కారుకు గెలుపు ప్రతిష్టాత్మకం  | Big Fight For TRS In Hyderabad Municipal Elections | Sakshi
Sakshi News home page

కారుకు గెలుపు ప్రతిష్టాత్మకం 

Published Sat, Jan 18 2020 11:09 AM | Last Updated on Sat, Jan 18 2020 11:09 AM

Big Fight  For TRS In Hyderabad Municipal Elections - Sakshi

సాక్షి,మేడ్చల్‌ : పుర ఎన్నికల పోరు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ పారీ్టకి ప్రతిష్టాత్మకంగా మారింది. రెబల్స్‌ గుబులు ఒక వైపు.. సొంత పారీ్టలో వేరు కుంపట్లు మరొక వైపు.. నేతల మద్య శిఖ పట్లు ఇంకొక వైపు ముఖ్య నాయకుల మధ్య సఖ్యత లేమి వెరసి.. కారు పార్టీ జోరుకు బ్రేకులు వేస్తున్నది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్, బడంగ్‌పేట మీర్‌పేట్, బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్లు, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, దుండిగల్, కొంపల్లి, తూముకుంట, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహింపట్నం, నార్సింగ్, శంషాబాద్, తుర్కయాంజాల్, తుక్కుగూడ, జల్‌పల్లి, మణికొండ, ఆదిభట్ల అమనగల్లు, షాద్‌నగర్‌ మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.

కాగా గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలను పోల్చుకుంటే ఇతర పార్టీల ఓట్లు పెరిగాయి. ఇటీవల మన నగరం వంటి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అభివద్ధి పనులకు శంకుస్థాపనలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చేపట్టడం ద్వారా ప్రజలను ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి తరుణంలో జరుగుతున్న పుర ఎన్నికల పోరులో పట్టణ ప్రాంత ఓటర్లు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటున్నారా? లేదా వ్యతిరేకంగా నిలుస్తున్నారా ? అన్న విషయం సస్పెన్స్‌గా మారింది. 

మేడ్చల్‌ 
నియోజకవర్గంలోని జవహర్‌నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, కార్పొరేషన్లు, దమ్మాయిగూడ, నాగారం, ఘట్‌కేసర్, పోచారం, నాగారం, దమ్మాయిగూడ, తూముకుంట, మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో 210 వార్డులున్నాయి. ఇందులో నాలుగు వార్డులను టీఆర్‌ఎస్‌  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఇక్కడ నుంచి  మంత్రి  చామకూర మల్లారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో  పురపోరు ప్రతిష్టాత్మకంగా మారింది.  మాజీ ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డితో ఉన్న విభేదాలు బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్‌కేసర్‌ పురపాలక సంఘాలపై ప్రత్యక్షంగా మిగతా వాటిపై పరోక్షంగా ప్రభావం చూపనున్నాయి. దీనికి తోడు రెబల్స్‌  గుబులు .. బోడుప్పల్‌లో 11 చోట్ల జవహర్‌నగర్‌లో 10, పీర్జాదిగూడలో ఏనమిది, నాగారంలో ఐదు, తూముకుంటలో ఏనమిది, ఘట్‌కేసర్‌లో ఏడు, మేడ్చల్‌లో 20, గండ్లపోచంపల్లిలో ఒక చోట రెబల్స్‌ బరిలో ఉన్నారు.

నియోజకవర్గంలో అసెంబ్లీ, పార్టమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మోజారిటీ పరిశీలిస్తే కొంత మేరలో పడిపోయింది. దీంతో పుర పోరును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీఆర్‌ఎస్‌ మున్సిపాలిటీలకు పార్టీ ఇన్‌చార్జులను నియమించినప్పటికీ అన్నీ తానై మంత్రి మల్లారెడ్డి, అల్లుడు మల్కాజిగిరి పార్లమెంట్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ మర్రి రాజశేఖర్‌రెడ్డి తనయులు, కూతురు  ఎన్నికల బాధ్యతలు మీద వేసుకుని పని చేస్తున్నారు. గతంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలతో పాటు ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికల్లో  నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించిన మల్కాజిగిరి పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌ రాజశేఖర్‌రెడ్డి మేడ్చల్‌తో పాటు మరి కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ గెలుపు బాధ్యతలను భుజస్కందాలపై వేసుకొని ఎన్నికలప్రచారం నిర్వహిస్తున్నారు.

మహేశ్వరం
బడంగ్‌పేట్, మీర్‌పేట్‌ కార్పొరేషన్లు, తుక్కుగూడ, జల్‌పల్లి మున్సిపాలిటీలో 121 వార్డులుండగా, అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నీ తానై చూసుకుంటోంది. ఇక్కడ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే  తీగల కృష్ణారెడ్డి మద్య అధిపత్య పోరు కారణంగా మీర్‌õపెట్‌లో 8 డివిజన్లు, తుక్కగూడలో నాలుగు వార్డుల్లో రెబల్స్‌ పోటీలో ఉన్నారు. జల్‌పల్లిలో ఎంఐఎం 24 చోట్ల పోటీ చేస్తున్నది. గతంలో  ఈ మున్సిపాలిటీ నాలుగు గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పడు ఎంఐఎం 16 ఎంపీటీసీలను గెలుచుకుంది. ఇక్కడ ఎంఐఎం, కాంగ్రెస్‌లను ఎదుర్కోవడం ద్వారా టీఆర్‌ఎస్‌కు పట్టం గట్టడంతో పాటు మిగతా పురపాలక సంఘాల్లో గులాబీ జెండాను ఎగుర  వేయడం లక్ష్యంగా  మంత్రి సబిత  ఎన్నికల ప్రచారాన్ని  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.  

ఇబ్రహీంపట్నం  
నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, పెద్ద అంబర్‌పేట్, తుర్కంజాల్‌ మున్సిపాలిటీల్లో 87 వార్డులుండగా, రెండు వార్డులను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మిగతా 85 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ విజయం కోసం అన్నీ తానై స్థానిక ఎమ్మెల్యే మంచికంటి కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే లోక్‌సభ ఎన్నికల్లో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ మోజారిటీ బాగా తగ్గింది. పెద్దఅంబర్‌పేట్‌లో ఒక వార్డుతో పాటు మిగతా మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో రెబల్స్‌ ఉన్నారు. పైగా నాయకుల మధ్య అంతర్గత అధిపత్య పోరు నడుస్తున్నది. దీన్ని అధిగమించడం ద్వారా అభ్యర్థుల గెలుపు తథ్యంగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఎన్నికల బాధ్యతలను మీద వేసుకుని పని చేస్తున్నారు. 

కుత్బుల్లాపూర్‌   
నియోజకవర్గంలోని నిజాంపేట్‌ కార్పొరేషన్, కొంపెల్లి, దుండిగల్‌ మున్సిపాలిటీల్లో 79 వార్డులుండగా, ఇందులో రెండు వార్డులను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక్కడ అన్నీ తానై ఎన్నికల బాధ్యతలను మీద వేసుకున్న స్థానిక ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ మధ్య నెలకొన్న అధిపత్య పోరు దుండిగల్‌ మున్సిపాలిటీపై ప్రభావం చూపుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. దుండిగల్‌లో నాలుగు చోట్ల టీఆర్‌ఎస్‌కు రెబల్స్‌ బెడద ఉంది. మూడు పురపాలక సంఘాలకు పార్టీ ఇన్‌చార్జులను అధిష్టానం నియమించినప్పటికీ, అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 

రాజేంద్రనగర్‌  
నియోజకవర్గంలోని బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌తో పాటు శంషాబాద్, మణికొండ, నార్సింగ్, మున్సిపాలిటీలు ఉండగా ఇందులో 85 వార్డులున్నాయి. టీఆర్‌ఎస్‌ గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు సొంత పార్టీలోని నేతల మద్య ఉన్న అధిపత్య పోరు ఎటువైపు దారి తీస్తుందోనన్న అందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది. దీనికి తోడు బండ్లగూడలో రెండు చోట్ల రెబల్స్‌తో పాటు మిగతా మున్సిపాలిటీల్లో కూడా తిరుగుబాటు దారులున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రకా‹Ùగౌడ్‌ అన్నీ తానై పుర ఎన్నికల పోరులో నిమగ్నమై పని చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement