సాక్షి, న్యూఢిల్లీ: విదేశీ మొబైల్స్ సహా, కొన్ని విద్యుత్ పరిరకాలపై దిగుమతి సుంకం పెంచడంతో స్మార్ట్‌ఫోన్ మొబైల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన మొబైల్ దిగ్గజం ఆపిల్ తన డివైస్‌ల రేట్లను సవరించింది. అన్ని ఐ ఫోన్ల రేట్లను అమాంతం పెంచేసింది. సగటున 3.5 శాతందాకా పెంచేసింది. సోమవారం నుంచే ఈ పెంచిన ధరలు అమల్లికి వచ్చాయి.
మొబైల్ ఫోన్లు, వీడియో కెమెరాలు, టెలివిజన్‌పై దిగుమతి పన్నుల సుంకాన్ని 10నుంచి 15 శాతంగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయంతో ఆపిల్ కంపెనీ మొత్తం ఐఫోన్ పరిధి ధరల్లో మార్పులు చేసింది.
ఐఫోన్ 6 రూ. 30,780 (ముందు రూ. 29,500), ఐఫోన్ ఎక్స్ ఇప్పుడు రూ. రూ. 89,000 లు పలకనుంది . ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ తాజా రివ్యూ అనంతరం వరుసగా రూ. 66,120 , రూ. 75,450 వరుసగా, (పాత ధరలురూ. 64,000 మరియు రూ. 73,000) . ఐఫోన్ 7 మరియు ఐఫోన్ 7 ప్లస్ ఇప్పుడు వరుసగారూ. 50,810 , రూ. 61,060లుగా నిర్ణయించింది. అలాగే ఐఫోన్ 6, ఐఫోన్ 6s ప్లస్ ప్రారంభ ధర ఇప్పుడు వరుసగా రూ. 41,550 , రూ. 50,740లు.
కాగా స్వదేశీ ఉత్పత్తిదారులకు ప్రోత్సాహాన్నిచ్చే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విదేశీ మొబైల్స్ దిగుమతి పన్నును 15 శాతంగా నిర‍్ణయించింది. టీవీలు, మైక్రోవేవ్ ఒవెన్లు తదితరాలపై 20 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. ఈపెంపుతో ఇతర మొబైల్ ఫోన్లతోపాటు మరిన్ని ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు కూడా సమీప భవిష్యత్తులో పెరగవచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment