పెరిగిన వంటగ్యాస్ ధర | gas cylinder price has risen to Rs 66 | Sakshi
Sakshi News home page

పెరిగిన వంటగ్యాస్ ధర

Published Tue, Dec 3 2013 3:13 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

gas cylinder price has risen to Rs 66

 శ్రీకాకుళం, న్యూస్‌లైన్: గృహ వినియోగదారుల వంట గ్యాస్ సిలిండర్ ధర 66 రూపాయల మేర పెరిగింది. ఇప్పటివరకు దీని ధర 1016 రూపాయలు కాగా ప్రస్తుతం 1082 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఒక్కసారిగా ధర భారీగా పెరగటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, సిలిండర్లను పంపిణీ చేసే సిబ్బంది ఇష్టారాజ్యంగా రవాణా చార్జీలు వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల 1100 రూపాయలకుపైగా వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గ్యాస్ విడిపించుకున్న తర్వాత బ్యాంకు ఖాతాకు సబ్సిడీ మొత్తం సకాలంలో జమ కాకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement