nuclear tests
-
ఇరాన్ భూగర్భ అణుపరీక్షలు?
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఇరాన్ మరింత పరాకాష్టకు తీసుకెళ్తోందా? అందులో భాగంగా తాజాగా అణు పరీక్షలు నిర్వహించిందా? అక్టోబర్ 5న శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపుగా ఒకే సమయంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు తావిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:45 ప్రాంతంలో ఇరాన్‌లోని అరదాన్ నగర సమీపంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. అక్కడికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు అమెరికా భూ¿ౌతిక సర్వే విభాగం ధ్రువీకరించింది. తర్వాత కొద్ది నిమిషాలకే ఇజ్రాయెల్‌లోనూ ప్రకంపనలు కన్పించాయి.యి. ఇది భూకంపం కాదని, కచి్చతంగా భూగర్భ అణు పరీక్షల పర్యవసానమేనని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. భూకంపం సంభవించింది అణు ప్లాంట్‌కు అతి సమీపంలోనే అంటూ వస్తున్న వార్తలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. భూ కంప కేంద్రం ఉపరితలానికి కేవలం 10 కి.మీ. లోపల ఉండటం చూస్తుంటే భూగర్భ అణు పరీక్షలు జరిగి ఉంటాయని అంటున్నారు. -
మళ్లీ అణు పరీక్షల బాటలో రష్యా!
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం ఇప్పటికే దీర్ఘకాలిక పోరుగా మారిపోయిన నేపథ్యంలో ఆ దేశానికి పాశ్చాత్య దేశాల సాయానికి అడ్డుకట్టే వేసేందుకు అవసరమైతే అణు పరీక్షలు జరిపేందుకు రష్యా సిద్ధమవుతోందా? తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అంతర్జాతీయ సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందానికి ఆమోదాన్ని వెనక్కు తీసుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు రష్యా పార్లమెంట్ డ్యూమా దిగువ సభ తుది ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన సమావేశంలో చట్టసభ సభ్యులంతా ఏకగ్రీవంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ బిల్లు వచ్చే వారం ఎగువ సభ అయిన ఫెడరేషన్ కౌన్సిల్ ముందుకు వెళ్లనుంది. 2000 నాటి ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటామని పుతిన్ ఇటీవలే ప్రకటించడం తెల్సిందే. 1996లో తెరపైకి వచి్చన ఈ ఒప్పందం ఏ దేశమూ ప్రపంచంలో ఎక్కడా అణు దాడులు చేయకూడదు. అయితే ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. రష్యా మాత్రమే దీనికి పూర్తి ఆమోదం తెలిపింది. అమెరికా, భారత్, పాకిస్థాన్, ఉ.కొరియా తదితర దేశాలేవీ దీనికి ఆమోదం తెలపలేదు. రష్యా వీలైనంత త్వరగా మళ్లీ అణు పరీక్షలకు దిగి సత్తా చాటాలని ఆ దేశ రాజకీయ వర్గాల నుంచి పుతిన్‌పై ఒత్తిడి పెరిగిపోతోంది. -
అణు పరీక్ష ప్రయత్నాల్లో అమెరికా
వాషింగ్టన్: దాదాపు 28 ఏళ్ల తర్వాత అమెరికా మరోసారి అణు పరీక్ష జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రష్యా, చైనాలకు గట్టి హెచ్చరికలు పంపడమే దీని లక్ష్యమని ‘వాషింగ్టన్ పోస్ట్’తన కథనంలో పేర్కొంది. అణు పరీక్ష నిర్వహించడంపై 15న∙ప్రభుత్వ యంత్రాంగం చర్చించింది. చర్చల్లో అంతిమ నిర్ణయం తీసుకోలేదు. ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నదీ లేనిదీ వెల్లడి కాలేదని అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలోని ఓ అధికారి, ఇద్దరు మాజీ అధికారులు వెల్లడించారని ఆ కథనంలో పేర్కొంది. ర్యాపిడ్ టెస్ట్‌తో తన సామర్థ్యాన్ని ప్రదర్శించుకోవడం ద్వారా రష్యా, చైనాలను అమెరికా తన దారికి తీసుకువచ్చి అణ్వాయుధాలకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు అన్నారు. అయితే, ఈ చర్య ద్వారా తన రక్షణ విధానం నుంచి అమెరికా వైదొలిగినట్లే అవుతుందని, ప్రపంచ దేశాల మధ్య తీవ్ర అణ్వాయుధ పోటీకి దారి తీస్తుందని పరిశీలకులు అంటున్నారు. ‘అణ్వాయుధ పోటీని నివారించే ఉద్యమానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ప్రపంచ దేశాల మధ్య ఆయుధ పోటీకి తెరలేస్తుంది. ముఖ్యంగా ఉత్తర కొరియాతో అణు చర్చలకు ఆటంకం కలుగుతుంది. అణు పరీక్షలపై విధించిన మారటోరియంకు ఆ దేశ పాలకుడు కిమ్ కట్టుబడి ఉండకపోవచ్చు. అంతిమంగా, అమెరికా చర్య కొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీస్తుంది’అని ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డారిల్ కింబల్ అన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా రక్షణ విధానం పెనుమార్పులకు లోనయింది. రష్యా, చైనాలు తక్కువ తీవ్రత గల అణు పాటవ పరీక్షలు జరుపుతున్నాయంటూ అమెరికా గతంలో ఆరోపణలు చేసింది. వీటిని ఆయా దేశాలు ఖండించాయి కూడా. చివరిసారిగా అమెరికా 1992లో అణు పరీక్ష నిర్వహించింది. -
మన అణ్వస్త్ర విధానం మారొచ్చు
జైపూర్/న్యూఢిల్లీ: సరిహద్దులో పాక్ కయ్యానికి కాలు దువ్వుతున్నవేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మొదటగా అణ్వాయుధాలను ప్రయోగించరాదు’అన్న విధానానికే భారత్ కట్టుబడి ఉందనీ, అయితే భవిష్యత్‌లో ఎదురయ్యే పరిస్థితుల దృష్ట్యా ఇది మారవచ్చని పరోక్షంగా పాక్‌ను హెచ్చరించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్(1974, 1998 అణుపరీక్షలు నిర్వహించిన ప్రాంతం)ను రాజ్‌నాథ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘భారత్‌ను అణ్వస్త్ర శక్తిగా మార్చాలన్న అటల్‌బిహారీ వాజ్‌పేయి దృఢసంకల్పానికి ఈ ప్రాంతం ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. అణ్వస్త్రాలను ఇతరులపై మొదటగా ప్రయోగించరాదన్న సిద్ధాంతానికి భారత్ ఇప్పటికీ గట్టిగా కట్టుబడింది. కానీ భవిష్యత్‌లో ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఇది మారొచ్చు’అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు వాజ్‌పేయి వర్థంతి సందర్భంగా రాజ్‌నాథ్ ఆయనకు నివాళులు అర్పించారు. ‘భారత్ బాధ్యతాయుతమైన అణ్వస్త్రశక్తిగా మారడం ప్రజలందరికీ గర్వకారణమే. ఇందుకు భారత్ అటల్జీకి రుణపడి ఉంటుంది’అని ట్వీట్ చేశారు. మరోవైపు రాజ్‌నాథ్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. అణ్వాయుధాల ప్రయోగంపై కేంద్ర ప్రభుత్వం తమ విధానాలను బయటపెట్టాలనీ, ఈ అస్పష్టతకు తెరదించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం వెనుక దేశమంతా నిలబడుతుందనీ, అయితే ముందుగా మన అణు విధానంపై వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరింది. -
కిమ్‌కు ట్రంప్ కళ్లెం వేశారా?
ప్యాంగ్యాంగ్, ఉత్తరకొరియా : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో భేటిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ భేటి రద్దు ప్రభావం కిమ్ ప్రభుత్వ అంతర్గత విభాగాలపై ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అణ్వాయుధ కేంద్రాలను నాశనం చేసి భేటిలో పాల్గొనడానికి సిద్ధమైన కిమ్, ట్రంప్ రద్దు నిర్ణయంతో షాక్ తిన్నారు. ప్యాంగ్ యాంగ్ నుంచి వస్తున్న సందేశాల కారణంగానే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, కిమ్ పూర్తిగా ట్రంప్ నియంత్రణలోకి వచ్చారని అనుకోవడానికి లేదని ప్రముఖ విశ్లేషకులు బ్రుస్ బెన్నెట్ పేర్కొన్నారు. జూన్ 12న ట్రంప్, కిమ్‌లు సింగపూర్‌లో భేటి కావాల్సి ఉంది. కాగా భేటిని రద్దు చేస్తున్నట్టు గురువారం ట్రంప్ ప్రకటించారు. 2011లో తండ్రి మరణాతరం ఉత్తరకొరియా అధ్యక్ష పదవిని చేపట్టిన కిమ్, తన ప్రత్యర్థులను హతమార్చి ప్రభుత్వంపై పట్టును సాధించారు. అమెరికా అధ్యక్షుడితో భేటి కోసం అంతర్జాతీయ జర్నలిస్టుల సమక్షంలో పంగేరి అణ్వాయుధాల కేంద్రాన్ని సైతం నాశనం చేశారు. అయితే, కిమ్ దేనికోసం ఇదంతా చేశారో అదే లేకుండా పోయింది. ఈ దశలో ఆయన ఉత్తరకొరియా సైన్యానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అణ్వాయుధ నిరాయుధీకరణ గురించి కిమ్ దేశ సైన్యం ఏ విధంగా భావిస్తోందో అర్థంకావడం లేదని రక్షణ రంగ నిపుణుడు బెన్నెట్ అన్నారు. కిమ్‌తో భేటికి మార్చి నెలలో అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. అప్పటినుంచి వివాదాలకు కిమ్ దూరంగా ఉంటున్నారు. ఒప్పందం ప్రకారం అమెరికాకు చెందిన ముగ్గురు ఖైదీలను కిమ్ ప్రభుత్వం విడుదల చేసింది. (చూడండి: కిమ్ జాంగ్‌కు సర్ప్రైజ్.. ఉత్కంఠ!) -
‘అణు’ కేంద్రం ధ్వంసం చేస్తాం
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలు నిలిపివేయనున్నట్లు గత నెలలోనే ప్రకటించిన కిమ్.. తాజాగా అణ్వాయుధ పరీక్షల కేంద్రాన్ని పేల్చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే నెల 12న సింగపూర్‌లో సమావేశం కానున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆరు అణ్వస్త్ర పరీక్షలు చేపట్టి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు ముచ్చెమటలు పట్టించిన కిమ్ జోంగ్ ఉన్ తన తాజా నిర్ణయంతో ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. తమ వద్ద హైడ్రోజన్ బాంబు ఉందని చెప్పిన ఉత్తర కొరియా.. రష్యా, అమెరికా, చైనా, బ్రిటన్, దక్షిణ కొరియా మీడియా చూస్తుండగానే అణ్వస్త్ర కేంద్రాలను మూసివేయనున్నట్లు వివరించింది. ఈ నెల 23–25 తేదీలలో విదేశీ మీడియా ఎదురుగా పేలుడు పదార్థాలతో పుంగ్యే–రి అణుపరీక్షల కేంద్రాన్ని పేల్చి వేయనున్నట్టు అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) వెల్లడించింది. పరిశోధన భవనాలు, సెక్యూరిటీ పోస్టులు, సొరంగ మార్గాలు, అణ్వాయుధ సంస్థ, ఇతర సంస్థలతో పాటు అన్నింటినీ ధ్వంసం చేయనున్నట్లు తెలిపింది. అణుపరీక్షలకు చరమగీతం పాడినట్టు ప్రకటించిన నేపథ్యంలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. అమెరికా ప్రకటన చేసిన మర్నాడే... ఉత్తర కొరియా అణ్వాయుధాలను వదులుకుంటే.. ఆ దేశానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని అమెరికా ప్రకటించిన మరుసటి రోజే కిమ్ జోంగ్ ఉన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ‘తెలివైన నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు అంటూ’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. దక్షిణ కొరియా కూడా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రకటనను స్వాగతించింది. కిమ్ మాటలు చెప్పడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు అభినందనలు తెలిపారు. -
కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం!
ప్యోంగ్యాంగ్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల దక్షిణ, ఉత్తర కొరియాలలో ఒకే సమయం ఉండాలని కిమ్ భావించి తమ దేశ సమయాన్ని మార్చుకున్న విషయం తెలిసిందే. భారీ అణ్వాయుధాలకు అడ్డాగా మారిన ఉత్తర కొరియా తన న్యూక్లియర్ పరీక్షలను ఈ నెలలోనే నిలిపివేయాలని భావిస్తోంది. ఈ మేరకు విదేశీ మీడియా సంస్థల సమక్షంలో అణ్వస్త్రాలను పరీక్షించే వేదికను ధ్వంసం చేసి, ఆపై మూసివేయనున్నట్లు కిమ్ తాజాగా ప్రకటించారు. తమ దేశంపై దాడి చేయనని అమెరికా హామీ ఇస్తే అణ్వాయుధాలను త్యజిస్తామని ఉత్తర కొరియా నియంత తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆ ప్రకటనకు కట్టుబడి న్యూక్లియర్ ప్లాంట్‌ను ధ్వంసం చేసి అణ్వాయుధాలకు తాము కూడా వ్యతిరేకమని ప్రపంచానికి చాటిచెప్పాలని కిమ్ భావిస్తున్నారు. మే 23-25 తేదీలలో ఈ పని చేయనున్నట్లు నార్త్ కొరియా ఉన్నతాధికారులు వెల్లడించారు. కిమ్ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వాగతించడంతో పాటు ప్రశంసించారు. ఇప్పటివరకూ ఆరు అణ్వస్త్ర పరీక్షలు చేపట్టి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు ముచ్చెమటలు పట్టించిన కిమ్ జోంగ్ ఉన్ తన తాజా నిర్ణయాలతో ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. తమ వద్ద హైడ్రోజన్ బాంబు ఉందని చెప్పిన ఉత్తర కొరియా.. రష్యా, అమెరికా, చైనా, బ్రిటన్, దక్షిణ కొరియా మీడియా చూస్తుండగా అణ్వస్త్ర కేంద్రాలను మూసివేయనున్నట్లు వివరించింది. కాగా, చైనాలోనూ పర్యటిస్తూ అగ్రదేశాలతో సత్సంబంధాల కోసం కిమ్ యత్నిస్తున్న విషయం విదితమే. -
‘పోఖ్రాన్’ సాహసోపేత నిర్ణయం: కోవింద్, మోదీ
న్యూఢిల్లీ: పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరపాలన్నది నాటి ప్రభుత్వ సాహసోపేత నిర్ణయమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఈ పరీక్షలు అంతర్జాతీయంగా భారత్ పట్ల ఉన్న వైఖరిని మార్చివేశాయనీ, భారత వైజ్ఞానిక సామర్థ్యాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లాయని ఆయన పేర్కొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వానికి ఉన్న ధైర్యాన్ని, సాహసాన్ని పోఖ్రాన్ అణు పరీక్షలు ప్రతిబింబించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజస్తాన్‌లోని థార్ ఎడారిలో 1998 మే 11, 13 తేదీల్లో భారత్ భూగర్భంలో ఐదు అణు పరీక్షలను జరిపింది. ఈ ఘట్టానికి శుక్రవారంతో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని పోఖ్రాన్–2 అణు పరీక్షలను, ఈ పరీక్షలు జరిపిన శాస్త్రవేత్తలకు నేతృత్వం వహించిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను గుర్తుచేసుకున్నారు. -
అణు పరీక్షలకు స్వస్తి
సియోల్: నిత్యం ఏదో ఒక ఆయుధ పరీక్షతో ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఉత్తర కొరియా ఎట్టకేలకు దిగొచ్చింది. అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలను నిలిపేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో అంతర్జాతీయ సమాజం ఆ దేశంపై విధించిన కఠిన ఆంక్షలు ఫలించినట్లయింది. త్వరలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భేటీ కానున్న నేపథ్యంలో శనివారం ఈ ప్రకటన వెలువడింది. ఈ వారమే కిమ్–మూన్‌ల భేటీ జరగనుండగా, ట్రంప్–కిమ్‌ల సమావేశం ఎప్పుడు జరుగుతుందో ఇంకా తేదీ ఖరారు కాలేదు. అణు, క్షిపణి పరీక్షలకు స్వస్తి పలుకుతామన్న కిమ్..ఇప్పటికే అభివృద్ధిచేసిన అణ్వాయుధాలు, క్షిపణులను త్యజించడంపై స్పష్టత ఇవ్వలేదు. అణు పరీక్షలకు వినియోగించిన ప్రయోగ కేంద్రాన్ని మూసివేస్తామని తెలిపారు. ఉ.కొరియా నిర్ణయాన్ని అమెరికా, జపాన్, చైనా, ఈయూ స్వాగతించాయి. ఇక వాటి అవసరం లేదు: కిమ్ అధికార వర్కర్స్ పార్టీ ప్లీనరీ సమావేశంలో సభ్యులకు కిమ్ తన నిర్ణయాన్ని తెలిపినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) వెల్లడించింది. ‘ అవసరమైన ఆయుధాలను ఇప్పటికే తయారుచేసుకున్నాం. క్షిపణులపై అమర్చే సూక్ష్మ వార్హెడ్లను కూడా అభివృద్ధి చేసుకున్నాం. ఇక మ నకు అణు పరీక్షలు, మధ్యంతర, ఖండాంతర క్షిపణుల అవసరం లేదు’ అని కిమ్ అన్నారు. అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి పరీక్షలను శనివారం నుంచి నిలిపేయాలని పార్టీ నిర్ణయించింది. భావి తరాలు గౌరవప్రద, సంతోషకర జీవితం గడపటానికి ఇప్పటికే అభివృద్ధిచేసిన అణ్వాయుధాలు భరోసా కల్పిస్తాయని కిమ్ వ్యాఖ్యానించారు. దేశాన్ని అణుశక్తిగా నిర్మించాలన్న లక్ష్యం నెరవేరిందని, ఇక పరిపుష్ట ఆర్థిక వ్యవస్థను తయారుచేసుకోవడంపై దృష్టిపెట్టనున్నట్లు వెల్లడించారు. గొప్ప పురోగతి: అమెరికా ఉ.కొరియా నుంచి ప్రకటన వెలువడిన వెంటనే ట్రంప్ స్పందించారు. ‘ఈ నిర్ణయం ఉ.కొరియాకే కాదు మొత్తం ప్రపంచానికి మేలు చేస్తుంది. ఇది గొప్ప పురోగతి. కిమ్‌తో సమావేశానికి ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఈ పరిణామాన్ని దక్షిణ కొరియా స్వాగతిస్తూ కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ దిశగా పడిన కీలక ముందడుగు అని వ్యాఖ్యానించింది. ఉ.కొరియా నిర్ణయం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించి, రాజకీయ స్థిరత్వానికి దోహదపడుతుందని మిత్ర దేశం చైనా పేర్కొంది. -
ఇక ‘అణు’ కిమ్ కాదు..!!
ప్యాంగ్యాంగ్, ఉత్తరకొరియా : అణు పరీక్షలను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఉత్తరకొరియా ప్రకటించింది. అమెరికా, దక్షిణకొరియాలతో చర్చల అనంతరం ఉత్తరకొరియా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గతేడాది కిమ్ జాంగ్ ఉన్ వరుస క్షిపణి ప్రయోగాలతో అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను హడలెత్తించిన విషయం తెలిసిందే. వింటర్ ఒలింపిక్స్ నుంచి ఉత్తరకొరియా అధ్యక్షుడు క్రమంగా ఉద్రేకమైన వ్యాఖ్యలను తగ్గిస్తూ వచ్చారు. రహస్యంగా చైనాలో పర్యటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు కూడా. అనంతరం దక్షిణ కొరియా అధికారుల బృందం ప్యాంగ్యాంగ్ వేదికగా కిమ్‌ను కలుసుకుంది. వారితో అణు పరీక్షల నిలిపివేతకు సంసిద్ధతను కిమ్ వ్యక్తం చేశారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరకొరియా తాజా ప్రకటనపై ట్రంప్ తాను చాలా మంచి వార్త విన్నానని అన్నారు. కాగా, మే నెలలో ట్రంప్-కిమ్‌లు సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. -
ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం వద్దు
బీజింగ్, చైనా : ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీసే వ్యాఖ్యలను అమెరికా విడిచి పెట్టాలని చైనా హితవు పలికింది. ఆసియా ప్రాంతంలో వరుసగా అణ్వాయుధ ప్రయోగాలు చేస్తున్న రష్యా, చైనాలను అమెరికా ఎన్పీఆర్లో హెచ్చరించిన విషయం తెలిసిందే. యూఎస్ అణ్వస్త్ర వ్యూహ సమీక్ష(ఎన్పీఆర్)పై చైనా ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రచ్ఛన్న యుద్ధమనే ఆలోచనా విధానం నుంచి యూఎస్ బయటకు రావాలని పేర్కొంది. అమెరికా, దాని మిత్ర దేశాలపై అణు దాడులకు దిగినా, ఉగ్రవాదులకు న్యూక్లియర్ పవర్ దక్కేలా చేసినా సహించబోమని అమెరికా ఘాటు వ్యాఖ్యలు చేసింది. -
అణుపరీక్షలతో ‘దెయ్యం వ్యాధి’
ప్యాంగ్యాంగ్ : అంతుచిక్కని వ్యాధితో ఉత్తరకొరియా ప్రజలు బెంబేలెత్తిపోతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. అణు పరీక్షల వల్ల విడుదలైన కాలుష్య పదార్థాలు కిమ్ దేశ ప్రజలపై పెను ప్రభావం చూపుతున్నాయి. గర్భస్థ శిశువులపైనా, స్త్రీ, పురుషుల ప్రత్యుత్పత్తి, నాడీ వ్యవస్థల మీద రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటున్నట్లు తెలిసింది. 2011లో దేశ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కింగ్ జాంగ్ ఉన్ వరుస అణు పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరకొరియాలో ఉన్న అణు పరీక్షా కేంద్రాల్లో ఒకటైన ‘పంగ్యే రీ’ వద్ద రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీంతో పంగ్యే రీ వద్ద పహారా ఉంటున్న సైనికులు అంతుచిక్కని దెయ్యం వ్యాధి బారిన పడి మృత్యువాత పడుతున్నారు. దీంతో భయాందోళనలకు గురవుతున్న సైనికులు.. తప్పించుకునేందుకు దక్షిణ కొరియాలోకి పారిపోతున్నారు. ఇప్పటివరకూ 30 మంది ఉత్తరకొరియా సైనికులు అనారోగ్య కారణాల రీత్యా దక్షిణ కొరియాలోకి పారిపోయి వచ్చినట్లు మీడియా రిపోర్టులు వచ్చాయి. రేడియేషన్కారణంగా విపరీతమైన నొప్పికి సైనికులు గురైనట్లు వారికి చికిత్స అందించిన దక్షిణ కొరియా వైద్యులు చెప్పారు. అణు పరీక్షల వల్ల ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్యకు లెక్కేలేదని దక్షిణ కొరియాలోకి పారిపోయి వచ్చిన ఓ సైనికుడు తెలిపారు. దీంతో రేడియేషన్ కారణంగా బాధపడే వారిని ‘ఘోస్ట్ డిసీజ్’ తో బాధపడుతున్నట్లు ఉత్తరకొరియాలో చెబుతారని వెల్లడించారు. అవయవ లోపంతో జన్మించిన శిశువులను చంపేస్తారని తెలిపారు. దీంతో తల్లిదండ్రులే బిడ్డలను చంపుకున్నట్లు అవుతుందని వివరించారు. అయితే, రేడియేషన్ కారణంగానే ఉత్తరకొరియాలో మరణాలు సంభవిస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి ప్రత్యేక ఆధారాలు లభ్యం కాలేదని శాస్త్రవేత్తలు చెప్పారు. -
ఉత్తర కొరియాపై సైనిక చర్య ఉండదు, కానీ...
- జింగ్ పిన్ తో ట్రంప్ ఫోన్ కాల్ - అగ్ర రాజ్యాలకు ఐరాస పిలుపు సాక్షి, వాషింగ్టన్: అణు పరీక్షలతో ఐక్యరాజ్య సమితికి సైతం విసుగు పుట్టిస్తున్న ఉత్తర కొరియా వ్యవహారంపై అమెరికా ఆచీ తూచీ వ్యవహరించబోతున్నట్లు అర్థమౌతోంది. ఉ.కొ. పై ఉన్నపళంగా సైనిక చర్యలు చేపట్టబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. ఉత్తర కొరియా ఈ మధ్య నిర్వహించిన అణు పరీక్షల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జింగ్ పిన్ బుధవారం ఫోన్లో ట్రంప్‌తో చర్చించారు. వారి సంభాషణలను ఉటంకిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థ విషయాలను వెల్లడించింది. సైనిక చర్య విషయంపై జింగ్ ప్రశ్నించగా.. అది తమ తొలి నిర్ణయం కాదని ట్రంప్ బదులిచినట్లు సమాచారం. ‘సూటిగా చెప్పాలంటే ఇది చాలా ముఖ్యమైన ఫోన్ కాల్. ఉ.కొ. విషయంలో నేను.. జింగ్ పింగ్ ఒకే అభిప్రాయంతో ఉన్నాం’ అని ట్రంప్ తెలిపారు. కిమ్ సామ్రాజ్యంలో ఏం జరుగుతుందో బాహ్యా ప్రపంచానికి తెలీని పరిస్థితి నెలకొందని, అతనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని జింగ్ పిన్ తనతో చెప్పినట్లు ట్రంప్ వివరించారు. అయితే సైనిక చర్యను పరిస్థితులు చేజారితే మాత్రం సైనిక చర్యలను చేపట్టవచ్చనే విషయాన్ని మాత్రం ట్రంప్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక రాజకీయాలకతీకంగా అగ్ర దేశాలన్నీ ఏకమై ఉత్తర కొరియా అణు పరీక్షల అంశంలో జోక్యం చేసుకోవాలంటూ ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అమెరికాకు త్వరలో మరిన్ని బహుమతులు (అణు ఆయుధాలు) పంపుతామంటూ ఉత్తర కొరియాకు చెందిన ఓ భద్రతా అధికారి హెచ్చరించిన కొన్ని గంటలలోపే ఐరాస శాంతి స్థాపనకు తాము ఎంత దూరమైన వెళ్తామని వ్యాఖ్యానించటం విశేషం. -
కిమ్‌ది యుద్ధ యాచన
► ఉ.కొరియాపై ఐరాసలో అమెరికా ఆగ్రహం ► కఠిన ఆంక్షలు విధించాలన్న అగ్రరాజ్యం ► చర్చలతోనే పరిష్కరించుకోవాలి: చైనా, రష్యా ఐక్యరాజ్యసమితి: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ యుద్ధం కోసం యాచిస్తున్నారని ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో అమెరికా శాశ్వత రాయబారి నిక్కీ హేలీ అన్నారు. అత్యంత శక్తిమంతమైన బాంబును ఉత్తర కొరియా ఆదివారం పరీక్షించగా, దీనిపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సోమ వారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఉత్తర కొరియాపై ఆంక్షల విషయంలో ఇతర దేశాలతో చైనా, రష్యాలు విభేదించడంతో ఏ నిర్ణయమూ తీసుకోకుండానే భేటీ ముగిసింది. సమావేశంలో నిక్కీ హేలీ మాట్లాడుతూ,‘అంతర్జాతీయ సమాజం కన్నెర్రచేస్తున్నా అణు పరీక్షలు ఆపని ఉత్తర కొరియాను నిలు వరించేందుకు వీలైనంత కఠినమైన ఆంక్షలను విధించాలి. ఆ దేశాన్ని కట్టడి చేయాలంటే దౌత్యపరంగా ప్రస్తుతం ఉన్న మార్గం ఇదొక్కటే. యుద్ధానికి దిగాలని అమెరికా అనుకోవడం లేదు. కానీ మా సహనానికీ ఓ హద్దు ఉంటుంది. మా భూభాగాన్ని, మిత్రదేశాలను రక్షించుకోవడానికి తగిన చర్యలను తీసుకుంటాం’ అని హెచ్చరించారు. ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ రాయబారులు ఉత్తర కొరియాపై కొత్త ఆంక్షలు విధించాలన్నారు. చైనా, రష్యాలు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఐరాస ప్రధాన కార్య దర్శి ఆంటోనియో గ్యుటెరస్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఉత్తర కొరియాలు చర్చలు జరపాలని రష్యా రాయబారి సూచించారు. ఉత్తర కొరియా అణు పరీక్షలను నిలిపివేయాల్సిందేనని, చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలని చైనా ప్రతినిధి ల్యూ జీయ్ అన్నారు. దక్షిణ కొరియాతో కలసి అమెరికా నిర్వహిస్తున్న సైనిక కార్యకలాపాలను ఆపేస్తే, ఉత్తర కొరియా అణుపరీక్షలను ఆపేస్తుందంటూ రష్యా తీసుకొచ్చిన ప్రతిపా దనను ప్రస్తావించారు. దీనిపై నిక్కీ మాట్లాడుతూ, సైనిక కార్యక లాపాలు ఆపేయడం తమకు అవమానమన్నారు. ‘ఓ వంచక దేశం అణ్వాయుధం అమర్చిన క్షిపణిని మీ దేశంవైపు తిప్పి ఉం చితే, మీరు మీ రక్షణ చర్యలను తగ్గించరు కదా. ఎవ్వరూ అలా చేయరు. మే కచ్చితంగా చేయం’ అని అన్నారు. ఉత్తర కొరియా తో వ్యాపారం చేసే ప్రతి దేశాన్ని తాము వంచక దేశానికి సాయ పడే వారిగానే చూస్తామని చైనాను ఉద్దేశించి అన్నారు. హైడ్రోజన్ బాంబు కాకపోవచ్చు: ద.కొరియా ఉత్తర కొరియా పరీక్షించినది హైడ్రోజన్ బాంబేనని కచ్చితంగా చెప్పలేమనీ, అయితే అత్యంత శక్తిమంతమైన అణుబాంబును తక్కువ పరిమాణంతోనే క్షిపణిలో నిక్షిప్తం చేయడంలో ఆ దేశం విజయం సాధించిందని దక్షిణ కొరియా అధికారులు పేర్కొన్నారు. ఆ బాంబు బరువు 50 వేల టన్నులు ఉంటుందన్నారు. ఉత్తర కొరియా మరో క్షిపణిని పరీక్షించేందుకూ సిద్ధమవుతూ ఉండొచ్చని దక్షిణ కొరియా భావిస్తోంది. దీంతో తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుం టోంది. ఉత్తర కొరియా బాంబు వల్ల వాతావరణంలో రేడియేషన్ ఏమీ రాలేదని చైనా, జపాన్ ప్రకటించాయి. -
మరిన్ని అణుపరీక్షలకు ఉత్తర కొరియా ఆదేశం
సియోల్: మరిన్ని అణుపరీక్షలు నిర్వహించాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ అధికారుల్ని ఆదేశించారని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ‘అణ్వాయుధ దాడి సామర్థ్యం మరింత పెంచాలి.. కొత్తగా తయారుచేసిన అణ్వాయుధాల శక్తి తెలుసుకునేందుకు పరీక్షలు కొనసాగించాలి... దాడి సామర్థ్యంపై అవగాహనకు పరీక్షలు నిర్వహించాలి’ అని అధ్యక్షుడు కిమ్ చెప్పారంటూ కేసీఎన్ఏ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. జనవరిలో ఉత్తరకొరియా అణుపరీక్ష నిర్వహించడంతో కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల ఏడోతేదీ నుంచి దక్షిణకొరియా, అమెరికా దళాలు పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. వీటిని ఉత్తరకొరియా తీవ్రంగా ఖండించడంతో పాటు అణ్వాయుధాలతో దక్షిణకొరియా, అమెరికాను బూడిద చేస్తామని హెచ్చరించింది. -
5.1 తీవ్రతతో 'కృత్రిమ భూకంపం'!
భూకంపాలు సంభవించడం మనకు ఇంతవరకు తెలుసు. కానీ కృత్రిమ భూకంపాల గురించి ఎప్పుడైనా విన్నారా? ఉత్తరకొరియాలో ఇది సంభవించింది. అక్కడ అణుపరీక్షలు నిర్వహించిన స్థలం వద్ద కృత్రిమ భూకంపం వచ్చినట్లు పలు దేశాలకు చెందిన వాతావరణ కేంద్రాలు, భూకంప కేంద్రాలు తెలిపాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైంది. ఉత్తరకొరియాలోని ఈశాన్య ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. అక్కడ 2013లో భూగర్భంలో అణు పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు అదే స్థలంలో కృత్రిమ భూకంపం వచ్చినట్లు గుర్తించారు. సుంగ్జిబీగమ్ ప్రాంతానికి 19 కిలోమీటర్ల తూర్పు ఈశాన్య దిశలో ఈ భూకంప కేంద్రం ఉంది. ఉత్తరకొరియాలో సంభవించినది భారీ పేలుడు కావచ్చని చైనా భూకంప గుర్తింపు కేంద్రాలు అనుమానిస్తున్నాయి. అది కృత్రిమ భూకంపం అని దక్షిణ కొరియా వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఉత్తర కొరియా మళ్లీ తాజాగా ఏమైనా అణు పరీక్షలు నిర్వహించిందా.. వాటివల్లే ఇలా కృత్రిమ భూకంపం ఏమైనా సంభవించిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ పరిస్థితి గురించి ఉత్తరకొరియా బుధవారమే ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. -
శక్తినిచ్చి.. మచ్చ మిగిల్చిన ఇందిర
ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని ఎప్పటికీ సమర్థించను. కానీ వ్యక్తిగతంగా ఆమె ఈ దేశాన్ని శక్తివంతం చేశారని నమ్ముతా. బంగ్లాదేశ్ యుద్ధ విజయంతో ఆమె ప్రజల ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించారు. అణు పరీక్షలను నిర్వహించి దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపారు. పేదల పెన్నిధిగా ఆమె అనేక సంక్షేమ పథకాలు రూపొందించారు. ఎమర్జెన్సీ విధింపు, దాని అతిక్రమణల కారణంగా తిరస్కరించిన ప్రజలే మళ్లీ ఆమెను ఎన్నుకోవడంతో ఆమె చేసిన తప్పులను ప్రజలు క్షమించేశారేమో అనిపిస్తుంది. ‘1971 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి గెలిచిన ఇందిరా గాంధీ.. అధికార దుర్వినియోగం చేశారని ఆ ఎన్నికలో ఆమె ప్రత్యర్థియైన రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకో ర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 12 జూన్ 1975న ఆ హైకోర్టు న్యాయమూర్తి జగ్మోహన్ సిన్హా ఇందిరా గాంధీ దోషిగా నిర్ధారించారు. ఆమె లోక్‌సభ సభ్య త్వాన్ని రద్దు చేస్తూ, మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా తీర్పు నిచ్చారు. నెహ్రూ వద్ద పనిచేసే ఒక ఉద్యోగి ఇందిరా గాంధీ వద్ద కూడా పని చేసేవారు. రాయ్‌బరేలీ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఆ ఉద్యోగిని, ప్రభుత్వ వాహనాన్ని వినియోగించుకున్న కారణంగా ఈ తీర్పు వచ్చింది. ఆ సమయంలో నిజానికి ఇందిరా గాంధీ రాజీనామా చేయాలనుకున్నా... ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీ, అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రేల ప్రోద్బలంతో ఆమె ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అదే సమయంలో జయప్రకాశ్ నారాయణ్ తదితరులు ఇందిర పదవిలో కొనసా గరాదని, ఆమె ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోరాదని తిరుగుబాటు లేవనెత్తారు. సమ్మెలు, ఆందోళనలు చెలరేగాయి. ఇందిర హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కానీ సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ 24 జూన్ 1975న హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు చెప్పారు. చీకటి పాలనలో.... ఈ పరిస్థితుల్లో సిద్ధార్థ శంకర్ రే దేశంలో వెల్లువెత్తుతున్న ఆందోళనలు, అసంతృప్తి, సమ్మెలు సాగుతున్న దృష్ట్యా రాజ్యాంగంలోని 352వ అధికరణం కింద స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధింపునకు అవకాశం ఉన్న దని ఇందిరా గాంధీకి వివరించారు. దేశంలో అంతర్గత భద్రతకు ప్రమాదం ఏర్పడినప్పుడు ఎమర్జెన్సీ విధింపునకు ఈ నిబంధన అవకాశం ఇస్తుందని చెప్పడంతో ఇందిరాగాంధీ అందుకు సరేనన్నారు. దాదాపు 21 నెలల పాటు పత్రికలు, ప్రజాసంఘాలు, విపక్షాలను అణగదొక్కారు. జైల్లో పెట్టారు. అదొక చీకటి అధ్యాయం.. పత్రికలపై సెన్సార్షిప్ ఉండేది. అప్పుడు నేను ముంబైలో పనిచేసిన ‘ఆన్‌లుకర్’ మ్యాగజీన్ కూడా అందుకు మినహా యింపు కాలేదు. పత్రికలను పూర్తిగా అణచివేశారు. కులదీప్ నయ్యర్ వంటి పలువురు ప్రధాన స్రవంతికి చెందిన పత్రికల ప్రతినిధులు కూడా అరెస్ట య్యారు. ఆ కాలమంతటా సెన్సార్‌కు వెళ్లని వ్యాసాలేవీ పత్రికల్లో ప్రచు రించడానికి అవకాశం ఉండేదే కాదు. దీనికి నిరసనగానూ, సంపాదకీయ పేజీ వ్యాసాలను సెన్సార్‌షిప్‌కు పంపడం ఇష్టం లేని కారణంగానూ పత్రికలు తమ ఎడిట్ పేజీలను ఖాళీగా వదిలేవి. ఎమర్జెన్సీ విధింపుకు ప్రధాన కారణమైన ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఆ కాలంలోనే రాజకీయరంగ ప్రవేశం చేసి బలీయమైన అధికారేతర శక్తిగా ఎదిగి, ప్రభుత్వంపై ఆధిపత్యం చలాయించారు. ఆయన ఒకదశలో 30 ఏళ్లపాటు ఎన్నికలే ఉండవని చెప్పుకొచ్చారు. బలవంతంగా కుటుంబ నియం త్రణ ఆపరేషన్లు చేయించేవారు. అలాంటి బాధితుల సంఖ్య లక్షల్లో ఉందని అంచనా. దీనికి తోడు సంజయ్‌గాంధీ తల్లి ఇందిరా గాంధీపై పెత్తనం చలా యించే స్థితికి చేరడంతో, ఆయన అనుయాయులు దేశవ్యాప్తంగా పలు అతి క్రమణలకు పాల్పడ్డారు. అతిక్రమణలు...దిద్దుబాటు యత్నం అంతవరకు భారతదేశాన్ని అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా చూసిన ప్రపంచ దేశాలు ఒక్కసారిగా విభ్రాంతికి గురయ్యాయి. అత్యంత సమర్థులరాలైన ప్రజాస్వామ్యనేతగా పేరు మోసిన ఇందిరా గాంధీ నియంతగా తీవ్ర విమ ర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే కొద్ది నెలలకే ఇందిరా గాంధీ జరి గిన తప్పును గ్రహించారు. ఎమర్జెన్సీ అనే ఒక తప్పు జరిగిపోయిందని తెలు సుకున్నారు. స్వతహాగా ప్రజాస్వామ్యాన్ని నమ్మే ఇంది రాగాంధీ.. జరిగిన తప్పును సరిదిద్దేందుకు ప్రయత్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రధానిని పార్ల మెంటులో తప్ప సుప్రీంకోర్టులో 39వ రాజ్యాంగ సవరణ చేసిన ఇందిరా గాంధీయే 2 నవంబర్ 1976లో భారతదేశం సోషలిస్టు, సెక్యులర్, రిపబ్లిక్‌గా 42వ సవరణ చేశారు. పార్లమెంటును రద్దు చేసి మళ్లీ ప్రజాతీర్పు పొంద డానికి సన్నాహాలు చేశారు. 1977లో మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఘోర ఓటమి పాలయ్యారు. లోక్‌సభలో కాంగ్రెస్ బలం 153కు పడిపోయింది. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం అంతర్గత కలహాలతో త్వరలోనే ప్రజలలో అప్రతిష్ట పాలైంది. దీంతో అత్యవసర పరిస్థితి విధింపు కారణంగా నియంతగా విమర్శలను ఎదుర్కొన్న ఇందిరా గాంధీకి మరోమారు ప్రజల తీర్పును కోరే అవకాశం త్వరలోనే లభించింది. ఓడించిన ప్రజలే పట్టంగట్టారు జనతాప్రభుత్వం అంతర్గత కలహాలతో కుప్పకూలి పోవడంతో 1980 నాటికే దేశం మళ్లీ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాల్సివచ్చింది. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని, దేశం ఎదుర్కొన్న సవాళ్లను... కొద్ది రోజులకే దేశం మరిచిపోయిందనిపించేలా ప్రజాతీర్పు వెలువడింది. జనతా ప్రభుత్వ పాలనలోని అంతర్గత ఘర్షణల వల్ల దానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనన్న అభిప్రాయం ప్రజల్లో కలిగింది. ఎమర్జెన్సీకి ముందు ఇందిరా గాంధీ దేశాన్ని శక్తివంతంగా మలిచిన కారణంగా దేశ ప్రజలు మళ్లీ ఆమెకే పట్టం కట్టారు. ఒక రాజకీయ నేతగా ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని ఎప్పటికీ సమర్థిం చను. కానీ వ్యక్తిగతంగా ఆమె ఈ దేశాన్ని శక్తివంతం చేశారని నమ్ముతా. 1962లో చైనాతో జరిగిన యుద్ధం కారణంగా దేశం బలహీనపడిందన్న న్యూనతాభావం నుంచి పాక్‌తో జరిగిన యుద్ధంలో గెలిచి, బంగ్లాదేశ్ ఆవి ర్భావానికి సహకరించి... ఆమె ప్రజల ఆత్మగౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెం పొందించారు. 1974లో అణు పరీక్షలను నిర్వహించి, అగ్రరాజ్యాల సరసన చేరి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అత్యంత సాహసోపేతంగా బ్యాంకులను జాతీయం చేశారు. పేదల పెన్నిధిగా ఆమె అనేక సంక్షేమ పథకాలు రూపొం దించారు. బడుగువర్గాల్లో ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలలో ఆమె అమ్మగా పేరు మోశారు. ఏదిఏమైనా ఆమె దేశాన్ని ఒక ప్రబలశక్తిగా చేశారు. కానీ చంద్రుడిలో కనిపించే మచ్చలా.. ఇందిరా గాంధీ రాజకీయ జీవితంపై ఈ ఎమర్జెన్సీ మచ్చ ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. ఇందిరా గాంధీ.. ఎమ ర్జెన్సీని విధించకుండా ఉంటే, హత్యకు గురికాకుండా ఉంటే ఆమె బలమైన నేతృత్వంలో దేశం చాలా ముందుకు వెళ్లేదేమో. ప్రజలు క్షమించారేమో... 1980 సాధారణ ఎన్నికల కంటే ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచా రంలో ఇందిరా గాంధీతో పాటు ఆమె వాహనంలో నేనూ వెళ్లాను. మేం ముంబై నుంచి పుణే వెళ్తుండగా ప్రతి ఊళ్లో జనం చంటి బిడ్డలను చంకన వేసుకుని ఆమెను చూసేందుకు ఎగబడేవారు. రాత్రయినా పగలైనా అదే జనసందోహం, అదే నిరీక్షణ. ఇందిరమ్మను చూశామన్న ఆనందం వారి కళ్లల్లో కనిపించేది. అప్పుడే ఆమె మళ్లీ తన కిరీటం దక్కించుకుంటుందని నేను ‘ఆన్ లుకర్’ మ్యాగజీన్లో రాశా. ఆ తరువాత ‘ఇండియా టుడే’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఉన్నప్పుడు కూడా 1980 సాధారణ ఎన్నికలకు ముందు రిపోర్టింగ్ నిమిత్తం ఆమె వెంట విమానంలో వెళ్లినప్పుడు ప్రజలు ఆమె పట్ల చూపుతున్న ఆదరణను చూసి.. ఇందిరా గాంధీ మళ్లీ ప్రధాని కాబోతున్నారని అప్పుడే వార్తలు ఇచ్చా. తొలిసారిగా అప్పుడు ఇచ్చిన జనాభిప్రాయ సేకరణ కూడా నిజమైంది. ఎమర్జెన్సీ విధింపు, దాని అతిక్రమణల కారణంగా ఇందిరాగాంధీని తిరస్కరించిన అదే ప్రజలు మళ్లీ ఆమెను ఎన్నుకోవడంతో ఆమె చేసిన తప్పులను ప్రజలు క్షమించేశారేమో అనిపిస్తుంది.’ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) s.venkatanarayan@gmail.com - ఎస్. వెంకటనారాయణ