Import tax
-
పంతం నెగ్గించుకున్న ఎలాన్ మస్క్
కేంద్రం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీపై పనిచేయనుందా? భారత్ ‘మేడిన్ ఇన్ ఇండియా’ నినాదంతో దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా దిగుమతి పన్ను (import taxes) తగ్గిస్తూ కొత్త ఈవీ పాలసీని అమలు చేయనుందా? అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ వెహికల్ పాలసీ ఉండబోతుందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. కేంద్రం కసరత్తు చేస్తున్న కొత్త వెహికల్ పాలసీ ఇలా ఉండబోతుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం.. దేశీయంగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పాలసీ అమలుతో 15 శాతం పన్ను రాయితీని పొందవచ్చు. అదే కారు ధర 40,000 డాలర్లు కంటే ఎక్కువగా ఉంటే 70 శాతం ట్యాక్స్ కట్టేలా కేంద్రం కొత్త వెహికల్ పాలసీని తయారు చేస్తుందని పలు నివేదికలతో పాటు, వెహికల్ పాలసీతో సంబంధం ఉన్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు చెప్పారంటూ నివేదికలు పేర్కొన్నాయి. అమెరికా తరహాలో ఉదాహరణకు ..టెస్లా సంస్థ తయారు చేసి, అత్యధికంగా అమ్ముడైన కార్లలో ‘టెస్లా మోడల్ వై’ ఒకటి. ట్యాక్స్ తగ్గక ముందు ఈ కారు ప్రారంభ ధర 47,740 డాలర్లుగా ఉంది. పన్ను రాయితీ పొందిన తర్వాత అదే కారు ధర 47,490 డాలర్లకు అమ్ముతుంది. అలా, అమెరికా ప్రభుత్వం టెస్లా కార్లపై ఎలాంటి రాయితీలు ఇస్తుందో.. అదే తరహాలో భారత్ సైతం తమకు ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వాలని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కోరుతున్నారు. దీంతో కేంద్రం సైతం సాధ్యసాధ్యాలను పరిగణలోకి తీసుకొని వెహికల్ పాలసీని తీర్చిదిద్దే పనిలో పడింది. కొత్త వెహికల్ పాలసీతో లాభాలు ఒకవేళ ఇదే వెహికల్ పాలసీ అమల్లోకి వస్తే.. భారత్‌లోని పలు కార్ల తయారీ సంస్థలు ఇతర దేశాల్లో తయారైన ఈవీ కార్లను దిగుమతి చేసుకోవడం తగ్గిపోతుంది. స్థానిక ఈవీ వాహనాల ధరల తగ్గుతాయని అంచనా. టెస్లాలాంటి అంతర్జాతీయ కార్ల మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థలు స్థానికంగా కార్ల తయారీ, అమ్మకాలు నిర్వహించుకునే వెసలుబాటు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ కార్ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో 2 శాతం కంటే తక్కువగా ఈవీ కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో వాటి విక్రయాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. పన్ను తగ్గుతుందా? దిగుమతి పన్ను తక్కువగా ఉంటే కొత్త కార్లతో పాటు ఇతర అన్నీ మోడల్ కార్లను అమ్మేందుకు టెస్లాకు అవకాశం లభిస్తుందని మరో నివేదిక హైలెట్ చేసింది. కాగా.. కొత్త ఈవీ వెహికల్ పాలసీపై వాణిజ్య అర్ధిక ఆర్థిక మంత్రిత్వ శాఖలు, టెస్లా సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే, ఈ వెహికల్ పాలసీ తయారీ ప్రారంభ దశలో ఉందని.. పూర్తియితే ట్యాక్స్ తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి👉 చంద్రయాన్-3 విజయం, భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు? -
మార్కెట్‌కు బడ్జెట్ బూస్ట్, కానీ ఈ షేర్లు మాత్రం ఢమాల్!
సాక్షి,ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అమృతకాల బడ్జెట్ స్టాక్‌మార్కెట్‌కు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా ఆరంభంలోనే 500 పాయింట్లు ఎగిసిన సూచీలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దాదాపు 1200 పాయింట్లు ఎగిసాయి. టాక్స్ షాక్ తగిలిన రంగాలు తప్ప అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1112 పాయింట్ల లాభంతో 60661 వద్ద, నిఫ్టీ 266 పాయింట్ల లాభంతో17928 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ అండ్ టి, హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ లాంటివి టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిగరెట్లపై పన్నులు పెంచుతున్నట్లు ప్రకటించడంతో గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా, ఐటీసీ లిమిటెడ్‌తో సహా సిగరెట్ కంపెనీల షేర్లు బుధవారం 5 శాతం కుప్పకూలాయి. గాడ్ఫ్రే ఫిలిప్స్ 5శాతం, గోల్డెన్ టొబాకో 4 శాతం, అయితే 6 శాతం నష్టపోయిన ఐటీసీ షేర్లు తేరుకొన్నాయి. ఇంకా ఎన్‌టిసి ఇండస్ట్రీస్ 1.4 శాతం, విఎస్టి ఇండస్ట్రీస్ 0.35 శాతం నష్టాలతో కొనాసగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 11 శాతం (YoY) కంటే ఎక్కువ పెంచాలని ప్రతిపాదించారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 18 లక్షల కోట్ల నుండి రూ.20 లక్షల కోట్లకు పెంచాలనే ప్రతిపాదన దాదాపు 11 శాతం ఎక్కువ అని, గోద్రెజ్ ఆగ్రోవెట్, బ్రిటానియా, టాటా కన్స్యూమర్స్ షేర్ స్టాక్‌లకు జోష్‌నిస్తుందని స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం. -
పెట్రో లాభాలపై పన్ను పిడుగు! కేంద్ర ఖజానాకు లక్షకోట్లు!
న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వ అనూహ్య నిర్ణయాలు ప్రకటించింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలతో భారీ లాభాలు వచ్చి పడుతున్నాయి. దీంతో దేశీయంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను (విండ్‌ఫాల్ ట్యాక్స్) విధించింది. ఫలితంగా దేశీ అవసరాలను పట్టించుకోకుండా, లాభాల కోసం ఎగుమతులకు ప్రాధాన్యం ఇస్తున్న సంస్థలకు కళ్లెం వేసినట్టయింది. ఇక్కడి నుంచి ఎగుమతి చేసే లీటర్ పెట్రోల్‌పై రూ.6, విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై రూ.6, లీటర్ డీజిల్ ఎగుమతిపై రూ.13 పన్ను విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అంతేకాదు, జూలై 1 నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఎగుమతులపై పన్ను రిలయన్స్ ఇండస్ట్రీస్, రోజ్‌నెఫ్ట్‌కు చెందిన నయారా ఎనర్జీపై ప్రభావం చూపించనుంది. ఈ రెండు సంస్థలు తమ రిఫైనరీ ప్లాంట్లలో ముడి చమురును శుద్ధి చేసి ఎగుమతి చేస్తుంటాయి. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్ను విధింపు నిర్ణయం ప్రభుత్వరంగ సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాతోపాటు, ప్రైవేటు రంగంలోని కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ (వేదాంత)పై ప్రభావం చూపించనుంది. ఏటా 29 మిలియన్ టన్నుల క్రూడాయిల్ దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. టన్నుకు రూ.23,250 విండ్‌ఫాల్ ట్యాక్స్‌తో కేంద్రానికి రూ.66,000 కోట్లు సమకూరనుంది. విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటే? కంపెనీలు ప్రత్యేకంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల వచ్చే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా చెబుతారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఈ పన్ను విధానం అమల్లో ఉంది. విండ్‌ఫాల్ ట్యాక్స్కుతోడు, ఎగుమతులపై పన్ను రూపంలో కేంద్రానికి సుమారు రూ.లక్ష కోట్లు సమకూరనుంది. ఇటీవల ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించి కొతం ఊరట కల్పించడం తెలిసిందే. దీనివల్ల రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. తాజా నిర్ణయాలో ఖజానాకు ఈ మొత్తం భర్తీ కానుంది. అంతర్జాతీయ పరిణామాల ఫలితం ఇటీవలే బ్రిటన్ అసాధారణ పెట్రో లాభాలపై 25 శాతం పన్ను విధించడం గమనార్హం. తాజా నిర్ణయంతో భారత్ కూడా బ్రిటన్ బాటలో నడిచినట్టయింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం అనంతరం ఐరోపా సమాఖ్య రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను తగ్గించుకోవడం మొదలు పెట్టింది. దీన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ మంచి అవకాశంగా భావించాయి. ఐరోపా, అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారా గణనీయమైన లాభాలను ఆర్జిస్తున్నాయి. రష్యా నుంచి చౌకగా లభిస్తున్న ముడి చమురును దిగుమతి చేసుకుని ఇక్కడ ప్రాసెస్ చేసి, ఎగుమతి చేస్తుండడం గమనార్హం. దీంతో ఎగుమతులను నిరుత్సాహపరిచేందుకు కేంద్రం పన్నులు విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) 5.7 మిలియన్ టన్నుల డీజిల్, 2.5 మిలియన్ టన్నుల పెట్రోల్ దేశం నుంచి ఎగుమతి అయింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ దేశీయంగా పెట్రోల్ పంపులు నిర్వహిస్తున్నాయి. ఇవి ప్రైవేటు సంస్థలు. ఆయిల్ మార్కెటింగ్‌లో 90 శాతం వాటా కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రిటైల్ విక్రయ ధరలను సవరించకుండా కొంత కాలంగా నియంత్రణ పాటిస్తున్నాయి. దీంతో పీఎస్‌యూల మాదిరే తక్కువ రేట్లకు పెట్రోల్ ఉత్పత్తులను విక్రయించడం వల్ల భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందంటూ రిలయన్స్, నయారా ఎనర్జీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల మాదిరి తక్కువ రేట్లకు విక్రయించకపోతే అవి మార్కెట్ వాటాను నష్టపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అవి స్థానిక విక్రయాలను తగ్గించుకుని కొంత మేర ఎగుమతులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి.. ‘‘ఇటీవలి కాలంలో క్రూడ్ ధరలు గణనీయంగా పెరిగాయి. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఇది అనుకూలంగా మారింది. అంతర్జాతీయ ధరలకే దేశీ రిఫైనరీలకు అవి ముడి చమురును విక్రయిస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ముడి చమురు ఉత్పత్తి చేసే సంస్థలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను విధిస్తున్నాం’’అని ఆర్థిక శాఖ తెలిపింది. నూతన లెవీ అన్నది చమురు కంపెనీలు పొందుతున్న ధరలో 40 శాతానికి సమానమని పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2 మిలియన్ బ్యారెళ్ల కంటే తక్కువ ఉత్పత్తి చేసిన సంస్థలకు ఈ పన్నును మినహాయించినట్టు తెలిపింది. కళ్లు చెదిరే లాభాలు.. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం 112 డాలర్ల స్థాయిలో ఉంది. లోగడ ఇది 139 డాలర్లకూ వెళ్లింది. ఫలితంగా ఓఎన్జీసీ 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.40,306 కోట్ల లాభం ఆర్జించింది. ఆయిల్ ఇండియా రూ.3,887 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఎగుమతులతో అద్భుత లాభాలు దేశీ సరఫరాలను పణంగా పెట్టి ఎగుమతి చేయడం ద్వారా కొన్ని ఆయిల్ రిఫైనరీ కంపెనీలు అద్భుత లాభాలు గడిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీనివల్లే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌పై ఎగుమతి పన్ను విధించాల్సి వచ్చినట్టు చెప్పారు. ఎగుమతి పన్నుతోపాటు, దేశీయ ఉత్పత్తిపై విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించి, అవసరమైతే మార్పులు చేస్తామని తెలిపారు. ప్రైవేటు తయారీ సంస్థలు ఎగుమతులపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయని, దీంతో దేశీయ సరఫరా పెంచేందుకు కొత్త పన్నును లక్ష్యంగా చేసుకున్నట్టు వివరించారు. లాభాలు పెంచుకునే సంస్థల పట్ల తాము కక్ష సాధించడం లేదని స్పష్టం చేశారు. ఎగుమతులపైనా పరిమితులు.. ఒకవైపు పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై పన్ను విధించిన కేంద్ర సర్కారు.. మరోవైపు ఎగుమతుల పరిమాణంపై పరిమితులు విధించింది. దేశీయంగా వీటి అందుబాటు పెంచడమే ఈ చర్యల ఉద్దేశ్యం. 2023 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి చేసే పెట్రోల్ పరిమాణంలో సగం మేర దేశీయ మార్కెట్లో విక్రయించాల్సి ఉంటుంది. అదే డీజిల్, గ్యాస్ అయితే ఎగుమతి పరిమాణంలో 30 శాతాన్ని దేశీయంగా విక్రయించాలని ఆర్థిక శాఖ పరిమితి పెట్టింది. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ మరింత అందుబాటులోకి వస్తుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రైవేటు సంస్థల పెట్రోల్ పంపులు ఎప్పుడూ నో స్టాక్ బోర్డుతో దర్శనమిస్తున్నాయి. కేంద్రం పెట్టిన పరిమితులతో ఇకమీదట ఈ పరిస్థితి ఉండదు. భూటాన్, నేపాల్ దేశాలకు ఎగుమతులను ఈ నిబంధనల పరిధి నుంచి మినహాయింపు కల్పించింది. అలాగే, నూరు శాతం ఎగుమతి ఆధారిత యూనిట్లు, సెజ్‌లలోని యూనిట్లకు ఎగుమతుల పరిమాణం పరిమితులు వర్తించవు. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏ రిఫైనరీ అయినా కానీ, ఎగుమతులపై పన్ను ఒకే విధంగా అన్నింటికీ అమలవుతుందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు గుజరాత్‌లోని జామ్ నగర్లో రెండు రిఫైనరీలు ఉన్నాయి. -
పామాయిల్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఇకనైనా ధరలు తగ్గేనా
ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెట్రోలు ధరలను తగ్గించిన కేంద్రం కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించింది. వీటితో పాటు వంట నూనె ధరల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ధరలు అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా పామాయిల్‌పై బేస్ దిగుమతి సుంకం తగ్గించింది. ఈ మేరకు కేంద్రం మంగళవారం పొద్దు పోయాక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తాజాగా బేస్ దిగుమతి సుంకాలు సవరించడంతో టన్ను క్రూడ్ పామాయిల్ దిగుమతికి ఇంతకు ముందు 1703 డాలర్లు అవగా ఇప్పుడు 1625 డాలర్లకే రానుంది. రిఫైన్డ్ చేసిన పామాయిల్ విషయానికి వస్తే ఆర్బీడీ పామ్ ఆయిల్ ధర 1765 నుంచి 1733 డాలర్లకు దిగివచ్చింది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో పామాయిల్ ధరలు తగ్గుతాయని ఆనందించేలోపు సోయా రూపంలో ప్రమాదం వచ్చి పడింది. సోయా ఆయిల్ టన్ను ధర 1827 నుంచి 1,866కి పెరిగింది. చదవండి: ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీ తగ్గింపు -
రాష్ట్రాలు ముందుకొచ్చినా.. కేంద్రం తగ్గేదేలే!
టెస్లా విషయంలో సోషల్‌మీడియా ద్వారా భారత ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్న ఆ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ ప్రయత్నాలు ఫలించడం లేదు. పైగా కేంద్రంతో సంబంధం లేకుండా తమ రాష్ట్రాలకు పెట్టుబడులకు రావాలంటూ టెస్లాకు పలు విజ్క్షప్తులు వెల్లువెత్తడం చూస్తున్నాం. అయినప్పటికీ ఈ విషయంలో కేంద్రం మాత్రం తగ్గట్లేదు. భారత్‌లో ఎంట్రీ ఇవ్వాలంటే.. ఈవీలపై దిగుమతి సుంకాలను తగ్గించాలన్నది టెస్లా డిమాండ్. కానీ, కేంద్రం మాత్రం అందుకు ససేమీరా అంటోంది. అంతేకాదు బడ్జెట్లో దిగుమతి సుంకాలపై ఏమైనా సడలింపులు ఉంటాయా? అని ఆశలు పెట్టుకుంది టెస్లా. అయితే అదీ నెరవేరలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు చైర్మన్ వివేక్ జోహ్రీ. ‘ఇప్పటికే దేశీయంగా ఈవీల ఉత్పత్తి నడుస్తోంది. ఇప్పుడున్న టారిఫ్ వ్యవస్థతోనే పెట్టుబడులకు కొన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. విదేశీ బ్రాండ్స్ సైతం విక్రయాలు చేపడుతున్నాయి. అలాంటప్పుడు వాళ్లకు మాత్రమే సమస్య ఉందా?’’ అంటూ పరోక్షంగా టెస్లాను నిలదీశారు వివేక్. కావాలనుకుంటే పాక్షికంగా తయారు చేసిన వాహనాలను దిగుమతి చేసి.. దేశీయంగా అసెంబ్లింగ్ చేసి అమ్ముకోవడచ్చని, తద్వారా దిగుమతి సుంకం 15-30 శాతం మధ్య ఉంటుందనే విషయాన్ని ఆయన మరోసారి ఉధ్ఘాటించారు. దిగుమతి సుంకం సంగతి పక్కనపెడితే.. దేశీయంగా తయారీ యూనిట్, కంపెనీ భవిష్యత్ పెట్టుబడులపై ప్రణాళిక ఇవ్వనందునే.. టెస్లాకు మార్గం సుగమం కావట్లేదన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో భారత్ దిగుమతి సుంకాన్ని పెనుభారంగా భావిస్తున్న టెస్లా.. మూడేళ్లుగా కొనసాగిస్తున్న ప్రయత్నాలపై ముందుకు వెళ్తుందా? లేదంటే ఇక్కడితోనే ఆగిపోతుందా? ఎలన్ మస్క్ తగ్గుతాడా? అనే దానిపై మరికొన్ని రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక భారత్‌లో విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న ఈవీలపై.. వాటి ధర 40వేల డాలర్లులోపు ఉంటే 60 శాతం, 40వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే 100 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారు. సో.. ఈ లెక్కన టెస్లా గనుక విక్రయాలు మొదలుపెడితే(100 శాతం దిగుమతి సుంకంతో..) ధరలు భారీగా పెంచాల్సి ఉంటుంది. అప్పుడు బయ్యర్స్ ముందుకు రావడం కష్టమై.. భారత్ మార్కెట్ అట్టర్‌ఫ్లాప్ అవుతుంది. అందుకే ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకాన్ని తగ్గించాలని టెస్లా కోరుతోందని టెస్లా కథనం. చదవండి: టెస్లా కార్లలో సమస్య! 8లక్షల కార్లు వెనక్కి -
టెస్లా ఎంట్రీపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం..!
భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి వచ్చేందుకు టెస్లా సిద్దమైన విషయం తెలిసిందే. దిగుమతి సుంకాలు అధిక ఉండడంతో టెస్లా రాక కాస్త ఆలస్యమవుతోంది. అధిక దిగుమతి సుంకాలపై ఇప్పటికే టెస్లా ప్రతినిధులు భారత ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా భారత్‌లోకి టెస్లా ఎంట్రీ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. డ్యూటీ కోత తగ్గించే అవకాశం..! ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలనే టెస్లా ప్రతిపాదనపై భారత ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. దిగుమతి సుంకాలపై ఎంతమేర కోత పెట్టవచ్చుననే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. టెస్లా ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ రెవెన్యూ విభాగం తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా మూడు సంవత్సరాల పాటు దిగుమతి సుంకాలను తాత్కాలికంగా తగ్గించే అవకాశాలపై కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు ఆయన అన్నారు. చదవండి: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1 ప్రభుత్వంతో చర్చలు..! ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని టెస్లా కోరిన విషయం తెలిసిందే. టెస్లాతో పాటుగా ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్ధ బీఎండబ్ల్యూ కూడా దిగుమతి సుంకాలపై ప్రభుత్వం మరొకసారి ఆలోచించాలని కోరింది. దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించడంతో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని టెస్లా వాదించింది. అదనంగా 10 శాతం సోషల్ వెల్ఫేర్ సర్చార్జిని కూడా మాఫీ చేసే అంశంపై కూడా కంపెనీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. విదేశీ కార్లపై దిగుమతి సుంకాలు భారత్‌లో ఇలా..! విదేశాల్లో తయారైన కార్లపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 60-100 శాతం దిగుమతి సుంకాలను విధిస్తుంది. ఇంజిన్ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుకొని 40,000 డాలర్లు దాటితే ఈ సుంకం వర్తించనుంది. చదవండి: లక్షకోట్లకు పైగా నష్టం, రాజకీయాల్లోని ఆ వృద్దులపై నిషేదం విధించాలి..! ఎలన్ పిలుపు -
ఇలా అయితే ఒకే... టెస్లాకు ఇండియా ఆఫర్ ?
ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో ప్రవేశపెట్టే విషయంలో టెస్లా పరిస్థితి ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. టెస్లా కార్ల అమ్మకాలకు సంబంధించి భారత ప్రభుత్వం విధించిన షరతులకు టెస్లా నేరుగా సమాధానం చెప్పడం లేదు, మరోవైపు ఇండియా మార్కెట్‌పై ఆశలు వదులకోవడం లేదు. దీంతో కార్ల అమ్మకంపై టెస్లాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది భారత ప్రభుత్వం . ఇంపోర్ట్స్ ట్యాక్స్‌పై పీటముడి విదేశాల్లో పూర్తిగా తయరైన కార్లను ఇండియాలో దిగుమతి చేసుకుంటే ఇంజన్ సామర్థ్యం, ధర తదితర విషయాల ఆధారంగా కారు ధరలో 60 నుంచి 100 శాతం వరకు దిగుమతి సుంకాన్ని భారత ప్రభుత్వం విధిస్తోంది. అయితే తమవి పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ కార్లు కావడం వల్ల పన్ను మినహాయింపు ఇవ్వాలంటూ టెస్లా చీఫ్ ఎలన్‌మస్క్ కోరారు. అయితే దీనికి ప్రతిగా కార్ల యూనిట్‌ను ఇండియాలో పెడతామంటే టెస్లాకు పన్ను రాయితీ అంశం పరిశీలిస్తామంటూ అధికారుల ద్వారా కేంద్రం ఫీలర్లు వదిలింది. టెస్లా ఒంటెద్దు పోకడలు కేంద్రం నుంచి ఓ మోస్తారు సానుకూల స్పందన రావడంతో తమ కార్లను ఇండియాకు తెచ్చే విషయంలో టెస్లా దూకుడు ప్రదర్శించింది. దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసేందుకు సన్నహకాలు చేస్తోంది. ముందుగా విదేశాల్లో తయారైన కార్లను ఇండియాకు దిగుమతి చేసుకుంటామని... ఆ కార్ల అమ్మకాలు జరిపి ఆపై తయారీ ప్లాంటు నెలకొల్పుతామని చెప్పింది. ఆన్లైన్ , ఆఫ్‌లైన్ మోడ్లలో తమ కార్ల సేల్స్ ఉంటాయంటూ వార్తలు వ్యాపింప జేసింది. అలా కుదరదు ఇండియాలో కార్ల తయారీకి సంబంధించి స్పష్టమైన వైఖరి తెలపకుండా.. టెస్లా అనుసురిస్తున్న కప్పదాటు వైఖరిపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఇండియాలో టెస్లా కార్ల తయారీ పరిశ్రమను నెలకొల్పి ఉత్పత్తి ప్రారంభించిన తర్వాతే పన్ను రాయితీ ఇస్తామంటూ కుండబద్దలు కొట్టింది, అయితే ఈ విషయాన్ని నేరుగా నేరుగా ప్రస్తావించకుండా, అధికారుల ద్వారా ఫీలర్లు వదిలింది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఘాటు రిప్లైకి టెస్లా ఎలా స్పందిస్తోందే వేచి చూడాలి చదవండి: ఆ కారుపై లక్ష వరకు బెనిఫిట్ ఆఫర్స్ ! -
ఇండియాకి టెస్లా కారు వస్తోందా? జరుగుతున్నదేంటీ?
టెస్లా కారు తర్వలోనే ఇండియాలో పరుగులు పెట్టడం ఖాయమనే వార్తలు ఆటోమొబైల్ సెక్టార్ నుంచి వినిపిస్తున్నాయి. ఓ వైపు దిగుమతి సుంకం తగ్గింపుపై భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే మరో వైపు కారు తయారీకి అవసరమైన ఏర్పాట్లను టెస్లా చేస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై ఇంత వరకు టెస్లా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏర్పాట్లలో టెస్లా భారత్ వంటి అతి పెద్ద మార్కెట్‌ను వదులకునేందుకు టెస్లా సిద్ధంగా లేదని ఆటో ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఓ వైపు పన్నుల తగ్గింపు విషయంలో భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఇండియాలో కార్ల తయారీకి అవసరమైన ఏర్పాట్లలో టెస్లా కంపెనీ చేస్తుందనే వార్తలు జాతీయ మీడియాలో వస్తున్నాయి. కార్ల తయారీకి అవసరమైన విడిభాగాలు తమకు సరఫరా చేయాలంటూ ఇండియాకు చెందిన పలు కంపెనీలతో టెస్లా సంప్రదింపులు చేస్తోందని ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మూడు కంపెనీలతో ఒప్పందం ఇండియాకు చెందిన మూడు కంపెనీలతో ఇప్పటికే టెస్లా ఒప్పందం చేసుకుందని, దాని ప్రకారం ఇన్స్స్ట్రుమెంటల్ ప్యానెల్, విండ్‌షీల్డ్స్, పలు రకాలైన బ్రేకులు, గేర్స్, పవర్సీట్స్ను సరఫరా చేయాల్సిందిగా ఆయా కంపెనీలను టెస్లా కోరిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు సోనా కమ్‌స్టర్ లిమిటెడ్, సంధార్ టెక్నాలజీస్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ కంపెనీలు ఎప్పటి నుంచో టెస్లాకు కారు విడిభాగాలను సరఫరా చేస్తున్నాయని, ఇది కొత్తగా చేసుకున్న ఒప్పందం కాదంటూ మరో వర్గం అంటోంది. మొదట దిగుమతికే అవకాశం టెస్లా, ఇండియా గవర్నమెంటుల మధ్య ఒప్పందం కుదిరినా ఇప్పటికిప్పుడు ఇండియాలో కార్ల తయారీ సాధ్యం కాదని ఆటోమొబైల్ రంగ నిపుణులు అంటున్నారు. మొదట విదేశీల్లో తయారైన కార్లను దిగుమతి చేసుకుని టెస్లా అమ్మకాలు ప్రారంభిస్తుందని, ఆ తర్వాతే తయారీ యూనిట్ విషయంలో అడుగులు పడతాయని అంటున్నారు. ప్రతిష్టంభన తొలగేనా ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో సంచలనాలు సృష్టించింది టెస్లా. ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి ప్రోత్సాహం అందిస్తోంది ఇండియా. ఇటీవల మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలంటే కేంద్రం కోరింది. అయితే ఇండియాలో టెస్లా కార్లు ప్రవేశపెట్టే విషయంలో ఇటు టెస్లాకి అటు భారత ప్రభుత్వానికి మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు. దిగుమతి పన్నులు తగ్గించాలంటూ టెస్లా అధినేత ఎలన్‌మస్క్ కోరుతుండగా ఇండియాలో తయారీ యూనిట్ పెడితే పన్నుల విషయంలో సానుకూలంగా స్పందిస్తామంటూ ప్రభుత్వ అధికారులను టెస్లాకు ఫీలర్ వదిలారు. దీంతో ఇండియాకి టెస్లా కార్లు రప్పించే విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన అలాగే కొనసాగుతోంది. చదవండి : సేఫ్టీ క్రాష్ టెస్ట్‌లో స్విఫ్ట్, డస్టర్ ఫెయిల్! -
ముడి పామాయిల్ దిగుమతి సుంకం కోత
సాక్షి, న్యూఢిల్లీ: పెరుగుతున్న ఆహార ధరలను నియంత్రించేందుకు కేంద్రం కీలకనిర్ణయం తీసుకుంది. ముడి పామాయిల్ (సీపీఓ) దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. ముడి పామాయిల్ దిగుమతిపై ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నును 37.5 శాతం నుంచి భారత్ 27.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పామాయిల్‌ను ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి చేసుకునేది భారత్. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుండి సంవత్సరానికి 9 మిలియన్ టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. -
బడ్జెట్ షాక్ : భారీగా ఎగిసిన పుత్తడి
సాక్షి, ముంబై : బులియన్ మార్కెట్‌కు బడ్జెట్ షాక్ తగిలింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విలువైన లోహాలపై సుంకాన్ని పెంచడంతో ధరలు అమాంతం పుంజుకున్నాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం భారీగా పుంజుకుంది. దేశీయ బంగారు ఫ్యూచర్స్ మార్కెట్లో 2 శాతానికి పైగా ర్యాలీ అయ్యాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 712 ఎగిసి రూ. 34929 వద్ద కొనసాగుతోంది. రాజధాని నగరం ఢిల్లీలో 99.9 స్వచ్ఛతగల బంగారం ధర 10 గ్రా. 590 రూపాయలు పెరిగి రూ. 34,800గా ఉంది. 8 ఎనిమిది గ్రాముల సావరిన్ గోల్డ్ కూడా 200 ఎగిసి రూ.27వేలు పలుకుతోంది. మరో విలువైన మెటల్ వెండి కూడా ఇదే బాటలో ఉంది. ఫ్యూచర్స్‌లో కిలో వెండి ధర 633 రూపాయలు ఎగిసి 38410 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ఔన్స్ ధర 1,415 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. అమెరికా జాబ్‌డేటా, వడ్డీరేటుపై ఫెడ్ ప్రకటన తదితర అంశాల నేపథ్యంలో ఈ వారంలో ధరలు 2 శాతానికి పైగా పెరిగిన పుత్తడి వరుసగా ఏడవ వారం కూడా లాభాల పరుగుతీస్తోంది. మరోవైపు దిగుమతి సుంకం పెంపువార్తలతో జ్యుయల్లరీ షేర్లు 2-7శాతం పతనమయ్యాయి. టైటాన్ కంపెనీ 3.1 శాతం, గోల్డియం ఇంటర్నేషనల్ 6.7 శాతం, లిప్సా జెమ్స్ 3 శాతం, పీసీ జ్యుయలర్ 4.84 శాతం, రినయిన్స్ జ్యుయల్లరీ 2 శాతం, తంగమాయి జ్యువెలరీ 5.8 శాతం, త్రిభువన్ దాస్ భీంజీ జవేరి 6.4 శాతం నష్టపోతున్నాయి. కాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో బంగారం , ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకాన్ని 12.5శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతమున్న 10 శాతం నుంచి బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 12.5 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. చదవండి : ఆదాయ పన్ను రిటర్న్స్ : ఊరట -
బంగారంపై పన్ను తగ్గుతోందా...?
ముంబై : ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం కొనుగోలుదారుగా ఉన్న భారత్‌లో రోజురోజుకి ధరలు పైపైకి ఎగుస్తున్నాయి. మరో రెండు రోజుల్లో కేంద్ర వార్షిక బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టబోతుంది. దీంతో పెరుగుతున్న ధరలకు చెక్‌పెట్టడానికి, అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం సమర్పించనున్న బడ్జెట్లో దిగుమతి పన్నును తగ్గించే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కూడా పన్ను తగ్గింపు అవసరమని బులియన్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తక్కువ దిగుమతి పన్నుతో దేశీయంగా బంగారం డిమాండ్‌ను పెంచవచ్చనీ పేర్కొంటున్నాయి. కరెంట్ అకౌంట్ లోటును తగ్గించేందుకు 2013 ఆగస్టులో దిగుమతి డ్యూటీని భారత్ 10 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగారంపై దిగుమతి పన్నును 2 నుంచి 4 శాతం తగ్గించే అవకాశముందని తాము అంచనావేస్తున్నట్టు ఇండియన్ బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ గాడ్జిల్ తెలిపారు. ఎక్కువ దిగుమతి డ్యూటీతో గ్రే ఛానల్స్ ఎక్కువవుతాయని, అక్రమ రవాణాకు, అనధికారిక విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ తగ్గింపు అవసరమని పేర్కొన్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం 2016లో భారత్‌కు దాదాపు 120 టన్నుల బంగారాన్ని స్మగ్లర్లు రవాణా చేసినట్టు తెలిసింది. 10 శాతం దిగుమతి పన్నును ఆదా చేసుకునేందుకు స్మగ్లర్లు 1 శాతం లేదా 2 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తారని, కానీ తాము ఎలాంటి డిస్కౌంట్లు ఇవ్వకుండా.. డ్యూటీలను చెల్లిస్తామని కోల్‌కత్తాకు చెందిన హోల్‌సేల్, జేజే గోల్డ్ హౌజ్ ప్రొప్రైటర్ హర్షద్ అజ్మిరా చెప్పారు. పన్ను ఎగవేతదారులు ఎక్కువగా అక్రమ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారని, వారు 3 శాతం జీఎస్టీని కూడా చెల్లించరని చెన్నైకు చెందిన హోల్‌సేల్ ఎంఎన్సీ బులియన్ డైరెక్టర్ ప్రకాశ్ రాథోడ్ అన్నారు. తొలుత ప్రభుత్వం 10 శాతం దిగుమతి పన్నును, అనంతరం జీఎస్టీని కోల్పోతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపు చేపట్టాలని బులియన్ పరిశ్రమ పట్టుబడుతోంది. -
ఐ ఫోన్ ధరలకు రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ: విదేశీ మొబైల్స్ సహా, కొన్ని విద్యుత్ పరిరకాలపై దిగుమతి సుంకం పెంచడంతో స్మార్ట్‌ఫోన్ మొబైల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన మొబైల్ దిగ్గజం ఆపిల్ తన డివైస్ల రేట్లను సవరించింది. అన్ని ఐ ఫోన్ల రేట్లను అమాంతం పెంచేసింది. సగటున 3.5 శాతందాకా పెంచేసింది. సోమవారం నుంచే ఈ పెంచిన ధరలు అమల్లికి వచ్చాయి. మొబైల్ ఫోన్లు, వీడియో కెమెరాలు, టెలివిజన్‌పై దిగుమతి పన్నుల సుంకాన్ని 10నుంచి 15 శాతంగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయంతో ఆపిల్ కంపెనీ మొత్తం ఐఫోన్ పరిధి ధరల్లో మార్పులు చేసింది. ఐఫోన్ 6 రూ. 30,780 (ముందు రూ. 29,500), ఐఫోన్ ఎక్స్ ఇప్పుడు రూ. రూ. 89,000 లు పలకనుంది . ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ తాజా రివ్యూ అనంతరం వరుసగా రూ. 66,120 , రూ. 75,450 వరుసగా, (పాత ధరలురూ. 64,000 మరియు రూ. 73,000) . ఐఫోన్ 7 మరియు ఐఫోన్ 7 ప్లస్ ఇప్పుడు వరుసగారూ. 50,810 , రూ. 61,060లుగా నిర్ణయించింది. అలాగే ఐఫోన్ 6, ఐఫోన్ 6s ప్లస్ ప్రారంభ ధర ఇప్పుడు వరుసగా రూ. 41,550 , రూ. 50,740లు. కాగా స్వదేశీ ఉత్పత్తిదారులకు ప్రోత్సాహాన్నిచ్చే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విదేశీ మొబైల్స్ దిగుమతి పన్నును 15 శాతంగా నిర్ణయించింది. టీవీలు, మైక్రోవేవ్ ఒవెన్లు తదితరాలపై 20 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. ఈపెంపుతో ఇతర మొబైల్ ఫోన్లతోపాటు మరిన్ని ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు కూడా సమీప భవిష్యత్తులో పెరగవచ్చని అంచనా. -
వంటనూనెలపై దిగుమతి సుంకం భారీ పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: పెరుగుతున్న వంట నూనెల ధరలనుకట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంటనూనెల దిగుమతులను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంది. ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాన్ని 15 శాతంగా ప్రకటించింది స్థానిక రైతులకు మద్దతు ఇచ్చే ప్రయత్నంలో వంట నూనెలపై దిగుమతి సుంకాలను పెంచింది. క్రూడ్ పామ్ ఆయిల్ఫై ఇంపోర్ట్ టాక్స్‌ను 30శాతానికి పెంచింది. ఇప్పటిదాకా ఇది 17.5 శాతంగా ఉంది. శుద్ధి చేసిన పామాయిల్‌పై దీన్ని 40 శాతంగా నిర్ణయించింది. ఇది గతంలో 25 శాతంగా ఉంది. కాగా ప్రపంచంలోనే వంట నూనె అతిపెద్ద దిగుమతిగా భారత్ ఉంది. పామాయిల్ దిగుమతుల్లో అత్యధిక భాగం ఇండోనేషియా, మలేషియా దేశాలది సోయా ఆయిల్ ఎక్కువగా అర్జెంటీనా , బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతుంది. -
ఇనుప ఖనిజంపై దిగుమతి సుంకం తొలగించాలి
న్యూఢిల్లీ: ఇనుప ఖనిజం దిగుమతులపై సుంకాన్ని తొలగించే యోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్లు ఉక్కు శాఖ అధికారి ఒకరు చెప్పారు. దేశీయంగా సరఫరాలు తగ్గిపోవడంతో స్టీల్ కంపెనీలు విదేశాల నుంచి ఇనుప ఖనిజాన్ని కొనుగోలు చేయాల్సి వస్తున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో దిగుమతుల అంశంపై ఇప్పటికే ఆర్థిక శాఖకు రాతపూర్వకంగా తెలియజేసినట్లు వెల్లడించారు. ఇనుప ఖనిజంపై దిగుమతి సుంకాన్ని తొలగించాల్సిందిగా సూచించినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై ఇక ఆర్థిక శాఖ నిర్ణయాన్ని తీసుకోవలసి ఉన్నదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇనుప ఖనిజ దిగుమతులపై 2.5% సుంకాన్ని విధిస్తున్నారు. స్టీల్ కంపెనీలు ఇనుప ఖనిజాన్ని ముడిసరుకుగా వినియోగించే సంగతి తెలిసిందే. దేశీయంగా ముడిసరుకు లభ్యత తగ్గడంతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ వంటి సంస్థలు ఇనుప ఖనిజాన్ని దిగుమతి చేసుకునే సన్నాహాల్లో ఉన్నట్లు స్టీల్ శాఖ అధికారి చెప్పారు. సీతారామన్‌కు మెమొరాండం: దేశీయంగా ఇనుప ఖనిజ లభ్యత తగ్గిపోవడంతో స్టీల్ కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తున్నదని వివరిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు పరిశ్రమల సమాఖ్య అసోచామ్ నివేదిక ఇప్పటికే అందజేసింది. వెరసి ప్రస్తుతం విధిస్తున్న 2.5% సుంకాన్ని తొలగించాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. దేశీయంగా ఇనుప ఖనిజ ఉత్పత్తి గతేడాది 144 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి మరింత అధికంగా 90-95 మిలియన్ టన్నులకు పడిపోయే అవకాశమున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకాల తొలగింపునకు ప్రాధాన్యత ఏర్పడింది.