Fault
-
అందరికీ చెప్పే పోలీసులే హెల్మెట్ పెట్టుకోలేదు.. ఇదేంటని అడిగితే.. ఏకంగా
My only fault was that I questioned That Two Cops Assaulted: జర్నలిస్ట్‌లపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయో మనం చూస్తునే ఉన్నాం. పైగా అధికార ప్రభుత్వానికి లేదా రాజకీయనాయకులకు వ్యతిరేకంగా రాసే పత్రికా సంస్థలు, జర్నలిస్ట్‌లపై ఎలాంటి దాడులు జరుగుతుంటాయో తెలిసిందే. ఇటీవలకాలంలో ఆ దాడులు మరింత ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఇక్కడొక జర్నలిస్ట్ పోలీసులను కేవలం ప్రశ్నించినందుకు అతని పై అత్యంత అమానుషంగా దాడిచేశారు. అసలు విషయంలోకెళ్తే...అస్సాంలోని జయంత్ దేబ్నాథ్ ఇద్దరు కానిస్టేబుళ్లని హెల్మట్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించాడు. ప్రజలకు చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా అని అన్నారు. అంతే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు దేబ్‌నాథ్‌పై కోపంతో దాడికి చేయడమే కాక బలవంతంగా జీపులో కూర్చోబెట్టేందుకు మరింతమంది పోలీసులను పిలవడం వంటివి చేశారు. పైగా తాను జర్నలిస్ట్‌ని అని చెప్పినందుకే మరింత దారుణంగా దాడి చేసి దుర్భాషలాడినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అస్సాంలోని చిరాంగ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెద్ద దుమారం రేపింది. ఈ క్రమంలో జర్నలిస్ట్ దేబ్నాథ్ మాట్లాడుతూ..." సమాజంలో శాంతి భద్రతలను సంరక్షించే పోలీసులే ఇలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించడం తప్పా. ఈ విషయమే నేను అస్సాం ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాను. నాపై దాడి చేసినవారిపై త్వరిత గతిన చర్యలు తీసుకోవాలి అని అస్సాం ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని అన్నారు. బాధ్యులైన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చిరాంగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) లాబా క్ర దేకా ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. (చదవండి: లే.. నాన్నా.. లే!) -
అమెజాన్ కొంపముంచిన కోడ్.. స్టూడెంట్స్‌కు పండగ
లండన్: ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్‌కు అలవాటు పడ్డ జనం.. ఏం కావాలన్నా బయటకు వెళ్లనవసరం లేకుండా ఆన్లైన్లోనే ఆర్డర్ ఇస్తున్నారు. ఈ-కామర్స్ సంస్థలు కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు పెద్ద మొత్తంలో భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. భారత్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు పండుగ సీజన్లో డిస్కౌంట్ ఆఫర్లతో భారీగా విక్రయాలు సాగిస్తున్నాయి. రోజురోజుకు ఆన్లైన్ షాపింగ్ పుంజుకుని.. మార్కెట్ బలపడుతున్న తరుణంలో కొన్నిసార్లు.. ఆయా వెబ్సైట్లలో లోపాల కారణంగా సంస్థలకు భారీ నష్టాలను మిగుల్చుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ స్టూడెంట్ డీల్‌లో.. డిస్కౌంట్ కోడ్‌లోని లోపం కారణంగా అమెజాన్ సంస్థకు నష్టం జరిగిన విషయాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇటీవల ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ యూకేలోని కొత్త కస్టమర్లకు మొదటి కొనుగోలుపై 5 పౌండ్లు డిస్కౌంట్ ఇచ్చింది. అమెజాన్ సంస్థ 'వెల్కమ్5' అనే పేరుతో ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్ఫై ఎలాంటి షరతులు పెట్టకపోవడంతో ఒకే కోడ్‌పై వినియోగదారులు అనేకసార్లు విక్రయాలు జరిపి సంస్థకు నష్టం మిగిల్చారు. డిస్కౌంట్ కోడ్‌లో లోపమున్న కారణంగా ఒకే వినియోగదారుడు ఆఫర్‌ను అనేకసార్లు ఉపయోగించవచ్చనే విషయం కంపెనీకి 9 రోజుల పాటు తెలియకపోవడం గమనార్హం. అమెజాన్ డిస్కౌంట్ కోడ్‌లో లోపాన్ని గుర్తించిన యూకే విద్యార్థులు, డిస్కౌంట్ కోడ్‌ను తెగ వాడేసుకుని లాభపడ్డారు. డిస్కౌంట్ కోడ్‌ను ఉపయోగించి ఎన్ని సార్లయినా కొత్త వస్తువుల కొనుగోలుపై డిస్కౌంట్ పొందవచ్చని కనుగొన్న కొందరు విద్యార్థులు మొత్తం క్యాంపస్ లైఫ్‌కు సరిపడా వస్తువులు భారీ మొత్తంలో కొనిపడేశారు. ఇక డిస్కౌంట్ కోడ్‌లో ఉన్న లోపం గురించి ఆ నోటా ఈ నోటా పడి యూకేలోని అన్ని క్యాంపస్‌లకు పాకింది. దీంతో వందలాది మంది విద్యార్థులు టాయిలెట్ రోల్స్, టూత్‌పేస్టులు, బీర్ ప్యాక్‌లను పెద్దమొత్తంలో ఆర్డర్ చేసి పూర్తి ప్రయోజనం పొందారు. మరి కొంతమంది విద్యార్థులు మాత్రం ఈ లోపాన్ని ఒక వ్యసనంలా.. ఆటలా భావించి.. ఎప్పటికీ కొనవలసిన అవసరం లేకుండా.. టాయిలెట్ రోల్స్, టూత్‌పేస్టులు, బీర్ ప్యాక్‌లు, నవలలు, పెన్నులు, ఫోల్డర్లు, బ్యాటరీలు కొన్నామని పేర్కొన్నారు. అయితే 9 రోజుల తర్వాత లోపాన్ని గుర్తించిన అమెజాన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కోడ్ లోపంతో ఎంతమేరకు నష్టం వచ్చిందన్నది వెల్లడి కాలేదు. -
బిహార్ ఎగ్జామినేషన్ బోర్డు మరో నిర్వాకం
పట్నా: బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వాకం మరోకటి తాజాగా వెలుగు చూసింది. మెరిట్ స్టూడెంట్ను ఫెయిల్ చేసిన మరో తప్పు చేసింది. పదవతరగతి విద్యార్థికి హిందీ సబ్జెక్టులో 79 మార్కులకు వస్తే.. రెండే మార్కులు వచ్చాయంటూ ఫెయిల్ చేసి పడేసింది. అయితే దీనిపై బాధిత ఆర్టీఐను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ఐఐటీ కలలుకంటున్న పదవ తరగతి విద్యార్థి ధనుంజయ్ కుమార్ అనూహ్యంగా ఫెయిల్ అయ్యాడు.. దీంతో అతను తీవ్ర నిరాశలో కూరుకు పోయాడు. ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు. అయితే కుటుంబం ఇచ్చిన మద్దతుతో బతికి బయపడ్డాడు. సమాచార హక్కు చట్టం కింద బాధిత విద్యార్థి హిందీ పేపర్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రీవాల్యుయేషన్లో 79 మార్కులు వచ్చాయి. ఆర్టీఐ అందించిన సమాచారం ప్రకారం మొత్తం 500 మార్కులకు గాను ధనుంజయ్ 421 మార్కులు సాధించాడు. దీనిపై బాధిత విద్యార్థి మాట్లాడుతూ.. హిందీలో ఫెయిల్ చేయడంతో ఉన్నత విద్యకు వెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన కలలను బీహార్ బోర్డు నీరుగార్చిందని కన్నీటి పర్యంతమయ్యాడు. గత ఆరు నెలలుగా అధికారులు చుట్టూ తిరగాల్సి వచ్చింది ధనుంజయ్ కుమార్ సోదరుడు వాపోయాడు. దీంతో తన తమ్ముడు సరిగ్గా చదువులోక పోయాడన్నాడు. దీనిపై టెన్త్ బోర్డ్ స్పందించాల్సి ఉంది. కాగా, గత అక్టోబర్‌లో బిహార్ బోర్డ్ మరో విద్యార్థికి కూడా ఇలాంటి షాకే ఇచ్చింది. సంస్కృతంలో 100కి 80 మార్కులువస్తే.. 9 మార్కులు, సైన్స్ లో 61 మార్కులు వస్తే 29 మార్కులు వేసి ఫెయిల్ చేసింది. చివరికి తప్పు ఒప్పుకున్న బోర్డు మార్కులను సవరించింది. మరో ఘటనలో లెక్కల్లో 94 మార్కులు వచ్చినా జీరో మార్క్ ఇచ్చింది. -
ఐఫోన్ 8, 8 ప్లస్‌లో బ్యాటరీ సమస్య?
ఐ ఫోన్ 8 , 8 ప్లస్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చి నెల రోజులు కూడా(భారత్‌లో సెప్టెంబర్ 29) గడవకముందే షాకింగ్ నివేదికలు కలకలం సృష్టించాయి. శాంసంగ్ గెలాక్సీ 7కి చుట్టుముట్టినట్లే తాజాగా ఆపిల్ ఐఫోన్ 8కి బ్యాటరీ పరమైన సమస్యలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. రెండు దేశాల్లో రెండు వేర్వేరు సంఘటనల్లో బ్యాటరీపరంగా సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు సంఘటనలు నమోదైనట్టు తాజా నివేదికల ద్వారా వెల్లడైంది. ఒకటి తైవాన్లోనూ, మరొకటి జపాన్‌లోనూ చోటు చేసుకున్నాయి తైవాన్ మీడియా అందించిన సమాచారం ప్రకారం ఐ ఫోన్ 8 బ్యాటరీ బ్యాటరీ ఉబ్బిపోయింది. ఈ భాగం ఫోన్ ముందు భాగం ఊడి బయటకు వచ్చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విట్టర్లో హల్ చల్ చేస్తున్నాయి. తైవాన్‌కి చెందిన మహిళ మిస్. వూ 64 జీబీ స్టోరేజ్ రోజ్ గోల్డ్ ఐ ఫోన్ 8ప్లస్ కొనుగోలు చేశారు. ఐదు రోజుల తరువాత ఒరిజినల్ కేబుల్, అడాప్టర్‌తో ఛార్జింగ్ పెట్టిన మూడు నిముషాలకే ఫోన్ ముందు భాగం ఉబికి వచ్చింది. చైనాలో చోటు చేసుకున్న మరో సంఘటనలో వినియోగదారుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఫోన్ తన చేతికి వచ్చేటప్పటికే బాడీనుంచి స్క్రీన్ పూర్తిగా విడిపోయి కనిపించిందని ఐ ఫోన్ 8 ప్లస్ ఓనర్ వాపోయారు. దీనిపై విశ్లేషణ కోసం కొన్ని డివైస్‌లను ఆపిల్ సంస్థ తిరిగి పంపిస్తున్నారట. అంతేకాదు శాంసంగ్ గెలాక్స్ నోట్ 7 బ్యాటరీ పేలుళ్లకు కారణమయిన బ్యాటరీ ఉత్పత్తిదారు ఆంప్రెక్స్ టెక్నాలజీ లిమిటెడ్ (ఏఊటీఎల్) కంపెనీనే ఐ ఫోన్ 8, 8ప్లస్ బ్యాటరీలను రూపొందించినట్టుగా ఓ అనధికారిక వార్త చక్కర్లుకొడుతోంది. మరోవైపు దేశీయంగా కూడా ఐ ఫోన్8 లో కొన్ని ఆడియో సమస్యలు ఉత్పన్నమైనట్టుగా ఓ టెక్ నిపుణుడు పేర్కొన్నారు. ఈ సమస్యపై ఆపిల్ ను సంప్రదించినపుడు అది కేవలం నెట్వర్క్ సమస్య అని అయితే ఈ వార్తలపై ఆపిల్ సంస్థ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ భారీ నష్టాలు మూటగట్టుకుంది. అలాగే ఆపిల్ స్మార్ట్ఫోన్లు ఐ ఫోన్, ఐ ఫోన్ 7ప్లస్ పేలుళ్లు అక్కడక్కడా నమోదైన సంగతి తెలిసిందే. iPhoneが昨日より膨らんでる。 Apple、早く回収しにきて! pic.twitter.com/sRx6orgxi6 — まごころ (@Magokoro0511) September 25, 2017 -
వైకల్యాన్ని శాపంగా చూడొద్దు
సర్వశిక్ష అభియాన్ జిల్లా మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ నకిరేకల్ : ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల వైకల్యాన్ని చూసి శాపంగా కాకుండా అదృష్టంగా భావించుకుని ప్రభుత్వం వారికి కల్పించే వివిధ వనరులను సద్వినియోగం చేసుకోవాలని సర్వశిక్ష అభియాన్ అకాడమిక్ మానీటరింగ్ జిల్లా అధికారి అండెం శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నకిరేకల్‌లోని భవిత కేంద్రంలో గురువారం ప్రత్యేక అవసరాలు పిల్లల తల్లిదండ్రులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్య పరంగా సామాన్య పిల్లలతో మాదిరిగా వీరు కూడా ఉన్నత స్థానాల్లో ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయన్నారు. అందరితో విద్య – అందరికి విద్య అనే సర్వశిక్ష అభియాన నినాదం ప్రకారం ప్రత్యేక అవసరాల గల పిల్లలను వేరు చేయకుండా సామాన్య పిల్లలతో కలిసి చదువుకునే అవకాశాలు కల్పిస్తుందన్నారు. స్థానిక ఐఈఆర్టీ సల్లోజు శ్రీనివాస్ మాట్లాడుతూ రియో ఒలంపిక్‌లో జరిగిన పోటీల్లో సాధారణ క్రీడాకారులు వెండి, కంచు పతకాలు సాధిస్తే దివ్యాంగులైన క్రీడాకారులు రెండు స్వర్ణపతకాలు సాధించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేడబోయిన శ్రీనివాస్, సబిత, రాపర్తి నర్సమ్మ, ఎల్మకంటి సైదమ్మ, మాదగోని సైదులు, మదార్ నాయక్, అబ్బగోని సైదులు, మారయ్య, రామేశ్వరి, అనూష, సైదమ్మ తదితరులు ఉన్నారు. -
తప్పు ఒప్పుకున్న శాంసంగ్
కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ తప్పును ఒప్పుకుంది. తాము ప్రకటించినట్టుగా గెలాక్సీ సిరీస్ లో వస్తున్న ఎస్ 7 ఆక్టీవ్ ఫోన్ వాటర్ ప్రూఫ్ కాదని, కొన్ని లోపాలున్నాయని అంగీకరించింది. తాము నిర్వహించిన పరీక్షల్లో గెలాక్సీ 7 యాక్టివ్ స్మార్ట్ ఫోన్లు విఫలమయ్యాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే దీన్ని సరిచేసే సామర్థ్యం తమ దగ్గరున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి చాలా కొద్ది ఫిర్యాదులు తమకు అందాయని పేర్కొంది. వారంటీ పీరియడ్ లో ఉన్న ఫోన్లకు రిప్లేస్ మెంట్ చేస్తున్నట్టు ప్రకటించింది సీఎన్ఈటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించినపుడు టచ్ స్క్రీన్ పనిచేయలేదని, గ్రీన్ లైన్స్ వచ్చాయని, ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతోపాటు.. పవర్ బటన్ పనిచేయలేదు. కెమెరా లెన్స్ పై నీళ్లు తదితర సమస్యలు తలెత్తినట్టు శాంసంగ్ వివరించింది. అయితే తాను రిలీస్ చేసిన అన్ని ఫోన్లలో లోపాలు లేవని, చాలా తక్కువ వాటిలో చాలా స్వల్పలోపాలు తలెత్తాయని చెబుతున్న శాంసంగ్ ఎన్ని యూనిట్లలో ఈ లోపాలున్నాయనేది స్పష్టం చేయలేదని ఎన్ గాడ్జెట్ రిపోర్ట్ చేసింది. కాగా ఎస్ 7 ఆక్టివ్ ఫోన్ నీటిలో కూడా పనిచేస్తుందనీ(వాటర్ రెసిస్టెంట్), ఐపీ68 సర్టిఫికేట్ ఉందనీ కంపెనీ ప్రచారం చేసుకుంది. అయితే కన్జ్యూమర్ రిపోర్ట్స్ అనే సంస్థ నిర్వహించిన పరీక్షల్లో ఈ స్మార్ట్ ఫోన్ వాటర్ రెసిస్టెంట్ గా లేదని తేలింది. నీటిలో ఉంచినపుడు స్క్రీన్ పై గ్రీన్ షేడ్స్ కనిపించినట్లు, కెమెరాపై బుడగలను గుర్తించినట్టు ఇటీవల నివేదించిన సంగతి తెలిసిందే. -
ఉత్తర భారతానికి పెను భూకంప ముప్పు!
అంతర్జాతీయ శాస్త్రవేత్తల హెచ్చరిక లాస్ఏంజెలిస్: ఉత్తర భారతంతోపాటు పశ్చిమ నేపాల్‌కు భవిష్యత్తులో మరో పెను భూకంప ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఏప్రిల్‌లో నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపంలో భూమి పొరలో లోపం(ఫాల్ట్) వద్ద కొంత శక్తి మాత్రమే విడుదలైందని, ఆ ఫాల్ట్ వద్ద ప్రస్తుతం ఇంకా చాలా ఒత్తిడి కొనసాగుతోందని తెలిపారు. జీపీఎస్ కేంద్రాలు, కఠ్మాండులో నేల కదలికలను పసిగట్టే యాక్సిలరోమీటర్ రాడార్ చిత్రాల నుంచి అందిన సమాచారాన్ని అధ్యయనం చేయగా ఈ విషయం తేలిందని అమెరికాలోని కాల్టెక్, వర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు తెలిపారు. నేపాల్‌లో రిక్టర్‌స్కేలుపై 7.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపంలో 9 వేల మంది మరణించడం తెలిసిందే. దీనిపై అధ్యయనం చేసిన వీరు.. పశ్చిమ నేపాల్‌తో పాటు ఉత్తర భారత్‌లో అనేక చోట్ల జనసమ్మర్ద ప్రాంతాలున్నాయని, గంగా మైదానంలో భూకంపమొస్తే పెను విలయం తప్పదని అన్నారు. యురేసియా భూఫలకంతో ఇండియన్ ప్లేట్ కలిసే చోట ఉన్న హిమాలయన్ ఫాల్ట్ లైన్ వద్దే ఇటీవలి భూకంపం సంభవించిందన్నారు. ఈ ఫాల్ట్ భాగం లాక్ అయిపోయిందని, భవిష్యత్తులో రెండు ప్లేట్ల మధ్య ఒత్తిడి వల్ల సర్దుబాటు జరిగి ఇంతకంటే పెను భూకంపానికి దారి తీయవచ్చన్నారు.