show room
-
వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో కీర్తి సురేశ్ సందడి (ఫొటోలు)
-
100 పైగా షోరూమ్‌ల ఏర్పాటులో ఈవీయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ సంస్థ ఈవీయం 2023 ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 100 షోరూమ్‌లను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకూ 1,000 పైచిలుకు ఈవీ స్కూటర్లను విక్రయించినట్లు ఎలీజియమ్ ఆటోమోటివ్స్ ప్రమోటర్ ముజమ్మిల్ రియాజ్ తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో 11 డీలర్‌షిప్‌లు ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది ఆఖరు నాటికి 8 రాష్ట్రాల్లోని 25 నగరాలకు కార్యకలాపాలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రియాజ్ వివరించారు. కొత్త షోరూమ్‌లలో ఆఫ్టర్ సేల్స్ సర్వీసులు, ఫైనాన్సింగ్ సేవలు, యాక్సెసరీలు మొదలైనవన్నీ అందుబాటులో ఉంటాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య రెడ్డి తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంస్థ మెటా4 గ్రూప్‌లో భాగమైన ఎలీజియం ఆటోమోటివ్స్ .. ఈవీయం బ్రాండ్ కింద మేడిన్ ఇండియా ఎలక్ట్రిక్ టూ–వీలర్లు తయారు చేస్తోంది. చదవండి: ఆకాశమే హద్దురా.. అక్కడి ప్లాట్ ధరలకు రెక్కలు.. ఏకంగా 5 రెట్లు పెరగడంతో.. -
అనంతలో తారల సందడి.. డీజే టిల్లుతో వయ్యారి భామలు
-
విజయవాడలో నివేదా పేతురాజ్ సందడి ఫొటోలు
-
పని చేసే చోటే చోరీ!!... అయితే చివరికి...
గచ్చిబౌలి: పని చేసే గ్యారేజ్‌కు కన్నం వేసిన ఓ మెకానిక్ భారీ చోరీకి పాల్పడి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. అసీఫ్‌నగర్‌కు చెందిన మహ్మద్ తాహెర్ అయ్యప్పసొసైటీలోని శ్రీ మోటార్స్ మల్టీబ్రాండ్ లగ్జరీ కారు సర్వీసింగ్ సెంటర్లో మెకానిక్‌గా పని చేస్తున్నారు. షోరూం యజమాని గేడంపేట్లో మరో షోరూమ్‌ను ఏర్పాటు చేసేందుకు నగదు తీసుకువచ్చి సర్వీసింగ్ సెంటర్లోని అల్మారా పెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన తాహెర్ నగదు కాజేసేందుకు తన స్నేహితులైన సయ్యద్ జావెద్, సైఫ్ మొయినొద్ధీన్తో కలిసి పథకం పన్నాడు. తెల్లవారు జాము ముగ్గురు కలిసి బైక్‌పై గ్యారేజ్‌కు వచ్చారు. తాహెర్ దూరంగా ఉండి వచ్చిపోయేవారిని గమనిస్తుండగా, సైఫ్ మొయినొద్ధీన్ సర్వీస్ సెంటర్ వెనక డోర్ స్క్రూలు తొలగించి లోపలికి ప్రవేశించాడు. లాకర్‌ను తెరిచి నగదు తీసుకెళ్లాడు. మర్నాడు వాచ్మెన్ బాలరాజు అల్మారా తలుపు తెలిచి ఉండటాన్ని గుర్తించి యజమానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు తాహెర్గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. అతడు ఇచ్చిన సమాచారంతో మిగతా నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.55 లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. చోరీ సొత్తు మూడు భాగాలుగా.. చోరీ చేసిన సొమ్మును తాహెర్ రూ.20 లక్షలు, జావెద్ రూ.20 లక్షలు, సైఫ్ మొయినొద్ధీన్ రూ.15 లక్షలు పంచుకున్నారు. అయితే ఇందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు తాహెర్ యథావిధిగా సర్వీసింగ్ సెంటర్‌కు వస్తున్నాడు. దాదాపు 45 మందిని విచారించిన పోలీసులు చివరికి తాహెర్‌ను నిందితుడిగా గుర్తించారు. సమావేశంలో మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, సీఐ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఓటీ సీఐ శివ ప్రసాద్, ఎస్ఐ విజయ వర్ధన్ పాల్గొన్నారు. -
మాటేశారు.. 30 లక్షల సొత్తు మాయం చేశారు
సాక్షి, కుత్బుల్లాపూర్( హైదరాబాద్): పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ ఐ స్టేషన్ షట్టర్ తాళాలు పగలగొట్టి సుమారు రూ.30 లక్షల విలువచేసే ఫోన్లను దొంగలు ఎత్తుకెళ్లారు.పేట్ బషీరాబాద్ పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. జీడిమెట్ల డివిజన్ ఎన్సీఎల్ కాలనీ రెనోవా ఆస్పత్రి పక్కన ఉన్న ఐ స్టేషన్లో యాపిల్ ఫోన్లను విక్రయిస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సందీప్ అనే వ్యక్తి దుకాణం తెరిచేందుకు రాగా షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండడం గమనించాడు. దీంతో యాజమాన్యానికి తెలియజేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలానగర్ క్లూస్ టీమ్ , సీసీఎస్ సీఐ పవన్, పేట్‌బషీరాబాద్ డీఐ రాజులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మొత్తం 39 యాపిల్ ఫోన్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వీటి విలువ రూ.30 లక్షలు ఉంటుందని తెలిపారు. ప్రొఫెషనల్ దొంగలే ఈ దొంగతనం చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా బాక్స్‌ను ఎత్తుకెళ్లారు. శామీర్‌పేట్ సమీపంలో సైతం నాలుగు ప్రాంతాల్లో చోరీకి యుత్నించినట్లు తెలిసింది. సీఐ రమేష్ మరో ఆరు బృందాలు వీరి కోసం వేట ప్రారంభించారు. ఐదుగురు దొంగలు ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. -
షోరూంలోనే రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి వాహనం కొన్న తరువాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్), హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ కోసం ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ మేరకు వాహనదారులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం ఓ కొత్త జీవోను వెలువరించింది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) స్థానంలో ఏకంగా ఒకేసారి శాశ్వత రిజిస్ట్రేషన్ చేసేస్తారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్, హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌తో కొత్త వాహనం రోడ్డెక్కేయొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానం విజయవంతంగా అమలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ అమల్లోకి తెచ్చేందుకు రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది. మొదట హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్ రమేశ్ తెలిపారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్ అనుభవాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి విధి విధానాలను రూపొందించనున్నారు. ప్రస్తుతం ఉన్న పద్ధతుల్లో మార్పులు, జీవితకాల పన్ను చెల్లింపుల్లోనూ, ఎక్స్‌షోరూమ్ ప్రైస్ (వాహన తయారీ ధరలు) వెల్లడించకపోవడం వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. అలాగే ప్రస్తుతం ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వాహనాలను కలిగి ఉంటే అదనంగా 2 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఇలాంటి అదనపు వసూళ్లకు ఎలాంటి పద్ధతులను అనుసరించాలనేది అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. అన్ని కోణాల్లోనూ సమగ్రంగా పరిశీలించిన అనంతరం జీవో అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులకు దీంతో ఒకింత ఊరట ఉన్నా షోరూమ్‌ల్లో అక్రమాలు జరిగే అవకాశం ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే హ్యాండ్లింగ్ చార్జీలు, ఎక్స్ట్రా ఫిట్టింగ్‌ల పేరిట వాహనదారులపైన రూ.3,000 నుంచి రూ.5,000 వరకు అదనంగా భారం మోపుతున్నారు. ప్రస్తుతం వాహనదారుడి పేరు, చిరునామా, ఆధార్ నంబర్, వాహ నం చాసీస్ నంబర్, ఇంజన్ నంబర్ల నమోదులోనే తరచుగా తప్పులు దొర్లుతున్నాయి. ఈ పొరపాట్లను సవరించుకొనేందుకు వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాల్లో రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. షోరూమ్‌ల్లో రిజిస్ట్రేషన్లతో ఇది మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అంతేగాక ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. -
దర్జాగా చోరీలు!
మేడికొండూరు: వరుస దొంగతనాలతో మేడికొండూరు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గురువారం అర్థరాత్రి సిరిపురం వద్ద ఉన్న ఇందిరా ఏజెన్సీస్ దుకాణంలో దొంగలు విజృంభించి నాలుగు విలువైన టీవీలను అపహరించారు. గ్రామానికి చెందిన నాగభైరు సురేష్ ఇందిరా ఏజెన్సీస్ పేరిట ఎలక్ట్రానిక్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి వ్యాపారం ముగించుకుని కూత వేటు దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం దుకాణంలో ఏదో పని ఉందని వచ్చి చూసేసరకి షట్టరు తాళాలు పగలగొట్టటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం పరిసరాలను పరిశీలించారు. దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నమోదయిన దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తొలుత ఇద్దరు వ్యక్తులు దుకాణంలోకి ప్రవేశించి టివీలు తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదయ్యాయి. ఒక వ్యక్తి ముఖానికి మాస్కు, చేతి వేలిముద్రలు పడకుండా గ్లౌజులు వేసుకొంటున్న దృశ్యాలు కనిపించాయి. సుమారు నాలుగు విలువైన టీవీలు పోయాయని బాధితుడు చెబుతున్నాడు. ఇదిలా ఉండగా రాత్రి వేళల్లో పోలీసులు సరైన గస్తీ కాయకపోవడంతో దొంగలు విజృంభిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. దొంగల బెడదతో రాత్రివేళల్లో నిద్ర కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మాట వినకుంటే కనెక్షన్ కట్టే!
* ఓ షోరూం నిర్వాహకులపై వేధింపులు * తమ షోరూం నుంచి వాహనాలు కొనుగోలు చేయాలంటూ హుకుం * మాట వినకపోవడంతో విద్యుత్ కనెక్షన్ కట్ చేయించిన వైనం * నోటీసు ఇచ్చినరోజే హడావిడిగా విద్యుత్ సరఫరా నిలిపివేత ఆయన కన్ను పడితే కబ్జాలే.. మాట వినకుంటే మటాషే.. అడిగినంత ఇవ్వాల్సిందే.. చెప్పింది చెయ్యాల్సిందే.. ఏ వ్యాపారం అయినా తన వాటా తేల్చాల్సిందే.. తాను చేసే వ్యాపారం ఎవరు చేసినా అందులో తనకు లబ్ధి కలగాల్సిందే.. లేదంటే బెదిరింపులు.. అప్పటికీ మాట వినకుంటే వేధింపులు.. అధికారులను రంగంలోకి దించి ఆర్థికంగా నష్టం కలిగించే చర్యలకు దిగుతారు.. - సాక్షి, గుంటూరు సత్తెనపల్లి పట్టణంలో 15 ఏళ్లుగా ఓ ద్విచక్రవాహనం షోరూమ్‌ను నిర్వహిస్తున్న వ్యాపారిని ముఖ్యనేత తనయుడు గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. గుంటూరులో ఉన్న తమ షోరూమ్ నుంచి ద్విచక్రవాహనాలను కొనుగోలు చేసి అమ్మకాలు జరపాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో ఏఆర్డీగా ఉండే షోరూమ్ ప్రస్తుతం ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌గా గుర్తింపు పొందింది. కంపెనీ వారి ఆదేశాలతో మొదటì నుంచి గుంటూరులోని ఓ షోరూమ్ ద్వారా ద్విచక్రవాహనాలను దిగుమతి చేసుకుని వీరు అమ్మకాలు జరుపుతున్నారు. అయితే సత్తెనపల్లిలో వాహనాల కొనుగోళ్లన్నీ తమ షోరూమ్ నుంచి జరగాలంటూ ముఖ్యనేత తనయుడు పట్టుబట్టాడు. దీనిపై వారు.. కంపెనీ సూచించిన మేరకే గుంటూరులో కొనుగోలు చేస్తున్నామని తెలియజేశారు. దీంతో తమ మాట వినలేదని ఆగ్రహం చెందిన సదరు ముఖ్యనేత తనయుడు విద్యుత్ అధికారులను ప్రయోగించి సదరు షోరూమ్‌పై దాడులు చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం సదరు షోరూమ్‌కు వెళ్లిన విద్యుత్ అధికారులు 14 కేవీ లోడు వాడాల్సి ఉండగా, 17 కేవీ లోడు వాడుతున్నారని, మిగతా డబ్బులు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు. సాధారణంగా నోటీసులు ఇచ్చిన తరువాత కొన్ని రోజులపాటు వీరు డబ్బు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. అయితే మొదటిసారి నోటీసులు ఇచ్చిlవెళ్లిన అధికారులు.. అదేరోజు రెండోసారి మళ్లీ షోరూమ్‌కు వచ్చి విద్యుత్ కనెక్షన్ కట్ చేసి సరఫరా నిలిపివేశారు. దీనిపై షోరూమ్ నిర్వాహకులు విద్యుత్ అధికారులను నిలదీయగా, తమపై ఉన్న ఒత్తిళ్లు అర్థం చేసుకోవాలంటూ చెప్పి వెళ్లిపోయారు. అయితే సదరు షోరూమ్ నిర్వాహకులు వెంటనే 3 కేవీకి డబ్బులు చెల్లించి తిరిగి విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరించుకున్నారు. అయినప్పటికీ ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేయాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వివరణ ఇదీ... ఈ విషయంపై విద్యుత్ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా అధిక లోడు వాడుతుండటంతో విద్యుత్ కనెక్షన్ కట్ చేశామని, డబ్బు చెల్లించగానే పునరుద్ధరించామని చెప్పారు. నోటీసు ఇచ్చిన తరువాత సమయం ఉంటుంది కదా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేశారు. పెచ్చుమీరుతున్న దౌర్జన్యాలు... నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో వ్యాపారులు, కాంట్రాక్టర్లపై ముఖ్యనేత తనయుని దాషీ్టకాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో వీరు మరింతగా రెచ్చిపోతున్నారు. వీరు చేసే అక్రమ దందాలకు అధికారులను ప్రయోగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు సైతం వీరిపై చర్యలు చేపట్టకుండా చూసీచూడనట్లు వదిలేయడం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రవాణా శాఖ సేవలూ ఇకపై ఆన్లైన్లోనే..
–ఇక ఏజెంట్ల వ్యవస్థకు చెక్ –15 నుంచి షోరూముల్లో రిజిస్ట్రేషన్లు –వినియోగదారులకు ఊరట తణుకుః రవాణాశాఖలో సంస్కరణలు తెచ్చేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆన్లైన్ సేవలను అందిస్తుండగా ఈనెల 15 నుంచి షోరూముల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్లు చేయించుకునేలా కసరత్తు చేస్తున్నారు. రవాణాశాఖ కార్యాలయల్లో రిజిస్ట్రేషన్లకు స్వస్తి పలికేందుకు ఈ విధానం అమలు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా కాలంగా తాత్కాలిక రిజిస్ట్రేషన్లతో ఉంటున్న వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసి ఆయా షోరూముల్లో రిజిస్ట్రేషన్లు చేయడానికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ విధానాన్ని జిల్లాకు వర్తింపజేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. సేవలన్నీ ఆన్లైన్... జిల్లాలోని అన్ని రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసి ఆన్లైన్లో వాహనాల రిజిస్ట్రేషన్లు పూర్తిగా జరిగేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీంతోపాటు ఫ్యాన్సీ నెంబర్లు సైతం ఆన్లైన్లో ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఏలూరు జిల్లా ఉపరవాణాశాఖ కార్యాలయం, భీమవరంలోని ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంతోపాటు తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో యూనిట్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల పరిధిలోని వాహన రిజిస్ట్రేషన్లు, డ్రై వింగ్ లైసెన్సులు, వాహన ఫిట్నెస్లు, రిజిస్ట్రేషన్, లైసెన్సుల రెన్యువల్స్, నకళ్లు వంటి 83 రకాల సేవలు అందిస్తుంటారు. ప్రసుతం ఈ సేవలన్నీ పొందడానికి వాహనదారులు ఆయా కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కొందరు ఏజెంట్లు అధికారులు, వాహనదారులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా వాహనదారులే ఆన్లైన్ ద్వారా సేవలు పొందడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రస్తుతం కార్యాలయాల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆయా వాహన షోరూములకు అప్పగించనున్నారు. దీంతో వాహనం కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. వేలిముద్రతో సేవలు... మీసేవ, ఏపీ ఆన్లైన్ సేవా కేంద్రాల్లో రవాణా సేవలు లభించనున్నాయి. ఇంటర్నెట్ కేంద్రాలు, వ్యక్తిగతంగా ఆన్లైన్లో సేవలు పొందే అవకాశం ఉంది. ఆయా సేవలకు ప్రభుత్వం నిర్థేశించిన ఫీజులతోపాటు నామమాత్రపు సర్వీసు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే వాహనదారుడు వేలి ముద్రతో సేవలు అందుకోవాల్సి ఉంది. ఇçప్పటికే ఆధార్ నమోదులో ఐరిస్, వేలిముద్రలు సేకరించడంతో రవాణాశాఖలో ప్రతి సేవకు ఆధార్ తప్పనిసరి కానుంది. షోరూంలో వాహనం కొనుగోలు చేయగానే 15 నిమిషాల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్, గంట వ్యవధిలో శాశ్వత రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఇందుకు వాహనదారుడి సంతకం, వేలిముద్రలు అప్లోడ్ చేస్తారు. ప్రతి దరఖాస్తు ఆన్లైన్లో రవాణాశాఖకు చేరుతుంది. సంతకం, ఆధార్‌లోని వేలిముద్ర సరిపోల్చడంతో సేవలు పూర్తవుతాయి. అనంతరం పత్రాలు వాహన యజమాని ఇంటికి పంపిస్తారు. ఈ విధానంపై జిల్లాలోని ఆయా షోరూం యాజమాన్యాలకు ఈనెల 13, 14 తేదీల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి 15నుంచి అమలు చేయనున్నారు. ఫ్యాన్సీ నెంబర్లు విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫ్యాన్సీ నెంబర్ కావాల్సిన వాహనదారులు ఆయా రవాణాశాఖ కార్యాయాల్లో సంప్రదించాల్సి ఉంది. కార్యాలయానికి రానవసరం లేదు... వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వాహనదారుడు కార్యాలయానికి రాకుండానే శాశ్వత రిజిస్ట్రేషన్ పొందవచ్చు. ఇందుకు వాహనదారుడి వేలిముద్రలు తీసుకోవడంతోపాటు వాహనం ఫొటోలు తీసి కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. అనంతరం కార్యాలయ అధికారులు నిర్థారించిన తర్వాత గంట వ్యవ««ధిలో శాశ్వత రిజిస్ట్రేషన్ పొందవచ్చు. ఫ్యాన్సీ నెంబర్ల విషయంలో 15 రోజుల్లో స్పష్టత రానుంది. – ఎస్.సత్యనారాయణమూర్తి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, ఏలూరు -
లేపాక్షి షోరూమ్‌లో వెడ్డింగ్ ఫర్నీచర్
-
షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ చార్జీ చెల్లింపు
హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీ చెల్లింపుల కోసం రవాణ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా షోరూమ్‌లో వాహనాన్ని కొనేప్పుడే రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించే కొత్త విధానం సోమవారం అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు రవాణా శాఖ కార్యాలయాల్లోనే ఆ రుసుము చెల్లించే విధానం ఉంది. కానీ రవాణా శాఖ కార్యాలయాలు తక్కువగా ఉండటం, సిబ్బంది కొరత, తదితర కారణాలతో జాప్యం జరుగుతుండటాన్ని గుర్తించిన రవాణాశాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. -
నెల్లూరులో హీరోయిన్ తమన్నా సందడి!
-
షోరూంలో బైకులను గుట్టుగా అమ్మేశారు!
హైదరాబాద్: నగరంలోని ఓ ద్విచక్ర వాహన షోరూంలో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. యజమానికి తెలియకుండానే షోరూం సిబ్బంది బైకులను విక్రయించి ఆ నగదును నొక్కేశారు. వీటిని కొన్నవారు సదరు వాహనాలు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. షోరూం యజమాన్యం ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. టోలిచౌకిలోని హోండా బైక్స్ షోరూంలో పనిచేసే ఏడుగురు సిబ్బంది యజమానికి తెలియకుండా 27 బైకులను వినియోగదారులకు విక్రయించి వచ్చిన సొమ్మును పంచుకున్నారు. ఈ తతంగం రెండు నెలల నుంచి సాగింది. వీటిని కొన్నవారికి నకిలీ రసీదులు ఇవ్వడంతో వాటికి ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో పలువురు వినియోగదారులు షోరూంకు వచ్చి సిబ్బందిని నిలదీయగా రేపుమాపు అంటూ సిబ్బంది నెట్టుకొస్తున్నారు. ఎంతకు వాహనాల రిజిస్ట్రేషన్ కాకపోవడంతో అనుమానం వచ్చిన వినియోగదారులు విషయాన్ని షోరూం యజమాని దృష్టికి తీసుకెళ్లగా ఆయన రికార్డులు తనిఖీ చేశారు. దీంతో బైకుల స్కాం వెలుగులో వచ్చింది. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు షోరూంలో పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని వీరు విక్రయించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
‘రేసుగుర్రం’ కాదు..రెక్కలగుర్రం ఎక్కినంత సంతోషంగా ఉంది..
మీ అభిమానం చూస్తుంటే.. ‘రేసుగుర్రం’ కాదు..రెక్కలగుర్రం ఎక్కినంత సంతోషంగా ఉంది..రాజమండ్రిలో శుక్రవారం ‘జాయ్ అలుక్కాస్’ షోరూమ్‌ను ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా తనను చూసేందుకు పోటీపడ్డ అభిమానులకు అభివాదం చేస్తున్న హీరో అల్లు అర్జున్. జాయ్ అలుక్కాస్ షోరూం ప్రారంభం ప్రముఖ వజ్రాభరణాల వ్యాపార సంస్థ జాయ్ అలుక్కాస్ కొత్త షోరూంను రాజమండ్రిలో శుక్రవారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించారు. శ్యామలా సెంటర్లో ఈ షోరూం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత తిరుపతిలో ఉదయం 10.30 గంటలకు జాయ్ అలుక్కాస్ నూతన షోరూంను ప్రారంభించిన అనంతరం 2.30 గంటలకు విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. రోడ్డు మార్గంగుండా రాజమండ్రి చేరుకుని ఓ హొటల్లో విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం ఐదు గంటలకు రాజమండ్రి షోరూంకు చేరుకున్నారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించిన బన్నీ..అనంతరం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నగర మేయర్ పంతం రజనీ శేషసాయి, అర్బన్ ఎస్పీ రవికుమార్ మూర్తితో కలిసి దీపారాధన చేశారు. ఆతర్వాత షోరూంలో నగల ప్రదర్శనను వీక్షించారు. కోనుగోలు చేసేందుకు వచ్చిన వారికి నగలు అందించారు. అనంతరం బయట తన కోసం ఎదరు చూస్తున్న అభిమానులను ఉద్దేశించి అర్జున్ మాట్లాడారు. అలుక్కాస్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం తన అదృష్టంగా పేర్కొన్నారు. షోరూం ప్రారంభోత్సవానికి రాజమండ్రి వచ్చే భాగ్యాన్ని కలుగచేసిన సంస్థ నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగర మేయర్ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ ప్రముఖ వజ్రాభరణాల సంస్థ రాజమండ్రిలో వ్యాపార విభాగాన్ని ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. సంస్థ నిర్వాహక ప్రముఖులు పాల్గొన్నారు. - సాక్షి, రాజమండ్రి నాకు కొడుకు పుట్టాడు సాక్షి, రాజమండ్రి : ‘నాకు మొన్ననే కొడుకు పుట్టాడు. వాడి ఫొటోలు తొందర్లో నే మీకోసం రిలీజ్ చేస్తా’ అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పుత్రోత్సాహాన్ని రాజమండ్రిలో అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ వజ్రాభరణాల విక్రయ సంస్థ జాయ్ అలుక్కాస్ షోరూంను రాజమండ్రిలో ప్రారంభించేందుకు వచ్చిన అర్జున్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శ్యామలా సెంటర్లో షోరూం ప్రారంభం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కి అర్జున్ తన అభిమానులతో మాట్లాడారు. అభిమానులను చూసి ‘దేవుడా’ అంటూ రేసుగుర్రం డైలాగు చెప్పడంతో జనం కేరింతలు కొట్టారు. స్టెప్పులు వేయాలంటూ కేకలు వేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను నటిస్తున్న సినిమా త్వరలో మీముందుకు రాబోతోందని వెల్లడించారు. తన రేసుగుర్రం గురువారంతో వంద రోజులు పూర్తిచేసుకుందని, అంతటి ఘన విజయాన్ని అందచేసిన అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్నానన్నారు. తన పట్ల రాజమండ్రి ప్రజలు ఎప్పుడూ ప్రత్యేక అభిమానం చూపుతారన్నారు.. తనకు కూడా రాజమండ్రి అంటే అభిమానం ఎక్కువని అన్నారు. తాను జాయ్ అలుక్కాస్ షోరూంలను చాలా చోట్ల ప్రారంభించానని, రాజమండ్రిలో వచ్చిన జనం ఎక్కడా చూడలేదని బన్ని ముచ్చట పడిపోయారు.