
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ సంస్థ ఈవీయం 2023 ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 100 షోరూమ్‌లను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకూ 1,000 పైచిలుకు ఈవీ స్కూటర్లను విక్రయించినట్లు ఎలీజియమ్ ఆటోమోటివ్స్ ప్రమోటర్ ముజమ్మిల్ రియాజ్ తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో 11 డీలర్‌షిప్‌లు ఉన్నట్లు చెప్పారు.
వచ్చే ఏడాది ఆఖరు నాటికి 8 రాష్ట్రాల్లోని 25 నగరాలకు కార్యకలాపాలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రియాజ్ వివరించారు. కొత్త షోరూమ్‌లలో ఆఫ్టర్ సేల్స్ సర్వీసులు, ఫైనాన్సింగ్ సేవలు, యాక్సెసరీలు మొదలైనవన్నీ అందుబాటులో ఉంటాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య రెడ్డి తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంస్థ మెటా4 గ్రూప్‌లో భాగమైన ఎలీజియం ఆటోమోటివ్స్ .. ఈవీయం బ్రాండ్ కింద మేడిన్ ఇండియా ఎలక్ట్రిక్ టూ–వీలర్లు తయారు చేస్తోంది.
చదవండి: ఆకాశమే హద్దురా.. అక్కడి ప్లాట్ ధరలకు రెక్కలు.. ఏకంగా 5 రెట్లు పెరగడంతో..