I Phones
-
విపక్ష నేతల ఐఫోన్ల కు హ్యాకింగ్ అలర్ట్స్
-
మాటేశారు.. 30 లక్షల సొత్తు మాయం చేశారు
సాక్షి, కుత్బుల్లాపూర్( హైదరాబాద్): పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ ఐ స్టేషన్ షట్టర్ తాళాలు పగలగొట్టి సుమారు రూ.30 లక్షల విలువచేసే ఫోన్లను దొంగలు ఎత్తుకెళ్లారు.పేట్ బషీరాబాద్ పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. జీడిమెట్ల డివిజన్ ఎన్సీఎల్ కాలనీ రెనోవా ఆస్పత్రి పక్కన ఉన్న ఐ స్టేషన్లో యాపిల్ ఫోన్లను విక్రయిస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సందీప్ అనే వ్యక్తి దుకాణం తెరిచేందుకు రాగా షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండడం గమనించాడు. దీంతో యాజమాన్యానికి తెలియజేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలానగర్ క్లూస్ టీమ్ , సీసీఎస్ సీఐ పవన్, పేట్‌బషీరాబాద్ డీఐ రాజులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మొత్తం 39 యాపిల్ ఫోన్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వీటి విలువ రూ.30 లక్షలు ఉంటుందని తెలిపారు. ప్రొఫెషనల్ దొంగలే ఈ దొంగతనం చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా బాక్స్‌ను ఎత్తుకెళ్లారు. శామీర్‌పేట్ సమీపంలో సైతం నాలుగు ప్రాంతాల్లో చోరీకి యుత్నించినట్లు తెలిసింది. సీఐ రమేష్ మరో ఆరు బృందాలు వీరి కోసం వేట ప్రారంభించారు. ఐదుగురు దొంగలు ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. -
బెంగళూరు ఎయిర్‌పోర్టులో 206 ఐఫోన్లు సీజ్
సాక్షి, దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.2.8 కోట్ల విలువైన ఆపిల్ కంపెనీ ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అమెరికా పాస్‌పోర్టు కలిగిన భారతీయ దంపతుల నుంచి వీటిని సీజ్ చేశారు. ఫిబ్రవరి 13న ముంబై నుంచి ఫ్రాన్స్ వెళ్లిన దంపతులు ఆదివారం రాత్రి ప్యారిస్ నుంచి విమానంలో బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. అధికారులు వారి లగేజీని సోదా చేయగా రూ.2.8 కోట్ల విలువ చేసే 206 ఐఫోన్ 12ప్రొ మాక్స్ ఫోన్లు బయటపడ్డాయి. బిల్లులు చూపకపోవడంతో ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: (పెట్రోలు బాంబు మంటల్లో హీరోకు గాయాలు) -
ఐఫోన్లపై పేటీఎం మాల్ భారీ ఆఫర్లు
సాక్షి, ముంబై : ఖరీదైన ఐఫోన్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకో మంచి అవకాశం. డిజిటల్ దిగ్గజం పేటీఎం మాల్ భారీ డిస్కౌంట్ సేల్ కి తెరలేపింది. తన వెబ్సైట్లో ఐఫోన్లపై ఆకట్టుకునే క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్ ఎక్స్ఈ నుంచి ఎక్స్ఎస్ మ్యాక్స్ దాకా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఫోన్లను కొనుగోలు చేస్తే అదనంగా మరో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఆర్ తదితర ఫోన్లపై గరిష్టంగా రూ.15వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను వినియోగదారులకు అందిస్తోంది. దీంతోపాటు కొన్ని మోడల్స్‌పై ప్రోమోకోడ్ ఆఫర్ కూడా ఉంది. ఐ ఫోన్స్ ఎక్స్ మాక్స్ : 256 జీబీ స్టోరేజి వేరియంట్‌ను రూ. 1,14,156 లకే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఐ ఫోన్ ఎక్స్ఆర్ 64 జీబీ మోడల్‌ను రూ. 53,687లకే అందుబాటులో ఉంది. ఐఫోన్ ఎక్స్ : 64జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియింట్ ధరలు వరుసగా రూ. 89,999 రూ. 75,489గా ఉన్నాయి. దీంతోపాటు ఎకోడాట్ స్మార్ట్ స్పీకర్ కూడా ఉచితం.. ఐఫోన్ 8 : 64జీబీ స్టోరేజ్ వేరియింట్ రూ. 59,990. 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 70,799 ఐఫోన్ 8 ప్లస్ : ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ స్టోరేజ్ వేరియింట్ ధర రూ. 68వేలు. ఐఫోన్ 7 : 32 జీబీ వేరియంట్ ధర రూ. 39,530. 128జీబీ స్టోరేజి మోడల్ ధర రూ. 52,999. ఐఫోన్ 7 ప్లస్ : 32జీబీ 128జీబీ , 256 జీబీ స్టోరేజ్ ధరలు వరుసగా రూ. 49,899, రూ. 61,999, రూ. 64,990లు. -
ఐఫోన్ తక్కువ ధరకు అంటూ టోకరా
సాక్షి, సిటీబ్యూరో: యూకే నుంచి ఐఫోన్లు అతి తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ నమ్మించి ఉప్పల్ వాసి నుంచి రూ.1,43,000లు వసూలుయచేసిన ముంబైకి చెందిన సైబర్ నేరగాడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం ముంబై నుంచి ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరనాథ్ తెలిపిన మేరకు.. ఫేస్బుక్లో వికాస్ పేరుతో సెకండ్ హ్యండ్ మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల వ్యాపారం చేస్తానంటూ ఉప్పల్‌కు చెందిన బండి నరేశ్‌తో నిందితుడు నీలేశ్ కుమార్ పరిచయం చేసుకున్నాడు. రూ.ఐదు వేలు డిపాజిట్ చేస్తే యూకే నుంచి ఐఫోన్ సమకూరుస్తానంటూ నమ్మించాడు. అలా నిందితుడిచ్చిన బ్యాంక్ ఖాతాల్లో రూ.ఐదు వేలు జమ చేశాడు. ఆ వెంటనే మరో 24 గంటల్లో ఐఫోన్ డెలివరీ అవుతుందంటూ బాధితుడి సెల్‌నంబర్‌కు ట్రాకింగ్ ఐడీని కూడా వాట్సాప్ పంపాడు. అయితే అదే వాట్సాప్ ద్వారా పంపిన ఈ మెయిల్ ఐడీ నుంచే 18 ఐఫోన్ల పార్శిల్ పంపిస్తామంటూ, డెలివరీ చార్జీల కోసం రూ.12,500లు చెల్లించాలని మెసేజ్ వచ్చింది. ఆ వెంట పార్శిల్ బ్రోకర్‌గా ఫోన్‌కాల్ చేసిన వ్యక్తి ఇన్సూరెన్స్ కోసం రూ.22,500లు చెల్లించాలని కోరాడు. ఆ తర్వాత కస్టమ్ చార్జీలు, జీఎస్టీ, ఎయిర్‌పోర్టు క్లియకెన్స్‌లతో మొత్తం రూ.1,43,000లు వసూలు చేశాడు. అనంతరం మరో రూ.20వేలు చెల్లించాలంటూ ఫోన్‌కాల్ రావడంతో అనుమానం వచ్చిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు ఫోన్‌కాల్స్, బ్యాంక్ ఖాతాల వివరాలతో ముంబై వాసి నిందితుడు నీలేశ్ కుమార్ గుర్తించి ముంబైలో పట్టుకున్నారు. ట్రాన్సిట్ వారంట్‌పై గురువారం నగరానికి తీసుకొచ్చారు. -
ఆపిల్ ఈవెంట్ : బిగ్ ప్రైస్, బిగ్ స్క్రీన్
కొత్త కొత్త ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు విపరీతంగా ఆకట్టుకుంటున్న ఆపిల్ లేటెస్ట్ ఈవెంట్ చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆపిల్ మరో సెప్సేషనల్ ఈవెంట్‌కు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందులో యాపిల్ మూడు కొత్త ఐఫోన్లు లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఐఫోన్ ఎక్స్‌సీ (ఐఫోన్), ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్‌ను ఈ రోజు రాత్రి రిలీజ్ చేయనుందనే అంచనాలు భారీగా హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఈసారి ఐఫోన్ల బిగ్ స్క్రీన్, బిగ్ ప్రైస్ తో రానున్నాయని అంచనా. మరోవైపు రెవెన్యూ వృద్ధితో ఆపిల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్లను ( సుమారు 7లక్షల 23వేల కోట్లు రూపాయలు) ను అధిగమించింది. ఐ ఫోన్ ఎక్స్ ప్లస్ లేదా మాక్స్ : టాప్ మోడల్‌గా తీసుకొస్తున్న ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్ 6.5 అంగుళాల ఓలెడ్ స్క్రీన్ అమర్చింది. ధర సుమారు రూ.75,000 ఐఫోన్ ఎక్స్ఎస్ : 6.1 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేతో రానుంది. దీని ధర సుమారు రూ. 71,000 ఉండనుంది. ఐఫోన్ ఎక్స్‌సీ : 5.8 అంగుళాల ఓలెడ్ స్క్రీన్. ఐఫోన్ ఎక్స్‌సీ ధర రూ.57,000గా ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటితో పాటు యాపిల్ ఐప్యాడ్ ప్రో మోడల్స్‌ని కూడా లాంఛ్ చేయనుందట. ఈఈవెంట్లో సరికొత్త మ్యాక్ లైనప్ కూడా లాంఛ్ కానుందని మరో ప్రచారం జరుగుతోంది. మ్యాక్ బుక్, మ్యాక్ బుక్ ప్రో, ఐమ్యాక్‌తో పాటు మ్యాక్ మినీ కూడా ఉండొచ్చు. డిస్ప్లే పెర్ఫామెన్స్‌లో అప్‌గ్రేడ్స్ చాలా ఉంటాయని టెక్ నిపుణులు అంచనా. అలాగే ఆపిల్ వాచ్ సిరీస్‌లో ఫోర్త్ జనరేషన్ వాచ్‌ను కూడా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. అయితే ఈ అంచనాలపై ఆపిల్ నుంచి అధికారికి సమాచారం ఏదీ అందుబాటులో లేదు. Round Apple watch finally? pic.twitter.com/vo82LW2dnN — Gissur Simonarson (@GissiSim) August 30, 2018 Top stories: Exclusive look at iPhone XS & Apple Watch Series 4, Apple announces Sept 12 event, more https://t.co/bcOeAkAXXX by @ChanceHMiller pic.twitter.com/CMTWtuhFMP — 9to5Mac (@9to5mac) September 1, 2018 -
ఐ ఫోన్ ధరలకు రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ: విదేశీ మొబైల్స్ సహా, కొన్ని విద్యుత్ పరిరకాలపై దిగుమతి సుంకం పెంచడంతో స్మార్ట్‌ఫోన్ మొబైల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన మొబైల్ దిగ్గజం ఆపిల్ తన డివైస్ల రేట్లను సవరించింది. అన్ని ఐ ఫోన్ల రేట్లను అమాంతం పెంచేసింది. సగటున 3.5 శాతందాకా పెంచేసింది. సోమవారం నుంచే ఈ పెంచిన ధరలు అమల్లికి వచ్చాయి. మొబైల్ ఫోన్లు, వీడియో కెమెరాలు, టెలివిజన్‌పై దిగుమతి పన్నుల సుంకాన్ని 10నుంచి 15 శాతంగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయంతో ఆపిల్ కంపెనీ మొత్తం ఐఫోన్ పరిధి ధరల్లో మార్పులు చేసింది. ఐఫోన్ 6 రూ. 30,780 (ముందు రూ. 29,500), ఐఫోన్ ఎక్స్ ఇప్పుడు రూ. రూ. 89,000 లు పలకనుంది . ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ తాజా రివ్యూ అనంతరం వరుసగా రూ. 66,120 , రూ. 75,450 వరుసగా, (పాత ధరలురూ. 64,000 మరియు రూ. 73,000) . ఐఫోన్ 7 మరియు ఐఫోన్ 7 ప్లస్ ఇప్పుడు వరుసగారూ. 50,810 , రూ. 61,060లుగా నిర్ణయించింది. అలాగే ఐఫోన్ 6, ఐఫోన్ 6s ప్లస్ ప్రారంభ ధర ఇప్పుడు వరుసగా రూ. 41,550 , రూ. 50,740లు. కాగా స్వదేశీ ఉత్పత్తిదారులకు ప్రోత్సాహాన్నిచ్చే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విదేశీ మొబైల్స్ దిగుమతి పన్నును 15 శాతంగా నిర్ణయించింది. టీవీలు, మైక్రోవేవ్ ఒవెన్లు తదితరాలపై 20 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. ఈపెంపుతో ఇతర మొబైల్ ఫోన్లతోపాటు మరిన్ని ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు కూడా సమీప భవిష్యత్తులో పెరగవచ్చని అంచనా. -
ఐఫోన్ 8, 8 ప్లస్‌లో బ్యాటరీ సమస్య?
ఐ ఫోన్ 8 , 8 ప్లస్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చి నెల రోజులు కూడా(భారత్‌లో సెప్టెంబర్ 29) గడవకముందే షాకింగ్ నివేదికలు కలకలం సృష్టించాయి. శాంసంగ్ గెలాక్సీ 7కి చుట్టుముట్టినట్లే తాజాగా ఆపిల్ ఐఫోన్ 8కి బ్యాటరీ పరమైన సమస్యలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. రెండు దేశాల్లో రెండు వేర్వేరు సంఘటనల్లో బ్యాటరీపరంగా సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు సంఘటనలు నమోదైనట్టు తాజా నివేదికల ద్వారా వెల్లడైంది. ఒకటి తైవాన్లోనూ, మరొకటి జపాన్‌లోనూ చోటు చేసుకున్నాయి తైవాన్ మీడియా అందించిన సమాచారం ప్రకారం ఐ ఫోన్ 8 బ్యాటరీ బ్యాటరీ ఉబ్బిపోయింది. ఈ భాగం ఫోన్ ముందు భాగం ఊడి బయటకు వచ్చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విట్టర్లో హల్ చల్ చేస్తున్నాయి. తైవాన్‌కి చెందిన మహిళ మిస్. వూ 64 జీబీ స్టోరేజ్ రోజ్ గోల్డ్ ఐ ఫోన్ 8ప్లస్ కొనుగోలు చేశారు. ఐదు రోజుల తరువాత ఒరిజినల్ కేబుల్, అడాప్టర్‌తో ఛార్జింగ్ పెట్టిన మూడు నిముషాలకే ఫోన్ ముందు భాగం ఉబికి వచ్చింది. చైనాలో చోటు చేసుకున్న మరో సంఘటనలో వినియోగదారుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఫోన్ తన చేతికి వచ్చేటప్పటికే బాడీనుంచి స్క్రీన్ పూర్తిగా విడిపోయి కనిపించిందని ఐ ఫోన్ 8 ప్లస్ ఓనర్ వాపోయారు. దీనిపై విశ్లేషణ కోసం కొన్ని డివైస్‌లను ఆపిల్ సంస్థ తిరిగి పంపిస్తున్నారట. అంతేకాదు శాంసంగ్ గెలాక్స్ నోట్ 7 బ్యాటరీ పేలుళ్లకు కారణమయిన బ్యాటరీ ఉత్పత్తిదారు ఆంప్రెక్స్ టెక్నాలజీ లిమిటెడ్ (ఏఊటీఎల్) కంపెనీనే ఐ ఫోన్ 8, 8ప్లస్ బ్యాటరీలను రూపొందించినట్టుగా ఓ అనధికారిక వార్త చక్కర్లుకొడుతోంది. మరోవైపు దేశీయంగా కూడా ఐ ఫోన్8 లో కొన్ని ఆడియో సమస్యలు ఉత్పన్నమైనట్టుగా ఓ టెక్ నిపుణుడు పేర్కొన్నారు. ఈ సమస్యపై ఆపిల్ ను సంప్రదించినపుడు అది కేవలం నెట్వర్క్ సమస్య అని అయితే ఈ వార్తలపై ఆపిల్ సంస్థ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ భారీ నష్టాలు మూటగట్టుకుంది. అలాగే ఆపిల్ స్మార్ట్ఫోన్లు ఐ ఫోన్, ఐ ఫోన్ 7ప్లస్ పేలుళ్లు అక్కడక్కడా నమోదైన సంగతి తెలిసిందే. iPhoneが昨日より膨らんでる。 Apple、早く回収しにきて! pic.twitter.com/sRx6orgxi6 — まごころ (@Magokoro0511) September 25, 2017 -
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఐ ఫోన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏపీ ప్రభుత్వం ఆపిల్ ఐ ఫోన్లను బహుమతిగా ఇచ్చింది. ఏటా బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బహుమతిని ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఐ ఫోన్లను అందించారు. ఇందుకోసం దాదాపు రూ. కోటిన్నరపైగా ఖర్చు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీటీడీ ప్రసాదాలను కూడా అందజేశారు.