాస్కోవాతోపాటు రష్యా పరువు కూడా నల్లసముద్రం పాలైనట్టే. నల్ల సముద్ర ప్రాంతం రష్యాకు అనేకవిధాల కీలకమైనది. అటు మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించేందుకు ఉపయోగపడటంతోపాటు ఇటు నాటో దేశాలతో అదొక తటస్థ ప్రాంతంగా ఉంటున్నది. నల్లసముద్రానికి తూర్పున రష్యా, జార్జియా, దక్షిణాన టర్కీ, పశ్చిమాన రుమేనియా, బల్గేరియాలుంటే... ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో ఉక్రెయిన్ ఉంటుంది. అక్కడ రష్యా యుద్ధ నౌకల సంచారానికి రెండున్నర శతాబ్దాల చరిత్ర ఉంది. అనేకానేక రష్యా యుద్ధ నౌకలు మోహరించి ఉండే ప్రాంతంలో ఒక ప్రధాన యుద్ధ నౌకను గురి చూసి కొట్టడమంటే మాటలు కాదు. ఏం మాట్లాడాలో తెలియని అయోమయ స్థితిలో రష్యా పడిపోవడం స్పష్టంగా కనబడుతోంది. నౌకలో ఉంచిన ఆయుధాలు పేలడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనీ, నౌకలో ఉన్న 500 మంది నావికాదళ సభ్యులనూ సురక్షితంగా తీసుకురాగలిగామనీ రష్యా అధికారికంగా చెబుతోంది. క్షిపణి వాహకాలు సురక్షితంగా ఉన్నాయంటున్నది. గత నెలలో రష్యా ఆక్రమించుకున్న బెర్డిన్స్క్లోని అజోవ్ నౌకాశ్రయంలో ఉన్న ఆ దేశ యుద్ధ నౌకను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. కానీ ఇంత వరకూ దానిపై రష్యా పెదవి విప్పలేదు. మాస్కోవా ఉదంతం అనేకవిధాల రష్యాను కుంగదీసింది. నల్ల సముద్ర ప్రాంతంలో రష్యా మోహరించిన నౌకలను చూసి నాటో దేశాలు బెంబేలెత్తేవి. దాంతో లడాయి బయల్దేరితే అది సమస్యాత్మకమవుతుందని భయపడేవి. రష్యా సైతం అక్కడి నౌకా శ్రేణులను గర్వకారణంగా భావించుకునేది. కానీ మాస్కోవా దెబ్బతినడంతో అదంతా గాలికి కొట్టుకుపోయింది. ఈ ఉదంతం వల్ల ఆ దేశం పైకి కనిపించేంత శక్తిమంతమైనది కాదనీ, దానికి యుద్ధ సంసిద్ధత సరిగా లేదనీ అందరికీ తేటతెల్లమైంది. అలాగే రష్యా తయారీ రక్షణ సామాగ్రి సామర్థ్యాన్ని మాస్కోవా ఉదంతం ప్రశ్నార్థకం చేస్తున్నది. ఏ దేశం ఉత్పత్తి చేసే రక్షణ సామగ్రికి ఏపాటి శక్తిసామర్థ్యాలున్నాయో నిగ్గుతేలేది యుద్ధ భూమిలోనే. ఆచరణలో ఏదైనా సరిగా అక్కరకు రావడం లేదని తేలితే ఆ రక్షణ సామగ్రికి గిరాకీ పడిపోతుంది. ఇప్పుడు మాస్కోవా ఉదంతం రష్యా తయారీ యుద్ధ నౌకల విషయంలో అలాంటి సందేహాలనే రేకెత్తిస్తోంది. వర్తమాన నాగరిక యుగంలో యుద్ధాలు దేనికీ పరిష్కారం కాదు. దురాక్రమణ ప్రారంభించిన నాటినుంచీ ఆంక్షల చట్రంలో చిక్కుకుని రష్యా ఆర్థికంగా విలవిల్లాడుతోంది. ఇప్పుడిప్పుడే దాని తాలూకు సెగలు అక్కడ కనబడుతున్నాయి. తనకున్న అపార చమురు, సహజవాయు నిక్షేపాలను ఎగుమతి చేస్తూ లక్షలాదిమందికి ఉపాధి కల్పించడంతోపాటు ఆర్థికంగా సుస్థిరమైన స్థానంలో ఉన్న రష్యాకు ఈ దురాక్రమణ గుదిబండలా మారింది. అటు రష్యా దాడుల పరంపరతో ఉక్రెయిన్ జనావాసాలన్నీ నాశనమవుతున్నాయి. వేలాదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ అన్నివిధాలా దెబ్బతింది. ఇప్పటికైనా యుద్ధం వల్ల కలిగే అపారమైన నష్టాన్ని అందరూ గుర్తించాలి. ఇదిలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధంగా ముదిరి, అణ్వాయుధాల ప్రయోగం వరకూ పోయే ప్రమాదం ఉన్నదని అమెరికాతోసహా అందరూ అర్థం చేసుకోవాలి. ఆయుధ సరఫరా కాదు... తక్షణ శాంతికి మార్గం వెదకాలని గ్రహించాలి. -
ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు: పుతిన్ వార్నింగ్
మాస్కో: ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించాడు. యుద్దంలో ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే ఉద్ధేశ్యం రష్యాకు లేదన్నారు. రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యత వహించాలని అన్నారు. వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరులకు రక్షణకు మిలటరీ ఆపరేషన్ మొదలైనట్లు తెలిపారు. ఉక్రెయిన్ను నాటోలో చేర్చవద్దనేది తమ డిమాండ్ అని పేర్కొన్నారు. అయితే తమ డిమాండ్‌ను అమెరికా, మిత్ర దేశాలు విస్మరించాయని అన్నారు. ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలి: పుతిన్ ఇక ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ మొదలైందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఖర్కిన్, ఒడేస్సా, మరియూపోల్‌లో మిస్సైల్స్‌తో దాడి చేస్తోంది. రష్యా స్వతంత్ర దేశంగా గుర్తించిన డోన్బాస్లోకి రష్యా సేనలు చేరుకున్నాయి. దీంతో డోన్బాస్లో ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలని పుతిన్ ఆదేశించారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. ఉక్రెయిన్ వేర్పాటువాదులు లొంగిపోవాలని పుతిన్ హెచ్చరించారు. చదవండి: ఇక మాటల్లేవ్.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యా రష్యా దాడులను తిప్పికొడతాం: ఉక్రెయిన్ ఇప్పటికే ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు 3 వైపులా బలగాలను రష్యా మోహరించింది. ఉక్రెయిన్ సరిహద్దులకు యుద్ధ ట్యాంక్‌లను తరలించింది. ఎయిర్‌స్పేస్‌ను మూసేసింది. అయితే రష్యా దాడులను తిప్పికొడతామని హెచ్చరించింది. యుద్ధంలో రష్యాపై విజయం సాధిస్తామని పేర్కొంది. చదవండి: రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభావం మనపై ఎంత? -
మయన్మార్‌లో ఎమర్జెన్సీ: బందీగా ఆంగ్ సాన్ సూకీ
సాక్షి,న్యూఢిల్లీ: మయన్మార్‌లో అనూహ్య పరిణామాలు ప్రకంపనలు పుట్టించాయి. అత్యవసర పరిస్థితుల్లో ఒక సంవత్సరం పాటు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేశ సైన్యం తన సొంత టెలివిజన్ ఛానల్ ద్వారా ప్రకటించింది. గత 50 ఏళ్లుగా సైన్యం చేతిలోనే మగ్గి తేరుకున్న ఆ దేశంలో తిరిగి సైనిక తిరుగుబాటుతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దేశంలో ఏడాది పాటు ఎమర్జెన్సీ ప్రకటించిన సైన్యం నేషనల్ లీగ్ ఫర్ డెమెక్రసీ నేత ఆంగ్ సాన్ సూకీని అదుపులోకి తీసుకోవడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేకాదు దేశమంతటా ఇంటర్నెట్ సేవలను ఆర్మీ నిలిపివేసింది. దీంతో అనేక మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు కూడా పనిచేయడంలేదు. సోమవారం సైనిక చర్య అనంతరం అంగ్ సాన్ సూకీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దేశం తమ పాలనలోకి వచ్చేసిందని ఆర్మీ ప్రకటించింది. ఎన్నికల అనంతరం అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మిలటరీకి మధ్య ఉద్రిక్తతల రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున సైనికులు దాడి జరిపి అంగ్ సాన్ సూకీతో పాటు ఆ పార్టీ కి చెందిన ఇతర సీనియర్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ ప్రతినిధి వెల్లడించారు.. గత నవంబర్‌లో నిర్వహించిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైన్యం ఆరోపించింది. ఈ ఆరోపణలను ఇప్పటికే సూకీ ప్రభుత్వం ఖండించింది. మరోవైపు అయితే మిలటరీ చర్యపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రజాస్వామ్యం నెలకొల్పే దిశగా జరిగిన ప్రయత్నాలను అడ్డుకుంటే సహించేది లేదని ప్రకటించింది. అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని, ఎన్నికల ఫలితాలను గౌరవించాలని మయన్మార్ సైన్యాన్ని కోరింది. దేశంపై నియంత్రణ కోసం మిలటరీ మరోసారి ప్రయత్నిస్తోందని ఆరోపించిన ఆస్ట్రేలియా ప్రజలు ఎన్నుకున్న నేత అంగ్ సాన్ సూకీ సహా ఇతర నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. -
నిరసనలపై మండిపడ్డ ట్రంప్
వాషింగ్టన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో రగిలిన అశాంతి, దావానలంలా రగులుతోంది. అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌వద్ద భారీ స్థాయిలో నిరసన చెలరేగడంతో భారీ ఎత్తున సైన్యాన్ని రంగంలోకి దించుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రాజధాని నగరంలో హింసాత్మక నిరసనలను అరికట్టడానికి అదనపు బలగాలను పంపుతున్నామన్నారు. (అమెరికాలో ఆగ్రహపర్వం) జార్జ్ ఫ్లాయిడ్ మృతితో దేశవ్యాప్తంగా నిరసన పేరుతో నగరంలో చాలా అమర్యాదకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయని, అవి శాంతియుత నిరసనలు కావంటూ మండిపడ్డారు. ఈ అల్లర్లను దేశీయ ఉగ్రవాద చర్యలుగా ఆయన పేర్కొన్నారు. వాషింగ్టన్లో అల్లర్లు, దోపిడీలు, దాడులు, ఆస్తి విధ్వంసాలను ఆపడానికి వేలాది మంది సాయుధ సైనికులు, ఇతర పొలీసు అధికారులను పంపిస్తున్నానని ప్రకటించారు. (భగ్గుమన్న అగ్రరాజ్యం: వైట్‌హౌస్ వద్ద ఉద్రిక్తత) అంతేకాదు శాంతిభద్రతల అధ్యక్షుడిగా తనని తాను ప్రకటించుకున్న అమెరికా అధ్యక్షుడు ఆస్తులను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, హింసను నియంత్రించడానికి వీలైనంత ఎక్కువ నేషనల్ గార్డ్ దళాలను ఉపయోగించాలని గవర్నర్లను ట్రంప్ కోరారు. అలాగే అలర్లకు పరోక్షంగా ఆయా రాష్ట్రాల గవర్నర్లే కారణమని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది గవర్నర్లు శక్తిహీనులుగా మారారని మండిపడ్డారు. అల్లర్లు జరిగిన చారిత్రాత్మక సెయింట్ జాన్ చర్చిని, రెండో ప్రపంచ యుద్ధం స్మారక కట్టడాన్ని ట్రంప్ సందర్శించారు. -
ఇరాన్‌పై సౌదీ రాజు సంచలన వ్యాఖ్యలు
ఇరాన్‌ను అరికట్టడానికి ప్రపంచ దేశాలు కలిసి రాకపోతే మునుపెన్నడూ చూడనంత గరిష్ఠ స్థాయికి ఇంధన ధరలు చేరే అవకాశముందని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరించారు. చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అలాగే చమురు ధరలు మన జీవితకాలంలో చూడని అనూహ్య రీతిలో పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. సీబీఎస్ టీవీ ఛానల్లో ‘60 మినిట్స్’ ఇంటర్వ్యూలో మహమ్మద్ బిన్ సల్మాన్ కార్యక్రమం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ విషయంలో ప్రపంచం కఠిన చర్యలు తీసుకోనిపక్షంలో పరిస్థితులు మరింత తీవ్రంగా మారతాయని మహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరించారు. ముఖ్యంగా సైనిక చర్యకంటే..రాజకీయపరమైన, శాంతియుత పరిష్కారమే మంచిదని తాము భావిస్తున్నామంటూ ప్రకంపనలు రేపారు. ఇరాన్‌తో యుద్ధం చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, ఇది ప్రపంచ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈనేపథ్యంలోనే ఆ దేశంతో శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు విఘాతం కలుగుతుందని, తద్వారా ఇంధన ధరలు జీవితంలో మునుపెన్నడూ చూడనంత గరిష్ఠ స్థాయికి చేరే ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించారు. సౌదీలో ఆయిల్ రిఫైరీపై ఈ నెల 14న జరిగిన క్షిపణి దాడులు ఇరాన్ చర్యేనని సౌదీ ఆరోపిస్తోంది. మరోవైపు సౌదీలోని ఆయిల్ రిఫైనరీపై జరిగిన డ్రోన్ దాడుల వెనుక ఇరాన్ ప్రమేయమున్నట్లు సౌదీ అరేబియాతో పాటు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఇరాన్ తమ ప్రమేయం లేదని ఇరాన్ కొట్టిపారేసింది. కాగా ఏడాది క్రితం జరిగిన వాషింగ్టన్ పోస్టు కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యలో తన ప్రమేయం లేదని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ స్పష్టంచేశారు. అయితే సౌదీ రాజ్యాధినేతగా ఖషోగ్గి హత్యకు తాను పూర్తి బాధ్యతవహిస్తున్నట్లు స్పష్టంచేశారు. సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీపై క్షిపణి దాడుల నేపథ్యంలో సౌదీ-ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ఖతార్ బిత్తిరి చర్య.. సౌదీ వార్నింగ్
రియాద్: ఏడాది క్రితం మొదలైన గల్ఫ్ దేశాల మధ్య ముసలం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. శాంతి వాతావరణాన్ని దెబ్బ తీస్తూ రష్యా నుంచి శక్తివంతమైన క్షిపణులను కొనుగోలు చేసేందుకు ఖతార్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అలాంటి పరిస్థితే గనుక ఉత్పన్నం అయితే సైనిక చర్య తప్పదని ఖతార్‌ను హెచ్చరించింది. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు సౌదీ రాజు సల్మాన్ ఓ లేఖ రాయగా.. అందులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ ఉగ్రవాదానికి ఊతమిస్తోందన్న ఆరోపణలతో గతేడాది జూన్‌లో సౌదీ అరేబియా సహా బెహ్రయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లు ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. గల్ఫ్ దేశాల పరస్పర సహకార మండలి(జీసీసీ) దేశాలన్నీ ఖతార్‌పై ఆంక్షలు కూడా విధించాయి. ఒకవేళ ఆంక్షలు తొలగించాలంటే మాత్రం 13 డిమాండ్ల(టర్కీ మిలిటరీ స్థావరాలను ఎత్తివేయటం, అల్ జజీరా మీడియా నెట్ వర్క్ అనుమతుల రద్దు తదితరాలు ఇందులో ఉన్నాయి)తో కూడిన ఒప్పందంపై సంతకం చేయాలన్న నిబంధన విధించాయి. అయితే దోహా(ఖతార్ రాజధాని) మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ డిమాండ్లకు నిరాకరించింది. ఒంటరిగా మారిన ఖతర్ తర్వాత రష్యాతో కొత్తగా స్నేహాన్ని మొదలుపెట్టింది. అంతేకాదు ఆయుధాల కొనుగోలు, దౌత్యపరమైన ఒప్పందాలను కూడా చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో రష్యా నుంచి ఎస్-400 డిఫెన్స్ మిసైల్ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపింది. తాజాగా రష్యా రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు ఈ డీల్ గురించి బహిరంగంగా ప్రస్తావించటంతో సౌదీ అప్రమత్తమైంది. ఒప్పందం కనుక కుదుర్చుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తూనే.. మరోవైపు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఫ్రాన్స్‌ను కోరుతోంది. అయితే ఈ లేఖపై ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయం స్పందించాల్సి ఉంది. -
ఉత్తర కొరియాపై సైనిక చర్యకు సిద్ధం: ట్రంప్
వాషింగ్టన్: అణ్వస్త్ర పరీక్షలతో దూకుడుగా వ్యవహరిస్తున్న ఉత్తర కొరియాపై సైనిక చర్యకు తాము సిద్ధంగా ఉన్నామనీ, అయితే ఆ మార్గాన్ని తాము ఇంకా ఎంచుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఉ.కొరియాను అణు నిరాయుధీకరించడంలో ఇతర దేశాలు కూడా తమతో కలవాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ‘సైనిక చర్యకు మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం. కానీ దానిని ఇంకా మేం ఎంచుకోలేదు. మేం సైనిక చర్య చేపడితే మాత్రం అది విధ్వంసకరంగా ఉంటుంది. ఉ.కొరియా తీరు మార్చుకోకపోతే, మేం ఆ పనే చేయాల్సి ఉంటుంది’ అని ట్రంప్ స్పెయిన్ ప్రధాని మరియానో రజోయ్‌తో కలసి పాల్గొన్న విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. -
ఇక సమరమేః ట్రంప్
వాషింగ్టన్: ఉత్తర కొరియాపై సైనిక చర్యకు అమెరికా సర్వ సన్నద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కొరియా అణు కార్యకలాపాలకు దూరంగా ఉండేలా బాధ్యతాయుత దేశాలన్నీ ఏకమవ్వాలని పిలుపు ఇచ్చారు. అమెరికా బాంబర్లను కూల్చివేయడం ద్వారా తమను తాము రక్షించుకుంటామని ఉత్తర కొరియా పేర్కొన్న నేపథ్యంలో ట్రంప్ కొరియాను గట్టిగా హెచ్చరించారు. దౌత్య, ఆర్థిక చర్యలకు బదులు తాము మరో ప్రత్యామ్నాయం ఎంచుకుంటే అది ఉత్తర కొరియా విధ్వంసానికి దారితీస్తుందని అన్నారు. ఉత్తర కొరియా నేత కిమ్ తీరు బాగా లేదని ట్రంప్ ఆరోపించారు. ఉత్తర కొరియాలో పరిస్థితిని దశాబ్ధాల కిందటే పరిష్కరించాల్సి ఉందని, అమెరికా గత పాలకుల నిర్లక్ష్యంతో ఇప్పుడు తాను ఈ పనికి ఉపక్రమించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియాపై అమెరికా పలు ఆంక్షలు విధించినా అణు పరీక్షల నుంచి కొరియా వెనక్కి తగ్గకపోవడంతో కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. -
మొత్తం నాశనం చేస్తా.. ఖబడ్దార్!
-
మొత్తం నాశనం చేస్తా.. ఖబడ్దార్!
ఉత్తర కొరియాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక ► ఆత్మహత్య మిషన్‌లో కిమ్ జోంగ్ ఉన్ ► ఐక్యరాజ్య సమితి వేదికగా ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు ► సహనంగా ఉంటున్నాం.. మా మిత్రులను ఇబ్బందిపెడితే సహించం ► ఉగ్రవాదులకు సాయం వద్దు.. పాకిస్తాన్‌కూ పరోక్ష హెచ్చరిక ► సార్వభౌమత్వానికి కొత్త నిర్వచనమిస్తామన్న ట్రంప్ ఐక్యరాజ్యసమితి: ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ తమను రెచ్చగొడుతూ ఉంటే.. ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఉత్తర కొరియాపై కఠినంగా వ్యవహరించేందుకు అన్ని దార్లూ తెరిచే ఉన్నాయని స్పష్టం చేశారు. ఉ.కొరియా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులను తయారుచేసుకుంటూ.. మిగిలిన ప్రపంచాన్ని హెచ్చరిస్తూ మానవాళికి ప్రమాదకరంగా మారిందన్నారు. మంగళవారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో తొలిసారి ప్రసంగించిన ట్రంప్.. ఉ.కొరియాపై సైనికచర్య ప్రారంభించేందుకు ఏమాత్రం సంకోచించబోమని తేల్చిచెప్పారు. భూమండలంపై ఏ దేశంలోనూ కిమ్ జోంగ్ ఉన్ వంటి అణ్వాయుధాలు, మిసైళ్లు కలిగిన నేరస్తులుండరన్నారు.కిమ్‌ను రాకెట్ మ్యాన్‌గా సంబోధించిన ట్రంప్.. ‘అమెరికా బలమైన, సహనశీలమైన దేశం. కానీ మా మిత్రులను కాపాడుకునేలా తప్పనిసరి పరిస్థితులు కల్పిస్తున్నారు. మా దగ్గర ఉత్తర కొరియాను పూర్తిగా నాశనం చేయటం మినహా వేరే ప్రత్యామ్నాయం లేదు. రాకెట్ మ్యాన్ ఆత్మహత్య మిషన్‌లో ఉన్నారు’ అని ట్రంప్ హెచ్చరించారు. ‘శాంతి కోసం మేం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడా అవసరం లేదనిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి ఉన్నదే అందుకోసం. చూద్దాం వారేం చేస్తారో?’ అని ట్రంప్ పేర్కొన్నారు. అణ్వాయుధాలు పక్కనపెడితేనే.. తమ భవిష్యత్తు బాగుండాలంటే.. అణ్వస్త్రరహితంగా మారటమొక్కటేనని ఉత్తరకొరియా గుర్తించాలన్నారు. ఇటీవలే ఉ.కొరియాపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ భద్రతామండలి 15–0తో ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్నీ ట్రంప్ గుర్తుచేశారు. ఈ ఆంక్షల విషయంలో ముందుకొచ్చిన భద్రతామండలి శాశ్వత సభ్యులు చైనా, రష్యాలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ‘దీనిపై మరింత స్పందన అవసరం. మనమంతా కలసి కిమ్ దేశం విరుద్ధమైన ఆలోచనలనుంచి బయటకు వచ్చేంతవరకు ఏకాకిని చేయాలి. ఇది ఒక్క కొరియాకే కాదు.. అమెరికాను చంపేస్తా, ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేస్తా, వివిధ దేశాధినేతలను చంపేస్తాననే ప్రతి ఒక్కరితోనూ ఇదే విధంగా వ్యవహరించాలి’ అని ట్రంప్ సమావేశానికి హాజరైన సభ్యదేశాల ప్రతినిధులను కోరారు. ఉగ్రసాయాన్ని ఉపేక్షించం ఈ ప్రసంగంలోనే పరోక్షంగా పాకిస్తాన్‌పై ట్రంప్ నిప్పులు కక్కారు. ఉగ్రవాదానికి సాయం చేస్తున్న దేశాలను గుర్తించి వారిని బాధ్యులుగా చేయాలన్నారు. ‘ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని, ఉగ్ర సాయాన్ని ఆపేయాలి. మా దేశానికి, ఆ మాటకొస్తే ప్రపంచానికి సవాల్ విసురుతున్న ఉగ్రవాదాన్ని మేం సహించం. వీరికి సాయంచేస్తున్న దేశాల కుట్రను బట్టబయలు చేయాలి. అల్‌కాయిదా, హిజ్బుల్, తాలిబాన్ వంటి పలు ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించటం, ఆర్థిక, శిక్షణాపరమైన సాయం చేయటాన్ని పూర్తిగా మానుకోవాలని పరోక్షంగా పాక్‌ను హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అమెరికా, మిత్రదేశాలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ‘తాలిబాన్ సహా ఇతర ఉగ్రవాద సంస్థలపై అనుసరించిన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశాను’ అని ట్రంప్ వెల్లడించారు. గత నెలలో పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటం మానుకోవాలంటూ ట్రంప్ నేరుగా తీవ్రస్థాయిలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. అమెరికా ఫస్ట్ తమ ప్రభుత్వం ‘అమెరికా ఫస్ట్’ నినాదంతోనే వెళ్తోందని.. మిగిలిన దేశాలు కూడా తమ తమ ప్రాథమ్యాలను గుర్తించి ముందుకెళ్లాలని ట్రంప్ సూచించారు. ఉమ్మడి సమస్య విషయంలో కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పలు దేశాలు కలసి వివిధ కూటముల ఏర్పాటు కన్నా.. సార్వభౌమ దేశాలుగా ఉండటమే మేలని సూచించారు. సార్వభౌమత్వానికి త్వరలో కొత్త నిర్వచనం ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ‘మా పౌరులు, వారి అవసరాలు తీర్చటం, వారికి భద్రత కల్పించటం, హక్కులను కాపాడటమే మా ప్రభుత్వ తొలి బాధ్యత. అమెరికా అధ్యక్షుడిగా అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని నేనెప్పటికీ ముందుంచే ప్రయత్నం చేస్తాను’ అని ట్రంప్ చెప్పారు. -
'మేం దిగితే ఉత్తర కొరియాకు దుర్దినమే'
వాషింగ్టన్: ఉత్తర కొరియాపై సైనిక చర్య చేపట్టడం తమ ఉద్దేశం కాదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒక వేళ తాము ఆ పని చేపట్టిన రోజు మాత్రం ఉత్తర కొరియాకు దుర్దినం అవుతుందని, ఆ రోజును వారు ఎప్పటికీ మర్చిపోలేరని బెదరగొట్టారు. తాజాగా ఉత్తర కొరియా ఆరోసారి అణ్వాయుధాల పరీక్షలు చేపట్టిన నేపథ్యంలో అమెరికా సైనిక చర్య చేపట్టనుందా అనే అంశంపై ఆయన ఈవిధంగా క్లారిటీ ఇచ్చారు. అమెరికా ఉన్న పలంగా ఉత్తర కొరియాకు ఆర్థిక పరంగా విడుదల చేయాల్సినవి ఎందుకు ఆపేసిందని ప్రశ్నించగా ఆ దేశం చాలా చెడుగా ప్రవర్తిస్తుందని, అందుకే వాటిని ఆపేశామని అన్నారు. 'సైనిక చర్య కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఉంది. అయితే, ఆహ్వానించదగినదా? ఏ మాత్రం కాదు?. మిలటరీ యాక్షన్ ద్వారా నేను ముందుకు వెళ్లాలని అనుకోవడం లేదు. అదే జరిగితే ఉత్తర కొరియాకు దుర్దినమే' అని ట్రంప్ చెప్పారు. -
ఉత్తర కొరియాపై సైనిక చర్య ఉండదు, కానీ...
- జింగ్ పిన్ తో ట్రంప్ ఫోన్ కాల్ - అగ్ర రాజ్యాలకు ఐరాస పిలుపు సాక్షి, వాషింగ్టన్: అణు పరీక్షలతో ఐక్యరాజ్య సమితికి సైతం విసుగు పుట్టిస్తున్న ఉత్తర కొరియా వ్యవహారంపై అమెరికా ఆచీ తూచీ వ్యవహరించబోతున్నట్లు అర్థమౌతోంది. ఉ.కొ. పై ఉన్నపళంగా సైనిక చర్యలు చేపట్టబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. ఉత్తర కొరియా ఈ మధ్య నిర్వహించిన అణు పరీక్షల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జింగ్ పిన్ బుధవారం ఫోన్లో ట్రంప్‌తో చర్చించారు. వారి సంభాషణలను ఉటంకిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థ విషయాలను వెల్లడించింది. సైనిక చర్య విషయంపై జింగ్ ప్రశ్నించగా.. అది తమ తొలి నిర్ణయం కాదని ట్రంప్ బదులిచినట్లు సమాచారం. ‘సూటిగా చెప్పాలంటే ఇది చాలా ముఖ్యమైన ఫోన్ కాల్. ఉ.కొ. విషయంలో నేను.. జింగ్ పింగ్ ఒకే అభిప్రాయంతో ఉన్నాం’ అని ట్రంప్ తెలిపారు. కిమ్ సామ్రాజ్యంలో ఏం జరుగుతుందో బాహ్యా ప్రపంచానికి తెలీని పరిస్థితి నెలకొందని, అతనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని జింగ్ పిన్ తనతో చెప్పినట్లు ట్రంప్ వివరించారు. అయితే సైనిక చర్యను పరిస్థితులు చేజారితే మాత్రం సైనిక చర్యలను చేపట్టవచ్చనే విషయాన్ని మాత్రం ట్రంప్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక రాజకీయాలకతీకంగా అగ్ర దేశాలన్నీ ఏకమై ఉత్తర కొరియా అణు పరీక్షల అంశంలో జోక్యం చేసుకోవాలంటూ ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అమెరికాకు త్వరలో మరిన్ని బహుమతులు (అణు ఆయుధాలు) పంపుతామంటూ ఉత్తర కొరియాకు చెందిన ఓ భద్రతా అధికారి హెచ్చరించిన కొన్ని గంటలలోపే ఐరాస శాంతి స్థాపనకు తాము ఎంత దూరమైన వెళ్తామని వ్యాఖ్యానించటం విశేషం. -
సైనిక చర్యకు వెనకాడం
ఉత్తర కొరియాకు అమెరికా హెచ్చరిక ఐక్యరాజ్యసమితి: ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తరకొరియాపై సైనిక చర్యకు వెనకాడబోమని అమెరికా హెచ్చరించింది. ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఉన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న చైనా, రష్యాల తీరును కూడా దుయ్యబట్టింది. బుధవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉత్తరకొరియా పరిణామాలపై జరిగిన అత్యవసర సమావేశంలో యూఎన్‌లో అమెరికా రాయబారి నిక్కీహేలీ మాట్లాడుతూ...ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణిని పరీక్షించడం ప్రపంచమంతటికీ ప్రమాదకరమని అన్నారు. చైనా కంపెనీలపై ఆంక్షలు!: ఉత్తరకొరియా కట్టడికి అమెరికా కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. వాటిలో ఆ దేశంతో వ్యాపార లావాదేవీలు నిర్వర్తిస్తున్న చైనా కంపెనీలపై ఆంక్షలు విధించడం ఒకటి. ఉత్తరకొరియా తన 90 శాతం వాణిజ్యాన్ని చైనాతోనే జరుపుతోంది. అమెరికా గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసినా చైనాకున్న పలుకుబడి వల్ల వెనక్కి తగ్గింది. ఎన్నికల్లో రష్యా పాత్ర వార్సా: గతేడాది జరిగిన ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుని ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఇతర దేశాలకూ ఇందులో పాత్ర లేదని కొట్టిపారేయలేమన్నారు.‘ సులువుగా చెప్పేయొచ్చ. అది రష్యా కావొచ్చు. ఇతర దేశాలు కావొచ్చు. కచ్చితంగా చెప్పలేం ఎవరి పనో. కానీ ఎన్నికల్లో చాలా మంది పాత్ర ఉందని అనుకుంటున్నా’ అని ట్రంప్ గురువారం వార్సా పర్యటనలో వ్యాఖ్యానించారు. గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌కు ప్రయోజనం కలిగేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రచారాన్ని ప్రభావితం చేశారని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.