అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
బీజింగ్, చైనా : ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీసే వ్యాఖ్యలను అమెరికా విడిచి పెట్టాలని చైనా హితవు పలికింది. ఆసియా ప్రాంతంలో వరుసగా అణ్వాయుధ ప్రయోగాలు చేస్తున్న రష్యా, చైనాలను అమెరికా ఎన్‌పీఆర్‌లో హెచ్చరించిన విషయం తెలిసిందే.
యూఎస్ అణ్వస్త్ర వ్యూహ సమీక్ష(ఎన్‌పీఆర్)పై చైనా ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రచ్ఛన్న యుద్ధమనే ఆలోచనా విధానం నుంచి యూఎస్ బయటకు రావాలని పేర్కొంది. అమెరికా, దాని మిత్ర దేశాలపై అణు దాడులకు దిగినా, ఉగ్రవాదులకు న్యూక్లియర్ పవర్ దక్కేలా చేసినా సహించబోమని అమెరికా ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment