సాక్షి ప్రతినిధి, కడప: రోడ్లు భవనాలశాఖలో కోల్డ్‌వార్ నడుస్తోంది. క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈగా ఉన్న వివేకానందరెడ్డిని అర్ధాంతరంగా బదిలీ చేశారు. ఆ స్థానంలో ఇటీవల హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లిన రెగ్యులర్ ఎస్‌ఈ మనోహర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమేరకు మంగళవారం ఆర్‌అండ్‌బి కడప క్వాలిటీ కంట్రోలర్ ఎస్‌ఈగా బాధ్యతలు చేపట్టారు.
అక్రమ ఉత్తర్వులంటూ ఇదివరకే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న వివేకానందరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఓ ఏ నెంబర్ 3511 ఆఫ్ 2015 ద్వారా వివేకానందరెడ్డి ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులపై స్టేటస్‌కో ఆర్డర్ జారీ చేస్తూ, మునుపటి ఎస్‌ఈ వివేకానందరెడ్డిని కొనసాగించాలని ఆదేశించింది. ఆమేరకు హైకోర్టు ఉత్తర్వులను కొనసాగించకపోతే, కోర్టుధిక్కారం అవుతుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతకొంత కాలంగా అంతర్గతంగా నడుస్తున్న కోల్డ్‌వార్ బహిర్గతం కావడంతో ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశమైంది.
ఆర్ అండ్ బీలో కోల్డ్‌వార్!
Published Thu, Jul 9 2015 3:33 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement