ఐ ఫోన్ 8 , 8 ప్లస్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చి నెల రోజులు కూడా(భారత్‌లో సెప్టెంబర్ 29) గడవకముందే షాకింగ్ నివేదికలు కలకలం సృష్టించాయి. శాంసంగ్ గెలాక్సీ 7కి చుట్టుముట్టినట్లే తాజాగా ఆపిల్ ఐఫోన్ 8కి బ్యాటరీ పరమైన సమస్యలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. రెండు దేశాల్లో రెండు వేర్వేరు సంఘటనల్లో బ్యాటరీపరంగా సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు సంఘటనలు నమోదైనట్టు తాజా నివేదికల ద్వారా వెల్లడైంది. ఒకటి తైవాన్‌లోనూ, మరొకటి జపాన్‌లోనూ చోటు చేసుకున్నాయి
తైవాన్ మీడియా అందించిన సమాచారం ప్రకారం ఐ ఫోన్ 8 బ్యాటరీ బ్యాటరీ ఉబ్బిపోయింది. ఈ భాగం ఫోన్ ముందు భాగం ఊడి బయటకు వచ్చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తున్నాయి. తైవాన్‌కి చెందిన మహిళ మిస్. వూ 64 జీబీ స్టోరేజ్ రోజ్ గోల్డ్ ఐ ఫోన్ 8ప్లస్ కొనుగోలు చేశారు. ఐదు రోజుల తరువాత ఒరిజినల్ కేబుల్, అడాప్టర్‌తో ఛార్జింగ్ పెట్టిన మూడు నిముషాలకే ఫోన్ ముందు భాగం ఉబికి వచ్చింది. చైనాలో చోటు చేసుకున్న మరో సంఘటనలో వినియోగదారుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఫోన్ తన చేతికి వచ్చేటప్పటికే బాడీనుంచి స్క్రీన్ పూర్తిగా విడిపోయి కనిపించిందని ఐ ఫోన్ 8 ప్లస్ ఓనర్ వాపోయారు. దీనిపై విశ్లేషణ కోసం కొన్ని డివైస్‌లను ఆపిల్ సంస్థ తిరిగి పంపిస్తున్నారట.
అంతేకాదు శాంసంగ్ గెలాక్స్ నోట్ 7 బ్యాటరీ పేలుళ్లకు కారణమయిన బ్యాటరీ ఉత్పత్తిదారు ఆంప్రెక్స్ టెక్నాలజీ లిమిటెడ్ (ఏఊటీఎల్) కంపెనీనే ఐ ఫోన్ 8, 8ప్లస్ బ్యాటరీలను రూపొందించినట్టుగా ఓ అనధికారిక వార్త చక్కర్లుకొడుతోంది. మరోవైపు దేశీయంగా కూడా ఐ ఫోన్8 లో కొన్ని ఆడియో సమస్యలు ఉత్పన్నమైనట్టుగా ఓ టెక్ నిపుణుడు పేర్కొన్నారు. ఈ సమస్యపై ఆపిల్ ను సంప్రదించినపుడు అది కేవలం నెట్‌వర్క్ సమస్య అని అయితే ఈ వార్తలపై ఆపిల్ సంస్థ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
కాగా శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ భారీ నష్టాలు మూటగట్టుకుంది. అలాగే ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌లు ఐ ఫోన్, ఐ ఫోన్ 7ప్లస్ పేలుళ్లు అక్కడక్కడా నమోదైన సంగతి తెలిసిందే.
iPhoneが昨日より膨らんでる。
— まごころ (@Magokoro0511) September 25, 2017
Apple、早く回収しにきて! pic.twitter.com/sRx6orgxi6