మాటేశారు.. 30 లక్షల సొత్తు మాయం చేశారు | Hyderabad: Mobiles Worth Rs 30 Lakh Stolen From Shop Quthbullapur | Sakshi
Sakshi News home page

మాటేశారు.. 30 లక్షల సొత్తు మాయం చేశారు

Published Sat, Jul 3 2021 9:56 PM | Last Updated on Sat, Jul 3 2021 11:05 PM

Hyderabad: Mobiles Worth Rs 30 Lakh Stolen From Shop Quthbullapur - Sakshi

సాక్షి, కుత్బుల్లాపూర్‌( హైదరాబాద్‌): పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ ఐ స్టేషన్‌ షట్టర్‌ తాళాలు పగలగొట్టి సుమారు రూ.30 లక్షల విలువచేసే ఫోన్లను  దొంగలు ఎత్తుకెళ్లారు.పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. జీడిమెట్ల డివిజన్‌ ఎన్‌సీఎల్‌ కాలనీ రెనోవా ఆస్పత్రి పక్కన ఉన్న ఐ స్టేషన్‌లో యాపిల్‌ ఫోన్లను విక్రయిస్తారు.

శుక్రవారం ఉదయం 10 గంటలకు సందీప్‌ అనే వ్యక్తి దుకాణం తెరిచేందుకు రాగా షట్టర్‌ తాళాలు పగలగొట్టి ఉండడం గమనించాడు. దీంతో యాజమాన్యానికి తెలియజేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలానగర్‌ క్లూస్‌  టీమ్‌ , సీసీఎస్‌ సీఐ పవన్, పేట్‌బషీరాబాద్‌ డీఐ రాజులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మొత్తం 39 యాపిల్‌ ఫోన్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వీటి విలువ రూ.30 లక్షలు ఉంటుందని తెలిపారు. ప్రొఫెషనల్‌ దొంగలే ఈ దొంగతనం చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా బాక్స్‌ను ఎత్తుకెళ్లారు. శామీర్‌పేట్‌ సమీపంలో సైతం నాలుగు ప్రాంతాల్లో చోరీకి యుత్నించినట్లు తెలిసింది. సీఐ రమేష్‌ మరో ఆరు బృందాలు వీరి కోసం వేట ప్రారంభించారు. ఐదుగురు దొంగలు ఈ చోరీ చేసినట్లు గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement