![Cyber Security Breach In America Treasury Department](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/31/uscyberattack.jpg.webp?itok=oFtczsHl)
వాషింగ్టన్:అగ్ర దేశం అమెరికా ఖజానాపై చైనా సైబర్ దాడి చేసినట్లు సమాచారం. వర్క్ స్టేషన్లు,కీలక ఫైల్స్‌పై చైనా ప్రోద్బలంతో జరిగిన సైబర్ దాడిని గుర్తించామని అమెరికా ట్రెజరీ శాఖ కాంగ్రెస్‌కు లేఖ రాసింది.ఈ లేఖ మీడియా చేతికి చిక్కడంతో అసలు విషయం బయట పడింది.డిసెంబర్ నెల ప్రారంభంలో సైబర్ దాడి ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస ప్రొవైడర్ పాస్‌వర్డ్‌ను కనిపెట్టిన హ్యాకర్లు బ్రేక్ చేసి వర్క్ స్టేషన్లు, కొన్ని ఫైల్స్‌లోని సమాచారాన్ని దొంగిలించారని ట్రెజరీ శాఖ అధికార ప్రతినిధి లేఖలో తెలిపారు.ఈ విషయాన్ని యూఎస్ సైబర్ సెక్యూరిటీ,ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ దృష్టికి ట్రెజరీ శాఖ తీసుకువెళ్లింది.
సైబర్ దాడిపై ట్రెజరీ శాఖకు థర్డ్‌పార్టీ సైబర్ సెక్యూరిటీ సేవలందిస్తున్న బియాండ్ ట్రస్ట్ సంస్థ ఈ వ్యవహారంపై స్పందించలేదు. ఇటీవలి కాలంలో కొన్ని థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్‌ను టార్గెట్ చేసి సైబర్ దాడులకు పాల్పడే ట్రెండ్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment