ఆపిల్‌ ఈవెంట్‌ : బిగ్‌ ప్రైస్‌, బిగ్‌ స్క్రీన్‌ | Apple newest iPhone could have big screen and big price | Sakshi
Sakshi News home page

ఆపిల్‌ ఈవెంట్‌ : బిగ్‌ ప్రైస్‌, బిగ్‌ స్క్రీన్‌

Published Wed, Sep 12 2018 2:21 PM | Last Updated on Wed, Sep 12 2018 11:04 PM

Apple  newest iPhone could have big screen and big price - Sakshi

కొత్త కొత్త ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు విపరీతంగా ఆకట్టుకుంటున్న ఆపిల్‌ లేటెస్ట్‌ ఈవెంట్‌ చర్చనీయాంశంగా మారింది. తాజాగా  ఆపిల్ మరో సెప్సేషనల్‌  ఈవెంట్‌కు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందులో యాపిల్ మూడు కొత్త ఐఫోన్లు లాంచ్‌ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఐఫోన్ ఎక్స్‌సీ (ఐఫోన్), ఐఫోన్ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్ ఎక్స్‌ఎస్‌ మ్యాక్స్‌ను ఈ రోజు రాత్రి రిలీజ్‌  చేయనుందనే అంచనాలు భారీగా హల్‌ చల్‌ చేస్తున్నాయి. అంతేకాదు ఈసారి ఐఫోన్ల  బిగ్‌ స్క్రీన్‌, బిగ్‌ ప్రైస్‌ తో రానున్నాయని అంచనా. మరోవైపు  రెవెన్యూ వృద్ధితో ఆపిల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్లను ( సుమారు 7లక్షల 23వేల కోట్లు రూపాయలు) ను అధిగమించింది.

ఐ ఫోన్‌ ఎక్స్‌ ప్లస్‌ లేదా మాక్స్‌ :  టాప్‌ మోడల్‌గా తీసుకొస్తున్న ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్‌ 6.5 అంగుళాల ఓలెడ్ స్క్రీన్‌ అమర్చింది. ధర సుమారు రూ.75,000

ఐఫోన్ ఎక్స్ఎస్‌ ‌: 6.1 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో రానుంది. దీని ధర సుమారు  రూ. 71,000 ఉండనుంది. 

ఐఫోన్ ఎక్స్‌సీ :  5.8 అంగుళాల ఓలెడ్ స్క్రీన్‌.  ఐఫోన్ ఎక్స్‌సీ ధర రూ.57,000గా ఉండొచ్చని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వీటితో పాటు యాపిల్ ఐప్యాడ్ ప్రో మోడల్స్‌ని కూడా లాంఛ్ చేయనుందట. ఈఈవెంట్‌లో సరికొత్త మ్యాక్ లైనప్‌ కూడా లాంఛ్ కానుందని మరో ప్రచారం జరుగుతోంది. మ్యాక్ బుక్, మ్యాక్ బుక్ ప్రో, ఐమ్యాక్‌తో పాటు మ్యాక్ మినీ కూడా ఉండొచ్చు. డిస్‌ప్లే పెర్ఫామెన్స్‌లో అప్‌గ్రేడ్స్ చాలా ఉంటాయని టెక్ నిపుణులు అంచనా. అలాగే ఆపిల్‌ వాచ్‌ సిరీస్లో ఫోర్త్‌ జనరేషన్‌ వాచ్‌ను కూడా రిలీజ్‌ చేయనున్నట్టు సమాచారం.  అయితే ఈ అంచనాలపై ఆపిల్‌ నుంచి అధికారికి సమాచారం ఏదీ అందుబాటులో లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement