వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీ చెల్లింపుల కోసం రవాణ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా షోరూమ్‌లో వాహనాన్ని కొనేప్పుడే రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించే కొత్త విధానం సోమవారం అమలులోకి వచ్చింది.
హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీ చెల్లింపుల కోసం రవాణ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా షోరూమ్‌లో వాహనాన్ని కొనేప్పుడే రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించే కొత్త విధానం సోమవారం అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు రవాణా శాఖ కార్యాలయాల్లోనే ఆ రుసుము చెల్లించే విధానం ఉంది. కానీ రవాణా శాఖ కార్యాలయాలు తక్కువగా ఉండటం, సిబ్బంది కొరత, తదితర కారణాలతో జాప్యం జరుగుతుండటాన్ని గుర్తించిన రవాణాశాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.