
సాక్షి, న్యూఢిల్లీ: పెరుగుతున్న ఆహార ధరలను నియంత్రించేందుకు కేంద్రం కీలకనిర్ణయం తీసుకుంది. ముడి పామాయిల్ (సీపీఓ) దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. ముడి పామాయిల్ దిగుమతిపై ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నును 37.5 శాతం నుంచి భారత్ 27.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పామాయిల్‌ను ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి చేసుకునేది భారత్. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుండి సంవత్సరానికి 9 మిలియన్ టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment