kuthbullapur
-
5 అంత వీజీ కాదు!
రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగటున ఓటర్ల సంఖ్య 2.5లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. ఆ మేరకు ఓటర్లున్న చోట గెలిచేందుకు అభ్యర్థులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ రాష్ట్రంలోని ఓ ఐదు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులు అందరికన్నా ఎక్కువగా తంటాలు పడక తప్పని పరిస్థితి. ఎందుకంటే అవి రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఓటర్లున్న సెగ్మెంట్లు. వీటిలో ఓటర్ల సంఖ్య 5 లక్షలపైనే. ఇందులోనూ రెండింటిలో అయితే ఆరు లక్షలపైనే ఓటర్లు ఉన్నారు. అంటే రెండు, మూడు సాధారణ నియోజకవర్గాలతో సమానం అన్నమాట. ఇవన్నీ హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నవే. వీటిలో శేరిలింగంపల్లి (6.98 లక్షలు), కుత్బుల్లాపూర్ (6.69 లక్షలు), ఎల్బీనగర్ (5.66 లక్షలు), రాజేంద్రనగర్ (5.52 లక్షలు), మహేశ్వరం (5.17 లక్షలు) ఉన్నాయి. ఇవన్నీ నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో కొత్తగా ఏర్పడినవే కావడం గమనార్హం. ఎక్కువ మంది ఓటర్లేకాదు.. బస్తీల నుంచి గేటెడ్ కమ్యూనిటీల దాకా, అత్యంత సంపన్నుల నుంచి కూలీపని చేసుకునేవారి దాకా విభిన్న వర్గాలు, కులాలు, వివిధ మతాల ప్రజలు వీటిలో ఉన్నారు. వీరందరినీ ఆకట్టుకుని ఓట్లుగా మలచుకోవడం ఆషామాషీ కాదు. ఖర్చు కూడా ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితి. ఈ నియోజకవర్గాల గురించి ఒక్కసారి తెలుసుకుందామా.. శేరిలింగంపల్లి టాప్ రాష్ట్రంలో ఎక్కువ ఓటర్లున్న నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఇక్కడ 6,98,133 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 2009లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన బీసీ నేత భిక్షపతియాదవ్.. టీడీపీ అభ్యర్థి మొవ్వ సత్యనారాయణపై 1,327 ఓట్ల తేడాతో గెలిచారు. 2014లో టీడీపీ, బీజేపీ కూటమి తరఫున కమ్మ సామాజికవర్గ నేత అరికపూడి గాందీ.. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌గౌడ్‌పై 75,904 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018 ఎన్నికల్లో అరికపూడి గాంధీ బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థిపై భవ్య ఆనంద్‌పై 44,194 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కుత్బుల్లాపూర్ బీసీ నేతలదే.. ఓటర్ల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6,69,361 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి జనం తొలి నుంచీ బీసీ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. 2009లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్‌పై స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసిన కూన శ్రీశైలంగౌడ్ 23,219 ఓట్లతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ నేత కె.హన్మంతరెడ్డిపై టీడీపీ తరఫున బరిలోకి దిగిన కేపీ వివేకానందగౌడ్ 39,021 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరిన వివేకానంద.. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌పై 41,500 ఓట్ల తేడాతో గెలిచారు. ఎల్బీనగర్లో ఖాతా తెరవని బీఆర్ఎస్ ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గాల్లో మూడోదైన ఎల్బీనగర్లో 5,66,866 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో టీడీపీ అభ్యర్థి ఎన్వీ కృష్ణప్రసాద్‌పై కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి 13,142 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్‌పై టీడీపీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య 12,525 ఓట్లతో విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌పై కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 17,251 ఓట్లతో గెలిచారు. తర్వాత కొద్దిరోజులకే ఆయన బీఆర్ఎస్లో చేరారు. బీసీలకే రాజేంద్రనగర్ మద్దతు ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలో నాలుగో స్థానంలోని రాజేంద్రనగర్‌లో 5,52,455 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో ఏర్పాటైనప్పటి నుంచీ బీసీ నేత ప్రకాశ్‌గౌడ్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రకాశ్‌గౌడ్.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జ్ఞానేశ్వర్‌పై విజయం సాధించారు. తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ప్రకాశ్‌గౌడ్.. టీడీపీ అభ్యర్థి గణేశ్‌పై 57,331 ఓట్లతో భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహమత్‌కు 46 వేలకుపైగా ఓట్లు రావడం గమనార్హం. ఐదో స్థానంలోని మహేశ్వరంలో.. మహేశ్వరం నియోజకవర్గం ఎక్కువ ఓటర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. 2009లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పి.సబితా ఇంద్రారెడ్డి 7,833 ఓట్లతో గెలిచారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో తొలి మహిళా హోంమంత్రిగా వైఎస్సార్ కేబినెట్లో బాధ్యతలు చేపట్టారు. ఇక 2014లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎం.రంగారెడ్డిపై టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 30,784 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరిన కృష్ణారెడ్డి 2018లో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగగా.. ఆయనపై కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి 9,227 ఓట్లతో గెలిచారు. తర్వాత ఆమె బీఆర్ఎస్లో చేరి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -గౌటే దేవేందర్ -
గల్లా పెట్టె ఘల్లుమనేలా!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు సర్కారు భూముల అమ్మకాలు, మరోవైపు లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా ఆదాయ సముపార్జనకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకాలకు చర్యలు చేపట్టిన అధికారులు.. సర్కారు ఖజానాను భర్తీ చేసేందుకు మరిన్ని చోట్ల భూముల అమ్మకాలకు ప్రణాళికలను రూపొందించారు. హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా చోట్ల వివాదంలో ఉండడంతో లేఅవుట్ల అభివృద్ధి, ప్లాట్ల విక్రయాల్లో జాప్యం చోటుచేసుకొంటోంది. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలు లేని భూములపై అధికారులు తాజాగా దృష్టి సారించారు. గతంలోనే అమ్మకానికి సిద్ధంచేసిన లేమూరుతో పాటు, కుత్బుల్లాపూర్‌లోని హెచ్ఎంటీ భూములు, ఔటర్‌కు సమీపంలోని కుర్మగూడలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్లు వేసి విక్రయించేందుకు కార్యాచరణను సిద్ధంచేశారు. రెండు చోట్ల వెంచర్లు.. లేమూరులో ప్రభుత్వ భూమితో పాటు కొంత భూమిని రైతుల నుంచి సేకరించారు. సుమారు 44 ఎకరాల్లో ప్లాట్లను సిద్ధం చేశారు. గతంలోనే ఈ ప్లాట్లకు వేలం నిర్వహించాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యం జరిగింది. ప్రస్తుతం లేమూరు అన్ని విధాలుగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. 300 చదరపు గజాలు, 200 చదరపు గజాల చొప్పున సుమారు 350 ప్లాట్ల వరకు లేఅవుట్లు వేసి విక్రయానికి ఏర్పాట్లు చేశారు. లేమూరు భూముల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.250కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని సుమారు 90 ఎకరాల హెచ్ఎంటీ భూముల్లోనూ తాజాగా లేఅవుట్లకు సన్నాహాలు చేపట్టారు. రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, తదితర అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధం చేస్తున్నారు. స్థానికంగా ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని 150 గజాల చిన్న ప్లాట్ల నుంచి 500 చదరపు గజాల ప్లాట్ల వరకు అందుబాటులో ఉంచనున్నారు. అక్కడ గజానికి రూ.25 వేల కనీస ధర నిర్ణయించే అవకాశం ఉంది. ఔటర్‌కు సమీపంలో ఉన్న కుర్మగూడలో ప్రభుత్వానికి మరో 60 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇందులో ఇంకా లేఅవుట్ చేయాల్సి ఉంది. ఇక్కడ డిమాండ్ బాగా ఉంటుందని అంచనా. ఈ మూడు చోట్ల కలిపి ప్లాట్ల విక్రయం ద్వారా కనీసం రూ.750 కోట్లకు పైగా ఆదాయం లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు. క్రమబద్ధీకరణకు సన్నద్ధం... లేఅవుట్ల క్రమబదీ్ధకరణ కోసంఇప్పటికే చర్యలు చేపట్టిన అధికారులు నాలుగు జోన్లలో కలిపి సుమారు 1000 లే అవుట్లను గుర్తించారు. వారంతా గతంలోనే ఎల్ఆర్ఎస్ కోసం డాక్యుమెంట్లను సమర్పించారు. రూ.10 వేల ఫీజు చెల్లించారు. అధికారులు గుర్తించిన లే అవుట్లలో సుమారు 700 కు పైగా లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ను ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఈ స్థలాలన్నీ ఎకరానికి పైగా ఉన్నవే కావడంతో ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. తాజాగా హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగం అధికారులతో ఈ అంశంపై సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దీపావళి తర్వాత అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. (చదవండి: హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం) -
మాటేశారు.. 30 లక్షల సొత్తు మాయం చేశారు
సాక్షి, కుత్బుల్లాపూర్( హైదరాబాద్): పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ ఐ స్టేషన్ షట్టర్ తాళాలు పగలగొట్టి సుమారు రూ.30 లక్షల విలువచేసే ఫోన్లను దొంగలు ఎత్తుకెళ్లారు.పేట్ బషీరాబాద్ పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. జీడిమెట్ల డివిజన్ ఎన్సీఎల్ కాలనీ రెనోవా ఆస్పత్రి పక్కన ఉన్న ఐ స్టేషన్లో యాపిల్ ఫోన్లను విక్రయిస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సందీప్ అనే వ్యక్తి దుకాణం తెరిచేందుకు రాగా షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండడం గమనించాడు. దీంతో యాజమాన్యానికి తెలియజేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలానగర్ క్లూస్ టీమ్ , సీసీఎస్ సీఐ పవన్, పేట్‌బషీరాబాద్ డీఐ రాజులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మొత్తం 39 యాపిల్ ఫోన్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వీటి విలువ రూ.30 లక్షలు ఉంటుందని తెలిపారు. ప్రొఫెషనల్ దొంగలే ఈ దొంగతనం చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా బాక్స్‌ను ఎత్తుకెళ్లారు. శామీర్‌పేట్ సమీపంలో సైతం నాలుగు ప్రాంతాల్లో చోరీకి యుత్నించినట్లు తెలిసింది. సీఐ రమేష్ మరో ఆరు బృందాలు వీరి కోసం వేట ప్రారంభించారు. ఐదుగురు దొంగలు ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. -
కారుకు గెలుపు ప్రతిష్టాత్మకం
సాక్షి,మేడ్చల్ : పుర ఎన్నికల పోరు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో అధికార టీఆర్ఎస్ పారీ్టకి ప్రతిష్టాత్మకంగా మారింది. రెబల్స్ గుబులు ఒక వైపు.. సొంత పారీ్టలో వేరు కుంపట్లు మరొక వైపు.. నేతల మద్య శిఖ పట్లు ఇంకొక వైపు ముఖ్య నాయకుల మధ్య సఖ్యత లేమి వెరసి.. కారు పార్టీ జోరుకు బ్రేకులు వేస్తున్నది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్, బడంగ్‌పేట మీర్పేట్, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లు, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, దుండిగల్, కొంపల్లి, తూముకుంట, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహింపట్నం, నార్సింగ్, శంషాబాద్, తుర్కయాంజాల్, తుక్కుగూడ, జల్పల్లి, మణికొండ, ఆదిభట్ల అమనగల్లు, షాద్‌నగర్ మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. కాగా గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలను పోల్చుకుంటే ఇతర పార్టీల ఓట్లు పెరిగాయి. ఇటీవల మన నగరం వంటి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అభివద్ధి పనులకు శంకుస్థాపనలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చేపట్టడం ద్వారా ప్రజలను ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి తరుణంలో జరుగుతున్న పుర ఎన్నికల పోరులో పట్టణ ప్రాంత ఓటర్లు అధికార పార్టీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటున్నారా? లేదా వ్యతిరేకంగా నిలుస్తున్నారా ? అన్న విషయం సస్పెన్స్‌గా మారింది. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, కార్పొరేషన్లు, దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, పోచారం, నాగారం, దమ్మాయిగూడ, తూముకుంట, మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో 210 వార్డులున్నాయి. ఇందులో నాలుగు వార్డులను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఇక్కడ నుంచి మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో పురపోరు ప్రతిష్టాత్మకంగా మారింది. మాజీ ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డితో ఉన్న విభేదాలు బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్ పురపాలక సంఘాలపై ప్రత్యక్షంగా మిగతా వాటిపై పరోక్షంగా ప్రభావం చూపనున్నాయి. దీనికి తోడు రెబల్స్ గుబులు .. బోడుప్పల్లో 11 చోట్ల జవహర్‌నగర్‌లో 10, పీర్జాదిగూడలో ఏనమిది, నాగారంలో ఐదు, తూముకుంటలో ఏనమిది, ఘట్కేసర్లో ఏడు, మేడ్చల్‌లో 20, గండ్లపోచంపల్లిలో ఒక చోట రెబల్స్ బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో అసెంబ్లీ, పార్టమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మోజారిటీ పరిశీలిస్తే కొంత మేరలో పడిపోయింది. దీంతో పుర పోరును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీఆర్ఎస్ మున్సిపాలిటీలకు పార్టీ ఇన్చార్జులను నియమించినప్పటికీ అన్నీ తానై మంత్రి మల్లారెడ్డి, అల్లుడు మల్కాజిగిరి పార్లమెంట్ పార్టీ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డి తనయులు, కూతురు ఎన్నికల బాధ్యతలు మీద వేసుకుని పని చేస్తున్నారు. గతంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలతో పాటు ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించిన మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ రాజశేఖర్‌రెడ్డి మేడ్చల్‌తో పాటు మరి కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ గెలుపు బాధ్యతలను భుజస్కందాలపై వేసుకొని ఎన్నికలప్రచారం నిర్వహిస్తున్నారు. మహేశ్వరం బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లు, తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలో 121 వార్డులుండగా, అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నీ తానై చూసుకుంటోంది. ఇక్కడ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మద్య అధిపత్య పోరు కారణంగా మీర్õపెట్లో 8 డివిజన్లు, తుక్కగూడలో నాలుగు వార్డుల్లో రెబల్స్ పోటీలో ఉన్నారు. జల్పల్లిలో ఎంఐఎం 24 చోట్ల పోటీ చేస్తున్నది. గతంలో ఈ మున్సిపాలిటీ నాలుగు గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పడు ఎంఐఎం 16 ఎంపీటీసీలను గెలుచుకుంది. ఇక్కడ ఎంఐఎం, కాంగ్రెస్‌లను ఎదుర్కోవడం ద్వారా టీఆర్ఎస్కు పట్టం గట్టడంతో పాటు మిగతా పురపాలక సంఘాల్లో గులాబీ జెండాను ఎగుర వేయడం లక్ష్యంగా మంత్రి సబిత ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, పెద్ద అంబర్పేట్, తుర్కంజాల్ మున్సిపాలిటీల్లో 87 వార్డులుండగా, రెండు వార్డులను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మిగతా 85 వార్డుల్లో టీఆర్ఎస్ విజయం కోసం అన్నీ తానై స్థానిక ఎమ్మెల్యే మంచికంటి కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే లోక్‌సభ ఎన్నికల్లో నియోజకవర్గంలో టీఆర్ఎస్ మోజారిటీ బాగా తగ్గింది. పెద్దఅంబర్‌పేట్‌లో ఒక వార్డుతో పాటు మిగతా మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో రెబల్స్ ఉన్నారు. పైగా నాయకుల మధ్య అంతర్గత అధిపత్య పోరు నడుస్తున్నది. దీన్ని అధిగమించడం ద్వారా అభ్యర్థుల గెలుపు తథ్యంగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఎన్నికల బాధ్యతలను మీద వేసుకుని పని చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ కార్పొరేషన్, కొంపెల్లి, దుండిగల్ మున్సిపాలిటీల్లో 79 వార్డులుండగా, ఇందులో రెండు వార్డులను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక్కడ అన్నీ తానై ఎన్నికల బాధ్యతలను మీద వేసుకున్న స్థానిక ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ మధ్య నెలకొన్న అధిపత్య పోరు దుండిగల్ మున్సిపాలిటీపై ప్రభావం చూపుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. దుండిగల్‌లో నాలుగు చోట్ల టీఆర్ఎస్కు రెబల్స్ బెడద ఉంది. మూడు పురపాలక సంఘాలకు పార్టీ ఇన్చార్జులను అధిష్టానం నియమించినప్పటికీ, అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్‌తో పాటు శంషాబాద్, మణికొండ, నార్సింగ్, మున్సిపాలిటీలు ఉండగా ఇందులో 85 వార్డులున్నాయి. టీఆర్ఎస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు సొంత పార్టీలోని నేతల మద్య ఉన్న అధిపత్య పోరు ఎటువైపు దారి తీస్తుందోనన్న అందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది. దీనికి తోడు బండ్లగూడలో రెండు చోట్ల రెబల్స్‌తో పాటు మిగతా మున్సిపాలిటీల్లో కూడా తిరుగుబాటు దారులున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రకా‹Ùగౌడ్ అన్నీ తానై పుర ఎన్నికల పోరులో నిమగ్నమై పని చేస్తున్నారు. -
ఈత రాకున్నా.. ప్రాణాలకు తెగించి..
సాక్షి, కుత్బుల్లాపూర్ : క్వారీ గుంతలో పడ్డ చిన్నారిని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఈత రాకున్నా బాలుడిని రక్షించాలన్న ఉద్దేశంతో సాహసం చేసి అందరి మన్నన్నలు పొందాడు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పేట్‌బషీరాబాద్ రంగారెడ్డిబండ సమీపంలో క్యారీ గుంత ఉంది. ఇందులో వర్షపునీరు చేరడంతో సరదాగా పిల్లలంతా నీటి పక్కన ఆడుకుంటూ ఉన్నారు. ఇంతలో మహేశ్, అంజమ్మల కుమారుడు వంశీ(4) ఒక్కసారిగా నీటిలో పడి మునిగిపోయాడు. అక్కడే మరో వ్యక్తి అంజి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని గమనిస్తున్న సంజీవ్ క్వారీగుంతలోకి ఒక్క ఉదుటున దూకీ బాలుడిని పైకి తీసుకు వచ్చాడు. అప్పటికే పూర్తిగా నీళ్లు తాగిన ఆ బాలుడు అచేతన స్థితికి చేరుకున్నాడు. వెంటనే స్థానికులు బాలుడి కడుపు, ఛాతిపై ఒత్తడంతో నీళ్లు బయటకు కక్కాడు. చిన్నారి సాధారణ స్థితిని రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
మోదీ జీతాగాడా.. రాహుల్ మనిషా..!
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ కాళ్ళ వద్ద మొకరిల్లారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీకి కూడా నెరవేర్చని టీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయ్యాలని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఖుత్బుల్లాపూర్‌లో జరిగిన మైనార్టీ సభలో రేవంత్ ప్రసంగిస్తూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తాగి రాష్ట్రాన్ని నడుతున్న కేసీఆర్‌ను అండమాన్ జైల్ల్లో పెటాల్సిన బాధ్యత పోలీస్‌లపై లేదా? అని అన్నారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు చంద్రబాబు నాయుడు పేరుని తెరమీదకు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు పట్టిన పీడవిరగడ అవ్వడానికే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను సాగనంపేందుకు ఇంటికి ఒక్కరు యుద్ధానికి సిద్ధమై బయటకు రావాలని పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రానికి సీఎంగా పాస్‌పోర్టు బ్రోకర్ ఉండాలా లేక.. కాంగ్రెస్ నాయకుడు ఉండాలా. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రానికి మోదీ జీతాగాడు సీఎంగా ఉండాలా లేక.. రాహుల్ మనిషి ఉండాలా’’ అని అన్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలి మహిళకు తీవ్ర గాయాలు
హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని కుత్బుల్లాపూర్ బ్యాంక్ కాలనీ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కాలనీలోని ఓ ఇంట్లో ఉదయం వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో.. మహిళకు తీవ్ర గాయాలు కాగా.. పేలుడు ధాటికి వంటగదితో పాటు పక్కనే ఉన్న ఓ కిరాణా షాపు ధ్వంసమయ్యాయి. -
బహిర్భూమికి వెళ్లాడు.. పేలుడుతో మృతి
కుత్బుల్లాపూర్: బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి రసాయన డ్రమ్ము పేలడంతో శరీరం ముక్కలై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనాథ్ వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం చిట్యాల గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుడు లోకేష్ (21) వారం రోజుల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చి రాంరెడ్డినగర్‌లో తన సోదరుడు చిన్నయ్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం అతను ఫాక్‌సాగర్ సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ పడి ఉన్న ఓ రసాయన డ్రమ్ము నుంచి పొగలు వస్తుండటంతో దానిని తీసుకునేందుకు ప్రయత్నించగా పెద్ద శబ్ధంతో పేలిపోయింది. దీంతో కాలనీవాసులు అక్కడికి వచ్చి చూడగా లోకేష్ శరీరం తునాతునకలై పడి ఉంది. పేట్ బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ రంగారెడ్డి, ఎస్సై శ్రీనాద్ అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతుని సోదరుడు చిన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కుత్బుల్లాపూర్‌లో రెండు డెంగ్యూ కేసులు
కుత్బుల్లాపూర్ (హైదరాబాద్): కుత్బుల్లాపూర్ ప్రాంతంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. షాపూర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చింతల్ వెంకటేశ్వరనగర్‌కు చెందిన భవ్యశ్రీ, గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన ప్రేరణ అనే బాలికలు చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారిని కుటుంబసభ్యులు బుధవారం ఆస్పత్రిలో చేరారు. వారిద్దరికీ డెంగ్యూ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. -
హాస్టల్లో యువతి ఆత్మహత్య
హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం జరిగింది. కరీంనగర్ జిల్లా ఆత్మానగర్ గ్రామానికి చెందిన వసుంధర హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్ లోని ప్రైవేటు హాస్టలో ఉంటోంది. మంగళవారం మధ్యాహ్నం ఆమె భోజనానికి రాకపోవడంతో అనుమానమోచ్చిన హాస్టల్ సిబ్బంది గది తలుపులు కొట్టారు. ఎంత కోట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందనరాలేదు. దీంతో తలుపులు పగలగొట్టి చూసే సరికి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఆత్మహత్య చేసుకొవడానికి కారణాలేంటో తెలియారాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.