cold war
-
ఫడ్నవీస్-శిందేల మధ్య కోల్డ్‌వార్? ఠండా ఠండా కూల్ కూల్?!
ముంబై: గార్డియన్ మంత్రి పదవి మొదలుకొని ప్రత్యేక వైద్య విభాగాలకు వేర్వేరుగా సమీక్షా సమావేశాలు, పర్యవేక్షణ ప్రాజెక్టుల కోసం ’వార్‌రూమ్’ల వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన డిప్యూటీ ఏక్నాథ్ షిండే మధ్య భిన్నాభిప్రాయాల కోల్డ్‌వార్ జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. గతేడాది నవంబర్‌లో అసెంబ్లీ ఫలితాల తరువాత రాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ఈసారి డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవలసి వచి్చంది. ఇందుకోసం రెండు వర్గాల మధ్య పలు ఒప్పందాలు, రాజీ చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రిగా ఉన్న రెండున్నరేళ్లలో శిందే నాయకత్వం, అభివృద్ధి సంక్షేమ నిర్ణయాల వల్లే బీజేపీ, శివసేన, ఎన్సీపీ(ఏపీ)ల మహాయుతి కూటమి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిందని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు.డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించేందుకు శిందే మొదట్లో విముఖత వ్యక్తంచేశారని, అయితే ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగం కావాలంటూ ఆయన సహచరులు, బీజేపీ అగ్రనేతలు ఒప్పించారని శివసేన నేతలు పేర్కొంటున్నారు. అందువల్లే మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తైనా వారికి శాఖల కేటాయింపునకు దాదాపు వారం రోజుల సమయం పట్టిందని చెబుతున్నారు. ప్రత్యేకంగా వ్యవహరించడం వెనుక... అయితే ఫడ్నవీస్, శిందేలిద్దరూ తమ విభేదాలున్నాయన్న వార్తలను ఖండిస్తున్నారు. తాము పరస్పర సహాకారం, సమైక్యతతో వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈమధ్యకాలంలో పలు సందర్భాల్లో రాయ్‌గఢ్, నాసిక్ జిల్లాల సంరక్షక మంత్రులుగా అదితి తట్కరే, గిరీష్ మహాజన్‌ల నియామకంపై శివసేన(శిందే) అసంతృప్తి వ్యక్తంచేసింది. దీంతో ఈ నియామకాలు వాయిదా పడ్డాయి. ఇంతేకాక ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ‘వార్ రూమ్‘తో పాటు, డిప్యూటీ సీఎంలు అజిత్‌పవార్, శిందేలిద్దరూ తమ పారీ్టల మంత్రులు నిర్వహించే శాఖలు, వారు సంరక్షక మంత్రులుగా ఉన్న జిల్లాల పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను ట్రాక్ చేయడానికి మానిటరింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధితో పాటు మెడికల్ ఎయిడ్ సెల్‌ను కూడా శిందే ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రంలో 2027 కుంభమేళా సన్నాహాల గురించి చర్చించేందుకు నాసిక్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్ఆర్డీఏ) సహా ఫడ్నవీస్ ఏర్పాటు చేసిన అనేక సమావేశాలకు శిందే దూరంగా ఉన్నారు. తాజాగా ఫడ్నవీస్ పరిశ్రమల శాఖ సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం శిందే మరో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. దీనికి తోడు 20 మంది శివసేన ఎమ్మెల్యేల భద్రత తగ్గింపు కూడా శివసేనలో మరింత అసంతృప్తిని రాజేసింది. ఎంపీల మద్దతు కోసమే బీజేపీ మౌనం: సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ అకోల్కర్ ఈ పరిస్థితిపై సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ అకోల్కర్ మాట్లాడుతూ ఇద్దరు నేతల మధ్య ‘ప్రచ్ఛన్న యుద్ధం‘ కొనసాగుతుందని అన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని శిందే భావించారు. కానీ బీజేపీకి బంపర్ మెజారిటీ రావడంతో అది సాధ్యపడలేదు. దీంతో సహజంగానే శిందే కొంత అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర బీజేపీలో ఫడ్నవీస్ వ్యతిరేకులు శిందేకు మద్దతునిస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వానికి శిందే పార్టీలోని ఏడుగురు ఎంపీల మద్దతు అవసరం. అందుకే ఈ వ్యవహారాలపై ఆ పార్టీ నాయకత్వం పెద్దగా స్పందించడం లేదు’అని అకోల్కర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: చీటింగ్ కేసులోమంత్రికి రెండేళ్ల జైలు శిక్షబహిరంగంగా ఒప్పుకోలేని పరిస్థితి: రత్నాకర్ మహాజన్ ‘సంకీర్ణ ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలున్నా ఐక్యంగా కొనసాగాల్సిన అవసరముంటుంది. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా అంతర్గత పోరు గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడలేరు. గత ఎన్నికల కంటే బీజేపీ బలం రెండింతలు పెరిగింది. అందుకే ప్రభుత్వ ఏర్పాటులో మెజారిటీ వాటా ఆశించింది. దాన్ని దక్కించుకోగలిగింది ’అని మహారాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రత్నాకర్ మహాజన్ అన్నారు. అవన్నీ ఊహాగానాలు: ఏక్నాథ్ శిందే కాగా తామిద్దరి మధ్య విబేధాలున్నట్లు వస్తున్న వార్తలను ఏక్నాథ్ శిందే ఖండించారు. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. మహాయుతి సంకీర్ణంలో ‘ప్రచ్ఛన్న యుద్ధం‘ అవాస్తవం. అంతా ‘ఠండా ఠండా కూల్ కూల్’. మేం కలిసికట్టుగా అభివృద్ధి నిరోధకులపై యుద్ధం చేస్తున్నాం’’అని పేర్కొన్నారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి లాగా పదవుల కోసం వెంబడించడం లేదా అధికారాన్ని దోచుకోవడం మహాయుతి ఎజెండాకు వ్యతిరేకం. ఎవరేమన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగడం, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’అని ఉద్ఘాటించారు. మీడియా సెల్ ఏర్పాటులో తప్పేంలేదు: ఫడ్నవీస్ సచివాలయంలో మీడియా సెల్ ఏర్పాటుపై విలేకరుల ప్రశ్నకు సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ, ‘ప్రజలకు సహాయం చేయడమే దాని లక్ష్యం. కాబట్టి అలాంటి సెల్ ఏర్పాటులో తప్పు లేదు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను కూడా ఇలాంటి సెల్‌ను ఏర్పాటు చేసాను.‘ అని తెలిపారు. -
అమెరికా ‘గ్రీన్‌ల్యాండ్’ కలలకు చెక్ పెట్టిన డెన్మార్క్!
గ్రీన్‌ల్యాండ్ స్వాదీనం కోసం డెన్మార్క్‌కు అగ్రరాజ్యం బెదిరింపులు.. కొన్ని లక్షల మంది ఊబకాయులున్న అమెరికాపైనే ప్రభావం చూపించనున్నాయి. బెదిరింపులకు, ఊబకాయులకు సంబంధమేంటనే సందేహం వస్తోంది కదూ.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే! గ్రీన్‌ల్యాండ్‌పై ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం అమెరికా, యూరప్ దేశం డెన్మార్క్ ప్రచ్ఛన్న పోరు కొనసాగుతోంది. గ్రీన్‌ల్యాండ్ ఖనిజ సంపదపై కన్నేసిన డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికైన నాటినుంచే కొనుగోలు ఆలోచనను తెరపైకి తెచ్చారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన చర్యలను వేగవంతం చేశారు. గ్రీన్‌ల్యాండ్‌పై అధికారాలున్న డెన్మార్క్‌పై బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ ప్రతిపాదనకు అంగీకరించకపోతే అధిక సుంకాలు విధిస్తామంటూ డెన్మార్క్‌ను హెచ్చరించారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమనే సంకేతాలూ ఇచ్చారు. అయినా గ్రీన్‌ల్యాండ్ అమ్మకానికి లేదంటూ డెన్మార్క్ స్పష్టం చేసింది. అమెరికా టారిఫ్ బెదిరింపులు డెన్మార్క్‌ను ప్రభావితం చేయడం ప్రశ్నార్థకమే. ఎందుకంటే అమెరికాను ఎదుర్కోవడానికి డెన్మార్క్ దగ్గర కీలక ఆయుధాలున్నాయి. వీటిలో మొదటిది ఊబకాయాన్ని తగ్గించే ఔషదం ఓజెంపిక్, రెండోది పిల్లలకు ఇష్టమైన లెగో బొమ్మల ఎగుమతులు. ప్రపంచంలోనే అత్యధిక ఊబకాయులు అమెరికాలోనే.. ప్రపంచంలోనే అత్యధిక ఊబకాయం రేటు అమెరికాలో ఉంది. ఓ నివేదిక ప్రకారం.. 23 అమెరికన్ రాష్ట్రాల్లో, ముగ్గురు పెద్దల్లో ఒకరి కంటే ఎక్కువ మంది (35%) ఊబకాయంతో బాధపడుతున్నారు. డానిష్ ఫార్మా దిగ్గజం నోవో నోర్డిస్క్ తయారు చేసిన ఓజెంపిక్, వెగోవి మందులు.. అమెరికాలో ఊబకాయం, డయాబెటిస్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. 2021 నుంచి 2023 వరకు అమెరికాలో ఓజెంపిక్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య 400 శాతం పెరిగింది. ఇప్పటికే అమెరికన్లు ఒక ఓజెంపిక్ ప్యాకెట్ కోసం దాదాపు వెయ్యి డాలర్లు చెల్లిస్తున్నారు. బీమా, డిస్కౌంట్లు లేకుండా అది కాస్తా 1300 డాలర్లు అవుతుంది. ఒకవేళ అమెరికా ఈ మందులు తయారు చేయాలనుకున్నా.. ఓజెంపిక్, వెగోవిలకు అవసరమైన సెమాగ్లుటైడ్ డెన్మార్క్‌లోనే తయారవుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ఇప్పటికే ఈ మందుల ధర ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ డెన్మార్క్‌పై భారీ సుంకాలు విధిస్తే ఓజెంపిక్, వెగోవి ధరలు పెంచే అవకాశం ఉంది. ఆ ఒక్కటే కాదు.. ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా ప్రకారం 2023లో డెన్మార్క్ నుంచి 5.7 బిలియన్ డాలర్ల విలువైన మందులు, వ్యాక్సిన్లు మరియు యాంటీబయాటిక్స్‌ను అమెరికా దిగుమతి చేసుకుంది. డెన్మార్క్ కేంద్రంగా లెగో గ్రూప్... ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల తయారీ సంస్థ లెగో గ్రూప్ కూడా డెన్మార్క్ కేంద్రంగానే పనిచేస్తోంది. ఈ బొమ్మలకు అమెరికాలో ప్రజాదరణ ఎక్కువ. అంతేకాదు.. అమెరికాకు వినికిడి పరికరాల సరఫరాలో కూడా డెన్మార్క్‌దే అగ్రస్థానం. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ టారిఫ్ బెదిరింపులు.. తిరిగి అమెరికాకు తలనొప్పులు తెచ్చే అవకాశం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీలో ముసలం.. పార్టీ ఎమ్మెల్యేకు హైకమాండ్ షోకాజ్‌నోటీసులు
బెంగళూరు: కర్ణాటక బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర కాగా.. మరొకటి సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ గ్రూప్‌గా తయారైంది. పార్టీలో అంతర్గత విబేధాల నేపథ్యంలో నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.తాజాగా బసనగౌడ, విజయేంద్ర వివాదంపై బీజేపీ హైకమాండ్ జోక్యం చేసుకుంది. ఈ మేరకు బసనగౌడ యత్నాల్‌కు షోకాజ్ నోటీసులు అందించింది. పార్టీ సిద్దాంత వ్యతిరేక వ్యాఖ్యలపై పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని లేకుంటే అధిష్టానం చర్యలు తీసుకుంటుందని తెలిపింది.‘రాష్ట్ర స్థాయి పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా యత్నాల్ ప్రవర్తిస్తున్నారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించడం, బహిరంగ ప్రకటనలు చేయడం ఆందోళన కలిగించే విషయం. యత్నాల్ వైఖరి రాజకీయ, ప్రజా ప్రాముఖ్యత ఉన్న అన్ని విషయాలపై పార్టీ అధికారిక వైఖరికి విరుద్ధంగా ఉంది. పార్టీ నాయకులపై మీరు చేసిన తప్పుడు, ఆరోపణలు పార్టీ క్రమశిక్షణను తీవ్రంగా ఉల్లంఘించడమే. మీ చర్యలపై పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. లేనిపక్షంలో పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది’ అని షోకాజ్ నోటీసులో పేర్కొంది. కాగా విజయేంద్రపై బసనగైడ తరుచూ విమర్శలు చేస్తున్నారు. విజయేంద్ర ఆయన వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని,పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఆయనే కారణమయ్యారని ఆరోపించారు. ఈ క్రమంలోనే హైకమాండ్ చర్యలు చేపట్టింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక, తాజాగా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బీఎస్ యడియూరప్ప, విజయేంద్రనే కారణమని పాటిల్ తీవ్ర విమర్శలు చేశారు. వీరిద్దరూ పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణా నోటీసులపై స్పందించిన యత్నాల్.. పార్టీ నోటీసులకు సమాధానం చెబుతానని పేర్కొన్నారు. కర్ణాటకలో పార్టీ ప్రస్తుత స్థితిని కూడా తెలియజేస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా శనివారం ఢిల్లీలో పార్టీ జాతీయ నాయకత్వంతో విజయేంద్ర భేటీ అయిన నేపథ్యంలో ఈ నోటీసులు వెలువడ్డాయి. రాజకీయ లబ్ధి కోసం యత్నాల్ తనపై, తన తండ్రి బీఎస్ యడియూరప్పపై నిత్యం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విజయేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. -
పోలీసులు బదిలీల్లో మితిమీరిన రాజకీయ జోక్యం
నంద్యాల, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో అన్నింటా మితిమీరిన రాజకీయ జోక్యం నడుస్తోంది. కూటమి నేతల్లో ప్రభుత్వం ఏర్పాటు నుంచి అధికార దర్పం ప్రదర్శించడం మరీ ఎక్కవైపోయింది. ఈ క్రమంలో వాళ్ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అధికారులు నలిగిపోతున్నారు. నందికొట్కూరులో నంద్యాల ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య పోస్టింగ్ ల రగడ నెలకొంది. పోలీసులు బదిలీల్లో రాజకీయ జోక్యం శ్రుతి మించిపోయింది. మొన్న నందికొట్కూరు సర్కిల్ సీఐ పోస్టింగ్ లో నువ్వా నేనా అంటూ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరగ్గా.. ఇవాళ జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ ఎస్ఐగా కేశవకి పోస్టింగ్ ఇప్పించుకున్నారు ఎంపీ శబరి. అయితే.. ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్న ఐదు నిమిషాల్లోనే ఎస్ఐ కేశవను బదిలీ చేపించారు ఎమ్మెల్యే జయసూర్య. ఇదే తరహాలో ముచ్చుమర్రి పీఎస్ ఎస్ఐగా ఎవరివారే సిఫార్సు చేసిన వాళ్లకు పోస్టింగ్ ఇవ్వాలంటున్న పట్టుపట్టారు ఇద్దరు. పోలీస్ ఉన్నతాధికారులు డీఓలు వేయడం, వెంటనే రద్దు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నేతల సిఫార్సులకు నాలుగు సింహలు తలోగుతుండగా.. అధికారుల తీరుతో సర్కిల్ పోలీస్ సిబ్బంది నలిగిపోతున్నారు. -
పార్టీ చీఫ్ పదవి కోసం పోటీపడుతున్న నేతలు
-
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఏపార్టీ గెలిస్తే ఆ పార్టీకే అధికారం
-
టిడిపి-జనసేన పొత్తుతో రెండు పార్టీల నేతల్లో గందరగోళం
-
కూతురితో వివాదం.. ముత్తిరెడ్డికి బిగ్ రిలీఫ్
సాక్షి, జనగామ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కూతురు తుల్జా భవానీరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తండ్రి మీద మీడియా ముందు విపరీతమైన ఆరోపణలు చేస్తూ వస్తోంది తుల్జా భవానీ. అయితే ఈ తండ్రీకూతుళ్ల కోల్డ్‌వార్ కొత్త మలుపు తిరిగింది. భవానీ అడ్డగోలుగా తన మీద ఆరోపణలు చేయకుండా నిలువరించేలా.. కోర్టు ద్వారా భవానీకి నోటీసులు జారీ చేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. తన పరువుకి భంగం కలిగించేలా కూతురు తుల్జా భవానీరెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని.. అందుకు తగ్గ ఆదేశాలు జారీ చేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ముత్తిరెడ్డి విజ్ఞప్తిని కోర్టు పరిశీలించింది. ప్రెస్, మీడియా, వాట్సాప్ ద్వారా ప్రకటనలు. YouTube, ఇతర ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాతో సహా మౌఖిక లేదంటే వ్రాత రూపంలో నేరుగాకానీ, పరోక్షంగాకానీ మాట్లాడవద్దని తుల్జా భవానీరెడ్డికి మధ్యంతర నిషేధ ఉత్తర్వు జారీ చేసింది కోర్టు. తద్వారా ముత్తిరెడ్డికి భారీ ఉపశమనం లభించినట్లయ్యింది. భూవ్యవహారంతో మొదలైన ఈ తండ్రీకూతుళ్ల మాటల యుద్ధం రోజురోజుకీ ముదురిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూట్యూబ్ సహా అన్ని మీడియా ఛానెల్స్ ముందు తండ్రిపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారామె. అంతేకాదు.. తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని చెబుతూనే.. తన తండ్రి దుర్మార్గుడని, సీటు ఇవ్వొద్దంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసిందామె. ముత్తిరెడ్డి మాత్రం తమ కుటుంబ సమస్యలను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని, తన కూతురిని తప్పు దోవ పట్టిస్తున్నారని చెబుతున్నారు . మరోవైపు తన కూతురు, అల్లుడు తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ దాఖలైన కేసులో విచారణ కొనసాగుతోంది కూడా. -
వరంగల్‌లో కొట్టుకున్న బీజేపీ నేతలు!
-
TS: మోదీ పర్యటన వేళ.. పార్టీ ఆఫీసు ధ్వంసం చేసిన బీజేపీ నేతలు!
సాక్షి, వరంగల్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు.. కొన్ని జిల్లాల్లో పార్టీ నేతల మధ్య సఖ్యత కుదరడం లేదు. ఇక, రెండు రోజుల్లో వరంగల్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీలో రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గమన్నాయి. ఈ క్రమంలో పార్టీ నేతలు బీజేపీ ఆఫీసుపైనే దాడులు చేయడం సంచలనంగా మారింది. కొందరు నేతలు తమకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు. వివరాల ప్రకారం.. నర్సంపేట పట్టణంలో బీజేపీలో ఒక్కసారిగా ఎప్పటి నుండో నివురుగప్పిన ట్లుగా ఉన్న అసమ్మతి బయటకు వచ్చింది. పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంపై సొంత పార్టీ నేతలు దాడి చేశారు. పార్టీలో మాకు గుర్తింపు లేదు, ప్రాధాన్యం లేదని దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో, ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. వాగ్వాదంలో భాగంగా పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారు. అయితే, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సమక్షంలోనే ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం. ఇక, ప్రధాని మోదీ పర్యటన వేళ వరంగల్ జిల్లాలో ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: త్వరలో ధరణి ఫైల్స్ రిలీజ్ చేయబోతున్నాం.. రేవంత్ సంచలన ఆరోపణలు -
‘గులాబీ’కి చికాకు తెప్పిస్తున్నారా?.. బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి?
ఉమ్మడి నల్గొండ జిల్లాను మరోసారి స్వీప్ చేయడానికి బీఆర్ఎస్ నాయకత్వం వేస్తున్న ప్లాన్ ఏంటి? అధినేత ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు పొరపాట్లు సరిచేసుకుంటున్నారా? తప్పులు దిద్దుకోనివారి పరిస్థితి ఏంటి? టిక్కెట్ కోసం కొట్టుకుంటున్నవారిని ఎలా దారికి తెస్తారు? గులాబీ పార్టీకి చికాకు తెప్పిస్తున్న నియోజకవర్గం ఎక్కడుంది? అది కాంగ్రెస్‌కు కంచుకోట నల్గొండ జిల్లాను కాంగ్రెస్‌కు కంచుకోట అని చెబుతారు. ఇక్కడి నుంచి ఇద్దరు ఎంపీలు కూడా ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందినవారే ఉన్నారు. కాని ఒక్కరంటే ఒక్కరు కూడా హస్తం పార్టీ ఎమ్మెల్యే ఈ జిల్లాలో లేరు. జిల్లా మొత్తం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలే. మునుగోడు గెలుచుకోవడం ద్వారా నల్గొండ జిల్లాను గులాబీ సేన క్లీన్ స్వీప్ చేసేసినట్లయింది. రానున్న ఎన్నికల్లో కూడా మొత్తం 12 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని జిల్లాలో తమదే తిరుగులేని ఆధిపత్యం అని చాటుకోవడానికి గులాబీ పార్టీ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు పార్టీకి చికాకు తెప్పిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం దేవరకొండలో నేతల మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరినట్లు సమాచారం. సిటింగ్ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్న దేవేందర్ నాయక్ మధ్య సీటు పోరు కొంతకాలంగా సాగుతోంది. పార్టీ ఫిరాయించి వచ్చిన రవీంద్రకుమార్‌కు కాకుండా తొలినుంచీ ఉద్యమంలో ఉన్న తనకు టిక్కెట్ ఇవ్వాలని మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన దేవేందర్ నాయక్ గట్టిగా పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల సందర్భంగా ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు మరోసారి బయట పడినట్లు తెలుస్తోంది. ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతన్న సమయంలోనే దేవేందర్ నాయక్ తన వర్గంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారట. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసమ్మతి వెనుక ఓ సీనియర్ నేత మరోవైపు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కేడర్‌కు కూడా అర్థంకాక తలలు పట్టుకున్నారట. ఇదే విషయం అధినేత దృష్టికి కూడా వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తీరు పట్ల నియోజకవర్గంలోని నేతలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని టాక్ నడుస్తోంది. పార్టీ గాని, ప్రభుత్వం కాని నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడంలేదని గులాబీ పార్టీ నేతలు ఎమ్మెల్యే పట్ల గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్యేను వ్యతిరేకించే నేతలంతా ఒక వర్గంగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో రవీంద్ర కుమార్‌కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పేశారట. ఈ అసమ్మతి వెనుక జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది. రవీంద్ర కుమార్ మాజీ గురువు అయిన ఆ నేత....తనను కాదని మరో పవర్ సెంటర్లో చేరిపోయిన తన మాజీ శిష్యుడిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉన్నారనే ప్రచారం సైతం సాగుతోంది. ఆ సీనియర్ నేతకు దేవరకొండపై మంచి పట్టు ఉండటంతోపాటు తన వైరివర్గంలో చేరిన ఎమ్మెల్యేకు ఎలా అయినా చెక్ పెట్టాలని వ్యూహాలు పన్నుతున్నారట. ఇదే సమయంలో టికెట్ ఆశిస్తున్న దేవేందర్ నాయక్‌ను తన వైపు తిప్పుకున్నారట. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో దేవరకొండలో జరుగుతున్న వ్యవహారాలు పార్టీ నాయకత్వానికి చికాకు కలిగిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు నేతల మధ్య టిక్కెట్ పోరు ఎక్కడికి దారితీస్తుందో అన్న ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. చదవండి: బెజవాడ రాజకీయాలు.. కేశినేని నాని దారెటు? -
పెద్దన్నల రూట్ మారితే..
అమెరికా, చైనా మధ్య తుది ఘర్షణ చోటు చేసుకుంటే ఇది భారతదేశానికి వ్యూహాత్మక విన్యాసానికి చోటు లేకుండా చేస్తుంది. స్నేహితుడు, ప్రత్యర్థి ఇద్దరి నుంచీ ‘నువ్వు ఉంటే మాతో ఉండు లేదా వ్యతిరేకంగా ఉండు’ అనే ఒకే రకమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా అమెరికా, చైనా మధ్య సంబంధాల ‘స్థిరీకరణ’ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు చైనా అప్రకటిత మద్దతు చెప్పడం కూడా వీటిని ఆపడం లేదు. ఈ పరిణామాలపై అప్పుడే భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ భారత్ ప్రయోజనాలపై ఇవి ప్రభావం చూపుతాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా, నిర్దిష్టంగా అంచనా వేయాల్సి ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా, తన ప్రపంచా ధిపత్యానికి చైనా ముప్పు కలిగిస్తూ ఎదుగు తోందని అమెరికా గ్రహిస్తోంది. రెండు దేశాల మధ్య బలాబలాల అంతరం క్రమంగా క్షీణిస్తోంది. ఆర్థిక, సైనిక, సాంకేతికపరమైన ప్రతి శక్తి కొలమానంలోనూ ఇది కనిపిస్తోంది. ప్రపంచంలోనే చైనా రెండో అతిశక్తిమంతమైన దేశం. అమెరికాను అగ్రపీఠం నుంచి తప్పించి తాను నంబర్ వన్ దేశంగా మారాలన్న తన ఆకాంక్షను వ్యక్తపర్చే విషయంలో చైనా ఏమాత్రం మొహమాటపడదు. కాబట్టి రెండు దేశాల మధ్య ఘర్షణ వ్యవస్థీకృతంగానే ఉంటోంది. పరివర్తన చెందుతున్న భౌగోళిక రాజకీయ వ్యవస్థ కేంద్రంగా తాను ఆవిర్భవించడం అనివార్యమని చైనా అభిప్రాయం. దీన్ని వెనక్కి తిప్పలేకపోయినా, కనీసం ఈ పరిణామాన్ని ఆపాలని అమె రికా కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో ఎవరు నెగ్గుతారు అనేది స్పష్టం కావడం లేదు కానీ, దీని పర్యవసానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి ఆసియా దేశాలపై ప్రభావం చూపుతాయి. ఈ కారణం చేత, అమెరికా–చైనా సంబంధాలలోని పరిణామాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది. ఎందుకంటే అవి భారత్ భౌగోళిక రాజకీయ అవకాశాలపై గణనీయంగా ప్రభావితం చూపుతాయి. నేను భారత్ దృక్కోణాన్ని అందిస్తాను. అన్ని రకాల ఘర్షణ, కుట్రల కోణంలో చూస్తే– అమెరికా, చైనా సంబంధాలు చివరి ఘర్షణ వైపుగా పయనిస్తున్నాయని అనుకోవచ్చు. కానీ ఈ తుది ఘర్షణ భారతదేశానికి ఒక వ్యూహాత్మక విన్యాసానికి చోటు లేకుండా చేస్తుంది. స్నేహితుడు, ప్రత్యర్థి ఇద్దరి నుంచీ ‘నువ్వు ఉంటే మాతో ఉండు లేదా వ్యతిరేకంగా ఉండు’ అనే ఒకే రకమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎత్తుగడల రీత్యా అయినా సరే... నిర్దిష్ట ప్రభావిత రంగాలను గుర్తించడం ద్వారా తమ మధ్య పోటీని నియంత్రించడానికి రెండు పార్టీలూ తీసుకునే నిర్ణయం నుంచే అమెరికా, చైనా మధ్య పొత్తు సంభవించవచ్చు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా, నాటి సోవియట్ యూనియన్ మధ్య జరిగింది ఇదే. అలాంటిది ఏదైనా జరిగినప్పుడు చైనా తూర్పు ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని స్పష్టంగా నొక్కి చెప్పుతుంది, అదే సమయంలో పశ్చిమార్ధగోళంలో అమెరికా ప్రాభవాన్ని అంగీకరిస్తుంది. చైనీస్ వ్యూహకర్తలు తరచుగా ఈ దోపిడీ విభజనను పశ్చిమ పసిఫిక్ మధ్య గీత గీయడం ద్వారా నొక్కి చెబుతారు. అప్పుడు హిందూ మహాసముద్రం వ్యూహాత్మకంగా చైనా ప్రభావంలో పడిపోతుంది. ఇది భారత్‌కు శాపం అవుతుంది. ఈ ఆకస్మికత అసంభవంగా కనిపిస్తున్నప్పటికీ, దాన్ని పూర్తిగా తోసి పుచ్చకూడదు. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా సంబంధాల్లోని ఇటీవలి కొన్ని పరిణామాల ప్రాధాన్యత ఏమిటి? మే 10, 11న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్, చైనా ప్రభుత్వ కౌన్సిలర్, మాజీ విదేశాంగ మంత్రి వాంగ్ యీని వియన్నాలో కలిశారు. ‘యుఎస్– చైనా ద్వైపాక్షిక సంబంధం, అంతర్జాతీయ, ప్రాంతీయ భద్రతా సమస్యలకు సంబంధించిన కీలక అంశాలపై నిష్కపటమైన, వాస్తవి కమైన, నిర్మాణాత్మక చర్చలు జరిగా’యని వైట్ హౌస్ నివేదించింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, తైవాన్ సమస్య తదితర అంశాలపై కూడా చర్చలు జరిగినట్లు తెలిపింది. ఈ చర్చలను వివరించడానికి చైనా షిన్వా న్యూస్ ఏజెన్సీ కూడా ఇదేవిధమైన పదజాలాన్ని ఉపయోగించింది. ౖ‘చెనా–అమెరికా సంబంధాల్లోని అవరోధాలను తొలగించి, స్థిరీకరించడంపై ఇరుపక్షాల మధ్య నిష్కపటమైన, లోతైన, వాస్తవికమైన, నిర్మాణాత్మక చర్చలు జరిగా’ యని నివేదించింది. ఇది అమెరికా, చైనా మధ్య వివిధ స్థాయిల్లో ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన వివిధ అంశాల్లో చర్చలు, సంభాషణల పునరుద్ధరణకు మార్గాన్ని సుగమం చేసింది. అమెరికా వాతావరణ విభాగానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక దూత జాన్ కెర్రీని చైనా సందర్శనకు ఆహ్వానించారని నివేదించారు కూడా. అమె రికా వాణిజ్య ప్రతినిధి కేథరీన్ తాయ్ మే 25–26 తేదీల్లో డెట్రా యిట్‌లో జరగనున్న అపెక్ వాణిజ్య మంత్రుల సమావేశంలో చైనా వాణిజ్యమంత్రి వాంగ్ వెన్ తావోతో చర్చలు జరపనున్నారు. జూన్ నెలలో సింగపూర్ లోని షాంగ్రి–లా చర్చల్లో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, చైనా రక్షణమంత్రి జనరల్ లీ షాంగ్ఫుతో భేటీ కానున్నారు. చైనాలో నూతన రాజకీయ ప్రతినిధులతో కమ్యూనికేషన్ ఛానల్స్ ఏర్పాటుపై అమెరికా ఆసక్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. బీజింగ్ కొత్త నాయకత్వంలో అనేక కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చైనా పక్షం ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ 20న జాన్ హాప్కిన్ ్స యూనివర్సిటీలో చేసిన, జాగ్రత్తగా రూపొందించిన ప్రసంగంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ ఎల్లెన్, అమెరికా–చైనా పొత్తులో ఈ నూతన దశ గురించి సంకేతాలిచ్చారు. ‘సంపద్వంతమైన చైనా... అమెరికాకు, ప్రపంచానికి కూడా మంచిదే కాబట్టి పెరుగుతున్న చైనా సంపద ప్రమాదకరమని అమెరికా ఏమాత్రమూ భావించడంలే’దని ఎల్లెన్ ఆ ప్రసంగంలో వివరించారు. చైనా నుంచి మన ఆర్థిక వ్యవస్థను విడగొట్టాలని అమెరికా చూడటం లేదని ఆమె చెప్పారు. ‘మన రెండు ఆర్థిక వ్యవస్థలూ సంపూర్ణంగా వేరుపడిపోతే అది రెండు దేశాలకూ వినాశకరమవుతుంది, అది తక్కిన ప్రపంచాన్ని కూడా అస్థిరపరుస్తుంది’ అని ఆమె చెప్పారు. ఈ అంశాన్ని నొక్కి చెప్పడానికిగానూ, అమెరికా–చైనా వాణిజ్యం ప్రస్తుతం 750 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఆమె తెలిపారు. ఇది దేన్ని సూచిస్తుంది? ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యాకు చైనా నిశ్శబ్ద మద్దతు ప్రకటించడం అనేది చైనాతో సంబంధాల ‘స్థిరీకరణ’ కోసం అమెరికా చేపట్టిన ఈ ముఖ్యమైన చర్యను నిరోధించలేదు. ఇటీవలి కాలంలో ఘర్షణాత్మక దిశకు దారితీసిన తైవాన్ సమస్య ఇప్పుడు కాస్త సద్దుమణిగిననట్లు కనిపిస్తోంది. చైనా పక్షం నుంచి కూడా దీనిపై కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. తైవాన్ స్థితి గీత దాట కూడని బాటమ్ లైన్ కి ప్రాతినిధ్యం వహిస్తోందనీ, అది అమెరికా, చైనా సంబంధాల సంపూర్ణత్వాన్ని సూచించదనీ చైనా పేర్కొంది. స్పష్టంగానే, తైవాన్ జలసంధిలో ప్రమాదకరమైన ఘర్షణ నుంచి వెనక్కు మళ్లాలని ఇరు పక్షాలూ నిర్ణయించుకున్నాయి. అమెరికా తీసుకున్న చొరవ తర్వాత గత నెలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మెక్రాన్ చైనాను సందర్శించారు. ఉక్రెయిన్‌పై చైనా వైఖరి భిన్నంగా ఉన్నప్పటికీ ఇది చైనాను బుజ్జగించ డానికి సంబంధించినదే అనడంలో సందేహం లేదు. చైనాను ‘వ్యవస్థీకృత’ ప్రత్యర్థిగా నిర్వచించినప్పటికీ, ఫ్రాన్స్, జర్మనీ రెండూ చైనాతో సంబంధాలు కొనసాగాల్సిన ప్రాధాన్యతను నొక్కి చెప్పాయి. భారత్ ఈ పరిణామాల పట్ల ఆందోళన చెందాల్సిందేనా? బహుశా ఈ దశలో అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే ఈ పరిణా మాలన్నీ ఏ దశను అనుసరిస్తాయో ఇంకా స్పష్టం కావడం లేదు. పైగా ఏదో అంశంపై తిరిగి ఘర్షణ ఏర్పడటం ద్వారా లేదా వివాదాస్పద సమస్య ద్వారా అమెరికా, చైనా బంధాలు మళ్లీ పట్టాలు తప్పుతాయా అన్నది కూడా అస్పష్టమే. అయితే ఇవి ఎలా పరిణమిస్తాయన్నదే భారత్ ప్రయోజనాలపై ప్రభావం చూపుతుంది కాబట్టి వీటిని జాగ్రత్తగా, నిర్దిష్టంగా అంచనా వేయాల్సి ఉంటుంది. కాకతాళీ యంగా, చైనాతో సాయుధ ఘర్షణ సంభవించిన పక్షంలో భారత్‌పై అమెరికా పెద్దగా ఆధారపడి లేదని అమెరికాలో పలు వ్యాఖ్యలు వినిపి స్తున్నాయి. అంటే అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలను తగ్గించు కోవడంపై భారత్ ప్రతిస్పందనల పట్ల అమెరికా పెద్దగా సావధానత చూపదని ఇది సూచిస్తుంది. శ్యామ్ శరణ్, వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
విద్వేషమే విడదీసింది! కొరియన్ యుద్ధానికి కారణమెవరు? చివరకు మిగిలింది!
ఉత్తర కొరియా. ప్రపంచంలో దూర్త దేశాల్లో ఒకటిగా అగ్రరాజ్యం అమెరికాతోపాటు యూరప్ దేశాలు గుర్తించిన దేశం. అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా వరుస క్షిపణి ప్రయోగాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. యథేచ్ఛగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. అణ్వాయుధాలకూ పదును పెడుతోంది. తమవైపు కన్నెత్తి చూస్తే ఖబడ్దార్ అంటూ ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరిస్తున్నారు. అమెరికా–దక్షిణ కొరియా కూటమి సంయుక్తంగా సైనిక విన్యాసాలపై మండిపడుతున్నారు. తాజాగా 48 గంటల వ్యవధిలో రెండుసార్లు క్షిపణి ప్రయోగాలు జరిపారు! ఉభయ కొరియాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండటం ప్రపంచ దేశాలను ఆందోళన పరుస్తోంది. వీటి మధ్య ఇంతటి విద్వేషానికి కారణమేమిటి...? ఉత్తర, దక్షిణ కొరియాల శత్రుత్వానిది దశాబ్దాల చరిత్ర. స్వతంత్ర దేశమైన ఉమ్మడి కొరియా ద్వీపకల్పాన్ని 1910లో జపాన్ ఆక్రమించుకుంది. 1945 దాకా నిరంకుశ పాలనలో కొరియా మగ్గిపోయింది. జపాన్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టింది. కమ్యూనిస్టు నేత కిమ్ ఇల్–సంగ్ కొరియా విముక్తి కోసం మంచూరియా నుంచి జపాన్ సైన్యంపై గెరిల్లా యుద్ధం చేశారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్ అధీనంలో ఉన్న కొరియాలోకి సోవియట్ సేనలు అడుగుపెట్టాయి. 38వ ప్యారలెల్ లైన్ దాకా దూసుకొచ్చాయి. దాని దిగువ ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంది. అలా కొరియా విభజనకు బీజం పడింది. 1945లో ప్యారలెల్ లైన్‌కు ఎగువన తమ అధీనంలోని కొరియా ప్రాంతంలో పాంగ్యాంగ్ రాజధానిగా సోవియట్ సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే ఉత్తర కొరియా. దిగువ ప్రాంతంలో అమెరికా సైనిక ప్రభుత్వాన్ని నెలకొల్పింది. అదే దక్షిణ కొరియా! ప్రచ్ఛన్నయుద్ధం చిచ్చు కొరియాకు స్వాతంత్య్రం ఇవ్వడానికి ఉమ్మడి వేదిక ఏర్పాటు చేయాలని సోవియట్ యూనియన్, మిత్రదేశాలు భావించాయి. ప్రపంచాధిపత్యం కోసం అమెరికాతో సాగిన ప్రచ్ఛన్న యుద్ధంలో ఉత్తర కొరియా మద్దతు కోసం అక్కడి కమ్యూనిస్టులను సోవియట్ ప్రోత్సహించింది. దాని అండతో కిమ్ ఇల్ సంగ్ పెద్ద నేతగా అవతరించాడు. 1948లో ప్రధానిగా పీఠమెక్కాడు. అనంతరం సోవియట్ సేనలు ఉత్తర కొరియాను వీడాయి. మరోవైపు దక్షిణ కొరియాలో అమెరికా సైన్యం కమ్యూనిస్టులను కఠినంగా అణచివేసింది. అమెరికాలో చదివిన కమ్యూనిస్టు వ్యతిరేకి సైంగ్ మాన్ రీ కి మద్దతిచ్చింది. 1948లో జరిగిన ఎన్నికల్లో సైంగ్‌మాన్ రీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1949లో అమెరికా సైన్యం దక్షిణ కొరియా వీడింది. అక్కడి నుంచి ఇరు కొరియాల మధ్య కొట్లాటకు బీజం పడింది. కొరియా ద్వీపకల్పం మొత్తాన్ని తామే పాలిస్తున్నామని, ఉభయ ప్రభుత్వాలు వాదించడం మొదలుపెట్టాయి. కిమ్ ఇల్ సంగ్ నాటి సోవియట్, చైనాల్లోని కమ్యూనిస్టు పాలకులు స్టాలిన్, మావోల మద్దతు కోరారు. ఇటు సైంగ్ మాన్ రీ కూడా ఉత్తర కొరియాను జయించాలన్న ఆకాంక్షలను దాచుకోలేదు. ఇది కొరియన్ యుద్ధానికి దారితీసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మాళవిక మోహనన్‌పై నయన్ ఫ్యాన్స్ ట్రోల్స్.. దిగొచ్చిన నటి
లేడీ సూపర్ స్టార్ అంటే ఎవరికైనా టక్కున గుర్తొచ్చే పేరు నయనతార. అయితే నయన్‌కు ఆ బిరుదు అవసరం లేదంటూ హీరోయిన్ మాళవిక మోహనన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యింది. గత కొన్ని రోజులుగా నయన్-మాళవిక మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మోహనన్ మరోసారి నయన్‌ను అవమానించింది. లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి మీ అభిప్రాయం ఏంటి అన్న ప్రశ్నకు వెంటనే కల్పించుకున్న మాళవికా మోహనన్.. 'లేడీ సూపర్ స్టార్ అనడం తనకు నచ్చదని,హీరోయిన్లను సూపర్ స్టార్ అంటే చాలు. లేడీ సూపర్ స్టార్ అనడం ఏంటి' అంటూ బదులిచ్చింది. ఆమె వ్యాఖ్యలపై నయన్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నయన్ స్టార్డమ్ చూసి ఓర్వలేకనే మాళవిక ఇలా ప్రతీసారి నయన్ పేరు వాడుకుంటుందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుండటంతో దిగొచ్చిన మాళవిక మరో ట్వీట్ చేస్తూ తను చేసిన కామెంట్స్‌పై వివరణ ఇచ్చింది. హీరోయిన్ల విషయంలో నా అభిప్రాయన్నా చెప్పాను తప్పా ఓ హీరోయిన్ని టార్గెట్ చేస్తూ నేనలా అనలేదు. నిజానికి నయనతార అంటే నాకు ఇష్టం. ఆమెను ఎంతో గౌరవిస్తాను. సీనియర్‌గా ఆమె కెరీర్ చూసి ప్రేరణ పొందుతాను కాబట్టి దయచేసి అందరూ కాస్త శాంతించండి అంటూ మాళవిక పేర్కొంది. Dont Call As Lady Super #MalavikaMohanan pic.twitter.com/OS3wTml8j4 — chettyrajubhai (@chettyrajubhai) February 11, 2023 My comment was about a term that is used to describe female actors & not about any specific actor. I really respect & admire Nayanthara, and as a senior really look upto her incredible journey. Can people please calm down. Especially the tabloid journos. Only ♥️ to Miss N https://t.co/QyrfqOoJWU — Christy (@MalavikaM_) February 12, 2023 -
నయనతారను అవమానించిన హీరోయిన్ మాళవిక
తమిళ సినిమా: నటి నయనతార–మాళవికా మోహన్ మధ్య కోల్డ్‌వార్ జరుగుతోందా అన్న సందేహం కలుగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల మాళవికా మోహన్ సమయం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. నయనతార నటించి, నిర్మించిన కనెక్ట్ చిత్రం గత డిసెంబర్ 22వ తేదీ విడుదలైంది. ఆ సందర్భంలో ఆస్పత్రిలో బెడ్‌పై పడుకున్న సన్నివేశంలోనూ ఫుల్ మేకప్‌తో జుట్టు కూడా చెదరకుండా నటించినట్లు నటి నయనతార పేరు చెప్పకుండా విమర్శించారు. ఆమెకు కౌంటర్ ఇచ్చే విధంగా కనెక్ట్ చిత్రం ఆర్ట్ ఫీలింగ్ కాదని, కమర్షియల్ చిత్రం అని, అందుకే దర్శకుడు అశ్విన్ సూచన మేరకే తాను అలా నటించానని నయన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మాళవిక మోహన్ మరోసారి నటి నయనతారను అవమానించే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక విలేకరి లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి మీ అభిప్రాయం ఏంటన్న ప్రశ్నకు వెంటనే కల్పించుకున్న మాళవికా మోహన్ లేడీ సూపర్ స్టార్ అనడం తనకు నచ్చదని అన్నారు. హీరోయిన్లను సూపర్‌స్టార్ అంటే చాలని లేడీ సూపర్‌స్టార్ అనడం ఏంటని ప్రశ్నించారు. హిందీలో కూడా దీపికా పడుకొనే, కత్రినా కైఫ్, అలియా భట్ వంటి సూపర్ స్టార్ హీరోయిన్లు ఉన్నారని, వారు ఎవరు లేడీ సూపర్‌స్టార్స్ అనడం లేదని పేర్కొన్నారు. దీంతో నయనతారపై ఈ అమ్మడుకి ఎందుకంత కోపం అంటూ సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. -
కాషాయ పార్టీలో కోల్డ్‌వార్!.. ఈటల, వివేక్ మధ్య విభేదాలకు కారణం?
తెలంగాణలో జెండా పాతేస్తామని కమలం పెద్దలు చెబుతున్నారు. ఇక్కడేమో పార్టీ నాయకులు గ్రూప్‌లుగా విడిపోయి రచ్చకెక్కుతున్నారు. వ్యక్తిగత వైరాలతో పార్టీ పరువు బజారుకీడుస్తున్నారని టాక్. నేతల మధ్య విభేదాలు కొంప ముంచుతాయని కేడర్ ఆందోళన చెందుతోంది. ఇంతకీ తెలంగాణలో రచ్చకెక్కిన ఆ ఇద్దరు ఎవరు? అసలు వారి మధ్య గొడవకు కారణం ఏంటి..? తెలంగాణలో అధికారమే లక్ష్యమని కమలం పార్టీ అధినాయకత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. రాష్ట్రానికి ఎవరు వచ్చినా వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతామని..అమిత్ షా ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ, రాష్ట్రంలోని ముఖ్య నాయకులు గ్రూపులు కడుతూ కేడర్‌ను అయోమయానికి గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని బీజేపీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఇద్దరూ కరీంనగర్ నేతలే.. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ గడ్డం వివేక్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోందని బీజేపీ ఆఫీస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే. హుజురాబాద్ ఎన్నికల సమయంలో కలిసి మెలిసి తిరిగిన ఈటల, వివేక్ మధ్య.. ఆ తర్వాత ఎక్కడో వ్యవహారం బెడిసి కొట్టింది. వివేక్ కాల్ చేసినా ఈటల రాజేందర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదని ప్రచారం నడుస్తోంది. దీంతో, పంచాయితీ కాస్తా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ మెంబర్ లక్ష్మణ్ ముందుకు వెళ్ళినట్టు సమాచారం. కారణాలపై పార్టీ పెద్దల ఆరా.. ఇక, సీనియర్ నాయకులతో మాట్లాడుకుంటూనే.. ఈటల రాజేందర్, వివేక్ పరస్పరం అరుచుకున్నట్లు సమాచారం. అయితే, అప్పుడే అనుకోకుండా అక్కడికి తెలంగాణ మంత్రి ఒకరు రావడంతో నేతల పంచాయితీ మధ్యలో ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఇంతగా రచ్చ కెక్కడానికి కారణాలేంటో పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలు రాష్ట్ర నాయలకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అప్పుడే అధికారంలోకి వచ్చేసినట్లుగా కొందరు నేతలు ఫీలవుతున్నారని.. అందుకే పార్టీలో గ్రూప్‌లో తయారవుతున్నాయని కేడర్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఢిల్లీ పెద్దల దగ్గర ప్రాధాన్యం పెరగడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో ఈటల, వివేక్ మధ్య విభేదాలు బయటికొచ్చాయి. అయితే, ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యం నిర్దేశించుకున్న సమయంలో నాయకుల మధ్య ఇలాంటి గొడవలు ఏమాత్రం మంచిది కాదని హైకమాండ్ గట్టిగా క్లాస్ పీకినట్లు సమాచారం. హైకమాండ్ చొరవతో అయినా ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా? లేదో వేచి చూడాల్సిందే. -
మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
-
మంత్రి మల్లారెడ్డిపై ఆ నలుగురి ఆగ్రహం!
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ ఎమ్మెల్యే, తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలు ఈ మేరకు సోమవారం భేటీ అయినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి వైఖరిపై రగిలిపోతున్నారు ఆ నలుగురు.. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని యత్నిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, జిల్లా పదవులన్నీ తీసుకెళ్లిపోయారని ఆ నలుగురు మండిపడుతున్నారు. ఈ మేరకు ఉప్పల్, కూకట్పల్లి, శేరిలింగం పల్లి ఎమ్మెల్యేలు.. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో భేటీ అయ్యారు. మల్లారెడ్డిపై అసమ్మతితోనే ఈ భేటీ నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. నామినేటెడ్ పోస్టులు మల్లారెడ్డికి సంబంధించిన అనుచరణ గణానికే ఇప్పించుకుంటున్నారని, మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ పోస్టుపై విషయంలో వాళ్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పోస్టులు ఒకే నియోజకవర్గానికి వెళ్లిపోయాయి. జిల్లా పదవులన్నీ మంత్రి తీసుకెళ్లారు. మంత్రి మల్లారెడ్డి మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ప్రభుత్వం, పార్టీ తీరుపై కాకుండా.. కేవలం మంత్రి మల్లారెడ్డి అంశంలోనే వాళ్లంతా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి మల్లారెడ్డి జోగులాంబ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిపై ఆయన స్పందించాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో మల్లారెడ్డి అంశంపై పంచాయితీని మంత్రి కేటీఆర్ దగ్గరకు తీసుకెళ్లాలని ఆ నలుగురు భావిస్తున్నారు. -
రష్మిక పరువు తీసేసిన రిషబ్ శెట్టి! మీడియా ముందే షాకింగ్ కామెంట్స్
కాంతార సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో రిషబ్ శెట్టి. ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లనలో ఒకరైన రష్మిక మందన్నా ప్రస్తుతం క్రేజీ హీరోయిన్గా ఛాన్సులు దక్కించుకుంటుంది. కన్నడ మూవీ కిరిక్ పార్టీ అనే సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన రష్మికకు మొదటగా ఛాన్స్ ఇచ్చింది రిషబ్ శెట్టినే అన్న విషయం చాలామందికి తెలియదు. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది రిషబ్ శెట్టినే. కిరిక్ పార్టీ తర్వాతే రష్మికకు వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే ఇటీవలె కాంతార మూవీ చూశారా అని అడగ్గా అంత టైం లేదని, సినిమా చూడలేదని రష్మిక చెప్పడంతో ఆమెపై విపరీతంగా ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఓ ఇంటర్వ్యూలో కూడా తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన రిషబ్ శెట్టి పేరు చెప్పకుండా, తన ఫోటో చూసి అవకాశం వచ్చిందని రష్మిక చెప్పడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి రష్మికకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సమంత, సాయిపల్లవి, రష్మికలలో నెక్ట్స్ ఎవరితో సినిమా చేయాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. 'కొంతమంది హీరోయిన్స్‌తో అస్సలు పనిచేయాలనుకోవడం లేదు. సమంత, సాయిపల్లవి పనితనం నాకు ఇష్టం. ఇంకా కొత్త హీరోయిన్స్‌తో వర్క్చేయాలనుకుంటున్నా' అంటూ రష్మిక పేరును వదిలేసి ఆమె సిగ్నేచర్ హ్యాండ్స్‌ను చూపిస్తూ కౌంటర్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ జరుగుతుందని ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చినట్లయ్యింది. మొదటి నుంచి రష్మిక కు రిషబ్ శెట్టికి మధ్య విభేదాలు నెలకొన్నాయని వార్తలు గుప్పుమన్నసంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. The Journey of two "✌️✌️" pic.twitter.com/rbGrdli6K9 — MNV Gowda (@MNVGowda) November 21, 2022 -
కారు పార్టీలో కోల్డ్‌వార్.. టీఆర్ఎస్లో ఎవరి దారి వారిదే!
సాక్షి, రంగారెడ్డి: అధికార పార్టీలో నేతల మధ్య సయోధ్య కరువవుతోంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం, మీర్‌పేట, బడంగ్పేట్, తుక్కుగూడ మున్సిపాలిటీల్లో అధికార పార్టీ పాలక మండలి సభ్యులు రెండుగా చీలిపోయి పరస్పర ఫిర్యాదులు చేసుకుంటుండగా తాజాగా అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. ఇప్పటి వరకు మిన్నకుండిన ద్వితీయశ్రేణి నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచే దారులు సిద్ధం చేసుకుంటున్నారు. అధిష్టానం వద్ద తమకే గుర్తింపు ఉందని, వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకు వస్తుందంటే తమకేనంటూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం విశేషం. ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో కేడర్ అయోమయానికి గురవుతోంది. చేవెళ్లలో కాలె వర్సెస్ రత్నం చేవెళ్ల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని, అధిష్టానం ఆశీస్సులు తమకే ఉన్నాయంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఎవరికి వారు సొంతంగా కేడర్‌ను తయారు చేసుకుని అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ చర్చనీయాంశమవుతున్నారు. మహేశ్వరంలో తీగల.. పటోళ్ల మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆయన కోడలు జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి సబిత, తీగల ఇద్దరూ పోటీకి సిద్ధమవుతున్నారు. ఇద్దరు నేతల మధ్య అంతర్గత విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ఎల్బీనగర్లో దేవిరెడ్డి.. ముద్దగోని ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి అధికారపార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ముద్దగోని రామ్మోహన్‌గౌడ్ మళ్లీ తన అస్థిత్వాన్ని నిలుపుకొనేందుకు యత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గెలుపొంది ఆ తర్వాత అధికారపారీ్టలో చేరిన ఎమ్మెల్యే దేవిరెడ్డి్కి దీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తానూ ఎన్నికల బరిలో ఉన్నాననే సంకేతాలు అటు కేడర్, ఇటు అధిష్టానానికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ‘పట్నం’లో మంచిరెడ్డి వర్సెస్ క్యామ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గత ఎన్నికల్లో స్వల్ప మెజార్జీతో గెలుపొందారు. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణ లపై తాజాగా ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. యాచారం ఫార్మాసిటీ, వెలిమనేడు ఇండ్రస్టియల్ పార్కు, ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ కార్యాలయాలకు భూసేకరణ విషయంలో ఆయనపై కొంత వ్యతిరేకత ప్రారంభమైంది. గత ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ను వీడి అధికార పారీ్టలో చేరిన క్యామ మల్లేశ్ దీన్ని అవకాశంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిన సమయంలోనే సీఎం కేసీఆర్ తనకు హామీ ఇచ్చారని.. వచ్చే ఎన్నికల్లో తనకే బి ఫాం అంటూ నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. కల్వకుర్తిలో జైపాల్.. కసిరెడ్డి కల్వకుర్తిలో పార్టీ రెండుగా చీలిపోయింది. ఒకరు నిర్వహించే కార్యక్రమంలో మరొకరు పాల్గొనని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మళ్లీ తనకే టికెట్ వస్తుందని, పోటీ చేసేది తానేనని ప్రచారం చేసుకుంటున్నారు. నిత్యం ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయతి్నస్తున్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం పోటీకి సిద్ధమవుతున్నారు. కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నిక విషయంలో ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా వెల్దండ ఎంపీపీ, మరో ఆరుగురు సర్పంచ్‌లు ఇటీవల తిరుగుబాటుబావుటా ఎగురవేయడం గమనార్హం. మరోవైపు తలకొండపల్లి జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్ సైతం పోటీకి సిద్ధమవుతున్నారు. టికెట్ తనకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అసెంబ్లీపై చేవెళ్ల ఎంపీ గురి చేవెళ్ల ఎంపీ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ లేకున్నా తనకున్న ఆర్థిక వనరులు, అధిష్టానం ఆశీస్సులతో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. -
కరీంనగర్ టీఆర్ఎస్లో కోల్డ్ వార్.. ఆడియో లీక్ కలకలం!
సాక్షి, కరీంనగర్: జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గ రాజకీయాలు బయటకు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఆయన కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ మేరకు గులాబీ పార్టీ అధినేత సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కరీంనగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్లు లేఖ రూపంలో ఫిర్యాదు చేశారు. సదరు లేఖలో మాజీ మేయర్ కుటుంబం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాగా, మంత్రిపై రవీందర్ సింగ్ అల్లుడు మాట్లాడిన ఆడియో లీక్ కలకలం సృష్టించింది. ఇక, ఆడియోలో టీఆర్ఎస్ మంత్రి, కలెక్టర్ గురించి మాట్లాడినట్టు పార్టీ కార్యకర్తలు గుర్తించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మేయర్ రవీందర్ సింగ్ అల్లుడే సమస్యలు సృష్టించి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులను పార్టీలో కొనసాగించరాదని సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను కోరారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల తెలంగాణ సీఎం బీహార్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూడా వెళ్లడం విశేషం. ఇది కూడా చదవండి: ప్రజాప్రతినిధులను పశువుల్లా కొంటున్నారు.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఆగ్రహం -
ఆ ఇద్దరి నేతల మధ్య.. బస్తీ మే సవాల్
సాక్షి, ఆదిలాబాద్: టీఆర్ఎస్లో ముఖ్యనేతల మధ్య ఇప్పటివరకు కొనసాగిన కోల్డ్‌వార్ ఇపుడంతా బహాటమయ్యింది. బస్తీ మే సవాల్ అన్నట్లుగా తోడ కొడుతున్నారు. ముఖ్యనేతలంతా ఒకవైపు అయ్యారు. బోథ్ ఎమ్మెల్యే మరోవైపయ్యారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అండతో ఆయన ముందుకు సాగుతున్నారు. అయితే బోథ్ నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. పైచేయి యత్నాలు బోథ్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలు రాజకీయంగా పార్టీలో ఉన్న వైషమ్యాలను బహిర్గతపరుస్తున్నాయి. తాజాగా బజార్హత్నూర్ ఎంపీడీఓగా చౌహాన్ రాధాను నియమించారు. బోథ్ మండలంలో ఉపాధి అక్రమాలకు సంబంధించి బాధ్యురాలిని చేస్తూ గడిచిన జెడ్పీ మీటింగ్ రోజు సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఉపాధి అక్రమాలకు సంబంధించి వివరాలు కోరినా అధికారులు ఇవ్వడంలేదని, ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే అప్పట్లో ఆమెపై వేటు పడింది. ఒక వైపు అక్రమాలపై విచారణ పూర్తిస్థాయిలో జరగనేలేదు.. దుర్వినియోగమైన నిధుల రికవరీ చేపట్టలేదు. ఇదిలా ఉండగానే ఆ ఎంపీడీఓపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ బజార్హత్నూర్ మండలంలో పో స్టింగ్ ఇవ్వడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా పైచేయి సాధించేందుకే అక్కడ ఇలా జరుగుతుందన్న చర్చ సాగుతోంది. బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఎమ్మెల్యే రాథోడ్ బా పూరావుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఎంపీడీఓపై సస్పెన్షన్ వేటు ప డిన తర్వాత నియోజకవర్గంలో ఆమెకు పోస్టింగ్ రా కుండా చూస్తామని ఎమ్మెల్యే వర్గీయులు సవాలు విసిరారు. పక్క మండలంలోనే ఆమెకు తిరిగి పోస్టింగ్ ఇప్పించడంలో ఎంపీపీ సఫలీకృతమయ్యా రు. జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో ఇది జరిగిందన్న ప్రచారం సాగుతోంది. పార్టీ పదవీ విషయంలో .. కొద్ది రోజుల క్రితం బోథ్ నియోజకవర్గ అధికార ప్ర తినిధిగా తలమడుగు మండలానికి చెందిన కిరణ్‌కుమార్‌ను ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు నియమిస్తూ సన్మానం చేశారు. అయితే పార్టీపరమైన పదవుల ని యమాకంలో ఎమ్మెల్యేలకు ప్రమేయముండదని జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న బహాటంగానే ఖండిస్తూ ఆ నియమాకం చెల్లదని చెప్పడం పార్టీలో చర్చ కు దారితీసింది. అయితే దీని వెనుక మరోక ప్ర చారం జరుగుతోంది. నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడిని అధికార ప్రతినిధిగా నియమించాలని పార్టీ ముఖ్యనేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే విష యం బయటకు రావడంతోనే రాథోడ్ బాపూరావు ముందుగానే తన అనుచరుడిని నియమించడం ద్వారా వ్యూహాకత్మకంగా ముందుకు కదిలారు. ఈ అంశం ప్రస్తుతం పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. అందరూ ఒకవైపు.. టీఆర్ఎస్ జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ మంత్రి గోడం నగేశ్, సీనియర్ నేత లోక భూమారెడ్డిలు ఒక్కటిగా ముందుకు సాగుతున్నారు. గతం నుంచి ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతో ఉన్న విబేధాల కారణంగా జిల్లా ముఖ్యనేతలు అందరూ ఒక్కటై ఆయనకు వ్యతిరేకంగా కదులుతున్నారని పార్టీలో చెప్పుకుంటున్నారు. జెడ్పీటీసీ అనిల్ జాదవ్ పుట్టినరోజు వేడుకలు గత నెలలో నేరడిగొండలో జరుగగా ముఖ్యనేతలంతా దానికి హాజరుకావడం, ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆ వేడుకకు దూరంగా ఉండటం వారి మధ్యలో ఉన్న విభేదాలు కళ్లకు కట్టాయి. ఈ విధంగా జిల్లాలో టీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్న ఈ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. -
ఇటు కమలం, అటు గులాబీ.. ఫ్లవర్ అనుకుంటిరా..ఫైర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్, బీజేపీ.. మాటల యుద్ధం ముదిరి పాకానపడుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, పరస్పర విమర్శలు, ఆరోపణలు, వ్యక్తిగత దూషణలతో సెగ రోజురోజుకూ పెరుగుతోంది. కొన్నాళ్లుగా రాష్ట్రం లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టుగా వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోళ్లు మొదలు, వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల వరకు పలు అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్, స్టాలిన్‌తో కలిసి ముందుకు సాగుతామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడ మంగళవారం కేసీఆర్‌కు ఫోన్ చేసి తన మద్దతు ప్రటించారు. బీజేపీపై దూకుడును కేసీఆర్ మరింత పెంచాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఇలావుండగా బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్‌కు దీటుగా స్పందిస్తూ ఎదురుదాడి చేస్తోంది. కేంద్ర మంత్రులు ఆర్కే సింగ్, కిషన్‌రెడ్డిలు మంగళవారం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీ ఏడున్నరేళ్ల పాలనపై అమర వీరుల స్తూపం వద్ద కేసీఆర్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని కిషన్‌రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ దివాలాకోరు, దిగజారుడు మాటలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని ఘాటుగా విమర్శించారు. మరోవైపు రైతులకు ఎలక్ట్రిక్ మీటర్లు ఇవ్వాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తోందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పని, అబద్ధమని ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. కాగా కేసీఆర్ చర్చకు సిద్ధమన్న కిషన్‌రెడ్డిని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మీతో చర్చకు మా ఎమ్మెల్యే చాలంటూ చురకలంటించగా.. ఇన్నాళ్లూ రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎడమొహం పెడమొహంగా ఉన్న కోమరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఆధికారంలోకి తేవడానికి ఉమ్మడి పోరాటం చేస్తామనడం రాష్ట్ర రాజకీయాల్లో కొసమెరుపు. కేసీఆర్‌తో చర్చకు సిద్ధం మా పార్టీని దేశం నుంచి వెళ్లగొట్టే శక్తి భూ మండలంలోనే ఎవరికీ లేదు. ప్రధాని మోదీ ఏడున్నరేళ్ల పాలనలో ఏం చేశారన్న దానిపై సీఎం కేసీఆర్‌తో బహిరంగ చర్చకు నేను సిద్ధం. – కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై మంత్రి హరీశ్‌రావు మండిపాటు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తి కిషన్‌రెడ్డి. మీతో చర్చకు అంబర్‌పేట చౌరస్తాలో మా పార్టీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చాలు. – మంత్రి హరీశ్ -
ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోంది?! ఈ సంక్షోభం ఎందుకు?
యూరప్‌లో అత్యంత పేద దేశం ప్రస్తుతం కొత్త కోల్డ్‌వార్‌కు వేదికగా మారింది. ఒకప్పుడు తమతో కలిసున్న ఉక్రెయిన్ను ఎలాగైనా మళ్లీ స్వాధీనం చేసుకోవాలని రష్యా ప్రయత్నిస్తుండగా, ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు అమెరికా, మిత్రపక్షాలు రెడీగా ఉన్నాయి. సింహాల మధ్య పోరులో జింకలు బలైనట్లు అగ్రరాజ్యాల ఆటలో పేదదేశం నలిగిపోతోంది. అసలేంటి ఈ ఉక్రెయిన్ సంక్షోభం? చూద్దాం.. నూతన సంవత్సరం ఆరంభంతో ఉక్రెయిన్‌పై అమెరికా, రష్యాల మధ్య వార్నింగుల పర్వం కూడా ఆరంభమైంది. ఆ దేశాన్ని ఆక్రమించాలని పుతిన్ యత్నిస్తే మూల్యం తప్పదని అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ హెచ్చరించారు. ఈ వార్నింగులను లెక్కచేయకుండా రష్యా దాదాపు లక్షమంది సైనికులను ఉక్రెయిన్ సరిహద్దుకు తరలించింది. ఉక్రెయిన్ విషయంలో తాము తొందరపడకూడదంటే అమెరికా, మిత్రపక్షాలు కొన్ని హామీలివ్వాలని రష్యా డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వకుండా ఉండడం, తూర్పు యూరప్‌లో నాటో బలగాల ఉపసంహరణ లాంటి డిమాండ్లకు అమెరికా అంగీకరించడంలేదు. ఈ నేపథ్యంలో నాటోదేశాలు సోమవారం యుద్ధనౌకలను బరిలోకి దింపడం మరింత ఉద్రిక్తతలకు కారణమైంది. ఏక్షణమైనా యుద్ధం మొదలుకావచ్చన్న భయాలున్నాయి. 2014లో బీజాలు 30 ఏళ్ల క్రితం రష్యా నుంచి విడిపోయిన తర్వాత ఉక్రెయిన్ విజయవంతంగా మనుగడ సాగించడంలో తడబడుతూ వచ్చింది. యూరప్‌తో ఒప్పందాలను తెంచుకొని రష్యాతో బంధం బలపరుచుకోవాలని 2014లో అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ నిర్ణయించడం దేశంలో విప్లవానికి దారితీసింది. దీంతో విక్టర్ పదవి నుంచి దిగిపోవాల్సివచ్చింది. దీనిపై ఆగ్రహించిన రష్యా ఆ సంవత్సరం ఉక్రెయిన్‌లోని క్రిమియాను ఆక్రమించింది. ఆ సమయంలో జరిగిన హింసాకాండ దేశంలో రష్యాపై విముఖతను, పాశ్చాత్య దేశాలపై సుముఖతను పెంచింది. ఈ నేపథ్యంలో 2024లో యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంటామని తాజాగా ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే నాటోలో చేరాలన్న కోరికను కూడా వ్యక్తం చేసింది. ఇది రష్యాకు మరింత కోపం తెప్పించింది. ఉక్రెయిన్ నాటోలో చేరితే సరిహద్దుల్లో బలమైన శత్రువుకు అవకాశం కల్పించినట్లవుతుందని పుతిన్ యోచన. ఉత్తుత్తి బెదిరింపులే.. సాంస్కృతికంగా రష్యాతోనే ఉక్రెయిన్‌కు సంబంధాలు అధికమని పుతిన్ చెబుతుంటారు. అందుకే నాటో, ఈయూలో చేరడం కన్నా తమతో కలిసిపోవడం మేలంటారు. అలాగే పలు సందర్భాల్లో రష్యాపై విధించిన ఆంక్షలు తొలగించేందుకు ఉక్రెయిన్ అంశాన్ని పావుగా వాడుకోవాలన్నది పుతిన్ ఆలోచనగా నిపుణులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై దాడి చేస్తే మరిన్ని ఆంక్షలు రష్యాపై పడతాయి, అందుకే పూర్తి స్థాయి యుద్ధం చేసి ఉక్రెయిన్ను ఆక్రమించే కన్నా ఆక్రమిస్తామన్నంత హడావుడి చేయడం ద్వారా ఆంక్షలను తొలగించుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. ఈ మొత్తం అంశంలో అమెరికాకు ఆసక్తి ఎందుకంటే.. సమాధానం చాలా సింపుల్. ప్రపంచంలో ఎక్కడ సమస్య కనిపించినా పెద్దన్న పాత్ర పోషించాలని యూఎస్ భావిస్తుంటుంది. పైగా ఈ సమస్యలో రష్యా కూడా ఉండడంతో అమెరికా మరింత చురుగ్గా పావులు కదుపుతోంది. అవసరమైతే ఉక్రెయిన్‌కు మిలటరీ సాయం కూడా చేస్తామని ప్రకటిస్తోంది. అటు రష్యా, ఇటు అమెరికా మధ్యలో ఉక్రెయిన్ సమాజం నలిగిపోతోంది. -
ఒక్క నిర్ణయంతో...
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల జీవితాలే తలకిందులైపోతాయి. తెలివైన వాళ్లు కూడా తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుని భారీ మూల్యం చెల్లించిన ఘటనలు చరిత్రలో ఉన్నాయి. మహా భారతంలో కీలకపాత్ర పోషించిన శకుని సాక్షాత్తూ గాంధారీ దేవి సోదరుడు. కౌరవులపై పగబట్టి ఉన్న శకుని కౌరవులకు అత్యంత ఆత్మీయుడిగా నటించాడు. తమ కారణంగా తండ్రినీ, సోదరులనూ పోగొట్టుకున్న శకుని మామను దుర్యోధనాదులు గుడ్డిగా నమ్మడం చిత్రమే! కోవర్ట్ ఆపరేషన్లతో కురు వంశాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా తనకున్న మాయాద్యూత విద్యతో కౌరవుల మనసులు గెలుచుకున్నాడు శకుని. మొదట్లోనే శకుని మామను కూడా అంతమొందించి, శత్రుశేషం లేకుండా చేసుకుని ఉండాల్సింది. అలా చేయకపోవడం వల్ల కౌరవులు తమ నాశనాన్ని తామే కోరి తెచ్చుకున్నారు. కురుక్షేత్ర సంగ్రామం అనంతరం దుర్యోధనుడు ఓ మడుగులో దాగాడు. తనకున్న జల స్తంభన విద్య ద్వారా నీటి అడుగున ఉండగలిగాడు. అప్పుడు ధర్మరాజు అతణ్ణి పిలిచి ‘సుయోధనా! నువ్వు ఒక్కడివి ఉన్నావు. మేం అధర్మ యుద్ధం చేయం. మా అయిదుగురిలో నువ్వు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నావో చెప్పు. అందులో నువ్వు గెలిస్తే ఈ యుద్ధంలో పాండవులు ఓడినట్లే’ అన్నాడు. అలా బంగారం లాంటి అవకాశం అంది వస్తే దుర్యోధనుడు ఏం చేయాలి? నీతోనే నేను యుద్ధం చేస్తాను అని తెలివిగా సవాలు విసిరి ఉంటే, యుద్ధం చేయకుండానే దుర్యోధనుడు గెలిచి ఉండేవాడేమో! కనీసం నకుల, సహదేవుల్లో ఏ ఒక్కరితో యుద్ధానికి కాలు దువ్వినా గెలిచేవాడేమో అని కొందరి వాదన. కానీ అలా చేయకుండా భీముడితో యుద్ధానికి సై అన్నాడు. భీముడు యుద్ధ నిబంధనలకు విరుద్ధంగా సుయోధనుని తొడలు విరగకొట్టి, కురు రాజును అంతమొందించాడు. రామాయణంలోనూ అంతే. వాలిని సంహరించేందుకు రెండో సారి రాముణ్ణి వెంటబెట్టుకుని వెళ్లిన సుగ్రీవుడు తన అన్న వాలిని ఉద్దేశించి, దమ్ముంటే యుద్ధానికి రారా అని సవాల్ విసిరాడు. నిజానికి అంతకు ముందే సుగ్రీవుణ్ణి చావ చితక్కొట్టి పంపించాడు వాలి. ఆ దెబ్బలు తట్టుకోలేక సుగ్రీవుడు చిత్రకూట పర్వతానికి పారిపోయి తలదాచుకున్నాడు. అలా పారిపోయినవాడు మళ్లీ యుద్ధానికి కాలుదువ్వాడంటే వాడి వెనకాల ఏదో ఓ బలం ఉందనో, కుట్ర ఉందనో వాలి గుర్తించకపోవడం పెద్ద పొరపాటు. ఓ రాజ్యాధినేత అయి ఉండి, సరిపడా వేగులను కలిగి ఉండి, నిఘా విభాగాల నుండి సమాచారాన్ని రాబట్టుకోవలసిన వాలి... అవన్నీ పక్కన పెట్టి కేవలం ఆవేశంతోనూ, అహంకారంతోనూ దూసుకొచ్చేసి రాముడి బాణానికి నేలకొరిగాడు. కాస్త తెలివిగా ప్రవర్తించి ఉంటే సుగ్రీవుడి తెర వెనుక బలం గురించి తెలుసుకుని జాగ్రత్త పడే అవకాశం ఉండింది కూడా! సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోలేకనే వాలి కథ అలా ముగిసింది. ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుని జీవితాలు తలకిందులు చేసుకున్న వాళ్లు ఈ యుగం లోనూ ఉన్నారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి బ్రిటన్ పారిపోయి అక్కడ తలదాచుకున్న విజయ్ మాల్యా కథ అలాంటిదే! కింగ్‌ఫిషర్ బీరుతో కోట్ల ఆస్తులు గడించాడు. వ్యాపారంలో పాదరసం వంటి విజయ్ మాల్యా తన జీవితంలో ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో ఆ రంగంలో అడుగుపెట్టాడు. ఓ ప్రైవేటు విమానయాన కంపెనీని కొన్నాడు. అందుకోసం భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టాడు. ఆ నిర్ణయమే ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని చావుదెబ్బ తీసింది. హాయిగా చేతిలోని చల్లటి వ్యాపారం చేసుకుంటూ, కడుపు చల్లగా ఉంచుకోకుండా నష్టాల్లో ఉన్న రంగంలోకి ఎందుకొచ్చినట్లు అని మాల్యాను ఉద్దేశించి అంతా అనుకున్నారు. మాల్యా ఏదైనా అద్భుతం చేస్తాడని అనుకున్నారు. ఎలాంటి మ్యాజిక్కులూ జరగకుండానే దివాళా తీశాడు. చేసిన అప్పులు తీర్చలేక చేతులెత్తేసి, చివరకు ఓ చీకటి ముహూర్తాన బ్రిటన్ పారిపోవలసి వచ్చింది. విమాన యాన రంగం నుంచి అందరూ బయటకు వస్తోన్న సమయంలో మాల్యా ఆ రంగంలోకి రాకపోయి ఉంటే ఈ పాటికి మన దేశంలోనే బ్యాంకులకు లక్షల కోట్లు అప్పు పెంచుకుని దర్జాగా ఉండేవాడేమో! మన రాష్ట్రానికే చెందిన సత్యం రామలింగరాజు కూడా అంతే కదా! ఆయన ఐటీ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించాడు. దాంతో తృప్తి పడి ఉంటే సరిపోయేది. కానీ అలా చేయ లేదు. లేని లాభాలను కాగితాలపై చూపించి, ఆ లాభాలకు అనుగుణంగా అనవసరంగా పన్నులు కట్టి, ప్రపంచం కళ్లు కప్పాలనుకున్నాడు. చివరకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఓ అబద్ధాన్ని ఎక్కువ కాలం కాపాడలేక దొరికిపోవలసి వచ్చింది. ప్రపంచ చరిత్రలోనూ ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. కోల్డ్ వార్ ముసుగులో అమెరికా – సోవియట్ యూనియన్ల మధ్య జరిగిన పోరాటంలోనూ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు రెండు దేశాలనూ దెబ్బతీశాయి. వియత్నాం వార్‌లో చావు దెబ్బతిన్న అమెరికా... అఫ్గాన్ వార్‌లో సోవియట్ యూనియన్ను ముగ్గులోకి దింపి ప్రతీకారం తీర్చుకుంది. సోవియట్ పాలకులు తీసుకున్న తెలివితక్కువ నిర్ణయమే సోవియట్ పతనానికి దారి తీసింది. అందుకే... సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెప్పేది. దాన్ని ఆచరించగలిగిన వారు ప్రశాంతంగా ఉంటారు. లేని వాళ్లు పతనాన్ని కోరి కొనితెచ్చుకుంటారు. తస్మాత్ జాగ్రత్త! -
యూపీ చదరంగంలో కొత్త ఎత్తుగడలు
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు బ్రాహ్మణ, ఠాకూర్ వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఇది ప్రత్యక్ష రాజకీయ యుద్ధంగా మారి బీజేపీకి తీవ్ర నష్టం జరగక ముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం పావులు కదపటం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ జనాభాలో 10 శాతంగా ఉన్న బ్రాహ్మణ వర్గం మొదటి నుంచీ బీజేపీకి సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉంది. అటువంటి ఓటుబ్యాంకును.. మరో బలమైన ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలు దూరం చేస్తున్నాయి. ఆయన ‘ఠాకూర్ వాదాన్ని’ ప్రమోట్ చేçస్తూ బ్రాహ్మణులను పైకి రాకుండా చేస్తున్నారనే విమర్శ ఉంది. దీంతో కాశీ కారిడార్ ప్రారంభ కార్యక్రమాన్ని మోదీ తనంతతానై నడిపించారు. మొత్తం మీద యూపీలో ఈ పరిస్థితులు చిక్కుముడులను తలపిస్తున్నాయి. అక్కడి రాజకీయ చదరంగంలోని చిక్కుముడులు విప్పడం అసాధ్యం అనిపిస్తోంది కూడా! ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ కుల చదరంగం వైపు చూపు సారిస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని కీలక దిగ్గజాలు, అప్రధానమైన బంట్లు పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అధిక సంఖ్యలో బీజేపీకి ఎంపీలను అందించిన ఉత్తరప్రదేశ్ (యూపీ)లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తలెత్తిన రైతుల ఆగ్రహ జ్వాలలను చల్లార్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఏకపక్షంగా ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తన ప్రసంగంలో పార్టీకి కలిగిన నష్టాన్ని పూడ్చుకునే ధోరణి కనిపించింది. వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించిన పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జాట్ రైతులు అధికంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆ ప్రాంతం నుంచి ఎక్కువ సీట్లు రావడం వల్లనే బీజేపీకి భారీ విజయం లభించింది. ముజఫర్‌నగర్ అల్లర్లు జరిగిన మరుసటి ఏడాదే జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ శక్తిని అనేక రెట్లు పెంచిన ప్రాంతం ఇది. పశ్చిమ యూపీలోని జాట్ల కోపాన్ని తగ్గించడానికి, సాధ్యమైతే వారిని తిరిగి తమ వైపు తిప్పుకోవడానికి మోదీ నూతన వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. పశ్చిమ యూపీలో హిందు– ముస్లింల మధ్య నెలకొని ఉన్న కొన్ని అగాథాలను ఈ రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమం కొంతవరకు పూడ్చగలిగింది. ఇప్పుడు రాష్ట్రం లోనూ, కే్రందంలోనూ అధికారంలో ఉన్న బీజేపీకి ఈ మారిన పరిస్థితులు ప్రతికూలమైనవని వేరే చెప్పనవసరం లేదు. అందుకే మోదీ వెంటనే కొత్త వ్యూహాలతో దిద్దుబాటు చర్యలకు తెరలేపారు. అక్టోబర్ 3వ తేదీన లఖింపూర్ ఖేరీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాచేసి ఇళ్లకు మరలిన రైతులను ఓ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొట్టి నలుగురు రైతుల మరణానికి కారణం కావడం, ప్రతీకార దాడిలో ఓ జర్నలిస్ట్ మృతి చెందడం తెలిసిందే. రైతులను ఢీకొట్టిన ఒక వాహనం ఆ ప్రాంత బ్రాహ్మణ వర్గానికి చెందిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తేనీ కుమారునిదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన ఆ ఏరియాలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడు. అటువంటి నాయకుని కుమారునిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ కేసును దర్యాప్తు చేయడానికి ఒక సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ వ్యవహారం కోర్టులకు చేరేటప్పటికి, సుప్రీం కోర్టు ఈ సిట్‌ను మానిటర్ చేయడం ప్రారంభించింది. అత్యున్నత న్యాయ స్థానం సిట్‌లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను నియమించి దానిని మరింత శక్తిమంతం చేసింది. ఇప్పుడు సిట్ ‘ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర’ వల్లనే రైతు హత్యలు జరిగాయని నివేదిక ఇచ్చింది. దీంతో మంత్రి అజయ్ మిశ్రాకు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. నిర్లక్ష్య మైన ర్యాష్ డ్రైవింగ్ వల్ల రైతు మరణాలు సంభవించాయని పోలీ సులు ఎఫ్ఐఆర్లో మొదట్లో పేర్కొన్నారు. అయితే సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ ఆరోపణల స్థానంలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద హత్య, నేరపూరిత కుట్ర, మరి కొన్ని ఇతర సీరియస్ ఆరోపణలను చేర్చారు. త్వరలో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో.. బీజేపీలోని ఒక వర్గం నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను చంపడానికి కుట్ర పన్నిందని పేర్కొంటున్న ఈ కేసు బీజేపీ పాలిట పేలబోతున్న టైమ్ బాంబ్లా తయారైంది. సిట్ రిపోర్టు సంగతి ప్రస్తావించిన ఒక జర్నలిస్ట్‌పై సాక్షాత్తూ మంత్రి అజయ్ మిశ్రానే తీవ్ర పదజాలంతో మండిపడుతూ దాడిచేస్తున్న దృశ్యాలు ఉన్న వీడియో ఒకటి జనంలోకి వెళ్లిపోయింది. నిజానికి అక్టోబర్ 3న రైతు మరణాలు సంభవించడా నికి కొన్ని రోజుల ముందే రైతులను ఆయన బహిరంగ వేదిక మీద నుంచి బెదిరించారు. ఈ నేపథ్యంలో ఎలా చూసినా అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాల్సిందే! అప్పుడు రైతులను, ఇప్పుడు జర్నలిస్టులను భయపెట్టిన అజయ్ మిశ్రా మంత్రి పదవికి ఏమాత్రం అర్హుడు కాదు. బలమైన ఓటుబ్యాంకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఒక పక్క రైతుల్లోని ఒక వర్గాన్ని శాంతింపచేసే ప్రయత్నం చేస్తూనే.. మరోపక్క ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణత్వానికి ప్రతినిధిగా బీజేపీ కేంద్ర నాయకత్వం చూపుతూ వచ్చిన వ్యక్తి చేసిన నష్టాన్ని పరిహరిం చేందుకు బీజేపీ నడుం బిగించింది. యూపీ జనాభాలో 10 శాతం బ్రాహ్మణులే ఉన్నారు. వీరు సిద్ధాంతపరంగా బీజేపీకి అనుకూలురని పరిగణించడం కద్దు. కానీ యూపీలో మరో బలమైన ఠాకూర్ కులానికి చెందిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘ఠాకూర్వాదం’ లేదా ఠాకూర్ల ఆధిపత్యం పెరగడానికి ఇతోధికంగా మద్దతు ఇస్తున్నా డనే ఆరోపణతో బ్రాహ్మణ వర్గం బీజేపీకి దూరమవుతున్నట్లూ విమ ర్శకులు భావిస్తున్నారు. ఇందువల్ల యూపీలో బీజేపీకి ఉన్న సంప్ర దాయ ఓట్లు దూరమయ్యే అవకాశం ఉండటంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. బీజేపీకి యూపీలో 40 శాతం ఓట్లు ఉన్నాయి. ఆ పార్టీని ఓడించాలంటే మిగతా పార్టీలు అంతకన్నా ఎక్కువ ఓట్లు పొందాలి. అయితే ప్రస్తుతం ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం, ప్రధాన పార్టీలన్నీ దేనికది ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవాలని భావించ డంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితి బీజేపీకి అనుకూలించే అంశమే. యూపీలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), అఖిలేశ్ యాదవ్ అధినేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కన్నా వెనుకబడి ఉంది. అఖిలేశ్ అనేక చిన్న ఏక కుల పార్టీలతో పొత్తుపెట్టుకొని రేసులో ముందున్నారు. ప్రస్తుతం పోటీ ద్విముఖమే అనిపిస్తోంది. బీజేపీకి 10 శాతం ఓట్లు తగ్గితే అవి ఎస్పీ ఖాతాలో పడతాయని భావిస్తున్నారు (2017లో అఖిలేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన ఎన్నికల్లో ఎస్పీకి 22 శాతం ఓట్లే పోలవ్వడంతో ఆయన పదవిని కోల్పోయారు). దీంతో అక్కడ పరిస్థితి రసకందాయంలో పడింది. ప్రియాంక మేలుకొలుపుతో ఎస్పీకి లాభం పార్లమెంట్ సమావేశాల సమయంలో వెలువడిన సిట్ రిపోర్ట్ ప్రతిపక్షాలకు మంచి ఆయుధం అయింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపక్షాల దాడికి నాయకత్వం వహించారు. అదే సమయంలో ఆయన సోదరి ప్రియాంకా గాంధీ ఉత్తరప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించి ఈ విషయంపై బీజేపీని ఎండగట్టారు. ఈ అంశం ద్వారా లబ్ధి పొందాలని ఆమె తీవ్రంగా ప్రయత్నించినా.. ప్రయోజనం మాత్రం ఎస్పీకే చేకూరుతుంది.. కాంగ్రెస్‌కు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి లేదని జనానికి తెలుసు. ఓడిపోయే పార్టీకి ఓటువేసి తమ ఓటును వ్యర్థం చేసుకోకూడదనే నియమాన్ని మన ఓటర్లు ఎటూ తప్పరు కాబట్టి.. గెలిచే పార్టీకే ఓటు వేస్తారు. ఆ విధంగా చూస్తే ప్రియాంక మేలుకొలుపు ఎస్పీకి లాభం చేకూర్చ బోతోంది. బీజేపీ ప్రచారంలో గమనించదగిన మరో విశేషం ఏమిటంటే.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాధాన్యాన్ని ప్రధాని మోదీ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం! ఇటీవల చోటుచేసు కున్న కాశీ కారిడార్ ప్రారంభోత్సవం ఒక రకంగా మతపరమైన వ్యవహారమే. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆ మతంలో యోగిగా గుర్తింపు పొందినవారు. కానీ ఈ కార్యక్రమంలో యోగి ఆదిత్య నాథ్‌ను పక్కన పెట్టి అంతా తానై కనిపించారు ప్రధాని మోదీ. ్రçపస్తుతం బీజేపీలో బలమైన ‘హిందూ హృదయ సమ్రాట్’ ఎవరు అనే పోటీ ఏర్పడితే కచ్చితంగా అది మోదీయే అని చెప్పడానికి వీలుగా కాశీ కారిడార్ ప్రారంభ కార్యక్రమం సాగింది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో పరిస్థితులు చిక్కుముడులను తలపిస్తున్నాయి. కొన్ని ముడులు విప్పడం అసాధ్యం అనిపిస్తున్నది కూడా! – సాబా నఖ్వీ, సీనియర్ జర్నలిస్ట్ -
మన భుజాలపై వారి తుపాకులు!
చైనాతో ఏర్పడుతున్న వివాదాలను సమానత్వం, న్యాయం ప్రాతిపదికన పరిష్కరించుకోవడానికి బదులుగా భారతీయులమైన మనం అమెరికా నేతృత్వంలో ఏర్పడిన క్వాడ్ కూటమిలో చేరడాన్ని ఎంచుకున్నాము. సారాంశంలో చైనాకు వ్యతిరేకమైన ఈ క్వాడ్ కూటమి ఆసియా ఖండంలో సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి రంగస్థలాన్ని సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో భారీ వ్యయంతో కూడిన ఆయుధాల పరుగుపందెం కూడా మొదలైపోయింది. అసలు విషయం ఏమిటంటే, చైనాపైకి గురిపెట్టి కాల్చడానికి బయటివారు మన భుజాలమీద వారి తుపాకులు పెడుతుంటే మనం దానికి అనుమతించాల్సిందేనా? క్వాడ్, ఆకస్ లాంటి కూటములతో... మన సముద్రాలు త్వరలో ప్రాణాంతకమైన యుద్ధనౌకలకు, జలాంతర్గాములకు ఆటస్థలంగా మారనుండటం భారతీయులను, ఆసియా ప్రజలను కలవరపరుస్తోంది. గురుదేవులు రవీంద్రనాథ్ టాగూర్ జీవించి ఉండి ఉంటే తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసి ఉండేవారు. ఆసియా ఐక్యతకోసం అవిశ్రాంతంగా ప్రచారం చేసిన ఈ కవి, తత్వవేత్త ప్రస్తుతం ఆసియా ఖండంలో పేరుకుంటున్న అనైక్యతను, నిత్య ఘర్షణలను చూసి ఎంతగానో బాధపడి ఉండేవారు. ఆసియా ఖండాన్ని నిత్యం శత్రుత్వంతో రగిలించడానికి పాశ్చాత్య శక్తులు ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలను చూసి టాగూర్ మనస్సు క్షోభతో కుమిలిపోయి ఉండేది. ఆసియా దేశాలను టాగూర్ సందర్శించినన్ని పర్యాయాలు మరే ఇతర భారతీయ నేతా పర్యటించలేదు. ఈ సందర్శనల ద్వారా టాగూర్ లక్ష్యం ఆసియన్ వివేచనను సృష్టించడమే. 1921లో ఆయన విశ్వభారతిని స్థాపించినప్పుడు, భారత్, ఇతర ఆసియా దేశాలను శతాబ్దాలుగా కలిపివుంచిన నాగరికతా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను పునరుద్ధరించడమే ప్రధాన లక్ష్యంగా ఉండేది. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి నేతలు కూడా ఆసియన్ ఐక్యతపట్ల సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూవచ్చారు. ఆసియన్ వివేచన పట్ల గురుదేవుల స్వప్నాలు ఈరోజు బీటలు వారిపోయాయి. ఒకప్పుడు వలసవాద పాలనలో బలిపశువులుగా మారిన దేశాలు ఇప్పుడు ప్రవాహవేగంలో కొట్టుకుపోతున్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 60 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసియా దేశాలు ఇప్పుడు శాంతికి దూరమవుతున్నాయి. పాశ్చాత్యదేశాలు ఆసియా ఖండంలో పరస్పరం తలపడే బృందాలను రూపొందిస్తూ నిత్య ఘర్షణలను రగిలిస్తున్నాయి. ఆసియా ఖండంలో అంతర్గత ఘర్షణలు శాంతికి హాని చేస్తూ, పరస్పర సహకారంతో అందరూ లబ్ధి పొందే అవకాశాలకు తలుపులు మూసేశాయి. పశ్చిమాసియా ఇటీవలి కాలంలో అనేక యుద్ధాలను చూసింది. ఇరాన్–ఇరాక్ యుద్ధం, ఇరాక్‌పై అమెరికా దురాక్రమణ, సిరియాలో, యెమెన్‌లో కొనసాగుతున్న యుద్ధాలు వీటిలో కొన్ని. ఇక దక్షిణాసియాలో బయటిశక్తులు రగిలించిన యుద్ధాలు, సైనిక ఘర్షణల కారణంగా నాలుగు దశాబ్దాలుగా అఫ్గానిస్తాన్ రక్తమోడుతూనే ఉంది. అమెరికా దళాలు ఇటీవలే ఆ దేశం నుంచి వైదొలిగిన తర్వాత కూడా అఫ్గానిస్తాన్ సుస్థిరత, జాతీయ పునర్నిర్మాణం విషయంలో భారత్, తదితర పొరుగు దేశాలు సహకారమందించే ప్రయత్నాలకు తావు లేకుండా పోయింది. ఒకవైపు తాలిబన్ మతోన్మాదవైఖరి, మరోవైపు భారత్–పాకిస్తాన్ మధ్య శత్రుత్వమే దీనికి కారణం. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు గడిచిన తర్వాత కూడా భారత్, పాకిస్తాన్ దేశాలు తమ మధ్య సౌహార్ద సంబంధాలు నెలకొల్పుకోలేకపోతున్నాయి. నిరంతరం ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న శత్రుత్వం కారణంగా సార్క్ (దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి) పూర్తిగా నిర్వీర్యమై కోమాలో ఉంటోంది. దీంతో పోలిస్తే, షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ)ను ఏర్పర్చి ఆసియాలో పాశ్చాత్యేతర వేదికను చెల్లుబాటులోకి తీసుకురావడంలో చైనా ఒకమేరకు విజయం సాధించింది. భారత్, పాకిస్తాన్ రెండు దేశాలనూ పూర్తిస్థాయి సభ్యులుగా చేసుకోవడంలో ఎస్సీఓ సఫలమైంది. దీంట్లో అఫ్గానిస్తాన్ కూడా పర్యవేక్షక ప్రతిపత్తిలో కొనసాగుతోంది. విషాదమేమిటంటే, చైనా, రష్యా, ఇరాన్, పాకిస్తాన్ దేశాలతో కూడిన ప్రాంతీయ సహకార ప్రయత్నాలకు దూరంగా ఉంటున్న భారత్ ప్రస్తుతం కాబూల్‌లో శాంతి స్థాపన, సమీకృత ప్రభుత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలనుంచి వైదొలిగింది. అదే సమయంలో తాలిబన్ పాలనలో ఉగ్రవాద సంస్థలకు అవకాశం ఇవ్వవద్దనే అంశంపై భారత్‌తో సహా ఈ అయిదు దేశాలకు పెద్దగా భిన్నాభిప్రాయాలు లేవు. ఈ గొప్ప అవకాశంలో పాలుపంచుకోవడానికి బదులుగా, అఫ్గాన్ విధానం విషయంలో అమెరికాతో భారత్ చేయి కలిపింది. పైగా, అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాద నిరోధక సైనిక చర్యలను నిర్వహించడానికి వాయవ్య భారత్‌లోని ఒక ప్రాంతంలో సైనిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి కూడా అమెరికా ప్రయత్నిస్తోందని వార్తలొస్తున్నాయి. భారత్‌కి, దక్షిణాసియా ప్రాంతానికి కూడా ఆత్మహత్యా సదృశమే అవుతుంది. భారత్ ద్వంద్వప్రమాణాలు పాటిస్తోందన్న విమర్శలకు కూడా తావిచ్చినట్లవుతుంది. ఇది నిజమే అయితే భారత్‌కి వ్యతిరేకంగా అఫ్గాన్ భూమిని ఉపయోగించుకోవడానికి తాలి బన్లు అనుమతించరాదంటూ భారత్ స్పష్టంగానే అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాం టప్పుడు భారత గడ్డమీద నుంచి అప్గాన్ వ్యతిరేక చర్యలు చేపట్టడానికి అమెరికాను మనం ఎలా అనుమతించగలం? ఇప్పుడు మరొక ప్రధానమైన అంశం ఆసియా అంతర్గత వైరుధ్యం. ఆసియాలో రెండు అతిపెద్ద నాగరికతా దేశాలైన భారత్, చైనాలు ఆధిపత్య పోరాటంలో నిమగ్నమై ఉన్నాయి. ఒకవైపు భారత్–చైనా మధ్య శత్రుత్వం, మరోవైపు దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ఇరుగుపొరుగు దేశాలతో సముద్ర జలాలపై హక్కు విషయంలో ఏర్పడిన వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంలో చైనా విఫలమైతే, ఎంతో దూరంలో ఉన్న అమెరికాకు వివాద జలాల్లో చేపలు పట్టే అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఆసియన్ వివాదాల్లో తలదూర్చవలసిన అవసరం అమెరికాకు లేదు. అయినప్పటికీ ఇండో–పసిఫిక్ అనే కృత్రిమ భావనను అమెరికా పెంచి పోషిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటినుంచి తమదే ప్రపంచాధిపత్యం అనే విశ్వాసంతో అమెరికా పాలకులు వ్యవహరిస్తూ వస్తున్నారు. కానీ ఇటీవలి దశాబ్దాల్లో చైనా ఎదుగుతూ వస్తున్నందున, అమెరికా ప్రపంచాధిపత్యానికి రోజులు చెల్లిపోయాయి. ఇది అర్థమయ్యే, ఆసియాలో అనైక్యతా బీజాలను నాటే పనిలో అమెరికా బిజీగా ఉంటోంది. అందుకే, చైనాకు అడ్డుకట్టలేయడానికి అమెరికా సైనిక కూటములను నిర్మించుకుంటూ పోతోంది. దురదృష్టవశాత్తూ, చైనాతో మనకు ఎదురవుతున్న వివాదాలను సమానత్వం, న్యాయం ప్రాతిపదికన పరిష్కరించుకోవడానికి బదులుగా భారతీయులమైన మనం అమెరికా నేతృత్వంలో ఏర్పడిన క్వాడ్ కూటమిలో చేరడాన్ని ఎంచుకున్నాము. సారాంశంలో చైనాకు వ్యతిరేకమైన ఈ క్వాడ్ కూటమి ఆసియా ఖండంలో సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి రంగస్థలాన్ని సిద్ధం చేస్తోంది. అసలు విషయం ఏమిటంటే చైనాపైకి గురిపెట్టి కాల్చడానికి బయటివారు మన భుజాలమీద వారి తుపాకులు పెడుతుంటే మనం దానికి అనుమతించాల్సిందేనా? అమెరికా ఇప్పుడు మరొక చైనా వ్యతిరేక కూటమి ఆకస్ని ఏర్పర్చింది. ఇది ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా మూడు దేశాల మధ్య భద్రతా ఒడంబడికను సాధ్యం చేసింది. చైనాను నిలువరించడానికి ఆస్ట్రేలియాకు అణుశక్తితో పనిచేసే జలాంతర్గాములను అమెరికా, బ్రిటన్ ఈ ఒప్పందంలో భాగంగా నిర్మించి ఇస్తాయి. నాటో కూట మిలో భాగమైన రెండు మిత్రదేశాల పట్ల ఫ్రాన్స్ అగ్రహంతో రగిలిపోతోంది. ఎందుకంటే 80 బిలియన్ డాలర్ల విలువైన ఫ్రెంచ్–ఆస్ట్రేలియన్ జలాంతర్గామి ఒప్పందానికి ఆకస్ కూటమి తూట్లు పొడిచింది. మన సముద్రాలు, మహా సముద్రాలు త్వరలో ప్రాణాంతకమైన యుద్ధనౌకలు, జలాంతర్గాములకు ఆటస్థలంగా మారనుండటం భారతీయులను, ఇతర ఆసియన్ ప్రజలను కలవరపరుస్తోంది. శక్తిమంతమైన దేశాలు తమ నావికా బలాన్ని ఉపయోగించి ప్రపంచ ఆర్థిక వనరులను కొల్లగొట్టే భవిష్యత్తు గురించి గాంధీజీ వందేళ్ల క్రితమే హెచ్చరించారు. (యంగ్ ఇండియా: 1921 డిసెంబర్ 8). ఆనాడు గాంధీ చేసిన హెచ్చరిక ఇప్పుడు భయపెట్టే వాస్తవంగా మారిపోయింది. రెండు ప్రపంచ యుద్ధాలకు కారణమైన యూరోపియన్ శత్రుత్వానికి సంబంధించిన విధ్వంసకరమైన లక్షణాలకు వ్యతి రేకంగా టాగూర్ కూడా ఆసియన్లను హెచ్చరించారు. ఇప్పుడు విశ్వగురువుగా మారాలని ఆకాంక్షిస్తున్న భారత్, మన గురుదేవులు టాగూర్ ఆనాడు చేసిన హెచ్చరికను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నట్లుంది. సుధీంద్ర కులకర్ణి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సన్నిహితుడు (ట్రిబ్యూన్ సౌజన్యంతో) -
ప్రచ్ఛన్నయుద్ధంలో... అమెరికా కొత్త ఎత్తుగడ
నూతన యుద్ధ కూటమిలకు నాందిపలకడం, తాను చేసే ప్రతి యుద్ధానికి ఒక కారణం చూపి నామకరణం చేసి ప్రజలను నమ్మించడంలో ఆరితేరిన దేశం అమెరికా. ఇటీవలిదాకా ప్రాచుర్యంలోకి వచ్చిన క్వాడ్ (అమెరికా,జపాన్, ఆస్ట్రేలియా, భారత్) కూటమి కానీ, ఇప్పుడు కొత్తగా దాని నాయకత్వంలో ఏర్పడిన ‘ఆకస్’ (ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా) కూటమి కానీ అమెరికన్ యుద్ధతంత్రంలో సరికొత్త వ్యూహాలేనని చెప్పాలి. అసియా–పసిఫిక్‌లో ‘భద్రత, శ్రేయస్సు’ కోసమని ఎప్పటిలాగే అమెరికా బొంకుతున్నప్పటికీ, చైనా విస్తరణ బూచిని చూపెట్టి కొత్త యుద్ధరంగాన్ని సిద్ధం చేస్తున్న వ్యూహంలో భాగమే ‘అకస్’ అని స్పష్టమవుతోంది. గత కొన్నేళ్లుగా చతుర్బుజ కూటమి క్వాడ్ (అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్) పేరిట పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో ఆధిపత్య రాజకీయాలకు అమెరికా తెరతీసింది. కానీ 8 వేలకు పైచిలుకు అణ్వస్త్రాలను కలిగి ఉన్న అమెరికాకు, కేవలం 300 అణ్వస్త్రాలు గల చైనాతో భద్రతకు ముప్పంటే పసిపిల్ల వాడు కూడా నమ్మలేడు. ఆసియా పసిఫిక్ ప్రాంతం లోని డిగోగార్షియా, బహ్రైన్, డ్జిబౌటీ, గువామ్, తైవాన్, జపాన్, ఫిలిప్ఫైన్స్, జపాన్, దక్షిణ కొరియాలలో అమెరికా ఇప్పటికే సైన్యాన్ని, క్షిపణులను, యుద్ధనౌకలను మోహరించింది. ఇప్పటివరకూ హాట్ టాపిక్‌గా ఉన్న ‘క్వాడ్’ (అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్) కూటమికి ఈనెల 24న అధ్యక్షుడు బైడెన్ ఆతిథ్యమిచ్చారు. అయితే అంతకంటే ముందుగా ఈ కూటమిని కాస్తా చల్లారబర్చి నూతన త్రిభుజ కూటమిగా (ఆస్ట్రేలియా, యూకే, అమెరికా) ‘అకస్’ను అమెరికా అధ్యక్షుడు, బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రధానులు ప్రకటించారు. దీంట్లో భాగంగా ఆస్ట్రేలియా జలాంతర్గాములకు అణుఇంధనంతో నిర్మించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా, బ్రిటన్లు అంది స్తాయి. ఈ కొత్త కూటమి ఏర్పాటు అసియా–పసిఫిక్‌లో ‘భద్రత, శ్రేయస్సు’ కోసమని ఎప్పటిలాగే అమెరికా బొంకుతోంది. అందుకే ఆకస్ ఒప్పందం వెనుక అమెరికా ప్రచ్ఛన్నయుద్ధ మనస్తత్వమే దాగి ఉందని చైనా ఆరోపించింది. వాస్తవం ఏమిటంటే, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆసియా ఖండంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోటానికి భారత్, చైనాలను యుద్ధ ముగ్గులోకి దింపి, పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లుగా అమెరికా వ్యవహరిస్తోంది. దీనికోసం 2011లోనే ‘ఆసియా పివోట్’ పథకాన్ని అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యూహాత్మకంగా ఆస్ట్రేలియాలో ప్రకటిం చాడు. ప్రశాంతంగా ఉండే ఆసియా–పసిఫిక్ ప్రాంతం నాటినుంచే ఉద్రిక్తతల నడుమ పయనిస్తోంది. ‘అకస్’ ఏర్పాటుతో నాటో యుద్ధ కూటమిలో, ఈయూ దేశాల్లో లుకలుకలు ప్రారంభమైనాయి. ఫ్రాన్స్ తన రాయబారులను అమెరికా, ఆస్ట్రేలియాలనుంచి వెనకకు రప్పించి, ఇది అమెరికా వెన్నుపోటని తీవ్రంగా హెచ్చరించింది. బ్రిటన్‌తో రక్షణశాఖ చర్చలను రద్దు చేసుకొంది. ఈ ఆకస్ ఒప్పందం అసలు ఉద్దేశం భద్రతకు సంబంధించినది కానేకాదు, అమెరికా యుద్ధ పరిశ్రమల కార్పొరేట్లకు లాభాలను ఆర్జిం చడం కోసమే. ఆస్ట్రేలియాతో ఫ్రాన్స్ లోగడ 2016లో డీజిల్‌తో నడిపే 12 జలాంతర్గాములను 36,400 కోట్ల డాలర్లతో ఎగుమతి చేయటానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తాజా ‘ఆకస్’ ఒప్పందంతో ఫ్రాన్స్ ఒప్పందం చిత్తు కాగితంగా మారింది. ఈ కూటముల జోలికి పోకుండా భారత్ తటస్థంగా ఉండి, అలీనోద్యమాన్ని ప్రోత్సహించటమే శ్రేయస్కరం. బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, కె.ఎల్. యూనివర్సిటీ ‘ 98494 91969 -
కాకినాడలో తిరుగుబాటు జెండా: టీడీపీ ఢమాల్..!
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: చింత చచ్చినా పులుపు చావలేదనే సామెతను తలపిస్తోంది జిల్లాలో టీడీపీ పరిస్థితి. అధికారానికి ఆ పార్టీని ప్రజలు దూరం చేసినా తెలుగు తమ్ముళ్లు మాత్రం నాయకత్వ పోరుతో సతమతమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు పట్టణాలు, ఇటు పల్లెల్లోనూ వైఎస్సార్ సీపీ తిరుగులేని ఆధిక్యతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలకు ముందు జిమ్మిక్కులతో చేజిక్కించుకున్న ఒక్కగానొక్క కాకినాడ నగర పాలక సంస్థలో ఆ పార్టీ బోర్డు తిప్పేసే సమయం దగ్గర్లోనే కనిపిస్తోంది. కార్పొరేషన్లో ఇద్దరు కార్పొరేటర్లు మృతి చెందగా మిగిలిన 30 మందితో బలమైన పక్షంగా ఉన్న టీడీపీ ఇప్పటికే నిట్టనిలువునా చీలిపో యింది. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తీరునచ్చక మెజార్టీ కార్పొరేటర్లు కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. బుధవారం డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వారందరూ బాహాటంగానే తిరుగుబాటు జెండా ఎగురేశారు. అసమర్థ నాయకత్వాన్ని కొనసాగిస్తే భవిష్యత్ ఉండదనే అభిప్రాయం కుండ బద్దలుగొట్టారు. రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికను వేదికగా చేసుకుని తడాఖా చూపించారు. ఫలితంగా కార్పొరేషన్లో టీడీపీ గల్లంతయ్యే రోజులు దగ్గరపడ్డాయనడంలో సందేహం లేదని ఆ పార్టీలో సీనియర్లే అంగీకరిస్తున్నారు. వాడబలిజల అణచివేత కార్పొరేషన్లో భంగపాటుకు టీడీపీ నాయకత్వ వైఫల్యమే కారణమని స్పష్టమైంది. డిప్యూటీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని పార్టీ ఇన్చార్జి వనమాడి చేసిన ప్రకటనను పార్టీలో ఏ ఒక్కరూ ఖాతరు చేయలేదు. ముందు పోటీలో లేమని చెప్పి, తరువాత పలివెల రవిని బరిలోకి దింపడం వంటి అసమర్థ నాయకత్వ లక్షణాలే టీడీపీ దుస్థితికి కారణమని విశ్లేషిస్తున్నారు. పార్టీ అభ్యర్థిని ఓడించడం ద్వారా కార్పొరేటర్లు నాయ కత్వంపై అసంతృప్తిని వెళ్లగక్కారు. కాకినాడలో మ త్స్యకారుల్లో 50 శాతం ఓటింగ్ ఉన్న వాడబలిజలను రాజకీయంగా, సామాజికంగా కొండబాబు అణగదొక్కేయడం కూడా ఈ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. టీడీపీలో ఈ వర్గానికి ఉన్న అసంతృప్తిని గుర్తించి అదే వర్గం నుంచి అదే పార్టీకి చెందిన చోడిపల్లి ప్రసాద్‌ను డిప్యూటీగా నిలబెట్టి గెలిపించుకోవడంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వ్యూ హం ఫలితాన్నిచ్చింది. కొండబాబు నాయకత్వంపై ఉన్న అసంతృప్తి ఓటమి రూపంలో ఎదురవడం అధినాయకత్వానికి మింగుడు పడటం లేదు. ఇదే తీరు కొనసాగితే నగరపాలక సంస్థను కూడా వదులుకోకతప్పదని పార్టీకి చెందిన కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మేయర్ పీఠం కదలనుందా.. వనమాడి నాయకత్వ వైఫల్యమే కారణమని మేయర్ సుంకర పావని వర్గం, మేయర్ వైఫల్యమే కారణమని వనమాడి అనుయాయులు పరస్పరం ఆరోపించకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొండబాబుకు వ్యతిరేకంగా పార్టీలో మేయర్ వేరు కుంపటి పెట్టారు. కార్పొరేటర్లను సమన్వయం చేసుకోలేకపోవడమే ఈ పరిస్థితికి కారణమంటూ కొండబాబు తమపై బురద చల్లుతున్నారని మేయర్ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత మేయర్‌పై ఉంటుంది. నగరపాలక సంస్థలో బలమైన పక్షంగా ఉన్నా కాకినాడ స్మార్ట్ సిటీలో అభివృద్ధి, పాలన గాడి తప్పాయనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. నాలుగేళ్లయినా అధికారులను సమన్వయపర్చుకునే రాజకీయ పరిపక్వత, మున్సిపల్ చట్టాలపై అవగాహన లోపించాయనే ముద్ర ఆమెపై ఉంది. ఈ పరిస్థితుల్లో ఏ క్షణాన్నయినా మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలని ఆ పార్టీ కార్పొరేటర్లు యోచిస్తున్నారు. నెల రోజుల్లో పదవీ గండం ఖాయమని వీరి మధ్య బహిరంగంగానే చర్చ నడుస్తోంది. చట్ట ప్రకారం మేయర్‌పై అవిశ్వాసానికి మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావాలి. వైఎస్సార్ హ యాంలో దీనిని నాలుగేళ్లకు పొడిగించారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌లో మేయర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టే ప్రయత్నాలు తెర వెనుక చురుగ్గా జరుగుతున్నాయి. అవినీతిని సహించలేకే... టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హయాంలో అడుగగడుగునా అలసత్వం, నిస్సహాయత, అవినీతి పేరుకుపోయాయి. ఆయన హయాంలో ఎలాంటి అభివృద్ధీ జరగక, ప్రజలకు సమాధానం చెప్పలేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ప్రజలకు ముఖం చాటేసే పరిస్థితి తెచ్చారు. అందువల్లే టీడీపీకి గుడ్‌బై చెప్పి సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం. – చోడిపల్లి ప్రసాద్, డిప్యూటీ మేయర్ ఇద్దరి మధ్య వేగలేకపోయాం మాజీ ఎమ్మెల్యే కొండబాబు, మేయర్ సుంకర పావని మధ్య వేగలేకపోయాం. ఒకరి వద్దకు వెళ్తే రెండో వారికి కోపం వచ్చేది. అలాగని ఏ ఒక్కరూ డివిజన్ల అభివృద్ధిపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. రెండేళ్లపాటు పడరాని పాట్లు పడ్డాం. ప్రజల ముందు తలెత్తుకు తిరగలేకపోయాం. కొత్త ప్రభుత్వం వచ్చాక ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయగలుగుతున్నాం. అందుకే టీడీపీకి గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. – కె.బాలాప్రసాద్, 46వ డివిజన్ కార్పొరేటర్ -
‘మా ఇద్దరిని కలపడానికి ఓ గదిలో పెట్టి తాళం వేశారు’
అందాల తార శ్రీదేవి బాల నటిగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఇండియాలోనే టాప్ హీరోయిన్గా నిలిచారు. అప్పటికే టాలీవుడ్లో టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న జయప్రద, జయసుధలకు.. అటు బాలీవుడ్లో మాధురీ దీక్షిత్‌కు గట్టి పోటీ ఇచ్చారు శ్రీదేవి. ఆ తర్వాత ఆమె ఇండియాలోనే నంబర్ వన్ హీరోయిన్గా ఎదిగారు. ఇక శ్రీదేవికి, జయప్రదకు మధ్య ఉన్న కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మర్యాదపూర్వకంగా పలకరించుకోవడం కానీ.. కనీసం ఒకరిని ఒకరు చూసుకోవడం కానీ చేసేవారు కాదు. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎందరో ప్రయత్నించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. తాజాగా వీరిద్దరి మధ్య నడిచిన కోల్డ్ వార్‌కు సంబంధించిన విశేషాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. ఈ సారి ఏకంగా జయప్రదనే దీనిపై స్పందించారు. ఇండియన్ ఐడల్ 12కు గెస్ట్‌గా వచ్చారు జయప్రద. ఈ వేదిక మీద ఆమె తనకు, శ్రీదేవికి మధ్య నడిచిన కోల్డ్ వార్‌ను మరోసారి గుర్తు చేసుకున్నారు. జయప్రద మాట్లాడుతూ.. ‘‘ఇలా చెప్పడానికి నేనేం బాధపడటం లేదు. అలా అని మేం ఇద్దరం ఎప్పుడైనా గొడవ పడ్డామా అంటే అది లేదు. కాకపోతే మా ఇద్దరి మధ్య కెమస్ట్రీ మ్యాచ్ కాలేదు. పైగా అప్పటికే మేం ఇద్దరం టాప్ హీరోయిన్లం. నేనేందుకు తగ్గాలంటే.. నేనేందుకు తగ్గాలి అని ఇద్దరం ఫీల్ అయ్యే వాళ్లం. ఎలా ఉండేవాళ్లం అంటే మా ఇద్దరి మధ్య ఐ కాంటాక్ట్ కూడా ఉండేది కాదు’’ అంటూ గుర్తు చేసుకున్నారు. ‘‘ఇక ప్రతి విషయంలో మేం ఒకరి మీద ఒకరం పోటీ పడుతుండేవాళ్లం. డ్రెస్సులు, డ్యాన్స్‌లు ఇలా అన్ని విషయాల్లో ఒకరిపై ఒకరం పై చేయి సాధించాలని ట్రై చేసే వాళ్లం. తెర మీద మంచి అక్కాచెల్లళ్లలా కనిపించినప్పటికి.. వాస్తవంగా కనీసం పరిచయం ఉన్నవారిలా కూడా ఉండేవాళ్లం కాదు. మేం ఇద్దరం ఎదురుపడిన ప్రతిసారి దర్శకులు, తోటి నటులు మమ్మల్ని ఒకరిని ఒకరికి పరిచయం చేసేవారు. అప్పుడు మాత్రం హలో అని పలకరించుకుని ముందుకు వెళ్లిపోయేవాళ్లం’’ అంటూ చెప్పుకొచ్చారు జయప్రద. ఇక తమ ఇద్దరిని కలపడానికి చాలా మంది ప్రయత్నించారని.. వారిలో రాజేశ్ కుమార్, జితేంద్ర ఖన్నా కూడా ఉన్నారని గుర్తు చేసుకున్నారు జయప్రద. ‘‘ఒకసారి షూటింగ్ లంచ్ టైంలో రాజేశ్ కుమార్, జితేంద్ర మా ఇద్దరిని ఒకే రూమ్‌లో పెట్టి తాళం వేశారు. దాదాపు గంటసేపు అలానే ఉంచారు. అలా అయినా మేం ఒకరితో ఒకరం మాట్లాడుకుంటామని భావించారు. గంట తర్వాత తలుపు తీసి చూస్తే.. మేం ఇద్దరం ఆ పక్క ఒకరం.. ఈ పక్క ఒకరం కూర్చుని ఉన్నాం. ఆ తర్వాత ఇద్దరం బయటకు వెళ్లిపోయాం’’ అని చెప్పుకొచ్చారు జయప్రద. చదవండి: 'అమ్మాయ్... చింపి.. చింపి.. చంపి పడేశావ్' ఆ నటి గొంతు నాకన్నా ఘోరంగా ఉంది -
అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధిస్తా
వాషింగ్టన్: చైనాతో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన కంపెనీలపై అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కొరడా ఝళిపించారు. చైనాకే చెందిన వీడియో యాప్ టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ యాప్‌ను సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతోందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘శనివారం కల్లా ఈ చైనా యాప్‌పై చర్యలు తీసుకుంటా. నాకున్న అత్యవసర అధికారాలను వినియోగించుకుంటా లేదా ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులను జారీ చేస్తా’అని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. టిక్‌టాక్ హక్కులను అమెరికా కంపెనీ కొనుగోలు చేయడం తనకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. అమెరికాలో టిక్‌టాక్ హక్కుల కోసం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వేలకోట్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు చురుగ్గా చర్చలు జరుపుతున్నారంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో శుక్రవారం ఒక కథనం వెలువడింది. ఈ చర్చల్లో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్తోపాటు అధ్యక్ష భవనం ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపింది. అమెరికన్ల వ్యక్తిగత గోప్యత, భద్రతకు ప్రమాదకరంగా మారిందంటూ టిక్‌టాక్‌పై విదేశాంగ మంత్రి మైక్ పాంపియో విమర్శలు చేస్తున్నారు. 29 వేల చైనా యాప్‌ల తొలగింపు చైనీస్ యాప్ స్టోర్ నుంచి శనివారం అకస్మాత్తుగా 29,800 యాప్‌లను స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ యాపిల్ తొలగించింది. ఇందులో 26 వేలకు పైగా గేమ్ యాప్‌లే కావడం గమనార్హం. లైసెన్స్ లేని గేమ్ యాప్‌లపై చైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నందునే యాపిల్ ఇలా చేసినట్లు క్విమై అనే పరిశోధన సంస్థ అంటోంది. చైనా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ ప్రభుత్వ నిబంధనలకు లోబడే చాలాకాలంలో పనిచేస్తున్నాయి. ఈ ఏడాది జూలై మొదటి వారంలో యాపిల్ తన యాప్ స్టోర్ నుంచి 2,500 టైటిళ్లను తొలగించింది. ఇందులో ప్రజాదరణ ఉన్న జింగా, సూపర్సెల్ వంటివి కూడా ఉన్నట్లు సమాచారం. -
పొన్నాల వర్సెస్ జంగా!
సాక్షి , వరంగల్ : పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి వర్గీయుల మధ్య నెలకొన్న గ్రూపు విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, అతని అనుచరులకు ఘోర పరాభవం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జనగామలోని 30 వార్డులకు గానూ పొన్నాల అనుచరులకు ఒక్క సీటు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు. మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన పొన్నాలకు ఈసారి కనీసం బీ ఫాంలు కూడా ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పొన్నాలకు పొమ్మనలేక పొగ పెడుతున్నారని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో డీసీసీ నేత జంగా రాఘవరెడ్డికే బీ ఫాంలు, అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు టీపీసీసీ ఇవ్వగా, జంగా రాఘవరెడ్డి ఒకే కుటుంబానికి రెండు రెండు టికెట్లు కేటాయించారని కాంగ్రెస్ నేతలు జనగామలో రోడ్డెక్కారు. చేసేదేం లేక పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పీసీసీ కార్యదర్శులు కంచ రాములు, ధర్మ సంతోష్‌రెడ్డి అధిష్టానానికి తమ రాజీనామా లేఖలు పంపించారు. కాంగ్రెస్‌లో బీసీలను అణిచివేశారని ఈ సందర్భంగా వారు ఆరోపణలు చేశారు. పెల్లుబికిన నిరసనలతో పొన్నాల లక్ష్మయ్య ఇంటికి చేరిన కాంగ్రెస్ శ్రేణులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జంగా రాఘవరెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జనగామలో స్థానికేతురుడైన రాఘవరెడ్డి పార్టీని నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. -
ఈ ఇద్దరి మధ్య అసలేం జరిగింది ?
సాక్షి, ఆదిలాబాద్ : ఈ ఇరువురు ప్రజాప్రతినిధుల మధ్య ప్రస్తుత వైరం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. భిన్న సిద్ధాంతాలు ఉన్న వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు కావడంతో సహజంగానే పార్టీల పరంగా చోటుచేసుకున్న విభేదాలా అన్న అనుమానాలు ఉన్నా అటువంటిది కాదనేది వారి మాటలను బట్టే స్పష్టమైంది. ఇరువురు నేతలు ఇటీవల ఐటీడీఏ పాలకవర్గ సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తమకు వ్యక్తిగతంగా ఎలాంటి పొరపొచ్చాలు లేవని స్పష్టం చేశారు. అయినా మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. దీంతో ఈ రచ్చకు ఆజ్యం ఏమై ఉంటుందోనని అందరిని తొలుస్తుంది. కొనసాగుతున్న పర్వం.. గత నెల వివిధ వేదికల ద్వారా ఈ ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవడం ద్వారా మొదలైన పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వేర్వేరుగా ప్రెస్మీట్లు పెట్టి మరీ ఒకరి వ్యాఖ్యలను మరొకరు ఖండిస్తూ నిరంతరంగా వ్యవహారం సాగుతోంది. అయితే ఇరువురు నేతల ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. బీసీ సంక్షేమశాఖ మంత్రిగా జోగు రామన్న ఉన్న సమయంలో ఆ శాఖకు రూ.వెయ్యి కోట్లు కేటాయింపులు ఉండగా, పూర్తిస్థాయిలో ఖర్చు చేసినట్లు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని సోయం బాపురావు సవాల్ విసిరారు. సోయం బాపురావు తాను గెలిచిన వెంటనే ఢిల్లీకి వెళ్లి సంతకం పెడితే ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించడం జరుగుతుందని చెప్పడం జరిగిందని, ఇప్పుడు నెలలు దాటినా తాను ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారంటూ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రతిసవాల్ విసిరారు. ఇలా ఈ ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకోవడం గమనార్హం. ఆజ్యం ఎక్కడ? ఆదివాసీలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎంపీ సోయం బాపురావు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుండగా, ఎస్టీ జాబితా నుంచి లంబాడీల తొలగింపు విషయంలో బీజేపీ రాష్ట్ర నేతలతో చెప్పిస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటూ రామన్న పేర్కొనడం గమనార్హం. అయితే ఈ ఇరువురు నేతల మధ్య ఇంతటి రగడకు ఆజ్యం ఎక్కడ పడిందన్న సందేహం ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను తొలుస్తుంది. తొలుత ఆగస్టు చివరిలో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కనబడింది. అయితే అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్, రైతుబంధు విషయంలో కొనసాగడంతో అది ప్రభుత్వాల పరంగా సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అక్కడ విభేదాల స్థాయి అంతగా కనిపించలేదు. అంతకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ 9 జెడ్పీటీసీలను గెలవడం, బీజేపీ 5, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలవడం అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ క్రమంలో 17 జెడ్పీటీసీల్లో 9 మంది మెజార్టీ ఉన్న టీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడం ఖాయమే అయినా అనూహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు జత కట్టడం ఆసక్తి కలిగించింది. దీనికి ఎంపీ సోయం బాపురావు నేతృత్వం వహించారు. ఇక టీఆర్ఎస్ నుంచి ఎవరినైన ఒకరిని ఇటువైపు తిప్పుకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయన్న రాజకీయ వేడి జెడ్పీచైర్మన్ ఎన్నిక రోజు కనిపించింది. అయితే ఈ వ్యవహారంలో ముందు జాగ్రత్త పడ్డ టీఆర్ఎస్ ముఖ్యంగా ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులు ఉట్నూర్ కాంగ్రెస్ జెడ్పీటీసీ చారులతను టీఆర్ఎస్ వైపు తిప్పుకున్నారు. జెడ్పీచైర్మన్ ఎన్నికలో చారులత టీఆర్ఎస్కు మద్దతిచ్చారు. బీజేపీ నుంచి ఆదివాసీ అభ్యర్థిని జెడ్పీచైర్మన్ పదవి కోసం పేరు ప్రతిపాదించాక ఈ వ్యవహారం చోటుచేసుకుంది. ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్నకు విభేదాలు అప్పటి నుంచే పొడసూపాయా అన్న అభిప్రాయం వ్యక్తమైనా ఆ సమావేశం చివరిలో ఇరువురు నేతలు కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడం ఆసక్తి కలిగించింది. పట్టున్న నేతలే.. ఈ నేతల రాజకీయ అనుభవాన్ని పరిశీలించినా ఇరువురు పట్టున్న నేతలే. ఎంపీ సోయం బాపురావు ఆదివాసీ ఉద్యమం పరంగా తన జాతి కోసం పోరాటం చేస్తూ ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే డిమాండ్‌కు కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా గతంలో బోథ్ ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరించారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలను చూశారు. ఇక ఎమ్మెల్యే జోగు రామన్న బీసీల ఆదరణతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో పట్టు కలిగి ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిస్థాయిలో మంత్రిగా పనిచేశారు. రాజకీయ అడుగులకు విరోధం కావడంతో ఇరువురి మధ్య ఈ విభేదాలు తలెత్తాయా.. లేదంటే మరేమైనా అయి ఉంటుందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. అదే సమయంలో కేంద్రం నక్సల్ బాధిత జిల్లాలకు ఇచ్చే నిధులను మళ్లించారని జోగు రామన్నతోపాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై కూడా సోయం బాపురావు విమర్శలు సంధించారు. అలాంటప్పుడు నిధుల మళ్లింపు విషయంలో ఈ విభేదాలా.. లేనిపక్షంలో సామాజిక కోణంలో హక్కులు, నిధుల విషయంలో ఒకరిపై మరొకరి ఆరోపణలు అగ్నికి ఆజ్యం పోసిందా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా మున్సిపల్ ఎన్నికల ముందు టీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఇది రాజకీయ వేడి పుట్టిస్తోంది. -
కమలాకర్ వర్సెస్ కమలాసన్
సాక్షి, కరీంనగర్ : అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరైతే... మరొకరు డీఐజీ ర్యాంక్‌లో కమిషనర్‌గా పనిచేస్తున్న పేరున్న ఐపీఎస్ అధికారి. ఇద్దరూ తమ తమ బాధ్యతల్లో ప్రజల మన్ననలు పొందుతున్న వారే. ఎక్కడ ఎవరి అహం దెబ్బతిందో తెలియదు గానీ... గత కొంతకాలంగా వారి మధ్య అంతరం పెరిగింది. కరీంనగర్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గంగుల కమలాకర్‌కు, దాదాపు మూడేళ్లుగా కరీంనగర్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కమలాసన్‌రెడ్డికి మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్ ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ హెడ్‌క్వార్టర్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కమలాకర్ భావిస్తుండగా, శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా చూస్తూనే... వివిధ అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్గిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు కమిషనర్ కమలాసన్‌రెడ్డి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొత్తపల్లి మండలం, చింతకుంటలో గత ఆదివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటనతో సమస్య తీవ్రమైంది. ‘పెట్రోల్’ మంట రాజేసిన పింఛన్ల సభ అధికారులు తన ఇంటికి నెంబర్లు కేటాయిండం లేదని రెండు లీటర్ల పెట్రోల్ క్యాన్‌తో చింతకుంట సభలో ఓ మహిళ వేదిక మీదికి వచ్చి పెట్రోల్ మీద పోసుకొనేందుకు ప్రయత్నించగా, ఎమ్మెల్యే గన్మెన్లు అప్రమత్తమై నిలువరించారు. అప్పటికే పెట్రోల్ ఎమ్మెల్యే, ఇతర నాయకులపై కూడా పడడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. తనకు భద్రత కల్పించడంలో పోలీసులు ఉద్ధేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఐజీ ప్రమోద్‌కుమార్‌కు తన అసంతృప్తిని తెలియజేసినట్లు సమాచారం. పింఛన్ల సభ జరుగుతుంటే కనీస భద్రత ఏర్పాటు చేయలేదని, సభకు పెట్రోల్ క్యాన్‌తో ఓ మహిళ వచ్చి, వేదిక ఎక్కుతున్నా అడ్డుకునే పోలీసులు లేకుండా పోవడాన్ని తప్పుపట్టారు. కొత్తపల్లి ఎస్ఐ, ఇద్దరు బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు సభకు వచ్చి, వేరే బందోబస్తుకు వెళ్లిపోతే ఎమ్మెల్యేకు పోలీసుల భద్రత అవసరం లేదా అని ప్రశ్నించినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే కమిషనర్ కమలాసన్‌రెడ్డి స్వయంగా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి, జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. కొత్తపల్లి ఎస్ఐని తక్షణమే అక్కడి నుంచి తొలగించి, కమిషనరేట్‌కు అటాచ్డ్ చేశారు. అయితే పెట్రోల్‌తో మహిళ సభావేదిక మీదికి వచ్చినప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఉంటే పరిస్థితి ఏమయ్యేదని భావిస్తున్న ఎమ్మెల్యే చల్లబడడం లేదు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచేనా? గత సంవత్సరం చివరలో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలోనే కమిషనర్‌కు ఎమ్మెల్యేకు మధ్య సఖ్యత లోపించినట్లు సమాచారం. ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన ఓ హోటల్లో పోలీసులు తనిఖీలు జరపడం, ఇతరత్రా సంఘటనలతో పొరపొచ్చాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్, ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో కట్టుదిట్టంగా వ్యవహరించామే తప్ప ఎమ్మెల్యే, ఇతర నేతల గురించి కాదని పోలీసులు సమర్థించుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీకి మెజారిటీ రావడంపై కూడా గంగుల అసంతృప్తికి కారణంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చింతకుంట సంఘటన ఇద్దరి మధ్య మంటలు రాజేసింది. ఎస్ఐ సమాచార లోపమే కారణమా..? ఆదివారం చింతకుంటలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో పింఛన్ల సమావేశం జరుగుతుందనే విషయాన్ని ఎస్ఐ స్వరూప్‌రాజ్ తమకు తెలియజేయలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కరీంనగర్ రూరల్ సర్కిల్లోని కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే పింఛన్ల సభ ఉన్న విషయం తనకు సమాచారం లేదని రూరల్ సీఐ శశిధర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఎస్ఐ స్వరూప్‌రాజ్ తనతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి సభకు పోయి, తరువాత శాతవాహన యూనివర్సిటీలో ఏదో ధర్నా సమాచారం వస్తే అక్కడికి వెళ్లినట్లు చెబుతున్నారని, ఈ విషయాలేవీ తనకు గానీ, ఏసీపీకి గానీ తెలియవని ఆయన స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డిని ఈ విషయంపై ప్రశ్నించగా... ఎమ్మెల్యే సభ గురించి ఎస్ఐ పై అధికారులకు చెప్పక, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా విషయం తెలిసిన వెంటనే కొత్తపల్లి ఎస్ఐ బాధ్యతల నుంచి స్వరూప్‌రాజ్‌ను తొలగించి, జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఎమ్మెల్యే కమలాకర్‌తోపాటు ప్రజాప్రతినిధులు అందరికీ పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నామని, సమాచారలోపంతో ఈ సంఘటన జరిగినట్లు ఆయన చెప్పారు. ఎమ్మెల్యేకు పెరిగిన భద్రత చింతకుంటలో ఆదివారం జరిగిన సంఘటన వివాదాస్పదం కావడంతో పోలీస్ అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తోపాటు ప్రజా ప్రతినిధులందరికీ భద్రతను పెంచారు. ఎస్బీ విభాగాన్ని అలర్ట్ చేశారు. ఎమ్మెల్యే కార్యక్రమాల సమాచారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తెలియజేయకపోవడంపై ఎస్బీ ఇన్స్పెక్టర్, సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే కమలాకర్ పోలీస్ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. మునిసిపల్ ఎన్నికల వేళ వివాదం రాజుకోకుండా నష్ట నివారణ చర్యలు కూడా మొదలైనట్లు సమాచారం. -
కోల్‌కతాలో ‘దీదీ’గిరి!
కోల్‌కతా: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారు మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరింది. చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో ఆదివారం కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను విచారించేందుకు వెళ్లిన సీబీఐ అధికారుల్ని బెంగాల్ పోలీసులు అడ్డుకుని నిర్బంధంలోకి తీసుకోవడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధీనంలో పనిచేస్తున్న రెండు పోలీసు విభాగాల మధ్య కనీవినీ ఎరుగని రీతిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. సెర్చ్ వారెంట్ లేకుండానే పోలీస్ కమిషనర్ ఇంటికి వెళ్లడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ.. మోదీ, షా చేతుల్లో తనకు అవమానం జరిగిందని పేర్కొంటూ కోల్‌కతాలో పేరొందిన మెట్రో సినిమాకు ఎదురుగా రాత్రి ధర్నాకు దిగారు. అయితే సీబీఐ అధికారుల అరెస్ట్‌పై భిన్న కథనాలు వినిపించాయి. తమ అధికారుల్ని బలవంతంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని సీబీఐ ఆరోపిం చగా, సీనియర్ పోలీసు అధికారి ఒకరు ఖండిం చారు. పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు తగిన పత్రాలు ఉన్నాయో? లేదో? పరిశీలించేందుకే వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లామని వివరణ ఇచ్చారు. దెబ్బకు దెబ్బ అన్నట్లు ఆ తరువాత బెంగాల్ పోలీసుల బృందం ఒకటి కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి తమ అదుపులోకి తీసుకుంది. కనిపించకుండా పోయారని వార్తలు వచ్చిన రాజీవ్‌కుమార్ తాజా ఘటనతో మళ్లీ ప్రత్యక్షమయ్యారు. రాజీవ్‌కుమార్‌ను విచారించేందుకు బెంగాల్ ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించా లని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీబీఐ తెలిపింది. శారద చిట్‌ఫండ్, రోజ్‌వ్యా లీ పోంజి పథకాలకు సంబంధించి రాజీవ్‌కుమార్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారని సీబీఐ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇదే అదనుగా బీజే పీ, తృణమూల్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బెంగాల్లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని తృణమూల్ ఆరోపించగా, రాజ్యాంగ సమగ్రత, విలువల్ని మమత ప్రభుత్వం ఎగతాళి చేస్తోందని బీజేపీ ఎదురు దాడి చేసింది. డ్రామా కొనసాగిందిలా.. కోల్‌కతాలో లౌడాన్ వీధిలోని రాజీవ్‌కుమార్ నివాసానికి సుమారు 40 మంది సీబీఐ అధికారులు చేరుకున్నాక కనీవినీ ఎరుగని హైడ్రామా మొదలైంది. వారు లోనికి వెళ్లకుండా అక్కడి భద్రతా సిబ్బంది, అధికారులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు..రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారుల వద్ద అవసరమైన పత్రాలు ఉన్నాయా? లేదా? అని వాకబు చేయడం ప్రారంభించారు. ఆ తరువాత కొందరు అధికారుల్ని షేక్స్పియర్ సరాని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ వెంటనే రాజీవ్‌కుమార్ నివాసానికి మరికొందరు సీబీఐ అధికారులు రావడంతో కొంత గందరగోళం నెలకొంది. వారిలో కొందరిని పోలీసులు బలవంతంగా జీపులో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణ ముగిశాక సీబీఐ అధికారుల్ని వదిలిపెట్టినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైం) ప్రవీణ్ త్రిపాఠి చెప్పారు. రహస్య ఆపరేషన్ నిమిత్తం కోల్‌కతాకు వచ్చామని వారు చెప్పారని, అది ఏ రకమైన ఆపరేషనో తమకు తెలియదని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఉద్రిక్తతను నివారించడానికి కోల్‌కతా సీబీఐ కార్యాలయం వద్దకు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. సీబీఐ దాడులు ఊహించాం: మమతా బెనర్జీ రాజీవ్‌కుమార్ నివాసం బయట హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించిన మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మోదీ ఆదేశాల మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రాజకీయ ప్రత్యర్థులపైకి సీబీఐని పంపుతున్నారని దుయ్యబట్టారు. ‘చేతులకు రక్తపు మరకలు అంటుకున్న అలాంటి ప్రధానితో మాట్లాడటానికి సిగ్గుగా ఉంది. జనవరి 19న విపక్షాలతో విజయవంతంగా ర్యాలీ నిర్వహించడంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోదీ, షా ప్రయత్నిస్తున్నారు. ర్యాలీ తరువాత సీబీఐతో దాడులు చేయిస్తారని మాకు తెలుసు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిట్‌ఫండ్ కంపెనీల యజమానుల్ని అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంలో సిట్‌ను ఏర్పాటుచేసి దర్యాప్తు చేసింది మేమే’ అని మమతా బెనర్జీ అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విపక్షాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని పరిహసించారు: బీజేపీ కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను సీబీఐ ప్రశ్నించకుండా పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ మండిపడింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల్ని పరిహాసానికి గురిచేస్తోందని ఆరోపించింది. ఈ వైఖరి మమతా బెనర్జీ నిరంకుశత్వాన్ని సూచిస్తోందని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ చిట్‌ఫండ్ కుంభకోణాలపై విచారణ జరుపుతోందని, కోల్‌కతా పోలీసుల చర్య అత్యున్నత న్యాయస్థానం పట్ల అవిధేయత కనబరచడమేనని పేర్కొంది. బెంగాల్లో శాంతి, భద్రతలు పూర్తిగా దారితప్పాయని విమర్శించింది. మమతకు విపక్షాల బాసట.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో మమతా బెనర్జీకి విపక్ష నాయకులు సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఆమెకు ఫోన్‌చేసి మద్దతు తెలిపారు. విపక్షాలంతా ఒకే పక్షమని, వచ్చే ఎన్నికల్లో ఫాసిస్ట్ శక్తుల్ని ఓడిస్తామని రాహుల్ అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్య స్ఫూర్తికి మోదీ తూట్లుపొడిచారని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి మోదీ–షా ద్వయం ప్రమాదకరమని, బెంగాల్లో సీబీఐ చర్యను ఖండించాలని అన్నారు. సీబీఐ నోటీసులకు స్పందించని కమిషనర్ శారదా, రోజ్‌వ్యాలీ కుంభకోణాల కేసుల్ని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి రాజీవ్‌కుమార్ నేతృత్వం వహించారు. ఈ కేసులకు సంబంధించి గల్లంతయిన కొన్ని పత్రాల విషయమై ఆయనని విచారించాల్సి ఉందని సీబీఐ ప్రకటించింది. తమ ముందు హాజరుకావాలని సీబీఐ పలు నోటీసులు పంపినా స్పందించలేదు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష జరిపేందుకు ఇటీవల ఎన్నికల సంఘం కోల్‌కతాలో పర్యటించగా, ఆ కార్యక్రమానికి రాజీవ్‌కుమార్ హాజరుకాలేదు. అయితే రాజీవ్‌కుమార్ విధులకు దూరంగా ఉంటున్నారని వచ్చిన వార్తల్ని కోల్‌కతా పోలీసులు కొట్టిపారేశారు. ఆయన కోల్‌కతాలోనే ఉన్నారని, రోజూవారీ విధులకు హాజరువుతున్నారని ప్రకటన విడుదల చేశారు. సీబీఐ అధికారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు -
ఆర్టీసీ చైర్మన్, టీఎంయూ మధ్య కోల్డ్‌వార్
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్, గుర్తింపు సంఘం టీఎంయూ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. అదిప్పుడు బహిరంగంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లింది. చైర్మన్ సోమారపు సత్యనారాయణ తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, కార్మికుల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పాలని టీఎంయూ ప్రధానకార్యదర్శి అశ్వత్థామరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం బస్ భవన్లో విలేకరులతో వారు మాట్లాడారు. గత నెల 28న సీసీఎస్, పీఎఫ్ నిధులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ బస్‌భవన్ ముందు ధర్నా నిర్వహించిన తమ ను ఉద్దేశించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, పోలీస్ కేసు పెడతామని, ఇదేచివరి వార్నింగంటూ చైర్మన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశామని, తమపై చర్య లు తీసుకునే అధికారం చైర్మన్‌కు లేదని అన్నారు. అధికారిని వెనుకేసుకొస్తున్నారు.. ఆర్టీసీ ఎండీ లేని సమయంలో చైర్మన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి విమర్శించారు. ఫైనాన్స్ అడ్వైజర్ స్వర్ణశంకరన్ నిబంధనలకు విరుద్ధంగా సీసీఎస్ నుంచి రూ.400 కోట్లను డ్రా చేసి సంస్థకు వాడారని ఆరోపించారు. కార్మికుల ప్రావిడెండ్ ఫండ్(పీఎఫ్)కు చెందిన దాదాపు రూ.500 కోట్లను డ్రా చేసి సంస్థకు వాడారని, అలాగే ఎస్బీటీ, ఎస్‌ఆర్‌బీఎస్‌లకు సంబంధించిన రూ.100 కోట్లను కూడా డ్రా చేశారని తెలిపారు. కార్మికులు ఎన్‌క్యాష్‌మెంట్ రాక జీతభత్యాలు లేక నానా అవస్థలు పడుతుంటే ఫైనాన్స్ అడ్వైజర్ నిధు లను దుర్వినియోగం చేశారని, చట్టప్రకారం అడ్వైజర్‌ను శిక్షించాల్సిందిపోయి చైర్మన్ వెనుకేసుకొస్తున్నా రని విమర్శించారు. ప్రభుత్వం నుంచి రూ.600 కోట్లు, జీహెచ్ఎంసీ నుంచి రూ.400 కోట్లు సంస్థకు రావాల్సి ఉందని, వాటిని తీసుకురావాల్సిన బాధ్యతను విస్మరిస్తూ టీఎంయూపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ కేసులు, జైళ్లకు భయపడేది లేదని, జైలుకు పంపితే బెయిల్ కూడా తీసుకోబోమని వారు స్పష్టం చేశారు. -
‘పానీ’పట్టు యుద్ధం
సాక్షి, విజయవాడ: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. పోలవరం కుడికాలువ పట్టిసీమపై ఏర్పాటు చేసిన పంపుసెట్లకు విద్యుత్ సరఫరా విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మంత్రి ఉమా సొంత నియోజకవర్గం మైలవరంలో నీరు ఇచ్చి గన్నవరం నియోజకవర్గంలోని రైతులకు నీరు ఇవ్వకుండా తెర వెనుక రాజకీయం చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మరోసారి రోడ్డెక్కారు. త్వరలోనే ఈ వివాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానంటూ వెల్లడించారు. ఉమా ద్వంద్వనీతి.. పోలవరం కుడి కాల్వ మైలవరం, గన్నవరం నియోజకవర్గాల మీదుగా కృష్ణానదికి చేరుతుంది. ఈ కాల్వ కోసం గన్నవరం రైతులు భూములు ఇచ్చారు. దీనికి ప్రభుత్వం రూ.700 కోట్లు చెల్లించింది. ఇక్కడ కాల్వల కంటే వ్యవసాయ భూములు ఎత్తుగా ఉండటంతో నీరు ఎక్కదు. పట్టిసీమ నీరు ఈ కాల్వ లో వెళ్తుండడంతో గన్నవరం నియోజకవర్గ రైతులు మోటార్లు పెట్టుకుని నీరు తోడుకుంటారు. అదే తరహాలో మైలవరం నియోజకవర్గంలోనూ రైతులు చేస్తారు. మంత్రి ఉమాకు, ఎమ్మెల్యే వంశీకి ఉన్న మనస్పర్ధల కారణంగా గన్నవరం నియోజకవర్గ రైతులు మోటార్ల ద్వారా నీరు తీసుకోవడం మంత్రికి మనస్కరించడం లేదు. తన నియోజకవర్గ రైతులకు మోటార్ల ద్వారా నీరు తోడుకునేందుకు అనుమతిచ్చే ఉమా గన్నవరం రైతుల విషయంలో మాత్రం పక్షపాత ధోరణి వహిస్తున్నారనే విమర్శలు ఆపార్టీ నేతల నుంచే వస్తున్నాయి. ఆది నుంచి వివాదమే.. పట్టిసీమ నీరు వచ్చిన తొలి ఏడాది నుంచి నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. మొదటి ఏడాది గన్నవరం రైతులు మోటార్లు పెట్టగానే ఇరిగేషన్ అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చివరకు వివాదం అవ్వడంతో అనుమతించారు. రెండో ఏడాది అదే తంతు. దీంతో ఎమ్మెల్యే వంశీ ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన తరువాత ఆ ఏడాది అనుమతిచ్చారు. మూడో ఏడాది మోటార్లకు కరెంటు ఇవ్వకుండా విద్యుత్ అధికారులు మోకాలు అడ్డుపెట్టి చివరకు విద్యుత్ ఇచ్చారు. ఈ ఏడాది తిరిగి మోటార్లకు విద్యుత్ ఇవ్వబోమంటూ తెగేసి చెప్పారు. ఎస్పీడీసీఎల్ అధికారి నాయక్‌తో ఎమ్మెల్యే వంశీ ఫోన్లో మాట్లాడినా విద్యుత్ చార్జీలు చెల్లిస్తామని చెప్పినా లాభం లేకపోయింది. దీంతో సాగునీరు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. కాగా సోమవారం ఉదయం టీడీపీ నాయకులు ధర్నా చేసి విద్యుత్ అధికారులకు మెమోరండం ఇచ్చినా ఫలితం లేకపోయింది. మైలవరం నియోజకవర్గంలో మోటర్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి..గన్నవరం నియోకవర్గంలో మోటార్లకు విద్యుత్ ఇవ్వకపోవడంతో పై ఎమ్మెల్యే వంశీ సీరియస్ అవుతున్నారు. మంత్రి దేవినేని ఉమా వల్లనే తమకు ఈ ఏడాది సాగు నీరు అందడం లేదని రైతాంగం అభిప్రాయపడుతోంది. సీఎం దృష్టికి సమస్య.. విద్యుత్‌బిల్లులు చెల్లిస్తామని చెప్పినా మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడాన్ని నిరసిన్తూ ఎమ్మెల్యే వంశీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నారు. రైతులపై మంత్రి వ్యవహరిస్తున్న తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దనే తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఏమైనా అధికారపార్టీకి చెందిన ఈ ఇద్దరి నేతల కుమ్ములాటల మధ్య రైతన్నలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ సరఫరా కోరుతూ ధర్నా గన్నవరం: మండలంలోని మెట్ట ప్రాంతాల్లో సాగునీటి చెరువులకు పట్టిసీమ నీటిని పంపింగ్ చేసుకునేందుకు వీలుగా మోటార్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద టీడీపీ నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు. పోలవరం కాలువ భూసేకరణకు సహకరించిన రైతులకు పట్టిసీమ నీటి సరఫరా చేసేందుకు విద్యుత్ సరఫరా ఇవ్వాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీచేసినప్పటికి ఆ శాఖ అధికారులు లెక్కచేయడం లేదని ఆ పార్టీ నేతలు అగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న మైలవరం నియోజకవర్గంలో నీటి పంపింగ్‌కు విద్యుత్ సరఫరా ఇస్తున్న అధికారులు, ఇక్కడే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. అధికారుల వైఖరి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైన అధికారులు వైఖరి మార్చుకోకపోతే ఎమ్మెల్యే ద్వారా సీఎంకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. -
అమెరికాపై చైనా ప్రచ్ఛన్నయుద్ధం
ఆస్పెన్: అగ్రరాజ్యంగా అమెరికా స్థానాన్ని ఆక్రమించేందుకు చైనా ప్రచ్ఛన్నయుద్ధం చేస్తోందని అమెరికా నిఘా సంస్థ (సీఐఏ) వెల్లడించింది. ఇందుకోసం అన్ని వనరులను చైనా వినియోగించుకుంటోందని అమెరికాకు చెందిన సీఐఏ నిపుణుడు (ఆసియా వ్యవహారాల) మైకేల్ కొలిన్స్ తెలిపారు. కొలిన్స్ వ్యాఖ్యలు చైనా ప్రభావం వేగంగా పెరుగుతోందన్న హెచ్చరికలను సూచిస్తోంది. ‘చైనా యుద్ధం చేయాలనుకోవడం లేదు. కానీ జిన్‌పింగ్ నేతృత్వంలోని చైనా ప్రభుత్వం అమెరికా ప్రభావాన్ని తగ్గించేందుకు వివిధ మార్గాల్లో అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేస్తోంది. నేరుగా యుద్ధం చేయలేక ప్రచ్ఛన్నయుద్ధాన్ని ఆశ్రయిస్తోందని నేను బలంగా చెప్పగలను. ఇది మనం చూసిన అమెరికా–రష్యాల మధ్య జరిగిన ప్రచ్ఛన్నయుద్ధంలా లేదు. కాస్త భిన్నంగా ఉంది’ అని కొలరాడోలో జరిగిన ఆస్పెన్ సెక్యూరిటీ ఫోరమ్ సదస్సులో కొలిన్స్ పేర్కొన్నారు. అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలు వ్యాపార వివాదాలను దాటి.. ఇరుదేశాలు నువ్వెంతంటే నువ్వెంత అనుకునే స్థాయికి చేరాయన్నారు. ‘అమెరికాలో జరుగుతున్న అత్యున్నత స్థాయి సాంకేతికత పరిశోధనలకు, వ్యాపార రహస్యాలను చైనా తస్కరిస్తోంది. తన మిలటరీని విస్తరిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని వివిధ ద్వీపాల్లో సైనిక స్థావరాలను ఆధునికీకరిస్తోందని అమెరికా సహా మిగిలిన దేశాలు ఐరాసకు ఫిర్యాదు చేశాయి. ఈ ద్వీపాలన్నీ తూర్పు క్రిమియాలుగా మారిపోతున్నాయి’ అని మైకేల్ కొలిన్స్ వెల్లడించారు. -
టీడీపీ నాయకుల మధ్య కోల్డ్‌వార్ !
సాక్షి, విజయవాడ : టీడీపీలో నాయకుల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. ముఖ్యంగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు తెలుగు యువత నాయకుడు దేవినేని అవినాష్ చెక్ పెడుతున్నారు. అవినాష్‌కు తన తండ్రి దేవినేని నెహ్రూ వర్గం అండదండలు పుష్కలంగా వుండటంతో పాటు జిల్లాకు చెందిన ఒక కీలక నేత సహాయ సహకారాలు అందిస్తూ ఉండటంతో ఆయన రెండు నియోజకవర్గాల్లోనూ తన వర్గాన్ని బలపరుచుకుంటున్నారు. బోడే వ్యతిరేక వర్గానికి అవినాష్ అండ! దేవినేని నెహ్రూ వర్గంలో కీలకంగా వున్న నేతలకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు మధ్య పొసగేది కాదు. అవినాష్ ఈ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టిన తరువాత కంకిపాడు, పెనమలూరు ప్రాంతాలకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు అవినాష్‌కు అండగా నిలబడుతున్నారు. అక్కడ ఉన్న కొంతమంది నేతలు నిర్వహించే కార్యక్రమాలకు బోడే ప్రసాద్‌ను ఆహ్వానించినా ఆయన వెళ్లడానికి ఇష్ట పడటం లేదు. దేవినేని అవినాష్ ఇటీవల నెహ్రూ వర్ధంతిని నిర్వహించినప్పుడు బోడే ప్రసాద్ దూరంగా ఉన్నారు. అవినాష్ వెళ్లిపోయిన తరువాత మొక్కుబడిగా వచ్చి వెళ్లారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అవినాష్ పెనమలూరు నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించడం బోడేకు రుచించడం లేదు. అవకాశం వస్తే పెనమలూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో దిగేందుకు అవినాష్ ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గద్దెకు పొగ... విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు అవినాష్ పొగపెడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటపడకపోయినా ఒకరికి ఒకరు చెక్ పెట్టుకునేందుకు తీవ్రంగా పావులు కదుపుతున్నారు. గద్దె వెంట ఉండే వారు అవినాష్‌తో కలవడానికి సిద్ధంగా లేరు. అవినాష్ వర్గాన్ని గద్దె పక్కన పెడుతున్నారు. అవినాష్ వర్గం చెప్పే పనులను చేయడానికి కూడా గద్దె రామ్మోహన్ ఆసక్తి చూపడం లేదని పార్టీలోనే బహిరంగంగానే చర్చ జరుగుతోంది. వ్యతిరేక వర్గంతో అవినాష్ వర్గం టచ్‌లో.... గద్దె వ్యతిరేకవర్గంతో అవినాష్ వర్గం సంప్రదింపులు జరుపుతోంది. 15, 16 డివిజన్లలో అవినాష్ వర్గీయులు గద్దెపై గుర్రుగా ఉన్నారు. నేతాజీ బ్రిడ్జి వద్ద బ్యారికేడ్ల సమస్యను పరిష్కరించకపోవడం, మల్లెల తిరుపతమ్మ మార్కెట్ సగం కూడా పూర్తికాకపోవడం, స్ట్రామ్ వాటర్ డ్రైయిన్ పనులు అసంపూర్తిగా వుండటం పై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే పై ఆగ్రహంతో ఉన్నారు. అవినాష్ వర్గానికి నియోజకవర్గంలో ఏవిధమైన పదవులు ఇవ్వకుండా ఎమ్మెల్యే జాగ్రత్త పడుతున్నారు. దీంతో గద్దెరామ్మోహన్ పై తిరుగు బావుటా ఎగరవేయాలని అవినాష్ వర్గం భావిస్తోంది. ఆదే విషయాన్ని ఐటీ మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా కొంతమంది నాయకులు తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో కార్యకర్తలు సీరియస్‌గా వున్నారు. తన తండ్రి నియోజకవర్గమైన విజయవాడ తూర్పు నియోజకవర్గంపై అవినాష్ కన్నేసి అక్కడ నుంచి పోటీకైనా సై అంటున్నారు. అందుకోసం నియోజకవర్గంలోని తన తండ్రితో కలిసి పనిచేసిన వారితో అవినాష్ విడతల వారీగా చర్చలు జరుపుతున్నారు. -
స్టార్ హీరోయిన్ల మధ్య కోల్డ్‌వార్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కత్రినా కైఫ్, జాక్వలిన్ ఫెర్నాండేజ్‌ల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. సల్మాన్‌తో పాటు వీరిద్దరు దబాంగ్ రీలోడెడ్ పేరిట నిర్వహిస్తున్న షోల కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టూర్లో భాగంగా అక్కడికి వెళ్లిన జాక్వలిన్, కత్రినాలు ఒకరికొకరు ఎదురుపడటానికి సైతం ఇష్టపడటం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ టూర్‌కు వీరితో పాటు సోనాక్షి సిన్హా, మనీశ్ పాల్లు కూడా వెళ్లారు. కత్రినా, జాక్వలిన్‌ల మధ్య అంతరాయలను గమనించిన సల్మాన్ వీరిద్దరు ఒకరికొకరు తారసపడకుండా చూడాలని ఇతర టీమ్ సభ్యులకు సూచించారు. హోటలల్లో కూడా కత్రినా, జాక్వలిన్లకు కేటాయించే రూమ్‌లు దూరంగా ఉండేలా వారు జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. -
ఐస్‌క్రీమ్ ‘కోల్డ్’ వార్!
సాక్షి, సిటీబ్యూరో: వేసవి కాలం వచ్చిందంటే శీతల పానీయాలతో పాటు ఐస్‌క్రీమ్‌లకు భారీ డిమాండ్ ఉంటోంది. కస్టమర్లకు చేరువకావడానికి అనేక సంస్థలు పలు సౌకర్యాలు కల్పిస్తుంటాయి. గూగుల్‌లో తమ నెంబర్లను పొందుపరచడం, కాల్ చేసిన వారికి డోర్ డెలివరీ ఇవ్వడం వీటిలో ఒకటి. క్రీమ్ స్టోన్ సంస్థకు చెందిన ఈ ‘సౌకర్యం’ హ్యాకింగ్‌కు గురైందని దాని ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. తమకు రావాల్సిన కాల్స్ హావ్మోర్ సంస్థకు వెళ్తున్నాయంటూ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ చాంద్‌బాషా దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖ ఐస్‌క్రీమ్స్ విక్రయ సంస్థ క్రీమ్‌స్టోన్‌కు నగర వ్యాప్తంగా అనేక ఔట్లెట్స్ ఉన్నాయి. గూగుల్ అందిస్తున్న ‘నియర్ బై’ సదుపాయంలో భాగంగా వీటి వివరాలతో పాటు ఫోన్ నెంబర్లను ఆ సంస్థ పొందుపరిచింది. ఓ ప్రాంతంలో ఉన్న వారు ఎవరైనా క్రీమ్‌స్టోన్ ఔట్‌లెట్‌కు వెళ్లాలని భావించినా, హోమ్ డెలివరీ కోసం ఆర్డర్ చేయాలనుకున్నా గూగుల్ ద్వారా తమ దగ్గరలో ఉన్న దానిని వెతుకుతుంటారు. ఇలా సెర్చ్ చేసినప్పుడు గూగుల్ ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న/ప్రముఖ క్రీమ్‌స్టోన్ ఔట్లెట్స్ వివరాలు చెప్పడంతో పాటు వాటి ఫోన్ నెంబర్లను డిస్ప్లే చేస్తుంది. ఈ వివరాల ఆధారంగా వినియోగదారులు ఆయా స్టోర్స్‌కు వెళ్లడమో, ఆర్డర్లు ఇచ్చి ఐస్‌క్రీమ్స్ ఇంటికి తెప్పించుకోవడమే చేస్తుంటారు. క్రీమ్‌స్టోన్ సంస్థకు చెందిన వినియోగదారులు కొందరు ఇటీవల గూగుల్ ద్వారా సెర్చ్ చేసినప్పుడు వివరాలు ఆ సంస్థలకు చెందినవే ఉంటున్నా... ఫోన్ నెంబర్లు మాత్రం హావ్మోర్ సంస్థకు చెందినవి డిస్ప్లే అవుతున్నాయి. దీంతో ఈ నెంబర్లకు కాల్స్ చేస్తే అవి హావ్మోర్ సంస్థ/ఔట్‌లెట్స్‌కు చేరుతున్నాయి. ఫలితంగా కొంత మేరకు వ్యాపారం వీరికి మళ్లుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన క్రీమ్‌స్టోన్ ఐస్‌క్రీమ్ వినియోగదారులు సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారూ సరిచూసుకోగా ఈ విషయం నిర్థారణ కావడంతో క్రీమ్‌స్టోన్ ఆపరేషన్స్ మేనేజర్ రెహ్మత్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొందరు దురుద్దేశంతోనే తమ సంస్థ ఔట్‌లెట్స్‌కు చెందిన గూగుల్‌లో ఉన్న డేటాబేస్‌ను హ్యాక్ చేసి, వేరే సంస్థ ఫోన్ నెంబర్లు ఉండేలా చేశారని అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి చీటింగ్ సెక్షన్‌తో పాటు ఐటీ యాక్ట్‌లోని 66 సీ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
అధికారుల మధ్య కోల్డ్‌వార్
నెల్లూరు(పొగతోట): ఓ పక్క పని ఒత్తిడి.. మరోవైపు జిల్లా ఉన్నతాధికారుల హెచ్చరికలతో రెవెన్యూ శాఖ ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు సైతం జిల్లా స్థాయి అధికారులకు ఎదురు తిరగలేక.. చెప్పిన పని చేయలేక నలిగిపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారుల మధ్య కోల్డ్‌వార్ ప్రారంభమైంది. ఉన్నతాధికారుల వైఖరిపై రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లేం దుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక.. పని ఒత్తిడి తట్టుకోలేక ఓ అధికారి మరణించగా, మరో అ«ధికారి ఆస్పత్రి పాలయ్యారు. జిల్లా అ«ధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక సివిల్ సప్లయ్స్ డీఎం తన కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇదీ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల పరిస్థితి. పనులు చేస్తున్నా, అది చాలదని, ఇంకా పరిగెత్తండంటూ ఒత్తిళ్లు చేయడంతో రెవెన్యూ అధికారులు ఆస్పత్రుల పాలవుతున్నారు. సమావేశాల్లో తహసీల్దార్లు, సీఎస్డీటీలను మందలించిన విషయం పత్రిక విలేకరికి ఎవరు చేరవేస్తున్నారంటూ జిల్లా అధికారులు ఆరాతీస్తున్నారు. మీరెన్ని చేసినా మా తీరింతేనని బెదిరిస్తున్నారని సమాచారం. సమీక్ష సమావేశాల్లో తహసీల్దార్లు, డీటీలు, సీఎస్డీటీలతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం రివాజు గా మారిపోయింది. ధర్నాలు, ఆందోళనలు చేసుకోండి ఐ డోంట్‌కేర్ అనే రీతి లో వ్యవహరిస్తున్నారని సమాచారం. సెలవుపై తహసీల్దార్ తహసీల్దార్లతో చులకనగా మట్లాడటంతో ఒకరు సెలవుపై వెళ్లగా, మరో ఇద్దరు సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అధికారుల ఒత్తిళ్లను తట్టుకోలేక అనంతసాగరం తహసీల్దార్ చెంచుకృష్ణమ్మ ఆస్పత్రి పాలై మరణించారు. అధికారుల ఒత్తిళ్లు, బెదిరింపులను తట్టుకోలేక జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం తన కార్యాలయంలోనే ఆత్మహత్నాయత్నానికి పాల్పడ్డారు. సకాలంలో సిబ్బంది కాపాడటంతో డీఎం ప్రాణాలతో బయటపడ్డారు. రికార్డులు సక్రమంగా లేకపోతే వాటిని ఈ విధంగా రాయాలని సూచించకుండా అందరి ముందు అవమానకరంగా మాట్లాడి మానసికంగా హింసిస్తున్నారని రెవెన్యూ అధికారులు వాపోతున్నారు. సీనియర్ తహసీల్దార్లతో దురుసు సీనియర్ తహసీల్దార్లతో జిల్లా అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాను జిల్లాకు వచ్చింది మీరు చెప్పింది వినడానికి కాదు.. తాను చెప్పింది చేయమని ఆదేశాలు జారీ చేస్తున్నారు. మీరు చెప్పింది ఆచరణలో సాధ్యంకాదు అని సమాధానం చెప్పిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సాధారణ పాలన, జిల్లా అధికారుల సొంత అజెండా, సర్వేలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలికాన్ఫరెన్స్‌లు, సమీక్ష, సమావేశాలు, తదితరాలతో రెవెన్యూ అధికారులు అల్లాడిపోతున్నారు. సిబ్బంది తక్కువ సమస్యలు అధికం. సూచించిన పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి. సీనియర్లని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ఏపీ జేఏసీ అమరావతి, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. ఇది మంచిపద్ధతి కాదని.. జిల్లా అధికారులు, రెవెన్యూ ఉద్యోగుల మధ్య అగాధం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే జరగబోయే పరిణామాలకు జిల్లా యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బొప్పరాజు తెలిపారు. -
అఖిలప్రియ వార్తా.. ఐతే ఆపెయ్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా నాగిరెడ్డి ‘ఆత్మ స్నేహితుడు’ ఏవీ సుబ్బారెడ్డి మధ్య వార్ మరింత ముదిరింది. ఏకంగా భూమా అఖిలప్రియకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయకూడదని ఏవీ సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాల నేపథ్యంలో నంద్యాల సిటీ కేబుల్‌లో మంత్రి వార్తలతో పాటు నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కార్యక్రమాలను కూడా ప్రసారం చేయడం లేదు. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, బనగానపల్లె ప్రాంతాల్లోనూ వీరి వార్తలకు బ్రేక్ పడింది. అయితే.. సిటీకేబుల్‌లో తమకూ వాటా ఉందని, తమ వార్తలను ఎందుకు ప్రసారం చేయరంటూ కేబుల్ సిబ్బందిని మంత్రి అఖిలప్రియ హెచ్చరించారు. ఏ విషయమైనా ఏవీతోనే తేల్చుకోవాలని వారు స్పష్టం చేశారు. ఆయనతో మాట్లాడే ప్రసక్తే లేదని అఖిలప్రియ భీష్మించారు. మొత్తమ్మీద వారం రోజులుగా వీరిద్దరి వార్తలు లేకుండానే సిటీకేబుల్ నడుస్తుండటం చర్చనీయాంశమయ్యింది. భూమా కుటుంబ వార్తలు లేకుండా ఉండటం సిటీ కేబుల్ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం. రోజురోజుకూ... భూమా నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి ఆత్మగా వ్యవహరించేవారు. ఏవీ లేకుండా ఏ రాజకీయ నిర్ణయమూ భూమా తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. అయితే, భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఇరు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇక కొత్త సంవత్సరం సాక్షిగా వీరి మధ్య అగాధం మరింత పెరిగింది. నూతన సంవత్సర వేడుకల పేరుతో ఏవీ సుబ్బారెడ్డి భారీ విందును ఆళ్లగడ్డలో ఏర్పాటు చేశారు. దీనికి వెళ్లొద్దని మంత్రి ఆదేశాలు జారీచేశారు. అయినా, వారి కుటుంబ సభ్యులు కూడా కొద్ది మంది హాజరుకావడం గమనార్హం. తాజాగా ఏవీ హెల్ప్‌లైన్ పేరుతో సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో కార్యకలాపాలు ప్రారంభించారు. మార్కెట్‌యార్డులో రైతులకు భోజన వసతి కల్పించే విషయంలో కూడా గొడవ పడ్డారు. నేరుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేదాకా వెళ్లారు. ఇదే తరుణంలో కేబుల్ వార్‌కు ఏవీ సుబ్బారెడ్డి తెరలేపారు. మొదటగా మంత్రి అఖిలప్రియకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేయొద్దని సిటీ కేబుల్ సిబ్బందిని ఆదేశించారు. ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కార్యక్రమాలను మాత్రం ప్రసారం చేశారు. అయితే..తన సోదరి అఖిలప్రియ కార్యక్రమాలనూ కవర్ చేయాలని బ్రహ్మానందరెడ్డి కోరారు. ఇందుకు ఏవీ ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో తన వార్తలు కూడా ప్రసారం చేయొద్దని బ్రహ్మానందరెడ్డి తేల్చిచెప్పినట్టు సమాచారం. దీంతో వాటిని కూడా నిలిపివేశారు. కాగా.. సిటీ కేబుల్‌లో తమకూ 50 శాతం వాటా ఉందని, ఎందుకు ప్రసారం చేయరంటూ మేనేజర్ జయచంద్రారెడ్డితో అఖిలప్రియ వాదించినట్టు సమాచారం. అయితే, ఏ విషయమూ ఏవీ సుబ్బారెడ్డితోనే తేల్చుకోవాలని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. ఏవీతో మాట్లాడే ప్రసక్తే లేదని అఖిలప్రియ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి ఇద్దరి వార్తలకు నంద్యాల సిటీ కేబుల్‌లో బ్రేక్ పడింది. -
ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం వద్దు
బీజింగ్, చైనా : ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీసే వ్యాఖ్యలను అమెరికా విడిచి పెట్టాలని చైనా హితవు పలికింది. ఆసియా ప్రాంతంలో వరుసగా అణ్వాయుధ ప్రయోగాలు చేస్తున్న రష్యా, చైనాలను అమెరికా ఎన్పీఆర్లో హెచ్చరించిన విషయం తెలిసిందే. యూఎస్ అణ్వస్త్ర వ్యూహ సమీక్ష(ఎన్పీఆర్)పై చైనా ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రచ్ఛన్న యుద్ధమనే ఆలోచనా విధానం నుంచి యూఎస్ బయటకు రావాలని పేర్కొంది. అమెరికా, దాని మిత్ర దేశాలపై అణు దాడులకు దిగినా, ఉగ్రవాదులకు న్యూక్లియర్ పవర్ దక్కేలా చేసినా సహించబోమని అమెరికా ఘాటు వ్యాఖ్యలు చేసింది. -
భారత్ – చైనా ప్రచ్ఛన్నయుద్ధం?
న్యూయార్క్: భారత్, చైనాల మధ్య సంబంధాల్లో ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం కనిపిస్తోందని అమెరికా మాజీ దౌత్యాధికారిణి అలిసా ఐర్స్ అన్నారు. చైనాను నిలువరించే క్రమంలో అమెరికా నేతృత్వంలోని కూటమిలో భారత్ చేరే అవకాశాలు లేవన్నారు. దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల విభాగంలో పనిచేసిన అలిసా ప్రస్తుతం విదేశీ వ్యవహారాల కౌన్సిల్లో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె రాసిన పుస్తకం ‘అవర్ టైం హాజ్ కమ్: హౌ ఇండియా ఈజ్ మేకింగ్ ఇట్స్ ప్లేస్ ఇన్ ది వరల్డ్’ విడుదల సందర్భంగా న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చైనాతో పటిష్టమైన వాణిజ్య సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ భారత్ సంతృప్తి చెందటం లేదన్నారు. హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెంచుకోవటం, ముఖ్యంగా డిజిబౌటిలో సైనిక స్థావరం ఏర్పాటును భారత్ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. పాక్, శ్రీలంకలతో చైనా సన్నిహితంగా మెలుగుతూ పెట్టుబడులు పెట్టడం భారత్‌కు ఇబ్బంది కలిగిస్తోందన్నారు. స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు ప్రాధాన్యమిచ్చే వాతావరణం ప్రపంచమంతటా ఉండాలని భారత్ ఆకాంక్షిస్తోందని ఆమె చెప్పారు. 2008 ముంబై దాడుల వంటివి పునరావృతమైతే భారత్ ఉదాసీన వైఖరితో ఉంటుందని భావించలేమన్నారు. నిర్ణయాత్మకంగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని అంచనా వేశారు. గతేడాది పాక్ భూభాగంపై భారత్ సర్జికల్ దాడులను ఇందుకు ఉదాహరణగా చెప్పారు. 2018లో ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు భారత్ ముందడుగు వేస్తోందని చెప్పారు. -
దశ దేశాల అతిథులు
ఈసారి మన గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొనేందుకు ఆగ్నే యాసియా దేశాల సంఘం(ఆసియాన్) అధినేతలు వచ్చారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని, సైనిక పాటవాన్ని ప్రముఖంగా ప్రదర్శించే ఈ ఉత్సవాలకు ప్రతిసారీ ఒక దేశాధినేత ముఖ్య అతిథిగా రావడం ఆనవాయితీ. అందుకు భిన్నంగా ఈసారి ఆసియాన్ అధినేతలందరూ రావడం విశేషం. ఆసియాన్‌తో మన దేశం సంబంధాలు నెలకొల్పుకుని అర్థ శతాబ్ది పూర్తయింది. వాటితో మనకు వ్యూహాత్మక భాగ స్వామ్యం ఏర్పడి పదిహేనేళ్లయింది. ఆసియాన్ దేశాలతో భారత్ వాణిజ్యపరమైన చర్చలు సాగించేందుకు అనువైన దౌత్య భాగస్వామ్యం ఏర్పడి పాతికేళ్లవుతోంది. ఈ దేశాలతో మనకు ప్రాదేశిక లేదా సముద్ర ప్రాంత సరిహద్దులు లేవు. కనుక వాటికి సంబంధించిన తగాదాలు లేవు. అందువల్ల మనతో ఉన్న స్నేహబంధాన్ని మరింత విస్తరించుకునే విషయంలో వాటికి రెండో అభిప్రాయం లేదు. ఆసియాన్‌లోని పది సభ్యదేశాలు– సింగపూర్, బ్రూనై, మలేసియా, థాయ్‌లాండ్, ఇండొనేసియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, లావోస్, కంబోడియా, మయన్మార్ల జనాభా మొత్తంగా దాదాపు 65 కోట్లు. వీటి ఉమ్మడి స్థూల దేశీయోత్పత్తి 2.60 లక్షల కోట్ల డాలర్లు. 120 కోట్ల జనాభా, 2.26 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ ఉన్న మన దేశంతో మైత్రి రెండు పక్షాలకూ మేలు చేస్తుంది. ఆగ్నేయాసియా దేశాలతో మన దేశానికి చరిత్రాత్మక సంబంధాలున్నా ప్రచ్ఛన్న యుద్ధ (కోల్డ్ వార్) కాలంలో అవి మందగించాయి. ఆ దేశాలు మొదటినుంచీ అమెరికాతో సన్నిహితంగా ఉండటం, అప్పట్లో మనం సోవియెట్ యూనియన్‌తో మైత్రి సాగించడం ఇందుకు కారణం. కానీ పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలకు ద్వారాలు తెరవడంతోపాటు ‘లుక్ ఈస్ట్’ విధానం పేరిట తూర్పు దేశాలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పు కోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. అప్పటినుంచి ఆగ్నేయాసియా దేశాలతో మన సంబంధాలు విస్తరిస్తూ వచ్చాయి. 2009లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం, 2014లో దీన్ని వివిధ సేవలకూ విస్తరించడంతో అనుబంధం మరింత పెరిగింది. ‘లుక్ ఈస్ట్’ను ప్రధాని నరేంద్ర మోదీ ‘యాక్ట్ ఈస్ట్’(తూర్పుదేశాలతో కార్యాచ రణ)గా రూపుదిద్దడం వల్లనే సంబంధాలు ఇంతగా విస్తృతమయ్యాయి. భౌగోళికంగా చూసినా, ఆర్థిక కార్యకలాపాల రీత్యా చూసినా ఆగ్నేయాసియా ప్రాంతం మనకెంతో కీలకమైనది. ఇరు పక్షాల మధ్యా వాణిజ్యం 7,000 కోట్ల డాలర్ల మేర ఉంది. వాణిజ్యంలో ఆసియాన్ భారత్‌కు నాలుగో పెద్ద భాగస్వామి. ఈ వాణిజ్యాన్ని మరింత పెంచుకునే దిశగా ఇరుపక్షాలూ ప్రయత్నిస్తున్నాయి. ఇదిగాక ఐటీ, కమ్యూనికేషన్లు వంటి రంగాల్లో భారత్ సాధించిన వృద్ధి ఆసియాన్‌ను ఆకట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం నెట్‌వర్క్‌ను పెంచుకోవడంలో అది తమకు సహకారం అందించగలదన్న విశ్వాసం వాటికుంది. అయితే ఇదే సమ యంలో చైనా పాత్రను తక్కువ అంచనా వేయలేం. ఆ దేశం కూడా కొన్ని దశా బ్దాలుగా ఆసియాన్ దేశాలతో వాణిజ్యబంధాన్ని విస్తరించుకుంటోంది. ఆ ప్రాంత దేశాలైన ఫిలిప్పీన్స్, మలేసియా, సింగపూర్, వియత్నాం వంటి దేశాలతో దానికి సరిహద్దు వివాదాలున్నా వాటి మధ్య వాణిజ్యం పెరుగుతోంది. అయితే చైనా దూకుడు ఆసియాన్ దేశాలకు ఇబ్బందిగానే ఉంటోంది. అది తమపై పెత్తనం చలా యించాలని చూస్తున్నదన్న అనుమానాలు వాటికున్నాయి. పర్యవసానంగా అభద్రతకు లోనవుతున్నాయి. అందుకే కేవలం చైనాపై ఆధారపడే విధానాన్ని విడనాడి ఆసియాలో మరో బలమైన దేశం భారత్‌కు మరింత సాన్నిహిత్యం కావాలని అవి భావిస్తున్నాయి. ఆసియాన్ దేశాలతో భిన్న రంగాల్లో భారత్ సహకారాన్ని విస్తరిం చుకోవడానికి, ఆ అంశాల్లో తరచు సంభాషణలు జరపడానికి 30 రకాల బృందాలు ఏర్పాటయ్యాయి. విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, పర్యాటకం, వ్యవసాయం, పర్యా వరణం, పునరుత్పాదక ఇంధన వనరులు, టెలికమ్యూనికేషన్ల రంగాల్లో మంత్రుల స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. తూర్పు–పడమరలను ఏకం చేసేందుకు చైనా తలపెట్టిన బృహత్తరమైన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ) ప్రాజెక్టులో ఆసియాన్ దేశాలు భాగస్వాములుగా ఉన్నా ఆ ప్రాజెక్టు విషయంలో వాటికి కొన్ని అభ్యంతరాలున్నాయి. మన దేశమైతే ఇందులో చేరలేదు. ఆసియాన్ దేశాలతో రాకపోకలను పెంచే భారత్–మయన్మార్–థాయ్‌లాండ్ త్రిభుజ రహదారి నిర్మాణా నికి మన దేశం చేయూతనిస్తోంది. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఈ ఏడాది కాలంలో ‘ఇండో–పసిఫిక్ పదబంధం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇండో–పసిఫిక్ ప్రాంత భద్రతలో భారత్ కీలక పాత్ర పోషించాలని ఆయన చెబుతున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా విధానం అవసరమని, ఇది మాత్రమే ఈ ప్రాంత సుస్థిరతకు, భద్రతకు పూచీ ఇస్తుందని భారత్–ఆసియాన్ దౌత్య శిఖరాగ్ర సదస్సును ప్రారంభిస్తూ నరేంద్ర మోదీ చెప్పడంతోపాటు సాగర ప్రాంత భద్రతకు అవసరమైన సహకారాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉన్నదని హామీ ఇవ్వ డాన్నిబట్టి రాగల కాలంలో ఈ దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో మన పాత్ర మరింత పెరుగుతుందని అర్ధమవుతుంది. ఇది సహజంగానే చైనాకు కంటగింపుగా ఉంటుంది. హిందూ మహా సముద్ర ప్రాంతంలో తన పరపతిని పెంచుకుంటున్న చైనా వ్యవహారశైలికి జవాబుగానే మన దేశం ఇలా అడుగులేస్తోంది. అయితే ఆసియాన్ దేశాలన్నిటితో మన దేశం ఒకే స్థాయిలో సంబంధాలు నెలకొల్పుకోవడం కష్టం. మన వ్యూహాత్మక అవసరాలతోపాటు ఆ దేశాల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆసియాన్ దేశాలు అన్నిటా ఒకే మాటపై లేకపోవడం కూడా మన పాత్రను పరిమితం చేస్తోంది. ఈ కారణం వల్లనే వాణిజ్యరంగం అనుకున్నంతగా విస్తరించలేదు. ఈ లోటుపాట్లన్నిటినీ సవరిం చుకుని ముందడుగేయడానికి అధినేతల రాకపోకలు, సంభాషణలు, శిఖరాగ్ర సదస్సులు దోహదపడతాయి. అందువల్ల ఆసియాన్ దేశాధినేతల రాక మంచి పరిణామం. -
లీటర్ పెట్రోల్.. రూ. 300?!
ఇంధన ధరలు చుక్కలను తాకనున్నాయా? పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి ఇక అందవా? అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలు.. భారతీయులకు శాపంగా మారున్నాయా? సమీప రోజుల్లో లీటర్ పెట్రోల్ రూ.300 చేరుకున్నా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదా? అంటే అవుననే చెబుతున్నారు విశ్లేషకులు. మధ్యప్రాచ్యంలో మొదలైన ప్రచ్ఛన్న యుద్దం సమీప రోజుల్లో భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపేలా ఉన్నాయి. ఈ పరిణామాలతో దేశంలో ఇంధన ధరలకు రెక్కలు వచ్చేలా కనిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో అత్యంత బలమైన ఇరాన్, సౌదీ అరేబియాలు.. ముడి చమురు ధరను భారీగా పెంచేలా కనిపిస్తున్నాయి. అంతేకాక ఇరు దేశాల మధ్య దశాబ్దాల కాలంగా కోల్డ్‌వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్, సౌదీ అరేబియాలు మధ్యప్రాచ్యంలో ప్రబలమైనశక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా సైనిక, ఆయుధ పరీక్షలకు ఏ మాత్రం వెరవడం లేదు. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న కోల్డ్‌వార్ పరిస్థితుల నేపథ్యంలో మన దేశంలో ఎన్నడూ లేనంత రీతిలో ఇంధన ధరలు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగే ఇంధన ధరల వల్ల మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఆయిల్ మార్కెట్‌పై ప్రభావం సౌదీ అరేబియా, ఇరాన్‌లు ముడి చమురును అధికంగా ఎగుమతి చేస్తాయి. అంతేకాక ఆయిల్ మార్కెట్‌పై పట్టుకోసం దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంటే.. అది ఆయిల్ మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. విశ్లేషకలు అంచనాల మేరకు ఆయిల్ డిమాండ్ 500 శాతం పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే మన దగ్గర ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.70 ఉండగా.. అది కాస్తా 500 శాతం పెరిగి.. రూ. 300కు చేరుకునే అవకాశం ఉంది. సౌదీ, ఇరాన్ మధ్యలో లెబనాన్ రియాద్, టెహ్రాన్ మధ్య చాలాకాలంగా ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తున్నా.. తాజాగా మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు లెబనాన్ కారణంగా మారింది. లెబనాన్‌పై ఇరాన్ ఆధిపత్యం అధికంగా ఉందంటూ ఆ దేశ ప్రధాని సాద్ హారరీ.. సౌదీ అరేబియాలో ప్రకటించి తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాక ఇరాన్ వల్ల తనకు ప్రాణహానీ ఉందంటూ ప్రకటించారు. ఆ ప్రకటన తరువాత ఆయన లెబనాన్ వెళ్లిన తరువాత.. మళ్లీ కనిపించకుండా పోయారు. దీంతో లెబనాన్‌లో తీవ్ర సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. తీవ్ర ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో బలమైన ఆర్థిక దేశాలు రెండూ ఆయిల్ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. పూర్తిస్థాయి యుద్ధం జరగదంటూనే.. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కేవలం నెల రోజుల్లోనే ఏర్పడ్డాయని విశ్లేషకులు అంటున్నారు. మరికొందరు మాత్రం.. దీనిని షియా-సున్నీ వర్గాల పోరాటంగానూ అభివర్ణిస్తున్నారు. ఏది ఎలా చెప్పుకున్నా సౌదీ అరేబియా, ఇరాన్‌లు దశాబ్దాలుగా మధ్య ప్రాచ్యంపై ఆధిపత్యం కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఈ పోరాటం మన మీద ఏ స్థాయి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే. -
అలా కసి తీర్చుకుంటోందా?
తమిళసినిమా: కొన్ని సంఘటనలు మనసులో బలంగా నాటుకు పోతాయి. వాటి నుంచి అంత తొందరగా బయటపడడడం కష్టం. ఇంకా చెప్పాలంటే శత్రువుకు శత్రువు మిత్రుడన్న సామెత ఉంది. నటి నయనతార ఇప్పుడు దాన్ని ఫాలో అవుతోందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాస్త వివరంగా చెప్పాలంటే నటి నయనతార ఇప్పటి లెవలే వేరు. అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈ సంచలన నటి ఇప్పుడు శాసించే స్థాయిలో ఉంది. కథానాయకికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్న నయనతార ఎక్కవగా వర్ధమాన దర్శకుల చిత్రాల్లో నటించడం విశేషమే. అయితే ఇందుకో కారణం ఉందంటోంది కోలీవుడ్. నయనతార నటించిన తాజా చిత్రం అరమ్ శుక్రవారం తెరపైకి రానుంది. తన కలెక్టర్‌గా నటించిన ఈ చిత్రాన్ని నవ దర్శకుడు గోపీనయినార్ తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వంలో నయనతార నటించడానికి కారణం ఇంతకు ముందు గోపీనయినార్ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన కత్తి చిత్ర కథ తనదంటూ కోర్టు వరకూ వెళ్లి ఆయన్ని రచ్చలోకి లాగాడు. ఏఆర్.మురుగదాస్‌కు నటి నయనతారకు మధ్య చాలా కాలంగా కోల్డ్‌వార్ జరుగుతోందనే ప్రచారం ఉంది. అందుకు కారణం గజని చిత్రంలో తన పాత్రను తగ్గించి, నటి అసిన్‌కు అధిక ప్రాముఖ్యంనివ్వడమేనన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆ కసి తీసుకోవడానికే ఆయన్ని ఢీకున్న గోపి నయినార్కు నయనతార అవకాశం ఇచ్చిందంటున్నారు. ఇక తాజాగా నయనతార కోకో అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకుడు. ఈయనకు నయనతార అవకాశం ఇవ్వ డం వెనుక ఒక కథ ఉందట.దర్శకుడు నెల్సన్ ఇంత కు ముందు శింబు హీరోగా వేట్టైమన్నన్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే ఆ చిత్రాన్ని శింబు మధ్యలోనే నిలిపేశారు. ఇక శింబుకు నటి నయనతారకు మధ్య సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి మధ్య డీప్ లవ్ చివరికి ఎలా ఫెయిల్ అయ్యిందో తెలిసిందే. శింబుపై ఆ కసి తీర్చుకోవడానికే దర్శకుడు నెల్సన్‌కు కోకో చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కల్పించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం హల్చల్ చేస్తోంది. -
మత్స్యశాఖలో కోల్డ్‌వార్!
నల్లగొండ టూటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపపిల్లల వ్యవహారం ఆ శాఖ అధికారుల మధ్య కోల్డ్‌వార్‌కు తెరలేపింది. కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి పోటీపడుతున్నారు. ఎవరి పని వాళ్లు చేయకుండా ఇతరుల సెక్షన్లో వేలు పెట్టడమే వీరి మధ్య విభేదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మత్స్యశాఖ సొసైటీల బాధ్యులతో రహస్య మంతనాలు జరిపి ‘ముడుపులు నాకు ఇస్తే చేప పిల్లల సరఫరా అంతా నేనే చూసుకుంటాను ... ఏది ఉన్నా నన్ను కలిస్తే సరిపోతది ..? ఏదీ కావాలన్నా నేను పనిచేసి పెడతా .. ఇక్కడ అంతా నాకు బాగా తెలుసు’’ అని మత్య్సకారులకు ఓ ఉద్యోగి చెబుతున్నట్లు సమాచారం. దీంతో ఇతర ఉద్యోగులకు ముడుపులు అందకుండా అతనొక్కడే అందినకాడికి నొక్కుతున్నారనే విషయంలో వారి మధ్య బేదాభిప్రాయాలు పొడిచూపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉద్యోగుల ఆధిపత్యంతో మత్స్యకారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముడుపులిచ్చిన వారికే ముందు ... ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు ఇస్తుంది. కానీ ఇక్కడ తతంగం వేరే నడుస్తోంది. ముడుపులు ఇచ్చిన వారికే ముందుగా చేపపిల్లలు పంపిణీ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉచితంగా చేపపిల్లలు పొందుతున్న మత్స్యకారుల వద్ద కొంతమంది ఉద్యోగులు ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలకు ఇటీవల జరిగిన పరిణామాలే బలం చేకూరుస్తున్నాయి. ఈ శాఖ ఉద్యోగులు ఏకంగా జిల్లా కేంద్రంలోనే ఓ లాడ్జి గదిలో కాంట్రాక్టర్లతో బేరాసారాలకు దిగడం సంచలనం సృష్టించింది. వైరి వర్గం ఉద్యోగులే ఫోన్లో ఇది భయపడే విధంగా చేశారని సదరు ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం రెండు వర్గాలుగా విడిపోయిన ఉద్యోగుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయంటే పరిస్థితి ఎంతతీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బహిరంగంగానే తిట్ల పురాణం ..! మత్స్యశాఖ కార్యాలయంలో ఉద్యోగులు తీరు చూసి మత్స్యకారులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇచ్చిన కాసులు తీసుకొని చడీ చప్పుడు లేకుండా ఉండకుండా వీరెందుకు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటన్నారని అనుకుంటుండడం విశేషం. ఉన్నతస్థాయి ఉద్యోగులపై కిందిస్థాయి వారు నోరు పారేసుకోవడం, మరికొంతమంది కిందిస్థాయి ఉద్యోగులు సైతం కార్యాలయంలో ఓ ఉద్యోగి అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారని బహిరంగంగానే చర్చించుకోవడం పెద్ద దుమారం రేపుతోంది. ఉన్నత ఉద్యోగిపై సైతం కార్యాలయ కింది స్థాయి సిబ్బంది వినే విధంగా ఓ ఉద్యోగి ఆరోపణలు చేయడంతో తిట్ల పురాణం ఎటు వైపు దారి తీస్తుందోనని కార్యాలయంలోని ఓ ఉద్యోగి వ్యాఖ్యానించడం గమనార్హం. మత్స్యకారుల ఇబ్బందులు .. అధికారులు వ్యవహరిస్తున్న తీరు కారణంగా జిల్లాలోని మత్స్యకారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పనికోసం వచ్చిన కార్మికులకు సరైన సమాధానం చెప్పడంలోనూ అధికారులు వైఫల్యం చెందుతున్నారు. నచ్చిన వారికి సమాచారం ఇవ్వడం, మిగతా వారికి నాకు తెలియదు మరో అధికారిని కలవండి అని చెప్పడం లాంటి ఘటనలతో మత్సకార్మికులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వంనుంచి వస్తున్న సంక్షేమ పథకాలపై కార్మికులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
కోల్డ్‌వార్
– స్టాఫ్‌నర్సులు వర్సెస్ హౌస్‌సర్జన్స్ – విధుల విషయంలో భేదాభిప్రాయాలు – ఓపీ, వార్డు విధులు బహిష్కరించిన వైనం – తీవ్ర ఇబ్బందులు పడిన రోగులు – వైద్యం కోసం గంటల తరబడి నిరీక్షణ – ఎంబీబీఎస్ విద్యార్థులే డాక్టర్లయిన పరిస్థితి – మధ్యాహ్నం వరకు రోగులను డిశ్చార్జ్ చేయని వైనం అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో స్టాఫ్‌నర్సులు, హౌస్సర్జన్ల మధ్య కోల్ట్‌వార్ కొనసాగుతోంది. కొంత కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్నా తాజాగా బహిర్గతమైంది. ఐదు నెలలు కావస్తున్నా స్టైఫండ్ అందడం లేదంటూ హౌస్ సర్జన్లు మంగళవారం సర్వజనాస్పత్రి ఓపీ బ్లాక్ ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సైఫ్ఖాన్తో పాటు కొందరు హౌస్సర్జన్లు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నెలల తరబడి బకాయిలు పెడితే ఎలాగని ప్రశ్నించారు. ఆస్పత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆరోపించారు. ఫలితంగానే దశలవారీగా ఆందోళనకు శ్రీకారం చుట్టామన్నారు. విషయం తెలుసుకున్న ఆర్ఎంఓ డాక్టర్ లలిత అక్కడికొచ్చి మాట్లాడారు. రెండ్రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. డాక్టర్లయి ఉండి ఇలా చేయడం మంచిది కాదని, రోగులను దృష్టిలో ఉంచుకుని విధుల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో వారి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ‘స్టైఫండ్’ డిమాండ్ పక్కకు జరిగి విధుల విషయం తెరమీదకొచ్చింది. క్యాజువాలిటీ మొదలు వార్డులు, ఓపీ వరకు తాము బాధ్యతాయుతంగా పని చేస్తున్నామని హౌస్సర్జన్లు అన్నారు. అయితే స్టాఫ్‌నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇంజెక్షన్లు, సెలైన్ బాటిల్ ఎక్కించడం ఇతరత్రా డ్యూటీల విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. తమకు కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ల నుంచి డాక్టర్ల వరకు చాలా మంది తమకన్నా తక్కువగానే డ్యూటీ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో చివరకు ఆర్ఎంఓతో పాటు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు హౌస్‌సర్జన్లను తమ చాంబర్‌కు పిలిపించి మాట్లాడారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విధుల బహిష్కరణతో రోగుల కష్టాలు వాస్తవానికి హౌస్సర్జన్లు నల్లబ్యాడ్జీలతో కాసేపు నిరసన తెలుపుతామని చెప్పి ఏకంగా ఓపీ, వార్డు విధులను బహిష్కరించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హౌస్సర్జన్లు అందుబాటులో లేకపోయారు. దీంతో ఓపీ, వార్డుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓపీ గదుల్లో ఒక్కో డాక్టర్ మాత్రమే ఉండడంతో గంటల తరబడి రోగులు నిరీక్షించాల్సి వచ్చింది. ఎంబీబీఎస్ విద్యార్థులే వైద్యుల అవతారం ఎత్తి సేవలు అందించారు. ఓపీల్లో నిత్యం ఇద్దరు చొప్పున హౌస్సర్జన్లు విధుల్లో ఉంటారు. వీరు అందుబాటులో లేకపోయే సరిసరికి పరిస్థితి అధ్వానంగా మారింది. డిశ్చార్జ్ కోసం మధ్యాహ్నం వరకు నిరీక్షణ ఆస్పత్రిలో నిత్యం పదుల సంఖ్యలో రోగులు డిశ్చార్జ్ అవుతుంటారు. విధులు బహిష్కరించిన నేపథ్యంలో హౌస్సర్జన్లు అందుబాటులో లేకపోవడంతో చాలామంది అష్టకష్టాలు పడ్డారు. ఎఫ్ఎం వార్డులో సుమారు 20 మందిని డిశ్చార్జ్ చేయగా వారంతా హౌస్సర్జన్ల కోసం మధ్యాహ్నం వరకు వేచి చూశారు. చివరకు 12 గంటల తర్వాత స్టాఫ్‌నర్సులు సమస్యను ఆర్ఎంఓ దృష్టికి తీసుకెళ్లడంతో ఓ హౌస్‌సర్జన్‌ను కేటాయించి.. డిశ్చార్జ్ ప్రక్రియను పూర్తి చేయడం కన్పించింది. ఇదే పరిస్థితి దాదాపు అన్ని వార్డుల్లోనూ నెలకొంది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి ఆస్పత్రిలో పరిస్థితి ఇంత వరకు రావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం 97 మంది వరకు హౌస్సర్జన్లు విధులు నిర్వర్తిస్తుండగా ఏప్రిల్ నెల నుంచి వీరికి స్టైఫండ్ రావాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపలేదు. ఫలితంగానే ఇప్పుడు విధుల బహిష్కరణ వరకు వచ్చింది. -
టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి
రోడ్డున పడుతున్న తెలుగుతమ్ముళ్లు నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు మొన్న గోపాలపురం, నిన్న తాడేపల్లిగూడెం, నేడు చింతలపూడి సాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికార తెలుగుదేశం పార్టీలో అసమ్మతులు, అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. తమ్ముళ్లు పదవుల కోసం గ్రూపులుగా విడిపోయి రోడ్డెక్కుతున్నారు. నాలుగురోజుల క్రితం గోపాలపురం నియోజకవర్గంలో మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైతే.. మొన్న తాడేపల్లిగూడెంలో నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. నిన్న చింతలపూడిలో ఎంపీ వర్గం నేతలు అసమ్మతి సమావేశం ఏర్పాటు చేశారు. అధిష్టానం నుంచి ఫోన్ రావడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. శనివారం భీమడోలులో జిల్లా సమన్వయ కమిటీలో ఈ విబేధాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి అసమ్మతి నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇవే నిదర్శనాలు.. గోపాలపురంలో గ్రూపు రాజకీయాలు నడుపుతున్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తమ ప్రత్యర్థి వర్గం వారికి మరోసారి పదవిని కట్టబెట్టి, తమకు మొండిచెయ్యి చూపారని ద్వారకాతిరుమల ఎంపీపీ వడ్లపూడి ఈశ్వర భానువరప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. అధిష్టానం తమకు పదిరోజుల్లోగా న్యాయం చేయకుంటే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని ఎంపీపీ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. మండల అధ్యక్ష పదవి విషయంలో ఇరు వర్గాల మధ్య విబేధాలు తలెత్తాయి. మండల అధ్యక్ష పదవిని సుంకవల్లి బ్రహ్మయ్యకే ఎమ్మెల్యే ముప్పిడి కట్టబెట్టడంతో లంకా సత్తిపండు వర్గం తిరుగుబాటు చేసింది. ఎంపీపీతో పాటు 12 మంది ఎంపీటీసీ సభ్యులు, 10 మంది సర్పంచ్‌లు, 15 మంది పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, 13 మంది నీటిసంఘం అధ్యక్షులు, 14 మంది పాలకేంద్రం అధ్యక్షులు, ఇద్దరు సొసైటీ అధ్యక్షులు, ఒక ఏఎంసీ వైస్ చైర్మన్, నలుగురు డైరెక్టర్లు రాజీనామా చేస్తామంటూ అల్టిమేటం ఇచ్చారు. తాడేపల్లిగూడెంలోనూ రెండురోజుల క్రితం జరిగిన సమావేశంలో శ్రేణులు ఎవరూ తనతో కలిసి రావడంలేదని, మునిసిపల్ కౌన్సిలర్లను కులాలవారీగా విడగొట్టే కుట్రలు జరుగుతున్నాయని, పార్టీలోని వ్యక్తులు కలిసిరాకపోవడం వల్ల ఇంక పార్టీ కార్యక్రమాలకు హాజరుకాబోనని, ఇదే చివరి సమావేశమంటూ మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ సమావేశం నుంచి బయటకు వెళ్లే యత్నం చేశారు. ఆరుగొలను చెరువు పనులను భాగాలుగా చేసి , మట్టి పనులు చేసుకున్న నాయకులు కూడా మట్టిమాఫియా అంటూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందంటూ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వ్యాఖ్యలు చేయడంతో దీనికి ప్రతిగా మునిసిపల్ కాంట్రాక్టర్, టీడీపీ నాయకుడు మేడపాటి చెల్లారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. నియోజకవర్గ సమన్వయకర్త ఈలి నాని తనకు సమావేశాలలో ప్రాధాన్యం ఇవ్వడంలేదంటూ జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లారనే విషయం సమావేశంలో దుమారం రేపింది. ఈ విషయంలో మునిసిపల్ చైర్మన్ , ఈలినానికి మధ్య మాటల యుద్ధం సాగింది. ఇలా అందరూ వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. తాజాగా చింతలపూడి మండలంలో ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రగడవరం సమీపంలో శుక్రవారం బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి మాట్లాడుతూ నేను చెప్పిందే వేదం, మీరంతా నేను చెప్పినట్టు వినాలన్న చందంగా ప్రవర్తించే నాయకులకు పార్టీలో మనుగడ ఉండదని పరోక్షంగా ఎమ్మెల్యే సుజాతను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. సమావేశం ప్రారంభం కావడానికి ముందే జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ముఖ్య నాయకులకు ఫోన్ చేసి పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించే వరకు ఆగాలని కోరడంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. ప్రతి నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్లు రోడ్డుకెక్కడం పార్టీకి తలనొప్పిగా మారింది. శనివారం జరిగే జిల్లా సమావేశం వాడిగా వేడిగా జరిగే అవకాశం కనపడుతోంది.. -
రెవెన్యూ పోలీసు శాఖల మద్య కోల్డ్ వార్
-
కోల్డ్‌వార్
– ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ మధ్య వయొలేషన్ చిచ్చు – రూ.10కి మించి వయొలేషన్ జరిగితే కేసు నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశం – తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ – జిల్లాలో రూ.10–30 వరకూ ధర పెంచి విక్రయిస్తున్న మద్యం వ్యాపారులు – ‘సిండికేట్’తో అబ్కారీ యంత్రాంగంతో పాటు పోలీసులకు మామూళ్ల పంట (సాక్షి ప్రతినిధి, అనంతపురం) ఎక్సైజ్ శాఖలో ‘వయొలేషన్’ చిచ్చు రేగిందా? రెండు విభాగాల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందా? బండి ఇరుసులాగా ఇన్నాళ్లూ సమానంగా వయొలేషన్ను పెంచి పోషించిన ఆ విభాగాల మధ్య ఇప్పుడు తేడా ఎందుకు వచ్చింది? ఈ పంచాయితీ ఏకంగా డైరెక్టరేట్ వరకూ వెళ్లిందా?.. జిల్లాలోని తాజా పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది. పత్రికల్లో వరుస కథనాలు వచ్చినా ఏమాత్రమూ ఖాతరు చేయకుండా అబ్కారీ శాఖ యథేచ్ఛగా ‘వయొలేషన్’(ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యం విక్రయం)ను ప్రోత్సహిస్తోంది. దీనివల్ల ప్రతినెలా రూ.5–14 కోట్ల అదనపు ఆదాయం మద్యం వ్యాపారులకు వస్తోంది. ఈ దోపిడీతో మందుబాబుల జేబులు గుల్లవుతుండగా..సర్కారీ గల్లా పెట్టె, వ్యాపారుల జేబులు మాత్రం గలగలలాడుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల జిల్లాలో ఐదు బృందాలుగా విడిపోయి మద్యం షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయాలు జరుపుతున్నారని కేసులు నమోదు చేశారు. అమడగూరులో క్వార్టర్ బాటిల్‌పై రూ.15, రాయదుర్గం పరిధిలో ఫుల్‌బాటిల్‌పై రూ. 30 పెంచి విక్రయిస్తున్న దుకాణదారులపై కేసు నమోదు చేశారు. వీటితో పాటు పలు కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామంతో ఎక్సైజ్ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ‘ఇన్నిరోజులూ వయొలేషన్ జరుగుతోంది. ఎన్ఫోర్స్మెంట్ అధికారులనూ బాగానే చూసుకుంటున్నాం. కానీ ఉన్నపళంగా ఎందుకు కేసులు నమోదు చేస్తున్నార’ని ఆరా తీశారు. దీంతో అసలు విషయం తెలిసింది. ‘అనంత’లో వయొలేషన్ విచ్చలవిడిగా సాగుతోందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లింది. ఈఎస్‌లతో డైరెక్టర్ స్వయంగా మాట్లాడి.. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ భారీగా వయొలేషన్ ఉన్నట్లు గుర్తించారు. ఎమ్మార్పీపై రూ.10 పెంచి విక్రయించేవాటిని వదిలి, అంతకుమించి అమ్ముతున్న వాటిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కోల్డ్‌వార్ ఎందుకో? ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలను ఎక్సైజ్ డీసీ నుంచి సీఐల వరకూ ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ‘వాటా’ ఇస్తున్నా ఎందుకు కేసులు రాస్తున్నారని ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. డైరెక్టర్ ఆదేశాలతోనే రాస్తున్నామని వారు చెప్పినట్లు తెలుస్తోంది. ‘రూ.10 వరకూ డైరెక్టర్ కూడా అనుమతి ఇచ్చారు కదా? రూ.10 మాత్రమే వయొలేషన్ అవుతున్నా అంతకుమించి జరుగుతున్నట్లు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నార’ని ఎక్సైజ్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాత్రం తాము రూ.10కి మించిన విక్రయాలపైనే కేసులు నమోదు చేస్తున్నామని అంటున్నారు. అయితే.. వాటాల పంపకంలో తేడాల వల్లే ఈ తతంగం నడుస్తున్నట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఆదాయం కోసం ఆన్లైన్ బిల్లింగ్‌కు బ్రేక్ ఈ నెలాఖరుతో ఎక్సైజ్ పాలసీ ముగుస్తుంది. వచ్చే నెల నుంచి కొత్త పాలసీ వస్తుంది. ప్రస్తుతం జిల్లాలో 240 దుకాణాలు నడుస్తున్నాయి. ఒక్కో దుకాణంలో రోజుకు సగటున 650 బాటిళ్లు విక్రయిస్తున్నారు. వయొలేషన్ కారణంగా 240 దుకాణాల్లో నెలకు రూ.4.68 కోట్ల నుంచి రూ.14.04 కోట్లదాకా వ్యాపారులకు అదనపు ఆదాయం వస్తోంది. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల దాకా స్థాయిని బట్టి ఎవరివాటా వాళ్లకు చేరుతోందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. వేతనాల కంటే ‘అదనపు’ ఆదాయమే భారీగా ఉండటంతో ‘వయొలేషన్’ను అరికట్టేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు చేపట్టేలా ఆన్లైన్ బిల్లింగ్ అంశాన్ని గతంలో కిరణ్ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆన్లైన్ బిల్లింగ్‌ను ‘కార్వే’ సంస్థకు కట్టబెట్టారు. బాటిల్‌పై ఉన్న బార్‌కోడ్‌ను స్క్రాచ్‌చేస్తే ఎమ్మార్పీకే బిల్లు వస్తుంది. ఈ మేరకే మందు బాబులు చెల్లించాలి. ఇది జరిగితే తమ ఆదాయానికి గండిపడుతుందన్న భావనతో మద్యం వ్యాపారుల నుంచి ఎక్సైజ్ అధికారుల వరకూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘కంప్యూటర్లు సరఫరా చేశాం.. అమలు చేస్తామ’ని పైకి చెబుతూ లోలోపల మాత్రం అడ్డుపడుతున్నారు. అందుకే నాలుగేళ్లుగా ఆన్లైన్ బిల్లింగ్ ముందుకు సాగడం లేదు. జిల్లాలో మద్యం దుకాణాలు : 240 బార్ అండ్ రెస్టారెంట్లు : 9 బాటిల్‌పై అధికంగా విక్రయిస్తున్న ధర : రూ.10–30 ధర పెంపు వల్ల వ్యాపారులకు నెలకు వచ్చే అదనపు ఆదాయం : రూ.4.68–14.04కోట్లు అధికారులకు వ్యాపారులు ఇస్తున్న నెలవారీ మామూళ్లు: రూ.1.30 కోట్లు ఒక్కో దుకాణం నుంచి నెలకు ఇవ్వాల్సిన మామూళ్లు : పట్టణప్రాంతాల్లో రూ.61 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.51 వేలు విశ్వసనీయ సమాచారం మేరకు నెలవారీ మామూళ్ల పంపకం ఇలా..(రూ. వేలల్లో) పట్టణ ప్రాంతాలు రూరల్ ఎక్సైజ్ స్టేషన్ 35 25 ఈఎస్టీఎఫ్ 5 5 ఎన్ఫోర్స్మెంట్ 6 6 సివిల్‌స్టేషన్ 15 15 –––––––––––––––––––––––––––––––––––– మొత్తం 61 51 ––––––––––––––––––––––––––––––––––––– -
గవర్నర్ వర్సెస్ సీఎం
► కిరణ్‌బేడీ, నారాయణస్వామి కోల్డ్‌వార్ ► ప్రభుత్వ అధికారుల తంటాలు టీనగర్: పుదుచ్చేరిలో గవర్నర్ కిరణ్‌బేడి, ముఖ్యమంత్రి నారాయణస్వామి మధ్య కోల్డ్‌వార్‌తో ప్రభుత్వ అధికారులు తంటాలు పడుతున్నారు. పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడి ప్రభుత్వ అధికారులను వెంటనే సంప్రదించేందుకు వాట్సప్ గ్రూప్‌లను ప్రారంభించి నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు, ప్రభుత్వ శాఖలతో నేరుగా చర్చలు జరిపేందుకు ఈ వాట్సాప్ గ్రూపులను వినియోగిస్తున్నారు. ఇందులో ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్, పీసీఎస్ అధికారులు చోటుచేసుకున్నారు. గత 29వ తేదీన గవర్నర్ వాట్సాప్ గ్రూపులో సహకార సంఘాల రిజిస్ట్రార్ శివకుమార్ అసభ్య వీడియోను పంపడం చర్చకు దారితీసింది. అతన్ని వెంటనే గవర్నర్ బంగళాకు రప్పించిన కిరణ్‌బేడి సస్పెండ్ ఉత్తర్వులను అందజేశారు. అంతేకాకుండా సీబీసీఐడీ పోలీసులచే కేసు నమోదైంది. కాగా, గవర్నర్ చర్యలను నేతలు, అధికారులు ఖండించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉత్తర్వులను వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లలో ఉపయోగించేందుకు నిషేధం విధించారు. ఇది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులుగా అన్ని శాఖలకు సర్కులర్‌గా పంపారు. ఈ చర్య కారణంగా గవర్నర్ వాట్సాప్ గ్రూప్ నుంచి అధికారులు వైదొలిగారు. ఇలావుండగా పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి సోషల్ మీడియా నెట్వర్క్ వినియోగంపై నిషేధ ఉత్తర్వులను గురువారం గవర్నర్ కిరణ్‌బేడి రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వపు నిర్ణయాన్ని గవర్నర్ రద్దు చేయడంతో గవర్నర్, పాలకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీసింది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు గవర్నరా? ముఖ్యమంత్రా? ఎవరి అదుపాజ్ఞలకు లోబడాలని తెలియకుండా అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రజా సంక్షేమ పనులకు ఆటంకం ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీనిపై సీఎం నారాయణస్వామి స్పందిస్తూ గవర్నర్‌తో నిర్వహణ రీతిగా కొన్ని లోపాలు ఉండొచ్చని, అయితే ఆమెతో ఎటువంటి ఘర్షణ లేదని అన్నారు. కుషు్బకు పాస్‌పోర్ట్ చిక్కులు: నటి కుషు్బకు పాస్‌పోర్టు చిక్కులు ఎదురయ్యాయి. ఆమె మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఈ విధంగా తెలిపారు. తన పాస్‌పోర్టు బుక్‌లో పేజీలు ఉపయోగించి పూర్తయిందని, అదనపు పేజీలను జతచేయాలని కోరుతూ పాస్‌పోర్టు కార్యాలయంలో అభ్యర్థించానని, అదే విధంగా పాస్‌పోర్టు రెన్యువల్ చేయాలని కోరినట్లు తెలిపారు. తన కోర్కెను పాస్‌పోర్టు అధికారి నిరాకరించారని, తనపై క్రిమినల్ కేసు ఉన్నందున రెన్యువల్ వీలుకాదని గత నెల 28న పాస్‌పోర్టు అధికారి ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఇది చట్టవిరుద్ధమని దీన్ని రద్దు చేయాలని తెలిపారు. తాను ఈనెల 12న విదేశాలకు వెళ్లనున్నందున పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసేందుకు ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయమూర్తి రాజేంద్రన్ వారంలోగా పాస్ట్‌పోర్టు సదరన్ రీజియన్ అధికారి కోర్టులో సంజాయిషీ పిటిషన్ దాఖలు చేయాలని కోరుతూ ఉత్తర్వులిచ్చారు. -
అమెరికాపై రష్యా ప్రతీకారం..!
ప్రచ్చన్న యుద్ధం పునఃప్రారంభమైందా? అనే స్థాయిలో అమెరికా, రష్యాలు ఒకరిపై మరొకరు అస్త్రాలను సంధించుకుంటున్నారు. అమెరికాలో పనిచేస్తోన్న 35 మంది రష్యా దౌత్య అధికారులపై ఒబామా సర్కారు బహిష్కరణవేటు వేసిన గంటల వ్యవధిలోనే రష్యా కూడా ప్రతికారానికి దిగింది. రష్యాలో పనిచేస్తోన్న 35 మంది అమెరికన్ దౌత్య అధికారులపై వేటే వేసేందుకు పుతిన్ సర్కారు పూనుకుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది. అంతేకాదు.. తన భూభాగం(మాస్కో)లోని ఆంగ్లో అమెరికన్ స్కూలును రష్యా ప్రభుత్వం మూసేయించినట్లు కూడా వార్తలు ప్రసారం అయ్యాయి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా దాదాపు అన్నిదేశాలతో మైత్రి కొనసాగించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. చివరి రోజుల్లో మాత్రం ప్రచ్చన్న యుద్ధాన్ని పునఃప్రారంభించినట్లు సంకేతాలు పంపుతున్నారు. మొన్న ఐక్యరాజ్యసమితో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వ్యవహరించి, నిన్న 35 మంది రష్యా దౌత్య అధికారులపై బహిష్కరణ వేటు వేశారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా దౌత్యాధికారులు హ్యాకింగ్‌కు పాల్పడ్డారని, తద్వారా డెమోక్రటిక్ పార్టీకి వ్యతిరేకంగా, ట్రంప్‌కు అనుకూలంగా వ్యవస్థను నడిపించారని ఒబామా ప్రభుత్వం ఆరోపించింది. అయితే ఒబామా ఇంకో 20 రోజుల్లో గద్దెదిగిపోనున్న నేపథ్యంలో రష్యా, ఇజ్రాయెల్‌లపై విధించిన ఆంక్షలు ఏమేరకు కొనసాగుతాయనేది అనుమానమే. అమెరికాలో పనిచేస్తోన్న తమ 35 మంది దౌత్యాధికారులపై వేటు వేయడాన్ని నిరసిస్తూ బ్రిటన్‌లోని రష్యా రాయబార కార్యాలయం శుక్రవారం ట్వీట్ బాంబు పేల్చింది. 'ఒబామా నిర్ణయం కోల్డ్ వార్‌ను తలపించేలా ఉంది. తన చివరి రోజుల్లో ఆయనలా ఏదోఒకటి చేయడం వల్ల అమెరికన్లు సహా చాలామంది గర్విస్తారు' అనే కామెంట్ తోపాటు ఒబామాను లేమ్డక్తో పోల్చుతూ ఫొటోను పోస్ట్ చేసింది. (అధ్యక్ష పదవికి ఎన్నికైన అభ్యర్థి పదవీ స్వీకారం చేసేదాకా కొనసాగే పాత అధ్యక్షుడిని ‘లేమ్ డక్’గా వ్యవహరిస్తారు) చివరి రోజుల్లో ఒబామా సర్కారు తీసుకుంటోన్న వివాదాస్పద నిర్ణయాల్లో కొన్నింటిని వ్యతిరేకిస్తోన్న కాబోయే అధ్యక్షుడు ట్రంప్.. 'రష్యా దౌత్యాధికారులపై వేటు'పై ఆచితూచి స్పందించారు. అతి త్వరలోనే ఇంటెలిజెన్స్ అధికారులతో సమావేశమై ఈ వ్యవహారంపై చర్చిస్తానన్నారు. ఐరాసలో ఇజ్రాయెల్‌పై అభిశంసన విషయంలో మాత్రం ట్రంప్ బాహాటంగానే ఒబామాను తప్పుపట్టారు. -
కోల్డ్ వార్-2
-
పోలీస్‌శాఖ వర్సెస్ రవాణా శాఖ
* అప్పుడు గప్‌చుప్... ఇప్పుడు వార్! * నేరాన్ని సర్దుబాటు చేసి యుద్ధం * దొంగ దొరకడంతో ఒకరిపై ఒకరు నెపం గుంటూరు (నగరంపాలెం): ఆరునెలల క్రితం ఓ నేరం జరిగింది... దానిని రవాణా, పోలీస్ శాఖలు సర్దుబాటు చేశాయి... తాజాగా ఇందుకు కారణమైన నిందితుడు దొరికాడు... ఇప్పుడు పునర్విచారణ పేరుతో అరెస్టుల పర్వం మొదలైంది... అంతేకాక ఈ కేసు రవాణా, పోలీస్‌శాఖల నడుమ రగడకు దారితీస్తోంది. గుంటూరుకు చెందిన యార్లగడ్డ నాగ చెతన్య తనకు తెలియకుండా తన వాహనంపై సంకూరి రవికిరణ్ అనే వ్యక్తి రూ.5.5 లక్షలు రుణం తీసుకున్నాడని, దీనిపై విచారించి బాధ్యులపై చర్య తీసుకోవాలని మార్చినెలలో ఉప రవాణా కమిషనరును కోరారు. దీనిపై విచారించిన రవాణాశాఖ అధికారులు పోలీసులు ఇచ్చిన మిస్సింగ్ సర్టిఫికెట్ ఆధారంగానే రవికిరణ్ నకిలీ ఆర్సీ పొందడంతో పొరపాటు జరిగిందని గ్రహించారు. కార్యాలయం వద్ద ఉన్న ఆర్టీఏ ఏజెంటు సహకారంతోనే రవికిరణ్ సులువుగా రుణం పొందినట్లు తెలిసింది. దీనిలో ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు కూడా ఉండటంతో వాహనంపై ఉన్న రుణాన్ని సర్దుబాటు చేయటంతో పాటు వాహనాన్ని అసలు యజమానిపై మార్పు చేశారు. అయితే వారం క్రితం తాడేపల్లికి చెందిన రవికిరణ్ అనే వ్యక్తి ఆర్టీఏ కార్యాలయం వద్దకు రాగా కార్యాలయం ఉద్యోగులు గతంలో సంఘటనకు అతనే బాధ్యుడని జిల్లా ఉప రవాణా కమిషనరుకు అప్పగించారు. డీటీసీ సమాచారం మేరకు తాలుకా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. నిందితుని విచారించిన పోలీసులు కారు యజమానికి తెలియకుండానే రుణం పొందటానికి పూర్తి సహకారం రవాణాశాఖ అధికారులు కల్పించారని తేల్చారు. దీనికి బాధ్యులను చేస్తూ రవాణాశాఖ కార్యాలయంలోని ఇద్దరు సిబ్బందితో సహా పదిమందిని నిందితులుగా తేల్చారు. పోలీసులదే తప్పంటున్న రవాణా శాఖ అధికారులు.. నిందితుడు నకిలీ ఆర్సీ పొందటానికి మిస్సింగ్ సర్టిఫికెట్ జారీ చేసిన పోలీసులదే తప్పు అని రవాణాశాఖ అధికారులు అంటున్నారు. నిందితుడ్ని తమ అధికారులే పట్టిస్తే... తమ సిబ్బందిపై కేసులు నమోదు చేయటంపై రవాణా శాఖ కమిషనరు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. విషయాన్ని డీజీ దృష్టికి తీసుకువెళ్లే యోచనలో రవాణాశాఖాధికారులు ఉన్నట్లు సమాచారం. మార్చిలో సంఘటనపై కేసు నమోదు చేయాలని కోరినా పోలీసులు ఒత్తిడితో కేసు రాజీ చేసి రుణం సర్దుబాటు చేసినట్లు చెబుతున్నారు. కాగా, శుక్రవారం రవాణా శాఖకు చెందిన ఇరువురు ఉద్యోగులు కోర్టులో లొంగిపోయి బెయిల్ పొందటం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా రెండుశాఖల మధ్య చెలరేగిన ఈ సమస్య ఎక్కడికి వెళుతుందో చూడాల్సిందే. -
ముక్కంటి నిధిపై నేతల పెత్తనం
ఉయ్యూరు : ఉయ్యూరు శివాలయంపై రాజకీయ పడగ పడింది. అధికార పార్టీకి చెందిన ఇరువురు ముఖ్య నేతలు ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటూ దేవాదాయ అధికారులపై రకరకాల ఒత్తిళ్లు తెస్తున్నారు. స్వామి వారి సొమ్ముపై పెత్తనం పెచ్చుమీరడంతో శివశివా దేమిటి అని భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. స్థానికంగా ప్రసిద్ధి చెందిన శ్రీ జగదాంబ సమేత సోమేశ్వరస్వామి (శివాలయం) ఆలయం భూమి 2.70 ఎకరాలు రహదారి విస్తరణలో పోయింది. ఈ భూమికి ప్రభుత్వం నుంచి రూ.8 కోట్ల 36 లక్షల 70 వేల 835లు నిధుల నష్టపరిహారం వచ్చింది. 20 రోజుల క్రితం ఈ మొత్తాన్ని ఆలయ వ్యవహారాల ఖాతా ఉన్న ఇండియన్ బ్యాంక్‌కు ఈ మొత్తం సొమ్ము జమైంది. ఈ కోట్లాది రూపాయలను స్వామివారి పేరిట డిపాజిట్ చేయాల్సి ఉంది. ఈ సొమ్మును తాము చెప్పిన బ్యాంకులోనే డిపాజిట్ చేయాలని ఆ ఇద్దరు నేతలు ఒత్తిళ్లకు దిగారు. పోరంకిలోని ఎస్బీఐ బ్యాంకులో జమ చేయాలని ఒకరు, కాదు ఉయ్యూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లో అని మరొకరు అధికారులకు హుకుం జారీచేశారు. ఎవరి ఆదేశం పాటించాలో పాలుపోక ఆలయ అధికారులు తలపట్టుకున్నారు. తాము చెప్పిన బ్యాంకులోనే ఈ భారీమొత్తాన్ని జమచేయిస్తే బ్యాంకుల నుంచి నజరానాలతో పాటు సొమ్ముపై పెత్తనం చలాయించవచ్చనేది ఆ నేతల దురాలోచనగా తెలుస్తోంది. డిపాజిట్‌పై ఏం చేయాలని కాకినాడ డిప్యుటీ కమిషనర్‌కు అధికారులు లేఖ రాసినట్లు సమాచారం. -
నయనను అధిగమించేనా?
అందాల భామలు నయనతార, త్రిషల మధ్య నువ్వా? నేనా? అన్నంతగా కోల్డ్‌వార్ నడిచింది. అయితే అది ఒకప్పటి కథ. ఇప్పుడు వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటిది తాజాగా ఈ బ్యూటీస్ మధ్య మరోసారి పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. నయనతార, త్రిష ఇద్దరూ సంచలన తారలే. ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోయినవారే. ఈ అందగత్తెల మధ్య మరో పోలిక ఏమిటంటే ఇటీవల ఇద్దరూ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలకు మారారు. అదే విధంగా నయనతార నటించిన ఆ తరహా చిత్రం అన్భే నీ ఎంగే(తెలుగులో అనామిక)చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక త్రిష నటించిన నాయకి తెలుగులో విడుదలై ఆమెకు నిరాశనే మిగిల్చింది. తమిళంలో త్వరలో తెరపైకి రానుంది. అయితే ఆ తర్వాత నయనతార నటించిన మాయ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ఇప్పుడు త్రిష కూడా మాదేశ్ దర్శకత్వంలో మరో హారర్ కథా చిత్రం చేస్తున్నారు. ఇకపోతే ఆ అమ్మడు కోలీవుడ్‌లో అగ్రకథానాయకులందరితోనూ జత కట్టారు. ఒక్క సూపర్‌స్టార్‌తో తప్ప. ఆయనతో నటించే అవకాశం రాలేదన్న నిరాశను, నటించాలన్న ఆశను తను చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. మూడు పదుల వయసు దాటిన త్రిషకు త్వరలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించాలనే కోరిక తీరే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఆ ఆశకు తన నెచ్చలి నయనతార గండి కొట్టే అవకాశం లేకపోలేదనే టాక్ మరో పక్క వినిపిస్తోంది. కబాలి చిత్రంతో ఆల్ రికార్డులను బద్దలు కొట్టిన రజనీకాంత్ తాజాగా శంకర్ దర్శకత్వంలో 2.ఓ చిత్రాన్ని పూర్తి చేయడానికి సిద్ధం అవుతున్నారు. కాగా తదుపరి కబాలి-2ను చేయబోతున్న విషయం ఇప్పటికే కోలీవుడ్‌లో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన అల్లుడు ధనుష్ వుండర్‌బార్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న ఆ చిత్రానికి దర్శకుడు ర ంజిత్ కథను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌కు జంటగా అమలాపాల్ నటించనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆ పాత్రకు నయనతార అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం వరుస విజయాలతోనూ, చేతి నిండా చిత్రాలతోనూ బిజీగా ఉన్న నయనతార కాల్షీట్స్ కుదరక పోతే త్రిషకు అవకాశం దక్కనుంది. నయన్ ఇప్పటికే సూపర్‌స్టార్‌తో చంద్రముఖి, కుచేలన్, శివాజీ చిత్రాల్లో జతకట్టారు. తాజాగా నాలుగోసారి నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నయనతారను అధిగమించాలంటే త్రిష లక్కుపైనే ఆధారపడి ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
గిరిజన సంక్షేమ శాఖలో 'కోల్డ్'వార్!
గుంటూరు వెస్ట్ : జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి(డీటీడబ్ల్యుఓ) పోస్టు కోసం ఇద్దరు అధికారుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఆ పోస్టులో ఉన్న అధికారి అక్కడే కొనసాగేందుకు, మరో అధికారి ఏవిధంగానైనా పోస్టును దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆ శాఖలో తీవ్రచర్చకు దారితీశాయి. ఆ ఇద్దరు అధికారుల తీరుతో విస్తుబోతున్న కిందిస్థాయి సిబ్బంది ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుత డీటీడబ్ల్యుఓ వీ.నారాయణుడును చిత్తూరు జిల్లా డీటీడబ్ల్యుఓగా నియమిస్తూ ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు జారీఅయినట్టు సమాచారం. గత ఏడాది ఆగస్టు 22న నారాయణుడు ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఏడాది కూడా పూర్తికాకుండానే ఆయనను చిత్తూరు జిల్లాకు బదిలీ చేయడం వెనుక చాలాతతంగం నడిచినట్టు ఉద్యోగవర్గాల్లో చర్చనడుస్తోంది. అలాగే ఏటీడబ్ల్యుఓ ఎం.ఈశ్వరరావుకు ఇన్చార్జి డీటీడబ్ల్యుఓగా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈశ్వరరావును చిత్తూరు జిల్లా ఇన్చార్జి డీటీడబ్ల్యుఓగా నియమిస్తూ ఉన్నతాధికారులు గతనెలలో ఉత్తర్వులు జారీచేశారు. ఆయన జూన్ 30 తేదీనే ఇక్కడి నుంచి రిలీవ్ కావాల్సి ఉంది. కానీ రిలీవ్‌కాలేదు. ఈశ్వరరావుది ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను మండలం. చిత్తూరు జిల్లాకు బదిలీపై వెళ్లడం ఇష్టంలేని ఆయన ఈ జిల్లాలోనే పోస్టింగ్ కేటాయించాలని ప్రత్తిపాడు నియోజకవర్గంలో కీలకపాత్ర పోషిస్తున్న అధికార పార్టీ నేత ద్వారా ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్టు తెలిసింది. తనకు బదులుగా నారాయణుడును చిత్తూరు జిల్లాకు పంపించాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో అధిక మొత్తంలో నగదు చేతులు మారినట్టు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఈక్రమంలోనే ఈశ్వరరావు ఈనెల 11వ తేదీ నుంచి 15 రోజులపాటు సెలవుపై వెళ్లిపోయారు. సీటు కాపాడుకునేందుకు నారాయణుడు విశ్వప్రయత్నాలు తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాలనకు సంబంధించిన వ్యవహారాలు, ఇతరత్రా సమస్యలు తలెత్తిన సమయంలో నారాయణుడు జిల్లాలో సీనియర్ ఏటీడబ్ల్యుఓ అయిన ఈశ్వరరావు ద్వారా వాటిని పరిష్కరించే వారని తెలిసింది. ఇప్పుడు తనసీటుకే ఎసరువస్తుండడం ఆయనకు మింగుడుపడడం లేదు. ఉన్నతాధికారులతో ఈవిషయమై పలుమార్లు చర్చించినట్లు తెలిసింది. నిబంధనలు ప్రకారం తన బదిలీ జరగదని, అదేవిధంగా జిల్లాకు చెందిన ఏటీడబ్ల్యుఓకు ఇన్చార్జి డీటీడబ్ల్యుఓగా ఇవ్వడం కుదరదని ఆయన చెబుతున్నారు. ఏమైనా ఇక్కడే కొనసాగేవిధంగా ఆయన తన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. -
ఆయనకు నా నటన నచ్చలేదనుకుంటా?
నటుడు ధనుష్‌కు నా నటన నచ్చలేదనుకుంటా అని ఆయన ఎదుటే బహిరంగంగానే అడిగేసి మరో సంచలనానికి తెర లేపారు నటి నయనతార. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ జరుగుతుందనే ప్రచారం జోరందుకుంది. వివరాల్లోకెళ్లితే ధనుష్ నిర్మించిన రెండు చిత్రాలు ఒకే వేదికపై అవార్డును గెలుచుకున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో ధనుష్ నిర్మించిన కాక్కాముట్టై ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకోగా, మరో చిత్రం నానుమ్ రౌడీదాన్ చిత్రంలో నటించిన నయనతారకు ఉత్తమ నటి అవార్డు వ రించింది. కాక్కాముట్టై చిత్ర అవార్డును నిర్మాతగా అందుకున్న ధనుష్ ఆ చిత్రం గురించే మాట్లాడారు. అనంతరం ఉత్తమ నటి అవార్డును అందుకోవడానికి వేదికపైకి వచ్చిన నయనతార మాట్లాడుతూ ధనుష్ తన నటన నచ్చినట్లు లేదు. అందుకే తను గురించి ఇక్కడ ప్రస్థావించలేదు అని అన్నారు. అది తన ఆవేదనా? లేక ధనుష్‌పై ఆరోపణా అన్న చర్చ కోలీవుడ్‌లో హాట్‌హాట్‌గా జరుగుతోంది. అంతే కాదు అదే వేదికపై ఈ అవార్డును దర్శకుడు విఘ్నేశ్శివకే డెడికేట్ చేస్తున్నట్లు ప్రకటించిన నయనతార ఇటీవల ఈ ప్రేమికులిద్దరూ విడిపోయారన్న వదంతులకు బదులిచ్చినట్లయింది. నానుమ్ రౌడీదాన్ చిత్ర షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ నయనతార చిత్ర దర్శకుడు విఘ్నేశ్‌శివ సమయానికి షూటింగ్‌కు రాకుండా చిత్ర నిర్మాణ బడ్జెట్‌ను పెంచేశారనే ప్రచారం అప్పట్లో హల్చల్ చేసింది. ఆ కారణంగానే ధనుష్ ఇప్పుడు నయనతార గురించి నోరు మెదపలేదని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఖద్దరు, ఖాకీ మధ్య మళ్లీ వార్
మూన్నెళ్లకోసారి ఇదే తంతు తెర వెనుక విషయం వేరు జనాన్ని నమ్మించేందుకే నాటకాలు విశాఖపట్నం: ఖద్దరుతో ఖాకీ జత కట్టకపోతే జత కట్టేలా చేయడం ఖద్దరుకు అలవాటు.. ఖద్దరు ఏం చెబితే అదే చేసుకుపోవడం ఖాకీకి తప్పని గ్రహపాటు. ఈ రెండు వర్గాల మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూవుంటారు. జిల్లా ఎస్పీ, నగర పోలీస్ కమిషనర్ తమకు సహకరించడం లేదని ఓపక్క ప్రజాప్రతినిధులు రుసరుసలాడుతుంటారు. మరోపక్క తెర వెనుక ఒకరికొకరు సహకరించుకుంటూనే ఉంటారు. పోలీసు బదిలీలు, నియామకాల విషయంలో తమ మాట చెల్లలేదని ఎమ్మెల్యేలు గతంలో సీఎంకు ఫిర్యాదు చేశారు. మంత్రి కల్పించుకొని పోలీసు ఉన్నతాధికారులకు క్లాస్ తీసుకోవడంతో సద్దుమణిగింది. ఇది జరిగి కొన్ని నెలలు గడిచిపోయింది. తాజాగా పోలీస్ కమిషనరేట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి సీఎం వస్తుంటే ఆ కార్యక్రమానికి తమకు ఆహ్వానం సరిగ్గా అందలేదంటూ కొందరు ఎమ్మెల్యేలు వివాదం లేవనెత్తారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లామని చెప్పుకొస్తున్నారు. మళ్లీ ఈ ట్విస్ట్ ఏమిటని ఆరా తీస్తే అసలు డ్రామా బయటపడింది. నాలుగు రోజుల క్రితం చిరు వ్యాపారుల మార్కెట్‌ను అధికారులు బలవంతంగా కూలగొట్టారు. పోలీసులు అంత కఠినంగా వ్యవహరించడానికి కారణం ఓ ప్రజాప్రతినిధి. ఆయన పంతం పట్టి ఆ మార్కెట్లో జనాన్ని అక్కడి నుంచి తప్పించాల్సిందేనని, అంత వరకూ కదిలేది లేదని జీవీఎంసీ కమిషనర్ ఎదుట కూర్చున్నారట. కమిషనర్ చేసేది లేక సిటీ పోలీస్ కమిషనర్ సహాయాన్ని కోరారు. జీవీఎంసీ సిబ్బంది, పోలీసులు, ఎమ్మెల్యే ఏకమై అలా మార్కెట్‌ను కూలగొట్టారు. అ విషయం బయటకు పొక్కడంతో అప్రతిష్ట పాలవుతామని గ్రహించిన ఆ ఎమ్మెల్యే మర్నాడు బాధితులను పరామర్శించి మొసలి కన్నీరు కార్చారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు, పోలీసులు చేసిన పనితో తమకు సంబంధం లేదని జనాన్ని నమ్మించేందుకే ఈ కమిషనరేట్ డ్రామా ఆడారని అంతా భావిస్తున్నారు. నిజానికి ఇటు నగరంలోనూ, అటు రూరల్లోనూ ప్రజాప్రతినిధులు చెప్పిందే పోలీస్ స్టేషన్లో నడుస్తోంది. దాని ఫలితంగానే ఎన్నడూ లేనంతగా హత్యలు, భూ కబ్జాలు, రౌడీయిజం పెచ్చుమీరుతున్నాయి. ఇది ఎంత దాచేసినా దాగని సత్యం. -
మేయర్ వర్సెస్ కమిషనర్
కౌన్సిల్ సాక్షిగా విభేదాలు బహిర్గతం కార్పొరేషన్ మేయర్, కమిషనర్ మధ్య సాగుతున్న కోల్డ్‌వార్ కౌన్సిల్ సాక్షిగా బహిర్గతమైంది. మున్నెన్నడూ లేని విధంగా మేయర్ కోనేరు శ్రీధర్.. ‘కమిషనర్’ అంటూ పలుమార్లు ఏకవచనంతో సంబోధించడం సభలో చర్చకు దారితీసింది. అనధికారిక కట్టడాలకు సంబంధించి పది శాతం ఫైన్ వసూలు విషయాన్ని టీడీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. రెండో అంతస్తు నిర్మాణానికి సంబంధించి జీవో 168 ప్రకారం ప్రభుత్వం నుంచి త్వరలోనే అనుమతి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫైన్‌ను నిలుపుదల చేయాల్సిందిగా టీడీపీ ఫ్లోర్‌లీడర్ గుండారపు హరిబాబు కోరారు. మార్కెట్ విలువ ప్రకారం కాకుండా భవన నిర్మాణ ఫీజుల ఆధారంగా ఫైన్ వసూలు చేయాల్సిందిగా సూచించారు. మేయర్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలకు సంబంధించి జరిమానాలు విధించేందుకు నగరపాలక సంస్థలో జడ్జిని ఏర్పాటు చేసినప్పటికీ ఆయన్ను క్షేత్రస్థాయి పర్యటనలకు ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ తీవ్రంగా స్పందించారు. జడ్జికి రూ.5 వేలకు మించి ఫైన్ వేసే అధికారం లేదన్నారు. తనకున్న అధికారాల ప్రకారం మార్కెట్ విలువలో పది శాతం వరకు వసూలు చేయవచ్చన్నారు. ఇప్పటివరకు ఫైన్ల రూపంలో కోటి రూపాయలు వసూలైందన్నారు. మీరు (కమిషనర్) ఫైన్ వేయండి. అయినంత మాత్రాన జడ్జిని తిప్పననడం సరికాదని మేయర్ పేర్కొన్నారు. పది శాతం ఫైన్‌ను తగ్గించాల్సిందిగా హరిబాబు సూచించగా కమిషనర్ కుదరదని తేల్చేశారు. సెకండ్ ఫ్లోర్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఇదే విధానాన్ని కొనసాగిస్తామని కుండబద్దలు కొట్టారు. దీంతో మేయర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పది శాతం ఫీజు వసూలు చేయమని జీవో ఎప్పుడు వచ్చిందో చెప్పాలని సిటీప్లానర్‌ను నిలదీశారు. ప్రభుత్వం జీవోలను అమలు చేసే సందర్భాల్లో కౌన్సిల్‌కు తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. కమిషనర్ నిర్ణయం భేష్ వైఎస్సార్సీపీ సభ్యుడు చందన సురేష్ మాట్లాడుతూ నగరంలో అక్రమ కట్టడాలు పేట్రేగుతున్నాయన్నారు. కమిషనర్ నిర్ణయం వల్ల కార్పొరేషన్‌కు దండిగా ఆదాయం వస్తోందన్నారు. పేదలు నివసించే ప్రాంతంలో ఐదు శాతం, పెద్దలు నివసించే ప్రాంతంలో పది శాతం చొప్పున ఫైన్ వసూలు చేయాల్సిందిగా సూచించారు. పది శాతం ఫైన్ మినహాయించాలని టీడీపీ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ సవరణ తీర్మానం ఇచ్చింది. ఆస్తి పన్ను వసూలులో రాష్ట్రంలోనే ఫస్ట్... విజయవాడ కార్పొరేషన్ 105 శాతం ఆస్తిపన్ను వసూళ్లుచేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని మేయర్ చెప్పారు. అయితే కొందరు సిబ్బంది పని దొంగల్లా మారారని, వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి జీతాలు కట్ చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో గోల్డెన్ మైల్ ప్రాజెక్ట్ జూన్ నాటికి అందుబాటులోకి రానున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావుతో పాటు తొలిసారిగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా పాల్గొన్నారు. -
అస్మదీయుడి కోసం.. వియ్యంకుల పంతం
వారిద్దరూ మంత్రులు.. పైగా కొన్ని నెలల క్రితమే వియ్యంకులయ్యారు. అప్పుడే వారి మధ్య విభేదాలు!.. విభేదాలంటే ఇదేదో కుటుంబ వివాదం అనుకునేరు!. ఇది ఫక్తు రాజకీయం.. అందులోనూ కీలకమైన ఒక విభాగాధిపతి పోస్టు యవ్వారం.. ఎవరికి వారు తమ మాటే నెగ్గాలని పట్టుదల వహించడంతో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. దాంతో ఆ విభాగాన్ని పట్టించుకునే నాథుడు లేకపోయాడు.. కుటుంబం కుటుంబమే.. రాజకీయం రాజకీయమే.. అని నిరూపిస్తున్న ఈ వ్యవహారం వివరాల్లోకి వెళితే.. సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) ఇటీవలే స్వచ్ఛ భారత్ అవార్డును సొంతం చేసుకుంది. కానీ ఈ నగరంలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన కీలకమైన ముఖ్య వైద్య ఆరోగ్యాధికారి (సీఎంహెచ్వో) సీటు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉంది. జాయింట్ డెరైక్టర్ డాక్టర్ ఎం.సత్య నారాయణరాజు రీజనల్ డైరెక్టర్‌గా పదోన్నతిపై గత ఏడాది జూలై 15న ఒంగోలుకు వెళ్లిపోయినప్పటి నుంచి ప్రజారోగ్య విభాగం దిక్కులేనిదైంది. ఇన్ చార్జ్‌గా వ్యవహరించిన జోన్ -4 ఏఎంవో డాక్టర్ మురళీమోహన్ కూడా కొద్దికాలానికే సెలవుపై వెళ్లిపోయారు. ఈయన పనితీరుపై కమిషనర్ ప్రవీణ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేయడం వల్లే సెలవుపై వెళ్లిపోయారనే ప్రచారం జరిగింది. దాంతో ఈ బాధ్యతలను ఏడీసీ జనరల్ జీవీవీఎస్ మూర్తికి అప్పగించినప్పటికీ పని ఒత్తిడి పెరగడంతో ఆయన పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. కమిషనర్ ప్రవీణ్ కుమార్ అంతా తానై చూసుకోవడం వల్లే పారిశుద్ద్య నిర్వహణ గాడిలో పడింది. అయినప్పటికీ జీవీఎంసీలోనే అతిపెద్ద విభాగమైన ప్రజారోగ్యంలో క్షేత్ర స్థాయిలో ఏమూల ఏం జరుగుతుందో పర్యవేక్షించడం అంత ఈజీ కాదు. సీహెచ్ఎంవో పోస్టు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉండడంతో ప్రజారోగ్యంలో కీలకమైన శానిటేషన్ అండ్ సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్, మెడికల్ కేర్, అర్బన్ మలేరియా అండ్ విక్టర్ బోర్న్ డిసీజెస్, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్స్, ఫుడ్ హైజనిక్, వెటర్నరీ పబ్లిక్ హెల్త్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (ఎన్యూహెచ్ఎం) విభాగాలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైంది. కీలకమైన ఈ పోస్టు భర్తీ చేస్తే ఇటు కమిషనర్ .. అటు ఏడీసీ(జనరల్)పై ఒత్తిడి తగ్గుతుంది. ఇంత ప్రాధాన్యమున్న ఈ పోస్టును భర్తీ చేయడంలో ఇటీవలే వియ్యంకులుగా మారిన మున్సిపల్, మానవవనరుల శాఖల మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదర లేదనే వాదన జీవీఎంసీలో బలంగా విన్పిస్తోంది. ఈ పోస్టులో శ్రీకాకుళానికి చెందిన డాక్టర్ దవళ భాస్కరరావును నియమించాలన్న ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. మరోపక్క గతంలో ఇదే పోస్టులో పనిచేసిన వైద్యాధికారితో పాటు కాకినాడ జీజీహెచ్, నెల్లూరు, గుంటూరు ప్రభుత్వాస్పత్రుల్లో సివిల్ సర్జన్ క్యాడర్లో పనిచేస్తున్న వైద్యాధికారులు దీని కోసం పైరవీలు సాగిస్తున్నట్టు తెలిసింది. రూ.50లక్షల వరకు ఇచ్చేందుకు నెల్లూరు, గుంటూరులలో పనిచేస్తున్న ఒకరిద్దరు సిద్ధపడినట్టు చెబుతున్నారు. కాగా తమకు కావాల్సిన వారిని ఈ పోస్టులో కూర్చోబెట్టేందుకు వియ్యంకులైన మంత్రులిద్దరూ ఎవరికివారు పట్టుదలతో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వారి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఈ పోస్టు భర్తీలో జాప్యం జరుగుతోందని అంటున్నారు. దీనిపై కమిషనర్ ప్రవీణ్ కుమార్‌ని ఎప్పుడు అడిగినా సీఎంహెచ్వో పోస్టు భర్తీ నా చేతుల్లో లేదు.. ప్రభుత్వమే త్వరలో నిర్ణయం తీసుకుంటుందంటూ దాటవేస్తున్నారు. -
సీనియర్ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు
ఒకరేమో జిల్లా మంత్రి... మరొకరు జిల్లా ఇన్చార్జి మంత్రి... ఇద్దరూ టీడీపీలో అత్యంత సీనియర్లే... ఎన్టీఆర్, చంద్రబాబు కేబినేట్లలో కలసి పనిచేసినవారే. పైగా ఇరుగుపొరుగు జిల్లాలవారే. అయితే మాత్రం...! ‘ఎక్కడైనా బావగానీ.. వంగ తోట కాడ కాదు’ అన్నట్లుగా తయారైంది వారి పరిస్థితి. జిల్లాపై పెత్తనం చెలాయించాలని ఇన్చార్జి మంత్రి చూస్తుంటే... అసలు మీ పెత్తనం ఏమిటని జిల్లా మంత్రి అడ్డుపడుతున్నారు. ఎందుకంటే అటు ఇన్చార్జి మంత్రి, ఇటు జిల్లా మంత్రి ఇద్దరూ కన్నేసింది ఒకే వ్యవహారంపై. అక్రమంగా కోట్లు కురిపిస్తున్న ఇసుక దందాతోపాటు ఉన్నతాధికారుల నియామక వ్యవహారం మీద ఇద్దరూ తమ మాటే చెల్లాలని పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్లిదంటే.. ఇన్చార్జి మంత్రిగా నియమితుడై ఏడాది గడుస్తున్నా ఇంతవరకు జిల్లాలో ఒక్క అధికారిక సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా అతన్ని కట్టడి చేశారు. ఇదంతా అనుకుంటున్నారా!.. వీరిలో జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు కాగా.. ఇన్చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు. వీరిద్దరి ఆధిపత్య పోరుకు వేదిక.. విశాఖ జిల్లా.. ► యనమల ఆధిపత్యాన్ని సహించని జిల్లా మంత్రి ► సమావేశాలే నిర్వహించని ఇన్చార్జి మంత్రి ► ఇసుక దందా, అధికారుల బదిలీల్లో ఆధిపత్య పోరే కారణం విశాఖపట్నం: విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఇసుక ర్యాంపుల వ్యవహారం మంత్రులు అయ్యన్న, యనమల మధ్య చిచ్చుపెట్టింది. మంత్రి యనమల కుటుంబ సభ్యులు జిల్లా సరిహద్దు దాటి విశాఖ జిల్లాలోకి వచ్చి మరీ భారీగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే పాయకారావుపేట నియోజకవర్గంలో ఇసుక దందాపై యనమల కుటుంబ సభ్యుల ఆధిపత్యమే కొనసాగుతోంది. వీరి పెత్తనమేమిటంటూ జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. వారి దందాను అడ్డుకుని ఆధిపత్యం సాధించేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రుల మధ్య చిన్నగా విభేదాలు ప్రారంభమయ్యాయి. అంతలోనే ఏడాది క్రితం విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రిగా యనమల రామకృష్ణుడును సీఎం నియమించారు. ఇది అయ్యన్నకు ఏమాత్రం రుచించలేదు. మరోవైపు యనమల కూడా దూకుడుగా వ్యవహరించి జిల్లా వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకోవాలని భావించారు. జిల్లాలో ఉన్నతాధికారుల నియామకంలో యనమల కల్పించుకోవడాన్ని కూడా అయ్యన్న సమ్మతించలేదు. జిల్లాలో వివాదాస్పదమైన ఆర్డీవో, డీఆర్వో నియామకాల్లో మంత్రి యనమల తనదైన పంథాలో వ్యవహరించడాన్ని అయ్యన్న అడ్డుకున్నారు. తాజాగా తాండవ నదిలో ఇసుక ర్యాంపులు దక్కించుకునేందుకు మంత్రులు పోటీపడుతున్నారు. అందుకోసం పంతాలకు పోతున్నారు. అడుగడుగునా అడ్డుకట్ట ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాపై పట్టు సాధించేందుకు యనమలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని అయ్యన్న పాత్రుడు భీష్మించుకున్నారు. అందుకే జిల్లాలో యనమల ఇంతవరకు ఎలాంటి అధికారిక సమావేశాన్ని నిర్వహించలేకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లా డీఆర్సీ సమావేశంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశాలను నిర్వహించాలని యనమల భావించారు. ఈ విషయాన్ని జిల్లా అధికార యంత్రాంగం ద్వారా అయ్యన్నకు తెలియజేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. ‘ఇప్పుడేమీ సమావేశాలు వద్దు. తరువాత నేను చెబుతా’ అని ముక్తసరిగా తేల్చేశారు. దాంతో ఇన్చార్జి మంత్రిగా నియమితుడై ఏడాది గడుస్తున్నా యనమల రామకృష్ణుడు ఇంతవరకు జిల్లాలో అధికారికంగా ఎలాంటి సమావేశాన్ని నిర్వహించలేకపోయారు. సీఎం చంద్రబాబు వస్తే ఆ పర్యటనలో పాల్గొనడం మినహా అధికారికంగా విధులు నిర్వర్తించలేకపోతున్నారనే అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ‘నా పుట్టలో వేలు పెడితే కుట్టనా’ అన్నట్లుగా మంత్రి అయ్యన్న వ్యవహరిస్తున్నారు. -
నా సోల్‌మేట్ తనే!
సినీ తారల మధ్య కోల్డ్ వార్ సహజమే. పైకి నవ్వులు రువ్వుకుంటూ, లోపల కత్తులు దూసుకుంటూ ఉంటారు. వీటన్నిటికీ అతీతంగా ఉండే వాళ్లు అతి కొద్ది మందే. ఆ జాబితాలో దీపికా పదుకొనే ఒకరు. ఆమె తన ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ప్రియాంకా చోప్రా అని చెబుతున్నారు ‘‘అసలు నేను సినీ పరిశ్రమలోకి వచ్చేటప్పటికే ప్రియాంక ఓ సూపర్ స్టార్. ఓ సందర్భంలో ఆమెను కలిశాక వెంటనే ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఒక్కోసారి ఈ ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని అనుకున్న సందర్భాలూ ఉన్నాయి. నాకు ఏ కష్టమొచ్చినా ప్రియాంక ఎప్పుడూ నా వెన్నంటే ఉంటూ ప్రోత్సహించేది. నేనూ అంతే. ఒక్కమాటలో ఆమె నా సోల్‌మేట్. ప్రియాంక కన్నా నాకు నచ్చిన బెటర్ కో-స్టార్ ఎవరూ లేరు’’ అని చెప్పుకొచ్చారు దీపిక. -
లండన్‌పై రష్యా అణుబాంబులు!
బ్రిటన్‌తో ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతున్న కాలంలో లండన్ నగరం మీద అణుదాడికి రష్యా ప్రణాళిక రచించిందా? దక్షిణ లండన్‌లోని క్రొయ్డన్లో అణుబాంబులు వేయాలని భావించిందా? అంటే తాజాగా వెలుగుచూసిన టాప్ సీక్రెట్ లేఖ అవుననే అంటున్నది. లండన్ మీద అణుబాంబులు వేయడానికి రష్యా ప్రయత్నిస్తున్నది హెచ్చరిస్తూ 1954లో బ్రిటన్ అణు ఇంధన సంస్థ చైర్మన్ ఎడ్విన్ ప్లొడన్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఇటీవల మరణించిన ప్లోడన్ 1954లో చేతిరాతతో రాసిన లేఖను జాతీయ అర్కైవ్ సంస్థ ఆదివారం విడుదల చేసింది. ఈ లేఖ ప్రకారం లండన్ మీద వేసేందుకు రష్యా దగ్గర 32 బాంబులు సిద్ధంచేసిందని, ఇందులో నాలుగో, ఐదో బాంబులు వేసినా.. భారీస్థాయిలో విధ్వంసం జరుగుతుందని ఆయన పేర్కొన్నారని మిర్రర్ పత్రిక పేర్కొంది. 1924-53 మధ్యకాలంలో రష్యా పాలకుడిగా జోసెఫ్ స్టాలిన్ ఉండగా.. 1954-63 వరకు నికిత కృశ్చెవ్ ఉన్నారు. 1945లో జపాన్‌లోని నాగాసాకిపై అమెరికా వేసిన అణుబాంబుల కంటే ఈ బాంబులు మరింత శక్తివంతమైనవని, వీటి పేలుడు చోటుచేసుకున్న ప్రదేశంలో మూడు మైళ్ల వరకు పూర్తిగా విధ్వంసమవుతుందని ఆయన లేఖలో హెచ్చరించారు. -
కొనసాగుతోన్న చంద్రబాబు, కేఈ వార్
-
రామగుండం టీఆర్ఎస్లో కోల్డ్‌వార్
ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు మధ్య ముదిరిన విభేదాలు ఎమ్మెల్యే కొడుకు పెత్తనంపై కినుక అధికారుల తీరుపై ఆగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు దూరం రద్దయిన మంత్రి ఈటల రాజేందర్ పర్యటన గోదావరిఖని : కుందనపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమం, రామగుండంలో జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ, గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం పాల్గొనాల్సి ఉంది. మంత్రి పర్యటనపై నాలుగు రోజుల ముందు నుంచే టీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసే శిలాఫలకంతోపాటు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం రామగుండం నియోజకవర్గంలో పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత మంథనిలో మంత్రి పర్యటించేందుకు చర్యలు చేపట్టారు. అరుుతే రామగుండం, గోదావరిఖనిలో కార్యక్రమాలకు హాజరుకావాల్సిన జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీపీ ఆడెప రాజేశం, రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ ఉదయం నుంచే అందుబాటులో లేకుండాపోయారు. వారి సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో నాయకులు, అధికారులు అయోమయంలో పడ్డారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సైతం సదరు ప్రజాప్రతినిధుల ఇళ్లకు అనుచరులను పంపించి ఆరా తీసినట్టు సమాచారం. మండలంతోపాటు కార్పొరేషన్‌కు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్ రామగుండం కార్యక్రమాలను రద్దు చేసుకుని మంథని నియోజకవర్గ పర్యటనకు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఎంపీని సంప్రదించగా... మంత్రి హుజూరాబాద్‌లో జరిగే కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉన్నందున సమయం సరిపోవడం లేదని రామగుండం పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిపారు. అయితే మంత్రి హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించకపోవడం గమనార్హం. అధికారులపై కినుకతోనే..? మంత్రి ఈటల రాజేందర్ పర్యటనకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీపీలకు, కార్పొరేషన్‌కు చెందిన ఇతర ప్రజాప్రతినిధులకు వీఆర్ఓల ద్వారా సమాచారం పంపించడంతో వారు అవమా నంగా భావించినట్లు తెలుస్తోంది. అధికారులు తమను చిన్నచూపు చూస్తున్నారని, కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని, తమ పరిస్థితి మంత్రికి తెలియాలనే ఉద్దేశంతోనే పర్యటనకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టమవుతోంది. దీనికితోడు ఎమ్మెల్యే కుమారుడికి అధికారికంగా ఏ పదవీ లేకపోయినా అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని ఆగ్రహంతో ఉన్నారు. అధికారులు సైతం ఆయనకే ప్రాధాన్యతనిస్తూ తమను చులకన చేస్తున్నారనే భావన కూడా నెలకొంది. పోలీస్స్టేషన్లు, మండల కార్యాలయూల్లో అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నారని, ఇందుకు ఎమ్మెల్యే తనయుడే కారణమని గతంలోనే పార్టీ అధిష్టానానికి, జిల్లా నాయకులకు తెలిపినా పట్టించుకోలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగానే ప్రజాప్రతినిధులు మంత్రి పర్యటన కు అందుబాటులో లేరని తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న అంతర్గత పోరుపై దృష్టి సారించకపోతే విభేదాలు మరింత ముదిరిపోయే ప్రమాదముందని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఆర్ అండ్ బీలో కోల్డ్‌వార్!
సాక్షి ప్రతినిధి, కడప: రోడ్లు భవనాలశాఖలో కోల్డ్‌వార్ నడుస్తోంది. క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈగా ఉన్న వివేకానందరెడ్డిని అర్ధాంతరంగా బదిలీ చేశారు. ఆ స్థానంలో ఇటీవల హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లిన రెగ్యులర్ ఎస్ఈ మనోహర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమేరకు మంగళవారం ఆర్అండ్బి కడప క్వాలిటీ కంట్రోలర్ ఎస్ఈగా బాధ్యతలు చేపట్టారు. అక్రమ ఉత్తర్వులంటూ ఇదివరకే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న వివేకానందరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఓ ఏ నెంబర్ 3511 ఆఫ్ 2015 ద్వారా వివేకానందరెడ్డి ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులపై స్టేటస్కో ఆర్డర్ జారీ చేస్తూ, మునుపటి ఎస్ఈ వివేకానందరెడ్డిని కొనసాగించాలని ఆదేశించింది. ఆమేరకు హైకోర్టు ఉత్తర్వులను కొనసాగించకపోతే, కోర్టుధిక్కారం అవుతుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతకొంత కాలంగా అంతర్గతంగా నడుస్తున్న కోల్డ్‌వార్ బహిర్గతం కావడంతో ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశమైంది. -
సర్పంచ్‌లు + కార్యదర్శులు
రికార్డుల నిర్వహణపై కోల్డ్‌వార్ తామే రికార్డులు రాస్తామంటున్న పంచాయతీ కార్యదర్శులు వేరే వ్యక్తితో రికార్డుల రాయియిస్తున్న సర్పంచ్‌లు పంచాయతీ అభివృద్ధిలో సర్పంచులు.. కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకం. చిన్నచిన్న లోపాలున్నా.. వారు ఐక్యంగా ఉంటేనే పాలన కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఇందులో నిధుల వ్యయానికి సంబంధించిన రికార్డుల నిర్వహణ బాధ్యత కార్యదర్శులదే కాగా.. ఆ పనేదో మేమే చేయించుకుంటామంటూ సర్పంచులు భీష్మిస్తున్నారు. దీనివెనుక మతలబేమిటో మీరే ఆలోచించండి!! సంతకవిటి : మండలంలోని పలు పంచాయతీలకు చెందిన పంచాయతీ కార్యదర్శులకు, పంచాయతీ సర్పంచ్‌లకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ప్రస్తుతం మండలంలో 34 పంచాయతీలుండగా 14 మంది కార్యదర్శులే ఉన్నారు. గతంలో అయితే మొత్తం 34 పంచాయతీలకూ కేవలం ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉండేవారు. దీంతో పంచాయతీలకు సంబంధించిన రికార్డులును వేరే వ్యక్తులు ద్వారా పంచాయతీ సర్పంచ్‌లు రాయించేవారు. తీర్మానాలు చేసేటప్పుడు, నిధులు వినియోగించే సమయంలో కార్యదర్శులకు రికార్డుల వ్యవహారం తెలిసేదికాదు. సర్పంచ్‌లు వారికి నచ్చిన రీతిలో తీర్మానాల రికార్డులు, నిధుల వినియోగం రికార్డులు నిర్వహించేవారు. దీంతో కార్యదర్శులు నామమత్రంగానే ఉండేవారు. తెర పైకి సమచార హక్కు చట్టం గతేడాది నుంచి మండలంలో పంచాయతీ కార్యదర్శుల సంఖ్య పెరిగింది. కొత్తగా రిక్రూట్ మెంట్‌ద్వారా వచ్చిన వారు యువకులు కావడంతో పాటు రికార్డులు రాసేందుకు ఆసక్తి ఉన్నవారు కావడంతో పంచాయతీల తీర్మానాలు రికార్డులు తామే రాస్తామని పట్టుబడుతున్నారు. పైగా ఇది వారి బాధ్యత కూడా. మరోవైపు నిధులు వినియోగానికి సంబంధించిన రికార్డుల వివరాలను ప్రజలు సమాచార హక్కు చట్టం ద్వారా అడుగుతున్నారు. ఈ వివరాలిచ్చే సమయంలో రికార్డుల్లోని అవకతవకలకు కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ భయంతోనే కార్యదర్శులు రికార్డులను తామే రాసుకుంటామని, ప్రైవేటు వ్యక్తులతో రాయించవద్దని పట్టుబడుతున్నారు. అయితే కార్యదర్శులే రికార్డులు రాస్తే తమ ఆటలు సాగవని పలు పంచాయతీలకు చెందిన సర్పంచ్‌లు ఆలోచనలో పడ్డారు. దీంతో ఆ రికార్డులును వారికి అప్పగించేందుకు ససేమిరా అంటున్నారు. ఐతే తమచేతికి రికార్డులు రాకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కార్యదర్శులు చెబుతున్నారు. -
ఇసుక దుమారం
వంగూరు: ఇసుక అక్రమ రవాణా వ్యవహారం ఇద్దరు అధికారుల మధ్య తీవ్ర దుమారం రేపుతోంది. అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న వాహనాలపై కేసులు నమోదుచేయాలని ఒకరంటే.. కుదరదని మరొకరు అంటున్నారు. ఈ ఉదంతం ఇద్దరి మధ్య కోల్డ్‌వార్‌కు దారితీసింది. వివరాల్లోకెళ్తే.. మండలంలోని దుందుబీ నది నుంచి కొనసాగుతున్న ఇసుకకు జిల్లాలోనే పేరుకుంది. ఈ అక్రమ రవాణాపై అప్పట్లో లోకాయుక్త కూడా స్పందించింది. ఇదిలాఉండగా, ఇటీవల స్థానిక అవసరాలను గుర్తించి అధికారులు అనుమతివ్వగా ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు అక్రమదందాకు తెరతీశారు. ఈ వ్యవహారంలో ఎస్ఐ నరేష్, తహశీల్దార్ సైదులు మధ్య విబేధాలు పొడచూపాయి. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లపై తక్షణమే కేసులు నమోదుచేసి కోర్టుకు పంపించాలని తహశీల్దార్ ఎస్ఐని కోరగా.. అలాచేయడం కుదరదని, నిబంధనలు మారాయని తేల్చిచెబుతున్నారు. పట్టుకున్న ట్రాక్టర్, లారీలను మైనింగ్ అధికారులకు సరెండర్ చేయడం తప్ప తమ చేతుల్లో ఏమీ లేదని అంటున్నారు. దీంతో తహశీల్దార్ నేరుగా తన సిబ్బందితో ట్రాక్టర్లను పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఐదుట్రాక్టర్లను పట్టుకోగా ఎస్ఐ కేసులు నమోదుచేయకుండా తిప్పిపంపించారు. ఈ వ్యవహారం ఏఎస్పీ, ఆర్డీఓ దృష్టికి కూడా వెళ్లింది. అధికారులు ఏమన్నారంటే.. ‘‘ వాహనాలపై కేసులు చేసి డ్రైవర్, ఓనర్లను కోర్టులో రిమాండ్ చేయాలి. గతంలో మాదిరిగానే కేసులు చేయమంటే పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతాం’’ అని తహశీల్దార్ సైదులు అన్నారు. ‘‘పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లు, లారీలను ఒకటి, రెండోసారి మైనింగ్ అధికారులకు పంపించి జరిమానా కట్టిస్తాం. మూడోసారి దొరికితే కేసులు పెడతాం. ఇటీవల కొన్ని నిబంధనలు మారాయి. అందుకోసం కేసులు చేయలేకపోతున్నాం’’ అని ఎస్ఐ నరేష్ స్పష్టంచేశారు. -
కంటి విభాగంలో కోల్డ్‌వార్..!
విజయనగరం ఆరోగ్యం :కేంద్రాస్పత్రిలోని కంటి విభాగంలో రెండు వర్గాల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఆప్తాలమిక్ అసిస్టెంట్లు, నర్సింగ్ సిబ్బందికి మధ్య కొంతకాలంగా అంతర్యుద్ధం నడుస్తున్నట్లు సమాచారం. దీంతో వీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిసింది. అయితే విచారణ చేసి న్యాయం అధికారులు పక్షపాత వైఖరితో వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల పక్షపాత ధోరణి వల్ల ఇద్దరు ఉద్యోగులు సరెండర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంటి విభాగంలో పనిచేస్తున్న ఆప్తాలమిక్ అసిస్టెంట్లపై అదే విభాగంలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది కంటి విభాగం అధికారికి, సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. అప్తాలమిక్ అసిస్టెంట్లు విధి నిర్వాహణలో తమకు సహాకరించడం లేదని, కామెంట్లు చేస్తున్నారని నర్సింగ్ సిబ్బంది ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయితే నర్సింగ్ సిబ్బంది కూడా తమను కించపరుస్తున్నట్లు ఆప్తాలమిక్ అసిస్టెంట్లు కంటి విభాగం అధికారికి, సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ రెండు ఫిర్యాదులను పరిగణలోనికి తీసుకుని విచారించాల్సిన అధికారులు ఏకపక్షంతో వ్యవహారించారనే విమర్శలు వ్యక్తమవుతున్నారు. నర్సింగ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోనికి తీసుకుని కంటి విభాగం అధికారి అప్తాలమిక్ అసిస్టెంట్ల సేవలు తమకు అవసరం లేదని వారేచోటకు బదిలీచేయడం లేదా సరెండ్ర్ చేయాలని సూపరింటెండెంట్‌కు సిఫార్సు చేసినట్టు తెలిసింది. దీంతో సూపరింటెండెంట్ అప్తాలమిక్ అసిస్టెంట్లను సరెండర్ చేయాలని సిఫార్సు చేస్తు జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి( డీసీహెచ్ఎస్), వైద్య విధాన్ పరిషత్ కమిషనర్‌కు లేఖలు రాశారు. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అయితే అప్తాలిమిక్ అసిస్టెంట్లు ఇచ్చే ఫిర్యాదును పరిగణలోకి తీసుకోకపోవడం గమనర్హాం. అధికారులు ఏకపక్షంగా వ్యవహారించడం పట్ల ఉద్యోగ సంఘాలు మండి పడుతున్నాయి. ఇదే విషయాన్ని కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు వద్ద సాక్షి ప్రస్తావించగా అప్తాలిమక్ అసిస్టెంట్లను సరెండర్ చేయాలని లేఖలు రాసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. -
టీడీపీ నేతల కోల్డ్ వార్
అనంతపురం: అనంతపురం టీడీపీ నాయకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నగరపాలక సంస్థ సమావేశం సాక్షిగా ఈ విషయం మరోసారి వెల్లడైంది. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప వర్గాల మధ్య ఆధిత్యపోరు కొనసాగుతోంది. నగరపాలక సంస్థలో రూ.13 లక్షల అవినీతిపై విచారణ జరపాలని ప్రభాకర్ చౌదరి డిమాండ్ చేయగా, రూ. 1.17 కోట్ల అక్రమాలపై నిగ్గు తేల్చాలని కార్పొరేటర్ ఉమామహేశ్వరి పట్టుబట్టారు. దీంతో సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. కాగా, అనంతపురంలో రోడ్ల విస్తరణకు ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని మేయర్ స్వరూప ఆరోపించారు. నిన్న జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభాకర్ చౌదరి హెచ్చరించారు. మేయర్ కుమ్మక్కు రాజకీయాల గురించి చంద్రబాబుకు వివరిస్తామని చెప్పారు. -
అందుకే కట్ చేశా
నటి త్రిషతో స్నేహాన్ని కట్ చేసుకోవడానికి కారణమేమిటన్న ప్రశ్నకు నటి రాయ్‌లక్ష్మి చెప్పిన బదులేమిటో తెలుసా? అసత్యాలు ఆమెకు నచ్చవట. వీరి సంగతేమిటో చూద్దాం. త్రిష, రాయ్‌లక్ష్మి ఒకప్పుడు మంచి స్నేహితులు. అలాంటి స్నేహం ఇప్పుడిద్దరి మధ్య లేదట. ఇటీవల సౌకారపేట చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాయ్‌లక్ష్మి విలేకరులతో ముచ్చటిస్తూ ప్రస్తుతం హాస్యంతో కూడిన హార్రర్ చిత్రాలకు ప్రేక్షకులు నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఈ సౌకారపేట చిత్రం ఆ కోవలోకే వస్తుందని చెప్పారు. అరణ్మణై చిత్రం తరువాత తానీ దెయ్యం ఇతివృత్తంతో కూడిన చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. మధ్యలో తానెక్కడికో పారిపోయినట్లు బోలెడు కథలల్లేస్తూ ప్రచారం చేశారన్నారు. నిజానికి నచ్చిన పాత్రలు లభించకపోవడంతో దొరికిన ఖాళీ సమయాన్ని న్యూజిల్యాండ్‌లో స్కై డైయింగ్, స్కూచ్ డైయింగ్ లాంటి క్రీడలో శిక్షణ పొందడానికి వెచ్చించానని వివరించారు. తనకు నటి త్రిష మధ్య కోల్డ్‌వార్‌కు కారణం ఏమిటని అడుగుతున్నారన్నారు. నాకు అసత్యాలాడే వారంటే నచ్చరని పేర్కొన్నారు. మొదట్లో త్రిష తాను చాలా ఫ్రెండ్లీగా ఉండేవారమని చెప్పారు. విందులు, వినోదాలకు కలిసే పాల్గొనేవారమని అలాంటి తనతో అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అయితే ఈ విషయమై తాను పూర్వాపరాల జోలికి వెళ్లదలచుకోలేదని రాయ్‌లక్ష్మి అన్నారు. వాళ్లను ఉరి తీయాలి: ఇంటర్నెట్లో తారల ఫొటోలను మార్ఫింగ్ చేసి బాత్రూమ్ సన్నివేశాలను ప్రచారం చేసే సంస్కృతి అధికం అవుతోందన్నారు. తారపై ద్వేషంతోనే కొందరు ఇలాంటి నీచ కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. తన ఫొటోలతో కూడిన బాత్రూమ్ సన్నివేశాలు ఇటీవల ఇంటర్నెట్లో హల్ చల్చేశాయన్నారు. ఇలాంటి వారిని ఊరికే వదిలేయకూడదని, ఇంకా చెప్పాలంటే బతకనీయరాదని అన్నారు. దుబాయ్‌లోని చట్టాలను తీసుకొచ్చి వారిని ఉరేయాలని రాయ్‌లక్ష్మి మండిపడ్డారు. -
సీక్రెట్ - కోల్డ్ వార్
-
మిత్రభేదం
తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపు చెక్కతో నే రెండిస్తా.. అన్నట్టు మిత్రపక్షాలుకయ్యాలాడుకుంటున్నాయి. ఎన్నికల ముందు ఉప్పలగుప్పాలాడిన బీజేపీ, టీడీపీ ఇప్పుడు నిప్పులు చెరుక్కుంటున్నాయి. మాటలే తూటాలుగా దాడులకు తెగబడుతున్నాయి. మీ చంద్రబాబు జనానికి ఇచ్చిన టోకరాలతో మేం జిల్లాలో తలెత్తుకోలేకపోతున్నామని కమలనాథులంటుంటే.. మీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే, సాధారణ బడ్జెట్లు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని తమ్ముళ్లు ఎదురుదాడికి దిగుతున్నారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :రాజకీయాల్లో మిత్రత్వం, శత్రుత్వం ఏదీ శాశ్వతం కాదు. ఒకప్పుడు తెగిడిన నోళ్లే తరువాత పొగుడుతాయి. భుజాల మీద మోసేవారే తేడా వస్తే అమాంతం కిందకు పడేస్తారు. ఇవన్నీ ప్రజలకు కొత్తకాదు. జిల్లాలో జాతీయ పార్టీ బీజేపీ, ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం క్రమంగా ప్రత్యక్షంగా పరిణమిస్తోంది. ఎన్నికల ప్రయోజనాల కోసం గత వైరాన్ని పక్కన పెట్టి బంధాన్ని కలుపుకున్న ఆ పార్టీలు ఎన్నికల అనంతరం అనుసరించిన విధానాలు స్థానిక నేతల మధ్య చిచ్చు రేపాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటినా ప్రజలను ఆకట్టుకోవడంలో విఫలం కాగా, ఆయా ప్రభుత్వాల వైఫల్యాలను ఒకరిపై ఒకరు నెట్టుకోవడానికి, ప్రజల్లో మంచి మార్కులు కొట్టేయడానికి జిల్లా నాయకులు పడుతున్న పాట్లు ఇరు పార్టీల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. ఎన్నికలకు ముందు నరేంద్రమోదీకి ప్రజల్లో ఉన్న ఆదరణను సొమ్ము చేసుకుని రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడానికే టీడీపీ తమతో జత కట్టిందని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తుండగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర ప్రజల్లో పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకుని, దాని నుంచి బయట పడడానికి, ఇక్కడ పార్టీని బలపరుచుకోవడానికి తమతో బంధమొక్కటే పరిష్కారం అని ఆలోచించుకుని బీజేపీ తమతో స్నేహ ఒప్పందం చేసుకుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. బాబు టోకరాతో గాబరా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఎన్నికల వాగ్దానాలైన రైతు, డ్వాక్రా రుణమాఫీల అమలుకు సాధ్యంకాని నిబంధనలు పెట్టి అటు రైతులకు, ఇటు మహిళలకు బాబు ఇచ్చిన టోకరాపై మిత్రపక్షమైన బీజేపీ నాయకులు స్పందిస్తూ ‘జిల్లాలో తలెత్తుకోలేని పరిస్థితి దాపురించింద’ని వ్యాఖ్యానిస్తున్నారు. అప్పటి వరకూ తమ నాయకుడు మోదీపై ప్రజల్లో ఉన్న అభిమానం కాస్తా చంద్రబాబు టోకరాతో మంటగలిసిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వృద్ధాప్య, వితంతు పింఛన్లు సైతం అర్హులకు ఇవ్వకుండా కోత విధించడం కూడా తమ నాయకుడు మోదీపై ప్రతికూల ప్రభావాన్ని ఏర్పరిచిందని, టీడీపీ నాయకుని విధానాలు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడంతోపాటు తమపై కూడా అదే వ్యతిరేకతకు దారి తీశాయని చెప్పుకొస్తున్నారు. బడ్జెట్ల సాకుగా టీడీపీ దాడి ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే, సాధారణ బడ్జెట్లు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని, నిధుల కేటాయింపులో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని టీడీపీ నాయకులు బాహాటంగానే ప్రకటనలు గుప్పించడం బీజేపీ నాయకులకు కంటగింపుగా మారింది. బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించి ఇప్పుడు మాట మార్చడం, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినప్పటికీ బడ్జెట్లో కేవలం రూ. 100 కోట్లు మాత్రమే విదల్చడం కూడా టీడీపీ నాయకులకు అవకాశంగా దొరికింది. మిత్రపక్షమైనప్పటికీ బడ్జెట్లో అన్యాయం చేసిందని ప్రకటనలు గుప్పిస్తూ తమను ఎన్నుకున్న ప్రజల్లో మంచితనాన్ని మూటగట్టుకోవడానికి, సానుభూతి సంపాదించుకోవడానికి టీడీపీ నేతలు వినియోగించుకున్నారు. కాగా జిల్లాలోని బీజేపీ నాయకుల్లో కొందరు బడ్జెట్‌పై పెదవి విరవడం, నో కామెంట్ అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించడం వారికి మరింత ఊతమిచ్చింది. ఐతే టీడీపీ నాయకుల ప్రకటనల దాడిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాస వర్మ తిప్పి కొట్టారు. తమ పార్టీని గాని, తమ నాయకుడిని గానీ విమర్శించే నైతిక అర్హత టీడీపీ నాయకులకు లేదని ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానన్న బాబు కనీసం రాజధాని నిర్మాణం విషయంలో ఇప్పటికీ భూసేకరణ చేయలేకపోవడం వైఫల్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నాయకులు గురువింద గింజ చందంగా వారి నాయకుడు బాబు కింద ఉన్న మచ్చను చూడకుండా మోదీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. -
కిరణ్ బేడీ.. సీఎం అభ్యర్థా?
-
కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారు?
భోపాల్: ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని బీజేపీ ప్రకటించడంపై ఆ పార్టీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ తీవ్ర అసంతృప్తితో ఉంది. నిన్న కాక మొన్న పార్టీలో చేరిన కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్... బీజేపీ అగ్రనేతలను ప్రశ్నించినట్లు సమాచారం. ఇది మంచి పరిణామం కాదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. బీజేపీలోని ఓ వర్గం కావాలనే కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారని మోహన్ భగవత్ ఆరోపించినట్లు సమాచారం. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉండగా... కిరణ్ బేడీ సీఎం అభ్యర్థి అంటూ ఎందుకు ప్రచారంలోకి వచ్చిందని సదరు నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది. మోహన్ భగవత్ అసంతృప్తిపై కమలనాథులు ఒకింత ఉలిక్కిపడ్డారు. దాంతో బీజేపీ అగ్రనేతలు వెంటనే రంగంలోకి దిగారు. ఈ అంశంపై మోహన్ భగవత్ తో చర్చించేందుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆగమేఘాలపై శుక్రవారం ఉదయం నాగపూర్ వెళ్లేరు. కాగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కిరణ్ బేడీ గురువారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. -
ఛార్మి, ఇలియానా మధ్య కోల్డ్ వార్!
ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్స్ ఛార్మి, ఇలియానా మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. మేకప్ లేకుండా ఇలియానాను అసలు చూడలేమంటూ ఛార్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హల్చల్ చేస్తున్నాయి. ఇంతకి అసలు విషయం ఏమిటంటే... ఓ ప్రయివేట్ ఛానల్ కార్యక్రమంలో ఛార్మి పాల్గొంది. అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆమె టకటకా సమాధానం చెప్పాలి. ఈ సందర్భంగా ఎక్కడికెళ్లినా మేకప్ కిట్ వెంట తీసుకు వెళ్లాల్సిన హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నకు ఛార్మి తడుముకోకుండా ఇలియానా పేరు చెప్పేసింది. మీరెప్పుడైనా ఇలియానాని మేకప్ లేకుండా చూశారా.. చూస్తే కనుక మేకప్ కిట్ దగ్గరే ఉంచుకోమని చెబుతారంటూ సెటైర్ వేసింది. వీరిద్దరూ గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'రాఖీ' చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఇద్దరు హీరోయిన్లకు....ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో సరైన అవకాశాలు లేవనే చెప్పుకోవాలి. ఇలియానా బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంటే...ఛార్మి .. టాలీవుడ్లో అడపాదడపా వచ్చే అవకాశాలతో సరిపెట్టుకుంటోంది. మరి ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఎలాంటి పోటీ లేకుండా ఛార్మి ఒక్కసారిగా...ఇలియానాను అలా ఎలా అనేసిందబ్బా!