risen
-
బైక్స్ కాదు...స్కూటర్లు దూసుకెళ్తున్నాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతేడాది ఏప్రిల్-జూలైలో దేశవ్యాప్తంగా 9,77,986 స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జూలైతో ముగిసిన నాలుగు నెలల్లో ఈ సంఖ్య ఏకంగా 16,87,062 యూనిట్లు నమోదైంది. అంటే 72.5 శాతం అధికం. మోటార్‌సైకిళ్ల వృద్ధి 27 శాతానికే పరిమితమైంది. భారత్‌లో స్కూటర్ల అమ్మకాలు దూసుకెళ్తున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. తక్కువ బరువు, సులభంగా నడపడానికి వీలుండడం స్కూటర్ల ప్రత్యేకత. నగరాల్లో అయితే కిక్కిరిసిన ట్రాఫిక్‌లో గేర్‌లెస్ వాహనాలే నయం అన్న భావన ప్రజల్లో ఉంది. స్కూటర్ల డిజైన్, పనితీరు విషయంలో పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. బ్యాటరీతో నడిచే ఈ-స్కూటర్ల అమ్మకాలు క్రమంగా అధికం అవుతున్నాయి. జోరుగా వృద్ధి నమోదు.. కంపెనీనిబట్టి స్కూటర్ల అమ్మకాల్లో 15–437 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మోటార్‌సైకిళ్ల కంటే ఇదే అధికం. ఈ ఏడాది జూలైలో 49.79 శాతం వాటాతో స్కూటర్ల రంగంలో హోండా యాక్టివా రారాజుగా నిలిచింది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో రీ ఎంటట్రీ ఇచ్చిన బజాజ్ ఆటో 9,261 యూనిట్లతో ఏకంగా 437.49 శాతం వృద్ధిని సాధించింది. ఇక 2021తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూలైలో హోండా మోటార్‌సైకిల్స్, స్కూటర్స్ ఇండియా 78.39 శాతం అధికంగా 8,12,086 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 108.14 శాతం వృద్ధితో 4,08,036 యూనిట్లు, సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 30.3 శాతం దూసుకెళ్లి 2,21,931 యూనిట్లు, హీరో మోటోకార్ప్ 15.42 శాతం అధికమై 1,04,885 యూనిట్లు, ఇండియా యమహా మోటార్ 60.32 శాతం హెచ్చి 57,525 యూనిట్లను సాధించాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు సైతం.. క్రమంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాల్లో ఈ–టూవీలర్ల వాటా ఈ ఏడాది జనవరిలో 2.7 శాతం. జూన్ నాటికి ఇది 3.8 శాతానికి ఎగసింది. అన్ని కంపెనీలవి కలిపి జనవరిలో 27,590 యూనిట్లు రోడ్డెక్కితే, జూన్ నాటికి ఈ సంఖ్య 42,262 యూనిట్లకు చేరింది. జనవరి-జూన్‌లో దేశవ్యాప్తంగా 2,40,662 ఈ-టూవీలర్లు విక్రయం అయ్యాయి. హీరో మోటోకార్ప్ పెట్టుబడి చేసిన ఏథర్ ఎనర్జీ 2022 ఏప్రిల్-జూలైలో 219.48 శాతం వృద్ధిని సాధించింది 13,265 యూనిట్లను విక్రయించింది. ఓకినావా ఆటోటెక్ 259 శాతం దూసుకెళ్లింది. ఈ ఏడాది జనవరి–జూన్‌లో ఓకినావా నుంచి 47,121 యూనిట్లు, హీరో ఎలక్ట్రిక్ 44,084, ఓలా 41,994, యాంపీర్ ఎలక్ట్రిక్ 33,785, ఏథర్ 15,952, ప్యూర్ ఈవీ 9,531, టీవీఎస్ 8,670, రివోల్ట్ 8,462, బజాజ్ 7,394 యూనిట్లు రోడ్డెక్కాయి. జోరుగా ఈ-స్కూటర్ల విక్రయాలు మోటార్‌సైకిళ్లు ఇలా.. భారత్‌లో 2021 ఏప్రిల్-జూలైలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 25,77,474 యూనిట్లు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూలైలో ఈ సంఖ్య 27.07 శాతం వృద్ధితో 32,75,256 యూనిట్లుగా ఉంది. ఈ కాలంలో మోటార్‌సైకిళ్ల విక్రయాల్లో బజాజ్ 5.53 శాతం, సుజుకీ 5.69 శాతం తిరోగమన వృద్ధి చెందాయి. హీరో 29.31 శాతం, హోండా 55.56, టీవీఎస్ 13.58, యమహా 67.19, రాయల్ ఎన్ఫీల్డ్ 41.81 శాతం వృద్ధి నమోదు చేశాయి. కాగా, 2021-22లో భారత్‌లో 1,34,66,412 యూనిట్ల ద్విచక్ర వాహనాలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2025 నాటికి టూవీలర్స్ పరిశ్రమ దేశంలో 2.49 కోట్ల యూనిట్లకు చేరుతుందని అంచనా. -
యస్‌బ్యాంకు భారీ ఊరట: రుణాల్లో 14 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: గతేడాది జూన్ ఆఖరుతో పోలిస్తే ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ రుణాల వ్యాపారం 14 శాతం వృద్ధి చెంది రూ. 1,63,654 కోట్ల నుంచి రూ. 1,86,598 కోట్లకు చేరింది. జూన్ క్వార్టర్లో స్థూల రిటైల్ రుణాలు రెట్టింపై రూ. 5,006 కోట్ల నుంచి రూ. 11,431 కోట్లకు పెరిగాయి. ఇక డిపాజిట్లు 18.3 శాతం వృద్ధితో రూ. 1,63,295 కోట్ల నుంచి రూ. 1,93,241 కోట్లకు చేరాయి. అయితే, మార్చి త్రైమాసికంతో పోలిస్తే 2 శాతం తగ్గాయి. ఇవి ప్రొవిజనల్ గణాంకాలని, త్వరలోనే జూన్ త్రైమాసిక ఆర్తిక ఫలితాలను ప్రకటించ నున్నామని బ్యాంక్ తెలిపింది. అటు, ఆర్బీఎల్ బ్యాంక్ కూడా తమ వ్యాపార గణాంకాలను స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొత్తం డిపాజిట్లు 6 శాతం పెరిగి రూ. 79,217 కోట్లకు చేరినట్లు పేర్కొంది. రిటైల్ రుణాలు వార్షికంగా 5 శాతం, సీక్వెన్షియల్‌గా 3 శాతం క్షీణించాయని వివరించింది. గత కొద్ది త్రైమాసికాలుగా పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో వ్యాపారం కూడా పుంజుకుంటోందని ఆర్బీఎల్ బ్యాంకు పేర్కొంది. -
మహమ్మారి.. పొంచే ఉంది!
భువనేశ్వర్: రాష్ట్రంలో కోవిడ్ కేసుల నమోదు అదుపులో కొనసాగుతోంది. అయితే రోజూ 10 నుంచి 20 వరకు మాత్రమే కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగడంతో కోవిడ్ మహమ్మారి పొంచి ఉందనే సంకేతాలు స్పష్టం అవుతున్నాయి. మరోసారి పూర్వ పరిస్థితులు విజృంభించకుండా జాగ్రత్తలు పాటించడం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోవిడ్–19 ఆంక్షలు తొలగించినా.. మాస్కు ధరించడం, ఇతర నివారణ చర్యలను యథాతధంగా కొనసాగిస్తుందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ నిరంజన్ మిశ్రా బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలుగైదు రాష్ట్రాల్లో కరోనా కేసుల నమోదు తరచూ పెరుగుతోందని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రతిపాదించామన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ప్రధాన వైద్యాధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. కరోనా విజృంభణ పునరావృతం కాకుండా పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని, కోవిడ్–19 నిర్ధారణ పరీక్షల పరిమితి విస్తరించాలని సూచించారు. పాజిటివ్ కేసుల నమోదు పెరిగిన సందర్భాల్లో చేపట్టాల్సిన సత్వర కార్యాచరణకు మార్గదర్శకాలను అనుబంధ యంత్రాంగాలకు జారీ చేశారు. విశ్వసనీయ సమీక్ష.. కోవిడ్ కేసుల నమోదు ఆధారంగా రాష్ట్రంలో నివారణ, నియంత్రణ కార్యాచరణ చేపట్టనున్నారు. నిబంధనల అమలు, సడలింపు, తొలగింపు వ్యవహారాలకు విశ్వసనీయ నివేదిక కీలకంగా ప్రజారోగ్య శాఖ పేర్కొంది. జిల్లాస్థాయిలో నిత్యం నమోదవుతున్న కేసులు, విశ్వసనీయ నివేదికతో మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. పాజిటివ్ కేసుల నిర్ధారణతో సంక్రమణ తీవ్రత, పరిధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఆస్పత్రి వ్యవస్థ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు. నిర్ధారిత విధానాల్లో కోవిడ్ పరీక్షలు చేపడుతూ పెరుగుదల, తీవ్రత వంటి విపత్కర సంకేతాలపై నిపుణులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. కరోనా తీవ్రత ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల ఆరోగ్య స్థితిగతుల పట్ల నిఘా పటిష్ట పరచాలని తెలిపారు. విస్తృతంగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్న జనసమూహ బహుళ అంతస్తు భనవ సముదాయాలు, హాస్టళ్లు, విద్యాసంస్థలు వంటి ప్రాంతాల్లో తరచూ పరీక్షల నిర్వహణ చేపట్టాలని పేర్కొన్నారు. కోవిడ్ సంక్రమణ నియంత్రణ, నివారణ కోసం స్థానికంగా అనుబంధ వ్యవస్థ, వైద్య పరీక్షల పరికరాలతో యంత్రాంగం అనుక్షణం సిద్ధం కావాలని వివరించారు. వైద్యారోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు.. ► భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్ఏ) తరచూ జారీ చేస్తున్న తాజా మార్గదర్శకాల మేరకు కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేపట్టడం అనివార్యం. ► కరోనా రోగుల చికిత్స కోసం గృహ నిర్బంధం, ఆస్పత్రి సదుపాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ► కోవిడ్ ఆరోగ్య సంరక్షణ కార్యాచరణ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి. ► నిబంధనల మేరకు కోవిడ్ టీకాల ప్రదాన ప్రక్రియ పూర్తి చేయడం పట్ల శ్రద్ధ వహించాలి. ► సామాజిక భాగస్వామ్యంతో వ్యాప్తి నివారణ, ప్రయాణ సమయం, జన సందోహిత ప్రాంతాల సందర్శన, కార్యాలయాల సముదాయాల్లో తిరుగాడే వారంతా మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. ► సామాజిక దూరం, రద్దీతో పరిసరాలు గుమిగూడకుండా ప్రజలు తిరుగాడుతూ కరోనా నివారణ పట్ల చైతన్యవంతం కావాలి. ►జన సందోహిత ప్రాంతాల్లో ఉమ్మడం నిషేధించారు. ► పనులు జరిగే చోట్ల చేతులు శుభ్రం చేసుకునేందుకు సదుపాయాలతో శానిటైజర్ వ్యవస్థ తప్పనిసరి. ► గాలి వీచేలా సదుపాయాలతో పనులు జరిగే ప్రాంతాల్లో పర్యావరణ అనుకూలత కల్పించాలని ఆదేశించారు. -
2020లోనూ వీసీ పెట్టుబడుల జోరు
సాక్షి, న్యూఢిల్లీ: వెంచర్ క్యాపిటల్(వీసీ) సంస్థలు దేశీయంగా గతేడాది భారీ పెట్టుబడులను తీసుకువచ్చాయి. తద్వారా 7,000కుపైగా స్టార్టప్‌లకు 10 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 72,500 కోట్లు) పెట్టుబడులను సమకూర్చాయి. బెయిన్ అండ్ కంపెనీస్ తాజాగా రూపొందించిన ఇండియా వెంచర్ క్యాపిటల్ నివేదిక వెల్లడించిన వివరాలివి. నివేదికలో ఇంకా పలు అంశాలను ప్రస్తావించింది. వీసీ పెట్టుబడుల్లో అత్యధిక శాతాన్ని కన్జూమర్ టెక్, ఎస్ఏఏఎస్(సాస్), ఫిన్‌టెక్ కంపెనీలు పొందాయి. వెరసి ఈ రంగాలకు చెందిన కంపెనీలు వీసీ సంస్థల నుంచి 75 శాతం పెట్టుబడులను ఆకర్షించాయి. వీటిలో కన్జూమర్ టెక్ ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం! దేశీ ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వీసీ అసోసియేషన్(ఐవీసీఏ) భాగస్వామ్యంతో రూపొందిన నివేదిక ప్రకారం.. డిజిటల్ ట్రెండ్‌పై కోవిడ్–19 ప్రస్తావించదగ్గ స్థాయిలో ప్రభావం చూపింది. ఫలితంగా వివిధ రంగాలలో డిజిటల్ ఆధారిత బిజినెస్‌లకు వీసీ నిధులు అధికంగా ప్రవహించేందుకు దారి ఏర్పడింది. డీల్స్ ఎక్కువే కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలోనూ వీసీ పెట్టుబడులు కొనసాగడం గమనార్హమని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 2019లో దేశీయంగా 755 డీల్స్ ద్వారా 11.1 బిలియన్ డాలర్లను వీసీ సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. 2020లో పెట్టుబడులు స్వల్పంగా తగ్గినప్పటికీ డీల్స్ సంఖ్య 810కు పెరిగింది. ఇందు కు సగటు డీల్ పరిమాణం తగ్గడం కారణమైనట్లు నివేదిక తెలియజేసింది. గతేడాది పలు సవాళ్లు ఎదురైనప్పటికీ పెరిగిన డీల్ పరిమాణం దేశీ స్టార్టప్ వ్యవస్థకున్న పటిష్టతను ప్రతిఫలిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్త స్టార్టప్ వ్యవస్థల్లో టాప్–5లో ఒకటిగా భారత్ కొనసాగిన ట్లు నివేదిక తెలియజేసింది. 2020లోనూ 7,000 స్టార్టప్‌లు ఊపిరిపోసుకున్నట్లు వెల్లడించింది. కొత్తగా నివేదిక ప్రకారం గతేడాదిలో 12 స్టార్టప్‌లో కొత్తగా యూనికార్న్ హోదాను సాధించాయి. తద్వారా యూనికార్న్ హోదాను పొందిన సంస్థల సంఖ్య 37ను తాకింది. వెరసి యూఎస్, చైనా తదుపరి భారత్ నిలిచింది. ఇది దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకున్న పటిష్టతను సూచిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రారంభమైన 1.10 లక్షలకుపైగా స్టార్టప్‌లలో ప్రస్తుతం 9 శాతం వరకూ నిధులను పొందాయి. అంటే మరిన్ని పెట్టుబడులకు అవకాశముంది. 2019ను మినహాయిస్తే గతేడాది గరిష్ట స్థాయిలో స్టార్టప్‌లకు వీసీ నిధులు లభించాయి. కొన్ని వినూత్న ఆలోచనలు ఆకట్టుకున్నాయి. దీంతో పలు చిన్న డీల్స్‌కు తెరలేచింది. భవిష్యత్‌లోనూ మరిన్ని వీసీ పెట్టుబడులకు వీలున్నదని నివేదికకు సహరచయితగా సేవలందించిన బెయిన్ అండ్ కంపెనీ నిపుణులు శ్రీవాస్తవన్ కృష్ణన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు -
56 పైసలు ఎగిసిన రూపాయి
సాక్షి, ముంబై: డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం భారీగా కోలుకుంది. ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్లో, రూపాయి 73.88 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించిన రూపాయి ఇంట్రాడే లో 73.55 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు డాలర్‌తో పోలిస్తే 73.61 వద్ద స్థిరపడింది. అంతకుముందు ముగింపుతో పోలిస్తే 56 పైసల పెరుగుదలను నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 (కరోనావైరస్) వేగంగా విస్తురిస్తున్న నేపథ్యంలో ఆర్థిక మందగమనం పెరుగుతున్న భయాల మధ్య మార్చి 9 న రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 74.17 వద్ద 17 నెలల కనిష్ట స్థాయి కు పడిపోయిన సంగతి తెలిసిందే. -
7వారాల గరిష్టానికి చమురు ధర
సాక్షి,న్యూఢిల్లీ: అనూహ్యంగా చమురు మరోసారిపైకి ఎగబాకాయి. ముఖ్యంగా అంచనాలకు విరుద్ధంగా అమెరికా ఇంధన నిల్వలు తగ్గడంతో చమురు ధరలు బుధవారం మరోసారి వేడెక్కాయి. మంగళవారం పుంజుకున్న చమురు ధరలు మరింత ఎగిసి ఏడువారాల గరిష్టాన్ని నమోదు చేశాయి. వాషింగ్టన్ ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆంక్షలు తిరిగి ప్రవేశపెడుతున్నట్లు కనిపిస్తోందనీ, ఇది ముడి చమురు ఉత్పత్తి, ఎగుమతి చేసే సామర్ధ్యాన్ని దెబ్బతీయనుందని డెన్మార్క్ సాక్సో బ్యాంక్ కమొడిటీ స్ట్రాటజిస్ట్ హెడ్ ఓలే హాన్సెన్ పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు కూడా చమురు ధరలకు తోడ్పడుతున్నాయని విశ్లేషకుల అంచనా. యూఎస్ మార్కెట్ నైమెక్స్ చమురు బ్యారల్ 0.3 శాతం బలపడి 65.39 డాలర్లను తాకగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు సైతం బ్యారల్ 0.3 శాతం ఎగసి దాదాపు 70 డాలర్లకు చేరింది. వెరసి ఏడు వారాల గరిష్టానికి చమురు ధరలు చేరాయి. కాగా.. ప్రస్తుతం నైమెక్స్ 65.22 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బ్రెంట్ బ్యారల్ 69.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మార్చి 16తో ముగిసిన వారంలో చమురు నిల్వలు 2.74 మిలి యన్ బ్యారళ్లమేర తగ్గినట్లు మంగళవారం అమెరికా ఇంధన శాఖ వెల్లడించింది. వాస్తవానికి 2.55 మిలియన్ బ్యారళ్లమేర నిల్వలు పెరగనున్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు. దీంతో 5మిలియన్ బ్యారళ్లమేర అంచనాలు తారుమారు కావడంతో చమురు ధరలు భారీగా పెరిగాయని నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఇరాన్‌కు తగిన గుణపాఠం చెబుతామంటూ సౌదీ అరేబియా ప్రకటించడం, వెనిజులాలో చమురు ఉత్పత్తి గత నెలలో 1.54 మిలియన్ బ్యారళ్లమేర తగ్గడం వంటి అంశాలు సైతం ధరల మంట పుట్టించినట్లు నిపుణులు తెలియజేశారు. -
మారుతి దూకుడు: కొత్త రికార్డ్
సాక్షి, ముంబై: దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి విశ్లేషకుల అంచనాలకనుగుణంగా దూసుకుపోతోంది. తాజాగా మారుతి సుజుకి కౌంటర్ బుధవారం మరో ఆల్ టైం రికార్డ్ స్థాయిని టచ్ చేసింది. దీంతో మార్కెట్ క్యాప్ రీత్యా టాప్-5 కంపెనీల్లో మారుతి ప్లేస్ కొట్టేసింది. మారుతీ సుజుకీ షేరు బీఎస్ఈలో తొలిసారి రూ. 10వేల మైలురాయిని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ(కేపిటలైజేషన్) మరింత బలపడింది. రూ. 3 లక్షల కోట్లను అధిగమించింది. ఈ ఏడాది లో 83 శాతం వృద్ధి సాధించింది. కంపెనీ ప్రధానంగా స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, ఆల్టో విక్రయాలతో దూసుకెళుతున్న మారుతి సరికొత్త వాహనాలతో కస్టమర్ల బేస్‌ను పెంచుకుంటోంది. వితారా బ్రెజా, ఇగ్నిస్, బాలెనో తదితర కొత్త మోడళ్లకు సైతం డిమాండ్ భారీగా ఉండడటంతో కార్ల మార్కెట్లో కంపెనీ వాటా 50 శాతానికి చేరింది. కాగా.. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రీత్యా ఐదో ర్యాంకును సొంతం చేసుకుంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రీత్యా రూ. 5.83 లక్షల కోట్లతో అగ్రస్థానం ఉన్న సంగతి విదితమే. ఇక రూ. 4.93 లక్షల కోట్లతో టీసీఎస్ రెండో ర్యాంకులోనూ, రూ. 4.88 లక్షల కోట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మూడవ ర్యాంకు, రూ. 3.22 లక్షల కోట్లతో ఐటీసీ నాలుగో స్థానంలో నిలిచాయి. రూ.10వేల -
ఐ ఫోన్ ధరలకు రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ: విదేశీ మొబైల్స్ సహా, కొన్ని విద్యుత్ పరిరకాలపై దిగుమతి సుంకం పెంచడంతో స్మార్ట్‌ఫోన్ మొబైల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన మొబైల్ దిగ్గజం ఆపిల్ తన డివైస్ల రేట్లను సవరించింది. అన్ని ఐ ఫోన్ల రేట్లను అమాంతం పెంచేసింది. సగటున 3.5 శాతందాకా పెంచేసింది. సోమవారం నుంచే ఈ పెంచిన ధరలు అమల్లికి వచ్చాయి. మొబైల్ ఫోన్లు, వీడియో కెమెరాలు, టెలివిజన్‌పై దిగుమతి పన్నుల సుంకాన్ని 10నుంచి 15 శాతంగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయంతో ఆపిల్ కంపెనీ మొత్తం ఐఫోన్ పరిధి ధరల్లో మార్పులు చేసింది. ఐఫోన్ 6 రూ. 30,780 (ముందు రూ. 29,500), ఐఫోన్ ఎక్స్ ఇప్పుడు రూ. రూ. 89,000 లు పలకనుంది . ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ తాజా రివ్యూ అనంతరం వరుసగా రూ. 66,120 , రూ. 75,450 వరుసగా, (పాత ధరలురూ. 64,000 మరియు రూ. 73,000) . ఐఫోన్ 7 మరియు ఐఫోన్ 7 ప్లస్ ఇప్పుడు వరుసగారూ. 50,810 , రూ. 61,060లుగా నిర్ణయించింది. అలాగే ఐఫోన్ 6, ఐఫోన్ 6s ప్లస్ ప్రారంభ ధర ఇప్పుడు వరుసగా రూ. 41,550 , రూ. 50,740లు. కాగా స్వదేశీ ఉత్పత్తిదారులకు ప్రోత్సాహాన్నిచ్చే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విదేశీ మొబైల్స్ దిగుమతి పన్నును 15 శాతంగా నిర్ణయించింది. టీవీలు, మైక్రోవేవ్ ఒవెన్లు తదితరాలపై 20 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. ఈపెంపుతో ఇతర మొబైల్ ఫోన్లతోపాటు మరిన్ని ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు కూడా సమీప భవిష్యత్తులో పెరగవచ్చని అంచనా. -
ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు గట్టి షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: విదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు షాకిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పటికే బేసిక్ ఎక్సైజ్ సుంకంతో విదేశీ మొబైల్స్‌కు చెక్ చెప్పిన ప్రభుత్వం మరోసారి కొరడా ఝుళిపించింది. వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మొబైల్స్‌పై బేసిక్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకనుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్న మొబైల్ ఫోన్ల ధరలు మోత మోగనున్నాయి. మేక్ ఇన్ ఇండియాకు మరింత ప్రోత్సాహమిచ్చే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్లపై గతంలో విధించిన 10శాతం బేసిక్ ఎక్సైజ్ సుంకాన్ని తాజాగా 15శాతానికి పెంచింది. దీనికి సంబంధించి గురువారం రాత్రి రెవెన్యూ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే కలర్ టీవీలు, మైక్రోవేవ్ అవెన్లపై బేసిక్ కస్టమ్ సుంకాన్ని 20శాతంగా నిర్ణయించింది. ఎలక్ట్రిక్ ఫిల్మెంట్, వాటర్ హీటర్లు, హెయిర్ డ్రెస్సింగ్ సాధనాలు, డిశ్చార్చ్ లాంప్స్ లాంటి కొన్ని ఇతర అంశాలపై కూడా కస్టమ్స్ సుంకాన్ని సవరించింది. దేశీయ పరిశ్రమలకు ప్రోత్సహహంతోపాటు, ఇప్పటికే తయారీలో ఉన్న కంపెనీలకు గట్టి పోటీ ఉండేలా ఈ చర్య చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కాగా గత జూలైలో మొదటిసారి బేసిక్ కస్టమ్ సుంకాన్ని విధించిన ప్రభుత్వం దేశీయ మొబైల్ కంపెనీలకు ఊతమిచ్చేలా విదేశీ మొబైల్స్‌పై దీన్ని10శాతంగా పేర్కొన్న సంగతి విదితమే. -
క్యూ2 లో పుంజుకున్న జీడీపీ వృద్ధిరేటు
సాక్షి, న్యూఢిల్లీ: గత త్రైమాసికంలో 5.7 శాతానికి పడిపోయిన జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో మళ్లీ పుంజుకుంది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో వృద్ధితో జులై-సెప్టెంబర్ మధ్య వృద్ధిరేటు 6.3 శాతంగా నమోదైంది. 2017-18 తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. వరుసగా ఐదు త్రైమాసికాల నుంచి నెమ్మదిగా ఉన్న దేశీయ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు తిరిగి పుంజుకోవడం గమనార్హం. తాజాగా కేంద్ర గణాంకశాఖ వెల్లడించిన డేటా ప్రకారం రెండో త్రైమాసికంలో తిరిగి 6శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా క్యూ2లో జీడీపీ వృద్ధిరేటు 6.4శాతానికి చేరుతుందని నిపుణులు అంచనా వేశారు. తయారీ రంగం, విద్యుత్, గ్యాస్, మంచినీటి సరఫరా, ట్రేడ్, హోటల్స్, రవాణా, సేవల రంగాల్లో వృద్ధిరేటు పెరిగింది. గనుల త్రవ్వకాలు, క్వారీ, వర్తకం, హోటళ్లు వరుసగా 12.9 శాతం,12.2 శాతం పెరిగాయి. తయారీ రంగం రెండో త్రైమాసికంలో ఉత్పాదకత 9.5 శాతం పెరగగా, వ్యవసాయ రంగం కేవలం 3.7 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు నిర్మాణరంగంలో వృద్ధి జీడీపీ వృద్ధిరేటులో కీలకపాత్ర పోషించడం గమనించాల్సిన విషయమని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఆర్ధిక వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రభావం తయారీ రంగంలో కనిపించిందని తెలిపారు. జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావాలు మెల్లగా తొలగిపోతున్నాయని, రానున్న త్రైమాసికాల్లో వృద్ధిరేటు పరుగులు పెడుతుందన్న విశ్వాసాన్ని ఆర్థికమంత్రి వ్యక్తంచేశారు. -
వంటనూనెలపై దిగుమతి సుంకం భారీ పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: పెరుగుతున్న వంట నూనెల ధరలనుకట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంటనూనెల దిగుమతులను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంది. ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాన్ని 15 శాతంగా ప్రకటించింది స్థానిక రైతులకు మద్దతు ఇచ్చే ప్రయత్నంలో వంట నూనెలపై దిగుమతి సుంకాలను పెంచింది. క్రూడ్ పామ్ ఆయిల్ఫై ఇంపోర్ట్ టాక్స్‌ను 30శాతానికి పెంచింది. ఇప్పటిదాకా ఇది 17.5 శాతంగా ఉంది. శుద్ధి చేసిన పామాయిల్‌పై దీన్ని 40 శాతంగా నిర్ణయించింది. ఇది గతంలో 25 శాతంగా ఉంది. కాగా ప్రపంచంలోనే వంట నూనె అతిపెద్ద దిగుమతిగా భారత్ ఉంది. పామాయిల్ దిగుమతుల్లో అత్యధిక భాగం ఇండోనేషియా, మలేషియా దేశాలది సోయా ఆయిల్ ఎక్కువగా అర్జెంటీనా , బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతుంది. -
హాలీవుడ్లో దక్షిణాది నటుడు
ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సుధీప్, కన్నడనాట స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. హీరోగా నటిస్తూనే ఇతర భాషల్లో కీలక పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఈ విలక్షణ నటుడ్ని మరో అద్భుత అవకాశం వరించింది. ఓ హాలీవుడ్ సినిమాలో సుధీప్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఆస్ట్రేలియన్ దర్శకుడు ఎడ్డీ ఆర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న రైసెన్ అనే ఆంగ్ల చిత్రంలో సుధీప్ నటిస్తున్నాడు. సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్లోనే సుధీప్ కనిపించటంతో హాలీవుడ్ సినిమాలో తమ అభిమాన నటుడిది కీలక పాత్ర అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాలో సుధీప్ న్యూయార్క్ లో స్థిరపడిన ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అమెరికన్ స్టార్ హీరోయిన్ నికోలే స్కాల్మో హీరోయిన్ గా నటిస్తోంది. సాండల్‌వుడ్‌లో స్టార్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న సుధీప్ ఈగ సినిమాతో టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ప్రస్తుతం శివరాజ్ కుమార్ తో కలిసి విలన్ అనే సినిమాలో నటిస్తున్న సుధీప్, త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి లోనూ కీలకపాత్రలో నటించనున్నాడు. -
పెరిగిన వంటగ్యాస్ ధర
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: గృహ వినియోగదారుల వంట గ్యాస్ సిలిండర్ ధర 66 రూపాయల మేర పెరిగింది. ఇప్పటివరకు దీని ధర 1016 రూపాయలు కాగా ప్రస్తుతం 1082 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఒక్కసారిగా ధర భారీగా పెరగటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, సిలిండర్లను పంపిణీ చేసే సిబ్బంది ఇష్టారాజ్యంగా రవాణా చార్జీలు వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల 1100 రూపాయలకుపైగా వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గ్యాస్ విడిపించుకున్న తర్వాత బ్యాంకు ఖాతాకు సబ్సిడీ మొత్తం సకాలంలో జమ కాకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.