చైనాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ ఇండియాతోపాటు అమెరికాలోని కొన్ని కంపెనీల సర్వర్లపై దాడికి పాల్పడినట్లు లుమెన్ టెక్నాలజీస్‌కు చెందిన బ్లాక్ లోటస్ ల్యాబ్స్‌లోని భద్రతా పరిశోధకులు తెలిపారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం వోల్ట్ టైఫూన్ అని పిలువబడే చైనీస్ హ్యాకింగ్ గ్రూప్ అమెరికా, ఇండియాలోని ఇంటర్నెట్ కంపెనీలపై దాడికి పాల్పడింది. అందుకోసం కాలిఫోర్నియాకు చెందిన వెర్సా నెట్‌వర్క్స్ అనే స్టార్టప్ కంపెనీ సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాన్ని ఉపయోగించుకున్నట్లు పరిశోధకులు తెలిపారు.
చైనీస్ గ్రూప్ చేసిన ఈ సైబర్ దాడివల్ల అమెరికాకు చెందిన నాలుగు ఇంటర్నెట్ కంపెనీలు, భారత్‌లోకి ఒక కంపెనీ ప్రభావితం చెందినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. వెంటనే స్పందించిన సదరు కంపెనీలు నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్‌ల నిర్వహణకు సహాయపడే వెర్సా నెట్‌వర్క్‌ల సాఫ్ట్‌వేర్‌లో లోపం కనుగొన్నారు. గతంలో వెర్సా బగ్‌ను గుర్తించి జూన్ 2023లో పరిష్కారాన్ని విడుదల చేసినప్పటికీ, సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల తిరిగి దాడికి గురయ్యాయని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: తగ్గనున్న చిన్న బ్యాంకుల రుణ వృద్ధి..!
వోల్ట్ టైఫూన్ హ్యాకింగ్ సర్వర్లు యూఎస్‌లోని నీటి వసతి, పవర్ గ్రిడ్ వంటి కీలక సేవలందించే సాఫ్ట్‌వేర్లలో చొరబడ్డాయని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. వోల్ట్ టైఫూన్ నిజానికి ‘డార్క్ పవర్’ అని పిలువబడే ఒక క్రిమినల్ గ్రూప్ అని, దానితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి సైబర్‌అటాక్‌ల పేరుతో అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చైనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment