
తాను జర్నలిస్ట్‌ని అని చెప్పినందుకే మరింత దారుణంగా దాడి చేసి దుర్భాషలాడినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చిరాంగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) లాబా క్ర దేకా ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
My only fault was that I questioned That Two Cops Assaulted: జర్నలిస్ట్‌లపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయో మనం చూస్తునే ఉన్నాం. పైగా అధికార ప్రభుత్వానికి లేదా రాజకీయనాయకులకు వ్యతిరేకంగా రాసే పత్రికా సంస్థలు, జర్నలిస్ట్‌లపై ఎలాంటి దాడులు జరుగుతుంటాయో తెలిసిందే. ఇటీవలకాలంలో ఆ దాడులు మరింత ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఇక్కడొక జర్నలిస్ట్ పోలీసులను కేవలం ప్రశ్నించినందుకు అతని పై అత్యంత అమానుషంగా దాడిచేశారు.
అసలు విషయంలోకెళ్తే...అస్సాంలోని జయంత్ దేబ్‌నాథ్ ఇద్దరు కానిస్టేబుళ్లని హెల్మట్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించాడు. ప్రజలకు చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా అని అన్నారు. అంతే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు దేబ్‌నాథ్‌పై కోపంతో దాడికి చేయడమే కాక బలవంతంగా జీపులో కూర్చోబెట్టేందుకు మరింతమంది పోలీసులను పిలవడం వంటివి చేశారు. పైగా తాను జర్నలిస్ట్‌ని అని చెప్పినందుకే మరింత దారుణంగా దాడి చేసి దుర్భాషలాడినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటన అస్సాంలోని చిరాంగ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెద్ద దుమారం రేపింది. ఈ క్రమంలో జర్నలిస్ట్ దేబ్‌నాథ్ మాట్లాడుతూ..." సమాజంలో శాంతి భద్రతలను సంరక్షించే పోలీసులే ఇలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించడం తప్పా. ఈ విషయమే నేను అస్సాం ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాను. నాపై దాడి చేసినవారిపై త్వరిత గతిన చర్యలు తీసుకోవాలి అని అస్సాం ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని అన్నారు. బాధ్యులైన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చిరాంగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) లాబా క్ర దేకా ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
(చదవండి: లే.. నాన్నా.. లే!)