vivekananda reddy
-
నర్రెడ్డి నాటకాలు చాలు
-
వివేకా కేసులో సంచలన నిజాలు బయటపడ్డ సునీత అబద్దాలు
-
మర్డర్ చేసిన దస్తగిరి అరెస్ట్ కాకపోవడానికి కారణం ఇదే..!
-
దస్తగిరితో చంద్రబాబే పిటిషన్ వేయించారు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్‌గా మారిన కిరాయి హంతకుడు దస్తగిరి పిటిషన్ వేయడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు దస్తగిరితో ఈ పిటిషన్ దాఖలు చేయించారని చెప్పారు. ఓ పక్క కేసు విచారణ సాగుతుండగా.. కడప నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, వైఎస్ వివేకా కూతురు.. ఇద్దరూ అవినాశ్‌ను హంతకుడిగా చిత్రీకరించేందుకు శత విధాలా ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. అవినాశ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఇదే కేసులో నిందుతుడు (ఏ–4) దస్తగిరి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. అవినాశ్‌రెడ్డి తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలను సమర్థిస్తూ సీబీఐ, సునీత తరఫు న్యాయవాదులు వాదించారు. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. వారివి సంబంధం లేని వాదనలు సీబీఐ, సునీత తరఫు న్యాయవాదుల వాదనలు ఎంత మాత్రం సమర్థనీయం కాదని నిరంజన్ రెడ్డి చెప్పారు. ‘చట్టవిరుద్ధంగా అవినాశ్‌కు బెయిల్ ఇచ్చారని చెప్పడం ఈ వాదనలతో సంబంధంలేని అంశం. ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కోర్టు అవినాశ్‌కు బెయిల్ ఇచ్చిన తర్వాత వాటిని ఆయన ఉల్లంఘించారా లేదా అన్న దానిపైనే వాదనలు సాగాలి. ఓ సీనియర్ న్యాయవాది, మరో పీపీ అనవసర వాదనంతా వినిపించారు. న్యాయస్థానం అవినాశ్‌కు విధించిన షరతుల్లో దేన్నీ ఆయన ఉల్లంఘించలేదు. కనీ వినీ ఎరుగని విధంగా బాధితులం అని చెప్పుకుంటున్న వారు అప్రూవర్‌తో కలసి నడుస్తున్నారు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఇష్టం వచ్చినట్లు అప్రూవర్‌ను ప్రకటించకూడదని సుప్రీంకోర్టు హెచ్చరించినా.. దర్యాప్తు సంస్థే అతన్ని వెనుకేసుకుని వస్తోంది. వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, కిరాయి హంతకుడు దస్తగిరి కూడా చంద్రబాబు చెబుతున్నట్లు వ్యవహరిస్తున్నారు. వివేకాకు రెండో భార్య ఉందని, ఆమెతో కలిగిన కుమారుడికి, సునీతకు ఆస్తి తగాదాలు ఉన్నాయన్నది వాస్తవం. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయడంలేదు. వివేకాను నరికానని చెబుతున్న వ్యక్తికే సునీత మద్దతుగా నిలవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతని బెయిల్‌ను రద్దు చేయాలని ఆమె కోరలేదు. ఎవరు ఏ పిటిషన్ వేసినా ఇంప్లీడ్ అవుతూ అవినాశ్‌ను ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని ఆమె విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సీబీఐ, సునీత, కిరాయి హంతుకుడు ఒకే బాటలో సాగుతూ అవినాశ్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో దస్తగిరి పిటిషన్ ‘ఇక్కడ దస్తగిరి తండ్రిపై దాడి చేశారని, జైలులో దస్తగిరిని చైతన్యరెడ్డి కలిశారని రెండు ఆరోపణలు చేస్తున్నారు. వీటికి ఒక్క ఆధారమూ లేదు. ఆరోగ్య శిబిరం నిర్వహించిన రోజు చైతన్యరెడ్డితో పాటు పదుల సంఖ్యలో వైద్యులు అక్కడికి వెళ్లారు. జైలు అధికారులంతా వారి వెంట ఉన్నారు. దస్తగిరిని చైతన్యరెడ్డి కలవడం అనేది అసాధ్యం అని జైలు అధికారులు చెబుతున్నారు. చైతన్యరెడ్డి జైలుకు రూ.20 కోట్లు తీసుకొచ్చాడని దస్తగిరి ఆరోపిస్తున్నారు. అంత మంది ఉండగా, అంత పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లడం సాధ్యం అవుతుందా? దీనికి, అవినాశ్‌కు ఏమిటి సంబంధం? అలాగే శివరాత్రి సందర్భంగా నామాల గుండు వద్ద దస్తగిరి తండ్రిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, ఎన్నికల్లో దస్తగిరి పోటీ చేయకూడదని బెదిరించారన్నది ఆరోపణ. ఈ కేసుకూ అవినాశ్‌కు సంబంధం ఏమిటో కూడా ఆధారం లేదు. విచిత్రమేమిటంటే.. తనపై దాడి జరిగిందని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేయలేదు. కుమారుడు దస్తగిరి ఒకరోజు తర్వాత చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లోనూ అవినాశ్ ప్రస్తావన లేదు. రోడ్డు ప్రమాదం కారణంగా దస్తగిరి తండ్రికి, యువకులకు మధ్య వివాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నారు. ఇది సమర్థనీయం కాదు. దస్తగిరి పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఊసరవెల్లి.. షర్మిలను సీఎం జగన్‌పై ప్రయోగించిన కుటిలనేత
అధికారంకోసం అడ్డదారులు తొక్కడం... అవసరమైతే అడ్డు తొలగించుకునేందుకు కూడా వెనుకాడకపోవడం... రోజుకో ఎత్తు గడతో నాలుక మడతేసేయడం... బద్ధ శత్రువులతోనైనా ఇట్టే జతకట్టేయడం... మరో అడుగు ముందుకేసి ఏకంగా కుటుంబాల్ని చీల్చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎంతటి వ్యక్తులనైనా బోల్తాకొట్టించగల సమర్థుడాయన. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక అన్ని పార్టీలను ఏకం చేసేందుకు నానా పాట్లు పడ్డారు. అంతేనా...మరో అడుగు ముందుకేసి ఆయన సోదరినే పావుగా వాడుకున్నాడు. అదీ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఏకంగా అన్నా... చెల్లెళ్లిద్దరూ కలసి నాటక మాడుతున్నారంటూ కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధికారంకోసం ఎంతకైనా తెగించగలిగిన టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న తీరును జనం సైతం ఛీకొడుతున్నారు. సాక్షి, అమరావతి: రాజకీయంలో ఎలాంటి కుట్రలకైనా వెరవకూడదనీ.. అబద్ధాలు అలవోకగా ఆడేయొచ్చని.. ఎలాంటి విషయాన్నైనా తనకు అనుకూలంగా మలచుకోవచ్చని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని అ్రస్తాలను ఎక్కుపెట్టారు. ఘోర పరాజయం నుంచి తప్పించుకుని, రాజకీయంగా ఉనికి చాటుకోవడానికి చివరి ప్రయత్నంగా మహానేత వైఎస్ కుటుంబాన్ని చీల్చి.. సీఎం జగన్‌పై సోదరి షర్మిలను ప్రయోగించారు. సోదరికే న్యాయం చేయలేని వాడు రాష్ట్రానికి ఏం చేయగలరని ఇన్నాళ్లూ ఆరోపిస్తూ వచ్చిన చంద్రబాబే.. ఆమెకు జనస్పందన లభించకపోవడం, తాను అనుకున్న ప్రయోజనాలు లభించే అవకాశాలు కన్పించకపోవడంతో మరోసారి మాట మార్చారు. శనివారం పెదకూరపాడులో నిర్వహించిన ప్రజాగళం సభలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. కుమారుడికి ఏపీ, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చానని ఒక తల్లి చెప్పిందని.. ఆ తల్లి తన ఇద్దరు పిల్లలకే న్యాయం చేయలేదు, రాష్ట్రానికి ఏం చేస్తారని ఇప్పుడు కొత్తగా ప్రశ్నించారు. అంతేగాదు... పిల్ల కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి కాంగ్రెస్ నాటకం ఆడుతోందంటూ ఆరోపించారు. ఎన్డీయేకు పడే ఓట్లు చీల్చాలని నాటకం ఆడుతున్నారని మరో ప్రచారానికి దిగారు. దీనిని బట్టి ఆయన రంగులు మార్చడంలో ఊసరవెల్లికి కూడా మించిపోతారని రాజకీయ విశ్లేషకులు వ్యంగోక్తులు విసురుతున్నారు. పావులా మారిన షర్మిల తెలంగాణలో 2021 జూలై 8న వైఎస్సార్సీపీని షర్మిల స్థాపించారు. తన బతుకైనా చావైనా తెలంగాణలోనేని ఆమె అప్పట్లో ప్రతిజæ్ఞ చేశారు. కానీ.. గతేడాది చివర్లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా అస్త్రసన్యాసం చేసి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నది జగమెరిగిన సత్యం. ఇందుకోసం కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌తో బెంగళూరు విమానాశ్రయం సాక్షిగా మంతనాలు జరిపి ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు కట్టబెట్టేందుకు ప్రణాళిక రచించారు. బీజేపీలోని తన ఏజెంట్, ప్రస్తుతం అనకాపల్లి లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ ద్వారా కాంగ్రెస్‌కు ఇం‘ధనం’ చేకూర్చి.. తన శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా కథ మొత్తం నడిపించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరేందుకు ఢిల్లీ వెళ్లినప్పుడు.. పీసీసీ చీఫ్ పదవి దక్కించుకున్నాక ఢిల్లీ, కడప తదితర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్లలోనే ప్రయాణించారు.ఇప్పటికీ సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్‌లో షర్మిల ప్రయాణాలు చేస్తుంటే.. ఆమె భర్త అనిల్ టీడీపీ నేతలు బీటెక్ రవి, దేవగుడి నారాయణరెడ్డి తదితరులతో సమావేశమవుతున్నారు. షర్మిలను సీఎం జగన్‌పై ఉసిగొలిపి.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లను చీల్చడం ద్వారా రాజకీయ ఉనికి చాటుకోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. ఆ ప్రయోగం విఫలమై ఇప్పుడు కొత్త పాచిక చంద్రబాబు, ఎల్లో పత్రికలు సీఎం జగన్‌పై చిమ్ముతున్న విషాన్నే పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి షర్మిల చేత వల్లెవేయించారు. మరో అడుగు ముందుకేసి కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలో నిలిచేలా చక్రం తిప్పారు. షర్మిలకు తోడుగా వివేకా కూతరు సునీతను రంగంలోకి దించారు. వారిద్దరి ద్వారా వివేకా హత్యపై దుష్ప్రచారం చేయించి.. దాన్ని అస్త్రంగా మార్చుకుని లబ్ధి పొందాలన్నది చంద్రబాబు పాచిక. కానీ.. వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాలే ఆయన హత్యకు దారితీశాయని ఉమ్మడి కడప జిల్లా ప్రజలు బలంగా నమ్ముతున్నందున కడప లోక్‌సభ స్థానం పరిధిలో షర్మిల చేస్తున్న బస్సు యాత్రకు ప్రజాస్పందన కన్పించలేదు. తాను అనుకున్న ప్రయోజనం లభించకపోవడంతో చంద్రబాబు తన నిజస్వరూపాన్ని మరో సారి బయటపెట్టుకున్నారు. ఇప్పుడు షర్మిలపైనా నిందలు మొదలుపెట్టేశారు. వారిద్దరూ కలసి ఎనీ్టయే ఓట్లు చీల్చేందుకు కుట్ర పన్నుతున్నారంటూ కొత్త పల్లవి ఎత్తుకుని తన సహజ నైజాన్ని చాటుకుంటున్నారు. అధికారంకోసం జిత్తులమారి ఎత్తులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99% అమలు చేసి.. ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే.. మరోవైపు అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్ రాబోయే ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించడం ఖాయమని దాదాపు అన్ని సర్వేల్లోనూ స్పష్టమైంది. అలాంటి వ్యక్తిని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేని చంద్రబాబు జనసేన, బీజేపీతో జతకలిశారు. మరో వైపు వివేకానందరెడ్డి కూతురు సునీతను చేరదీశారు. వివేకా హత్యపై సునీతతో దుష్ప్రచారం చేయిస్తూ.. రాజకీయంగా లబ్ధి పొందాలని భావించారు. అంతేగాకుండా జగన్ సోదరి షర్మిలను వాడుకునేందుకు కొత్త ప్రణాళికను అమలు పర్చారు. -
Watch: తండ్రి హత్య కేసులో కూతురు చెప్పని నిజాలు!
-
దస్తగిరి చెప్పేవన్ని అబద్ధాలే
పులివెందుల: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి చెప్పేవన్ని పూర్తి అవాస్తవాలని.. హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న సునీల్‌యాదవ్ సమీప బంధువు భరత్‌యాదవ్ స్పష్టంచేశారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని చెబుతూ రౌడీయిజం, గూండాయిజం, సెటిల్మెంట్లు ఎలా చేస్తున్నాడని ప్రశ్నించారు. అతను చేసిన దుర్మార్గపు పనిని గొప్పగా చెప్పుకుంటూ సమాజంలో రౌడీయిజంతో హల్చల్ చేస్తున్నాడన్నారు. ఉన్నతమైన వ్యక్తులను టార్గెట్ చేస్తూ అబద్ధపు మాటలతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. నిజాన్ని కప్పిపుచ్చి దస్తగిరితో వెనుక ఉండి ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసునన్నారు. గతంలో సునీల్‌యాదవ్, దస్తగిరిలు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో తనను సంప్రదించేవారని.. అప్పట్లో ఐస్ బండి వ్యాపారం చేస్తూ అప్పులతో ఉన్న దస్తగిరి ఇప్పుడు విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నాడని భరత్‌యాదవ్ ప్రశ్నించారు. తనకు కూడా డబ్బులు బాకీ ఉన్న దస్తగిరి తననూ దూషించాడన్నారు. వివేకా రెండో భార్య అయిన షమీమ్‌కు ఆస్తి పోతుందనే ఈ హత్య జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. ఈ హత్యలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కీలకపాత్ర పోషించాడన్నారు. అతను వెనుక ఉండి ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరిల ద్వారా హత్య చేయించాడన్నారు. ఎర్రగంగిరెడ్డి నోరువిప్పితే అసలు విషయాలు వెల్లడి.. ఈ హత్యలో ఎర్రగంగిరెడ్డి నోరు విప్పితే పూర్తి విషయాలు బయటపడతాయని భరత్‌యాదవ్ చెప్పారు. తనకు సునీల్‌యాదవ్ రూ.16 లక్షలు ఇవ్వాలని, అప్పట్లో తాను డబ్బుల విషయం అడిగితే రాజశేఖర్ సార్ ఇవ్వాలని, డబ్బులు వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పేవాడన్నారు. అలాగే, డబ్బుల విషయమై ఒకసారి ఎర్రగంగిరెడ్డి కూడా నీకు రావాల్సిన డబ్బులు ఎక్కడికీ పోవు, త్వరలోనే వస్తాయని తనతో చెప్పేవాడన్నారు. దస్తగిరి, దస్తగిరి భార్య ఎవరితో మాట్లాడుతున్నారో వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భరత్‌యాదవ్ అభిప్రాయపడ్డారు. అసలు సునీతమ్మ తన తండ్రిని చంపిన దస్తగిరి కోసం ఎందుకు ఆరాటపడుతోందో ఆమెకే తెలియాలన్నారు. గతంలో తనను సీబీఐ ఎంక్వైరీకి పిలిచినప్పుడు అన్ని విషయాలు వారికి తెలిపానని, అయినా కూడా వారు తాను చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఎర్రగంగిరెడ్డి నోరువిప్పితే ఈ కేసులో నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి పాత్ర బయటపడుతుందని భరత్‌యాదవ్ స్పష్టంచేశారు. -
‘దస్తగిరి వెనుక సునీత, ఆమె భర్త ఉన్నారు’
వైఎస్సార్ జిల్లా: మాజీ మంత్రి వైఎస్ వివేకాను హత్య చేశానని దస్తగిరి ఒప్పుకున్నాడని భరత్ యాదవ్ తెలిపారు. వివేకా కేసులో జైలులో ఉంటున్న గంగిరెడ్డి నోరు విప్పితే కేసు చిక్కుముడి వీడుతుంది అని భరత్ యాదవ్ స్పష్టం చేశారు. కాగా, భరత్ యాదవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పుడు దస్తగిరి వైఎస్ కుటుంబంపై బురదజల్లుతున్నాడు. దస్తగిరి వెనుక ఎవరుండి మాట్లాడిస్తున్నారు?. ఇది వరకు.. ఇప్పుడు దస్తగిరి ఆర్థిక పరిస్దితి ఎంటీ?. సునీత ఇంట్లో పని మనిషి బీబీ అనే మహిళ ద్వారా దస్తగిరితో సునీత మాట్లాడుతుంది. డబ్బు కూడా అమె ద్వారానే దస్తగిరికి అందుతోంది. అందుకే సునీత మాట్లాడమన్నట్లు దస్తగిరి మాట్లాడుతున్నాడు. దస్తగిరికి ప్రాణహానీ ఉన్నప్పుడు.. వంట మనిషి బీబీ ద్వారా ప్రాణహానీ ఎందుకు ఉండదు. ఎన్నికల్లో పోటీ చేస్తాను అనేంత డబ్బు ఎలా వస్తుంది?. ఐస్ బండి నడిపే దస్తగిరికి ఇంత డబ్బు ఎలా వచ్చింది?. ఖచ్చితంగా దస్తగిరి వెనక సునీత, అమె భర్త రాజశేఖర్ ఉండి మాట్లాడిస్తున్నారు. వైఎస్ వివేకా రెండవ భార్యకు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఆయన చంపించారు. వైఎస్ వివేకాను హత్య చేసింది దస్తగిరి, సునీల్ యాదవ్, గంగిరెడ్డి. వైఎస్ వివేకా హత్య తర్వాత దస్తగిరి, సునీల్, ఎర్ర గంగిరెడ్డి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి నుంచి డబ్బు రావాలి అని ఎర్ర గంగిరెడ్డి చెప్పేవారు. జైలులో ఉంటున్న గంగిరెడ్డి నోరు విప్పితే కేసు చిక్కుముడి వీడుతుంది’ కీలక వ్యాఖ్యలు చేశారు. -
నిజాలు దాచి దర్యాప్తా?
సాక్షి, పులివెందుల: ‘అత్యున్నత స్థాయి విచారణ సంస్థ దిగజారి ప్రవర్తిస్తోంది. కీలక అంశాలను మరుగు పరుస్తూ, సిల్లీ అంశాల ఆధారంగా విచారణ చేస్తోంది. పర్సన్ టార్గెట్ ఇన్వెస్టిగేషన్ కాదు.. ఫ్యాక్ట్ టార్గెట్ ఇన్వెస్టిగేషన్ చేయాలని సీబీఐ డైరెక్టర్, డీఐజీ, కొత్తగా నియమితులైన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను కలిసి అభ్యర్థించినా ఆ దిశగా కనీస విచారణ చేపట్టలేదు’ అని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఆదివారం పులివెందులలో ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. తన తండ్రిని ఊహించని విధంగా అరెస్టు చేశారని, మాటలు రానంత బాధగా ఉందన్నారు. వ్యతిరేక శక్తులు, వ్యతిరేక మీడియాతో పోరాటం చేయడంలో నిజాయితీ నిరూపించుకోవడం సవాల్‌గా నిలుస్తోందని చెప్పారు. సీబీఐ కీలక అంశాలను డౌన్‌ప్లే చేసి, సిల్లీ అంశాల ఆధారంగా ఎందుకు విచారణ కొనసాగిస్తోందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుపటి అధికారి చేసిన రోల్ కంటిన్యూ చేయడం మినహా విచారణలో ప్ర«ధాన కోణం వెలుగు చూడడం లేదన్నారు. ఇలా అవినాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడిన కొద్ది గంటలకే సోమవారం మరోమారు విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు ఇవ్వడం గమనార్హం. అవినాష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడిన అంశాలు ఇంకా ఇలా ఉన్నాయి. డెత్ నోట్ దాచి పెట్టింది అల్లుడే.. ♦వైఎస్ వివేకానందరెడ్డిది హత్య అని తెలిసీ, డెత్ నోట్ చదివి వినిపించిన పీఏ కృష్ణారెడ్డితో దానిని ఎవరికీ చూపించకుండా దాచి పెట్టమని అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆదేశించారు. ఆ మేరకు కృష్ణారెడ్డి ఆయన చెప్పినట్లే చేశారు. వాస్తవాలు చెప్పకుండా ఘటనా స్థలం వద్దకు నన్ను వెళ్లమని నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి ఫోన్లో కోరారు. ♦నేను అక్కడికి వెళ్లి చూశాక ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చాను. హత్య విషయం నా కంటే గంట ముందుగా వివేకా అల్లుడికి తెలుసు. పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన ఆయన విషయాన్ని దాచారు. వివేకా హత్య విషయాన్ని ముందుగా పోలీసులకు తెలిపింది నేనే. సీఐ శంకరయ్యకు స్వయంగా మూడు సార్లు ఫోన్ చేశాను. 35 నిమిషాల తర్వాత సీఐ వచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన నన్నే దోషిగా చూపిస్తున్నారు. ♦ఆ రోజు జమ్మలమడుగుకు వెళ్తున్న నాకు ఫోన్ రావడంతో కృష్ణాలయం సమీపం నుంచి వెనుతిరిగి వచ్చాను. నేనొక్కడినే కాకుండా, నాతో పాటు నాలుగు వాహనాలు ఉన్నాయి. మీరు చెబుతున్న గూగుల్ టేకౌట్ ద్వారా పరిశీలించుకోండి. వాస్తవమో కాదో తెలుస్తుంది. డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి.. ♦ఏ–4 దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన స్టేట్మెంట్లో వివేకా హత్య అనంతరం స్టాంప్డ్ డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాతే ఇంట్లో నుంచి బయటికి వచ్చినట్లు చెప్పాడు. దీనిని బట్టి డాక్యుమెంట్లు దొంగిలించారని స్పష్టం అవుతోంది. అలాంటప్పుడు దొంగతనానికి చెందిన సెక్షన్లు సీబీఐ ఎందుకు పెట్టలేదు? ♦తన ఐడియా ప్రకారమే డెత్‌నోట్‌లో డ్రైవర్ ప్రసాద్ పేరు రాయించానని దస్తగిరి చెబుతున్నాడు. దస్తగిరి చంపి, సంబంధం లేని వారిపై ఆరోపణలు చేస్తున్నాడు. ఆ మేరకు ఉన్న ఐపీసీ సెక్షన్లు ఎందుకు పెట్టలేదు? మరోవైపు వాచ్మెన్ రంగన్న స్టేట్మెంట్లో హత్యలో పాల్గొన్న నలుగురి పేర్లతో సహా చెబుతారు. అయినా నిందితుల్లో ఒకరిని సాక్షిగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇవన్నీ చూస్తే కలిసికట్టుగా పద్ధతి ప్రకారం విచారణ సాగుతోందని అర్థమవుతోంది. ♦ఏప్రిల్ 3న రిజిస్టర్ పోస్టు ద్వారా సీబీఐ డైరెక్టర్, డీఐజీ, ప్రస్తుత ఐఓకు పలు వివరాలు ఆధారాలతో పంపించాను. 5వ తేదీ మనిషి ద్వారా కూడా వారికి చేర్చాను. ఏమాత్రం మార్పు లేదు. బెంగళూరు సెటిల్మెంట్లో రూ.8 కోట్లు రావాల్సి ఉండగా, ఆ డబ్బులో సగం ఇవ్వాలని డిమాండ్ చేసిన తర్వాత జరిగిన ఘర్షణలో చంపినట్లు దస్తగిరి చెబుతాడు. ♦వాస్తవంలో అవి ఫేక్ డాక్యుమెంట్లు అని తేలిపోయింది. అసలే రాని, లేని డబ్బు కోసం గొడవ జరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలను ఎందుకు సీబీఐ ఛేదించడం లేదు? డాక్యుమెంట్లు తీసుకెళ్లామని దస్తగిరి చెబుతున్నాడు.. ఆ డాక్యుమెంట్లను ఎందుకు రికవరీ చేయలేదు? అందులో ఏముంది? అన్న విషయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. సునీతక్క వర్షన్ సడన్‌గా మారింది ♦ 2019 మార్చి 15న హత్య జరిగితే, టీడీపీ నేతల ఆరోపణల నేపథ్యంలో వైఎస్ కుటుంబం ఔన్నత్యాన్ని సునీతక్క స్పష్టంగా వివరించింది. సీఎంగా వైఎస్ జగనన్నను, ఎంపీగా నన్ను చేసుకోవాలని కొద్ది నెలలుగా వైఎస్ వివేకానందరెడ్డి తపన పడ్డారని ఆమె స్పష్టంగా తెలిపింది. ఒక సంవత్సరం వరకూ బాగా మాట్లాడేది. ఎర్రగంగిరెడ్డి వైఖరిపై నా అభిప్రాయం కూడా కోరింది. చెప్పాను. సడన్‌గా వైఖరి మార్చుకొని ఢిల్లీకి వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలు చేసింది. కారణమేంటో సునీతక్కే చెప్పాలి. ♦హత్యలో స్వయంగా పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి ముందస్తు బెయిల్ కోసం సీబీఐ నో అబ్జక్షన్ చెబుతోంది. రెండేళ్లుగా కోర్టులో ఎవరు బెయిల్ పిటిషన్ వేసినా ఇంప్లీడ్ అయ్యే సునీతమ్మ, దస్తగిరి ముందస్తు బెయిల్‌కు మాత్రం అభ్యంతరం చెప్పరు. ఆ తర్వాత అప్రూవర్ అనే అబద్ధాల కట్టడం వెలుగులోకి వచ్చింది. ♦అప్రూవర్‌గా మారితే కేసు విచారణ పూర్తయ్యే వరకు లోపల ఉండాల్సి వస్తుంది కాబట్టి ముందస్తు బెయిల్‌కు అభ్యంతరం చెప్పడం లేదు. అటు సీబీఐ, ఇటు సునీతమ్మ కలిసికట్టుగా ప్రణాళిక బద్ధంగా కేసును పక్కదాది పట్టిస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతోంది. మేము ఏ తప్పూ చేయలేదు ♦మా నాన్న 40 ఏళ్లుగా మీ అందరికీ తెలుసు. మా మనస్తత్వాలు తెలుసు. నా నిజాయితే నన్ను గెలిపిస్తోంది. వివేకం సార్ హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మేము ఇసుమంతైనా తప్పు చేయలేదు. ఎల్లో మీడియా విష ప్రచారాలను నమ్మొద్దు. ♦2009 నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. తొలుత లింగాల మండలం ఇన్ఛార్జిగా పని చేశా. పదేళ్లుగా నేనేంటో అందరికీ తెలుసు. ఈ 3650 రోజుల్లో 1500 రోజులు ఉదయ్‌కుమార్‌రెడ్డి నాతో కలిసి ఉంటాడు. కానీ ఆ రోజు ఉదయమే వచ్చినట్లు చెబుతున్నారు. ఇంకో విషయం.. థర్డ్ పర్సన్ ఫోన్ కోసం నేను వెయిట్ చేసినట్లు మరో విషయాన్ని చెబుతున్నారు. అదే వాస్తవమైతే నేనే అక్కడికి ఎవర్నో పంపించి ఫోన్ చేయించుకునే వాడిని కదా.. చాలా సిల్లీ థింగ్స్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. ♦విచారణలో సీబీఐ కీలక విషయాలను వదిలేసింది. అప్రూవర్ అనే అబద్దాల కట్టడం కోర్టులో నిలిచే అవకాశమే లేదు. మాకు పదవులపై వ్యామోహం లేదు. న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. వ్యవస్థలపై గౌరవం ఉంది. న్యాయం కోసం పోరాటం చేస్తాం. వ్యక్తి టార్గెట్‌గా చేస్తున్న విచారణలో తుదకు న్యాయమే గెలుస్తుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు సాక్షి ప్రతినిధి కడప : కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుమార్లు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో మరోసారి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. -
విచారణలో సీబీఐ కీలక విషయాలను వదిలేసింది: అవినాష్ రెడ్డి
సాక్షి, పులివెందుల: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. పులివెందులలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. ఇక, భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. ‘భాస్కర్‌రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేయించారు. ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటాం. మేం చెప్పిన అంశాలను సీబీఐ పరిశీలించలేదు. లెటర్ దాచిపెట్టామని వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి చెప్పారు. హత్య విషయం నా కంటే గంట ముందు వివేకా అల్లుడికి తెలుసు. కీలక అంశాలను సీబీఐ విస్మరిస్తోంది. వివేకా హత్య విషయాన్ని ముందుగా పోలీసులకు చెప్పింది నేనే. పోలీసులకు సమాచారం ఇచ్చిన నన్నే దోషిగా చూపిస్తున్నారు. నేను గాలి మాటలు.. గాలి కబుర్లు చెప్పడం లేదు. సాక్షులు చెప్పిన స్టేట్మెంట్ల ఆధారంగానే చెబుతున్నాను. చదవండి: వివేకా హత్య కేసులో ఈ విషయాలు ఎందుకు పరిశీలించలేదు? సీబీఐ నమ్ముకున్న దస్తగిరి స్టేట్మెంట్లోనే అనేక కీలక అంశాలున్నాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. డాక్యుమెంట్లు చోరి కాబడ్డ ఏ4పై ఎందుకు కేసు నమోదు కాలేదు. ఏ4కి ఎందుకు ఇంత రిలీఫ్ ఇస్తున్నారు. కలిసికట్టుగా ఎవరిపైనో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్రూవర్‌గా మార్చేందుకు యాంటిసిపేటరీ బెయిల్ వేయించారు. అప్రూవర్‌కు సహకరించి సీబీఐ బెయిల్ ఇప్పించింది. వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరుతున్నాను. ఏప్రిల్ 3న మా అభ్యంతరాలను సీబీఐ దృష్టికి తీసుకెళ్లాం అని అన్నారు. చదవండి: రెండో వివాహంతోనే కుటుంబంలో తీవ్ర విభేదాలు! పోలీసులు రావొద్దని నేను చెప్పాననడం దారుణం. పాత అధికారి చేసిన విచారణనే కొత్త బృందం ఫాలో అవుతోంది. వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరుతున్నాను. రెండో భార్యకు ఆస్తి రాసివ్వాలని వివేకా అనుకున్నారు. స్టాంపు పేపర్లు పోతే సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయలేదు. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత స్టాంప్ పేపర్ల పరిశీలన, దొంగతనం జరిగింది. చోరీ కేసు ఎందుకు పెట్టలేదు.. ఆ దిశగా ఎందుకు విచారించలేదు?. సునీత, సీబీఐ ఒక లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నాయి. వివేకా.. షేక్ మహ్మద్ అక్బర్‌గా 2010లో పేరు మార్చుకున్నారు. వివేకాకు పెహన్ షా అనే కుమారుడు ఉన్నాడు. వివేకా రాసిన లెటర్ అక్కడే ఉంది. లెటర్ దాచిపెట్టామని వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి చెప్పారు. విచారణలో సీబీఐ కీలక విషయాలను వదిలేసింది. మాకు పదవులపై వ్యామోహం లేదు. వ్యవస్థలు, న్యాయస్థానాలపై మాకు గౌరవం ఉంది. చివరకు నిజాయితీయే గెలుస్తుంది’ అని తెలిపారు. చదవండి: భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ స్థానికుల ర్యాలీ -
Political Fact Check: వివేకా హత్య కేసులో పుకార్లేంటీ? నిజాలేంటీ?
తెలుగుదేశం క్యాంపు, ఎల్లో మీడియా తనకు అచ్చొచ్చిన గోబెల్స్ ప్రచారాన్ని వివేకా హత్య కేసుకు రుద్ది రాజకీయ లబ్ది కోసం వెంపర్లాడుతున్నట్టు తెలుస్తోంది. పదే పదే అబద్దాలను ప్రచారం చేసి దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయడానికి తెగ ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. హత్య జరగడం మొదలు.. ఇప్పటివరకు ప్రతీ అంశాన్ని అనుకూలంగా మార్చుకునే దిశగా ఈ కుట్ర సాగుతోంది. ఇందులో కీలకమైన అంశం రాజకీయం. ఎంపీ టికెట్ విషయంలో వివేకానందరెడ్డి అడ్డు ఉంటారని భావించినందుకే ఆయన్ను హత్య చేశారంటూ ఎల్లో మీడియా విస్తృతంగా కథనాలు ఇచ్చింది. ఇందులో నిజమెంత? ఏ కోణంలో ఆలోచించినా ఈ వాదనలో కించిత్తు లాజిక్ కనిపిస్తోందా? ఇక్కడ కొన్ని ఎల్లో మీడియా వాదనలు, వాటికి స్థానికంగా ఉన్న వాస్తవ పరిస్థితులను పోల్చి చూద్దాం. ఎల్లో మీడియా వాదన : ఎంపీ టికెట్‌కు అడ్డు పడతాడన్న భయంతోనే వివేకా హత్య.? Fact Check : వైఎస్సార్ కడప జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, వాస్తవ పరిశీలనలేంటీ? వైఎస్సార్ కడప జిల్లాలో రాజకీయాలు దశాబ్దాలుగా ఒకే తీరున ఉన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబంపై అక్కడి ప్రజలు పూర్తి విశ్వాసాన్ని, ఆదరాభిమానాలను కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎంతగా ఆదరించారో.. అదే తీరున, అంత కంటే ఓ మెట్టు ఎక్కువగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని తమ వాడిగా గుండెల్లో పెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడయినా.. వైఎస్సార్సిపి పేరుతో కొత్త పార్టీని పెట్టినప్పుడయినా.. తమ అభిమానాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ఇక్కడ పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ. కాంగ్రెస్ లేదా బీజేపీ తరహాలో నిర్ణయాలు ఎక్కడో ఢిల్లీలో ఉండవు. వివిధ సమీకరణాలు, నాయకత్వ లక్షణాలు, ప్రజలకు చేరువయ్యే అభ్యర్థిని పార్టీ అధ్యక్షుడు ఎంచుకుంటారు. అలాగే 2014లో అయినా, 2019లో అయినా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. కడప ఎంపీ టికెట్‌ను ఆయన రెండు సార్లు కూడా వైఎస్ అవినాష్‌రెడ్డికే ఇచ్చారు తప్ప వివేకానంద రెడ్డికి ఇవ్వలేదు. వయస్సు రీత్యా అయినా.. ప్రజల్లో ఉన్న కలివిడి, ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే శక్తి, వివిధ వర్గాల్లో ఉన్న ఆదరణ విషయంలో వివేకానందరెడ్డి ఏ రకంగానూ అవినాష్‌రెడ్డి అడ్డు పడలేదు, అడ్డు రాలేదు. ఎల్లో మీడియా వాదన : రాజకీయంగా వివేకానందరెడ్డి అవినాష్‌రెడ్డికి పోటీగా మారుతున్నాడు Fact Check : వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఏం ఫలితాలొచ్చాయి? వాస్తవ పరిశీలనలేంటీ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా వైఎస్సార్ కడప జిల్లాలో రాజకీయ పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ ఏ మార్పు కనిపించలేదు. గతంలోలాగే వైఎస్సార్సిపికి ప్రజలు పట్టం కట్టారు. ఇక కడప ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికను పరిశీలిస్తే.. 2014లో, 2019లో రెండు సార్లు ఇక్కడ ఎన్నిక జరిగింది. రెండు సార్లు కూడా.. కడప ఎంపీ స్థానానికి తమ అభ్యర్థిగా అవినాష్‌రెడ్డిని ఎంచుకున్నారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2014లో కడప ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికలో అవినాష్‌రెడ్డి ఏకంగా లక్షా 90వేల మెజార్టీతో గెలిచారు. ఆయనకు 671,983 ఓట్లు అంటే 55.95% వస్తే.. తెలుగుదేశం అభ్యర్థి రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి 481,660 ఓట్లకు పరిమితం అయ్యారు. ఇక 2019లో అవినాష్‌రెడ్డి విజయం రెండింతలయింది. 2019లో కడప ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికలో అవినాష్‌రెడ్డి ఏకంగా 3 లక్షల 80వేల 726 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆయనకు 783,499 ఓట్లు అంటే 63.79% వస్తే.. తెలుగుదేశం అభ్యర్థి సి.ఆదినారాయణ రెడ్డికి కేవలం 402,773 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏ రకంగా చూసినా 3లక్షల 80వేల మెజార్టీ అంటే దేశంలో ఘనవిజయం సాధించిన వ్యక్తుల్లో అవినాష్‌రెడ్డి ఒకరు. ఈ లెక్కలు చూస్తే.. అవినాష్‌రెడ్డికి ఏ కోశానా వివేకానందరెడ్డి అడ్డుగా ఉన్నాడనో.. లేక రాజకీయంగా తన అవకాశాలను దెబ్బ తీస్తాడన్న వాదన సరికాదని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇంత చిన్న లాజిక్‌ను పక్కనబెట్టి ఎల్లోమీడియా ఇదే రాగం తీయడం, దాన్ని దర్యాప్తు సంస్థల మీద ప్రభావితం చేసేలా ప్రచారం చేయడం విడ్డూరంగానే కనిపిస్తుంది. ఎల్లో మీడియా వాదన : కడప టికెట్ నాకైనా ఉండాలి లేక మన వాళ్లకే ఉండాలి : వివేకానందరెడ్డి తరచుగా తన కూతురు సునీతకు చెప్పేవాళ్లు Fact Check : వైఎస్సార్ కడప జిల్లాలో వాస్తవ పరిశీలనలేంటీ? రాజకీయంగా ఎలాంటి పరిస్థితులున్నాయి? పైన చెప్పుకున్న సమగ్ర వివరాలలో మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అంశాలు రెండు. మొదటిది వైఎస్సార్సిపి అనేది ప్రాంతీయ పార్టీ. అంటే పార్టీ అధ్యక్షుడు ఎవరిని ఎంచుకుంటే వారే అభ్యర్థి అవుతారు. అప్పటికే రెండు సార్లు అంటే 2014, 2019లలో అవినాష్‌రెడ్డి ఘనవిజయం సాధించారు, ప్రజలకు చేరువయ్యారు, వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు. 2014-19 మధ్య కాలంలో వైఎస్సార్సిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కడపలో జరిగిన సమావేశంలో జనవరి 3, 2018న ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబును సభపైనే ప్రశ్నించిన ధైర్యం అవినాష్‌రెడ్డిది. కృష్ణా జలాల విషయంలో తన నియోజకవర్గంలో ముంపు గ్రామాలకు న్యాయం చేయాలంటూ చంద్రబాబును నేరుగా ప్రశ్నించిన ధైర్యం అవినాష్‌ది. జనవరి 3, 2018న జరిగిన మరో బహిరంగ సభలో ఎంపీగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ అసలు ప్రాజెక్ట్ ఘనత ఎవరిదో చెప్పబోతున్నప్పుడు సభపైనే చంద్రబాబు, టిడిపి నేతలు మైక్ లాక్కున్న ఘటన ఈ కింది వీడియోలో చూడవచ్చు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలే. వైఎస్సార్ కడప జిల్లాలో పార్టీ కార్యకర్తలకు, సామాన్యులకు పూర్తిగా అండగా ఉండే మనస్తత్వం అవినాష్‌రెడ్డిది. పార్టీ పరంగా ఆయన తన వాదనను పూర్తి స్థాయిలో వినిపించారు. తెలుగుదేశం నాయకులకు కొరకరాని కొయ్యగా మారారు. అందుకే అవినాష్‌రెడ్డి ఉంటే కడపలో ఏం చేయలేమన్న ధోరణి టిడిపి నేతల్లో కనిపించింది. సరిగ్గా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే వివేకానంద రెడ్డి హత్య జరగడం, దాన్ని ఒక పథకం ప్రకారం అవినాష్‌రెడ్డికి అంటించడం ఇందులో భాగమేనని స్థానికంగా ఎవరిని అడిగినా చెబుతారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయంగా అవినాష్ ఎదుగుదలకు వివేకానందకు ఎలాంటి లింకు లేదు. పైగా అవినాష్‌ను వద్దని తనకు టికెట్ కావాలని వివేకానందరెడ్డి చెప్పారంటూ ఎల్లోమీడియా చేస్తున్న వాదనలోనూ లాజిక్ లేదు. ఎల్లో మీడియా వాదన : రాజకీయంగా వివేకా ఎదుగుతున్నారు. అందుకే ఆయన్ను అడ్డు తొలగించారు. Fact Check : వైఎస్సార్ కడప జిల్లాలో వాస్తవ పరిశీలనలేంటీ? రాజకీయంగా వివేకా సాధించిన విజయాలేంటీ? వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం ఆయన నీడలో ఎదిగిన వివేకానందరెడ్డి.. ఆయన మరణం తర్వాత మరో స్టాండ్ తీసుకున్నారు. ఏ కుటుంబం అయితే అండగా ఉందో అదే కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేశారు. తర్వాతి కాలంలో ఆయన తిరిగి వైఎస్సార్సిపిలో చేరినా.. ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోయారు. 2017 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి వైఎస్సార్సిపి అభ్యర్థిగా బరిలో దిగారు. అప్పటికే జిల్లాలో ఏ రకంగా చూసినా పార్టీ పటిష్టంగా ఉంది. అభ్యర్థి ఎవరయినా వైఎస్సార్‌సిపిదే విజయం అన్నట్టుగా ఆనాటి పరిస్థితి ఉంది. ఆ ఎన్నికల్లో పోటీకి దిగిన వివేకానందరెడ్డి ఓడిపోయారు. తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి చేతిలో ఓడిపోవడం ఇబ్బందికర పరిస్థితి. ఏ రకంగా చూసినా ఇది వివేకానందరెడ్డికి ఇబ్బందికరమైన విషయమే. ఎమ్మెల్సీగా గెలవలేని అభ్యర్థి.. కడప ఎంపీగా పోటీ చేయాలని ఎలా భావిస్తారు? ఎల్లో మీడియా ప్రచారం చేసినట్టు టికెట్ తనకే కావాలని ఎలా అడుగుతారు? ఇక ఆయన్ను అవినాష్‌రెడ్డి తనకు అడ్డు అని ఎలా భావిస్తారు? ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తే.. అవినాష్‌రెడ్డిని ఇరికించడానికి, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయడానికి ఓ పథకం ప్రకారం కుట్ర జరుగుతోందని అర్థమవుతోంది. -
ఏది నిజం ?: బాబూ.. జవాబుందా ?
అధికారం కోసం ఎంతకైనా తెగించడం... ఎవరితోనైనా చేతులు కలపటం చంద్రబాబు నైజం. సొంత మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినపుడు గానీ... ఆగర్భ శత్రువైన కాంగ్రెస్‌తో గత ఎన్నికల్లో జతకట్టడం కానీ ఈ నైజానికి ఓ రెండు మేలిమి ఉదాహరణలు మాత్రమే.వంగవీటి రంగాను పట్టపగలు నడిరోడ్డుపై హతమార్చిన నారాసుర రక్త చరిత్ర ఎవరికి తెలియదని? టీడీపీలో ఈయనకు పోటీగా ఎదిగిన ప్రతి నాయకుడూ... రోడ్డు ప్రమాదంలోనో, నక్సల్స్ చేతుల్లోనో ప్రాణాలు కోల్పోయారంటే ఆ రక్తపు మరకలకు కారకులెవరో తెలియదా? అలాంటి చంద్రబాబు... మాటకు కట్టుబడే... మనుషులకు అత్యంత విలువిచ్చే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సైతం తన రక్తపు చేతులు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. వివేకా హత్యకేసుకు సంబంధించి ‘జగనాసుర రక్త చరిత్ర’ అంటూ తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన పుస్తకం ఈ కోవలోనిదే!!. మొదటి నుంచీ సీబీఐ దర్యాప్తు ఎలా సాగాలోతన రాతలతో చెబుతున్న ఎల్లో మీడియా... షరా మామూలుగా ఈ టీడీపీ కరపత్రాన్ని కూడా పతాక శీర్షికల్లో అచ్చేసింది. కానీ ఈ కేసులో చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. మరి ఆయన గానీ... ఆయన తరఫున రామోజీరావు గానీ వాటికి సమాధానం చెబుతారా? ► వివేకా పీఏ కృష్ణారెడ్డికి అక్కడో లేఖ దొరికింది. డ్రైవర్ తనను తీవ్రంగా కొట్టాడంటూ వివేకా రాసిన లేఖను, ఆయన ఫోన్‌ను... కృష్ణారెడ్డి ఎవ్వరికీ ఇవ్వలేదు. వివేక కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆదేశాలతోనే లేఖను దాచిపెట్టారు. ముందే లేఖ ఇస్తే అది సహజ మరణం కాదని తెలిసి ఎవ్వరూ మృత దేహాన్ని తాకేవారే కాదు. ఆ లేఖ తన తండ్రి రాసిందేనని సాక్షాత్తూ డీఐజీకి సునీత చెప్పారు. ఆ లేఖను ముందే ఇవ్వకపోవటంపై గానీ... వాట్సాప్ మెసేజీలతో సహా ఫోన్లో సగం డేటాను డిలీట్ చేయటంపై గానీ ఎందుకు ప్రశ్నించటం లేదు? ఆ లేఖను దాచిపేట్టిన కృష్టారెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. కానీ ఆ లేఖ దాచిపేట్టమన్న వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ► వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి హత్య చేశానని నిందితుడు దస్తగిరి అంగీకరించాడు. కానీ తనను ఈ కేసులో అప్రూవర్‌గా చేసుకుని... తనచేత వేరేవాళ్ల పేర్లు చెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారెందుకు? దస్తగిరి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించకపోవడమేంటి? హత్య చేసిన వ్యక్తి జైల్లో కాకుండా... దర్జాగా బయట తిరుగుతున్నాడెందుకు? హత్య జరిగిన రోజు నిరంతరం స్థానిక పోలీసులతో నాటి ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఏం మాట్లాడారు? నిమిష నిమిషానికీ చంద్రబాబుతో ఏం చెప్పారు? ఈ కోణంలో చంద్రబాబును విచారించలేదెందుకు? ఈ కేసులో దర్యాప్తును మొదటి నుంచీ నడిపిస్తున్నది ఎల్లో మీడియానే. పోలీసులు, సీబీఐ ఏం చేయాలో కూడా ఎల్లో మీడియానే చెబుతోంది. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి... వివేకా అనుచరులే డబ్బు లావాదేవీల్లో భాగంగా ఆయన్ను హతమార్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేసింది ‘ఈనాడు’. ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ప్లేటు ఫిరాయించింది. బాబుకు లబ్ధి కలిగేలా ఎంపీ అవినాశ్‌ను టార్గెట్ చేస్తూ కథనాలు వండి వారుస్తోంది. వీరి వల్ల ఈ కేసులో దర్యాప్తు ఎలా పక్కదోవ పడుతోందో వివరించే కొన్ని అంశాలివిగో... ► అవినాశ్ రెడ్డికి వివేకా మృతి గురించి తెలిసిందెప్పుడు? ఉదయం 6.30 ప్రాంతంలో... అది కూడా వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి చెబితేనే!!. దీంతో జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారానికి వెళుతూ అవినాశ్ తిరిగి వెనక్కొచ్చారు. అప్పటికే అక్కడ జనం పోగయి ఉన్నారు. వచ్చాక విషయం తెలుసుకుని ఆయన తొలుత సీఐ శంకరయ్యకి, తరవాత కొందరు బంధువులకు ఫోన్లు చేశారు. ఏ ఫోన్ అయినా 6.30 తరవాతే. కానీ అర్ధరాత్రే ఫోన్ చేసినట్లు నిరాధార ఆరోపణలెందుకు చేస్తున్నారు? జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ ఇన్చార్జిగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి... మార్చి 10నే ఎన్నికల షెడ్యూలు రావటంతో హత్యకు ముందురోజు రాత్రి కూడా (మార్చి 15) ఎంపీ అవినాశ్ కోసం ప్రచారం చేశారు కదా? ఇందులో అవినాశ్–వివేకా మధ్య రాజకీయ వైరుధ్యాలకు అవకాశమెక్కడుంది? మృతి గురించి శివప్రకాశ్‌రెడ్డే్డ తనకూ చెప్పారన్నది జమ్మలమడుగు టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి మాట. గుండెపోటుతో మృతి చెందారని, సిగరెట్లు ఎక్కువ తాగటం వల్ల కావచ్చునని చెప్పినట్లు ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. మరి అందరికీ శివప్రకాశ్ రెడ్డే చెప్పినపుడు అవినాశ్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు? చంద్రబాబూ నిరాధార ఆరోపణలు కట్టిపెట్టు... ఇవిగో నిజాలు... అవాస్తవ ఆరోపణలతో టీడీపీ విడుదల చేసిన పుస్తకం పూర్తిగా కట్టుకథల పుట్టని ఇట్టే తేలిపోయింది. ఆ పుస్తకంలో టీడీపీ చేసిన నిరాధార ఆరోపణలకు సమాధానాలు ఇవిగో... వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తోంది సీబీఐనా...!? చంద్రబాబా..!? వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రాత్రి 3గంటలకు ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వైఎస్ భారతి పీఏ నవీన్‌కు ఎందుకు ఫోన్ చేశారని టీడీపీ ఓ అవాస్తవ విషయాన్ని ప్రచారంలోకి తేవడం విడ్డూరంగా ఉంది. అసలు ఆ రోజు రాత్రి 3గంటలకు ఎంపీ అవినాశ్ రెడ్డి నవీన్‌కు ఫోన్ చేశారని ఎవరు చెప్పారు చంద్రబాబూ...? ఎంపీ అవినాశ్ రెడ్డి కాల్ డేటా మీ దగ్గర ఉందా... ఉంటే మీ పుస్తకంలో ఎందుకు ప్రచురించలేదు? ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన అర్ధ రాత్రి 3గంటల సమయంలో వైఎస్ అవినాశ్‌రెడ్డి ఎవరికీ ఫోన్ చేయనే లేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వం. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, అప్పటి రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావే ఈ కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించారు. మరి అప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు ఆ కేసు రికార్డులన్నీ కూడా కరకట్ట మీదున్న చంద్రబాబు నివాసానికి తరలించారా...?ఈ కేసులో టీడీపీ నేతల పాత్రను కప్పిపుచ్చేందుకే అలా చేశారా? మతి భ్రమించిందా చంద్రబాబూ...! అధికారం కోల్పోవడంతో చంద్రబాబుకు మతిభ్రమించినట్టు ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి ముందు రోజు రాత్రే తెలిసినా వైఎస్ జగన్ పులివెందులకు సాయంత్రం వరకు ఎందుకు వెళ్లలేదంటూ టీడీపీ ప్రశ్నించడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం. 2019 మార్చి 15 ఉదయం 6.10గంటలు అయినా సరే వివేకానందరెడ్డి నిద్ర లేవకపోవడంతో పీఏ కృష్ణారెడ్డి చాలాసేపు బయటే వేచి ఉన్నారు. ఆ తరువాత వాచ్‌మ్యాన్ రంగన్న, వంటమనిషి కుమారుడు ప్రకాశ్‌లతో కలసి వెనక ద్వారం నుంచి వెళ్లి చూడగా బాత్రూమ్లో వివేకానందరెడ్డి మృతిచెంది ఉండడాన్ని గుర్తించారు. ఆ వెంటనే హైదరాబాద్‌లో ఉన్న వివేకానందరెడ్డి భార్య, కుమార్తె, అల్లుడికి సమాచారం అందించారు. వారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వచ్చే సరికి మధ్యాహ్నం 1గంట అయ్యింది. హైదరాబాద్‌లో ఉన్న అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన భద్రతా సిబ్బంది అనుమతించిన తరువాత రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రంలోపు పులివెందుల చేరుకున్నారు. కానీ ఈ అంశానికి కూడా మసిపూసి మారేడు కాయ చేయాలని చూడటం చంద్రబాబు రాజకీయ నైచ్యమే.. సీబీఐ అధికారులపై కేసు పేరిట మరో అబద్ధం అంతఃపుర ఆదేశాలతోనే అంటే ముఖ్యమంత్రి నివాసం నుంచి వచ్చిన ఆదేశాలతోనే సీబీఐ అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారని టీడీపీ మరో నిరాధారణ ఆరోపణ చేసింది. సీబీఐ అధికారులపై పోలీసులు తమకు తాముగా కేసు నమోదు చేయలేదు. ఉదయ్‌కుమార్ అనే వ్యక్తిని సీబీఐ అధికారులు విచారణ పేరిట పదే పదే పిలిచి తీవ్రంగా కొడుతుండడంతో ఫిర్యాదుచేసినా పోలీసులు స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీబీఐ అధికారులను ఒక్క రోజు కూడా విచారణకు పిలవనే లేదు. సీబీఐ అధికారులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ కేసులో స్టే మంజూరైంది. ఇక ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం ఎక్కడ ఉంది?.. సీబీఐ విచారణకు సహకరిస్తున్న ప్రభుత్వం ప్రతిపక్ష నేతగా సీబీఐ విచారణ కోరిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను సీఎం అయ్యాక ఎందుకు వద్దనుకున్నారని టీడీపీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. ఆనాడు చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేకే వైఎస్ జగన్ సీబీఐ విచారణను కోరారు. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వాధినేతగా తమ పోలీసు శాఖపై ముఖ్యమంత్రి నమ్మకం ఉంచారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ నిచ్చి కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చాక రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా పూర్తి సహకారం అందిస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో సీబీఐని నిషేధించారు.అలాంటి చంద్రబాబు అధికారం కోల్పోగానే మళ్లీ సీబీఐపై నమ్మకం ప్రదర్శిస్తుండటం రాజకీయ అవకాశవాదమే. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టకూడదని వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించి ఉంటే ఆయన కూడా సీబీఐకి రాష్ట్రంలో నిషేధించి ఉండేవారు కదా. ఆయన అలా చేయలేదు. అంటే వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేసినా తనకు అభ్యంతరంలేదని చెప్పినట్టే కదా. ఎంపీ టికెట్ అవినాశ్‌కే ఖరారు చేశారు బాబూ వైఎస్ అవినాశ్ రెడ్డి ఎంపీ టికెట్ కోసమే వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించినట్టు సీబీఐ సందేహం వ్యక్తం చేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిందని ఆరోపించడం టీడీపీ కుతంత్రాలకు పరాకాష్ట. సీబీఐ అఫిడవిట్ మీరు చూశారా చంద్రబాబు..! అసలు 2019 ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుగానే ఖరారు చేశారు. కడప లోక్‌సభ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్గా వైఎస్ వివేకానందరెడ్డిని నియమించారు. అవినాశ్ రెడ్డి గెలుపు కోసం వివేకానందరెడ్డి అప్పటికే ప్రచారం ప్రారంభించారు కూడా. వివేకాందరెడ్డి హత్య తరువాత కూడా ఆయన కుమార్తె వైఎస్ సునీత అదే విషయాన్ని మీడియా సమావేశంలో చెప్పారు కూడా. చార్జ్‌షీట్‌కు సీబీఐ 17 నెలల సమయం ఎందుకు తీసుకుంది? ఈ కేసులో ఏ–1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ ఎందుకు వచ్చింది... పోలీసులు ఆయనపై చార్జ్‌షీట్ ఎందుకు వేయలేదని టీడీపీ సంధించిన ప్రశ్న హాస్యాస్పదంగా ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పటి నుంచి 75రోజులపాటు చంద్రబాబే అధికారంలో ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు చార్జ్‌షీట్‌వేయలేదు? వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితులను గుజరాత్‌లోని న్రార్కో అనాలిసిస్ ల్యాబరేటరీకి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించింది. కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతుండగానే న్యాయస్థానం ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తును 2020, జూలై 9న సీబీఐకి అప్పగించింది. సీబీఐ 2021, అక్టోబరు 26న తొలి చార్జ్‌షీట్ దాఖలు చేసింది. తొలి చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు సీబీఐ 17 నెలల సమయం తీసుకుంది. చార్జ్‌షీట్ దాఖలకు 17 నెలల సమయం తీసుకున్న సీబీఐనిగానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీనిగానీ టీడీపీ ఎందుకు ప్రశ్నించడం లేదు? వ్యక్తిగత కారణాలతోనే డిప్యుటేషన్‌పై వెళ్లిన అభిషేక్ మహంతి చంద్రబాబు గాలిపోగేసి చేసిన మరో ఆరోపణ... ఈ కేసులో గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని అప్పటి కడప ఎస్పీ అభిషేక్ మహంతి విచారణకు తీసుకువెళ్తుంటే హఠాత్తుగా నవీన్ నుంచి ఫోన్ వచ్చింది...దాంతో ఆయన్ని విచారించకుండా విడిచిపెట్టారని అవాస్తవ ఆరోపణలు చేశారు. పైగా అభిషేక్ మహంతి సుదీర్ఘ సెలవుపై ఎందుకు వెళ్లారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. ఏమయ్యా చంద్రబాబూ... ఎస్పీ అభిషేక్ మహంతికి నవీన్ నుంచి ఫోన్ రావడం నువ్వు చూశావా...? పోనీ ఆయన కాల్ డేటా నీ దగ్గర ఉందా? ఇక అభిషేక్ మహంతి తన కుటుంబపరమైన కారణాలతోనే ఆయన తెలంగాణకు డిప్యుటేషన్ కోరుకునివెళ్లారు. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదన్నది రెండు రాష్ట్రాల్లోని పోలీసు శాఖలకు తెలుసు. రెండేళ్ల ఐదు నెలలు సస్పెన్షన్‌లోనే సీఐ శంకరయ్య సీఐ శంకరయ్య వాంగ్మూలం ఇచ్చి వెనక్కితగ్గారని ... వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసిందని టీడీపీ ఆరోపించడం విడ్డూరంగా ఉంది. తాను చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడాన్ని శంకరయ్య తప్పుబట్టారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన మర్నాడే శంకరయ్య సస్పెండ్ అయ్యారు. 2019 మేలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత కూడా రెండేళ్ల ఐదు నెలలపాటు శంకరయ్య సస్పెన్షన్‌లోనే ఉన్నారు. కుటుంబ పోషణ కోసం తనకు పోస్టింగ్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శంకరయ్యపై అభియోగాలు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగానే ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చారు. ఆయనకు ఏమీ ప్రాధాన్యమున్న పోస్టింగ్ ఇవ్వ లేదు. దాంతో కేసు దర్యాప్తు ప్రభావితమయ్యేది ఏముంది? టీడీపీ తప్పుబట్టాల్సింది ఏముంది...? ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ అంశంపై టీడీపీ అసత్య ఆరోపణలు చేసింది. ఎర్రగంగిరెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితుడు. ఎర్ర గంగిరెడ్డి జైలులో ఉన్నప్పుడు కూడా వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తరచూ ఆయన్ని కలిసేవారు. ఎర్ర గంగిరెడ్డికి న్యాయవాదులను కూడా సునీతే ఏర్పాటు చేశారు. ఆయనకు బెయిల్ రావాలని సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డి కోరుకున్నారు. తీరా ఇప్పుడు ఆయనకు బెయిల్ రావడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హస్తముందని టీడీపీ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని గంగాధర్‌రెడ్డిపై టీడీపీ నేతల ఒత్తిడి వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు కె.శ్రీనివాసరెడ్డి, గంగాధర్ రెడ్డి అనుమానాస్పదంగా మృతిచెందారంటూ వక్రీకరిస్తూ టీడీపీ ఆరోపణలు చేయడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఈ కేసులో కె.శ్రీనివాసరెడ్డి అసలు సాక్షి కాదు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టడానికి ముందే శ్రీనివాసరెడ్డి మృతి చెందారు. ఆయన సోదరుడు పరమేశ్వరరెడ్డి ఈ కేసులో అనుమానితుడు. అతను టీడీపీ నేత బీటెక్ రవికి సన్నిహితుడు కూడా. వివేకానందరెడ్డి హత్యకు ముందు పరమేశ్వరరెడ్డి తనకు ఎలాంటి అనారోగ్యం లేనప్పటికీ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఉన్న అతను బయటకు వచ్చి టీడీపీ నేత బీటెక్ రవితో సమావేశమయ్యారు. వివేకానందరెడ్డి ఉన్నంతవరకు తాను పులివెందులలో పట్టు సాధించలేనని బీటెక్ రవికి తెలుసు. తాను ఎంపీగా గెలవలేనని ఆదినారాయణ రెడ్డికి తెలుసు. ఇక పరమేశ్వరెడ్డికి వివేకానందరెడ్డితో ఆర్థిక వివాదాలు ఉన్నాయి. అందుకు బీ.టెక్ రవి, ఆదినారాయణరెడ్డి, పరమేశ్వరరెడ్డి కలసి వివేకానందరెడ్డి హత్యకు కుట్రపన్ని ఉండొచ్చని వైఎస్సార్సీపీ మొదటి నుంచి చెబుతోంది. ఈ విషయాలన్నీ శ్రీనివాసరెడ్డికి తెలుసు. అతను జీవించి ఉంటే బీ.టెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలకే ముప్పు. అందుకే అతన్ని అంతం చేసే అవకాశం వారికే ఉంది. ఇప్పటికైనా సీబీఐ వారిని విచారించాలి. అలానే గంగాధర్ రెడ్డి మృతి విషయంలోనూ టీడీపీ అసత్య ఆరోపణలతో కేసును తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని వైఎస్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, టీడీపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని గంగాధర్‌రెడ్డి ఆరోపించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదుచేశారు కూడా. ఆ తరువాత అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందారు. గంగాధర్‌రెడ్డి వైఎస్ అవినాశ్‌రెడ్డికి అనుకూలంగా ఉన్నారు. ఆయన వాంగ్మూలం టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ఉంది. మరి ఆయన అనుమాస్పదంగా మృతిచెందితే...అందుకు టీడీపీ నేతలనే శంకించాల్సి ఉంటుంది కదా. నారాసుర రక్తచరిత్రలో ప్రతిపేజీ హత్యలు,కుట్రలే... 1 వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడే కదా? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేసినా చంద్రబాబు నో చెప్పారెందుకు? ‘సిట్’తో సరిపెట్టారెందుకు? 2 ముఖ్యమంత్రి కుటుంబానికి ఎంపీ అవినాశ్ నుంచి అర్ధరాత్రే ఫోన్ వెళ్లినట్లు తెలుగుదేశం ఓ అభూత కల్పనను సృష్టించింది. ఎవరు చెప్పారిది సీబీఐ కూడా చెప్పలేదుగా? పోనీ... అప్పుడు అధికారంలో ఉన్నది మీరే కదా? దీన్ని నిరూపించే కాల్ డేటాను చూపించగలరా? ఉదయం 6.10కి వివేకా పనిమనిషి ఇంటి తలుపు తీసేదాకా ఆయన మృతి గురించి ఎవ్వరికీ తెలియదన్నది పచ్చి నిజం కాదా? ఆమె చెప్పాకే బంధువులకు, బయటి ప్రపంచానికి తెలిసిందన్నది వాస్తవం కాదా? 3 అవినాశ్‌రెడ్డి అప్పటికే ఎంపీ. కడప లోక్‌సభ ఇన్చార్జి కూడా. వివేకానందరెడ్డిని జమ్మలమడుగు అసెంబ్లీ ఇన్చార్జిగా ప్రకటించారు జగన్. ఎన్నికల షెడ్యూలు వెలువడటంతో అవినాశ్ గెలుపు కోసం వివేకా ప్రచారాన్ని ప్రారంభించారు. ముందురోజు రాత్రి జమ్మలమడుగులో ప్రచారం చేశారు కూడా. అలాంటిది ఎంపీ సీటు కోసం ఆయనపై కుట్ర పన్నాల్సిన అవసరం అవినాశ్‌కు ఎందుకుంటుంది? 4 మార్చి 15, 2019న ఉదయాన్నేజమ్మలమడుగు ప్రచారానికి వెళుతుండగా అవినాశ్‌కు వివేకా బావమరిది శివప్రకాశ్‌రెడ్డి ఫోన్ చేసి వివేకా మరణించినట్లు చెప్పటంతో ఆయన హడావుడిగా అక్కడకు చేరుకున్నారు. ఆ ఫోన్ రాకపోయి ఉంటే ఆయన వచ్చి ఉండేవారే కాదు. వచ్చిన వెంటనే ఆయన విషయం తెలుసుకుని మొదట సీఐకి ఫోన్ చేశారు. అప్పుడున్నది తెలుగుదేశం సర్కారు. సీఐ కూడా టీడీపీ నేతలు కోరి తెచ్చుకున్న వ్యక్తి. అలాంటిది సీఐకి ఫోన్ చేశాక.. బంధువులకు ఫోన్లు చేశారు అవినాశ్‌రెడ్డి. ఇందులో ఆయన చేసిన తప్పేంటి? -
వివేకా హత్య కేసులో వారిని కూడా విచారించండి: తులసమ్మ వాంగ్మూలం
సాక్షి, వైఎస్సార్‌కడప: వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఇక, ఈ కేసులో పులివెందుల కోర్టులో మెజిస్ట్రేట్ ముందు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలం ఇచ్చారు. గత ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో తులసమ్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సీబీఐ విచారణలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని తులసమ్మ ఆక్షేపించారు. మరో ఆరుగురిని సీబీఐ విచారించాలని సీబీఐని తులసమ్మ కోరారు. వివేకా హత్యలో ఆర్థిక అంశాలు, కుటుంబ వివాదాలు ముడిపడి ఉన్నాయని ఆ అంశాలను పరిగణనలోకి తీసులేదని తులసమ్మ ఆరోపించారు. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, బావమరిది శివప్రకాష్‌రెడ్డి, కొమ్మ పరమేశ్వర్‌రెడ్డి, బీటెక్ రవి, రాజశేఖర్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌ను సీబీఐ విచారించేలా ఆదేశించాలని తులసమ్మ కోరారు. ఇక, తులసమ్మ పిటిషన్‌పై 9 నెలల తర్వాత వాంగ్మూలం నమోదు చేశారు. -
ఆలిండియా సర్వీస్ రూల్స్‌కు ఇవి వ్యతిరేకం: పాల్‌రాజ్
సాక్షి, విజయవాడ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖపై పోలీసుశాఖ వివరణ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించి కీలక విషయాలను డీఐజీ పాల్‌రాజ్ వెల్లడించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బదిలీ అయ్యే వరకు వివేకానందరెడ్డి కేసు దర్యాప్తును ఏబీ వెంకటేశ్వరావునే పర్యవేక్షించారని తెలిపారు. దర్యాప్తు వివరాలు అధికారులకు ఎందుకు ఇవ్వలేదో ఏబీవీనే చెప్పాలని అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలు వెలికితీయకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంపై బురద జల్లే యత్నం చేశారని తెలిపారు. సిట్ దర్యాప్తుపై ఏబీవీ సందేహాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని తెలిపారు. ఏబీవీ దగ్గర ఆధారాలు ఉంటే సీబీఐకి సీల్డ్కవర్లో లేఖ పంపొచ్చని చెప్పారు. ఇన్నాళ్లు వెంకటేశ్వరరావు మాట్లాడకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని డీఐజీ పాల్‌రాజ్ ప్రశ్నించారు. బహిరంగ విమర్శలు చేయడం తీవ్రమైన విషయమని అన్నారు. ఆలిండియా సర్వీస్ రూల్స్‌కు ఇవి వ్యతిరేకమని గుర్తుచేశారు. ఏబీవీకి అనుమానాలుంటే పద్ధతి ప్రకారం సమాచారం ఇవ్వాలని డీఐజీ పాల్‌రాజ్ అన్నారు. చదవండి: కరోనా బారిన పడి డీఎస్పీ మృతి -
డ్రగ్స్ కేసు: టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు
-
వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐకి..
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాదరావు బుధవారం తీర్పు వెలువరించారు. ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను న్యాయమూర్తి అనుమతించారు. ఇవే అభ్యర్థనలతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నేత సి.ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు సరైన సాక్ష్యాలను సేకరించలేకపోయారని పేర్కొన్నారు. వివేకా హత్య ఘటన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదని, ఇందులో ఇతర రాష్ట్రాల వ్యక్తుల ప్రమేయం కూడా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందంటూ ఆ తీర్పులను న్యాయమూర్తి ప్రస్తావించారు. ఆ తీర్పుల ఆధారంగా వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేసి, తుది నివేదికను సంబంధిత కోర్టులో దాఖలు చేయాలని సీబీఐకి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన రికార్డులను సీబీఐకి అప్పగించాలని ‘సిట్’ను న్యాయమూర్తి ఆదేశించారు. బీటెక్ రవి, ఆది నారాయణరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సల్మాన్ ఖుర్షీద్, ఆర్.బసంత్ వాదించగా.. సౌభాగ్యమ్మ, సునీత తరఫున హైకోర్టు సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. -
కారుకు గెలుపు ప్రతిష్టాత్మకం
సాక్షి,మేడ్చల్ : పుర ఎన్నికల పోరు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో అధికార టీఆర్ఎస్ పారీ్టకి ప్రతిష్టాత్మకంగా మారింది. రెబల్స్ గుబులు ఒక వైపు.. సొంత పారీ్టలో వేరు కుంపట్లు మరొక వైపు.. నేతల మద్య శిఖ పట్లు ఇంకొక వైపు ముఖ్య నాయకుల మధ్య సఖ్యత లేమి వెరసి.. కారు పార్టీ జోరుకు బ్రేకులు వేస్తున్నది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్, బడంగ్‌పేట మీర్పేట్, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లు, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, దుండిగల్, కొంపల్లి, తూముకుంట, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహింపట్నం, నార్సింగ్, శంషాబాద్, తుర్కయాంజాల్, తుక్కుగూడ, జల్పల్లి, మణికొండ, ఆదిభట్ల అమనగల్లు, షాద్‌నగర్ మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. కాగా గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలను పోల్చుకుంటే ఇతర పార్టీల ఓట్లు పెరిగాయి. ఇటీవల మన నగరం వంటి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అభివద్ధి పనులకు శంకుస్థాపనలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చేపట్టడం ద్వారా ప్రజలను ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి తరుణంలో జరుగుతున్న పుర ఎన్నికల పోరులో పట్టణ ప్రాంత ఓటర్లు అధికార పార్టీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటున్నారా? లేదా వ్యతిరేకంగా నిలుస్తున్నారా ? అన్న విషయం సస్పెన్స్‌గా మారింది. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, కార్పొరేషన్లు, దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, పోచారం, నాగారం, దమ్మాయిగూడ, తూముకుంట, మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో 210 వార్డులున్నాయి. ఇందులో నాలుగు వార్డులను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఇక్కడ నుంచి మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో పురపోరు ప్రతిష్టాత్మకంగా మారింది. మాజీ ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డితో ఉన్న విభేదాలు బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్ పురపాలక సంఘాలపై ప్రత్యక్షంగా మిగతా వాటిపై పరోక్షంగా ప్రభావం చూపనున్నాయి. దీనికి తోడు రెబల్స్ గుబులు .. బోడుప్పల్లో 11 చోట్ల జవహర్‌నగర్‌లో 10, పీర్జాదిగూడలో ఏనమిది, నాగారంలో ఐదు, తూముకుంటలో ఏనమిది, ఘట్కేసర్లో ఏడు, మేడ్చల్‌లో 20, గండ్లపోచంపల్లిలో ఒక చోట రెబల్స్ బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో అసెంబ్లీ, పార్టమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మోజారిటీ పరిశీలిస్తే కొంత మేరలో పడిపోయింది. దీంతో పుర పోరును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీఆర్ఎస్ మున్సిపాలిటీలకు పార్టీ ఇన్చార్జులను నియమించినప్పటికీ అన్నీ తానై మంత్రి మల్లారెడ్డి, అల్లుడు మల్కాజిగిరి పార్లమెంట్ పార్టీ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డి తనయులు, కూతురు ఎన్నికల బాధ్యతలు మీద వేసుకుని పని చేస్తున్నారు. గతంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలతో పాటు ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించిన మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ రాజశేఖర్‌రెడ్డి మేడ్చల్‌తో పాటు మరి కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ గెలుపు బాధ్యతలను భుజస్కందాలపై వేసుకొని ఎన్నికలప్రచారం నిర్వహిస్తున్నారు. మహేశ్వరం బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లు, తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలో 121 వార్డులుండగా, అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నీ తానై చూసుకుంటోంది. ఇక్కడ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మద్య అధిపత్య పోరు కారణంగా మీర్õపెట్లో 8 డివిజన్లు, తుక్కగూడలో నాలుగు వార్డుల్లో రెబల్స్ పోటీలో ఉన్నారు. జల్పల్లిలో ఎంఐఎం 24 చోట్ల పోటీ చేస్తున్నది. గతంలో ఈ మున్సిపాలిటీ నాలుగు గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పడు ఎంఐఎం 16 ఎంపీటీసీలను గెలుచుకుంది. ఇక్కడ ఎంఐఎం, కాంగ్రెస్‌లను ఎదుర్కోవడం ద్వారా టీఆర్ఎస్కు పట్టం గట్టడంతో పాటు మిగతా పురపాలక సంఘాల్లో గులాబీ జెండాను ఎగుర వేయడం లక్ష్యంగా మంత్రి సబిత ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, పెద్ద అంబర్పేట్, తుర్కంజాల్ మున్సిపాలిటీల్లో 87 వార్డులుండగా, రెండు వార్డులను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మిగతా 85 వార్డుల్లో టీఆర్ఎస్ విజయం కోసం అన్నీ తానై స్థానిక ఎమ్మెల్యే మంచికంటి కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే లోక్‌సభ ఎన్నికల్లో నియోజకవర్గంలో టీఆర్ఎస్ మోజారిటీ బాగా తగ్గింది. పెద్దఅంబర్‌పేట్‌లో ఒక వార్డుతో పాటు మిగతా మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో రెబల్స్ ఉన్నారు. పైగా నాయకుల మధ్య అంతర్గత అధిపత్య పోరు నడుస్తున్నది. దీన్ని అధిగమించడం ద్వారా అభ్యర్థుల గెలుపు తథ్యంగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఎన్నికల బాధ్యతలను మీద వేసుకుని పని చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ కార్పొరేషన్, కొంపెల్లి, దుండిగల్ మున్సిపాలిటీల్లో 79 వార్డులుండగా, ఇందులో రెండు వార్డులను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక్కడ అన్నీ తానై ఎన్నికల బాధ్యతలను మీద వేసుకున్న స్థానిక ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ మధ్య నెలకొన్న అధిపత్య పోరు దుండిగల్ మున్సిపాలిటీపై ప్రభావం చూపుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. దుండిగల్‌లో నాలుగు చోట్ల టీఆర్ఎస్కు రెబల్స్ బెడద ఉంది. మూడు పురపాలక సంఘాలకు పార్టీ ఇన్చార్జులను అధిష్టానం నియమించినప్పటికీ, అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్‌తో పాటు శంషాబాద్, మణికొండ, నార్సింగ్, మున్సిపాలిటీలు ఉండగా ఇందులో 85 వార్డులున్నాయి. టీఆర్ఎస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు సొంత పార్టీలోని నేతల మద్య ఉన్న అధిపత్య పోరు ఎటువైపు దారి తీస్తుందోనన్న అందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది. దీనికి తోడు బండ్లగూడలో రెండు చోట్ల రెబల్స్‌తో పాటు మిగతా మున్సిపాలిటీల్లో కూడా తిరుగుబాటు దారులున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రకా‹Ùగౌడ్ అన్నీ తానై పుర ఎన్నికల పోరులో నిమగ్నమై పని చేస్తున్నారు. -
వివేకా హత్యను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు
-
వివేకా మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్‌తో కాకుం డా సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. మాలలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి పార్లమెంట్ సీట్ల కేటాయింపుల్లో మాల సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మాలమహానాడు డిమాండ్ చేసింది. -
‘గ్రేటర్’లో బార్లకు గేట్లు బార్లా!
- తాజాగా 88 కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల - ఈనెల 18 వరకు దరఖాస్తుల జారీ - డిసెంబర్ 8 నుంచి 20 వరకు లెసైన్సుల జారీ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త బార్లకు గేట్లు బార్లా తెరుచుకున్నారుు. నూతన ఆబ్కారీ పాలసీ ప్రకారం.. 11 వేల జనాభాకు ఒకటి చొప్పున మహానగరంలో సుమారు 659 బార్లు ఏర్పాటు చేయవచ్చని సర్కారు నిర్ణరుుంచింది. ఈ నేపథ్యంలో నూతనంగా 88 బార్లకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. వీటి ఏర్పాటుకు సంబంధించి ఈనెల 10 నుంచి దరఖాస్తుల విక్రయం ప్రారంభమైందని.. 18 వరకు ఒక్కోటి రూ. 50 వేల చొప్పున విక్రరుుంచనున్నట్లు నగర ఎకై ్సజ్ విభాగం డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి తెలిపారు. ఈనెలాఖరు వరకు మూల్యంకన ప్రక్రియ పూర్తిచేసి డిసెంబర్ 8 తరువాత కొత్త లెసైన్సులు జారీ చేస్తామన్నారు. నూతన బార్లకు లెసైన్సు ఫీజు ఏడాదికి రూ.40 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇప్పటికే రెస్టారెంట్ ఉండి.. అవసరమైన స్థలం అందుబాటులో ఉన్నవారు, ట్రేడ్ లెసైన్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కాగా తాజాగా ప్రభుత్వం కొత్త బార్లకు నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల మహిళా, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారుు. పదకొండు వేలకు ఒకటి చొప్పున... మహానగరం పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 72.44 లక్షల జనాభా ఉండగా.. ఇందులో 11 వేలకు ఒకటి చొప్పున బార్లుండాలని ప్రభుత్వం నూతన ఆబ్కారీ పాలసీలో పేర్కొంది. ఈలెక్కన 659 బార్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 571 బార్లకు అదనంగా మరో 88 బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 145 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో సగానికి పైగా గ్రేటర్‌లోనే ఉండడం గమనార్హం. మినీ బ్రేవరేజెస్కు స్పందన అంతంతే...! మందుబాబులకు క్షణాల్లో తాజా బీరును అందించేందుకు గ్రేటర్ పరిధిలో 20 మినీ బ్రేవరేజెస్కు ఆబ్కారీ శాఖ అనుమతిం చినప్పటికీ నగరంలో మూడు చోట్ల మాత్రమే అవి తెరచుకున్నట్లు ఎకై ్సజ్‌శాఖ వర్గాలు తెలిపారుు. వీటి ఏర్పాటుకు రూ.6 లక్షలు లెసైన్సు ఫీజు అరుునప్పటికీ ఉత్పత్తిపై విధిం చే అప్‌ఫ్రంట్ ట్యాక్స్ అధికంగా ఉండడం, వీటి ఏర్పాటుకు వినియోగించే యంత్ర పరిక రాల ఖరీదు రూ.7 కోట్ల వరకు ఉండడంతో నిర్వాహకులు ముందుకురావడం లేదన్నారు. నోట్ల ఎఫెక్ట్.. తగ్గిన మద్యం అమ్మకాలు... రూ.500, రూ.వెరుు్య నోట్ల రద్దుతో నగరంలోని మద్యం దుకాణాలు, బార్లకు గడిచిన నాలుగు రోజులుగా గిరాకీ 50 శాతం మేర తగ్గినట్లు వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చేసేదిలేక పలు బార్లు, మద్యం దుకాణాల్లో క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగంతో సైతం మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కాగా కార్మికులు, కూలీలు అధికంగా కొనుగోలు చేసే చీప్‌లిక్కర్ అమ్మకాలు భారీగా పడిపోరుునట్లు వాపోయారు. కొత్త బార్లకు అనుమతులిలా... గ్రేటర్లో ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్య: 571 నూతనంగా ఏర్పాటు కానున్న బార్లు: 88 కొత్త బార్లకు దరఖాస్తుల గడువు: నవంబర్ 10 నుంచి 18 వరకు దరఖాస్తుల మూల్యంకనం: నవంబర్ 19 నుంచి 24 వరకు దరఖాస్తుల తిరస్కరణ, ఆమోదం: నవంబర్ 28 పోటీ అధికంగా ఉండే బార్లకు డ్రా తీసే తేదీ: డిసెంబర్ 5 నూతన బార్లకు లెసైన్సుల మంజూరు: డిసెంబర్ 8 నుంచి 20 వరకు లెసైన్సు ఫీజు: ఏడాదికి రూ.40 లక్షలు దరఖాస్తు ఫీజు: రూ.50 వేలు -
సింగరేణి కాలనీలో 51 మద్యం బాటిళ్లు స్వాధీనం
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా లిక్కర్‌ను విక్రయిస్తున్న స్థావరాలపై మలక్‌పేట ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సీఐ బీ.ఎల్. రేణుక తెలిపిన వివరాల ప్రకారం.. డిప్యూటీ కమీషనర్ వివేకానందరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం స్టేషన్ పరిధిలోని ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఐఎస్‌సదన్ డివిజన్ సింగరేణికాలనీ రోడ్డు నంబర్ -14లో ఆర్. పాండు (42), అతని భార్య జుక్కుబాయి (38) నివాసంలో తనిఖీలు చేయగా 26 మద్యబాటిళ్లు పట్టుబడ్డాయి. సాయంత్రం మరోసారి నిర్వహించిన దాడుల్లో అదేప్రాంతానికి చెందిన ఆర్. రాజు(32) ఇంటిలో 25 లిక్కర్ క్వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్య విక్రయదారులు ముగ్గురిపై కేసు నమోదు చేశామని, వారు పరారీలో ఉన్నారని తొందరలోనే వారి పట్టుకుంటామని సీఐ తెలిపారు. తనిఖీల్లో ఎస్సైలు దుబ్బాక శంకర్, నరేష్కుమార్, కానిస్టేబుల్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్ అండ్ బీలో కోల్డ్‌వార్!
సాక్షి ప్రతినిధి, కడప: రోడ్లు భవనాలశాఖలో కోల్డ్‌వార్ నడుస్తోంది. క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈగా ఉన్న వివేకానందరెడ్డిని అర్ధాంతరంగా బదిలీ చేశారు. ఆ స్థానంలో ఇటీవల హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లిన రెగ్యులర్ ఎస్ఈ మనోహర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమేరకు మంగళవారం ఆర్అండ్బి కడప క్వాలిటీ కంట్రోలర్ ఎస్ఈగా బాధ్యతలు చేపట్టారు. అక్రమ ఉత్తర్వులంటూ ఇదివరకే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న వివేకానందరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఓ ఏ నెంబర్ 3511 ఆఫ్ 2015 ద్వారా వివేకానందరెడ్డి ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులపై స్టేటస్కో ఆర్డర్ జారీ చేస్తూ, మునుపటి ఎస్ఈ వివేకానందరెడ్డిని కొనసాగించాలని ఆదేశించింది. ఆమేరకు హైకోర్టు ఉత్తర్వులను కొనసాగించకపోతే, కోర్టుధిక్కారం అవుతుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతకొంత కాలంగా అంతర్గతంగా నడుస్తున్న కోల్డ్‌వార్ బహిర్గతం కావడంతో ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశమైంది. -
కొత్త రాజధానిగా కర్నూలే ఉండాలి
-
టీడీపీ..అదొక రెంటల్ పార్టీ
నెల్లూరు: ఎక్కడా టికెట్ దొరకని వారే టీడీపీలోకి వెళుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ధ్వజమెత్తారు. అదొక రెంటల్ పార్టీగా మారిందని విమర్శించారు. స్థానిక ఏసీసెంటర్లోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీకి అభ్యర్థులు, కార్యకర్తలు కరువయ్యారన్నారు. టీడీపీ కేవలం ఫ్లెక్సీల్లో మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. ప్రమాదాలు ఎదురవుతాయనే నెల్లూరు సిటీలో ముందు జాగ్రత్తలు తీసుకున్నానన్నారు. అందరి మన్ననలను పొందిన వారినే మేయర్‌గా ఎంపిక చేస్తామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలన్న కాంక్షతో ప్రతి విద్యార్థికి గ్రీటింగ్‌లు పంపుతున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా గ్రీటింగ్‌లను ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు బర్నాబాసు, ఏసీ సుబ్బారెడ్డి, దిలీప్, కర్తం ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. -
పోరుపై స్పష్టత
నెల్లూరు : నెల్లూరు సిటీ, రూరల్ నియోజక వర్గాల నుంచి వచ్చే శాసనసభ ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల విషయంలో సోమవారం నాటికి స్పష్టత వచ్చింది. రూరల్ నియోజక వర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల పేరుతో ఆయన నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. రూరల్ నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన ఆనం వివేకానందరెడ్డి ఈ సారి నియోజక వర్గం మారుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుత నియోజక వర్గంలో ప్రతి కూల పవనాలు ఎదురుకావచ్చనే ఆందోళనతో ఆయన సిటీ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వినిపిం చాయి. ఇదే సమయంలో సిట్టింగ్ శాసనసభ్యుడు ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. దీంతో వివేకాకు మార్గం సుగమం అయ్యింది. రూరల్ నియోజక వర్గం నుంచి వివేకా తన సోదరుడు ఆనం విజయకుమార్‌రెడ్డిని బరిలోకి దించబోతున్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో వివేకా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇకపోతే ఈ సారి సర్వేపల్లి నుంచి కాకుండా రూరల్ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మానసికంగా సిద్ధపడ్డారు. ఇందులో భాగంగానే ఆయన గత మూడు రోజులుగా నెల్లూరు రూరల్ నియోజక వర్గ పర్యటనలకు వెళుతున్నారు. ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో సోమిరెడ్డి తానీసారి రూరల్ నుంచే పోటీకి దిగబోతున్నానని చెప్పకనే చె ప్పారు. దీంతో నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చ ంద్రమోహన్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డి పోటీ చేస్తారనేది తేలిపోయింది. ఇక సిటీ విషయానికి వస్తే డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు . ఇక్కడ గతంలో పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద పోటీ చేయబోతున్నారు. రూరల్ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తన మిత్రుడు శ్రీధరకృష్ణారెడ్డితో తలపడనున్నారు. దీంతో ఈ నియోజక వర్గానికి సంబంధించిన ప్రధాన పార్టీల అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చింది.