పట్నా: బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వాకం మరోకటి తాజాగా వెలుగు చూసింది. మెరిట్ స్టూడెంట్‌ను ఫెయిల్ చేసిన మరో తప్పు చేసింది. పదవతరగతి విద్యార్థికి హిందీ సబ్జెక్టులో 79 మార్కులకు వస్తే.. రెండే మార్కులు వచ్చాయంటూ ఫెయిల్ చేసి పడేసింది. అయితే దీనిపై బాధిత ఆర్‌టీఐను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది.
ఐఐటీ కలలుకంటున్న పదవ తరగతి విద్యార్థి ధనుంజయ్ కుమార్ అనూహ్యంగా ఫెయిల్ అయ్యాడు.. దీంతో అతను తీవ్ర నిరాశలో కూరుకు పోయాడు. ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు. అయితే కుటుంబం ఇచ్చిన మద్దతుతో బతికి బయపడ్డాడు. సమాచార హక్కు చట్టం కింద బాధిత విద్యార్థి హిందీ పేపర్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రీవాల్యుయేషన్‌లో 79 మార్కులు వచ్చాయి. ఆర్‌టీఐ అందించిన సమాచారం ప్రకారం మొత్తం 500 మార్కులకు గాను ధనుంజయ్ 421 మార్కులు సాధించాడు.
దీనిపై బాధిత విద్యార్థి మాట్లాడుతూ.. హిందీలో ఫెయిల్ చేయడంతో ఉన్నత విద్యకు వెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన కలలను బీహార్ బోర్డు నీరుగార్చిందని కన్నీటి పర్యంతమయ్యాడు. గత ఆరు నెలలుగా అధికారులు చుట్టూ తిరగాల్సి వచ్చింది ధనుంజయ్ కుమార్ సోదరుడు వాపోయాడు. దీంతో తన తమ్ముడు సరిగ్గా చదువులోక పోయాడన్నాడు. దీనిపై టెన్త్ బోర్డ్ స్పందించాల్సి ఉంది.
కాగా, గత అక్టోబర్‌లో బిహార్ బోర్డ్ మరో విద్యార్థికి కూడా ఇలాంటి షాకే ఇచ్చింది. సంస్కృతంలో 100కి 80 మార్కులువస్తే.. 9 మార్కులు, సైన్స్ లో 61 మార్కులు వస్తే 29 మార్కులు వేసి ఫెయిల్ చేసింది. చివరికి తప్పు ఒప్పుకున్న బోర్డు మార్కులను సవరించింది. మరో ఘటనలో లెక్కల్లో 94 మార్కులు వచ్చినా జీరో మార్క్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment